Home పుస్త‌క స‌మీక్ష‌ ఆమె-రాత్రి-నేను

ఆమె-రాత్రి-నేను

by S Lahari

కొన్ని కవితల్ని చదివినప్పుడు మనసులో ఏదో అలజడి రేగుతుంది. వాటిని అలాగే ఆస్వాదిస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది.
ఒక అనామకుడు వేశ్య దగ్గరికి వెళ్తాడు.” చీకటి ఆకాశాన్ని ఆక్రమిస్తున్న వేళ/ వివస్త్ర మవుతూ అడిగింది ” అని అంటున్నపుడు.. ఏదో తప్పు చేస్తున్న భావన కంటే, అంతర్లీనంగా తన ప్రేయసి విరహవేదన బాధగా అతణ్ణి మెలిపెడుతుంటే.. ఆమె దేహానికి వస్త్రాన్ని చుట్టబెట్టి మౌనంగా కూలబడతాడు. ఏదో కోల్పోయిన తనంలోంచి ఆమె తీసిన వస్త్రాల్ని తిరిగి చుట్టాలనుకుని.. ఆ మనిషి కనిపించగానే ఏమి మాట్లాడాలో అర్ధం కాలేదామెకు.
మిమ్మల్ని ” ప్రేమ మోసం చేసిందా? ” అనడిగింది.
అతడి సమాధానం
” నన్ను వదిలేసి కొత్త జీవితాన్ని ప్రేమిస్తూ/ఎక్కడో/దూరంగా తాను తనను మారువలేక/ఆ జ్ఞాపకాలతో/భారంగా ఇక్కడ నేను ” అని అంటూ మథనపడుతూనే ” మరి నువ్వు ” ఒక అర్ధోక్తి సందేహంతో.. నిజం తెలుసుకోవాలనే తాపత్రయంలో ఆగిపోతాడు.
నాది ప్రేమ కూడా నా వాడికి భారమై, ఆకలికి బానిసై, అందరికి శరీరాన్ని అప్పగిస్తూ చివరికి ఒక జీవచ్ఛవంలా బతుకుతున్నాను అంటుంది.
అతని ప్రేమలో నేను, ఆమె ప్రేమలో మీరు ఇలా బాధగా ఇద్దరం ఇక్కడ …అంది
అతడు వెళ్లేప్పుడు నోటి నుండి మందు వాసన ఎంత దుఃఖాన్ని గొంతులోకి వొంపిన, (అంటే ఎంత తాగినా కూడా)
అవి గుండెల్లో నిక్షేపం అయి ఉంటాయి కాబట్టి ఏమి చేయలేం.

“ప్రేమ ఎన్నడు కామించదు.

కాయం ఎప్పటికి ప్రేమించలేదు”.

అందుకే తన్మయం పొందే చీకటి గతిలో ఇక్కడ ప్రేమ ఉంటుంది.

కామం తప్ప, ఇక్కడ మీరు, నేను నిషిద్ధం అంటూ చెప్పేస్తాడు.

అయినా సరే నేను మళ్లీ వస్తాను.. నీతో సుఖం పంచుకోవడానికి కాదు నీ దుఃఖాన్ని పంచుకోవడానికి అంటూ వెనుతిరిగి పోతాడు.

చివరి వరకు ఆమె చూపులు అతడిని వెంబడిస్తూనే
ఉంటాయి.

విశ్వ

చివరగా కవితను పరిశీలిద్దాం..
ఆమె-రాత్రి-నేను
~

1.
ఎంత సేపుంటారు?
చీకటి ఆకాశాన్ని ఆక్రమిస్తున వేళ..
వివస్త్రమవుతూ అడిగింది!

అపరాధ తనమేదో..
మనసును మెలేస్తున్న బాధతో తనకు
వస్త్రాన్ని చుట్టి కూలబడ్డాను

2.
కోల్పోయినదేదో తిరిగి దొరికినట్టు..
తన తనమేదో
వెనుతిరిగి పలకరించినట్టు ఆశ్చర్యంగా
చూస్తూ అందామె-

గాయాలు చేసేవారే తప్ప..
గాయపడి ఇక్కడికొచ్చిన వారు మీరే!
బహుశా.. ప్రేమ మోసం చేసిందా?

3.
ఏమో.. చెప్పలేను!
నన్ను వదిలేసి జీవితాన్ని ప్రేమిస్తూ
ఎక్కడో..
దూరంగా తను తనను మరువలేక
ఆ జ్ఞాపకాలతో..
భారంగా ఇక్కడ నేను! మరి, నువ్వు..
ఈ పని..?’

నాదీ ప్రేమే..!
అతనికి భారమై.. నాకు బాధ్యతై..
ఆకలికి బానిసై.. అందరికీ వశమై..
చివరికి జీవచ్చవాన్నై ఇక్కడ!

అతని ప్రేమలో మునిగి నేను ఆమె
ప్రేమలో తడిసి
మీరు ఇలా కలిశామన్నమాట అంది
రెప్పలపై
నీటిచెమ్మను తుడుచుకుంటూ!

4.
‘వాన వెలిసింది! వెళ్ళొస్తా..’ అన్నాను

కానీ.. మీ
గొంతులోంచి ప్రేమ గాఢమైన బ్రాందీ
పరిమళంతో గుబాళిస్తోంది
ఎంత..
దుఃఖాన్ని గొంతులోకి వొంపినా.. కొన్ని
జ్ఞాపకాలను
గుండెల్లోంచి తీసేయ్యలేము వాటిలో
జీవితాంతం..
వెంటాడేవి కొన్ని వేటాడేవి మరికొన్ని!

ప్రేమ ఎన్నడూ కామించదు
కామం ఎప్పటికీ ప్రేమించ లేదు!
కామంతో రగిలే తనువులు
తన్మయత్వం పొందే చీకటి గదులివి
ఇక్కడ ప్రేమ ఇంకా మీరు నిషిద్ధం!

5.
అర్ధమైంది! అయినా మళ్లీ వస్తాను..
కామంతో
కాదు ప్రేమతోనే నీతో సుఖించడానికి
కాదు నీ దుఃఖాన్ని
పంచుకోడానికి!- అని కదిలాను.

దారి..
చివరివరకూ ఆమె చూపులు నా
వీపును
తాకుతూనే వున్నాయి!!
కవి: విశ్వ

You may also like

Leave a Comment