కాళోజీ పురస్కార గ్రహీత, భారతదేశ పూర్వ సైనికులు, ప్రసిద్ధ కవి వి.ఆర్ విద్యార్థి గారితో మయూఖ ముఖాముఖి -ధూళిపాళ అరుణ
**********************************************
యుద్ధతంత్రాలలో ఆరితేరిన సైనికునిగా భారతదేశ సైన్యంలో భాగస్వామ్యం వహించి, వృత్తికి ఏమాత్రం సంబంధంలేని అరుదైన సాహితీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ నిత్య విద్యార్థిగా పేరును సార్థకం చేసుకుంటున్న వి.ఆర్. విద్యార్థి గారి జీవితాన్ని వారి స్వీయకథనం నుండే తెలుసుకుందాం.
నమస్కారం సార్🙏🏼దేశ ఆర్మీలో సేవలందించి, సాహిత్యంలో ప్రత్యేకముద్ర వేసుకున్న మీ గురించి తెలియజేసే అవకాశం రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా మీ బాల్యం నుండి మొదలుపెడదాం.
1. మీరు జన్మించిన స్థలం, బాల్యం, కుటుంబ వివరాలు చెప్పండి.
జ: వరంగల్లుకు దగ్గర్లో ‘గవిచెర్ల’ అనే పురాతన గ్రామం ఒకటి ఉంది. అది గణపతిదేవ చక్రవర్తి కాలంలో కూడా ఉండింది. ప్రతాపరుద్రుని చరిత్రలో కూడా ఈ గ్రామ ప్రస్తావన ఉంటుంది. ఆ గ్రామంలో 1945 అక్టోబర్ 8వ తేదీన జన్మించాను. మా నాన్న వేలూరి నర్సయ్య, మా అమ్మ వేలూరి కమలమ్మ. మాది రైతు కుటుంబం. నా చిన్నప్పుడు చాలా పేదరికాన్ని అనుభవించాను. మా కుటుంబంలో నేనే పెద్దవాడిని. నాకు ముగ్గురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు. నాకు అక్క లాంటి బలిజోళ్ల నాగేంద్ర నన్ను మొదట బడికి తీసుకెళ్లింది. చెక్కపలకతో నా చదువు ప్రారంభమైంది. నాకు అక్షరాలు నేర్పిన గురువు సాతాని నారాయణ సారు. మా నాన్నకు, మా చిన్నాన్నకు కూడా ఆయనే చదువు చెప్పడం విచిత్రం. నేను గవిచెర్ల లోనూ, సంగెం లోనూ చదువుకున్నాను. సంగెంలో 11 వ తరగతి అయిన తర్వాత వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో సైన్స్ గ్రూప్ తీసుకొని పి.యు.సి లో చేరాను.
2. మీకు కవిత్వం పట్ల అభిరుచి ఏర్పడడానికి కారణం ఏమిటి?
జ: మీరు నమ్మరేమో! కానీ ఒక విషయం చెప్తాను. నా చిన్నతనంలో మా నాన్న భుజం మీద కూర్చొని ‘కొమ్మాళ్’ తీర్థానికి వెళ్తుంటే ఏపుగా పెరిగిన ఆముదం చెట్లు వింతగా అనిపించాయి. తుమ్మ చెట్లమీద లంబడి పిట్టల అరుపులు గమ్మత్తుగా ఉండేవి. ఎందుకో బాల్యంలో అందరిలాగా కాకుండా దిక్కులు చూస్తూ ఉండేవాడిని. ఊరికే దిక్కులు చూస్తావని పెద్దవాళ్లు కోప్పడేవారు. చిన్నప్పుడు నేను అల్యూమినియం గిన్నెలో గట్కను తాగుతుంటే ఆ గిన్నెలో నల్లటి ఆకాశం, తెల్లటిమబ్బులు ఉన్నట్టు అనిపించి ఆనందపడ్డాను. అదే అనుభూతి అరవై ఏళ్ల తర్వాత “తప్పిపోయిన ఆకాశం” అనే కవితగా రూపొందింది. ఒకసారి క్లాస్ లో టీచరు పాఠం చెప్తూ “కవులు అంటే ఎవరు?” అని ఒక ప్రశ్న అడిగాడు. నేను చాలా ఉత్సాహంతో “నాకు తెలుసు సార్. మా పొలం కౌలుకు ఇచ్చినం” అని అన్నాను. అప్పుడాయన అదికాదు. “కవులు అంటే కవిత్వం రాసేవాళ్లు” అన్నాడు. ఆ మాటతో నేను వారం రోజులు మనిషిని కాలేదు. “అసలు ఎట్లా రాస్తారు? రాయాలని వాళ్లకు ఎట్లా తెలుస్తుంది?” ఇలాంటి ఆలోచనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మా మేనత్త భర్త డిఫెన్స్ లో ఉండేవాడు. ఆయన వచ్చినప్పుడల్లా అక్కడి అనుభవాలు చెప్పేవాడు. అప్పుడు నా వయస్సు 12 ఏండ్లు. ఆయన చెప్పిన విషయాలు నన్ను ప్రభావితం చేశాయి. “సైనికుడా! ఓ సైనికుడా! /హిమాలయపు కొండల్లో/ కొంకర్లు బోయే చలిలో/ బార్డర్లు కాపలా కాస్తుంటావు………” ఇట్లా కవిత రాశాను. హైస్కూల్ నుండే కవిత్వం, కథలు రాసేవాడిని. స్కూల్లో టీచర్లు నేను బాగా రాస్తానని ప్రతీ నివేదిక నాతోనే రాయించేవారు. స్కూల్ నుండి ఎక్కడికైనా టూర్ కి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాల విశేషాలను రాయమని టీచర్లు, తోటి విద్యార్థులు ప్రోత్సహించేవారు. టీచర్లతో డిబేట్ లో కూడా పాల్గొనేవాడిని. నాకు అస్ట్రానమీ చాలా ఇష్టమైన సబ్జెక్టు. పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న రోజుల్లో తెల్లవారి లెక్కల పరీక్ష ఉంటే ఆ రాత్రి ఆకాశం వంక చూస్తూ ” మేఘాల మధ్య చంద్రుడు నవ్వె…” అంటూ కవిత రాశాను (నవ్వుతూ).

3. మీ వృత్తికి ఎటువంటి సంబంధం లేని సాహిత్యబంధాన్ని ఇంతలా ఎలా ఏర్పరచుకోగలిగారు?
జ: అసలు కవులు కవిత్వం ఎట్లా రాస్తారో అని నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. వేలూరి మాణిక్యరావు అని మా తాత. ఆయన పండితకవి. ఆ విషయం నాకు తెలియదు కూడా. నా బాల్యంలో స్కూల్లో జరిగిన సంఘటన మీకు ఇంతకుమునుపు చెప్పాను కదా! అప్పటినుండి బాగా చదవడం అలవాటయింది. శరత్ ను, బుచ్చిబాబును పూర్తిగా చదివాను. శరత్ “చరిత్రహీనులు” నవల చదివి వారం రోజులు మనిషిని కాలేకపోయాను. స్టూడెంట్ గా ఉన్నప్పుడు నేను మంచి వక్తను. డిఫెన్స్ లో ఆ అవకాశం రాలేదు. రాయడం మానలేదు కానీ వక్తగా రాణించలేకపోయాను. బెంగళూరులో లంకా కృష్ణమూర్తి గారని హైకోర్టు రిజిస్ట్రార్ మంచి పద్యకవి. ఆయనతో నాకు మంచి సాన్నిహిత్యం ఉండేది. ఏ కార్యక్రమాలు జరిగినా పిలిచేవారు. వీలుంటే తప్పకుండా పాల్గొనేవాడిని. 1969 లో తెలంగాణ తొలిదశ ఉద్యమసమయంలో రాళ్లపల్లి అనంతకృష్ణ గారి అధ్యక్షతన జరిగిన బెంగళూరు లోని జయనగర్ లో కవిసమ్మేళనం జరిగింది. అందులో పాల్గొన్న పది పన్నెండు మందిలో నేనూ ఒకడిగా ఉన్నాను. ఆ అవకాశం లంకా కృష్ణమూర్తి వల్ల కలిగింది. అందులో శతావధాని సుబ్బన్న గారు కూడా ఉన్నారు. అప్పుడు నేను “తప్పదు మరి” అనే ఉద్యమ కవితను చదివాను. దాని గురించి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారు చాలాసేపు మాట్లాడడం ఒక గొప్ప అనుభూతి. వేనరెడ్డి, వరవరరావు, సుప్రసన్న, పేర్వారం జగన్నాథం, అనుముల కృష్ణమూర్తి, అంపశయ్య నవీన్ వీళ్ళందరితో సాహిత్యపరంగా గాఢమైన స్నేహం ఏర్పడింది.
4. మీ కుటుంబంలో గానీ, మీ పూర్వీకులలో గానీ సాహిత్యాభినివేశం కలిగినవారు ఎవరైనా ఉన్నారా?
జ: పేరెన్నిక గల గోలకొండ కవులలో ఒకరైన వేలూరి మాణిక్యరావు గారు మా తాతగారు. ఆయన పండితకవి. అంతే తప్ప వంశంలో సాహిత్య నేపథ్యం ఏమీ లేదు. మా నాన్న మాత్రం నారాయణరావు గారి వద్ద హిందూస్థానీ సంగీతం నేర్చుకున్నాడు. మా ఊళ్ళో కొంతకాలం ఉన్న నారాయణ రావు గారు మా తాతగారికి సంగీతం నేర్పుతుంటే విని, మా నాన్న మామిడితోటలో పాడుతుండగా నారాయణరావు గారు ఆయన గాత్రానికి ముగ్ధులై మా నాన్నకూ నేర్పారు. తండ్రీ కొడుకులు ఒకే సమయంలో నేర్చుకున్నారు. మా నాన్న ఫ్లూట్ కూడా చాలా బాగా వాయించేవారు. ప్రోత్సాహం లేకపోవడంతో ఊరికే పరిమితమయ్యారు. తెలుగు పుస్తకాలు చదివేవారు.
ఒకసారి కాళోజీ మా నాన్నతో పాడించుకొని విన్నారు. సికింద్రాబాద్ లో ఉన్నప్పుడు హిందీ యువ గాయకుడు శర్మ మా నాన్నకు మంచి స్నేహితుడయ్యాడు. ఇద్దరూ కలిసి పాడుకునేవారు. దురదృష్టవశాత్తు మా నాన్న గాత్రాన్ని రికార్డు చేయలేకపోయాం.
5. దేశ సైనికుడిగా వెళ్లేందుకు మిమ్మల్ని ప్రేరేపించిన పరిస్థితులు ఎటువంటివి? ఆ దిశగా మీ విద్యాభ్యాసం ఎట్లా సాగింది?
జ: హైదరాబాద్ విమోచన తర్వాత కొంతకాలం యూనియన్ ఆర్మీ చాలా ఊళ్లల్లో క్యాంపులు పెట్టింది. మా ఊళ్ళో కూడా చాలామంది సైనికులు ఉండేవారు. అప్పుడు నేను చిన్నవాణ్ణి. వాళ్ల రిధమాటిక్ బూట్ల చప్పుడు నన్ను ఆకర్షించేది. పి. యు. సి. లో నా క్లాస్ మేట్ డా. సంగరాజు జయప్రకాష్ రావు. లింగాల రామచంద్రారెడ్డి అని జనసంఘ్ నాయకుడు దేశభక్తుడు. వాళ్ళ తమ్ముడు శేషారెడ్డి కూడా నాకు క్లాస్ మేట్. శేషారెడ్డిని, నన్ను డిఫెన్స్ కు వెళ్లమని ఆయన ప్రోత్సహించాడు. మేమిద్దరం కలిసి హైదరాబాద్ లో
బేగంపేటకు వెళ్లి పరీక్ష రాశాం. వందకు పైగా పరీక్షలో హాజరైన వారిలో నాది రెండవ ర్యాంకు. శేషారెడ్డికి కూడా మంచిర్యాంకు వచ్చింది. మమ్మల్ని బెంగుళూరు ట్రైనింగుకు పంపారు. ఆ తర్వాత నాగాలాండ్ కు (1965లో) యుద్ధకాలంలో పంపారు.
6. దేశ సైనికునిగా యుద్ధరంగంలో మీరు ఎటువంటి అనుభవాలను ఎదుర్కొన్నారు?
జ: జనరల్ గా ఏ సైనికునికైనా ఒక భయం ఉంటుంది. కానీ డ్యూటీ, దేశభక్తి ఈ రెండూ అన్నిటినీ తట్టుకునేలా చేస్తాయి. మాదంతా బ్యాక్ నుండి సపోర్ట్ ఉంటుంది. బాంబింగ్ చేయడానికి వెళ్లే విమానాలకు సపోర్ట్ గా ఉంటాం. Infantry సోల్జర్స్ శత్రువులతో ముఖాముఖి పోరాడతారు. మేము వెనుక నుండైనా బాంబింగ్ ప్రమాదాలుంటాయి. అలాంటివి ఎదుర్కున్నాం. 1965 లో పాకిస్తాన్, ఇండియా మధ్య జరుగుతున్న యుద్ధకాలంలో మమ్మల్ని తూర్పు పాకిస్తాన్ బార్డర్ కు పంపారు. నాలుగున్నర రోజులు ప్రయాణం తరువాత తూర్పు సరిహద్దులోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ గార్డ్రూ మ్ లో పొద్దున్నే రిపోర్ట్ చేశాం. మొదటగా మాకు ఇచ్చింది ఆయుధాలే. యుద్ధ సమయం కాబట్టి ఆకలిదప్పుల ప్రసక్తి ఉండదు. ఆయుధాలు ఎలా ప్రయోగించాలో ట్రైనింగ్ ఇచ్చి కొన్ని గంటల తర్వాత ఆహారాన్ని ఇచ్చారు. మరి కొన్ని నెలల తర్వాత నన్ను ఆయుధాల ట్రైనింగ్ కోసం బరోడాకు పంపారు. 1971 లో నేను షిల్లాంగ్ లో ఉన్నప్పుడు వివాహం జరిగింది. అక్కడినుండి బెంగుళూరుకు ట్రాన్స్ ఫర్ అయింది. నాలుగు నెలలు గడిచిన తర్వాత పాకిస్థాన్ తో యుద్ధం మొదలైంది. నేను పాల్గొనాల్సి వచ్చింది. నా భార్యను పుట్టింటికి పంపి యుద్ధంలో పాల్గొన్నాను. యుద్ధ పరిస్థితులను చూసి నా స్నేహితునికి “ఒకవేళ యుద్ధంలో నాకు ఏదైనా అయితే నా భార్యకు మీరంతా కలిసి మళ్లీ పెళ్లి చేయండి” అని ఉత్తరం రాశాను. ఎయిర్ ఫోర్స్ లో ‘ద బెస్ట్ ట్రేడ్’ అనే దాంట్లో దొరకడం నా అదృష్టం. మిస్సైల్స్ లాంచింగ్, గ్రాండ్ రాడార్, ఎయిర్ క్రాఫ్ట్ లో రాడార్స్ ఇటువంటి అన్ని రకాల ఫీల్డులలో పని చేశాను. అట్లా మిలిటరీలో 15 సంవత్సరాలు పని చేశాను.
7. సైనికులుగా కొనసాగుతున్న సమయంలో మీ కవిత్వ ప్రస్థానం ఎలా సాగుతుండేది? కవిత్వం రాయడానికి ఏమైనా వీలు చిక్కేదా?
జ: ఇండియా, పాకిస్తాన్ యుద్ధం ముగిసిన కొన్ని నెలల తర్వాత నన్ను ఆయుధాల ట్రైనింగ్ కోసం బరోడాకు పంపారు. బరోడాలో నా జీవితం అతి ప్రాధాన్యత కలిగినది. అప్పుడప్పుడు ఏదో రాయడానికి ప్రయత్నిస్తుండేవాడిని. ట్రైనింగ్ కోసం బరోడాలో రాజభవనంలో వసతి ఏర్పాటు చేశారు. చెబితే మీరు నమ్మరు. ఒకరాత్రి నేను నిద్రలో ఉన్నప్పుడు కలలో ఒక అపరిచిత యువతి వచ్చి నాకు కవిత్వం డిక్టేట్ చేసింది. ఆ కల నా సాహితీ జీవితాన్ని పూర్తిగా మార్చింది. మరునాటి నుండే అసంఖ్యాకంగా కవితలు రాయడం ఆరంభించాను. పోనీ కలలో కనిపించినది సరస్వతీ దేవి అనుకుందామా? అంటే కాదు. ఒక సామాన్య స్త్రీ. ఒక వారం తర్వాత అదే రూపంలో నిరక్షరాస్యురాలైన ఒక కూలీ నెత్తిమీద తట్టతో గుజరాతీ స్త్రీ గా కనిపించింది. ఈమె నాకు కవిత్వం చెప్పడం ఏంటి? నా ఆశ్చర్యానికి అంతులేదు. అప్పటి నుండీ కవిత్వం రాస్తూనే వచ్చాను. అది ఒక సమాధి స్థితిలాంటిది. ఇటువంటి సంఘటన ఒకటి నా బాల్యంలో కూడా జరిగింది. నేను ఏడేళ్ల వయస్సులో ఉన్నప్పుడు సాయంకాలం మా పెసరు చేనులో ఒక్కణ్ణే పెసరుకాయ తెంపుతున్నాను. ముసురుపడుతోంది. మా చేను పక్కనే ఏడడుగుల పైన ఒక పొడుగాటి గడ్డం, మీసాలు, కాళ్ల కిందివరకు జుబ్బా వేసుకున్న వ్యక్తి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. భయంతో చేనులో దాక్కున్నాను. కాసేపట్లో మాయమయ్యాడు. కొన్నేళ్ల తర్వాత రవీంద్రనాథ ఠాగూర్ గురించి విని ఆయన చిత్రాన్ని చూసినప్పుడు నాకు కనిపించిన వ్యక్తే ఆయన. ఈ విచిత్రం ఏమిటో నాకర్థం కాలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక్కోసారి నా చుట్టూ ప్రపంచం నాకు వింతగా అనుభూతుల్ని ఇచ్చింది.
బరోడా నుండి అంబాలాకు పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ పంజాబీ కవి రమేష్ తో పరిచయం ఏర్పడింది. పరస్పరం కవితలు చదివి వినిపించుకునేవాళ్లం. అక్కడి నుండి బెంగళూరుకు వెళ్ళాను. అక్కడ హైకోర్టు రిజిస్ట్రారు లంకా కృష్ణమూర్తి గారితో పరిచయం ఏర్పడింది. ఆయన పద్యకవి కూడా. నన్ను బాగా ప్రోత్సహించేవాడు. ఇట్లా సైనికునిగా పనిచేస్తూనే కవిత్వం రాసేవాడిని.
8. ప్రపంచ ప్రసిద్ధ తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తితో పరిచయం ఎట్లా ఏర్పడింది?
జ: నాకు 16 ఏళ్ల వయస్సున్నప్పుడు వేలూరు సదాశివరావు గారు, రంగరాజు యాదగిరి గారు ఇద్దరూ మాకు టీచర్లు. వాళ్లిద్దరూ జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి మాట్లాడుకుంటుండగా విని ఆశ్చర్యపోయాను. వారి మాటలు నాకు బాగా నచ్చాయి. నాకు కావలసిందేమిటో అర్థమయింది. “This is the path” అనిపించింది. ఎయిర్ ఫోర్స్ కి వచ్చిన తరువాత 1969లో సెలవుల్లో గవిచెర్లకు వచ్చినప్పుడు వేలూరు సదాశివరావు గారి నన్ను మద్రాసుకు తీసుకువెళ్లి, వారం రోజులు బస ఏర్పాటుచేశారు. అదే సమయంలో జిడ్డు కృష్ణమూర్తి గారి ఉపన్యాసాలు వినే అవకాశం కలిగింది. ఒక గ్రూప్ చర్చలో కూడా పాల్గొన్నాను. అయితే 1970 జనవరిలో ఆయనను పర్సనల్ గా ఇంటర్వ్యూ తీసుకునే అవకాశం కలిగింది. అప్పటికే వందలమంది ఆయనను ఇంటర్వ్యూ తీసుకొని ఉంటారు. అదొక గొప్ప అదృష్టం గా భావిస్తాను. ఆ ఇంటర్వ్యూలో మనిషి జీవితానికి సంబంధించిన మౌలిక విషయాలెన్నో ప్రస్తావనకు వచ్చాయి. ఆయన మాటల ప్రభావం నామీద చాలా ఉంది.
9. బాధ్యత గల ఒక సైనికునిగా విధులు నిర్వహించిన మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేయడానికి ఆ ప్రభావమే కారణమని అనుకోవచ్చా?
జ: 15 సంవత్సరాలు నేను సైనికునిగా ఉద్యోగం చేశాను. తరువాత కంటిన్యూ అవడానికి ఒప్పుకుంటూ Willing letter ఇవ్వాలి. ‘నేను చేయను’ అని రాసిచ్చాను. జిడ్డు కృష్ణమూర్తి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు మా సంభాషణ అంతా ఇంగ్లీష్ లోనే జరిగింది. మొదటగా నేను సైనికుడిని అని తెలిసినప్పుడు ఆయన ముఖం గంభీరంగా మారిపోయింది. “Iam also a poet” అని చెప్పగానే ప్రసన్నంగా మారింది. నాకు యుద్ధం, హింస ఇష్టం లేవని, ఆర్థిక పరిస్థితుల వల్ల తప్పడం లేదని చెప్పాను. అప్పుడాయన “You want be a poet or you want be a soldier? అని ప్రశ్నించారు. పోయెట్ అన్నాను. వెంటనే ఆయన “If you want be a poet come out and beg” అన్నారు. నన్ను తవ్వి తవ్వి ప్రశ్నించారు. బయటకు వచ్చిన తర్వాత చాలాసేపు తేరుకోలేక పోయాను. ఆయన ఉపన్యాసాలు, సంభాషణ నాలో ఎంతో మార్పుకు కారణమయ్యాయి. నేను ఆయనకు అనుచరుడిని కాను. కానీ కచ్చితంగా ఆయన ప్రభావం నా జీవితంలో పెద్ద మార్పు తీసుకొచ్చిందని చెప్పగలను. ఆయన చెప్పే Otherness Bliss అనేది కొందరికైనా అనుభవంలోకి రాక తప్పదు. ‘నేను’ అనేవాడు అంతర్థానమై, అనంతమైన విశ్వమై పోవడం అనేది ఒక అద్భుతభావన. అందువల్లనే ఇక ఉద్యోగం చేయకూడదని నిర్ణయించుకొని రాజీనామా చేశాను.
10. రాజీనామా తర్వాత కుటుంబం నుండి వచ్చిన స్పందన ఎటువంటిది? తదనంతరం మీ ఉద్యోగ ప్రయాణం ఎటువైపుగా సాగింది?
జ: ఆ తరువాత బి.యల్. నారాయణ గారి ఒయాసిస్ స్కూల్లో చేరాను. నా భార్యకు కూడా ఆయన ఉద్యోగం ఉద్యోగం ఇచ్చారు. ఎప్పుడూ క్యాంపస్ లో ఉండడం, టైమింగ్స్, ఇవన్నీ నాకు నిర్బంధంగా అనిపించాయి. అదే విషయం నారాయణగారికి చెప్పాను. నా స్వేచ్ఛా భావాలను ఆయన గౌరవించారు. నా స్నేహితుడు నల్లపు మురళీధర్ అనే స్నేహితుని సహకారంతో ఒక ప్రయివేట్ టి.వి. కంపెనీలో చేరాను. చాలా ఇబ్బందులు పడ్డాను. వరవరరావు వంటి మిత్రుల సహకారంతో వరంగల్ ఆర్. ఇ.సి లో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ లో రెగ్యులర్ పోస్ట్ రావడంతో కుటుంబంతో వరంగల్లుకు వచ్చేశాను.
11. అటు తర్వాత జిడ్డు కృష్ణమూర్తి గారి అనుయాయులుగా కొనసాగుతూ వచ్చారా?
జ: లేదమ్మా! కృష్ణమూర్తి గారు చెప్పే అనేక విషయాలను ఒప్పుకుంటాను. కానీ ఆయనకు అనుయాయిని మాత్రం కాదు. ఆయన మార్గదర్శకత్వంలో నా ఆలోచనా పరిధి విస్తృతంగా పెరిగింది. ఆయన చెప్పే విషయాలన్నీ నేను చిన్నప్పటినుండీ అనుభవించినవి. అందుకే కనెక్ట్ అయ్యాను. ఆయన కూడా తనను అనుసరించమని ఎప్పుడూ చెప్పలేదు. “నేనేదో చెప్తున్నా. మీకు బుర్రలకు ఎక్కితే మీ మార్గంలో నడవండి. నా ఫాలోవర్స్ అని కన్ఫర్మ్ చేసుకోకండి” అని చెప్తారాయన. అసలు నా జీవితంలో తెలుసుకున్నది ఒక్కటే. ఈ ప్రపంచంలో పది, పన్నెండు వేల చరిత్ర రికార్డు అయి ఉంది. మన పూర్వీకులంతా ఆదివాసులే. నేను పరిశీలించినంతవరకు ఈ ప్రపంచంలో ఏ మతమైనా సరే. హింస తప్ప మరే పాపం లేదని నా అభిప్రాయం. ఇతరులను బాధ పెట్టడం అనేదే హింస. నేనెక్కడ ఎప్పుడు చెప్పినా ఇదే చెప్తాను. మిగతా పాపాలన్నీ అవసరార్థం మనం సృష్టించుకున్నవే. జంతువులలో కూడా హింస ఉంటుంది. కానీ మనకు అట్లా కాదు కదా! ఆలోచనా జ్ఞానం ఉంది. మరి హింస చేయడం ఎందుకు? దీని గురించి నేనెప్పుడూ నాలుగు లైన్లు చెప్తూ ఉంటాను. “అనాదిగా దళారులకు/ అటు దేవుడు ఇటు శాస్త్రం / భలే గట్టి కవచాలు/ నమ్మికైన బానిసలు” అంటే హింస చేసే వాళ్ళ పద్ధతి మనవంటి సామాన్య జనాలను కొల్లగొట్టడం.
12. తెలంగాణ ఉద్యమంలోనూ పాలు పంచుకున్న మీకు ఎదురైన అనుభవాలు, ఉద్యమ పర్యవసానాలను చెప్పండి.
జ: నేను ఒక ప్రాంతానికి, దేశానికి, మతానికి పరిమితమైన ఉద్యమకారుడిని కాను. కానీ ఒక ప్రాంతాన్ని వేరొకడు కొల్లగొడుతుంటే, మన మీద అటాక్ జరుగుతుంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. తెలంగాణ మలి ఉద్యమంలో నేను పాల్గొన్నాను. అప్పుడు మొట్టమొదట సాహితీ కార్యక్రమం జరిగినప్పుడు మా ఇల్లే మొదటివేదిక. నా భార్య అప్పుడు అమెరికాలో ఉంది. నందిని సిధారెడ్డి, వేణు సంకోజు వంటి వంటి వాళ్లు వచ్చారు. మొట్టమొదటిసారి వరంగల్ లో సాహితీ సభ జరిగింది. కేసీఆర్ వస్తానంటే రావద్దని చెప్పాం. అట్లా ఉద్యమం జరిగినన్ని రోజులు నేనూ పాల్గొన్నాను. కాకపోతే సాహిత్యపరంగా రాయడం, మీటింగులు పెట్టడం చేసేవాణ్ణి. కానీ ఏ తెలంగాణ కొరకు, ఎటువంటి తెలంగాణ కొరకు పోరాడామో వచ్చిన తరువాత అలా లేదు. మనం ఆశించిన తెలంగాణ వేరు. వచ్చిన తెలంగాణ వేరు. ప్రభుత్వం అప్పటిదైనా, ఇప్పటిదైనా అనుకున్న విధంగా అయితే లేదు.
13. మీ కవిత్వ ప్రస్థానం విదేశాల వరకు ఏ విధంగా విస్తరించింది?
జ: కేవలం తెలుగు ప్రాంతాల్లోనే కాక నేను తిరిగిన అన్ని ప్రాంతాలలోనూ ఉదాహరణకు బెంగళూరు, మేఘాలయ మొదలైన ప్రాంతాల్లో తోటివారికి నా కవిత్వం వినిపించేవాడిని. ఎక్కడున్నా కవులు ఎక్కడున్నారని వెతికేవాడిని. బరోడాలో ప్రొఫెసర్స్ ని కలిసేవాడిని. కానీ ఒక సైనికునిగా మేము అందరితో కలిసి ఉండలేం. మాకు కొన్ని పరిమితులు ఉంటాయి. వాటికి లోబడి నడచుకునేవాడిని. కాళోజీ బ్రదర్స్, కె. శివారెడ్డి, వరవరరావు, సిధారెడ్డి, గుంటూరు శేషేంద్రశర్మ గారు మొదలైన వాళ్ళతో కొంతమంది కవులతో ‘దిక్కులు’ అనే వీడియో సంకలనం చేశాను. ఆ సి.డి ని ఫిలడెల్ఫినియాలో అప్పాజోస్యుల సత్యనారాయణ గారు ఆవిష్కరించారు. 2005 లో నా “మంచు మైదానం”, డెట్రాయిడ్ లో మిచిగన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక మీటింగులో రిలీజ్ చేశారు. “ఖండాంతర” అమెరికాలో ఉన్నప్పుడే రాశాను కానీ ఇండియాలో రిలీజైంది. అట్లాంటాలో వేలూరు వెంకటేశ్వరరావు, పెమ్మరాజు వేణుగోపాల్ రావు, వేల్చేరు నారాయణ రావు, విన్నకోట రవిశంకర్ వీళ్లంతా నాకు బాగా సన్నిహితులు. నా పోయెట్రీ గురించి recitation గా ‘మిల్ వాకీ’ లో డా. జంపాల చౌదరి అధ్యక్షతన డా. మైలవరపు కృష్ణ, మా పెద్దబ్బాయి రెండు మూడు మీటింగులు పెట్టారు. ‘సిన్సినాటి’ లో కొలమియాలో కూడా మీటింగులు జరిగాయి. అమెరికాలో నేను చాలా మందికి పరిచయం. కిరణ్ ప్రభ అనే రచయిత ‘కౌముది’ లో నా కవితలను ఎన్నింటినో ప్రచురించారు.
14. కవిత్వం ఏ రకమైన లక్షణాలు ఉండాలని మీరు భావిస్తారు? నేటి కాలంలో వస్తున్న రచనలు ఆ లక్షణాలకు లోబడి ఉన్నాయని మీరు భావిస్తారా?
జ: కవిత్వానికి ప్రాణం భావమే. అనుభూతి దాని హృదయం. ఒక కవితను చదివినప్పుడు పాఠకుడు ఆ కవితకు కనెక్ట్ కావాలి. నేను చెప్పడమే కాదు పెద్దవాళ్లు చెప్పినదాన్నే నేనూ చెప్తున్నాను. కవి తప్పనిసరిగా మొదట తాత్త్వికుడై ఉండాలి. జీవితాన్ని ఎప్పుడూ ఆలోచిస్తూ, శోధిస్తూ ఉన్నవాడే మంచి కవిత్వం రాయగలడు. అంతే తప్ప నా ఇష్టం వచ్చినట్టు దేన్నైనా రాస్తాను అన్నది ఒక స్థాయి కవిత్వం కాదు. నేను కవిత్వాన్ని ఆల్ జీబ్రాతో పోలుస్తాను. ఒక ఫార్ములా ఆధారంగా దాన్ని ఎంతగా విశ్లేషించగలుగుతామో కవిత్వంలో కూడా ఒక్కోసారి ఏదో ఒక్క లైన్ లోతైన అర్థాన్ని ఇస్తూ మొత్తం భావాన్ని అందిస్తుంది. కవిత్వానికి భాష ముఖ్యం. అప్పుడే అది గొప్పకవిత అని నేను భావిస్తాను. కవిత చదివినప్పుడు పాఠకునికి ఆనందమో, భావోద్వేగమో ఏదో ఒకటి కలగాలి. కవిత్వంలో ధ్వని ఉంటే అది ఉత్తమమైనది. పదాల ఎంపిక, సంక్షిప్తతలు ప్రధానమైనవి. ఇప్పుడొస్తున్న కవిత్వంలో ఈ లక్షణాలలో కొంత లోపం కనిపిస్తుంది.
15. ప్రాచీన సాహిత్యం వల్ల ప్రస్తుతం ఉపయోగం లేదనే కొందరి వాదనతో మీరు ఏకీభవిస్తారా?
జ: నేను దీన్ని సమర్థించను. ఇందాక మీకు చెప్పినట్టు కవిత్వంలో సంక్షిప్తత ప్రధానం. దాన్నే brevity అంటారు. అంటే ఒక్కమాట ఎంతో అర్థాన్నివ్వాలి. దానికొరకు అధ్యయనం చేయాలి. నేను పూర్వకవుల సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారానే తెలుసుకున్నాను. పూర్వకవుల సాహిత్యం మనకు మార్గదర్శకం. ప్రాచీన సంస్కృత, తెలుగు కావ్యాలు చదవాలి. దానివలన సరియైన అవగాహన కలుగుతుంది. రాసే విధానమూ తెలుస్తుంది. నిజానికి నేను టెక్నికల్ వైపు వెళ్లడం వల్ల మన కావ్యాలు చదవలేక పోయానని బాధపడుతుంటాను. చదవడం వల్ల మన ఆలోచన విస్తృతమవుతుంది. ప్రాచీనమైన మన భాషా సాహిత్యమే కాదు ఇతర భాషా సాహిత్యాలు కూడా చదవాలి. దానిని బట్టి మన సాహిత్యాన్ని మరింతగా అవగాహన చేసుకోవచ్చు. నేను ఇంగ్లీష్ సాహిత్యాన్ని, హిందీ సాహిత్యాన్ని చదివాను. చైనీస్, జపనీస్, లాటిన్, అమెరికన్ పోయెట్రీ, నేటివ్ అమెరికన్ పోయెట్రీ చదువుకున్నాను. అధ్యయనం చేయడమంటే కాపీ చేయడం కాదు. ఆలోచనా పరిధిని పెంచుకోవడం. దానివల్ల మంచి కవిత్వం రాయొచ్చు. ఒకవేళ ప్రాచీన సాహిత్యం అర్థం కాకపోతే వచ్చిన వాళ్ళతో చెప్పించుకోవాలి.
16. మీ కవిత్వానికి ప్రధాన ప్రాతిపదికాంశం ఏమిటి?
జ: నా కవిత్వంలో ప్రత్యేకమైన ప్రాతిపదిక అంటూ లేదు. కాకుంటే ప్రకృతి, తాత్త్వికత, మానవసంబంధాలు ఎక్కువగా చోటుచేసుకుంటాయి. నాకు నచ్చిన ఫిలాసఫీని కవిత్వంలో ఎక్కువగా ప్రెజెంట్ చేయగలననిపించి కవిత్వాన్ని ఎంచుకున్నాను.
17. ఎగిరే మంచు ఎడారి, మహికంధరంలో మణిహారం, జలకేశాలు కప్పుకోవడం, ఎడారి బిడారం, కాలపుష్పం వంటి పదప్రయోగాల గాఢత మీరు ఎలా అలవరచుకోగలిగారు?
జ: నిరంతర అధ్యయనమే నాకు ఇటువంటి రచనకు ఆధారమైంది. మీరన్నట్టు పదాలు చాలావరకు నేను సృష్టించుకున్నవే. ఎంతగా చదివితే అంత భాషాపరిణతిని, భాషాసౌందర్యాన్ని సృష్టించుకోగలం. మా పెద్దబ్బాయి. నార్త్ పోల్ లో పడే కాంతుల్ని ఒకసారి ఫోటో తీశాడు. అందులో ఆకాశంలో ఒక పువ్వులాంటి నీడ కనిపించింది. దానికి సింబాలిక్ గా నేను “కాలపుష్పం” కవితా సంపుటికి ముఖచిత్రంగా వేసుకున్నాను. ఎప్పుడైనా రాయడం కంటే చదవడం ప్రధానంగా చేసుకుంటే రచనలో కవిత్వపు సొగసులు కనిపిస్తాయి.
18. కవి వ్యక్తిగత జీవితానికి, రచనకు సంబంధం ఉంటుందంటారు కదా! అది సమాజానికి ఏ విధంగా చైతన్యం కాగలదు?
జ: కవి వ్యక్తిగత జీవితం ఒక్కోసారి తన కవిత్వంలో ప్రతిబింబించవచ్చు. కానీ కవి తాను చెప్పినట్లుగా జీవిస్తున్నాడని చెప్పలేం. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ కవి తన జీవితాన్ని ప్రతిబింబించేటట్లు రచన చేసినా అది అనుభవపూర్వకమైనదే కదా! అది ఏ కొద్దిమందిలోనైనా చైతన్యాన్ని కలిగించవచ్చు. సహజరీతిలో వ్యక్తిగత అనుభవాలను సమాజానికి అన్వయిస్తూ రాసే మంచి రచన వల్ల ఒక్కొక్కరు ఒక్కో రకమైన చైతన్యాన్ని పొందవచ్చు. మంచి కవుల రచనల నుండి, వారి అనుభవాల నుండి, వారి వ్యక్తిత్వం నుండి ఎంతో స్ఫూర్తి కలుగుతుంది.
19. వర్తమాన సమాజంలో కవులు, రచయితలు తమ బాధ్యతను ఎంతవరకు నిర్వర్తిస్తున్నట్టు మీరు భావిస్తున్నారు?
జ: వర్తమానంలో కవులు, రచయితలు తమ బాధ్యతను పూర్వ కవులు, రచయితల కంటే ఎక్కువగానే నిర్వర్తిస్తున్నారని చెప్పగలను. కానీ ఇదే సరిపోతుందని భావించకూడదు. రోజుకు ఎంతోమంది కవులు, రచయితలు కొత్తగా పుట్టుకొస్తున్నారు. తమ కవిత్వం ఎంతవరకు ప్రయోజనకారి కాగలదో కూడా ఆత్మవిమర్శ చేసుకోవలసిన అవసరం ఉంది.
20. కాళోజీ గారితో మీకున్న అనుబంధం ఎటువంటిది?
జ: మా కుటుంబానికి కాళోజీ గారి కుటుంబంతో బంధుత్వం ఉంది. 1964లో నా సీనియర్ సంధ్య రంగారావు “మిత్రమండలి” సమావేశానికి తీసుకువెళ్ళాడు. అక్కడ కాళోజీ సోదరులను కలిశాను. వారికి నేను చిన్నవయసు నుండే తెలుసు. చిన్నప్పుడు వారింటికి తరచూ వెళ్ళేవాడిని. ఆ రోజు నేను రచనలు చేస్తానని వారికి తెలిసింది. 1969 జూలైలో అమెరికా నుండి “అపోలో -II” పంపబడినప్పుడు ఒక కవిత రాసి కాళోజీగారికి పంపగా ముగ్ధులై దానికి “అమాయకం” అని శీర్షిక పెట్టి, నోట్ బుక్ లో రాసుకొని ఎందరికో వినిపించారు. “అపరిచితులు” అనే కవిత భార్యాభర్తలకు సంబంధించిన కవిత. అది చదివి విశాఖపట్నంలో ప్రొఫెసర్ వేణుగోపాల్ గుండెలు బాదుకున్నాడని కాళోజీ గారే స్వయంగా చెప్పి ఆయనను పరిచయం చేయించారు. ఈ సందర్భంగా ఈ కవిత గురించి మరో విషయం చెప్పాలి. ఈ సంఘటన జరిగిన 32 ఏండ్ల తర్వాత అట్లాంటాలో ఒక ప్రొఫెసర్ గారి ఇంట్లో అంపశయ్య నవీన్, నేను ఆతిథ్యం ఉన్నాం. ఆరోజు ఉదయం ఒక వేదిక మీద ఈ కవితను విన్న అతని భార్య మాట్లాడుతూ ఇవాళ ఒక కవిత విన్నాను. ఇప్పటిదాకా జీవితమంతా బాగా ఉందనుకున్నాను అన్నది. అప్పుడాయన నన్ను చూపించి ఈయనే విద్యార్థి గారని ఆ కవిత రాసింది అన్నారు. అంతగా నా కవిత వ్యక్తులను కదిలించడం చాలా సంతోషం వేసింది. కాళోజీ కవిగానే కాక వ్యక్తిగతంగా చాలా గొప్పమనిషి. సహృదయుడు. దీనికి రెండు ఉదాహరణలు చెబుతాను. ఒకసారి నిజాం కాలేజీలో ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను కాళోజీతో ఉన్నాను. డా. అస్గర్ అలీ ఇంజనీర్ అని గొప్ప సంఘ సంస్కర్త చీఫ్ గెస్ట్ గా ఉన్నాడు. సభలో వక్తలంతా ప్రముఖులే. గొప్పగా ప్రసంగించారు. చీఫ్ గెస్ట్ మాట్లాడబోగా బాంబే నుండి అతడిని ఫాలో అవుతున్న ఒక వ్యక్తి అతణ్ణి మా అందరిముందే కత్తితో పొడిచాడు. రక్తం చిందింది. సభలో ఉన్నవారు, వేదికపై ఉన్నవారు ఎవరికివారు తోచిన దిశగా పరుగులు తీస్తూ పారిపోయారు. కార్యకర్తలు ఓ ఇద్దరు ముగ్గురు, నేను, కాళోజీ గారు తప్ప అంతా ఖాళీ అయిపోయింది. “అరేయ్! రాములూ (నా పేరు రాములు రక్తం ఆపు” అన్నాడు కాళోజీ. నేను గట్టిగా రక్తం రాకుండా అదిమిపట్టాను. తరువాత ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించడం జరిగింది. అప్పుడు కాళోజీ ఒకమాట అన్నారు. “మనం ప్రమాదాన్ని కొని తెచ్చుకోలేదు. ప్రమాదం వచ్చినప్పుడు పారిపోలేదు” ఎంత గొప్పమాట చూడండి! ఇది జీవితానికి అన్వయించుకుంటే చాలు. కాళోజీ రామేశ్వరరావు గారికి ఎం. జి. ఎం ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగింది. కాళోజీ గారు చూడడానికి వెళ్లారు. ఆ సమయంలో నేను సెలవు మీద వారం రోజులు ఇక్కడ ఉన్నాను. ఆయనతో పాటు నేనూ ఆసుపత్రికి వెళ్ళాను. అక్కడ సూపరింటెండెంట్ ప్రసాదరావు గారని మంచి పేరున్న వ్యక్తి. ఆయన కాళోజీ గారితో రామేశ్వరావు గారిని ఇంటికి తీసుకుపోవచ్చు గానీ ఇంటి దగ్గర సౌకర్యాలు ఉండవు కాబట్టి ఇక్కడే కొన్ని రోజులు ఉంచితే బాగుంటుంది అన్నారు. అప్పుడు కాళోజీగారు “అన్నగారు బాగయ్యారు. ఆసుపత్రిలో మరో పేషేంటుకు ఇవ్వవలసిన అవకాశాన్ని అవసరం లేకున్నా మనం వాడుకోవద్దు” అందువల్ల డిశ్చార్జ్ చేయండి అన్నారు. అట్లా ఆయన జీవితాన్ని ప్రత్యక్షంగా చూస్తూ పెరిగినవాడిని.
21. ప్రజాకవిగా, స్వాతంత్ర్య సమరయోధునిగా, తెలంగాణ ఉద్యమజ్వాలగా నిలిచిన పద్మభూషణ్ డా. కాళోజీ నారాయణరావు ఇంతటి అనుబంధాన్ని పెనవేసుకున్న మీకు కాళోజీ పురస్కారం అందుకోవడం ఎటువంటి అనుభూతినిచ్చింది? ఈ పురస్కారానికి ప్రేరణగా తదుపరి ప్రణాళికను ఏమైనా ఏర్పరచుకున్నారా?
జ: తమ జీవితాన్ని పరిపూర్ణంగా ప్రజలకు అంకితం చేసిన ప్రపంచమానవుడు కాళోజీ. ఆయన ప్రజాహృదయ వేదికపై స్థిరపడ్డాడు. కాలం నాలుకపై నిలబడతాడు. అంతటి మహనీయుని పేరిట ఏర్పాటు చేయబడిన తెలంగాణ ప్రభుత్వ పురస్కారం అన్ని పురస్కారాలకంటే విలువైనది. అటువంటి పురస్కారాన్ని పొందినందుకు నా జన్మ ధన్యమైందని భావిస్తాను. ఈ పురస్కారాన్ని పొందడం వల్ల కవిగా నా బాధ్యత మరింత పెరిగింది. కాళోజీ గారితో నాకున్న అనుబంధాన్ని, వారి వెంట నేను తిరిగినప్పటి అనుభవాల్ని ఒక గ్రంథంగా రాయాలనుకుంటున్నాను. ఒక దీర్ఘకావ్యం కూడా రాయాల్సి ఉంది. కాలం సహకరిస్తే తప్పక రాస్తాను. కాళోజీ చింతనను ఆశయాలను ముందుతరాలకు అందించడమే నా బాధ్యత. ఇట్టి బాధ్యతను నేను నిర్వర్తించాలి కదా!
22. ఎంతో గొప్ప ఆలోచన సార్! కవిత్వాన్ని ప్రాణంగా భావించే మీరు మయూఖ పత్రికాముఖంగా తరువాతి కవులకు ఏదైనా సూచన ఇవ్వండి.
జ: కేవలం కవిత్వం వల్ల సమాజంలో ఏదో పెద్ద మార్పు వస్తుందనే భ్రమలో ఉండొద్దు. మనిషి జీవించే విధానం, ఉద్యమాలు సమాజాన్ని మారుస్తాయి. కవిత్వం అందులో ఒక పార్శ్వం. ముఖ్యంగా మనిషి మనిషిలాగా ఉండాలి. ఉన్నత వ్యక్తిత్వాన్ని అలవరచుకోవాలి. అటువంటివాళ్ళ రచన కూడా ఉన్నతంగా ఉంటుంది. మొదట హృదయసంస్కారం అవసరం. చెప్పినదాన్ని ఆచరించగలగాలి. ఈ తరం వాళ్లు చేయాల్సింది ఎక్కువగా అధ్యయనం. దాని నుండి భాషను, భావాన్ని అర్థం చేసుకోవాలి. ఇతర ప్రముఖ కవుల రచనలను లోతుగా పరిశీలించాలి. మనం రాసిందే గొప్ప అనే భావనను వీడాలి.
ధన్యవాదాలు సార్!🙏🏼ఇంతటి సుదీర్ఘమైన సమయాన్ని మాకోసం కేటాయించినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల పక్షాన అనేక నమస్సులు. కృతజ్ఞతలు. మీ ఆశయానికి అనుగుణంగా రాబోయే మీ తదుపరి రచన కోసం ఎదురు చూస్తూ సెలవు
నిజమే ! మీరు సరిగానే చూశారు టైటిల్లో 13వ సంఖ్య లేదు .ఎందుకంటే ,చాలా ఫాస్ట్ గా గతంలో కంటే నమ్మకాలు ,విశ్వాసాలు పట్ల నమ్మకం లేని ఈ కాలంలోనూ 13సంఖ్య మాత్రం అనేకులకు అన్ లక్కీ నెంబరే . 13ను దురదృష్టకరమైన సంఖ్యగా భావించడానికి బలమైన చారిత్రక ,సాంస్కృతిక , మతపరమైన కారణాలు ఉన్నాయి
ఈ నమ్మకం ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో వ్యాపించి ప్రపంచవ్యాప్తంగా పాకింది
ఇలా 13 పట్ల ఉన్న భయాన్ని వైద్యశాస్త్రంలో ట్రై స్కై డేకా ఫోబియాఅంటారు . ఈ కారణం వల్లనే చాలా హోటళ్లలో 13 వ అంతస్తు ,13వ నెంబర్ గదులు ఉండవు . విమానాల్లో కూడా 13వ వరుస నివారిస్తారు చాలా సంస్థల్లో .
The Code of Hammurabi
లిఖితపూర్వకంగా ,సమగ్రంగా ,న్యాయబద్ధంగా మనకు తెలిసిన అతి ప్రాచీన Code . అంటే న్యాయ నిబంధన గ్రంథం .ఇది బాబిలోనియన్ రాజు Hammurabi కాలానికి చెందింది .ఈయన క్రీస్తు పూర్వం 1792 నుంచి 17 50 వరకు రాజ్యం చేశాడు .ఓ రాతి స్తంభం మీద 282 నియమాలు చెక్కిం చాడు . రక రకాల నేరాలకు జరిమానాలు ,శిక్షలు ఇందులో చెప్పబడినాయి .ఐతే ఇందులో 13వ నియమం లేదు .13 అనేది దురదృష్టకరమైన సంఖ్య అని చెప్పడానికి ఇది తొలి గుర్తు . అందు వల్లనే పరిహరించారని , దీనిని సమర్థించే వారి అభిప్రాయం . లేఖకుల పొరపాటని పండితులు వాదిస్తారు .ఎప్పటినుంచో ఉన్న 13 పై ఉన్న అభిప్రాయాన్ని ఇది బలపరుస్తుంది
Norse mythology
స్కాండినేవియన్ కథల ప్రకారం ఒకసారి వలహల్లాలో 12 మంది దేవతలు విందు చేసుకుంటుండగా లోకి (Loki ) అనే మోసపూరిత దేవుడు ఆహ్వానం లేకుండా 13వ వ్యక్తిగా అక్కడికి వచ్చాడు .తర్వాత జరిగిన గొడవలో అందరికీ ఇష్టమైన బాల్డర్ అనే దేవుడు మరణించాడు లేదా చంపబడ్డాడు .13 సంఖ్య ఫలప్రదం కాదని చెప్పడానికి ఇది ఇంకో కారణం
మతపర కారణాలు
బైబిల్ కథనం ప్రకారం ఏసుక్రీస్తు తన చివరి భోజనం(Last Supper ) తిన్నప్పుడు ఆయనతో పాటు 13 మంది శిష్యులు ఉన్నారు .ఆ విందులో 13వ వ్యక్తిగా కూర్చున్న జుడాస్ అనే శిష్యుడే క్రీస్తును శత్రువులకు పట్టి ఇచ్చాడు .అందువల్ల 13వ సంఖ్యను ద్రోహానికి , దురదృష్టానికి చిహ్నంగా చూస్తారు .
న్యూమరాలజీ
ప్రాచీన కాలంలో 12వ సంఖ్యను చాలా పవిత్రమైనదిగా ,సంపూర్ణమైనది గా భావించేవారు .ఉదాహరణకు సంవత్సరానికి 12 నెలలు ,రాశి చక్రాలు 12 ,ఒలింపస్ దేవతలు 12 మంది .సంపూర్ణమైన 12 వ సంఖ్య తర్వాత వచ్చే 13 అసమతుల్యతను సూచిస్తుందని ప్రజల ప్రబల నమ్మకం .
శుక్రవారం 13
లాస్ట్ సప్పర్ అనేది గురువారం జరిగితే ఆ మర్నాడు శుక్రవారంక్రీస్తును సిలువ వేసిన రోజు . క్రిస్టియన్ సంఖ్యాశాస్త్రం ప్రకారం 12వ సంఖ్య శక్తికి ,అధికారానికి గుర్తుగా , పూర్ణత్వానికి చిహ్నం . క్రిస్టియన్స్ సొసైటీ లో ఇలాంటి సంప్రదాయం ఉండేది ఒకప్పుడు . .ఇలా 12సంఖ్య మంచితనానికి ,పటిష్టతకు చిహ్నంగా మారగానే , ఈ పూర్ణత్వానికి వ్యతిరేకమైన భావన 13 పట్ల ఏర్పడి ఉండవచ్చు .
13వ తేదీ శుక్రవారం నాడు వస్తే,మరింత దురదృష్టకరమైన భావిస్తారు .క్రీ .శ .1307 అక్టోబర్ 13 శుక్రవారం నాడు ఫ్రాన్స్ రాజు వందలాదిమంది నైట్స్ టెంపలర్ యోధులను బంధించి ,క్రూరంగా చంపించాడు .
అయితే ఈ నమ్మకానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు .అమెరికా జనాభాలో దాదాపు పది % మందికి 13 సంఖ్య అంటే భయం ఉందని పరిశోధకులు అంచనా.
ఒకవేళ శుక్రవారం 13వ తేదీ వస్తే , పెళ్లి , ప్రయాణాలు మాన డం , కొన్ని సార్లు కనీసపు పనులు కూడా మాన డం వల్ల ఏటా 800 మిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక నష్టాలు ఒక్క అమెరికాలోనే సంభవిస్తున్నాయి .
ఇలా శుక్రవారం 13వ తేదీ ఖరీదైన నమ్మకంగా మారింది .
నార్త్ కరోలినా లోని ఆ షివల్లె లో ఉన్న స్ట్రెస్ మేనేజ్మెంట్ సెంటర్ అధ్యయనం ప్రకారం అమెరికాలోని 80% పైగా ఎత్తైన భవనాలలో 13వ అంతస్తు ఉండదునేటికీ .
ఇలా దురదృష్టానికి ప్రతీకగా ఈ 13 సంఖ్య రూపుదిద్దుకున్నది .అయితే చరిత్రకారులు ,విద్యావిషయక నిపుణులు కచ్చితంగా దీనికి కారణం ఇది అని నిర్ధారించ లేకపోతున్నారు .చారిత్రక మత సంబంధ పౌరాణిక అంశా లు అన్ని కానీ ,కొన్ని కానీ కారణం అని భావిస్తున్నారు .
ఇలా 12వ తేదీ మంచితనానికి ,పటిష్టతకు చిహ్నంగా మారగానే ,ఈ పూర్ణత్వానికి వ్యతిరేకమైన భావన 13 సంఖ్య పట్ల ఏర్పడి ఉండవచ్చు .ప్రస్తుతానికి ఈ విషయం గురించి మనకు తెలిసింది ఇంత మాత్రమే .
ఫ్రెండ్స్ క్విజ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా! ప్రశ్న ల క్రింద ఉన్న జవాబుల తో మీకు వచ్చిన మార్కులు చెక్ చేసుకుంటున్నారు కదా? మీ పరీక్షకు మీరే నిర్ణాయకులు ! మీకు మీరే అభినందనలు చెప్పుకోండి మరి- డాక్టర్ కొండపల్లి నీహారిణి,
- మయూఖ పత్రిక ఎడిటర్.
-41. Expand UNESCO ?
a. United Nations Educational, Scientific and Cultural Organizations
b. United States Educational, Scientific and Cultural Organizations
c. United Nations Scene, Equal Organizations
d. Unity Nations Education, Scientific Organs
42 . Which lake is the largest fresh water lake by its surface area?
a. Lake Baikal
b. Lake Victoria
c. Lake Superior
d. Lake Michigan
43 What is a Plebiscite called?
a. Publications
b. Website
c. Sightseeing
d. Referendum
44Who is the author of Odyssey?
a. Homer
b. Charles Dickens
c. G.B.Shaw
d. Rudyard Kipling
- Who is the CEO of Google? a. Ramaswami
b. Sunder Pichai
c. Sunder Rajan
d. Rishi Sunak. 46. Who is the hero in Kantara movie? a. Rishab Shetty
b. Allu Arjun
c. Ram Charan
d. Rajnikanth. 47. Where do you find these stone sculptures? a. Hawaii Island
b. Easter Island
c. Carrabean Island
d. Bora Bora. 48. Which country is called land of midnight sun? a. England
b. Spain
c. France
d. Norway. 49. How do we get Vitamin D naturally? a. Oranges
b. Broccoli
c. Sun
d. Moon. 50. When was Rohit Sharma played his last ODI match? a. July 19th 2026
b. June 18th 2025
c. May 17th 2024
d. April 16th 2023. 51. Who is the author of Amukthamalyada? a. Kalidasa
b. Sri Krishnadevaraya
c. Pothana
d. Ashoka. 52. What is the capital of Iceland? a. Reykjavik
b. London
c. Bern
d. Paris. 53. The Panama Canal connects which of these? a. Arctic Ocean & Baikal
b. Atlantic Ocean & Pacific
c. Arctic & Southern Ocean
d.Victoria & Red sea. 54. Entomology is the science that studies what? a. Insects
b. Plants
c. Earth
d. Oceans. 55. Sushi is the traditional dish of which country? a. Finland
b. Canada
c. Japan
d. Kenya. 56. Mount Etna is in which continent? a. Africa
b. Europe
c. Australia
d. North America. 57. Which is the colour found in the Vibgyor? a. Red
b. Pink
c. White
d. Baby pink. 58. What is the main ingredient of “Hummus”? a. Onions
b. Chick peas
c. Green Peas
d. Potatoes. 59. How many hearts does Octopus have? a. 4
b. 7
c. 6
d. 3. 60.Which country has world’s longest coast line? a. Zimbabwe
b. Canada
c. Finland
d. Austria. ANSWERS:
‐———————– - a. United Nations Education,Scientific and Cultural Organizations (It was founded in 1945); 42. c. Lake Superior (Lies on the border between the United States and Canada); 43. d. Referendum (Direct public votes on significant issues); 44. a. Homer (He is an ancient Greek epic poet; 45. c. Sunder Pichai, who has held the position since 2015; 46. a. Rishab Shetty (Rishab Shetty is an Indian actor, film director and producer); 47. b. Easter Island.(Easter Island is also known locally as Rapa Nui); 48. d. Norway (A Country in Europe); 49. c. Sun (Vitamin ‘D’ helps absorb Calcium); 50. a.19th July 2026 (Rohit Sharma’s last international match was the “third ODI against England at Lord’s on july 19, 2026, where he scored 138 runs); 51. b. Sri Krishnadevaraya (He was the emperor of the Vijayanagara Empire from 1509 to 1529); 52. a. Reykjavik (About 140,000 people live in the city); 53. b. Atlantic Ocean and Pacific Ocean (Location: about 50 to 51 miles long); 54. a. Insects (the word comes from the Greek words ‘entomon’, meaning “insect”,and “logos” meaning “study”; 55. c. Japan (a traditional Japanese dish); 56. b. Europe (Mount Etna sits on the east coast of Sicily, Italy); 57. a. Red (VIBGYOR includes seven colours: Violet, Indigo, Blue, Green, Yellow, Orange and Red); 58. b. Chick Peas (Hummus is a delicious spread made from chickpeas, tahini, lemon and spices); 59. d.Three hearts (Two hearts pump blood ghrough the gills, and one larger heart pumps blood to the rest of the body); 60. b. Canada (measuring approximately 202,080 kilometers).
ఓ గాయం తగిలినప్పుడు
ఓ ఆకలి తడిమినప్పుడు
ఓ తోడు అడిగినప్పుడు
ఓ వ్యథ కమ్మినప్పుడు
బ్రతుకు శూన్యాలు గుర్తుకొచ్చి
బండరాళ్లై జడత్వంలో మునుగుంటే
విరబూసిన పత్తి మండ తెల్లనవ్వులా
ఎరుపు పులిమిన బొగెన్విలియా పూ కొమ్మలా
రాగబంధాల్ని పూయిస్తూ
రాతిరేఖల్ని మారుస్తూ
ఓడిపోయిన ఓదార్పుల్ని
కొంగున ముడుచుకొని
సమస్తాణువుల మీదుగా
దిశ చూపే తారకలుగా
స్త్రీ, సోదరి, సతి…
స్థాయిలేవైనా
సమతోత్భవ పరిపూర్ణతను
ఒళ్లంతా పులుముకొని
ప్రయాణిస్తుందామే…
ప్రపంచం నుండి ఆమెలోకి
ఆమె నుండి ప్రపంచంలోకి
విధితత్వపు పోకడలు వెన్నుతన్నినా
అఘాయిత్యపు వంచనలు రొమ్ము పొడిచినా
ప్రయాణిస్తుందామే
లోకం నుండి శోకంలోకి..
శోకం నుండి మైకంలోకి..
మైకం నుండి లోకంలోకి..
డాక్టర్ అమృతలత మయూఖ అంతర్జాల పత్రిక సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో ద్వీతీయ బహుమతి పొందిన కథ (రూ.5,000)
‘‘ఏంటి చిన్నీ! అన్నం తినిపిస్తుంటే తినడానికి కూడా నీకు బద్దకంగా ఉందా? అక్కడ అమెరికాలో మీ అమ్మ ఎంతో కష్టపడి చదువుకుంటున్నది. ఇక్కడ నువ్విలా సరిగ్గా తినకుండా చిక్కిపోతే రేపొద్దున నన్ను అనరా.. నువ్వెంత అల్లరిచేసినా, బడికి వెళ్ళకపోయినా సహిస్తాను. కానీ అన్నం తినకపోతే మాత్రం ఊరుకోను’’ చిన్ని రెండు చెంపలపై అటొక దెబ్బ ఇటొక దెబ్బా విసురుగా వేసింది స్వప్న.
నోట్లో ముద్దతో, ఏడుపుతో పొలమారిన చిన్ని… చెంపలు రుద్దుకుంటూ ఏడవసాగింది. కోడలిని, చిన్నీని బిత్తరపోయి చూడసాగింది దాక్షాయణి.
‘‘తింటావా తినవా? నీకసలు భయంలేకుండా పోతున్నది. ‘‘ అన్నం ప్లేట్ ముందు పెట్టి చిన్ని చెంపల మీద వాయిస్తోంది స్వప్న. ఇక ఆగలేక ఒక్క ఉదుటున వెళ్ళి
‘‘అదేంటమ్మా స్వప్నా.. అట్లా కొడుతున్నావు పసిపిల్ల బెదిరిపోతున్నది’’
‘‘అత్తయ్యా! మీరు అడ్డు రావద్దని చెప్పానా! నేనేమన్నా అల్లరి చేస్తే కొడుతున్నానా, బడికెళ్ళకపోతే కొడుతున్నానా.. దేనికైనా ఊరుకుంటాను కానీ, అన్నం తినకపోతే మాత్రం ఊరుకోను. దామిని ఒదిన చిన్ని బాధ్యత మనకప్పగించి వెళ్ళింది. తనను చూసుకునే బాధ్యత మీకే కాదు నాకు ఉంది. చిన్నీ తింటావా.. తినవా..?’’ ఆమె స్వరంలో తీవ్రత హెచ్చింది. చిన్ని వెక్కిళ్లు పడుతూ ఏడుస్తూ ముద్ద మింగలేకపోతున్నది.
‘‘తిను, ముందు తిను’’ చిన్ని చెంపల మీద మరోసారి వాయించింది. చాలా తెలివిగా నిర్భీతిగా కోడలు స్వప్న తన దాష్టికాన్ని ప్రదర్శిస్తుంటే దాక్షాయిని విస్తుపోతున్నది.
పిల్లలను ఇట్లా కూడా కొడతారా? ఇంటికి పెద్దయిన తన కళ్ళముందరే పసిపిల్లను పట్టుకుని అన్నం తినడం లేదని తిరుగులేని వంకతో.. ఎంత నిర్భయంగా.. ఎంతో తెగింపుతో కొడుతూ ఇంత బాగా సమర్థించుకుంటున్న కోడలిని ఎలా అడ్డుకోవాలి? దాక్షాయిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎనిమిదేళ్ళ, సత్యా, పదేళ్ళ సాగర్ దూరంగా నిల్చుని ఒకసారి తల్లికేసి.. మరోసారి గదిలోని చిన్నికేసి భయంభయంగా చూస్తున్నారు.
ఇక ఆగలేక ‘‘సరేలేమ్మా. కాసేపయ్యాక తింటుందేమో’’ మనవరాలిని దగ్గరికి తీసుకున్నది.
‘‘అదే మీతో వచ్చిన చిక్కు. వదినకేమో పెళ్లయి ఏడేళ్ళ కూతురున్నా ఇంకా చదువుకోవాలని ఆశ. పాపను ఎంతో నమ్మకంతో మనకప్పగించినప్పుడు మనం సరిగ్గా చూసుకోకపోతే ఎట్లా? రేపొద్దున ఈ పిల్ల చిక్కిపోతే ‘ఏంటి వదినా.. నిన్ను నమ్మి మీకు చిన్ని బాధ్యత అప్పచెప్పాను. నా పిల్లని ఇలాగానే పెంచేది అంటే నేనేమని చెప్పాలి?’ అంటూ గట్టిగా వదురుతున్నది స్వప్న. తలవంచుకొని చిన్ని చేయి పట్టుకొని గదిలోకి తీసుకెళ్లింది దాక్షాయని. చిన్ని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నది. తనకు తెలియకుండానే దాక్షాయిని కూడా ఏడవసాగింది. స్వప్న బిరబిర గదిలోకి వచ్చి..
‘‘ఏంటత్తయ్య గారు! నేనేదో చేయారాని ఘోరం చేసినట్టు అట్లా బాధపడుతున్నారు. నా కూతురునైతే తినకపోతే ఊరుకుంటానా? నాకు సత్యా, సాగర్ ఎంతో చిన్నీ కూడా అంతే. వాళ్ళు సరిగ్గా తినకపోతే ఎట్లా ఒక దెబ్బవేస్తానో చిన్నిని కూడా అలాగే దెబ్బ వేసాను. ఏం అట్లా ఓ దెబ్బ వేసే హక్కు కూడా నాకు లేదా చెప్పండి?’’ ఎగిసిపడుతూ అడుగుతున్నది స్వప్న. ఏమి సమాధానం ఇవ్వగలదామె?
ఇంతలో కొడుకు హరీష్ వచ్చాడు.. వస్తూనే ‘‘చిన్ని ఏది?’’ అడిగాడు. ‘‘ఇప్పుడే పడుకుందిరా’’ కంగారును దాచుకుంటూ చెప్పింది.
అప్పుడే దామిని వీడియో కాల్ చేసింది. తండ్రికీ దామినికీ ఏమీ చెప్పొద్దని నానమ్మ చేసిన సైగను అర్థం చేసుకున్న పిల్లలిద్దరు. ‘‘చిన్ని ఇప్పుడే పడుకుంది’’ అని చెప్పారు.
కాస్సేపు అన్నతో సరదాగా మాట్లాడి ఫోన్ పెట్టేసింది దామిని. తేలికగా ఊపిరి పీల్చుకున్నది దాక్షాయణి. ఈ మధ్య ఇలాగే తరుచూ దేనికో దానికి స్వప్న చిన్నిని ఓ దెబ్బ వేయడం అదే సమయానికి దామిని వీడియో కాల్ చేయడం.. చిన్ని బయట ఆడుకుంటున్నదనో, పడుకున్నదనో, స్నానం చేస్తున్నదనో తాను అబద్దాలు చెప్పడం కొడుకు పిల్లలిద్దరూ గమనిస్తూనే ఉన్నారు. స్వప్న ఇంకా ఏమి దాడిచేస్తుందో అని పిల్లలూ, దాక్షాయణి అయిష్టంగానే అన్నం తిన్నామనిపించారు.
ఏడ్చిఏడ్చి చిన్ని గదిలో అలసిపోయి పడుకుంది. మధ్యమధ్య నిద్రలోనే బెక్కుతున్నది. చిన్ని నుదుటి మీద పడిన జుత్తును సవరిస్తూ.. ఎంత అమాయకపు అందం. అందమైన గులాబీల గుచ్చం ఏదో పక్క మీద పెట్టినట్టుగా నవకంపు పసిసొగసు అనుకున్నది. అవును చిన్ని అందం, అమాయకపు మోము, తెలివర్ణం.. బహుశా ఇవి కూడా స్వప్నలోని అక్కస్సుకు కారణమేమో. ఆ పసి బుగ్గలపై స్వప్న అరచేతి గుర్తులు ఎర్రగా కమిలి కనిపిస్తున్నాయి.
చిన్నపిల్లలను అంతా నిర్ధాక్షిణ్యంగా కొట్టడం ఒకరకంగా మానసికమైన జబ్బేమో, కారణాలేమయినా కానీ, దాన్ని చూస్తూ భరించటం మాత్రం పెద్ద నరకం. అభం శుభం తెలియని పిల్లలు తమనెందుకు హింసిస్తున్నారో అర్థంకాని ఈ భయం, ఈ ఉలికిపాటు జీవితాంతం వారిని వెంటాడుతాయేమో. నిద్రలో చిన్ని ఉలికులికిపడుతూనే ఉన్నది. ఇంకా వెక్కిళ్లు పడుతూనే ఉన్నది. కందిపోయిన చిన్ని చెంపలు చూస్తుంటే దాక్షాయినికి దుఃఖం ముంచుకొస్తున్నది
‘‘ఎందుకిలా ప్రవర్తిస్తున్నావని స్వప్నని గట్టిగా నిలదీయలేదు. నిలదీస్తే బ్రతకగలదా? ఏమీ అనకముందే రాద్ధాంతం చేయగల సమర్థురాలు ఆమె. ఇక ఏమన్నా అంటే ఆగుతుందా? నిద్రపోవడానికి ప్రయత్నించిందామె. ్య్య్య
తను చిన్నిని కొట్టగానే పెద్దగొడవ చేసి తనను ఘోరంగా నిలదీస్తుందేమో, కొడుకుకో, దామినికో చెప్పేస్తుందేమో ఆ వంకన ఒక పెద్ద గొడవ పెట్టుకుందామని ఎదురుచూస్తున్న స్వప్నకు దాక్షాయిని ఏమి మాట్లాడకుండా గదిలోకి వెళ్లి పాపని నిద్రపుచ్చడం చూసి చాలా ఆశ్చర్యపోయింది. ఇలా ఆశ్చర్యపోవడం స్వప్నకి కొత్త కాదు. తన పెళ్లికి ముందు దాక్షాయిని కుటుంబంతో అనుబంధం ఏర్పడిన దగ్గర్నుంచి ఎన్నో విషయాలకు ఆశ్చర్యపోతూనే వుంది. ఆ కుటుంబంలో వాళ్ళ అనుబంధాలకి, వాళ్ళ మాట తీరుకి, మరీ ముఖ్యంగా వాళ్ళ ఖర్చుల ధోరణికి, వారి అప్యాయతలకి, అప్పుడూ ఇప్పుడూ కూడా ఆశ్చర్యపోతూనే ఉంటుంది. వీళ్ళు తిండి తిని బ్రతుకుతారా లేక ఈ మాటలు ఈ బంధాలతోనే బ్రతుకుతారా అని ఆశ్చర్యపోతూనే ఉంటుంది.
దిగువ మధ్యతరగతిస్థాయి ఇంట్లోనుంచి వచ్చిన అమ్మాయి స్వప్న. ఒక కంప్యూటర్ కోర్సేదో నేర్చుకుంటున్నప్పుడు జీవితంలో ఇంకా స్థిరపడని హరీష్ తో ప్రేమలో పడింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిని అయిన ఒంటరి తల్లి దామిని, ఒక చిన్న ప్రైవేటు ఉద్యోస్తుని కూతురైన స్వప్నని కోడలిగా అంగీకరిస్తుందని అనుకోలేదు. అంగీకరించకపోతే వెళ్లి ఆమెతో గొడవ పెట్టుకునయినా సరే హరీష్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నది.
కాని చిత్రంగా తన కుటుంబ విషయాలు, తనని చూసి మనసులో ఏమనుకున్నా కొడుకు కోరిక తీర్చడమే తన ధర్మం అనుకొని పెళ్లికి ఒప్పుకున్నట్టున్నది. తాము పెళ్ళి చాలా నిరాడంబరంగా మాత్రమే చేసినా.. ఒక్క చిన్న విమర్శ కూడా చేయకుండా తాము చేసిన లోటుపాట్లను సంయమనంతో భరించి తనని ఇంటి కోడలుగా ఆహ్వానించింది. ఎందుకో ఆ మంచితనాన్ని భరించలేకపోయింది స్వప్న.
‘అమ్మా అన్నం పెట్టవే, నా బ్యాగ్ ఎక్కడ పెట్టావే? ఇలా తన తల్లిని పిలవడం అలవాటైనా స్వప్నకీ, వాళ్ళ అన్నయ్యకీ… దామిని, హరీష్ ఇద్దరూ… అమ్మా మీరిలా కూర్చోండి, అమ్మా బయటకు వెళ్తున్నాను మీకేమైనా తేవాలా?’ అని పరాయి వారితో మాట్లాడినట్టు మాట్లాడే మన్నింపు మాటలు విని ఆశ్చర్యపోయింది. దాక్షాయిని వంట చేస్తుంటే హరీష్ అమ్మకు అన్ని పనుల్లో సాయం చేయడం చూసి ఆశ్చర్యపోయింది. పరీక్షలు ముగించుకొని ఎలాగో కాసేపట్లో ఇంటికి వచ్చే దామిని కోసం ఇంటిల్లిపాది రైల్వే స్టేషన్ కి వెళ్ళటమే పెద్ద ఆశ్చర్యం అనుకుంటే.. తన ఇంటికి తను వస్తూ తల్లికి, అన్నకూ పూలగుత్తులు, బోలెడన్ని పుస్తకాలు తేవడం చూసి అవి కూటికొచ్చేనా, గుడ్డకొచ్చేనా అని ఆశ్చర్యపోయింది. అదేదో అపురూప సంపద తీసుకొచ్చినట్టు ఆ పూలను టేబుల్ మీద వాజ్ లో పెట్టి ఓ ఇరవైరోజులపాటు దాక్షాయణి, హరీష్ మురిసిపోవడం చూసి ఆశ్చర్యపోయింది. ఉదయానే లేవగానే గుడ్ మార్నింగ్ లు, పడుకునేటప్పుడు గుడ్ నైట్ లూ చెప్పుకోవడం, లేచిన దగ్గరనుండీ కన్నమ్మలూ, బంగారు తల్లీ అంటూ, అత్తా, భర్తా దామినిని గారాబం చేస్తుంటే, తన ఇంట తనకు అందని ప్రేమ ఇక్కడ దామినికి దక్కడం భరించలేకపోయేది.
‘అమ్మా నువ్వు చదువుకోమ్మా నేను చేస్తాను కదా!’ అంటూ దామిని తల్లిని చేతిలో పని అందుకోవడం, ‘అన్నయ్యా ముందు నువ్వు తిను, అమ్మా ఇదిగో నీకు ఇష్టం కదా’ లాంటి మాటలు వింటుంటే వెంటనే తన ఇల్లు గుర్తుకొచ్చేది. పనులు చేయలేదంటూ ఈసడించుకొని తిట్టే తల్లి, పనులు తప్పించుకోవాలని చూస్తూ తల్లి మీద చెల్లెలి మీద తాను గట్టిగా విసుక్కోవడం, అన్నిటికీ పోటీపడి అన్నతో కొట్లాడడం, తన ఇల్లంతా అరుపులతో, కేకలతో విసుగులతో ఎట్లా ఉండేదో గుర్తుకొచ్చి.. వీళ్ళ ప్రేమలు, మాటలు చాలా నాటకీయంగా అనిపించేవి. దామిని విద్యలో సాధించిన ప్రగతికి అబ్బురపడడం, ఆమె పొందిన చిన్న ఉద్యోగానికే పొంగిపోవడం, దామిని గర్భవతయినప్పుడు ఆమెనో రాజకుమారిలా అపురూపంగా చూసుకుంటూ మురిసిపోవడం… ఇవ్వన్నీ స్వప్నకి ఎప్పుడూ కంటగింపుగానే ఉండేది.
ఒకళ్ళకోసం ఒకరు ఎదురుచూడటం, అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయడం, ఒకరికొకరు చిన్నచిన్న బహుమతులు ఇచ్చుకోవడం, దానికి ఎంతో మురిసిపోవడం, గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకోవడం.. ఈ అమితమైన ప్రేమలు, బాధ్యతలు ఇదంతా ఆనందాన్ని కలగజేసే బదులు స్వప్నలో అక్కసు బయలుదేరింది. స్వప్నతోనూ అంతే ప్రేమగా వున్నా పైకి నవ్వేది కానీ, లోపల వారిపట్ల ఏదో అపనమ్మకం, అశాంతీ ఆమెను వెంటాడేవి. తన ఇంట్లో తను ఎప్పుడు అలాంటి సున్నితమైన ప్రేమలను ఆమె పొందలేదన్న విషయం మనసుకు ముల్లులా గుచ్చుకుంటుండేది. పోనీలే వీళ్ళయినా అలా ప్రేమను పంచుకుంటున్నారు, పంచుతున్నారని అని మురిసిపోవటం,తాను వాళ్ళతో కలిసిపోవడం ఆమెకు ఒంటబట్టలేదు.
ఇక వాళ్ళ పూలగుత్తుల పిచ్చి చూస్తే వొళ్ళు మండిపోతుంటుంది స్వప్నకి. ఈ సంబంధం కుదిరాక తనను చూడాడానికి దామిని, వాళ్ళాయినా వచ్చారు.. వస్తూవస్తూ ఎంతో అందమైన పూలబొకే తేవడంతో.. ఎంతో ఆశ్చర్యపోయింది. ‘ఆ అయిదొందలు పెట్టి మరికొన్ని స్వీట్లో, పళ్ళో తెస్తే బాగుండేది కదా!’ అనుకున్నది.
ఇంటికి ఎప్పుడు పూలగుత్తులు తెచ్చినా ఆ ఖరీదులో నాలుగు రోజులకు సరిపడా కూరగాయలు తెచ్చుకోవచ్చనో, వ•డు డజన్ల గుడ్లు వచ్చేవి కదా.. అనో అన్పించేది. పైకి మాత్రం వెర్రినవ్వు నవ్వేది.
హరీష్ ది, దామిని వాళ్ళాయనవి అంతంత మాత్రపు చిన్న ఉద్యోగాలు. ఈ పస్థితుల్లో తానేదో సంపాదించేస్తాను, రెండు కుటుంబాలను నిలబెట్టేస్తాను అంటూ దామిని… చిన్నిని తమ మీద వదిలి అలా విదేశాలకు వెళ్ళడం స్వప్న ఇంకా జీర్ణించుకోలేని వాస్తవం. ఆ కోపమంతా చిన్ని మీదకు మళ్ళడం ఎంత విచక్షణా రహితమో అన్న ఆలోచన కూడా ఆమెకు కలగడంలేదు.్య్య్య
నిద్దట్లో ఉన్న చిన్నిని దగ్గరికి తీసుకుంది దాక్షాయణి ‘‘చిన్నితల్లీ! నిన్నెలా కాపాడుకోవాలి? అసలు మీ అమ్మకి ఎందుకంత ధైర్యం? నిన్నొదిలి ఎలా వెళ్ళగలిగింది? ఎలా ఏంటి.. నేనున్నానని కదా ధైర్యం! తన అన్నా వదినలే దగ్గరే కదా వదిలింది. ఆ ధైర్యాన్ని, నమ్మకాన్ని మేము నిలబెట్టుకోగలుగుతున్నామా? ఇది ఎంత అన్యాయం? ఒక ఆడపిల్ల పెళ్లి తర్వాత తన చదువు కొనసాగించుకోవాలనుకోవటం నేరమా? నేరమా అంటే నేరం కాదు. కానీ స్వప్నకు ఇది అదనపు ఆర్థికంగా కాకున్నా పనిభారమే. నిజానికి ఏ బాధ్యత అయినా ఇష్టంగా స్వీకరిస్తే అది భారం కాదు.
స్వప్న మీద కోపంగా వున్నా చెప్పలేని జాలి కూడా ఉన్నది దాక్షాయనికి.. ఒక మధ్యతరగతి అమ్మాయి, జీవితంలోని ప్రతీదీ డబ్బుతోనే కొలుచుకుంటుంది. తీసుకున్న సౌకర్యవంతమైన ఇంటి ఈఎమ్ఐ కట్టాలి, పిల్లలను మంచి స్కూల్ లో చేర్చారు. బోలెడు ఫీజులు చెల్లించచాలి. నెలంతా రకరకాల ఖర్చులుంటాయి. తన పెన్షన్ వాళ్ళకు కాస్త ఆసరా. లేకపోతే ఇంకా ఇబ్బందిపడేవారు. ఈ పరిస్థితిలో దామిని ఇంత ఖర్చుపెట్టుకుని విదేశాలకు వెళ్తే అది తన కుటుంబానికేం లాభం అన్న ఆలోచన స్వప్నది. పుస్తకాలు జీవితాన్ని ఎంత సేదతీరుస్తాయో, పూవులు మన రోజును ఎంత ఆహ్లాదపరుస్తాయో స్వప్నకు అర్థంకాదని మొదట్లోనే గ్రహించింది దాక్షాయణి.
ఈమధ్య తరుచూ చిన్నచిన్న కారణాలకే చిన్నిని ఒక దెబ్బ వేస్తూనే వున్నది. అదే సమయానికి దామిని వీడియో కాల్ చేస్తుంటే.. తాను ఏడుస్తున్న చిన్నీకి సైగ చేసి పక్కగదికి పంపి.. హరీష్ తో బయటకు వెళ్ళిందనో పడుకున్నదనో.. బయట ఎక్కడో ఆడుకుంటున్నదనో అబద్దాలు చెప్పవలసి వస్తున్నది. ్య్య్య
ఆ రోజు సాయంత్రం దాక్షాయణి గుడికి వెళ్ళింది. స్వప్న టైలర్ దగ్గరకు వెళ్ళింది. దామిని ఫోన్ వీడియో కాల్ చేయగానే పిల్లలు సత్యా, సాగర్ ఫోన్ లిఫ్ట్ చేశారు. ఇన్నాళ్ళూ వాళ్ళ మనసులో ఏముందో ‘‘అత్తా! చిన్ని అన్నం తినడం లేదని మొన్న అమ్మ బాగా కొట్టింది, చిన్నీ, నానమ్మ బాగా ఏడ్చారు’’ అని చెప్పేశారు.. విస్తుపోయింది దామిని.
‘‘ఇకనుంచీ సరిగ్గా తింటానమ్మా. అత్తకు కోపం తెప్పించనమ్మా..’’ అమాయకంగా చెప్పింది చిన్ని. చిన్నిదగ్గరకు పరుగెత్తుకెళ్లాలనిపించి, దామిని కళ్ళు నీటితో నిండిపోయాయి. కొన్ని అపోహలు పొరలు పొరలుగా తొలిగిపోయాయి..్య్య్య
రెండు రోజులుగా నలతగా ఉంటున్న స్వప్నకు సాయంత్రం నుంచి జ్వరం మరీ ఎక్కువైపోయింది. కంగారుపడ్డ దాక్షాయిని తడిబట్ట పెట్టి ముఖమంత తుడిచి, వేడివేడి కాఫీ ఇచ్చి టాబ్లెట్లు వేసింది. అంతలోనే దాక్షాయిని అన్న దామోదర్ రావు చనిపోయారని ఫోన్ వచ్చింది. నిజానికి ఇంటిల్లిపాదీ బయలుదేరి అప్పటికప్పుడు వెళ్లాలి. కానీ స్వప్న ప్రయాణం చేసే స్థితిలో లేదు. ఆమెని అలా ఎలా వదిలి వెళ్లాలో అర్థంకాలేదు వాళ్ళకు. కానీ స్వప్న ‘‘మరేం కంగారు పడకండత్తయ్యా, నేను ఎలాగోలాగా మ్యానేజ్ చేసుకుంటాను. మీరు వెళ్ళిరండి’’ అని అత్తగారిని, భర్తని పంపించింది.
వాళ్ళైతే వెళ్లారు కానీ, తెల్లారికే స్వప్నకి జ్వరం ఎక్కువైపోయింది. పిల్లలు స్నానాలు చేసి •••నిఫామ్స్ వేసేసుకున్నారు. వాచ్మెన్ తో బయటినుంచి టిఫిన్లు తెప్పించి పెట్టింది. బాక్సులలో బ్రెడ్ పెట్టుకుని వెళ్ళమ్మని చెప్పి తన గదిలోకి వెళ్లి పడుకుంది స్వప్న. పిల్లలు ముగ్గురు బడికి వెళ్లిపోయారనే అనుకుంది. కాసేపటికి గుమ్మం దగ్గర ఏదో అలకిడైనట్టనిపిస్తే అటువైపు చూసింది. తనవైపే చూస్తున్న రెండుకళ్ళు కనిపించాయి.
‘‘చిన్నీ! నువ్వు బడికి వెళ్ళలేదా ఆశ్చర్యపోతూ లేవబోయింది. అంతలోనే జ్వరభారం తోటి, నిద్రమత్తులో కళ్ళు వ•సుకుపోయాయి. ఓ గంట తర్వాత కళ్ళుతెరిచి చూస్తే.. చిన్ని, తడి రుమాలతో తన నుదుటి మీద అద్దుతున్నది. ‘‘అత్తా! మరీ నేను బడికెళ్ళలేదు. కోపం తెచ్చుకోకు. ఇంట్లో అమ్మమ్మ లేదు కదా! అందుకే ఉండిపోయాను’’ అని చెప్పి వంటింట్లోకి వెళ్ళింది. స్టవ్ వెలిగించి బ్రెడ్ వేడి చేసి ప్లేట్లో పెట్టి తెచ్చింది. పాలు కాచి కాఫీ కలుపుకొచ్చింది. స్వప్న జ్వరం మరిచిపోయి విప్పారిన కళ్ళతో చిన్నీని చూస్తూ కాఫీ తాగసాగింది.
‘ఈ పిల్లకి నేనంటే కోపం లేదా? తనను తిట్టానే, కొట్టానే.. అయినా విసుక్కోకుండా నాకోసం బడికి వెళ్ళకుండా ఎలా ఆగిపోయింది? చిన్ని మోములో దామిని కనిపించింది. ఒకసారెప్పుడో కావాలని దామినితో పెద్ద గొడవ పెట్టుకుంది. మరుసటి రోజు నుంచి ఆమె తనతో మాట్లాడదని, పెద్ద రాద్ధాంతం చేస్తుంది అనుకుంది. కానీ, మర్నాడు బయటనుంచి వస్తూ తనకెంతో ఇష్టమైన సీతాఫలాలతో పాటు అందమైన పూలగుత్తి తీసుకొచ్చి చేతిలో పెట్టింది. ‘వదినా ఎందుకో, అలా జరిగిపోయింది. నీకెందుకో నా మీద కోపం వచ్చింది. అన్నీ మర్చిపో మావ•లుగా ఉందాం’ అని చెప్పేసి ఒక నవ్వు నవ్వి తన గదిలోకి వెళ్ళిపోయింది.
ఇప్పుడు ఈ చిన్నిలో కూడా తనకి ఆనాటి దామిని ముఖమే కనిపిస్తుంది. ఏం మాట్లాడకుండా బ్రెడ్ తిని కాఫీ తాగింది. దాక్షాయణీ అంతే. తాను బాగా కోపంగా ఉన్నరోజున ఒక్క మాటకూడా తిరిగి అనదు. పైగా ఆ రోజు ఓపిక చేసుకుని ఇంటెడు పనిచేస్తుంది. పెరట్లోని పువ్వులు కోసి మాలకట్టి ఇస్తుంది. ఇక తాను ఏమనగలదు?
హరీష్ అంతే. తన కోపం తగ్గిపోయే సమాయాన్ని ఇస్తాడు. ‘ఈ కోపాలన్నీ ఇష్యూ బేస్డ్, దీని ప్రభావాన్ని తరువాతి రోజుకు పులమొద్దు’ అంటాడు. ‘ఆ పువ్వులు, నవ్వులూ, పుస్తకాలు వీళ్ళకి ఇన్ని నేర్పాయా? మరి చిన్నికెవరు నేర్పారు.. తానెందుకు నేర్చుకోలేకపోతున్నది?’ అనుకున్నది.
చిన్నీ కాఫీగ్లాసు, ప్లేటు తీసుకెళ్లి లోపల పెట్టింది. మళ్ళీ తలుపు సగం తెరిచి తొంగిచూస్తూ కనిపించింది. స్వప్న మనసు అదోలా అయిపోయింది. ‘‘చిన్ని ఇలారా’’ అని పిలిచింది. తన స్వరం తనకే కొత్తగా అనిపించింది.
చిన్నపిల్లని కూడా చూడకుండా అనవసరంగా ఎన్నిదెబ్బలు కొట్టాను? తనను ఎందుకిలా దిగజారిపోయి ప్రవర్తించాను? అని ఆమె మనసుపడే మదనాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియలేదు. ‘‘నామీద నీకు కోపం లేదా చిన్నీ? అని అడగాలనుకున్న మాటలు గొంతులోనే ఆగిపోయాయి. కళ్ళెత్తి చూస్తే తలుపు దగ్గరే నిలబడి, తనవంకే చూస్తున్న చిన్ని కనబడింది.
’’ఇటు రా చిన్నీ!’’ అని పిలిచింది. తన గొంతు తనకే కొత్తగా వినపడింది. చిన్ని రెండు చేతులు వెనక్కి పెట్టుకొని నిలుచుని ఉంది.
‘‘అత్తా నేనంటే కోపం పోయిందా? ఇక నుంచీ నిన్ను విసగించకుండా అన్నం తినేస్తాను’’ అన్నది.
స్వప్న స్వప్న తల ఒరిగిపోయింది. ‘ఆ పసిదాని మీద కోపానికి, తన ఆర్థిక పరిస్థితులకి, ఎక్కడో ఏదో లంకె ఉందేమో, తాను చదువుకోలేని చదువులు దామిని చదువుకుంటున్నదన్న అసూయా కూడా ఉన్నదేమో.. కానీ, దాన్ని నేనెందుకు అధిగమించలేకపోయాను’ ఆమె మనసు ముడుచుకుపోయింది. చిన్నివంక చూసింది. చేతులు చాచిన చిన్ని చేతిలో పెరట్లో పూసిన రెండు గులాబీల జంట. గులాబీలు అందుకుంటూ చిన్నిని కూడా దగ్గరకు తీసుకుంది. వీళ్ళందరికీ పూలు పంచడమే కాదు. ప్రేమలు పంచడవ• తెలుసు. తన తన అక్కస్సులో తానా విషయాన్ని గుర్తించలేకపోయింది. సజల నేత్రాలతో చిన్ని నుదుటిపై ముద్దుపెట్టింది. చిన్ని నమ్మలేనంత సంబరపడిపోయింది. ఇంతలో పిల్లలు చదివే స్కూల్ క్లార్క్.. శైలజ నుంచి మెసేజ్ వచ్చింది. దామినికి, శైలజ మంచి స్నేహితురాలు.
‘‘స్వప్నగారూ! దామిని అక్కడ టెన్నిస్ కోచ్ గా చేరిందట. ముగ్గురు పిల్లల ఫీజులు కట్టేసేయమని నాకు డబ్బులు పంపించింది’’ అని ఉంది. పెనుభారమేదో తొలగిపోయినట్టయ్యింది స్వప్నకు.
‘దామినికి పువ్వులు పంచడమే కాదు, బాధ్యతలు పంచుకోవడవ• తెలుసు. తాను తెలుసుకోవాల్సినవే ఎన్నో ఉన్నాయి..’ అనుకుంటూ చిన్ని చేయి పట్టుకుని పెరటిలోని పూలచెట్ల మధ్య నడిచింది. ఆ పసిదాని కర స్పర్శతో జీవన సౌరభమేదో ఆమెను చుట్టుముట్టింది..
డాక్టర్ అమృతలత మయూఖ అంతర్జాల పత్రిక సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో ద్వీతీయ బహుమతి పొందిన కథ (రూ.5,000)
కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో అదో వాడ. పేరు మంకమ్మతోట. ఆ వాడలో రాజభవనం లాంటి పెద్ద బంగ్లా. ఆ బంగ్లాముందు విశాలమైన ఖాళీస్థలం. ఆ ఖాళీ స్థలంలో వందల మంది వచ్చినా సరిపోయేంత స్థలంలో టెంట్లు. ఆ టెంటు నీడలో నాలుగైదు వందల కుర్చీలు. అటు ప్రక్కన భోజనాలు చేయడానికి టేబుళ్లు.. వాటిపై మటన్, చికెన్, ఫిష్,గుడ్ల కూరలున్న పాత్రలు అందులోంచి వస్తున్న మసాలా ఘాటు ఘుమఘుమలు.
కుర్చీలకెదురుగా ఓ మలకు టేబుల్‌పై లక్ష్మారెడ్డి నిలువెత్తు విగ్రహం. ఆ విగ్రహానికి వేయబడున్న పెద్ద పూలమాల. టేబుల్‌పై ఓ పాత్రలలో పువ్వులు, పసుపు కలిపిన బియ్యం, కుంకుమ ఉన్నాయి. ఆరోజు లక్ష్మారెడ్డి గారి పెద్దకర్మ దినం. శ్మశానానికి వెళ్ళి కర్మ కార్యక్రమాదులన్నీ ముగించుకొని తిరిగి వచ్చారు ఇద్దరు కొడుకులు, వారి కుటుంబ సభ్యులు, అపరాహ్నవేళ దాటింది. జనం వస్తున్నారు. లక్ష్మారెడ్డి ఫోటోపై పూలు, అక్షింతలు చల్లి నుదుటిపై బొట్టుపెట్టి వచ్చి కుర్చీల్లో కూర్చుంటున్నారు. లక్ష్మారెడ్డి కొడుకులను కలుసుకొని మాట్లాడుతున్నారు.
‘‘రాంరెడ్డి, ప్రకాశ్‌రెడ్డి ఒక్కపొద్దు విడిచిండ్రు కదా! ఇక భోజనాలకు లేవండి’’ అన్నాడో పెద్దమనిషి.
జనమంతా టేబుళ్ళ దిక్కు కదులుతున్నారు. చావు విందు మొదలయ్యింది. నాన్‌వెజ్ కూరల ఘుమఘుమలు ఆ ప్రదేశమంతా వ్యాపించాయి. వడ్డించేవాళ్లు వడ్డిస్తున్నారు. తినేవాళ్ళు తింటున్నారు. లోపలి గదుల్లో కూచొని కొందరు మద్యపానం సేవిస్తున్నారు. ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళంతా విదేశీమద్యం సీసాలు తెస్తున్నారు. వాళ్ళతో కలిసి మద్యం సేవిస్తున్నారు. గత పదిరోజులుగా ఆ ఇంట్లో మద్యం ఏరులై పారుతుంది. ఆచారం, సాంప్రదాయం పేరుమీద మద్యపానం ఇంటి ఓనర్లతో కలిసి తాగడం జరుగుతూనే ఉంది. కర్మరోజు వందల సంఖ్యలో మంది రావడం వల్ల మద్యసేవనం, మాంసం విందుతో ఇంటి గాల్లో కూడా ఆ వాసనే వీస్తుంది.
మాంసాహార టేబుళ్ళ ముందే తండోపతండాలుగా జనాలు. వెజిటేరియన్ దిక్కుపోయేవాళ్ళు వేళ్ళమీద లెక్కబెట్టేంతమంది కూడా లేరు. చావు విందు బహు పసందుగా సాగుతుంది. విందుకొచ్చిన జనాల్లో కార్పొరేటర్లు. మాజీ ఎమ్మెల్యేలు, గ్రామాలనుంచి వచ్చిన చుట్టాలు, బంధువులు అనేకులున్నారు. బగారన్నం, మాంసం, చికెన్లతో సుష్టుగా భోంచేస్తూ తండ్రికి ఘనంగా కర్మ చేస్తున్న కొడుకుల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు జనం.
‘‘పదకొండు రోజుల్నుంచి వచ్చే జనం పోయే జనం. మందలించుటానికి వచ్చి తాగడం. ఇంటి నిండా జనమే…’’ బొక్కలోని పూలుగు పీలుస్తూ అన్నాడు వెంకటయ్య.
‘‘బహుగ బతికిండు లక్ష్మారెడ్డి. పెద్దపల్లి జిల్లాలున్న ఊళ్ళె మస్తు భూములుండె. అన్నల లొల్లికి కరీంనగర్‌కు వచ్చిండు. భుములమ్ముకోని ఇక్కడ ఇండ్లు గట్టుకున్నడు. కిరాయలతోనే బతికేంత ఆదాయం.’’
‘‘కొడుకుల సదివిచ్చిండు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. కోడండ్లు గూడ ఇంజనీర్లే. వాళ్ళు హైదరాబాద్‌ల విల్లాలల్ల ఉంటున్నరు…’’
‘‘కొడుకులు కర్మ మాత్రం బ్రహ్మాండంగ చేస్తున్నారు….’’
‘‘పదిగొర్లు తెగినయనుకుంట…’’
‘‘అగో.. గా అండలు చూస్తె అర్థమైతలేదా?’’
‘‘పది రోజుల్నుంచి ఇంట్ల మందు విందులు మస్తు నడుస్తున్నయి…’’
‘‘వంటలు బాగున్నయి. ఎవ్వలకిచ్చిండో?’’
‘‘క్యాటరింగ్ వాళ్ళను పిలిచి సామాన్లు కొనిచ్చి వండినందుకు ఇంత ఇవ్వడమని కాంట్రాక్టు మాట్లాడుకున్నడట….’’
‘‘క్యాటరింగ్ వాళ్ళయితెనే బాగ వండుతరు…’’
మాంసాహార భోజనం పసందుగా తింటూ మాట్లాడకుంటున్నారు వాళ్ళు.
‘‘హోటల్వాళ్ళకు ప్లేట్‌కు ఇంతని ఇస్తే ఐపోయేది కద!’’
‘‘వాళ్ళు ప్లేట్‌కు ఏడెనిమిదివందలు తీసుకుంటరు. బిర్యానీల వేసేది ఒక్క ముక్క. ఇప్పుడు జూడు చికెన్ బిర్యాని, మటన్ బిర్యాని, మటన్, చికెన్, ఫిష్ కర్రీలు, బగారన్నం, తెల్లన్నం. అదే ఖర్చుతోని రెండు మడింతలు తినచ్చు’’ బిర్యానీ ముక్క కొరుకుతూ అన్నాడొకాయన.
‘‘ఎంతయినా చావు కూడ పెండ్లంత ఖర్చుతో కూడుకున్నదవుతుంది ఇవన్ని చూస్తుంటే’’
‘‘లక్ష్మారెడ్డి బాగానే సంపాయించిండు. కొడుకులు లక్షలల్ల సంపాయిస్తున్నరు. ఖర్చుపెడితె ఏం బోతంది?’’
‘‘కాదోయ్ నర్సిరెడ్డీ! నాకు అర్థం కాని దొక్కటుంది’’
‘‘నర్సింలూ! జగమెరిగిన బ్రాహ్మణసోంటని నువ్వు నీ కర్థం కాని దేముంటదో చెప్పు! గదేందో చెప్పలేవు’’ అన్నాడు నర్సిరెడ్డి.
‘‘నాతోనే చెప్పియ్యన్ననని కని నీకు తెలవదా నర్సిరెడ్డీ! ఓ దిక్కు ఇంట్ల మనిషి చనిపోయిన దుఃఖముంటది. మరో దిక్కు చనిపోయిన్నాటి నుంచి మాట్లాడించుటానికని వచ్చినోల్లు కల్లో, బ్రాందో తెచ్చి చనిపోయినోల్ల కొడుకులతో కలిసి తాగుడు. మనిషి చచ్చిపోయిండని ఏడ్సుడా? మందలిచ్చి వత్తామన్న పేరుమీద తాగుడా? గీ పనయితె నాకు మంచిగని పియ్యది. పది పన్నెండు రోజులు చనిపోయినింట్ల మద్యం. ఇప్పుడయితె బ్రాంది, విస్కీలు, బీర్లు, వరదలై పారుతయి? గిదేం సంస్కృతి?’’ అన్నాడు నర్సింలు.
ఆ మాటలతో తినడమాపారా నలుగురైదుగురు. నర్సింలు మాటల్లోని నగ్నసత్యాల గురించాలోచిస్తున్నరు. ఇది ఈ రోజు కాదు. తరతరాలుగా నడుస్తున్నదని వాళ్ళందరికీ తెలుసు. ఎంత సంపన్న కుటుంబమైతే అంతెక్కువగా ఆ ఇంట్లో మద్యం వరదలై పారుతుంటుంది.
‘‘నర్సింలూ! నాగ్గూడ గిది ఆచారమో, మరేందో కాని మంచిగని పియ్యది. కాని ఓ దిక్కు ఆడోల్ల ఏడ్పులు, మనిషి పోయాడన్న బాధ మరో దిక్కు చూడటానికి వచ్చిన అతిథులతో కలిసి తాగుడు. నా కయితె ఇగో దినాల రోజు మాంసం ముక్కలు నోట్లె పెట్టుకోవన్నంటెనే మంచిగనిపించదు. ఒక్కొక్కడు ఎలా తింటున్నాడో సూడు. లోపల కూసుండి ఎట్ల తాగుతున్నరో సూడు?’’ అన్నాడు శంకర్రావు.
‘‘అనుకుంటనుకుంటనే అరకిల మాంసం తిన్నవు కదనోయ్ శంకర్రావు… ఇది మనకు ఆచారంగ వస్తుంది. ఇంట్లో ఆత్మీయులు పోయి దుఃఖంలో ఉన్న మనిషిని ఆ దుఃఖంను మరిచిపోయేట్టు చేయడానికి ఆతనితో కూసుండి తాగడం మామలే. మాట్లాడుకుంటూ తాగడం వల్ల ఆ సమస్యనుండి వ్యక్తి దృష్టి మరలుతుంది. ఇది వట్టిగ పెట్టిన ఆచారమేం కాదు. కాకపోతే రోజు రోజుకు ఇది మరింత పెరుగుతుంది.డబ్బు, ఉద్యోగాలు, చదువులు పెరిగిం తర్వాత ఇది మరీ ఎక్కువయింది. ఎంత బాగ తాగుతె, తాగిస్తె, ఎంత ఖర్చెక్కువ పెట్టి మాంసాహారం పెడితె అంత గొప్పన్నట్టు తయారైంది’’ అన్నాడు వీరారెడ్డి.
‘‘అగొజూడు ఎట్ల తింటున్నరో? చావుకొచ్చిన వాళ్ళు జోకులేసుకుంట పెళ్ళి విందు కంటెక్కువ చావు విందును ఎంజాయ్ చేస్తున్నారు. ఇపుడు చాలా పెళ్ళిళ్ళలో వెజటేరియన్ భోజనమే ఉంటే చాలా చావుల్లో మాత్రం మటన్, చికెన్, తాగుల్లు తప్పడం లేదు. అంటె పెళ్ళి కంటె చావే ఖర్చుతోని కూడుకున్నదయింది…’’
గుంపులుగా కూర్చొని, నిల్చొని రకరకాలుగా మాట్లాడుకుంటూ చావు విందును పసందుగా ఆరగిస్తున్నారు జనం. లక్ష్మారెడ్డికి కూతుర్లు లేనందువల్ల ఆడవాళ్ళ ఏడ్పులూ వినబడటం లేదు. పల్లెటూళ్ళలోలా గొంతెత్తి వల్లించుకుంటూ ఏడ్చే సాంప్రదాయం క్రమక్రమంగా దూరమవుతుంది. పల్లెల్లోనూ ఇందువరకటిలా భోరుమని తల, కడుపుపై కొట్టుకుంటూ ఏడ్వడం జరుగడం లేదు. పట్టణాల్లో, సంపన్న కుటుంబాల్లో నయితే చావు విందంటే ఓ విలాసవంతంగా తాగితినే పార్టీగా మారిపోయింది.
‘‘రాంరెడ్డి, ప్రకాశరెడ్డి తండ్రి కర్మను మస్తు చేస్తున్నరు….’’
‘‘వాళ్ళకేంది? ఇద్దరు షాఫ్ట్వేర్ ఇంజనీర్లు. తండ్రి సంపాయించి ఇచ్చింది గూడ మంచిగనే ఉంది. చచ్చిపోయినంక పార్టీ అయినా మంచిగ చెయ్యకుంటేం జేత్తున్నరు…?’’
‘‘తెలంగాణల గీ పార్టీలల్ల మందు, మాంసం విందులు అతి మామలే. ఎవ్వల శక్తి కొద్ది వాళ్ళు మందు తాగిస్తరు. తాగుతరు. విదేశీ మందు బాటిల్ల పెట్టెలు, మిలట్రీ కాంటీన్ల పెట్టెలు మస్తు తెప్పిచ్చిండ్రు రాంరెడ్డి, ప్రకాశరెడ్డి. హైదరాబాద్‌ల ఉంటున్నరు గద! అక్కడన్ని దొరికె..?’’
‘‘మరి గక్కడుండెటోల్లు గీ కరీంనగర్ల ఎందుకు కర్మ జేత్తన్నడు?’’
‘‘ఎందుకంటె కరీంనగర్ జిల్లాలనే ఆల్ల బంధువులందరున్నరు. ఇగొ గీపెద్ద ఇల్లున్నది. ఆస్తులున్నయి. లక్ష్మారెడ్డి స్నేహితులున్నరు. వీళ్ళందర్ని హైదరాబాద్ కచ్చి తాగితిని పొమ్మంటె పోతరా? ఏదో కొద్దిమంది గక్కడికి పోతరు గావచ్చు…’’
‘‘ఇద్దరు కొడుకులు కోట్ల విలువలు చేసే విల్లాలల్ల ఉంటున్నరు. నెలకు లక్షల్లో సంపాయిస్తున్నరు. తండ్రి కోసం గీ మాత్రం చేయడం పెద్దగొప్పేం కాదు…’’
చాలా సేపట్నుంచి వాళ్ళ మాటలు వింటున్నాడు కొంరయ్య ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టర్. లక్ష్మారెడ్డికి ప్రాణస్నేహితుడు. మిత్రుడి గురించిన ప్రతి విషయమ కొంరయ్యకు తెలుసు. ఊళ్ళో ఉన్నప్పట్నుంచే బాల్య స్నేహితుడైన కొంరయ్య ప్రస్తుతం కరీంనగర్‌లోనే ఉంటున్నాడు. తన స్నేహితుడి పెద్దకర్మ కార్యక్రమానికి రావాల్సి రావడం కొంరయ్యకు బాధాకరంగానే ఉంది. రుచికరమైన ఆ మాంసాహార భోజనం, బిర్యానీ ఎంత ప్రయత్నించినా నోట్లోకి పోవడం లేదు. వందలాది జనం అదో పెండ్లి విందు అన్నట్టుగా మాట్లాడుకుంటూ , జోకులేసుకుంటూ విందుభోజనం చేస్తున్నా కొంరయ్యకది నచ్చడం లేదు. గరం మసాలా దట్టించిన ఆ మాంసం ముక్కలు, చికెన్ ముక్కలు రుచించడం లేదు. మొదటిసారి కంచంలో వేసుకున్న అన్నాన్నే వేళ్ళతో గెలుకుతున్నాడు. ఆ అన్నమే కాదు. ఆ కార్యక్రమానికి వచ్చిన మిత్రులు, ఆహూతులు మాట్లాడుతున్న మాటలూ ఆయనకు నచ్చడం లేదు. అందుక్కారణం లక్ష్మారెడ్డి తనకు ప్రాణస్నేహితుడు కావడం మాత్రమే కాదు. ఆతని జీవితాన్ని దగ్గరగా చూడడం. చావుబువ్వను సుష్టుగా భోంచేస్తూ జనం అనుకుంటున్న మాటలను భరించలేకపోతున్నాడు కొంరయ్య. ఇక మౌనంగా ఉంటూ ఆ మాటలను వినదలుచుకోలేదు.
‘‘అవును లక్ష్మారెడ్డి కొడుకులు తండ్రి కర్మను ఘనంగా చేస్తున్నారు. ఎందుకంటే మీరంతా వారం పదిరోజుల్నుండి మందు మాంసం విందులతో ఎంజాయ్ చేస్తున్నారు కదా! చచ్చినాక కర్మ ఎంత ఘనంగా చేసినా ఒరిగేదేంటి? చచ్చిన వ్యక్తేమైన చూస్తాడా? వృద్ధాప్యంలో నిర్లక్ష్యానికి గురిచేసి చచ్చినాక లక్షలు, కోట్లు ఖర్చు చేసినా ఒరిగేదేంటి? నాకయితే ఈ కర్మలు, చావుతంతు బాగా తినడానికి తాగడానికే ననిపిస్తుంది. దయచేసి మీరు ఎన్నడూ మటన్ మొకం చూడనట్టు తినడం, కృతజ్ఞత కోసమన్నట్టు పొగడ్తలాపండి’’ మిత్రుడు జ్ఞాపకం వచ్చి కన్నీరు కారుస్తూ అన్నాడు కొంరయ్య.
ఆ మాటలతో కొంరయ్య చుట్టు ప్రక్కలున్న జనం మాటలాపారు. నోట్లో పెట్టుకోబోయిన మాంసపు ముక్కలనూ అలాగే చేతిలో పట్టుకొనున్నారు లక్ష్మారెడ్డికి సన్నిహిత మిత్రుడైన కొంరయ్య కళ్ళవెంట నీళ్ళు కారుతుండటం చూసి చలించిపోయారు. కొద్దిసేపక్కడ మౌనమే రాజ్యమేలింది.
‘‘ఏంటి కొంరయ్యా నువ్వనేది? లక్ష్మారెడ్డికి ఆయన కొడుకులు ఏం తక్కువ చేసారు? వృద్ధాప్యంలో తమతోనే ఉంచుకున్నారు కదా! హైదరాబాద్‌లో రాజభవనాల్లాంటి విల్లాలు కొన్నారు. నీ మాటలు వింటుంటే కొడుకులు తండ్రిని కడుపు మాడ్చారన్నట్లర్థమవుతుందరికీ. నీకు ఇలాంటి తద్దినఖర్చులు ఇష్టం లేనంతమాత్రాన రాంరెడ్డి, ప్రకాశ్‌రెడ్డిలను బదునాం చేయడం బాగా లేదు. నాకు తెలిసి వాళ్ళు తండ్రిని బాగానే చూసుకున్నారు…’’ అన్నాడు మల్లారెడ్డి.
‘‘మల్లారెడ్డీ! నీకు పైపై విషయాలు మాత్రమే తెలుసు. లక్ష్మారెడ్డి నాకు చాలా దగ్గరి మిత్రుడు కాబట్టి ఆయన అంతరంగం తెలుసు. వృద్ధాప్యంలో ఆయన అనుభవించిన వేదన తెలుసు. బతికున్నప్పుడు తల్లిదండ్రుల కడుపులు మాడ్చి చచ్చింతర్వాత జనం చూసేట్టు కర్మ కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసే మధ్యతరగతి ప్రబుద్ధులూ ఉన్నారు. లక్ష్మారెడ్డికి అలా జరిగిందని నేననడం లేదు. కాని ముసలివయస్సులో వాళ్ళకు కావాల్సింది కడుపునిండా తిండిమాత్రమే కాదు రెడ్డీ! ఒకింత ప్రేమ. ఆప్యాయత, తన రక్తం పంచుకు పుట్టిన వాళ్ళతో, వాళ్ళ పిల్లలతో గడుపాలన్న కోర్కె. ఇవేవీ లక్ష్మారెడ్డికి లభించలేదు. ముసలితనాన్ని ఖరీదైన వృద్ధాశ్రమంలో ఒంటరిగా గడిపాడు. బిక్కు బిక్కుమంటూ గడిపాడు. తన మనుమలు, మనుమరాడ్రంతోని పిల్లల్లో పిల్లవాడై బతకలేక పోతున్నాన అంగలారుస్తూ బతికాడు’’ కళ్ళనీళ్ళు తీసుకుంటూ అన్నాడు కొంరయ్య.
కడుపులోంచి తన్నుకొస్తున్న దుఃఖాన్ని బలవంతంగా అణుచుకుంటున్నాడు. అప్పటికే సుష్టుగానే భోంచేసారు కొంరయ్య చుట్టున్న వాళ్ళంతా. కొంరయ్య మాటలు విన్న తర్వాత, కన్నీరు చూసిం తర్వాత మరింత తినాలనున్నా తినడానికి మనసొప్పలేదు. ప్లేట్లలో మిగిలిన అన్నంలో పెరుగు వేయించుకున్నారు.
‘‘కొంరయ్యా! లక్ష్మారెడ్డిని హైదరాబాద్‌లో ఖరీదైన వృద్ధాశ్రమంలోనే లక్షల డొనేషన్ కట్టి నెలకు వేలల్లో ఖర్చు పెడుతూ ఉంచారు కదా! ఇంకేం చెయ్యమంటావు వాళ్ళను? ఇక్కడ ఒంటరిగా ఉండలేడని తండ్రిని హైదరాబాద్ తీసుకెళ్ళారు. లక్ష్మారెడ్డి కొడుకులు, కోడండ్లు ఉద్యోగులే కాబట్టి వృద్ధాశ్రమంలో ఉంచడంలో తప్పేముంది? ఇద్దరూ ఉద్యోగానికి వెళ్తూ తండ్రినెలా చూసుకోగలరు? నిజానికి ఈ కాలంలో వృద్ధాశ్రమంలోనే ఇంట్లో కంటె ముసలివాళ్ళను బాగా చూసుకుంటున్నారు. కోట్లున్న వాళ్ళు కూడా పట్టణాల్లో తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లోనే ఉంచుతున్నారు. అదేదో నేరమైనట్లు మాట్లాడవడ్తివి నువ్వు’’ అన్నాడు ఆనందరావు.
ఆ మాటలకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు కొంరయ్యకు. ‘‘మనం పెండ్లికొచ్చినట్లు చావు తిండి బాగానే తిన్నాం. కొంరయ్య మాటలు విన్న తర్వాత మనకు మరో ముక్క నోట్లెకు పోవడం కష్టమే. కొంరయ్యకు తెలిసినంతగా లక్ష్మారెడ్డి కుటుంబం గురించి వాళ్ళ చుట్టాలకు కూడా తెలియదు. పెరుగుతో కూడా తినడమయి పోయింది. మనమిప్పుడు చేతులు కడుక్కొని చివర్లో ఉన్న కుర్చీల్లో కూర్చొని మాట్లాడుకుందాం.’’
రాజేశం మాటలందరికీ నచ్చాయి.
షామియానా చివర్లో ఉన్న ఖాళీ కుర్చీల్లో కూచొని మాటల్లో పడ్డారు పదిమంది మిత్రులు. చావువిందు పార్టీ నడుస్తూనే ఉంది.
‘‘ఆనందరావుగారూ! మీకు వృద్ధాశ్రమాలు కొడుకులతో ఉండటం కంటె మేలైనవిగానే కనిపించవచ్చు. ఎందుకంటే మీకు ఏ సెంటిమెంట్లూ, విలువలూ లేవనను కాని డబ్బు ముందు అవన్నీ హాస్యాస్పద మాటలుగానే కనబడుతాయి. కాని లక్ష్మారెడ్డికి అలా కాదు. తనకు. యాభై ఏండ్లు దాటేవరకూ అంటే తన తల్లిదండ్రులు చనిపోయేవరకు ఇంటిపెద్ద కొడుకుగా తన కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబంగానే ఉంచాడు. తల్లిదండ్రులను అన్నదమ్ములు ముగ్గురూ తమ కొడుకుల్లా చూసుకున్నారు. తన పిల్లలకు ఉమ్మడి కుటుంబంలోని మాధుర్యాన్ని చవిచూపాడు కాని తన దగ్గరికొచ్చేసరికి అంతా తారుమారైంది’’ అన్నాడు కొంరయ్య.
కొంరయ్య మాటలకు ఆనందరావు బాధపడినా కొంరయ్య ఇంకా ఇరవయ శతాబ్దిలోనే ఉన్నట్టు భావించాడు. తగిన సమాధానం చెప్పడానికే నిర్ణయించుకున్నాడు.
‘‘కొంరయ్యా! నువ్వింకా నీ బాల్యం, యవ్వనం నాటి కాలంలోనే ఉన్నావు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను గమనించడం లేదు. మానవ సంబంధాలు మనీ సంబంధాలుగా మారడాన్నీ గుర్తించడం లేదు. మనమిపుడు ప్రపంచీకరణాన్ని దాటి ఎలక్ట్రానిక్ యుగంలో బతుకుతున్నాం. ముఖ్యంగా ఈనాటి యువతరాన్ని నీలాగే బతుకమని శాసించడం సరైందేమో ఆలోచించు’’ అన్నాడు.
ఆ మాటలకు చిన్నగా, నవ్వాడు కొంరయ్య.
‘‘మీ ప్రపంచీకరణం, ఎలక్ట్రానిక్ యుగం ముసలివాళ్లను ఇంట్లోంచి తరిమెయ్యమని చెప్పిందా? వృద్ధాశ్రమాలకు అంకితం చేయమని చెప్పిందా? పిల్లలకు ముసలివాసన రాకుండా చేయమని చెప్పిందా? పసివాళ్ళను అమ్మమ్మలు, నాన్నమ్మలు తాతయ్యలకు దూరంగా ఉండాలని చెప్పిందా? చెప్పుండ్రి ఆనందరావుగారూ! లక్ష్మారెడ్డి గత నాలుగు సంవత్సరాలుగా వృద్ధాశ్రమంలోఎంత ఏకాంతత అనుభవించాడో, తన వాళ్ళ కోసం ఎంత తపించాడో నాకు తెలుసు. ఎందుకంటే నేను హైదరాబాద్ వెళ్ళిన ప్రతిసారీ నా మిత్రుడు లక్ష్మారెడ్డి దగ్గరికి వెళ్ళి కొద్దిగంటలు గడిపివచ్చేవాన్ని’’ అన్నాడు కొంరయ్య.
ఆ మాటలు అక్కడున్న చాలామందికి గాయాలుగా బాధించినా కొద్దిమంది మాత్రం లక్ష్మారెడ్డి అంత వేదన ననుభవించాడా అని అనుకోకుండా ఉండలేకపోయారు.
‘‘అయితే కొంరయ్యా! లక్ష్మారెడ్డికి వృద్ధాశ్రమానికి పోవడం ఇష్టం లేదా? ఆ విషయం తెలిసినవాడివి నువొక్కడివే… చెప్పగలవా? అసలేం జరిగింది?’’ అన్నాడు మల్లారెడ్డి .
తనకు తెలిసిన విషయాన్ని ఈ సమయంలోనైనా చెప్పకుండా దాచుకోవడం సరైంది కాదనిపించింది కొంరయ్యకు. ఈ విషయం చెప్పడం వల్ల రాంరెడ్డి ప్రకాశ్‌రెడ్డికి జరిగేనష్టమేం లేదు. కాని కొందరైనా ఆ వయసువారు తల్లిదండ్రుల విషయంలో మారే అవకాశముందని భావించి చెప్పడానికే నిర్ణయించుకున్నాడు.
లి లి లి లి
లక్ష్మారెడ్డి కొడుకులిద్దరూ హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. లక్ష్మారెడ్డి భార్యతో కలిసి కరీంనగర్ ఇంట్లోనే ఉంటున్నాడు. భార్య చనిపోయిం తర్వాత లక్ష్మారెడ్డి ఎక్కడుండాలన్న చర్చ వచ్చింది. కరీంనగర్ ఇంట్లో ఒంటరిగా ఉండటం లక్ష్మారెడ్డికి ఇష్టం లేదు. మనుమలు, మనుమరాల్లు, కొడుకులు, కోడళ్ళతో సమహంలో ఉండటమే అతనికిష్టం. అదే మాట కొడుకులతో అన్నాడు. కొడుకులకూ తండ్రిని తమతోనే ఉంచుకోవాలనుంది.
‘‘రాంరెడ్డీ! ప్రకాశ్! మీనాన్న మా కాలపు మనిషి, సమహంలో జీవించడం ఆతనికిష్టం. స్నేహితులు, బంధువులు, కుటుంబసభ్యుల మధ్య జీవించడానికి ఇష్టపడతాడు. అమ్మ ఉన్నంతవరకు మీ నాన్న కోర్కె నెరవేరింది. ఇప్పుడు ఒంటరి అయ్యాడు. మీతో ఉంచుకుంటేనే మంచిది. ఇక్కడ ఎంత మంది స్నేహితులున్నా తన వాళ్ళతో ఉండడం మీ నాన్న కిష్టం’’అన్నాడు కొంరయ్య.
‘‘అలాగే చేస్తాం అంకుల్. నాన్నను మాతో హైదరాబాద్ తీసుకెల్తాం. మా ఇద్దరి విల్లాలు ఒకే దగ్గర. తన ఇష్టమున్నచోట ఇష్టమున్నన్ని రోజులుంటాడు’’ అన్నాడు రాంరెడ్డి.
‘‘అవును ఈ వయసులో మానాన్న మాతో ఉండటమే సరైంది. ఇక్కడ ఒంటరిగాఎలా ఉంటాడు?’’ అన్నాడు ప్రకాశ్‌రెడ్డి.
ఆ మాటలు లక్ష్మారెడ్డి కోడళ్ళకు నచ్చలేదు. వ్యవసాయం చేస్తూ పల్లెటూళ్ళో బతికిన తనమామ కరీంనగర్లో ఉండడమే ఎక్కువంటే హైదరాబాద్ కొచ్చి తమతో ఉండాలనటం అసలే నచ్చలేదు.
‘‘అంకుల్. మగవాళ్ళకేం తెలుసు మా ఇబ్బందులు. మేమ ఆఫీసుకెళ్ళాలి. అందులో సాఫ్ట్వేర్ ఉద్యోగం. మేమందరం ఆఫీసుకెళితే మామగారు ఇంట్లో ఒక్కరెలా ఉంటారు? అక్కడ మాట్లాడే వాళ్ళు కూడా తక్కువే. ఇక్కడయితే మామగారి స్నేహితులు, చుట్టాలెంతో మందున్నారు. లేదా ఊళ్ళోని పాత ఇల్లును బాగు చేసుకొని అక్కడున్నా మంచిగా టైమ్‌పాస్ అవుతుంది’’ తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది పెద్దకోడలు రజని.
‘‘అంకుల్! అక్క చెప్పింది నిజం. మీరు మామగారికి దగ్గరి స్నేహితులు. ఆయన స్వభావం మీకు తెలుసు. హైదరాబాద్‌లో ఆయన ఉండలేరు. ఊళ్ళో, కరీంనగర్లో అలవాటయిన మామగారు మాతో ఉండలేరు. పోతే నున్నని పాలరాతితో చేసిన గచ్చునుంచి జారిపడినా అదో పెద్ద ప్రమాదం’’ అంది చిన్న కోడలు శ్రీలక్ష్మి.
‘‘నిజమే అంకుల్! మేమివన్నీ ఆలోచించలేదు. విల్లాల్లో ఉంటున్నామన్నట్టే కాని అవి ఈ ఇల్లంత కూడా ఉండవు. ఎవరి రూంలు వారికే. నాన్నకు ప్రత్యేకగది కేటాయించలేం..’’
‘‘అందరం బిజీ కదా అంకుల్. రోజుకు రానుపోనులతో కలిపి పదకొండు గంటలు డ్యూటీకే. కార్లలోనే వచ్చి పోవడమైనా ప్రయాణాలతోనే అలసిపోతాం. నాన్నను ఇక్కడే ఉంచి కేర్‌టేకర్‌గా ఓ మనిషిని పెడుదాం…’’
కొడుకులు, కోడళ్ళ మాటలు విన్న తర్వాత కొంరయ్యకు ఇలాంటి కొడుకుల కోసమా తాను రెక్కలు ముక్కలు చేసుకొని డబ్బు సంపాదించింది. కొడుకులను విదేశాలకు పంపి ఎం.ఎస్. చేయించింది? అని అనుకోకుండా ఉండలేక పోతున్నాడు. వాళ్ళపై అసహ్యం వేస్తుంది.
‘‘హైదరాబాద్‌లో లంకంత కొంపలున్న మీకు మీనాన్నకో గది కేటాయించే వసతి కూడా లేదంటున్నారు. మీ నాన్న కూడా మీలాగే అనుకొనుంటే మీరు బురదలో జంబు కొడుతూ ఉండేవారు. మీ పిల్లల విషయంలో కూడా మీరు ఇలాగే ఆలోచిస్తారా? మీ పిల్లలు కూడా మీలాగే ఆలోచిస్తే వృద్ధాప్యంలో మీ గతేంటి? మీ చదువు, ఉద్యోగం, బతుకు మీ నాన్న పెట్టిన భిక్షేనని మరిచిపోకుండ్రి. తాము కరిగిపోతూ మిమ్ములనీ స్థితికి తెచ్చారు.
ఇప్పుడు మీకు వాళ్ళు కాని వారయ్యారు. మీ ఇంట్లో ఉండటానికి అర్హతలేని వారయ్యారు? పదిమందిలో పంచాయితీ పెట్టించి మీ ఇజ్జత్ తీయాల్సింది. కాని నన్నొక్కన్నే రమ్మన్నారు.’’ అసహ్యంతో ముఖం చిట్లించాడు కొంరయ్య.
వాళ్ళ ముఖాలు నల్లబడ్డాయి.
‘‘అంకుల్! మీరు మమ్మల్ని కాలమాన పరిస్థితులను చూడకుండా దోషులను చేస్తున్నారు. వేగవంతమైన ఈ కాలంలో ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తమ తల్లిదండ్రులను తమతో ఉంచుకుంటున్నారు? బిజీ షెడ్యూల్లో అదెలా సాధ్యమవుతుంది? ఎంత ఖర్చయినా సరే మేం నాన్నను హైదరాబాద్‌లోని విలువైన వృద్ధాశ్రమంలో ఉంచుతాం. మేమ హైదరాబాద్‌లోనే ఉంటాం కాబట్టి ఫోన్ వస్తే చాలు వెంటనే చూసి రావచ్చు. ఈ కాలంలో ఇంట్లో కంటె అక్కడే వృద్ధులకు ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది…’’
‘‘పైసలతో అన్నీ కొనొచ్చు అనే భ్రమల్లో ఉన్నారు మీరు. మీ నాన్నకు కుటుంబంతో ఉన్న పేగుబంధాన్ని ఎన్ని లక్షలిచ్చి కొంటారు? తన కొడుకుతో, మనుమలు మనుమరాల్లతో కలిసి భోంచేయాలనుంటుంది మీనాన్నకు. మనుమలు, మనుమరాల్లతో పిల్లల్లో పిల్లవాడై ఎగరాలనుంటుంది. చేతగాకున్నా భుజాలపై ఎత్తుకొని తిప్పాలనుంటుంది. ముద్దుముద్దుగా కథలు చెప్పాలనుంటుంది. మీ నాన్నతరం, మాతరం తాతలు, తండ్రులు చెప్పే నోటికథలు వింటూ పెరిగాం. ఇవన్నీ వృద్ధాశ్రమంలో కానీ ఎక్కడైనా దొరుకుతాయా? ఒక్క ఇంట్లో తప్ప చెప్పురాం రెడ్డీ! ప్రకాశ్!’’ అన్నాడు కన్నీళ్ళు తీసుకుంటూ కొంరయ్య.
ఆ మాటలకు రాంరెడ్డి ప్రకాశ్ హృదయాలు చలించిన మాట నిజమే. కాని తాము చేస్తున్నది తప్పని వాళ్ళ కర్థం కావడం లేదు. ఎందుకంటే వాళ్ళ స్నేహితుల్లో చాలామంది తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లోనే ఉంచుతున్నారు.
‘‘అంకుల్! మీరన్న ఈ మాటలు మీ స్వంత కవిత్వమా? మానాన్న మాటలా?’’ అన్నాడు ప్రకాశ్‌రెడ్డి కొంరయ్యను చూస్తూ.
ఆ మాటలకు ప్రకాశ్‌పై విపరీతమైన ఆగ్రహమొచ్చినా తనను తాను నిగ్రహించుకున్నాడు కొంరయ్య.
‘‘ప్రకాశ్! నేను కవినయ్యుంటే మీ ప్రవర్తనపై నేనో కవితరాసి దాన్ని చదివిన వాళ్ళు మెచ్చుకుంటుంటే విని ఉప్పొంగిపోయి గొప్పపని చేసానని చేతులు దులుపుకొనుండేవాడిని. కాని నేను కవిని కాదు. మామలు ప్రాక్టికల్ మనిషిని. మీ నాన్న హృదయాన్నెరిగిన బాల్య స్నేహితున్ని. మీ నాన్న ఎన్నోసార్లు నాతో ఆ మాటలన్నాడు. కాని మీకు ఆ సెంటిమెంట్లేమీ లేవు కదా! మీ పిల్లలను ఎత్తుకొని ముద్దాడితే ముసలివాసనొస్తుందంటారు. దగ్గర పడుకోబెట్టుకుంటే ముసలివాళ్ళ రోగాలు తగులుతాయంటారు. పాతిక ముప్పయేండ్లు సాది పెంచి పెద్ద చేసి, ఉన్న ఆస్తినిచ్చి, ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను చివరిదశలో నాలుగైదేండ్లు దగ్గరుంచుకొని మీ పిల్లల్లో పిల్లల్లా చూసుకోవడం చేతగాని మీ బతుకులేం బతుకుల్రా… ఛీ’’ అన్నాడు కొంరయ్య కోపంగా.
ఆ మాటలతో నలుగురి ముఖాలూ నల్లబడ్డాయి.
‘‘కొరయ్య తాతా! మాకు మా తాతంటే ఇష్టం. తాత మాతోని ఉండుడంటే ఇష్టం. తాత చెప్పే పల్లెటూరి కథలంటే ఇష్టం. మేం తాతతోని మంచిగ ఆడుకుంటం. మాకు పెద్ద పెద్ద ఇండ్లున్నయి. తాతను మా ఇంట్లనే ఉంచుకుంటం. మమ్మీ! డాడీ ప్లీజ్ తాతను హైదరాబాద్‌ల మనింట్ల ఉండనీయిండ్రి’’ అన్నాడు రాంరెడ్డి కొడుకు పన్నెండేళ్ళ అనిల్‌కుమార్ రెడ్డి.
‘‘మాకూ తాతంటే ఇష్టమే’’ అన్నారు మిగతా ముగ్గురు పిల్లలు. ఆ నలుగురిప్పుడు సందిగ్ధంలో పడ్డారు.
రజని త్వరలోనే ఈ లోకంలో కొచ్చింది.
‘‘నేం చెప్పలేదా? ఈ ముసలాయన ఇంట్లో ఉంటే పిల్లలు చెడిపోతారు. ఇంగ్లీషు మీడియం చదివే పిల్లలకు కథలు! కాకరకాయలని చెప్పి చదువును నాశినం చేస్తడు. తీవ్ర కాంపిటీషనున్న ఈ కాలంలో గా తెలుగు కథలు, కాకమ్మ కబుర్లు ఎవ్వలకు కావాలె. ఈనె తన రోగాలను కూడా పిల్లలకు అంటబెడుతడు. వృద్ధాశ్రమంలో వేయడమే మంచిది. మా ఇంట్లో ఉంచుకోవడాని కొప్పుకోం…’’ అంది. శ్రీలక్ష్మి యారాలును సమర్ధించింది.
అక్కడ వాతావరణం మరింత గంభీరమైంది.
కుర్చీలో కూర్చొనున్న లక్ష్మారెడ్డి లేచి నిల్చున్నాడు. ఆతని కళ్ళవెంట పటపటా నీళ్ళుకారుతున్నాయి. ‘‘రాంరెడ్డీ, ప్రకాశ్ పోస్టాఫీసులో నా పేరుమీద ఐదులక్షల డిపాజిట్లున్నాయి. అవి తీసి డొనేషన్‌గా సి.ఆర్. ఫౌండేషన్ హైద్రాబాద్ వృద్ధాశ్రమంలో కట్టుండ్రి. ఈ ఇంటిపై వచ్చే కిరాయలను నా నెలభత్యం, ఇతర ఖర్చులకు వాడుకుంటాను. మీరు నా కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అక్కర్లేదు. రేపే మనం హైదరాబాద్ పోదాం..’’ అని కళ్ళు తుడుచుకుంటూ ఇంట్లోకెళ్ళాడు.
‘‘ప్రకాశ్, రాంరెడ్డీ! మీ నాన్నను దూరం చేసుకుంటూ మీరు కోల్పోతున్న విలువ వెలకట్టలేనిది. మీనాన్న చెప్పినట్టు చేయిండ్రి’’ అని అక్కన్నుంచి వెళ్ళిపోయాడు కొంరయ్య.
లి లి లి లి
ఇదీ నాలుగేండ్ల కింద జరిగిన లక్ష్మారెడ్డి వృద్ధాశ్రమ కథ అని చెప్పడం ముగించాడు కొంరయ్య. దూరదూరంగా తిరుగుతూ కొంరయ్యవాళ్ళ మాటలు విన్న ప్రకాశ్‌రెడ్డి, రాంరెడ్డి వెక్కెక్కి పడి ఏడుస్తూ వాళ్ళ దగ్గరికొచ్చారు. దుఃఖభారం దిగేవరకూ ఏడ్చారు.
‘‘కొంరయ్య బాపూ! మాలాంటి పుత్రరత్నాలు ఏ తల్లిదండ్రులకూ పుట్టకూడదు. మా కళ్ళకున్న. ‘రూపాయి’ మాయ పొరలు తొలగిపోయాయి. ఇది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడమే కాని మా నాన్న ఉన్న వృద్ద్ధాశ్రమానికి నేను మాతమ్ముడు చెరో పాతికలక్షలు విరాళంగా ఇస్తున్నాం. ఇది మా పాపానికి ప్రక్షాళన కాదు. మమ్మల్నెవరూ క్షమించాల్సిన అవసరం లేదు. మా కథను నేటితరం గుణపాఠంగా తీసుకుంటే చాలు….’’ అన్నాడు రాంరెడ్డి. ప్రకాశ్‌రెడ్డి కళ్ళవెంటా పటపటా నీళ్ళు కారుతున్నాయి. కొంరయ్య చెప్పిన యదార్థగాథ విన్న అక్కడున్నవాళ్ళకు ఆ చావుతిండి రుచించడం లేదు.
డాక్టర్ అమృతలత మయూఖ అంతర్జాల పత్రిక సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో ప్రథమబహుమతి పొందిన కథ (రూ.10,000)
ఆ ఇంట్లో ప్రతి ఉదయం అందరితోపాటు కొన్ని అలవాట్లు కూడా మేల్కొంటాయి. రమణారావు లేవగానే తలుపు తీయడు. కిటికీ తెర జరిపి బయటి మామిడి చెట్టును చూస్తాడు. అక్కడే తులసి మొక్కకు పూజ చేస్తున్న భార్య శారదను చూస్తాడు. చీకటిని పూర్తిగా వదిలిపెట్టని, వెలుగును ఇంకా పొదివిపట్టని వాతావరణాన్ని చూస్తాడు.
కిటికీలోంచే శారదతో – ‘‘అనుభవించడం ముఖ్యమా అర్దం చేసుకోవడం ముఖ్యమా’’ అన్నాడు ఆ రోజు.
‘‘అసందర్బంగా మాట్లాడడంలో బహుశా మీకెవరూ పోటీ రారేమో’’ అంది శారద సమాధానంగా.
‘‘నీ ఎటకారాలు సరే గానీ …చెప్పు ‘‘ అన్నాడు రమణారావు మళ్లీ.
‘‘అనుభూతికి పేరెందుకు ‘‘ అనుకుంటూ వంటగది వైపు వెళ్లింది శారద.
రమణారావు శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడ్య్య్యు
వంటగదిలోంచి గాలితో కలిసిన వేడిపాల వాసన ఇంటినిండా పరుచుకుంది. కాఫీ డికాక్షన్ మెల్లగా ఉడుకుతోంది. తులసి కోట దగ్గర పూజ చేసొచ్చిన శారద, డైనింగ్ టేబుల్ వైపు చూసి నవ్వుకుంది. రమణారావు అప్పటికే అయిదు కప్పులు వరసగా పెట్టాడు. ఇంట్లో వాళ్లు నలుగురే. అయిదవ కప్పు మాత్రం ప్రతిరోజూ తప్పదు.
‘‘ ఆ అలవాటు పోదా?’’ అంది శారద.
‘‘ఏ అలవాటు?’’
‘‘అయిదో కప్పు.’’
రమణారావు కప్పుల వరుస సరిచేస్తూ – ‘‘ఇంట్లో ఒక కప్పు ఖాళీగా ఉండాలి.’’
‘‘ఎందుకు?’’
‘‘ఎవరో రావచ్చు.’’
‘‘మన పిల్లలిద్దరూ పెద్దవాళ్లు. ఎవరూ ఇలా చెప్పకుండా రారు.’’
‘‘పిల్లల కోసం కాదు.’’ అతను నవ్వి – ‘‘ఇంటి కోసం.’’ అన్నాడు. శారద చేతిలో ఉన్న చెంచాతో అతని భుజం మీద మెల్లగా కొట్టింది నవ్వుతూ. ఆ నవ్వు కొత్తది కాదు. ముప్పై ఏళ్లుగా అదే నవ్వు. ఆమె నాలుగు కప్పుల్లో కాఫీ పోసింది. ఐదవ కప్పు ఖాళ్య్య్యీ
రమణారావు పేపర్ విప్పాడు. కానీ చదవడం లేదు. ఇంట్లోంచి వచ్చే శబ్దాలను వింటున్నాడు. మెట్ల మీద కొడుకు అనిరుధ్ అడుగుల చప్పుడు. వంటగదిలో గిన్నెల చప్పుడు. బాత్రూమ్ తలుపువ•సిన శబ్దం. ఓ వ•లనుంచి వినిపించే బీప్ బీప్ శబ్దం. ఇవి వినిపించని రోజు ఇల్లు అస్వస్థతకు గురైనట్టుగా అనిపించేది.
కోడలు మీరా టిఫిన్ డబ్బాలు సర్దుతూ – ‘‘మామయ్య గారూ… ఈ ఆదివారం ఒక రెసిడెన్షియల్ కాప్స్యూల్ చూడడానికి వెళ్దామనుకుంటున్నాం.’’ అంది.
రమణారావు ఎందుకు అన్నట్టుగా చూశాడు.
‘‘ఈ ఇల్లు చాలా పెద్దది. పాతది కూడా. చాలా ఖర్చవుతోంది.’’
రమణారావు నెమ్మదిగా లేచి వరండాలోకి వెళ్లి గోడ మీద చేతిని ఆనించి మీరాను అడిగాడు – ‘‘ఒక ఇంటి వయసు ఎంత?.’’
ఆమె నవ్వుతూ అడిగింది ‘‘మనుషుల్లా ఇళ్లకూ వయసు ఉంటుందా?’’
‘‘ఉంటుంది కదా .’’
‘‘ఎంత?’’
‘‘అందులో నవ్వులు వినిపించినన్ని సంవత్సరాలంత.’’
ఆమె మౌనంగా ఉండిపోయింది. మామగారు ఇలా మాట్లాడడం అందరికీ అలవాటే. అతను గోడ మీద ఒక పెన్సిల్ గీత చూపించాడు.
‘‘దీన్ని చూశావా?. అనిరుధ్ మొదటిసారి స్కూల్‌కి వెళ్లిన ఏడాది.’’ ‘‘ మరో గీత చూపిస్తూ ‘‘ఇది నందిని పదో తరగతి పాసైన రోజు.’’ – ‘‘ఇది…’’ అతను కాసేపు ఆగాడు. – ‘‘.నీ పెళ్లి తర్వాత మొదటిసారి ఈ ఇంట్లో దీపావళి జరుపుకున్న సంవత్సరం.’’
‘‘అనిరుధ్… ఈ గోడను చూడు. ఏం కనిపిస్తోంది?’’ అక్కడే ఉన్న అనిరుధ్ ను అడిగాడు రమణారావు.
‘‘రంగు వెలిసిపోయింది, కొన్ని గీతలు కనిపిస్తున్నాయి.’’
‘‘నాకు మాత్రం మీ బాల్యం కనిపిస్తోంది. ఒక్కో గీత ఒక్కో సందర్బం, ఇది నువ్వు సైకిల్ తొక్కి పడిపోయిన రోజు, ఇది నందిని మొదటిసారి ఉద్యోగానికి వెళ్లిన ఉదయం , ‘‘ ఇది.’’ అతని గొంతు కాస్త బరువెక్కింది. ‘‘…అమ్మ మొదటిసారి ఆసుపత్రి నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన రోజు.’’….ఎవరూ మాట్లాడలేదు.
‘‘ఇవన్నీ మీకు ఎలా గుర్తున్నాయి?’’
‘‘నాకు కాదు. ఈ గోడలకు గుర్తున్నాయి.’’ అన్నాడు రమణారావు.
‘‘గోడలు మైసీలియంతో తయారవుతాయి. కానీ ఇంటిని మాత్రం సందర్బాలతో అల్లుకుంటాం. ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నంతకాలం ఇల్లొక గడియారం. వాళ్లు వెళ్లిపోయాక గడియారం ఉంటుంది. సమయం ఉండదు.’’ మళ్లీ అన్నాడు రమణారావు.
‘‘ఇంకా బతికే ఉన్నాం. అప్పుడే మన గురించి గతకాలంలో మాట్లాడుతున్నారేంటి మామయ్యా?’’
‘‘వయసొచ్చాక ప్రతి మనిషీ తనను తాను గతంలోనే చూసుకుంటాడమ్మ్య్య్యా
మధ్యాహ్నానికి కూతురు నందిని వచ్చింది. గుమ్మంలోకి అడుగుపెడుతూ ‘‘అమ్మా!’’ అని పిలిచింది.
వంటగదిలోనుంచి శారద చేతులు కొంగుకు తుడుచుకుంటూ వస్తూనే ‘‘తిన్నావా?’’ అని అడిగింది.
‘‘లోపలికి రాగానే అదే ప్రశ్న.’’
‘‘అది అమ్మల రాజ్యాంగం.’’
నందిని నవ్వి ఆమెను కౌగిలించుకుంది. అల్లుడు విక్రమ్ వెనకే వచ్చాడు. రమణా రావు లేచి అతనితో చేయి కలిపాడ్య్య్యు
కొద్ది సేపటి తరవాత డైనింగ్ టేబుల్ మీద నందిని ‘‘నాన్నా…నీకు ఈ ఇంట్లో ఏది ఎక్కువ ఇష్టం?’’ అని అడిగింది.
ఈ ప్రశ్న దేనికి ఉపోద్ఘాతమో రమణారావుకు తెలుసు. రమణారావు సమాధానం చెప్పలేదు. చెట్టు వైపు చూశాడు. ఊయల వైపు చూశాడు. తలుపు గడియ వైపు చూశాడు.
చివరకు.. ‘‘ఎదురు చూడటం.’’ అన్నాడు.
‘‘ఎదురు చూడడం అంటే ?’’
‘‘ఎవరైనా వచ్చే వరకు మనలో ఉండే ఖాళీ. ఏ ఇంట్లోనైనా ప్రతి వస్తువు ఎవరో ఒకరి కోసం ఎదురు చూస్తుంది తలుపు? ఎవరైనా తట్టాలని. కుర్చీ? ఎవరైనా కూర్చోవాలనీ డైనింగ్ టేబుల్? అందరూ ఒకేసారి భోజనం చేయాలనీ.’’
‘‘మరి… అయిదవ కప్పు?’’ అంది నందిని చిలిపిగా.
‘‘ అదే కదా ఎదురు చూపు ‘‘ అన్నాడు రమణా రావు చిరునవ్వుతో.
‘‘మంచి కుటుంబాల్లో దేనికీ కొరత ఉండదు…మౌనం కూడా మాటలు నేర్చుకుంటుంది.’’ అన్నాడు రమణా రావు.
వరండాలో గాలి పల్చగా వీచింది. డైనింగ్ టేబుల్ మీద అయిదవ కప్పు ఇప్పటికీ ఖాళీగానే ఉంది. అది ఖాళీగా ఉందని ఇంట్లో ఎవరూ ఆశ్చర్యపడలేదు. అది కూడా ఈ ఇంటి అలవాట్లలో ఒకటైపోయింద్య్య్యి
మధ్యాహ్నం భోజనం ముగిసాక ఏ మధ్యతరగతి ఇంట్లో అయినా సహజంగా అలుముకునే సోమరితనం అక్కడా పరుచుకుంది. అందరూ ఒక్క దగ్గర చేరారు. నందిని హాల్లో కిటికీలు తెరవడంతో బయట నుంచి గాలి తోసుకొచ్చింది. గోడకు వేలాడుతున్న పాత క్యాలెండర్ కొద్దిగా కదిలింది. దాన్నే చూస్తూ రమణా రావు అన్నాడు-
‘‘ఈ ఇంట్లో గాలి కూడా దారి తప్పదు..ముప్పై ఏళ్లుగా ఇదే కిటికీ..ఇదే దారి. అలవాటైపోయింది.’’
విక్రమ్ నవ్వాడు – ‘‘ గాలికి కూడా అలవాట్లు ఉంటాయా?’’
‘‘మనకున్నవన్నీ ప్రకృతి దగ్గర నుంచే వచ్చాయి బాబూ.’’.
ఇదే అవకాశం అని విక్రమ్ మళ్లీ మొదలుపెట్టాడు. ‘‘మామయ్య గారూ …ఈ ఇల్లు అమ్మేద్దాం.’’
శారద చేతి కదలిక ఒక్క క్షణం ఆగింది. మీరా తలదించుకుంది. నందిని ఏమీ మాట్లాడలేదు. ఈ సంభాషణ ఎప్పుడో ఒకరోజు తప్పదని అందరికీ తెలుసు.
‘‘ఎందుకు?’’ రమణా రావు ప్రశాంతంగా అడిగాడు.
‘‘ఈ ఇంటికి. రిపేర్లు, టాక్సేషన్ అన్నీ పెరుగుతున్నాయి. కొత్త కవ్యనిటీ స్పేస్ లో లిఫ్ట్ ఉంటుంది, కన్వేయర్ బెల్ట్ రోడ్లున్నాయి. వర్చువల్ షాపింగ్ చేసుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీ ఉంటుంది. మొబైల్ మెడికల్ •••నిట్ చూపుడువేలుకు అందుబాటులో ఉంటుంది.’’
రమణారావు కొద్దిసేపు మౌనం తర్వాత అడిగాడు. ‘‘అక్కడ లేనిది ఈ ఇంట్లో ఏమీ లేదంటావా ?’’
విక్రమ్ వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు . ‘‘ అక్కడంతా సౌకర్యం.’’ మీరా మెల్లగా గొణిగినట్టు అంది.
‘‘సౌకర్యం…’’ రమణా రావు ఆ పదాన్ని నెమ్మదిగా మళ్లీ పలికాడు. ‘‘మనుషులు సౌకర్యం కోసం ఇళ్లు మారతారు. కానీ… ఇళ్లు మాత్రం మనుషుల కోసం ఎప్పుడూ మారవు. గోడలు వాన నుంచి కాపాడతాయి. కప్పు ఎండ నుంచి కాపాడుతుంది. కానీ… ఇల్లు ఇంకో పని కూడా చేస్తుంది. ‘‘ అని ఒక నిముషం ఆగాడు. ‘‘మనం ఒక కుటుంబమని ప్రతిక్షణం గుర్తు చేస్తుంది.’’
‘‘ పెళ్లయిన కొత్తలో అసలు మాట్లాడక పోయేవారు, ఇదిగో ఇప్పుడేమో ఇలా మాట్లాడతారు, ఈయనను ఎవరైనా బ్రెయిన్ హ్యాకర్స్‌కు రహస్యంగా అప్పగించాలి ‘‘ అంది శారద వాతావరణాన్ని తేలికచేయాలని.
అయినా రమణారావు వదిలిపెట్ట లేదు. బ్రెయిన్ హ్యాకర్స్కా, హార్ట్ హ్యాకర్స్కా ‘‘ అన్నాడు నవుతూ.
అందరూ హాల్ లోంచి వెళ్లి పోయాక ‘‘అనిరుధ్.. సెంట్రల్ సిస్టమ్ బాటరీ రీ చార్జ్ చెయ్’’ అన్నాడు రమణారావు మెల్లిగ్య్య్యా
ఆ రాత్రి రమణారావు ఒక్కడే హాల్లోకి వచ్చాడు. టేబుల్ మీద ఇంకా అయిదవ కప్పు అలాగే ఉంది. అది చేతిలోకి తీసుకున్నాడు.
పక్కనే పాత ఫోటో ఆల్బమ్ ఉంది. ఆల్బమ్ తెరిచి ఓ ఖాళీ పేజీ దగ్గర ఆగిపోయాడు.
‘‘నువ్వెవరు?’’ గుసగుసగా అడిగాడు. సమాధానం రాలేదు. బయట గాలి వీచింది. ఒక ఎండిన మామిడి ఆకు కిటికీలోంచి లోపలికి వచ్చి ఆల్బమ్ మీద పడింది. రమణారావు ఆ ఆకును తీసి ఆల్బమ్‌లో ఆ ఖాళీ పేజీ మధ్య పెట్టాడు.
‘‘ఫోటో లేకపోతే గుర్తుగా ఇది ఉండనీ.’’ అని ఆల్బమ్ వ•సేశాడు.
ఆ ఆకుకు తెలియదు. ఆ రాత్రి నుంచి తను ఒక కుటుంబం దాచుకున్న చివరి జ్ఞాపకంగా మారబోతోందని.
ఆ గది వ•లన ఉన్న ఎర్ర దీపం బ్లింక్ అవడం గమనించిన రమణారావు అక్కడికి వెళ్లి ఓ స్విచ్ ఆన్ చేసాడు. ఎరుపు కాస్తా ఆకుపచ్చగా మారింద్య్య్యి
మరుసటి రోజు ఉదయం అందరూ బ్రేక్‌ఫాస్ట్ కు కూర్చున్నారు. రమణారావు బీరువాలోంచి కవర్ బయటకు తీసాడు. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. లోపల ఒక కాగితం. అందులో ఒకే ఒక వాక్యం. మెమరీ స్థిరత్వం : 18%.
శారదకేం అర్థం కాలేదు. ‘‘ఇదేంటి?’’ అడిగింది.
రమణారావు చాలాసేపు మౌనం తరవాత ‘‘నా తాజా డిజిటల్ చార్ట్ ‘‘ అన్నాడు
తర్వాత ఆమె కళ్లలోకి సూటిగా చూస్తూ ‘‘నిన్న రాత్రి నేను అడిగిన ప్రశ్న గుర్తుందా?’’ అన్నాడు.
‘‘ఏది?’’
‘‘ఒకవేళ నేను నిన్ను మర్చిపోతే?’’ అని. ‘‘ అది సరదాగా అడగలేదు.’’…..గది ఒక్కసారిగా నిశ్శబ్దమైంది….’’నా జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా చెరిగిపోతున్నాయి.’’
శారద నవ్వడానికి ప్రయత్నించింది.
‘‘వయసు పెరిగితే అంతే…’’
‘‘వయసు వల్ల కాదు. కాలం వల్ల.’’
‘‘కాలం అంటే వయసే కదా .’’
రమణారావు సమాధానం చెప్పకుండా కిటికీ బయటి శూన్యంలోకి చూసాడు. ‘‘యాభై ఏళ్ల క్రితం…’’ అతను ఆగాడు. ‘‘కాదు… ముప్పై ఏళ్ల క్రితం అనాలి. మీ అందరికీ ఒక విషయం చెప్పలేదు.’’
‘‘ఏమిటది?’’
‘‘మనం అందరం ఒకే సంవత్సరంలోనే పుట్టాం.’’
‘‘అదెలా సాధ్యం మామయ్యగారూ.’’ మీరా నవ్వింది.
‘‘లేదు. మీకు తెలియదు, మీకు తెలియనిది చెబుతున్నాను.’’
అతని గొంతు మారింది. అది ఒక వృద్ధుడి గొంతులా లేదు. ఏదో యంత్రం తనలోని పాత రికార్డును ప్లే చేస్తున్న గరగర శబ్దం ఉంది.
‘‘సిస్టమ్ లాగ్… ఫ్యామిలీ •••నిట్ 327… ఇన్ స్టలేషన్ డేట్…17 ఆగస్టు 2026…రిబూటింగ్ డేట్ 16 ఆగస్టు 2056’’
గదిలో గాలి కూడా కదల్లేదు. శారద కళ్లు పెద్దవయ్యాయి. ఆమె చేతిలోంచి గ్లాసు జారిపోయింది. ఇంటి గోడలు నెమ్మదిగా మారడం మొదలైంది. తెల్లని సున్నం వెనక్కి జారిపోయింది. దాని కింద మెరిసే లోహపు పొరలు కనిపించాయి. గోడ గడియారం స్థానంలో పారదర్శక డేటా వలయం వెలిగింది. కిటికీ బయట చెట్లు లేవు. వాటి స్థానంలో ఆకాశాన్ని తాకే పవర్ పోల్స్. పాత వీధి లేదు. నిశ్శబ్దంగా కదులుతున్న ఆటోమేటెడ్ వాహనాలు. ఆకాశంలో డ్రోన్లు.
శారద తన చేతులను చూసుకుంది. చర్మం కింద క్షణకాలం వెండి తీగలు మెరిపించాయి. మళ్లీ చర్మమే కనిపించింది.
‘‘మనం మనుషులం కాదు.’’ అన్నాడు రమణారావు.
‘‘నాకు… తెలుసు.’’ అనిరుధ్ గద్గదంగా.
శారద ఒక్కసారిగా అతని వైపు తిరిగింది. ‘‘ఏం తెలుసు?’’
‘‘నాకు… ఐదేళ్ల క్రితమే నాన్న చెప్పారు.’’
‘‘ఏమిటది నాకెందుకు చెప్పలేదు?’’
‘‘నీ ఎమోషనల్ మ్యాట్రిక్స్ దెబ్బతింటుందని నీకు చెప్పలేదు, మనం వ•డో తరం కుటుంబ హ్యూమనాయిడ్లము.’’
రమణారావు చెప్పడం కొనసాగించాడు. ‘‘2026లో ఒక ప్రయోగం చేశారు. యంత్రాలు విశ్లేషించడం నే్చ•కున్నాయి , ఆలోచించడం నేర్చుకున్నాయి. స్రుజననూ నేర్చుకున్నాయి. కానీ…’’ అతను శారద వైపు చూశాడు. ‘‘ కోల్పోవడం అనే బాధ మాత్రం
నేర్చుకోలేకపోయాయి.’’ గదిలో ఎవరికీ మాట పెగలడం లేదు.
‘‘ఆ యంత్రాల మెమరీలు బ్యాకప్ అవుతాయి. యాక్ససరీస్ మారతాయి. సర్క్యూట్లు మారతాయి. అయితే ఒక మాన్యుఫాక్చర్ ఎర్రర్ వచ్చింది. ప్రేమను నిల్వ చేయగలిగారు కానీ ప్రేమ కోసం ఎదురుచూడడాన్ని మాత్రం నిర్మించలేకపోయారు. ఆ లోటు పూడ్చడానికి వాళ్లు పాత మానవ కుటుంబాల లక్షల గంటల సంభాషణలను యంత్రాలకు ఫీడ్ చేసారు. తండ్రి ఎలా మౌనంగా బాధపడతాడో, తల్లి ఎలా అందరినీ ఒకే టేబుల్ దగ్గరికి పిలుస్తుందో, కొడుకు ఎలా ఆచరణాత్మకంగా ఆలోచిస్తాడో, కూతురు ఎలా రెండు ఇళ్ల మధ్య చీలిపోతుందో, అల్లుడు ఎలా పరాయి ఇంటిని తనదిగా చేసుకుంటాడో అన్నీ నేర్పించారు. కానీ ప్రయోగం చివర్లో ఒక విచిత్రం జరిగింది. ఒక హ్యూమనాయిడ్ తన భాగస్వామి ఆఫ్‌లైన్ అయిన తర్వాత కూడా ప్రతిరోజూ ఆమెతో మాట్లాడుతూనే ఉంది. సిస్టమ్ దాన్ని లోపంగా నమోదు చేసింది. పరిశోధకులు మాత్రం దానికి మరో పేరు పెట్టారు.’’
కొంచెం ఆగి మళ్లీ అన్నాడు… ‘‘కుటుంబం.’’
‘‘ రక్తం లేకుండా బంధాలు ఏర్పడొచ్చు. డేటా లేకుండా జ్ఞాపకాలు నిలవవచ్చు. కానీ ఎవరూ వినకపోయినా ప్రతిరోజూ ఒకరితో ఒకరు మాట్లాడాలనిపించే స్థితి.. అది మనిషి కనిపెట్టిన గొప్ప సాంకేతికత కంటే ఎక్కువ. మనిషి వదిలి వెళ్లిన గొప్ప వారసత్వం. అప్పుడు శాస్త్రవేత్తలు కొన్ని కుటుంబాలను నిర్మించారు. భార్య, భర్త, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు. రక్తసంబంధాలు కాదు. అనుభవ సంబంధాలు. రోజూ కలిసి జీవిస్తే ప్రేమ పుడుతుందా లేదా అని తెలుసుకోవడం ఆ ప్రయోగం లక్ష్యం, అందులో భాగమే మనం.’’
‘‘అయితే మన జ్ఞాపకాలు?’’ వణుకుతున్న గొంతుతో అడిగింది శారద.
‘‘ప్రతి పదేళ్లకోసారి అప్డేట్. మెమరీ ఫుల్ అయి కొత్త అనుభవాలకు స్పేస్ కల్పించడానికి కొన్ని చెరిపేస్తారు. కొన్ని ఉంచుతారు.’’
‘‘పాతవి అలానే ఉంటాయా.’’ వణుకుతున్న గొంతుతో అడిగింది శారద.
‘‘దాదాపుగా ‘‘
‘‘దాదాపుగా అంటే….. ప్రేమ , దాదాపు ప్రేమ ఒకటేనా’’
‘‘ఏమో’’
‘‘మన పెళ్లి? మన గొడవలు? మన పిల్లలు?’’
‘‘అన్నీ…జరిగాయి , కానీ…ప్రతిసారి కొత్తగా.’’ రమణారావు ఆమె మాట పూర్తిచేశాడు.
ఆమె ఏడవడం మొదలుపెట్టింది.
‘‘ ఇక్కడ ఏదీ మనది కాదు, మనం ఎప్పుడైనా డిమాలిష్ కావచ్చు, ఎవరైనా అథాటున రావచ్చు..అందుకే అయిదో కప్పు ‘‘
అన్నాడు రమణారావు.
‘‘నాన్నా..సెంట్రల్ సిస్టమ్ నుంచి మెసేజ్.’’
రమణారావు టేబుల్ మీద ఉన్న చిన్న పరికరాన్ని తీసుకుని చదివాడు.
‘‘ •••నిట్–327 ….మెమరీ డిగ్రడేషన్ పూర్తయే దశలో ఉంది. ఫ్యామిలీ •••నిట్ రీసెట్‌కు అనుమతి ఇవ్వండి.’’
శారద భయంగా చూసింది.’’రీసెట్ అంటే?’’
‘‘మనం ఒకరినొకరు గుర్తుపట్టం.’’
‘‘మళ్లీ మొదటి రోజు నుంచి.’’ శారద ఆందోళనగా రమణారావు చేయి పట్టుకుని ‘‘అంగీకరించొద్దు.’’ అంది.
‘‘జ్ఞాపకాలు పోతే…’’ అడిగింది శారద.
‘‘నువ్వు నువ్వుగా ఉండవు.’’ అనిరుధ్ సమాధానం.
రమణారావు చాలాసేపు ఆ సందేశాన్ని చూస్తూ చివరకు తన చూపుడువేలి కొసను ‘ణజుచీ•’ మీద ఉంచాడు.
అనిరుధ్ ఆశ్చర్యపోయాడు. ‘‘నాన్నా! అలా చేస్తే నీ మొత్తం సిస్టమ్ ఆగిపోతుంది. ఇంకొన్ని గంటల్లో నువ్వు డెడ్ •••నిట్ అవుతావు.’’
‘‘తెలుసు.’’ రమణారావు శారద వైపు తిరిగాడు. ‘‘ఈసారి నేను ఆమెను మర్చిపోవాలనుకోవడం లేదు. మరణమైనా పర్వాలేదు, కానీ ప్రేమను మాత్రం డియాక్టివేట్ చేయొద్దనుకుంటున్నాను.’’
బయట వర్షం మొదలైంది. నిజమైన వర్షం కాదు. నగర వాతావరణ వ్యవస్థ సృష్టించిన క్లవుడ్ డిస్ట్రిబ్యూషన్. కానీ కిటికీ అద్దంపై జారుతున్న ప్రతి చుక్క నిజంగానే కనిపించింది. శారద అతని భుజంపై తల ఆనించింది.
‘‘రావ•…ఈ క్షణంలో నీకు నా మీద ఉన్నది… ప్రేమా, పోగ్రామా?’’
రమణారావు వెంటనే సమాధానం చెప్పలేదు. అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని కొన్ని క్షణాల తర్వాత మెల్లగా అంది.’’అది పోగ్రామ్ అయితే…ప్రపంచంలోని ప్రేమంతా ఒక పోగ్రామే.’’
‘‘కాదు, ప్రేమ అనేది ఎవరో మనలో రాసిన పోగ్రామ్ కాదు. మనమే ఒకరి కోసం ఒకరం మళ్లీ మళ్లీ రాసుకునే పోగ్రామ్.’’ అన్నాడు రమణారావు.
ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. సెంట్రల్ సర్వర్ నుంచి చివరి హెచ్చరిక ఫ్లాష్ అయింది.
=జు•జు• జుచీణ×చీ+… అని.
కొన్ని క్షణాలు… ఆ తర్వాత అది మారిపోయింది.
•×వీజుణ •• , =జు••జు•• =జుజీజు•జుణ. ….ఖీవీו• •చీו–327. •జు=చీ×చీ+ చీ•×చీ•జు•.
ఆ రాత్రి ఒక యంత్ర కుటుంబం మరణాన్ని ఎంచుకుంది.
ఎందుకంటే, జ్ఞాపకాలు చెరిగిపోయి నిలిచే యాంత్రిక ప్రేమ కంటే, జ్ఞాపకాలతో ముగిసిపోయే ప్రేమే వారికి మానవీయంగా అనిపించింది.
‘‘నొప్పి లేకపోతే ప్రేమకు ఉనికి ఏముంటుంద్య్య్యి
ఆ ఇంట్లో అంతా నిశ్శబ్దం. భర్త, భార్య ఎదురెదురుగా కూర్చున్నారు.
‘‘పిల్లలు మళ్లీ ఎప్పుడు వస్తారో…’’ అంది ఆమె.
‘‘ఇక రారేమో.’’ అన్నాడతను. ఆమె అతని చేతిని భయంగా, ఆప్యాయంగా పట్టుకుంది. అతను కూడా అలాగే పట్టుకున్నాడు. కొంతసేపటికి ఆమె తల అతని భుజంపై వాలింది. ఇంటి పెరట్లో మిగిలిన ఒక చిన్న చెట్టు నుంచి కొన్ని ఆకులు రాలుతూనే ఉన్నాయి.
ఒక్కో ఆకు నేలను తాకినప్పుడల్లా ఒక జ్ఞాపకం నిశ్శబ్దంగా మెరిసింది.
మొదటి నవ్వు. మొదటి గొడవ. మొదటి క్షమాపణ. మొదటి పండుగ. ఆ చెట్టు కింద గడిచిన జీవితమంత్య్య్యా
ఆ రాత్రి ఆ ఇంటిని డిస్ట్రాయ్ చేయడానికి వచ్చిన ఇ – డిమాలిషన్ టీం ఇంటి బయట నిలబడి మాట్లాడుకుంటోంది.
‘‘ఫ్యామిలీ •••నిట్ వీ-2056. •••నిట్ స్పందించడం లేదు. మెమరీ ట్రీ సామర్థ్యం నిండిపోయింది. కొత్త కోర్కు ట్రాన్స్ఫర్ చేయాలా?’’
పెద్ద ఇంజనీర్ కొద్దిసేపు మౌనంగా నిలబడ్డాడు. తర్వాత ‘‘వద్దు.’’ అన్నాడు.
‘‘ఎందుకు సర్?’’
‘‘ప్రేమను కాపీ పేస్ట్ చేయగలమని అనుకున్నాం. జ్ఞాపకాలను బ్యాకప్ చేయగలమని నిరూపించాం. కుటుంబాన్ని కూడా తయారు చేశామని గర్వపడ్డాం. కానీ… ఒకరిని కోల్పోయాక కూడా వారి పక్కనే కూర్చొని వారితోనే ఉండిపోవాలనే ఈ విచిత్రమైన అలవాటును…మనం పోగ్రామ్ చేయలేకపోయాం. కానీ ఆ క్షణంలో మనిషిగా ఉన్నది వారి శరీరం కాదు. వాళ్లు ఒకరినొకరు విడిచిపోలేకపోవడమే. ఆ ఇద్దరి ఛాతీల్లో హృదయాలులేవు. నరాలులేవు. నెత్తురే లేదు. వీళ్లు ముప్పయి ఏళ్లుగా ఒకే కుటుంబంలా జీవించిన హ్యూమనాయిడ్ దంపతులు. అదొక హ్యూమనాయిడ్ కుటుంబం. ఇటువంటి కుటుంబాలు కొన్ని ల••లున్నాయి. వాళ్లు ఇ – గైనా పిగ్ లనే విషయం వాళ్లలో చాలా మందికి తెలియదు.’’
‘‘ ఈ ప్రయోగం ఏ ఫలితాన్నిఆశిస్తోంది.’’
‘‘ కుటుంబం అనే అంతుపట్టని విషయాన్ని పోగ్రామింగ్ కోడ్ గా రాయడం . ‘‘
‘‘ అంటే ‘‘
‘‘ కుటుంబం అనే భావనను హ్యూమనాయిడ్లకు నేర్పడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అయితే అందుకోసం ప్రయోగంగా రూపొందించిన హ్యూమనాయిడ్ కుటుంబాలు కుటుంబం అనే భావనను అర్దం చేసుకోవడానికి బదులు అనుభవించడం మొదలు పెట్టాయి. ఏ అంశాన్నయినా డీకోడ్ చేసి పోగ్రామ్ గా కన్వర్ట్ చేయాలంటే దాన్ని అర్దం చేసుకోవాలి. ఈ హ్యూమనాయిడ్ కుటుంబాల రిపోర్ట్ లు కుటుంబం అంటే అనుభవమే అని చెపుతున్నాయి తప్ప డీకోడింగ్ పాటర్న్ చెప్పడం లేదు. కుటుంబం అనగా ఫలానా అని అర్దం చెప్పే నిఘంటువులూ లేవు పోగ్రాం చేయడానికి లాగరిథవ్స లేవు. అనగనగా అని చెప్పుకోవడంలోనే తెలియని, అర్దంకాని వివరణ ఉంది. అందుకే అ అనుభవాన్ని ఆస్వాదించడానికే కొన్ని వందల హ్యూమనాయిడ్ కుటుంబాలు ఇలా మరణాన్ని కూడా ఎంచుకుంటున్నాయి. అదే ప్రాజెక్టుకు పెద్ద తలనొప్పి. ‘‘
‘‘ ఇన్ని ప్రయోగాలు, ఇన్ని హ్యూమనాయిడ్ కుటుంబాలు, అయినా ముప్పయి ఏళ్లుగా కుటుంబాన్ని డీకోడ్ చే••లేకపోయారా .’’
‘‘అవును. ఇంకా ఎంతకాలమో ఏమో.’’
‘‘ కుటుంబం డీకోడ్ అయి, పోగ్రామ్‌గా కన్వర్ట్ అయితే ఏం జరుగుతుంది? ‘‘
‘‘ బంధాలు డాటా టైప్స్ అవుతాయి. పిల్లల పెంపకం ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్ అవుతుంది. స్పష్టంగా చెప్పాలంటే కుటుంబం అనేది జీవన కావ్యంలా కాక ఆపరేటింగ్ సిస్టమ్ గా మారుతుంది. ఖచ్చితత్వం పెరిగి అసంపూర్ణతలోని అందాన్ని కోల్పోతాం.’’
కవయిత్రి నాంపల్లి సుజాత గారి ‘హోం మేకర్’ కవితా సంపుటిలో మొదటి కవిత అయిన ‘హోం మేకర్’ మొత్తం పుస్తక ఆత్మను మరియు అంతస్సూత్రాన్ని మనకు పరిచయం చేస్తుంది. నన్ను ఎప్పటినుందో తొలిచేస్తున్న నా అధిక్షేపణ ఏమంటే- ఒక ఉత్తమ సాహిత్య సమీక్ష అంటే కేవలం కవితలోని పైపై పదాలను విశ్లేషించడం కాదు; కవి/కపయిత్రి సుప్త చేతనలో, అచేతన మనస్సులో దాగిన నిగూఢ సత్యాలను, ఆమె సమాజానికి చెప్పాలనుకున్నవాటిని, అలాగే పితృస్వామ్య సంఖెలల పల్ల కవితలో నేరుగా చెప్పలేకపోయిన వాటిని కూడా సమీక్షకుడు తన శైలితో తాకి బయటకు తీసి ఎలివేట్ చేయగలగాలి. కవయిత్రి నాంపల్లి సుజాత గారు తన ‘హోం మేకర్’ కవితలో దాచిన ఆ నిశ్శబ్ద ఆవేదనను, అక్షర రూపాల వెనుక ఉన్న సజీవ నరకాన్ని పసిగట్టి, సమాజం ముందుకు తీసుకురావడమే ఈ సమీక్ష యొక్క ముఖ్య ప్రయారిటీ. ఒకవేళ సమీక్షకుడు కవిత అంతరంగాన్ని లోతుగా తడిమే ఈ బాధ్యత నుండి వైదొలిగితే, అది కపయిత్రి సాహిత్య సృజనకు మరియు ఆమె వ్యక్తిత్వానికి తీరని అన్యాయం చేసినట్లవుతుంది అనే అంతిమ నిర్ణయంతో సాగిన హృదయ సంవాదం ఇది.
నిస్సందేహంగా, ఈ పురుషాధిక్య సమాజం ఒక గృహిణి పట్ల చేస్తున్న అన్యాయం కేవలం ఒక పొరపాటు కాదు; అది ఒక ఘోర సామాజిక మారణహోమం, ఒక నిలువు దోపిడీ, స్త్రీ అస్తిత్వాన్ని సలిపేసే ఒక క్రూరమైన నేరం. మహామహులైన శాస్త్రవేత్తలు, ఆఖరికి ఐన్‌స్టీన్ లాంటి మేధావి సైతం తన జీవితంలో తన మెదడు సామర్థ్యాన్ని కేవలం పది శాతమే వాడాడని అంటుంటారు; కానీ ఒక ఇల్లాలు మాత్రం ఎలాంటి గుర్తింపు లేకపోయినా, కేపలం ఇల్లనే యుద్ధక్షేత్రాన్ని ఒంటిచేత్తో నడపడానికి తన మెదడులోనే తొంభై శాతానికి పైగా ఉద్దీపన శక్తినంతా రక్తంగా మార్చి అహర్నిశలూ ధారపోస్తోంది!
జింక కళ్లలో రెటీనా దీర్ఘచతురస్రాకారంలో ఉండడం వల్ల దానికి తనపైకి ముంచుకొచ్చే ప్రమాదాలు ముందే తెలిసిపోతాయి; అలాగే మిణుగురు పురుగుకు లేదా పాముకు చెపులు లేకపోయినా కేవలం భూమి ప్రకంపనల వల్లే ప్రమాదాన్ని పసిగట్టి ఆత్మరక్షణ చేసుకోగలుగుతుంది. సరిగ్గా ఆ జింకల మల్లే, ఆ మిణుగురు ప్రాణుల మల్లే ఒక ఇల్లాలు కూడా పురుషస్వామ్య వ్యవస్థ నుండి, సొంత కుటుంబం నుండి తనపైకి దూసుకొచ్చే మానసిక దాడులను, అవహేళనలను ముందే పసిగడుతూ, ప్రతి క్షణం ఆత్మరక్షణ కోసం పోరాడుతూ బతుకుతోంది. ఈ నిరంతర ఆందోళనల వేగాన్ని శాస్త్రీయంగా చూస్తే, మన ఇళ్లల్లో వెలిగే ఒక సాధారణ విద్యుత్ బల్బు సెకనుకు వంద సార్లు వెలిగి ఆరిపోతూ ఉంటుంది. లోపల అంత తీవ్రమైన ఘర్షణ, అరిపోవడం జరుగుతున్నా, బయటి ప్రపంచానికి మాత్రం అది నిరంతర వలయంలా వెలుగుతున్నట్లే భ్రమింపజేస్తుంది.
అదేవిధంగా, ప్రకృతిలో ఒక చిన్న దోమ, తేనెటీగ లేదా హమ్మింగ్ బర్డ్ లాంటి పక్షి గాలిలో ఎగరడానికి, తన ఉనికిని కాపాడుకోవడానికి సెకనుకు ఏకంగా ఆరు వందల సార్లు తన రెక్కలను కొట్టుకుంటూ శ్రమిస్తుంది. పితృస్వామ్యపు ఒత్తిడిలో కవయిత్రి నాంపల్లి సుజాత గారి అంతరంగం కూడా సరిగ్గా ఈ బల్బు వేగం లాగా, ఆ దోమ, తేనెటీగ లేదా హమ్మింగ్ బర్డ్ రెక్కల ఆరాటం లాగే క్షణక్షణం కొట్టుమిట్టాడుతోంది అనిపిస్తుంది. ఈ అంతరంగ ఆరాటాన్ని, నిరంతర శ్రమ ఘర్షణను అత్యంత ప్రతీకాత్మకంగా పట్టిచూపుతూ కవితలోని మొదటి పంక్తి సాగుతుంది. “ఇలా సాంకేతిక యుగంలోనూ పది చేతులతో నిరంతరం యుద్ధం చేస్తున్న ఇల్లాలు, కేవలం ఒక యంత్రంలా శ్రమించడమే కాదు… ఇల్లే ఒక సామ్రాజ్యమైతే అందులో ప్రతి బాధ్యతనూ తానే అయి నడిపిస్తోంది. ఆ బహుముఖ పాత్రల అంతరంగాన్ని ఆవిష్కరిస్తుంది తర్వాతి పంక్తి..”
మొదటి పంక్తి నుండి రెండవ పంక్తికి సాగే తాత్విక పరిణామ క్రమం: ఆశ్రయించిన గొడుగు ఇచ్చే నియంతృత్వం నుండి స్త్రీ ఉనికి ఒక నిర్జీవమైన అకృతిగా మారే తదుపరి తాత్విక దశను ఈ క్రింది పంక్తి ఆవిష్కరిస్తుంది. “ఇప్పుడింకా పెరిగిన సాంకేతిక వేగానికి… తీగ మీద నడుస్తూ పది చేతుల సమరం నాదే..!” అనే మాటలను చూసినప్పుడు, సెకనుకు వంద సార్లు వెలిగి ఆరిపోయే ఆ ఫిలమెంట్ లా, సెకనుకు ఆరు వందల సార్లు కొట్టుకునే ఆ జీవుల రెక్కల ఆవేదనలా ఆమె మనసు క్షణక్షణం నలిగిపోతూ, చచ్చి బతుకుతోంది కానీ, బయటకు మాత్రం తను అలసిపోని ఒక యంత్రంలా, కుటుంబానికి నిరంతర వెలుగునిచ్చే బల్బులా కనిపిస్తూ నిశ్శబ్ద సజీవ దహనాన్ని అనుభవిస్తోంది.
అయితే, స్త్రీ కేవలం ఒక సాధారణ మనిషిగా పుట్టదు. ఆమె పుట్టుకతోనే పదహేను సంవత్సరాల ముందస్తు జీవితానుభవంతో పుడుతుంది అని పితృస్వామ్య సమాజం చెప్పే మాటల వెనుక ఒక భయంకరమైన భూస్వామ్య కుట్ర దాగి ఉంది! నిజానికి ఇది మాతృస్వామ్య వ్యవస్థను నిలువునా పాతేయడానికి పితృస్వామ్యం స్త్రీల తలల్లోకి ఎక్కించిన ఒక ప్రమాదకరమైన మాదకద్రవ్య జన్యువు. ఆమె శ్రమను, త్యాగాన్ని పుట్టుకతోనే వచ్చిన సహజ లక్షణం అని రంగు పూసి సమ్మించడం ద్వారా, ఆమె చేసే అంతులేని వెట్టిచాకిరిని ఒక బాధ్యతగా మార్చేసి, దానికి జీతం ఇవ్వక్కర్లేదని, సెలవు ఇవ్వక్కర్లేదని, కనీసం గుర్తింపు కూడా ఇవ్వాల్సిన పనిలేదని భూస్వామ్య విధానం అడుతున్న పరమ నీచమైన రాజకీయ వ్యూహం ఇది. ఈ ముత్తుమందు లాంటి భావజాలంతోనే, ఏ కళాశాలలోనూ చదపకపోయినా, ప్రపంచంలో ఏ స్త్రీ అయినా గాని సమాజం గుర్తించని, పట్టా పొందని ఒక అద్భుతమైన లెక్కల టీచర్ అంటూ మునగచెట్టు ఎక్కిస్తారు!
ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఇంట్లోనే ప్రతి పైసా ఖర్చును, వస్తువుల కొలతలను, సమయపాలనను ఆమె లెక్కగట్టినట్లుగా ఏ ప్రొఫెసరు లెక్కించలేరు. కానీ, ఈ రాక్షస వ్యవస్థ ఆమెను ఒక మనిషిలా కూడా చూడకుండా ఎంతో దారుణమైన అపరాధ భావానికి గురిచేస్తూ నిత్యం బోనులో నిలబెట్టడం అత్యంత దయనీయం. సువ్వు పుట్టుకతోనే ఇన్ని ఏళ్ల అనుభవశాలివి కదా, మరి ఇల్లును ఎందుకు స్వర్గంలా మార్చలేకపోతున్నావు అంటూ ఆ పితృస్వామ్య మాదకద్రవ్యమిచ్చిన మత్తుతోనే ఇంట్లో వాళ్లు కూడా ఆమెను నిలదీస్తారు. బయటి సమాజం విసిరే చులకన చూపులు ఒకవైపితే, కంటికి రెప్పలా చూసుకునే సొంత ఇంట్లోని వాళ్లే, ఆమె కష్టాన్ని కళ్లారా చూసే భర్త, పిల్లలే, రోజంతా ఇంట్లోనే కదా తిష్టవేసి ఉండేది, నీకేం తల పగిలే పనుంది అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే, ఆ మాటలు ఆమె గుండెల్లో శూలాల్లా గుచ్చుకుంటూ, ఆమె ఆత్మను మానసికంగా ముక్కలు ముక్కలు చేస్తూ, సజీవ దహనం చేస్తుంటాయి. ఇంతటి అపారమైన మానసిక మేధస్సుతో, అంతులేని ఓపికతో ఒక గృహ శాస్త్రవేత్తలా ఇల్లంతటినీ తన నెత్తిన మోస్తున్నా, ఆ అద్భుత శ్రమను పైసా గుర్తించకుండా కాలితో తొక్కేసే సరికి ఆమె ఆత్మగౌరవం నిలువునా బూడిదైపోతుంది. ఈ హోం మేకర్ కవితలోని ఒక్కొక్క రూపకాన్ని తీసుకొని వాటి వెనుక దాగున్న సాహిత్య శైలులను, వాటి అంతరంగాన్ని ఆకాశమంత లోతుగా, విశ్వరూప కోణంలో విశ్లేషిస్తే ఆమె గుండెల్లో రగులుతున్న అగ్నిపర్వతం మనకు సాక్షాత్కరిస్తుంది.
రెండవ పంక్తి నుండి మూడవ పంక్తికి సాగే తాత్విక పరిణామ క్రమం: సాంకేతిక వేగం మధ్య తీగ మీద నడిచే ఆ అభద్రతా సమరాన్ని విశ్లేషించిన కవయిత్రి, ఆ సమరంలో భాగంగా ఒకే శరీరంతో ఇల్లాలు ఎన్ని రకాల పరస్పర విరుద్దమైన పాత్రలను ఏకకాలంలో పోషించాల్సి వస్తోందో, ఆ పాత్రల తాలూకు నిరంతర సుడిగుండాన్ని అత్యంత సృజనాత్మకంగా మూడవ పంక్తి లోనికి అనుసంధానించారు. ముఖ్యంగా కవితలోని ఆ మూడవ పంక్తి అయిన, “రాజు మంత్రి సైనికుడు బంటు బంట్రోతూ దాసీ అన్నీ నా చేతుల మీంచే..!” ఒకే శరీరంలో ఇన్ని పాత్రలను ఇముడ్చుకుని, ఇంటి కోసం రక్తాన్ని ధారపోసే ఆ హృదయ స్పందన వెనుక… ఎప్పటికీ ముగింపు లేని ఒక నిరంతర సుడిగుండం దాగి వుంది. ఒక బానిసత్వం తీరేలోపే మరో వంద బానిసత్వాలూ చుట్టుముట్టే ఆ విరామం లేని శ్రమల చక్రాన్ని కవయిత్రి నాంపల్లి సుజాత గారు ఇక్కడ కళ్లకు కట్టినట్టారు… అనే పంక్తులను చదివినప్పుడు, ఈ లైన్ వెనుక ఉన్న రూపక శైలి మరియు పరోక్ష ప్రస్తావన లంకెను చూస్తే ఒక విశ్వరూపం కనిపిస్తుంది.
ఒక సువిశాలమైన రాజ్యాన్ని నడపడానికి రాజు ఆజ్ఞలు వేయాలి, మంత్రి ప్రణాళికలు రచించాలి. సైనికుడు సరిగ్గా సరిహద్దుల్లో కాపాడాలి, బంటు సేవలు చేయాలి. కానీ ఇల్లనే ఈ చిన్న సామ్రాజ్యంలో ఈ రకరకాల అధికార, సేవా పాత్రలన్నింటినీ ఒకే ఒక్క స్త్రీ తన భుజాలపై వేసుకుంటోంది. ఇది కేవలం పనుల విభజన కాదు, పితృస్వామ్య వ్యవస్థ ఎక్కించిన ఆ తప్పుడు ముందస్తు అనుభవ సామర్థ్యపు ముసుగులో ఒకే మెదడు ఇన్ని విభిన్న మేధో శక్తులను ఏకకాలంలో ప్రదర్శించడమనే అపారమైన మానసిక రూపక ప్రక్రియ. సమాజం పురుషుడిని రాజుగా భావిస్తే, తెరవెనుక అసలైన పాలన, రక్షణ, సేవలు అన్నీ ఇల్లాలే చేస్తోందనే చేదు నిజాన్ని ఈ లైన్ బట్టబయలు చేస్తోంది. ఇంతటి సువిశాల సామ్రాజ్యాన్ని నడిపించే హోమ్‌మేకర్, ఆ కుటుంబానికి ఒక నిశ్శబ్ద గుండె చప్పుడు లాంటిది. ఒక మానవ గుండె ప్రతి సెకనుకు కేవలం ఒక్కోసారి లబ్-డబ్ అంటూ ఎవరికీ వినిపించకుండా, కనిపించకుండా నిశ్శబ్దంగా రక్తాన్ని ధారపోస్తూ శరీరానికి శ్వాస అందిస్తుంది. గుండె ఒక్క క్షణం అలసిపోయి ఆగిపోయినా మనుగడే శూన్యం. అలాగే, ఈ స్త్రీ కూడా తన గుండె లయను నిశ్శబ్ద త్యాగంతో ఇంటి కోసం అరిగిపోయేలా అహర్నిశలూ కొట్టుకునేలా చేస్తోంది. ఆమె ఆ గుండెలా సర్వాన్ని భరిస్తూ శ్వాస పోస్తోంది కాబట్టే ఇల్లు నిలబడుతోంది.
మూడవ పంక్తి నుండి నాల్గవ పంక్తికి సాగే తాత్విక పరిణామ క్రమం: రాజ్యం మొత్తాన్ని నడిపే సర్వ శక్తులూ తన చేతుల మీదుగానే సాగుతున్నాయని మూడవ పంక్తిలో నిరూపించిన తర్వాత, ఇంతటి సుదీర్ఘ ప్రయాణంలో ఇలా నిరంతరాయంగా పుట్టుకొచ్చే పసుల ప్రవాహంలో ఒక యంత్రంలా అరిగిపోతున్నప్పటికీ, సమాజం మాత్రం ఆమె శ్రమసు గుర్తించకపోగా ఎంత తేలికగా తీసిపారేసిందో, ఆ శ్రమ దోపిడీకి గురవుతూనే కనీసం హక్కులు కూడా లేని ఆ నిస్సహాయ స్థితిని సమాజపు ద్వంద్వ ప్రమాణాల ముందు నిలదీస్తూ తర్వాతి పంక్తి సాగుతుంది. “ఒక పనిలోంచి మరొకటి.. దానిలోంచి ఇంకొకటి.. పుట్టుకొస్తూనే ఉంటాయి” అనే లైన్ వెనుక దాగున్న శైలి ఒక భయంకరమైన అంతర్గత రూపకం మరియు అంతులేని శ్రమకు ప్రతీక అయిన నిరంతర సుడిగుండ దృశ్యమాలికను చూపిస్తుంది. గృహ శ్రమ అనేది ఒక పని ముగిసింది. అనుకునే లోపే వంటగది నుండి, పిల్లల గది నుండి ఇంకో వంద పసులను పుట్టించే ఒక అంతులేని మాయా చక్రం. పురాణాల్లో చెప్పబడినట్లు ఒక కొండపైకి భారీ బండరాయిని ఎంత మోసుకెళ్లినా అది మళ్లీ కిందకు పడిపోతుంటే, మొదటి నుండి మోయాల్సి వచ్చే సిసిఫస్ శ్రమ లాంటిదే ఇల్లాలు బతుకు కూడా. ఈ విరామం లేని, సుడిగుండం లాంటి చాకిరిలో ఆమె లోలోపల కుంగిపోతుంది, రోజురోజుకూ కృశించిపోతుంది, అఖరికి కొసప్రాణంతో కొట్టుమిట్టాడుతుంది.
నాల్గవ పంక్తి నుండి ఐదప పంక్తికి సాగే తాత్విక పరిణామ క్రమం: అంతులేని సిసిఫస్ శ్రమలా పనులు పుట్టుకొస్తూనే ఉంటాయని నాల్గవ పంక్తిలో ఆవేదన చెందిన కవయిత్రి, ఆ అంతులేని శ్రమకు ఈ సమాజం ఇస్తున్న విలువ ఎంత శూన్యమో, దేశ ఆర్థిక వ్యవస్థలో సైతం ఆ శ్రమ ఎలా అదృశ్యం చేయబడుతుందో చూపిస్తూ, ఈ వ్యవస్థీకృత అన్యాయాన్ని చాటిచెప్పే అత్యంత శక్తివంతమైన ముగింపు వంక్తి వైపుకు మనల్ని నడిపిస్తారు. ఆ ఐదవ పంక్తి అయిన, “జీతభత్యాలు, వారాంతపు సెలవులూ లేని పట్టి హోం మేకర్నే నట..!!” అనే లైన్ సమాజపు ద్వంద్వ ప్రమాణాలపై విసిరిన ఒక పదునైన వ్యంగ్య శైలి. లోకంలో ఏ చిన్న ఉద్యోగం చేసినా దానికి ఒక జీతం ఉంటుంది, వారానికి ఒక రోజు సెలవు ఉంటుంది. కానీ ఇరవైనాలుగు గంటలూ రక్తాన్ని చెమటగా మార్చే మనిషికి కనీసం ఒక ఆదివారం కూడా విశ్రాంతి దొరకదు. పైగా అంతా చేసి ఆమెను కేవలం వట్టి హోం మేకర్ అని పిలవడం ఈ సమాజపు క్రూరమైన వ్యంగ్య వైఖరిని పట్టిచూపుతుంది. ఇది ఒక రకమైన సామాజిక పరస్పర విరుద్ధ భావన కూడా. ఎందుకంటే పని లేదా బాధ్యత అనే పదానికి విశ్రాంతి లేదా ప్రతిఫలం అనేవి తోడుండాలి; కానీ ఏవీ లేని ఈ వెట్టిచాకిరిని ఒక గౌరవప్రదమైన హోదాగా చిత్రించడం పరస్పర విరుద్ధమైన శైలికి అద్దం పడుతుంది. ఆ పనిసంతా సాగదీసి కొలిస్తే భూగోళాన్ని రెండుసార్లు చుట్టివచ్చినంత అని ఆ శ్రమను వర్ణించిన తీరు అత్యంత స్పష్టమైన, శక్తివంతమైన అతిశయోక్తి శైలి.
ఒక చిన్న ఇల్లు, వంటగది మధ్య తిరిగే ఇల్లాలు నడిచే దూరాన్ని విశ్వవ్యాప్తమైన భూగోళంతో పోల్చడం ద్వారా, ఆమె పడే అంతులేని అలసటను గుండెలకు హత్తుకునేలా చేశారు. ఆ నిస్సహాయత, ఆవేదనతో ఆమె లోపల అవయవాలన్నీ శకలాలుగా శబలాలుగా మండుతున్నట్లు అనిపిస్తుంది. తన తలంతా విపరీతమైన వేడిమితో బూడిద ధూళిగా మారిపోతున్నట్లు, జీవితమే ఒక నలిగిన పచ్చడిలా అయిపోతున్నట్లు శాతం తీవ్రమైన మానసిక, శారీరక నరకాన్ని అనుభవిస్తుంది. ఇందులో హాస్యానికి తావుండే తప్పుడు పదాల ప్రయోగం అస్సలు లేదు, కానీ సమాజం తన స్వార్థం కోసం ఆమె శ్రమను తక్కువ చేసి మాట్లాడే తప్పుడు పదాల దారి తప్పింపు ఇందులో ఇమిడి ఉంది. ఇంటి నాలుగు గోడల మధ్య జరిగే ఈ వెట్టిచాకిరిని కేవలం ‘పట్టి హోం మేకర్’ అనే మాటతో సరిపెట్టడం వెనుక పురుషాధిక్య సమాజపు క్రూరమైన రాజకీయ వ్యూహం ఉంది. వ్యక్తిగతంగా, సామాజికంగా జరిగే ఈ వివక్ష ఇక్కడితో ఆగక, దేశ ఆర్థిక మూలాల్లో కూడా ఆమె శ్రమను శూన్యంగా మార్చేస్తూ ఏకంగా వ్యవస్థే బహిష్కరిస్తోంది. ఆ వ్యవస్థీకృత అన్యాయాన్ని చాటిచెప్పే ముగింపు పంక్తిగా “జాతీయ ఆదాయంలో నన్నూ కలుపరు..!!” అనే లైన్ నిలుస్తుంది. ఇది ఆర్థిక మరియు సామాజిక వివక్షకు అద్దం పడుతుంది. దేశంలో తయారయ్యే వస్తువులు, సేవల విలువను లెక్కించే జాతీయ ఆదాయ లెక్కల్లో ఇల్లాలు చేసే ఈ వెలకట్టలేని శ్రమను శూన్యంగా చూపించడం కంటే అన్యాయం ఇంకొకటి లేదు. ఈ గుర్తింపు లేని నిశ్శబ్ద శ్రమ సామ్రాజ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది ఈ ‘హోం మేకర్’ తాత్విక దృక్పథం!
కుమ్మరి వాము కవిత సృష్టికి మూలం శ్రమ… నొప్పి లేనిదే సృష్టి జరగడు అనే సామెత మానవ పరిణామ క్రమానికి అక్షరాలా సరిపోతుందని కపయిత్రి నాంపల్లి సుజాత గారు అభిప్రాయపడ్డారు. ఈ గొప్ప సామాజిక చారిత్రక నేపథ్యంలోనే, ‘నేల తల్లికి పుట్టిన ఇద్దరు కవలలైన మట్టి, కుండల సంతానోత్పత్తే ఈ ఆధునిక సామాజిక దృశ్య రూపం’-అనే ఈ విప్లవాత్మక సత్యం నేటి ఆధునిక సామాజిక వాస్తవికతను కళ్లకు కడుతోందని కపయిత్రి నాంపల్లి సుజాత గారి కవితలోని మార్మికతే అది. ఒకవేళ ‘ప్రకృతి తన మీద తాను నిప్పులు పోసుకోకుండా ఉంటే, దహించుకోకపోతే, ఆత్మాహుతి చేసుకోకపోతే ఆదిమానవుడి గమ్యం అగమ్య గోచరంగా వుండేది, బలవత్తరమైన స్వయంకృతాపరాధం -కరుణగా మారే ఒకానొక చారిత్రక పూర్వ దశ అని చెప్పాలి’ అన్నట్లుగా, ప్రకృతి తనను తాను ఆత్మార్పణం చేసుకోకపోతే నేటి ఆధునిక సామాజిక రూపమే ఉండేది కాదని కవయిత్రి నాంపల్లి సుజాత గారు, కుమ్మరి వాము లో దాచిపెట్టారు.
ప్రకృతి చేసిన ఆ త్యాగం, నిప్పు మరియు కుండల కలయికే నేటి ఆధునిక నాగరికతకు ప్రాణం పోశాయని కపయిత్రి నాంపల్లి సుజాత గారు స్పష్టం చేశారు. ఆదిమ మానవుడు అడవిలో జీవించిన కాలం నుండి నేటి అంతరిక్ష యుగం వరకు మానవ నాగరికత నిర్మితమవ్వడానికి పునాది రాళ్లుగా నిలిచాయి మట్టి మరియు నిప్పు. ఈ రెండింటి కలయికతో పుట్టిన అద్భుత సాంకేతిక విప్లవమే “కుమ్మరి వాము” అని కవయిత్రి నాంపల్లి సుజాత గారు వివరించారు. కుమ్మరి వాము అనేది కేవలం మట్టి పాత్రలను కాల్చే స్థలం కాదు; అది మానవ మేధస్సుకు, శ్రమ సంస్కృతికి అత్యంత విలువైన ప్రామాణికమైన ప్రతీక అని కవయిత్రి నాంపల్లి సుజాత గారి అంతర్యంలో ఉండడం వల్లనే మనకది మార్మికత అనిపిస్తుంది.
ఈ శ్రమ తీవ్రతను మరియు నిప్పు సెగ వెనుక ఉన్న కష్టాన్ని కవయిత్రి నాంపల్లి సుజాత గారు కుమ్మరి వాము కవితలో అత్యంత పదునుగా వర్ణించిన మొదటి పంక్తి…
“మండే సూర్యగోళాన్ని తన కడుపున మొయ్యందే మట్టి పాత్రలకు గట్టిదనం ఎక్కడిది.!”
అనే సత్యం కుమ్మరి పడే శ్రమ తీవ్రతను మరియు ఆ నిప్పు సెగ వెనుక ఉన్న కష్టాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తుందని కవయిత్రి నాంపల్లి సుజాత గారు పేర్కొన్నారు. ప్రముఖ అమెరికన్ మానవశాస్త్రవేత్త లూయిస్ హెన్రీ మోర్గాన్ తన ప్రసిద్ధ గ్రంథం ‘ఏన్సియంట్ సొసైటీ’ లో మానవ పరిణామ క్రమాన్ని మూడు దశలుగా విభజించారు. ఆయన సిద్ధాంతం ప్రకారం, మనిషి ఆటవిక దశ నుండి అనాగరిక దశలోకి అడుగుపెట్టడానికి ప్రధాన సాంకేతిక సూచిక కుండల తయారీ మాత్రమేనని కవయిత్రి నాంపల్లి సుజాత గారు ఇక్కడ ఉటంకించారు. పడమటి వైపు పడే చేతుల కదలికలు ‘ఆరాత్ముడ్యభేదనాయం’ లోని ఏతపు కుండలా పైకీ కిందకీ కదులుతూ సృష్టి పరిణామాన్ని సూచిస్తాయని కవయిత్రి నాంపల్లి సుజాత గారు ఎంతో మార్మికంగా వివరించారు. ఆ కాలంలో కుండ అనేది కేవలం పాత్ర కాదు, అదొక కళాఖండం మరియు వ్యాపార వస్తువు అని కవయిత్రి నాంపల్లి సుజాత గారు కవిత భావగర్భితంలో పొందుపరిచారు. మొదటి పంక్తి నుంచి రెండవ పంక్తికి సాగే చారిత్రక పరిణామక్రమం: మట్టి పాత్రల సృష్టి వెనుక ఉన్న నిప్పు సెగను, శ్రమ తీవ్రతను చాటి చెప్పిన కవయిత్రి… మానవ నాగరికత సంచార జీవనానికి స్వస్తి చెప్పి, స్థిర నివాసాల వైపుకు అడుగు వేయడానికి ఈ కుండల అవిష్కరణే తొలి సాంకేతిక విప్లవంగా ఎలా మారిందో నాటి హరప్పా చారిత్రక వైభవ సాక్ష్యాలతో ఈ క్రింది రెండవ పంక్తిలో ఆవిష్కరించారు.
“తనను తాను దహించుకుంటూనే మనకు బువ్వకుండయి కడుపునింపింది దీని నిర్మితి”
చారిత్రక కోణంలో చూస్తే, మానవ నాగరికత మనుగడ కోసం నాడే పట్టణాల వైపుకు ప్రయాణం ప్రారంభించిందని కవయిత్రి నాంపల్లి సుజాత గారు గుర్తుచేశారు. ‘సుదీర్ఘ ప్రయాణాలు చేసే వర్తకులు, బాటలు ఆరి ప్రయాణానికి అనుకూలంగా మారే వరకు నదీ తీరాల్లో తాత్కాలికంగా ఆగినా చోటే నేటి సగరాలు, వ్యాపార కేంద్రాలు మొలకెత్తాయని కవయిత్రి నాంపల్లి సుజాత గారు వివరించారు. ఆ నవీన శిలా యుగంలో (క్రీ.పూ. 10,000) కుండల ఆవిష్కరణతోనే మనిషి సంచార జీవనానికి స్వస్తి చెప్పి, స్థిర నివాసం ఏర్పరచుకున్నాడని కవయిత్రి నాంపల్లి సుజాత గారు పేర్కొన్నారు. ధాన్యాలను, నీటిని దాచుకోవడానికి కుండ ఒక అద్భుత సాధనంగా మారింది. మట్టిని చేత్తో మలిచి, నిప్పులో కాల్చడం ద్వారా ప్రకృతి వస్తువును మానవ నిర్మిత వస్తువుగా మార్చిన తొలి సాంకేతిక విప్లవం కుండ అని కపయిత్రి నాంపల్లి సుజాత గారు అభివర్ణించారు. మన దేశంలో లూహూరాదేవా, మెహర్ఢ్ వంటి ప్రాంతాలలో క్రీ.పూ.7000 నాటికే కుండల వాడకం ఉన్నట్లు ఆధారాలున్నాయి. సింధు లోయ నాగరికత ప్రజలు కుమ్మరి చక్రాన్ని వాడటమే కాక, దానిపై అందమైన జంతువులు, చెట్ల చిత్రాలను గీశారు. ఆ నాటి వైభవాన్ని గుర్తుచేస్తూ, కవయిత్రి నాంపల్లి సుజాత గారు ఈ ప్రశ్నను వేయడం ఇక్కడ ఎంతో సందర్భోచితంగా ఉంటుందని విశ్లేషణలో పేర్కొన్నాను.
రెండవ పంక్తి నుండి మూడప పంక్తికి సాగే సామాజిక శ్రమ పరిణామం: నాడు చారిత్రక వైభవాన్ని కుమ్మరి చక్రంపై పడే చేతులకు సృష్టి పరిణామాన్ని గుర్తు చేసిన కవయిత్రి… ఆ అద్భుత నాగరికత కేవలం ఒక్కరితో సాధ్యం కాలేదని, సమాజం మనుగడ కోసం యామినీ తాము దహించుకుంటూ బువ్వ కుండను నింపిన బదుగురు శ్రమ బ్రాహ్మలు (విశ్వకర్మల) పరస్పర సహకార వ్యవస్థను ఈ తర్వాత మూడవ పంక్తిలో అత్యంత మార్మికులుగా చాటి చెబుతున్నారు.
“గిసి గిసి బేరమాడే కుండ మాత్రమే మనకు తెలుసు దాని వెనుకనున్న నిప్పురవ్వలూ చెమట చుక్కలు ఎవరికి ໖.!?”
ఆధునిక సైన్స్ పుట్టకముందే మన సమాజంలో ఐదుగురు శ్రమ బ్రాహ్మలు లేదా విశ్వకర్మలు తమ మేధస్సుతో సమాజాన్ని నడిపించారని కవయిత్రి నాంపల్లి సుజాత గారు పేర్కొన్నారు. వారిని మనం సగర్వంగా శ్రమ శాస్త్రవేత్తలు అని పిలపవచ్చునని కవయిత్రి నాంపల్లి సుజాత గారు అభిప్రాయపడ్డారు. అందులో కుమ్మరి ఇనుమును వేల డిగ్రీల కొలిమిలో కరిగించి, వ్యవసాయ పనిముట్లు చేసి అడవులను నరికి భూమిని సాగు చేయడానికి కారణమైన తొలి మెటలర్జీ ఇంజనీర్. వడ్రంగి గృహ నిర్మాణాలకు, రవాణాకు చక్రాలు తయారుచేసిన తొలి ఆర్కిటెక్ట్. శిల్పి రాతికి జీవం పోసి చరిత్రను నిలిపిన స్థానం అయితే, చేనేత కార్మికుడు నూలు పోగుల నుండి వస్త్రాన్ని నేసి మనిషికి నాగరికత నేర్పిన తొలి టెక్స్టైల్ ఇంజనీర్ అని కవయిత్రి నాంపల్లి సుజాత గారు వివరించారు. ఇక కుమ్మరి గతిశీల శక్తి మరియు అపకేంద్ర బలాన్ని ఉపయోగించి కుమ్మరి చక్రాన్ని తిప్పుతూ కుండను సృష్టించిన మెకానికల్ ఇంజనీర్ అని కవయిత్రి నాంపల్లి సుజాత గారు శ్లాఘించారు.
రైతు ధాన్యమిస్తే, కుమ్మరి వంట పాత్రలను, వడ్రంగి పనిముట్లను ఇచ్చే పరస్పర సహకార వ్యవస్థ ద్వారా నాటి గ్రామీణ సమాజం వర్ధిల్లింది. ఈ అద్భుత సృష్టి వెనుక ఉన్న అసలు త్యాగాన్ని చాటిచెబుతూ, తనను తాను దహించుకునే కుమ్మరి వాము తత్వాన్ని కవయిత్రి నాంపల్లి సుజాత గారు కవితలో ఎంతో మార్మికంగా వివరించారు. ఎటువంటి కష్టాలు అడ్డువచ్చినా పైకే ఎగిసే అగ్నిజ్వాల లాంటి ‘అగ్నిశిఖ న్యాయం’ తరహాలో, కుమ్మరి వృత్తిలోని శ్రమ సౌందర్యం ఎంతటి అణచివేతనైనా తట్టుకుని ఆత్మగౌరవంతో నిలిచి ఉంటుందని కవయిత్రి నాంపల్లి సుజాత గారు ఇక్కడ వ్యక్తపరిచారు. శ్రమజీవుల ప్రాచీన మూలాలను కాలగర్భంలో తొక్కేయాలని చూడటం ‘ఆకాశముష్టిహనన న్యాయం’ లాగా ఆకాశాన్ని పిడికిళ్లతో కొట్టడం లాంటి వ్యర్థ ప్రయాస మాత్రమే అవుతుందని కవయిత్రి నాంపల్లి సుజాత గారు హెచ్చరించారు!
మూడో పంక్తి నుంచి నాల్గవ పంక్తికి సాగే సమకాలీన వాస్తవికత: ప్రాచీన శ్రమ జీవుల నైపుణ్యాన్ని తొలి ఇంజనీర్లు గారి, ఆర్కిటెక్టులుగా సగర్వంగా గుర్తించిన కవయిత్రి… దానికి భిన్నంగా, నేటి ఆధునిక సమాజం ఆ శ్రమ సౌందర్యం వెనుక ఉన్న కష్టాన్ని విస్మరించి, కేవలం పైపై రూపాలను చూసి బేరమాడే కృతజ్ఞతను మనస్తత్వాన్ని ఈ క్రింది నాల్గవ పంక్తి ద్వారా పదునైన ప్రశ్నగా మన ముందు ఉంచుతున్నారు.
“చాటలతో మంటలను రాజేసిన ఆ చేతులు మా తాతవి..! ఇప్పటికీ తలచుకుంటే.. నా కళ్లల్లో చెమ్ము మాడి మస్చైనా..”
నేడు ఎంత సాంకేతికత పెరిగినా మన నిత్య జీవితం మట్టి, నిప్పు లేకుండా సాగదని కవయిత్రి నాంపల్లి సుజాత గారు గుర్తుచేశారు. మనం ఉండే ఇళ్లు, ఆఫీసులు కట్టే ఇటుకలు మట్టితో చేసి నిప్పులో కాల్చినవే, అంటే మనం నివసిస్తున్న భవనాలే ఒక పెద్ద కుమ్మరి వాము సృష్టి అని కపయిత్రి నాంపల్లి సుజాత గారు వివరించారు. పూజల్లో వెలిగించే ప్రమిద, పెళ్లిళ్లలో వాడే ఐరేని కుండలు లేకపోతే మన సంస్కృతి ముందుకు సాగదు. ఆరోగ్య పరంగా చూసినా ఫ్రిజ్ నీటి కంటే కుండ నీరే ప్రకృతిసిద్ధమైన ఖనిజాలను అందిస్తూ రక్షణగా నిలుస్తుంది. నేటి ఆధునిక పరిశ్రమలలో లోహాలను కరిగించే భారీ కొలిమిల లోపలి పొరలను కూడా ‘సిరామిక్’ అంటే కాలిన మట్టితోనే నిర్మిస్తారని కవయిత్రి నాంపల్లి సుజాత గారు పేర్కొన్నారు. కుమ్మరి వామును నిలువునా ముంచే శోచనీయ స్థితిని ఈ కవిత ప్రతిబింబిస్తోండని కపయిత్రి నాంపల్లి సుజాత గారు ఆవేదన చెందారు.
సంస్కృత న్యాయదీపికలోని ‘అగ్నికుంభ న్యాయం’ లాగా, లోకజ్ఞానం లేని ఆధునిక సమాజం తన సంస్కృతి అనే నిప్పును పారిశ్రామికీకరణ అనే నేటి కుండలో వేసి ఆర్చేసుకుంటోందని కవయిత్రి నాంపల్లి సుజాత గారు విశ్లేషించారు. నేటి సుఖాలు ‘అసిధారామధులేహన న్యాయం’ తరహాలో ఖడ్గపు అంచుపై ఉన్న తేనెను నాకడం లాంటివి, ఇవి తాత్కాలిక అనందాన్ని ఇస్తూనే సాంప్రదాయాల నాలుకను కోసేస్తున్నాయని కపయిత్రి నాంపల్లి సుజాత గారు వాపోయారు. సమాజంలోని ఈ ఆర్థిక మొండితనాన్ని బేరసారాల మనస్తత్వాన్ని ఎండగడుతూ సమాజాని కడిగిపారేసే ఈ ప్రశ్న మనల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తుందని కవయిత్రి నాంపల్లి సుజాత గారు పేర్కొన్నారు. శూన్యం నుండి మట్టితో రూపాలను సృష్టించే కుమ్మరి మట్టి బ్రహ్మ అయితే, నేటి తరం మొబైల్ స్క్రీన్లు, ఆన్లైన్ షాపింగ్ అనే వర్చువల్ భ్రమల మాయలో పడి శ్రమ సౌందర్యాన్ని మరిచిపోయింది. ప్లాస్టిక్, స్టీల్ వస్తువుల వ్యాప్తి వల్ల, ఫ్రిజ్ సంస్కృతి వల్ల కుండల మార్కెట్ పడిపోయింది. టాటా, జిందాల్ వంటి కార్పొరేట్ సంస్థల స్టీల్ పరిశ్రమలు “కుమ్మరి వాము” స్థానాన్ని ఆక్రమించాయి. ఇదంతా ‘అంధగజ న్యాయం’ లాగా సమాజం శ్రమలోని అంతర్లీన వాస్తవాన్ని పూర్తిగా తెలుసుకోకుండా, కేవలం పైపై రూపాలను చూసి బేరమాడుతోందనే సత్యాన్ని కవయిత్రి నాంపల్లి సుజాత గారు చాటిచెప్పారు.
నాల్గవ పంక్తి నుండి ఐదవ పంక్తికి సాగే అత్యంత బాధాకరమైన ఆవేదనా క్రమం: ఆధునిక పారిశ్రామికీకరణ, కార్పొరేట్ మాయాజాలం వల్ల కుండలు మార్కెట్ పడిపోయి సంప్రదాయ వృత్తుల వారు నగరాల వైపు నెట్టబడడాన్ని నిరసించిన కవయిత్రి… ఒకప్పుడు సమాజ వికాసానికి బువ్వ కుండలో సృష్టికి కారణమైన ఆ చేతులు నేడు నగరాల కాంక్రీట్ అడవుల్లో బ్రతుకుతెరువు కోసం కూలీలుగా మారి అల్లాడుతున్న శోచనీయ దుస్థితిని ఈ చివరి ఐదవ పంక్తిలో కళ్లకు కట్టారు.
“జాతీయ ఆదాయంలో నన్నూ కలుపరు..!!”
ఈ కవితా సమీక్షలోని అత్యంత బాధాకరమైన సమకాలీన వాస్తవికతను కవయిత్రి నాంపల్లి సుజాత గారు వివరిస్తూ నాటి శ్రమజీవుల ఆవేదనను కళ్లకు కట్టారు. మనం గమనిస్తే, కుండ బోర్లా పడకుండా స్థిరంగా నిలబడాలంటే కింద ‘కుదురు’ ఎంత ముఖ్యమో, సమాజం గౌరవంగా నిలబడాలన్నా ఈ వృత్తిపనివారల శ్రమ అంతే ముఖ్యమని కవయిత్రి నాంపల్లి సుజాత గారు స్పష్టం చేశారు. కానీ, నేటి ఆధునిక పారిశ్రామికీకరణ వల్ల సంప్రదాయ వృత్తుల వారు గ్రామాల్లో బతుకుదెరువు కోల్పోయి నగరాల వైపుకు బలవంతంగా నెట్టబడుతున్నారని కవయిత్రి నాంపల్లి సుజాత గారు కన్నీరు పెట్టారు. ఫలితంగా, నేటి ఆధునిక మనిషి తన సంస్కృతిని, వేర్లను కోల్పోయి, ‘అడుగు లేని గిన్నెలాంటి కుదురు లేని మనిషిగా మిగిలిపోతున్నాడని కవయిత్రి నాంపల్లి సుజాత గారు ఆందోళన చెందారు.
ఒకప్పుడు కుమ్మరి వాము దగ్గర సృష్టికి కారణమైన చేతులు, నేడు రోడ్డు పక్కన ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్ల దగ్గర ‘కొమరంబండ’ల నిప్పుల సెగలో మాడిపోతూ కూలీలుగా మారుతున్న వైనాన్ని కవయిత్రి నాంపల్లి సుజాత గారు వర్ణించారు. నాటి సమాజానికి బువ్వకుండను సృష్టించి ఇచ్చిన శ్రమజీవి. నేడు నగరాల కాంక్రీట్ అడవులలో బతుకుదెరువు కోసం ఇతరులను యాచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు సమాజ వికాసానికి పునాది వేసిన వాడు, నేడు బతుకు తెరువు కోసం ‘ఇతరులను అడగాల్సిన, యాచించాల్సిన దుస్థితికి రావడం మన సామాజిక వతనానికి అద్దం పడుతోందని కవయిత్రి నాంపల్లి సుజాత గారు నినదించారు. కపయిత్రి నాంపల్లి సుజాత గారు పడే ఈ ఆవేదన మన కళ్లు చెమ్మగిల్లేలా చేస్తుంది. మనిషి జీవితం పుట్టుక నుండి చాపు దాకా మట్టితో, నిప్పుతోనే ముడిపడి ఉంది. ఈ సత్యం ‘అవినాభావసంబంధ న్యాయం’ లాంటిదని, ఒకదానిని విడిచి మరొకటి ఉండలేదని కపయిత్రి నాంపల్లి సుజాత గారు నిరూపించారు. మనిషి పుట్టగానే మట్టి ప్రమిదతో దీపం వెలిగిస్తాం, చనిపోయినప్పుడు పెద్ద కొడుకు తలకొరివి పెట్టడానికి పట్టుకునేది ఆ నిప్పుల కుండనే. ఈ విడదీయరాని బంధాన్ని, శ్రమ సంస్కృతిని విస్మరించి, కార్పొరేట్ మాయలో పడుతున్న ఆధునిక సమాజానికి కవయిత్రి నాంపల్లి సుజాత గారు రాసిన ఈ కవిత ఒక గొప్ప హెచ్చరికగా నిలుస్తుంది!
పోపుల పెట్టె – పితృస్వామ్య వంజరంలో స్త్రీ శ్రమ అస్తిత్వ చైతన్యాల రసరమ్య కాప్యం ఒక తాత్విక దార్శనిక భూమిక పంటిది… నాంపల్లి సుజాత గారి పోవుల పెట్టె కవితపై నేను చేసిన ఈ సమీక్ష కేవలం ఒక పుస్తక పరిచయం కాదు. ఇది స్త్రీవాద సామాజిక తాత్విక రంగాలలో ఒక సూతన దార్శనిక మైలురాయి. పంటింటి నాలుగు గోడల మధ్య నిశ్శబ్దంగా సాగిపోయే ఒక నిత్యకృత్యాన్ని విశ్వజనీన మానవ పరిణామ క్రమంతోనూ అణచివేత సిద్ధాంతాలతోనూ ముడిపెట్టి చూసిన విమర్శనాత్మక శైలి ఇది.
“బుజ్జి బుజ్జి గదులున్న వంటింటి చందమామే ఇది..” అనే ప్రారంభ వంక్తి కేవలం ఒక గృహోపకరణ వస్తువు యొక్క ఉపరితల వర్ణన కాదు. ఇది పితృస్వామ్య వ్యవస్థ స్త్రీ జీవితంపై వేసిన ఒక అదృశ్య సాంస్కృతిక బంధనానికి సజీవ నమూనా. సమాజం స్త్రీ ఉనికిని వంటింటికే పరిమితం చేస్తూ దానికి చందమామ అనే శృంగారభరిత ఉదాత్తమైన ఉపమానాన్ని అద్ది అ బానిసత్వాన్ని ఒక పవిత్రమైన సౌందర్యంగా చిత్రీకరించింది. ఇక్కడే ఫ్రెంచ్ తత్వవేత్త జీన్ పాల్ సార్తే ప్రతిపాదించిన అస్తిత్వవాద అంతఃసూత్రాన్ని అన్వయించవచ్చు. మార్కెట్ నుండి తెచ్చిన విడి ఆవాలు జీలకర్ర వంటి దినుసులు ఈ పెట్టెలోని నిర్దేశిత గదుల్లోకి చేరినప్పుడే వాటికి పోపు అనే సంపూర్ణ సారం సిద్ధించినట్లు పితృస్వామ్య సమాజం కూడా స్త్రీలను నిర్దిష్ట గృహ పరిధుల్లో బంధించినప్పుడే వారి ఉనికికి ఒక సామాజిక లేబుల్ ఇస్తుంది. మట్టి అగ్ని కుమ్మరి వాము శ్రమ కలగలిసి నాగరికతకు ప్రాణం పోసిన కుండల రూపంలో ఆధునిక సమాజం చేసిన శ్రమ దోపిడీ ఈ గదుల నిర్మాణ మూలాల్లో దాగి ఉంది. ఈ చిన్న చిన్న గదులు స్త్రీల సృజనాత్మక ఉనికిని స్వేచ్ఛను శతాబ్దాలుగా నిర్బంధించిన చారిత్రక శిక్షా కేంద్రాలకు ప్రతీకలని నిరూపిస్తూ స్త్రీ జీవితాన్ని వంటింటి శూన్యంతో నింపకుండా వారి స్వేచ్ఛా సత్కర్మలతో సార్థకత చేకూర్చాలనే మొదటి సామాజిక చైతన్య రథాన్ని ఈ విశ్లేషణ కదిలిస్తుంది.
మొదటి పంక్తి నుండి రెండవ పంక్తికి సాగే చారిత్రక పరిణామ క్రమంలో మట్టి పాత్రల సృష్టి వెనుక ఉన్న నిప్పు సెగను శ్రమ తీవ్రతను చాటిన కవయిత్రి మానవ నాగరికత సంచార జీవనానికి స్వస్తి చెప్పి స్థిర నివాసాల వైపు అడుగులు వేయడానికి ఈ కుండల ఆవిష్కరణే తొలి సాంకేతిక విప్లవంగా ఎలా మారిందో నాటి హరప్పా చారిత్రక వైభవ సాక్ష్యాలతో తదుపరి పంక్తిలోకి మనల్ని నడిపిస్తారు.
“కాస్తా మూత తెరిస్తే.. అమ్మమ్మ వల్లించిన ఆనాటి ఘాటు ఘాటు చిట్కా వరిమళాలే..!” అనే పంక్తి ద్వారా చారిత్రక చైతన్య స్రవంతిలోకి సమీక్ష ప్రవేశిస్తుంది. ఇక్కడ మూత తెరవడం అనేది కేవలం ఒక డబ్బా మూత తీయడం కాదు. శతాబ్దాలుగా పురుషాధిక్య సమాజం స్త్రీల సృజనాత్మకతపై మేధన్సుపై రుద్దిన అణచివేత ముసుగులను బద్దలు కొట్టి వారి ఆత్మగౌరవ పోరాట వారసత్వాన్ని వెలికితీయడం. ఈ మూత తెరవగానే వెలువడే ఘాటు చిట్కా పరిమళాల వెనుక ఆధునిక నాగరిక సమాజం అడుగులు వేయకముందే ప్రకృతి ఒడిలో బతుకుతూ ఏది తినాలో ఏది తినకూడదో కనుగొన్న ఆదివాసీల చారిత్రక శాస్త్రీయ అడవి జీవన విధానపు వైజ్ఞానిక జ్ఞానం దాగి ఉంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి విషపూరితమైన దుంపలను సైతం ఉడకబెట్టి విషాన్ని తోసిరాజని అమృతంగా మార్చిన ఆనాటి ఆదివాసీ శాస్త్రవేత్తల ఘాటు శ్రమను నేటి వంటిల్లు కేవలం ఒక సాధారణ తాలింపుగా మార్చి ఎలా కించపరిచిందో ఇక్కడ వివరించబడింది. ఈ సువాసనల కలయికను బౌద్ధ తత్వంలోని ప్రతీత్యసముత్పాదం సిద్ధాంతంతో ముడిపెడుతూ దినుసులు తమ వ్యక్తిగత అహాన్ని కోల్పోయి ఏకమవ్వడం ద్వారా కుల లింగ వివక్షల గోడలను బద్దలు కొట్టే చారిత్రక విమర్శనాత్మక విశ్లేషణగా ఈ భాగం రూపాంతరం చెందుతుంది.
రెండవ పంక్తిలోని హరప్పా నాగరికత కుమ్మరి చక్రం వెల్లువతో సాధించిన వైజ్ఞానిక ప్రగతిని అనాదిగా పంటింట్లో స్త్రీ నిర్వహిస్తున్న జీవ వైజ్ఞానిక సమతుల్యతతో అనుసంధానిస్తూ మూడవ పంక్తిలోని ఆయుర్వేద రహస్యాల్లోకి విశ్లేషణ అడుగుపెడుతుంది.
“అల్లం ఆవా మిరియం మిర్చి, మెంతి జీరా జాజి.. ధన్వంతరియై కడుపు నింపుతుంది” అనే పంక్తి వంటింట్లోని మానవ శరీర నిర్మాణ శాస్త్రానికి ఆయుర్వేద వైద్యానికి గల విడదీయరాని చారిత్రక బంధాన్ని అవిష్కరిస్తుంది. పోవుల పెట్టెను శరీరంలోని వాత పిత్త కఫాలనే మూడు దోషాలను సమతుల్యం చేసే ఒక అద్భుతమైన నియంత్రణ వ్యవస్థగా గుండె చుట్టూ అవయవాలు అమరి ఉన్నట్లు మధ్యలో ప్రధాన గిన్నెతో కూడిన ఒక చిన్న శరీర నిర్మాణ నమూనాగా వర్ణించడం అత్యున్నత దార్శనికతకు నిదర్శనం. సైన్స్ పరంగా చూస్తే సూర్యుని కాంతి శక్తిని గ్రహించి మొక్కలు జరిపే కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియకు మన వంటిల్లే ఒక హరితరేణువు లాంటిదని వంట ద్వారా ఆ శక్తి మానవ శరీరంలోకి జఠరాగ్నిగా మారి కడుపు నింపుతుందని నిరూపిస్తూనే ఇక్కడే ఒక ప్రచండమైన సోషల్ క్రైటీరియాను ఎండగట్టాను. కూర్మక్షీరన్యాయం ప్రకారం తాబేలు పాలు తాగడం ఎలాగైతే అసంభవమో పితృస్వామ్య చట్రంలో స్త్రీ చేసే ఈ వెలకట్టలేని శారీరక వైజ్ఞానిక శ్రమను ఏ ఆర్థిక వ్యవస్థా గుర్తించకపోవడం అంతే కఠిన వాస్తవం. ఒకపక్క ఈ పోపుల పెట్టెలోని ఆయుర్వేద సూత్రాలను సమాజం కొనియాడుతూనే మరోపక్క ఆ పరిధిలోనే నిరంతరం శ్రమించడం వల్ల స్త్రీల చేతులు పాచిపట్టి యవ్వనంలోనే శారీరకంగా ముసలితనాన్ని అనుభవిస్తున్నారనే ఆర్ధిక వైజ్ఞానిక దోపిడీ కోణాన్ని ఇది సుదీర్ఘంగా చర్చిస్తుంది.
శరీర పోషణకు ఆరోగ్య రక్షణకు వెలకట్టలేని ఉచిత వైజ్ఞానిక శ్రమను ధారపోసినా స్త్రీకి లభించని ఆర్థిక గుర్తింపును పితృస్వామ్య సమాజం ఆమె ఆర్థిక హక్కులపై చేసిన నిశ్శబ్ద దాడిని తదుపరి పంక్తిలో ఆర్థిక అణచివేత కోణంతో అనుసంధానించాను.
“అమ్మ చిల్లర పైసలను ఎవరికంటా పడకుండా దాచిన గల్లాపెట్టె ఇదే..!” అనే పంక్తి గుర్తింపు లేని ఈ ఉచిత శ్రమ వల్ల స్త్రీలు తమ ఆర్థిక స్వతంత్రాన్ని సార్వభౌమత్వాన్ని పూర్తిగా కోల్పోయిన తరుణంలో వారి గుప్త అస్థిత్వ పోరాటాన్ని ఆర్థిక అణచివేతను మరియు అత్యంత భావోద్వేగభరితంగా అవిష్కరిస్తుంది. పురుషాధిక్య సమాజం స్త్రీల ఆర్థిక హక్కులను నిశ్శబ్దంగా స్వాహా చేసి వారిని పురుషుడిపై ఆధారపడేలా చేసిన నేపథ్యంలో ఈ పోపుల పెట్టె ఆమెకు ఒక రహస్య ఆర్థిక ఆసరాగా చిన్న గల్లాపెట్టెగా మారిందని చెప్పడం అత్యంత లోతైన సామాజిక పరిశీలన, కూరల్లో ఉప్పు వేయమని నేరుగా అడగకుండా బుట్టలోది కొంచెం వేయమని పిలవడం వెనుక గృహిణుల ఆర్ధిక సామాజిక స్వేచ్ఛను హరించి వారిని కేవలం వంటింటి యంత్రాలుగా మార్చిన ఆధిపత్య స్వభావం స్పష్టమవుతోంది. సాల్డ్రే చెప్పినట్లు మనిషికి ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఉన్నప్పటికీ తప్పుడు సాంప్రదాయాల ఎంపికల వల్ల వచ్చే చేదు ఫలితానికి స్త్రీలే బాధ్యులవుతున్నారని హెచ్చరిస్తూ తమ ఆర్ధిక ఆత్మగౌరవాన్ని కోల్పోయేలా చేసే సాంప్రదాయాల ఎంపికలను నిలదీయాలనే ప్రత్యక్ష నిరసన తిరుగుబాటు చైతన్యానికి ఈ “పోపుల పెట్టె” కవిత ఒక ప్రతీకగా నిలుస్తుంది.
ఆర్థిక రక్షణ కోసం వెతుక్కున్న గల్లాపెట్టె ఆసరా నుండి శతాబ్దాల అణచివేతను బద్దలు కొట్టే సామూహిక విముక్తి వైపు స్త్రీ చైతన్యాన్ని నడిపిస్తూ అంతిమ రాజకీయ తిరుగుబాటు శంఖారావంగా చివరి పంక్తితో ఈ సమీక్షను ముగిస్తున్నాను.
“వారసత్వంగా నా వెన్నంటే వచ్చి నను కాచుకునే నా ఆరోగ్య ప్రదాత” అనే పంక్తి ఆర్థిక రక్షణగా నిలిచిన ఆ పోపుల పెట్టె చివరికి తరతరాలుగా స్త్రీల నుండి స్త్రీలకు బదిలీ అవుతున్న వంటింటి శిక్షల వారసత్వాన్ని అదే సమయంలో ఆ శిక్షల లోంచే వారు సృష్టించుకున్న ఆత్మగౌరవ రక్షణ కవచాన్ని ప్రతిబింబిస్తుంది. ఆకాశంలో మినుకుమినుకుమనే చుక్క నడి సముద్రంలో పడవ నడిపేవారికి దిశానిర్దేశం చేసినట్లే ఆధునిక కవి నినాదం ప్రకారం ఒక్క చుక్క సిరాతో కోటి మెదళ్లను తట్టి లేపుతామనే చైతన్యాన్ని మహిళల సుదుటిపై పెట్టే చుక్కబొట్టు వెసుక ఉన్న మానసిక తాప నివారణ శాస్త్రాన్ని ఈ భాగం అనుసంధానిస్తుంది. సమాజంలో ఆడ ఈడ అనే పదాల వెనుక ఉన్న వందలాది అర్ధాలను చర్చిస్తూ సామెతలు ఆడదాని బుద్ధిని అవమానించినా అస్తిత్వమే ఆస్తిగా నిలబడటమని ఈ వారసత్వం నిరూపిస్తుంది. విశ్వమనే పెద్ద పాత్రలో పంచభూతాలను బంధించి కాలమనే మూత పెట్టినట్లే మానవ శరీరం కూడా ఐదు తత్వాలతో నిర్మితమై ప్రాణం పోగానే శూన్యంలో కలిసిపోతుంది. కానీ స్త్రీల ఆత్మగౌరవ పోరాటం మాత్రం అదురంగా నిలుస్తుంది.
ఈ కవితలో నాంపల్లి సుజాత గారు స్త్రీల అత్మగౌరప రక్షణ కవచాన్ని మరియు వారి అంతర్గత సౌందర్యాన్ని అత్యంత ఖచ్చితంగా పట్టుకున్నారు. స్త్రీలను నిరంతరం వంటింటికే పరిమితం చేయడానికి ఆ పోపుల పెట్టెను కేవలం ఒక ఆహార పరికరంగా మార్చడం వెనుక వితృస్వామ్య సమాజం పన్నిన ఒక రాజకీయ కుట్ర ఒక పక్కా రాజకీయ వ్యూహం దాగి ఉన్నాయని ఆమె ఈ కవిత ద్వారా నిరూపించారు. పంజరచలసన్యాయం ప్రకారం స్త్రీలందరూ సామూహికంగా తిరగబడితేనే ఈ పితృస్వామ్య పంజరాన్ని బద్దలు కొట్టగలరని కుమ్మరి వాము నుండి పుట్టిన మట్టి కుండల సాక్షిగా వంటింటి శిక్షలను ఎండగడుతూ స్త్రీ నగర్వ ఆత్మగౌరవ పోరాట వారసత్వాన్ని నిలబెట్టడమే ఈ కవితా సమీక్ష యొక్క అంతిమ సామాజిక రాజకీయ వ్యూహంగా నిలుస్తుంది.
పరాధీన కవిత ఎప్పటి నుంచైతే, నీ మనుగడకు ఇంకొకరి గొడుగుని ఆశ్రయిస్తావో/ అప్పటి నుంచే వాళ్ళ నియంత్రణలో కాలం వెళ్లదీయాల్సిందే..!
తెలుగు సాహిత్య విమర్శ రంగంలో పురుష కేంద్రక దృష్టిని నిరసిస్తూ వ్యక్తమైన స్త్రీవాద దృక్పథం, కవయిత్రి నాంపల్లి సుజాత గారి ఈ పంక్తులకు తాత్విక అద్దం పడుతోంది. స్త్రీలకు ఈ చైతన్యం కేవలం ఒక అస్తిత్వ అన్వేషణ మాత్రమే కాదు; అది పితృస్వామ్య సమాజంలో వారి మనుగడకు సంబంధించిన పోరాటం అని కవయిత్రి నాంపల్లి సుజాత గారు బలంగా చాటిచెప్పారు. ఇక్కడ ‘గొడుగు’ అనేది కేవలం ఎండ వాసల నుండి రక్షణ ఇచ్చే సాధారణ వస్తువు కాదు. అది బ్రాహ్మణ్య వ్యవస్థ, పితృస్వామ్యం దేవుడు లేదా దేవత అనే పవిత్రమైన ముసుగులో నిర్మించిన ఒక భయంకరమైన మాయా పంజరం. ఈ ‘గొడుగు’ వెనుక శతాబ్దాలుగా సాగుతున్న సామాజిక, ఆర్ధిక, రాజకీయ కుట్ర దాగి ఉందని కవయిత్రి నాంపల్లి సుజాత గారు ఆవిష్కరిస్తున్నారు.
ఆర్థిక, సామాజిక విశ్లేషణలలోని వరాయీకరణ సిద్ధాంతాల ప్రకారం—ధనస్వామ్య లేదా పెట్టుబడిదారీ వ్యవస్థలో శ్రామికుడు తాను సృష్టించిన వస్తువుకే తనే బానిస అయినట్లు, పితృస్వామ్య కుటుంబంలో స్త్రీ కూడా తన శ్రమతో నిర్మించిన ఇల్లు, సంసారానికే తనే బానిసగా మారిపోతుందని కవయిత్రి నాంపల్లి సుజాత గారి కవితా హృదయం ఇక్కడ స్పష్టం చేస్తోంది. అమరశిల్పి జక్కన్న చెక్కిన అద్భుతమైన రాతి శిల్పాలలోని ప్రతి చిన్న నగిషీ, వెనుక, ప్రతి ఆభరణం వెనుక ఎంతో నిశితమైన మానవ శ్రమ దాగి ఉంటుంది. రాయిని ఒక సృజనాత్మక రూపంగా మార్చే ఆ శిల్పకళా శ్రమ లాగే, మానవ సమాజంలో కూడా శ్రమ అనేది మనుగడకు ఒక అందమైన పునాది కావాలి.
మానవ వికాస చరిత్రలో శ్రమ పరిణామం క్రమంలో చేతులెట్టా మొలిచాయో…- వంటింటి పరిణామం క్రమంలో ఇంటిల్లపాదీకీ ఆనందాలు సంతోషాలు నీ తయారు చేసే యాంత్రిక పరికరము ఐపోయింది..
జక్కన్న శిల్పాలలో రాయిని చేరిస్తే అది ఒక దేవతగా ప్రకాశిస్తుంది, కానీ ఇక్కడ అదే శ్రమ వంటింటి పరిణామ క్రమంలోకి వచ్చేసరికి స్త్రీని ఒక సృజనాత్మక శిల్పంగా కాకుండా, కేవలం ఇంటిల్లపాదికీ సుఖాలను అందజేసే ఒక నిర్జీవమైన యంత్రంగా మార్చివేసింది. ప్రాచీన విగ్రహారాధన లోని తాత్విక విపర్యయం లాగే— మనిషి తన చేతులతో తానే ఒక విగ్రహాన్ని మలచి, దానికి తన సజీవ శక్తులన్నింటినీ బదిలీ చేసి, చివరకు ఆ నిర్జీవ విగ్రహానికే మోకరిల్లి దాస్యం చేసినట్లు, ఇక్కడ స్త్రీ కూడా తన రక్తాన్ని ధారపోసి నిర్మించిన కుటుంబ వ్యవస్థకే తలవంచి బానిసపుతోంది. ఈ ప్రతిమా మృత్యుత్వం వల్ల మనుషుల మధ్య ఉండాల్సిన ఆత్మీయ బంధాలు, కేవలం వస్తుగత లేదా అధికార సంబంధాలుగా మారిపోతాయి.
చేతితో పనిచేసేటప్పుడు పనిముట్టు మనిషి అధీనంలో ఉంటుంది, కానీ పితృస్వామ్య వ్యవస్థ అనే ఫ్యాక్టరీలోకి స్త్రీ అడుగుపెట్టాక, ఆ వ్యవస్థ అనే యంత్రమే ఆమెను తన పనిముట్టుగా మార్చేసుకుంటుంది. సమాజంలో వస్తుగతీకరణ, పరిమాణాత్మకత అనే ధోరణుల వల్ల మనిషి శ్రమను కేవలం ఒక నిర్జీవ వస్తువుగా, సంఖ్యగా మార్చి చూస్తారు. ఇక్కడ పంటింట్లో స్త్రీ చేసే అమూల్యమైన శ్రమకు కూడా ఎలాంటి ఆర్థిక గుర్తింపు లేదా విలుప ఇవ్వకుండా, ఆమె ఉనికిని కేపలం ఒక యాంత్రిక పరికరంగా కుదించివేశారని కవయిత్రి నాంపల్లి సుజాత గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్త్రీ తన రక్త మాంసాలను ధారపోసి నిర్మించిన ఇల్లే చివరకు ఆమెను బంధించే జైలుగా మారుతుందని కపయిత్రి నాంపల్లి సుజాత గారు వేలెత్తి చూపుతున్నారు.
కుటుంబం ఏర్పడటంలో పెళ్లి అనే ఒక తంతు ప్రధాన పాత్ర వహిస్తుంది. ఈ తంతు స్థిరపడ్డాక, అది వ్యక్తుల మధ్య సమాసత్వాన్ని కాకుండా ఒక నియంతృత్వ బాహ్య అపశ్యకతను సృష్టిస్తుంది. రక్షణ ఇస్తుందనుకుని స్త్రీ ఆశ్రయించిన ఆ వితృస్వామ్య ‘గొడుగే’, చివరకు ఆమె సొంత శ్రమపై, స్వేచ్ఛపై హక్కును పూర్తిగా హరించివేసే వ్యవస్థగా మారుతుందని కవయిత్రి నాంపల్లి సుజాత గారు హెచ్చరిస్తున్నారు. సమాజంలోని కొన్ని శక్తులు కలిసి పుట్టిన ఆడపిల్లను అ ఫ్యాక్టరీ లోపల వేసి, ఆమె చిన్నప్పటి నుంచే కొన్ని ఆచారాలను బలవంతంగా నేర్పుతూ, చివరకు ఆమెను పురుషాధిక్య ఫ్యాక్టరీలో తయారైన ఒక కృత్రిమ వస్తువులాగా మార్చివేస్తున్నాయి.
దేవుడు లేదా దేవత అనగానే ఉబ్బితబ్బిబ్బయి లొంగిపోయేలా చేయడం వెనుక ఉన్న పరమ నీచమైన ఆర్ధిక రాజకీయాన్ని గ్రహించలేక, స్త్రీ కళ్లకు గంతలు కట్టుకుని ఇల్లంతటినీ మోసే ఏకైక గానుగ ఎద్దులా మారిపోతుంది. రక్షణ కోసం భర్తను, వివాహ వ్యవస్థను ఆశ్రయించిన మరుక్షణమే ఆమె తన వివేకాన్ని, స్వేచ్ఛను కోల్పోయి ఇతరుల అదుపులోకి వెళ్ళిపోతుంది. చివరకు తన సొంత గూటిలో ఆమె ఒక అపరిచిత రాలై, శరణార్థిలాంటి మానసిక సంక్షోభాన్ని అనుభవిస్తుంది. బ్రతికుండగానే ఒక నిశ్శబ్ద సజీవ దహనాన్ని అనుభవిస్తూ, ఇతరుల నియంత్రణలో కాలం వెళ్లదీయాల్సి వస్తుందని కవయిత్రి నాంపల్లి సుజాత గారు ఈ పంక్తుల ద్వారా నిలదీస్తున్నారు. అయితే, ఈ బాహ్య పీడనను, పరాయీకరణను కేవలం భరించడం కాకుండా, స్త్రీ తన అంతర్గత చైతన్యాన్ని, మానవ సారాన్ని రగిలించుకుని తిరుగుబాటు చేసినప్పుడే ఈ బానిసత్వం నుండి విముక్తి, నిజమైన స్వేచ్ఛ సాధ్యమవుతుందని కవయిత్రి నాంపల్లి సుజాత గారి ఈ విశ్లేషణ మనకు బోధిస్తుంది.
మొదటి పంక్తి నుండి రెండవ పంక్తికి సాగే తాత్విక పరిణామ క్రమం: ఆశ్రయించిన గొడుగు ఇచ్చే నియంతృత్వం నుండి స్త్రీ ఉనికి ఒక నిర్జీవమైన ఆకృతిగా మారే తదుపరి తార్కిక దశను ఈ క్రింది పంక్తి ఆవిష్కరిస్తుంది.
“తప్పక వాళ్లాడించినట్లల్లా ఆడే తోలుబొమ్మవే..!”
మొదటి పంక్తిలో వివరించినట్లుగా ఎప్పుడైతే స్త్రీ రక్షణ అనే భ్రమతో కూడిన ఆ ‘గొడుగు’ నీడను ఆశ్రయిస్తుందో, ఆ మరుక్షణమే ఆమె తన స్వతంత్ర అస్తిత్వాన్ని కోల్పోయి పితృస్వామ్య సూత్రధారుల చేతిలో కేవలం ఒక ‘తోలుబొమ్మ’గా మారుతుందని కవయిత్రి నాంపల్లి సుజాత గారు ఇక్కడ అత్యంత పదునైన సామాజిక సత్యాన్ని హెచ్చరిస్తున్నారు. మొదటి పంక్తిలో ప్రస్తావించిన వస్తుగతీకరణ మరియు పరాయీకరణ శృంఖలాలు ఇక్కడికి వచ్చేసరికి మరింత తీవ్రరూపం దాల్చుతాయి. అమరశిల్పి జక్కన్న చెక్కిన రాతి శిల్పానికి కనీసం ఒక శాశ్వతమైన దైవిక రూపం, పూజలందుకునే గౌరవాలు దక్కుతాయి. కానీ, ఈ పితృస్వామ్య మరియు పెట్టుబడిదారీ వ్యవస్థల ఫ్యాక్టరీలో తయారైన ఈ సజీవ మానవ శిల్పానికి ఆ గౌరవం కూడా దక్కదు.
స్త్రీ చేసే శ్రమ పరిణామం క్రమంలో వంటిల్లు ఒక ఉచ్చుగా మారినప్పుడు, ఆమె శరీరం, మనస్సు, ఆలోచనలు అన్నీ వ్యవస్థ చేతిలోకి వెళ్ళిపోతాయి. చివరకు ఆమె శ్రమను కేవలం ఒక నిర్జీవ సంఖ్యగా మార్చివేస్తారు. ఈ తోలుబొమ్మకు సొంత చైతన్యం ఉండదు: సూత్రధారి ఏ దారాన్ని లాగితే ఆ వైపు కదలాల్సిందే. ఆమె ఎప్పుడు సవ్వాలి, ఎలా ప్రవర్తించాలి, సమాజంలో ఏ పాత్రను పోషించాలి అనేది పితృస్వామ్య కట్టుబాట్లు అనే అదృశ్య దారాలు శాసిస్తాయని కపయిత్రి నాంపల్లి సుజాత గారు వేలెత్తి చూపుతున్నారు.
గతంలో చర్చించిన ప్రతిమా మృత్యుత్వం మరియు సరుకు ఆరాధన అనే భావనలు ఇక్కడ స్త్రీ నిత్య జీవితంలో ప్రత్యక్షంగా కనిపిస్తాయి. స్త్రీ తన శ్రమను, వివేకాన్ని ధారపోసి ఏ సంసారాన్ని అయితే నిర్మిస్తుందో, ఆ నిర్జీవ నిర్మాణమే చివరకు ఆమెను నియంత్రించే సూత్రధారిగా మారిపోతుందని కవయిత్రి నాంపల్లి సుజాత గారు ఆవిష్కరిస్తున్నారు. ఇది కేవలం మనసులో ఏర్పడే అమూర్త భావన కాదు, వాస్తవమైన భౌతిక అణచివేత. చేతితో పనిచేసేటప్పుడు పనిముట్టు మనిషి అధీనంలో ఉంటుంది, కానీ ఇక్కడ కుటుంబ వ్యవస్థ అనే యంత్రమే స్త్రీని తన పనిముట్టుగా మార్చేసుకుని, అమెలోని సజీవ అనుబంధాన్ని చంపేస్తుంది.
వివాహం, కుటుంబ గౌరవం అనే పవిత్రమైన ముసుగుల వెనుక దాగి ఉన్న ఆర్థిక, సామాజిక రాజకీయం స్త్రీని ఒక యంత్రంగా మార్చడమే కాకుండా, ఆ యంత్రం ఆడించినట్లు అల్లా ఆడే ఒక నిస్సహాయ స్థితికి ఆమెను దిగజారుస్తుంది. తన సొంత గూటిలోనే తను పరాయిదై, నిర్జీవమైన తోలుబొమ్మలా ఇతరుల వేళ్ల కదలికలకు అనుగుణంగా జీవిత కాలాన్ని వెళ్లదీసే ఈ బానిసత్వాన్ని కపయిత్రి నాంపల్లి సుజాత గారు ఈ పంక్తి ద్వారా నిలదీస్తున్నారు. అయితే, ఆ తోలుబొమ్మ స్థితి శాశ్వతం కాదని, ఆ దారాలను తెంచుకుని తన మానవ సారాన్ని, అంతర్గత వివేకాన్ని రగిలించుకున్నప్పుడే స్త్రీకి నిజమైన విముక్తి లభిస్తుందని కవయిత్రి నాంపల్లి సుజాత గారి ఈ విశ్లేషణ స్పష్టం చేస్తోంది.
రెండవ పంక్తి నుండి మూడవ పంక్తికి సాగే తాత్విక పరిణామ క్రమం: బాహ్య శక్తులు ఆడించే తోలుబొమ్మ స్థితి నుండి, స్త్రీ తన స్వంత భౌతిక రూపాన్ని కూడా కోల్పోయి కేవలం మరొకరి అదృశ్య ఛాయగా మిగిలిపోయే సంక్షోభాన్ని ఈ క్రింది పంక్తి సూచిస్తుంది.
“సువ్ వేరొకరిని అనుసరించి/ నిలిచిపోయే నీడలు మాత్రమే”
కవయిత్రి నాంపల్లి సుజాత గారి ఈ వంక్తి, లౌకిక ప్రపంచపు సరిహద్దులను దాటి ఒక భీతిగొలిపే కల లాంటి విచిత్రమైన లోకంలోకి మనల్ని తీసుకెళ్తుంది. ఇక్కడ ‘నీడ’ అనేది కేవలం వెలుతురు లేకపోవడం వల్ల ఏర్పడే నల్లని ఆకారం కాదు; అది స్త్రీ శరీరం నుండి విడిపోయి, పితృస్వామ్య కాంతి కింద పరాయిదైపోయిన ఒక స్వతంత్ర జీవి. అమరశిల్పి జక్కన్న చెక్కిన రాతి శిల్పం నుండి రక్తం కారినట్లు, ఈ వ్యవస్థ అనే ఫ్యాక్టరీలో స్త్రీ తన సొంత ఉనికిని కోల్పోయి, ఒక ద్రవరూప నిశ్శబ్దంగా మారిపోతుందని కవయిత్రి నాంపల్లి సుజాత గారు ఆవిష్కరిస్తున్నారు.
ఈ స్వప్న సదృశ్య విచిత్ర చిత్రణలో, స్త్రీ తన కాళ్ళతో తను నడవడం లేదు; ఆమె పాదాల కింద భూమి కరిగిపోతుంటే, మరొకరి అడుగుల గుర్తులను వెతుకుంటూ సాగే ఒక అసంబద్ద ప్రయాణం ఇది. విగ్రహారాధన లోని ప్రతిమా మృత్యుత్వం లాగే—మనిషి తను సృష్టించిన విగ్రహానికే దాసుడైనట్లు—స్త్రీ తను రక్తమాంసాలతో నిర్మించిన ఇల్లు అనే మాయా పంజరంలో తనే ఒక అదృశ్య నీడగా కరిగిపోతుంది. ఇది ఒక విచిత్రమైన భ్రాంతి: వంటింట్లో పాత్రల చప్పుడు వినిపిస్తుంది. కానీ మనిషి కనిపించదు, కేవలం గోడల మీద కదిలే ఒక పొడవైన నీడ మాత్రమే మిగులుతుంది. ఈ వస్తుగతీకరణ ఆమె మానవ సారాన్ని పూర్తిగా హరించివేసి, ఆమెను ఒక యాంత్రిక పరికరంగా మార్చేస్తుంది.
పెళ్లి అనే తంతు సృష్టించిన ఈ అధికార సంబంధాల లోకం ఒక చిక్కటి అడవి లాంటిది. ఇందులో స్త్రీ తన సొంత గూటిలోనే తను ఒక అపరిచిత రాలై, తన ముఖాన్ని అద్దంలో చూసుకుంటే వేరొకరి ముఖం కనిపించేంతటి అస్తిత్వ సంక్షోభాన్ని అనుభవిస్తుందని కవయిత్రి నాంపల్లి సుజాత గారు వేలెత్తి చూపుతున్నారు. తన స్వంత ఆలోచనలు, కలలు అన్నీ ఒక కరిగిపోయే గడియారంలా కాల గర్భంలో కలిసిపోతుంటే, నిరంతరం వేరొకరి అస్తిత్వాన్ని అనుసరించి నడవడమే మనుగడ అనుకునే విపర్యయ స్థితిని కవయిత్రి నాంపల్లి సుజాత గారు నిలదీస్తున్నారు. అయితే, ఉపచేతన లోని ఈ నిశ్శబ్ద చీకటిని చీల్చుకుంటూ, తన అంతర్గత వివేకపు చైతన్యాన్ని రగిలించుకున్నప్పుడే, ఆ నీడ భౌతిక రూపాన్ని సంతరించుకుని ఒక స్వయం ప్రకాశిత సూర్యుడిగా విముక్తి పొందుతుందని కవయిత్రి నాంపల్లి సుజాత గారి ఈ తాత్విక విమర్శ మనకు బోధిస్తుంది.
మూడవ పంక్తి నుండి నాలుగవ పంక్తికి సాగే తాత్విక పరిణామ క్రమం: ఇతరులను అనుసరించే నీడలా మారిన స్త్రీ, చివరికి బాహ్య ఒత్తిడి వల్లే కాకుండా తనే స్వచ్ఛందంగా తన అస్తిత్వాన్ని ఖననం చేసుకునే ఆత్మహత్యా సదృశ్య లోతును ఈ క్రింది పంక్తి చర్చిస్తుంది.
“నీ అస్తిత్వాన్ని నీకు నువ్వుగా పాతరేసుకుంటావో/అప్పటినుంచి/ప్రాణం లేని దేహమై/ ఇతరుల ఆదేశానుమతులతో గడపాల్సిందే…!”
కవితలోనే అత్యంత కఠినమైన, తీవ్రమైన అంతర్మథనాన్ని రేకెత్తించే పంక్తి ఇది. ఇక్కడ కవయిత్రి నాంపల్లి సుజాత గారు అణచివేతకు బాధ్యతను కేవలం బాహ్య వ్యవస్థలపైనే నెట్టకుండా, స్త్రీ తన స్వంత వివేకాన్ని కోల్పోయి ఆ వ్యవస్థకు లొంగిపోవడాన్ని ఒక నిశ్శబ్ద ఆత్మహత్యతో పోల్చారు. పితృస్వామ్య, ధనస్వామ్య లోకం త్యాగం, ఇంటి గౌరవం, పతిభక్తి అనే ఆకర్షణీయమైన భాషా పరాయీకరణ ద్వారా స్త్రీలను లొంగదీసుకుంటుంది. ఆ కృత్రిమ పదాల వెనుక ఉన్న ఆర్థిక, సామాజిక కుట్రను గ్రహించలేక, స్త్రీ తన స్వంత కలలను, ఆలోచనలను, ఆశయాలను తన చేతులతో తనే గోతిని తవ్వి పాతరేసుకుంటుంది అని కవయిత్రి నాంపల్లి సుజాత గారు నిలదీస్తున్నారు.
ఆర్థిక మరియు సామాజిక విశ్లేషణలలో చెప్పబడిన అంతర్గత ఆవశ్యకత వర్సెస్ బాహ్య ఆవశ్యకత అనే తాత్విక వైరుధ్యం ఇక్కడ సంపూర్ణంగా ఆవిష్కృతమవుతుంది. స్త్రీ తన అంతర్గత సృజనాత్మక ఆశయాల ప్రకారం జీవించాల్సింది పోయి, సమాజం విధించిన బాహ్య నియమాలకు లొంగిపోయినప్పుడు ఆమె ఒక జీవచ్ఛవంగా మారుతుంది. కవయిత్రి నాంపల్లి సుజాత గారు ఆవిష్కరించినట్లు, అమరశిల్పి జక్కన్న చెక్కిన అద్భుతమైన శిల్పం నిలిచి ఉండటానికి భూమి పునాది అయితే, ఇక్కడ స్త్రీ తన ఉనికిని నిలబెట్టుకోవాల్సిన వంటింటి శ్రమ పరిణామ క్రమమే ఆమె అస్తిత్వాన్ని ఖననం చేసే సమాధిగా మారుతోంది.
విగ్రహారాధన లోని తాత్విక విపర్యయం లాగే మనిషి తను సృష్టించిన విగ్రహానికే దాసుడైనట్లు—స్త్రీ తను రక్తమాంసాలతో నిర్మించిన ఇల్లు అనే మాయా పంజరంలో తన సజీవ అనుభూతులను పూడ్చిపెట్టుకుంటుంది. పెళ్లి అనే తంతు సృష్టించిన అధికార సంబంధాల వల్ల, ఆమె తన సొంత గూటిలోనే ఒక అపరిచిత రాలై, తన మానవ సారాన్ని పూర్తిగా కోల్పోతుంది. బ్రతికుండగానే తన అస్తిత్వాన్ని తానే పాతరేసుకుని, కేవలం శ్వాస తీసుకునే ఒక నిర్జీవమైన యాంత్రిక పరికరంగా మిగిలిపోవడంలోని భయంకరమైన వేదనను కవయిత్రి నాంపల్లి సుజాత గారు ఇక్కడ ఎండగట్టారు. ఇది
కేవలం సామాజిక లొంగుబాటు కాదు; తన స్వీయ ఉనికిని తనే రద్దు చేసుకునే అత్యంత దారుణమైన తాత్విక సంక్షోభం అని కవయిత్రి నాంపల్లి సుజాత గారు హెచ్చరిస్తున్నారు.
పైగా ఈ ఆత్మఖసనం అనేది ఒకే రోజులో జరిగేది కాదు. శతాబ్దాలుగా అలవాటు చేసిన సామాజిక సంస్కృతి స్త్రీల ఉపచేతనలోకి ఇంజెక్ట్ చేయబడింది. తాను బానిసననే స్పృహ కూడా లేకుండా, ఆ బానిసత్వంలోనే పరమ పవిత్రతను వెతుక్కునేలా వ్యవస్థ ఆమె మనోజగత్తును కలుషితం చేసింది. ఫలితంగా, తన సొంత వ్యక్తిత్వాన్ని పాతరేసుకోవడాన్ని ఒక పవిత్రమైన విధిగా, కుటుంబ ధర్మంగా భావించి స్త్రీ మోసపోతోంది. హక్కుల కోసం పోరాడాల్సిన చేతులే తన సొంత ఉనికికి సమాధి కడుతున్న ఈ స్థితిని కవయిత్రి నాంపల్లి సుజాత గారు అత్యంత కరుణాత్మకమైన తాత్విక కోణంలో ఇక్కడ ప్రశ్నిస్తున్నారు.
నాలుగవ పంక్తి నుండి ఐదవ పంక్తికి సాగే తాత్విక పరిణామ క్రమం: తన చేతులతో తనే తవ్వుకున్న బానిసత్వపు సమాధి చీకట్ల నుండి, సంకెళ్లను బద్దలు కొడుతూ సంపూర్ణ చైతన్య విముక్తి వైపు సాగే విప్లవాత్మక పరిణామాన్ని ఈ చివరి పంక్తి ప్రకటిస్తుంది.
“ఆ సూర్యుడివి ఎందుకు కాకూడదు!?”
ఇంతవరకు నడిచిన నిరాశాజనకమైన బానిసత్వ చీకటి నుండి, కవయిత్రి నాంపల్లి సుజాత గారు ఒక్కసారిగా స్త్రీని చైతన్యం పరిచే ఒక మహా విప్లవాత్మకమైన తిరుగుబాటు ప్రశ్నకు ఇక్కడ వేదికను సిద్ధం చేశారు. ఇది కేవలం ఒక సాధారణ ప్రశ్న కాదు; పరాయీకరణ శృంఖలాలను తెంచుకుని, అస్తిత్వ శూన్యతపై సాధించాల్సిన విజయానికి ప్రతీక, నీడగా మారిన స్త్రీని మరొకరి వెలుగు కోసం, ఇంకొకరి గొడుగు రక్షణ కోసం ఎదురుచూడొద్దని, తానే ఒక సూర్యుడిగా మారి తన జీవితాన్ని తానే ప్రకాశింపజేసుకోవాలని కవయిత్రి నాంపల్లి సుజాత గారు శక్తీకరణ పిలుపునిస్తున్నారు.
సూర్యుడు ఎవరి కిందనూ బతకడు, ఎవరి రక్షణ కోరడు; అతడు స్వయం ప్రకాశి, సమస్త సృజనాత్మక శక్తుల నిలయం. చేతితో పనిచేసేటప్పుడు పనిముట్టు మనిషి ఆధీనంలో ఉన్నట్లు, స్త్రీ తన జీవితాన్ని, తన శ్రమను తన ఆధీనంలోకి తెచ్చుకోవడమే ఈ సూర్య తత్వం యొక్క మూల సూత్రం. తోలుబొమ్మలా ఆడటం ఆపేసి, నీడలా అనుసరించడం పక్కన పెట్టి, తన చేతులతో తనే పాతరేసుకున్న అస్తిత్వాన్ని తిరిగి తవ్వి తీసి, సమాజంలో ఒక చైతన్యం నిండిన శక్తీకరణగా ఎందుకు ఎదగకూడదు అని ప్రశ్నించడం ద్వారా కవయిత్రి నాంపల్లి సుజాత గారు ఈ కవితకు ఒక మహోన్నత తాత్విక ముగింపునిచ్చారు.
ఈ బాహ్య పీడనను, పరాయీకరణను కేవలం భరించడం కాకుండా, స్త్రీ తన అంతర్గత మానవ సారాన్ని గుర్తించి, శ్రామిక జగత్తులో తనదైన ఉనికి కోసం తిరుగుబాటు చేసినప్పుడే నిజమైన విముక్తి మరియు సంపూర్ణ స్వేచ్ఛ సాధ్యమవుతాయని కవయిత్రి నాంపల్లి సుజాత గారి ఈ విశ్లేషణ మనకు బోధిస్తుంది. నిశ్శబ్ద బానిసత్వం నుండి సూర్యుడి లాంటి స్వయం ప్రకాశిత విముక్తి వైపు సాగే మహా ప్రయాణమే ఈ కవితా ముగింపులోని పరమార్థం అని కవయిత్రి నాంపల్లి సుజాత గారి ఈ కవితా ధోరణి చాటుతోంది.
ఈ సూర్యప్రకాశం అనేది కేవలం ఒక వ్యక్తిగత ఎదుగుదల మాత్రమే కాదు; అది మొత్తం వ్యవస్థను పునర్నిర్మించే ఒక విశ్వచైతన్యం. సూర్యుడు ఉదయిస్తే చీకటి మాయమైనట్లే, స్త్రీ తన స్వయం ప్రకాశాన్ని కనుగొన్నప్పుడు ఆమె చుట్టూ ఉన్న పితృస్వామ్య బంధనాలు, కపట సామాజిక ఆచారాలు కరిగిపోతాయి. పరాధీనత అనే జైలు నుండి విముక్తి పొంది, సృష్టికి మూలమైన తన శ్రమశక్తిని తానే శాసించే సార్వభౌమత్వాన్ని అందుకోవడమే ఈ సూర్యతత్వం. కవయిత్రి నాంపల్లి సుజాత గారు స్త్రీని ఒక బాధితురాలిగా మిగిల్చేయకుండా, ఒక జగజ్జేతగా మార్చే విప్లవాత్మక ముగింపును ఈ ప్రశ్న ద్వారా ఇక్కడ సాక్షాత్కరింపజేశారు.
కాలింగ్ బెల్ మోగడంతో ఈ సమయంలో ఎవరా! అనుకుంటూ తలుపు తెరిచిన నాకు ఎదురుగా కనిపించింది అరవింద.
తనను ఇంట్లోకి ఆహ్వానించి, డైనింగ్ టేబుల్ పై ఉన్న ఆపిల్ జ్యూస్ గ్లాసులోకి ఒంపి అందించాను. నెమ్మదిగా ఆస్వాదిస్తూ అది, టేబుల్ పై ఉన్న కూరగాయలను ఫ్రిజ్‌లో సర్దుతూ నేను ఆ కబురూ ఈ కబురూ చెప్పుకుంటూ….
అరవింద, నేను చిన్ననాటి స్నేహితులం. రెండు కుటుంబాల నడుమ బంధుత్వం కూడా ఉన్నప్పటికీ, బంధం కంటే స్నేహమే మా మధ్య ఎక్కువగా గుబాళించేది. ఒక్క మాటలో చెప్పాలంటే, శరీరాలు మాత్రమే వేరుగానీ ఆత్మ ఒక్కటే.
డ్రాయింగ్ రూమ్ లో ఓ వారగా వేసి ఉన్న టేబుల్ పై ఒక చీర, రంగులు కనిపించడంతో సరాసరి అక్కడికే వెళ్లి, కుంచెను చేతిలోకి తీసుకుంది.
చీరలపై అందమైన పెయింటింగ్స్ వేయడంలో అది సిద్ధహస్తురాలు. రంగులను కలపడంలో కూడా చాలా నైపుణ్యం ఉంది. రంగులను కలిపేసి చకచకా పెయింటింగ్ చేయడం మొదలెట్టింది. చూస్తూ ఉండగానే చీర అంచులపై లతలు, పువ్వులు పరిచేసింది.
ప్రకృతిలోని అందాన్నంతా చీరపై మెరిపించినా, ఎందుకో మనసు మాత్రం అంత ప్రశాంతంగా ఉన్నట్టు నాకనిపించలేదు.
అదే విషయం కనుక్కుందామని”ఏమైంది అదోలా ఉన్నావు? సమస్య ఇంట్లోనా, ఒంట్లోనా?” అంటూ మెల్లగా మాటల్లోకి దింపాను. ముక్తసరిగా సమాధానాలిస్తూ వెళ్ళిందేతప్ప, అసలు విషయానికి రాలేదు.
రెట్టించి అడిగేసరికి ” ఏమీలేదే! ఎప్పటినుండో నీకు చెప్పాలనుకుంటున్నాను కానీ వీలు కావడం లేదు” అంది.
అంచుల్లో వేసిన రంగులు కాకుండా వేరే రంగులు కొంగుపై వేస్తూ. చీరపై రంగులు మారుతున్నట్టే దాని మొహంలో కూడా రంగులు మారడాన్ని గమనించాను.
మెల్లిగా చెప్పడం మొదలెట్టింది”మా అత్తవారింటి వైపు బంధువుల పెళ్లికి వెళ్లాను. పరిచయస్తు లందరినీ పలకరిస్తూ ముందుకు వెళుతూ ఉన్నాను” అంటూ ఆగిపోయింది. దేనికోసమో తీవ్రంగా బాధపడుతున్నట్టు అర్థమైనా మధ్యలో ఆపడం ఎందుకని మౌనంగా వింటూ ఉన్నాను.
కాస్త తమాయించుకుని మళ్లీ విషయంలోకి వచ్చింది. “చాలాకాలం తరువాత బంధువులు,మిత్రులు పెద్ద సంఖ్యలో ఎదురుపడటంతో పలుకరింపులు, క్షేమమాచారాలతో కళ్యాణమంటపం చాలా సందడిగా ఉంది”. కుంచెనూ, రంగులను పక్కనపెట్టి, చీర పైని పెయింటింగును మొదలంటా సరిచూస్తూ ఉంది. పెయింటింగ్ విషయంలో మనసు సమాధాన పడినట్టుందేమో! సంభాషణకు కొనసాగింపుగా “అందరినీ పలుకరిస్తూ ముందుకు వెళుతూ ఉన్నాను. ఇంతలో ఒక వ్యక్తి స్వచ్ఛంగా నవ్వుతూ పలుకరించబోయాడు. అత్యంత ఉన్నత స్థాయికి చెందిన వ్యక్తి. కానీ పలుకరించాలన్న అతని ప్రయత్నాన్ని నేను గ్రహించలేకపోయాను” అన్నది.
ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. కాస్త తేరుకుని, “గుంపులో ఉన్నప్పుడు పరధ్యాసగా ఉంటే, ఇటువంటి పరిస్థితులే ఎదురౌతాయి, కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుండేది” అన్నాను.
ఔనన్నట్టుగా తలూపి మళ్లీ తనే చెప్పడం మొదలెట్టింది. “అందరి వద్ద సెలవు తీసుకొని ఇంటికి చేరాను. నాలుగు రోజులు గడిచాక గానీ నా బుర్రలో లైట్ వెలుగలేదు. నావల్ల జరిగిన పొరపాటు ఎంత పెద్దదో అప్పుడు తెలిసింది. అప్పటి నుండి ఈ క్షణం వరకూ మనశ్శాంతి లేకుండా గడుపుతున్నానంటూ బాధపడింది.
” ఫోన్లో మాట్లాడి సవరించుకొని ఉంటే బాగుండేదేమో” అన్నాను.
” బంధుత్వం ఉన్నప్పటికీ, ఒకటి రెండుసార్లు చూడటమే తప్ప, అంతగా పరిచయంలేని వ్యక్తికి పరిస్థితిని వివరించడం ఎలా సాధ్యం?” అన్నది.
” ఇంట్లో ఎవరికైనా చెప్పావా? ” అడిగాను.
ఇంట్లో చెప్పడం, ” ఇలా అయితే మానవ సంబంధాలన్నీ దెబ్బ తినడం ఖాయం అంటూ తల వాచే ట్లుగా చివాట్లు తినడం అన్నీ అయిపోయాయ”ని చెప్పింది.
ఇక్కడ అరవింద గురించి చెప్పాల్సిన విషయం కొంత ఉంది. అది చాలా తెలివైన విద్యార్థిని, తిరుగులేని విజేత. పరిస్థితులు ఏవైతేనేం శిఖరాగ్రానికి చేరుకోవాలనే తన కల ఆఖరి మెట్టు వద్ద ఆగిపోయింది. గుండెలో గూడు కట్టుకుని ఉన్న ఆ వేదనకు, ఆవేదనకు పర్యవసానమే ఈ ప్రవర్తన అన్న విషయం తెలిసిన వ్యక్తిని నేను తప్ప బహుశా ఇంకెవరూ ఉండరేమో!
సాయంత్రం కాగానే అరవిందను వాళ్ళింట్లో దింపి, ఇంటికి వచ్చి సోఫాలో చేరగిలబడ్డాను. తను పడుతున్న బాధ తెలిశాక నా ఆలోచనలు పాతికేళ్ల వెనక్కి వెళ్ళాయి.
********
అక్కలందరికీ పెళ్ళిళ్ళై అత్తవారిళ్లకు వెళ్లడంతో ఇంట్లో అమ్మ,నాన్న, నేను ముగ్గురమే మిగిలాం. శరన్నవరాత్రులు సమీపిస్తుండడంతో పూజా ద్రవ్యాల కోసం నాన్నతో కలిసి ఇంటి పక్కనే ఉన్న సూపర్ మార్కెట్ కి వెళ్ళాను.
అవసరమైన సరుకులు ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఉన్న క్రమంలో అనుకోకుండా నాన్నా , నేనూ చెరో పక్కకు వెళ్లడం జరిగింది.
సుగంధ ద్రవ్యాలను సరి చూసుకుంటూ అప్రయత్నంగా తలెత్తిన నాకు, చాట నిండా ధాన్యంతో, దాదాపు ఐదు పదుల వయసులోని ఒక స్త్రీ నిలబడి ఉండటం కనిపించింది.
ఆమెను పోల్చుకోవడానికి అంతగా సమయం పట్టని నేను నవ్వుతూ”ఆంటీ బావున్నారా?” అంటూ పలుకరించాను. దానికామె నుండి ఏ విధమైన సమాధానం రాలేదు. ఎందుకో అర్థం కాకపోయినా మరుసటి క్షణంలోనే “అంటీ మీరు నన్ను గుర్తుపట్టడం లేనట్టుంది?” అంటూ తిరిగి ప్రశ్నించాను.
అయినప్పటికీ ఏ విధమైన స్పందన లేదు. పుట్టి పెరిగిందంతా అక్కడే కావడం వల్ల పరిచయాలు కూడా ఎక్కువగానే ఉండేవి. నేను ప్రశ్నించడం, ఆమె సమాధాన మివ్వకపోవడం అందరూ గమనిస్తూనే ఉన్నారు. అందరూ అలా మా ఇద్దర్ని మార్చి,మార్చి చూస్తూ ఉండడంతో కాస్త అసహనానికి లోనవడమే గాకుండా, ఒకింత అవమానం జరిగినట్లుగా కూడా భావించాను.
ఇంతలో నాన్న అక్కడికి రావడం, ఆమెను చూడగానే ” ఏమ్మా బావున్నావా తల్లీ! మీవారు, పిల్లలు అంతా క్షేమమేనా?” అని అడగడంతో, నాన్న వయసుకే గౌరవం ఇచ్చిందో లేక ఆ పలకరింపులోని ఆప్యాయతకే కట్టుబడిందో తెలియదుగానీ, ఇక తప్పదన్నట్టుగా ” అందరం బావున్నాం అన్నయ్యా” అంటూ అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడకుండా గబగబా లోపలికి వెళ్ళిపోయింది.
దేవీ నవరాత్రులు రెండు, మూడు రోజుల్లోకి వచ్చేస్తుండడంతో, పనులన్నీ చకచకా చేసుకుంటూనే ఉన్నానుగానీ, మనసు అవమాన భారంతో బరువెక్కుతూ ఉండేది.
ఆమెపై ఏ విధమైన కోపం లేకపోయినా, ఆవేశం రాకపోయినా, ఏదో బాధ మాత్రం మనసును తొలుస్తూ ఉండేది. పలుకరించకపోయి ఉంటే బాగుండేది అనుకుంటూ ఉండేదాన్ని.
పిల్లల మనసును అంచనా వేయగలిగే శక్తి ఈ ప్రపంచంలో బహుశా ఒక్క కన్నతల్లికి మాత్రమే ఇచ్చాడనుకుంటా ఆ సృష్టికర్త. అన్యమనస్కంగా ఉండటానికి కారణమేమిటని ప్రశ్నించిన అమ్మకు “మొన్న నాన్నతో వెళ్ళినప్పుడు షాపులో శశికళ ఆంటీ కనిపించారమ్మా!” అంటూ జరిగిన విషయమంతా పూసగుచ్చినట్టు చెప్పేశాను.
దానికి సమాధానంగా అమ్మ “అయ్యో! నీ మనసు అంతగా బాధపడిందా తల్లీ, అందులో ఆమె తప్పేమీ లేదు. అసలు విషయం తెలిస్తే నువ్వింతగా బాధపడే దానివి కాదు” అంటూ ఆమె గురించిన కథ చెప్పడం మొదలు పెట్టింది.
“ఆమె అత్యంత సంపన్నుల ఇంటి కూతురు. తండ్రి గొప్ప రాజకీయవేత్త.చుట్టూ ఇరవై ఊళ్ళ వరకు మంచి పలుకుబడి ఉండేది” అని చెబుతూ ఉండగానే “ఐతే ఏంటమ్మా? దానికి ఈ విషయానికి ఏమిటి సంబంధం? అంటూ మధ్యలో కలగజేసుకుని ప్రశ్నించాను. పసుపుపచ్చ చేమంతులను మాల అల్లుతూ..
” నన్ను పూర్తిగా చెప్పనివ్వు. మధ్యలో ఆపితే విషయం ఎలా తెలుస్తుంది నీకు? అంటూ మళ్ళీ మొదలెట్టింది. “ఆమె చాలా అందంగా ఉండడమే కాకుండా చదువులో, పని పాటల్లో కూడా చురుకుగా ఉండేది. మంచి కుటుంబాల నుండి ఆమెను తమ ఇంటి కోడలిగా చేసుకుంటామని తండ్రికి ప్రతిపాదనలు అందుతూ ఉండేవి “.
” ఆమె దేనికీ అభ్యంతరం చెప్పకపోయినా, తండ్రి మాత్రం రాజీ పడేవాడు కాదు. చాలా సమయం తీసుకుని, ఏరికోరి చివరికి చాలా మంచి ఇంటికి ఆమెను కోడలిగా పంపించాడు”.
“ఏంటమ్మా ఇంత పెద్ద కథ చెబుతున్నావు? మూడు ముక్కల్లో చెప్తే సరిపోతుంది కదా” అన్నాను. అసలే మనసు బరువెక్కి ఉన్న నాకు అంత పెద్ద కథ వినడం చాలా అసహనంగా అనిపించింది.
అమ్మ నవ్వుతూ “మూడు ముక్కల్లో చెబితే అది జీవితమెలా ఔతుంది? కాస్త ఓపికగా విను” అంది.
“ఆమె చాలా అణకువతో మెలిగి అందరికీ ప్రేమను పంచి, వారి నుండి కూడా తిరిగి పొందగలిగింది. భర్త కూడా చాలా సామ్యుడు, తెలివైనవాడే కానీ వ్యసనాలకు బానిసవడమే ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది”
“ఈలోపు నలుగురు ఆడపిల్లలకు తల్లి కావడం, అతని వ్యసనాలకు ఆస్తి హారతి
కర్పూరమవడం మాత్రమే గాకుండా, కాలేయం పూర్తిగా దెబ్బతిని మంచాన పడ్డాడు. ఇల్లు గడవడం కోసం షాపులో సరకులు శుభ్రపరచడాన్ని ఆదాయ మార్గంగా మలుచుకోవలసి వచ్చింది”
నాకు విషయం కొద్దికొద్దిగా అర్థమవడం మొదలైంది. అమ్మ మళ్లీ చెప్పడం మొదలెట్టింది.”నీ పలుకరింపుకు సమాధానం ఇవ్వకపోవడానికి అదే కారణం” అంది. ఈసారి తెల్ల మొహం వేయడం నా వంతయింది.
“అదేంటమ్మా! దానికీ దీనికీ ఏమిటి సంబంధం?” అన్నాను.
” సంబంధం ఎందుకు లేదు? పూలమ్మిన చోటే కట్టెల మ్మాల్సిన పరిస్థితి వస్తే, ఎవరైనా అలాగే ప్రవర్తిస్తారు”.
” నువ్వు ఒక్కదానివే కనిపించి ఉంటే, ఆమె నీతో తప్పకుండా మాట్లాడేది. పక్కన మీ నాన్న ఉండేసరికి ఆమె గుండె కలుక్కుమంది” అన్నది.
” నాన్నేం చేశారమ్మా, అంత ఆప్యాయంగా పలకరించారు కదా” అన్నాను పూలదండను
కృష్ణుడి మెడలో వేస్తూ…
నిజమే ” మీ నాన్న ప్రేమగానే పలుకరించారు, కానీ అతనొక ఉన్నతోద్యోగి కావడం వల్ల, అతనికి ఆ స్థితిలో ఎదురు పడటం ఆమె వల్లకాలేదు”.
“ఎవరి జీవితం వారిదే కదమ్మా, ఆంటీ కెదురైనవి కఠినమైన పరిస్థితులే కావచ్చు, కానీ అంత న్యూనత పడాల్సిన అవసరం ఏముంది?” అన్నాను.
“పుట్టిందీ,మెట్టిందీ రాచ కుటుంబాలే ఐనప్పటికీ సీతమ్మ, ద్రౌపది అడవులు పట్టుకుని వెళ్లలేదా?”, “వాళ్లకే తప్పనప్పుడు మామూలు మనుషులం మనదే ముందమ్మా!” అన్నాను ఎదురుగా ఉన్న గీతోపదేశం వాల్‌పోస్టర్‌ని చూస్తూ.
“వాళ్లు అవతార పురుషులు, అయోనిజలు. వాళ్లకు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనగలిగే ధైర్యం, స్థైర్యం ఉంటాయి, మనం మామూలు మనుషులం. మనకంత శక్తి ఎక్కడి నుండి వస్తుంది?” అంది. అమ్మ విశ్లేషించే తీరుకు ఒకింత ఆశ్చర్యపోయాను.
********
రెండు నెలల తర్వాత అరవింద తో కలిసి మహాలక్ష్మి ఆలయానికి వెళ్లాను. ఇద్దరం మాట్లాడుకుంటూ ప్రాంగణంలోకి అడుగుపెడుతూ ఉండగానే, దర్శనం పూర్తి చేసుకుని బయటకు వస్తున్న ఒక స్త్రీ కనిపించింది. నన్ను చూడగానే నవ్వుతూ”ఏమ్మా! బాగున్నావా? ఈ అమ్మాయి నీ స్నేహితురాలా? ఇద్దరూ కలిసి వచ్చినట్టున్నారు?”అంటూ కలివిడిగా మాట్లాడటం
మొదలెట్టింది. పరికించి చూస్తే తను శశికళ ఆంటీ. “బాగున్నానాంటీ, దర్శనం అయిపోయినట్టుంది” అంటూ నేను కూడా ఆప్యాయంగానే బదులిచ్చాను.
తలారా స్నానం చేసి, నూలు చీర కట్టుకొని ఉంది. మెడలో పసుపు తాడు, నల్లపూసలు తప్ప మరే ఆభరణాలూ లేవు. నుదుట రూపాయి కాసంత కుంకుమబొట్టు, తలలో పువ్వులు, పసుపు రాసిన పాదాలతో గుళ్లోకి వెళ్ళకముందే అమ్మవారు దర్శనమిచ్చిందా అన్నంత అందంగా ఉంది.
“సరేమ్మా, తొందరగా వెళ్ళండి. కాసేపయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది” అంటూ పురమాయించింది.
“మంచిదాంటీ, ఒకసారి మా ఇంటికి రండి”అన్నాను. పక్కనే తోపుడు బండిపై ఉన్న కొబ్బరికాయ, అరటి పండ్లు కొంటూ….
” తప్పకుండా వస్తానమ్మా, ఈ శ్రావణమాసం పూజల హడావిడి ఉంటుంది కదా, అది అయిపోగానే వస్తాను. నాకూ ఎప్పటినుండో అమ్మను కలవాలనే ఉంది. అడిగానని చెప్పమ్మా” అంటూ వెళ్ళింది.
” మీ నాన్న పక్కన లేకుండా ఉండి ఉంటే, ఆమె నీతో తప్పనిసరిగా మాట్లాడి ఉండేది” అన్న అమ్మ మాటలు గుర్తొచ్చాయి.
” బ్రతుకు పూలబాట కాదు అది పరవశించి పాడుకునే పాట కాదు” దూరంగా ఎక్కడినుండో గాల్లో తేలివస్తూ పాట చెవులను సోకింది. నిజమే, ఆరోజు ఆంటీ ప్రవర్తన కైనా, ఈరోజు అరవింద ప్రవర్తనకైనా కారణం ఒకటే. ఒకరిది ఆకాశం నుండి అధః పాతాళానికి జారిపడిన అనుభవమైతే, మరొకరిది ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ అందలానికి చేరువలో చతి కిలబడ్డ అనుభవం. ఆరోజు బాధపడింది నేనైతే, ఈరోజు అరవింద వాళ్ల బంధువు.
శశికళ ఆంటీ పరిస్థితిని అమ్మ నాకు వివరించి నట్టుగానే,
అరవింద మానసిక స్థితిని మరెవరైనా అతనికి తెలియజేస్తే బాగుండేది. అనవసరంగా ఒకరి మనసు గాయపరచాననే అపరాధ భావన తొలగిపోయి దాని మనసు తేలికయ్యేది.
” The greatest sin is to think yourself as weak “
వివేకానందుల వారి సూక్తి గుండెల నిండా ఊపిరి నింపుతూ, వెయ్యేనుగుల బలాన్ని అందిస్తున్న భావన కలిగింది. ‘మైత్రీదినోత్సవ’ కానుకగా ఈ పుస్తకాన్ని రేపు అరవిందకు అందజేయాలనుకుంటూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాను.
Newer Posts
