Home పుస్త‌క స‌మీక్ష‌ స్వచ్ఛమైన నీటి మనసు

స్వచ్ఛమైన నీటి మనసు

by Dr. Saroja Vinjamura

కవిత్వం ఒక వ్యక్తిత్వం. ఒక భావం. ఒక భావన. సంతృప్తి, తపనల వెల్లడి. రసానందం పొందడంతోనే ఆగిపోదది. ఒక మార్పును, చైతన్యాన్ని, తెగింపును,
విప్లవాన్ని, ఆవేశాన్ని ఆలోచనకు మళ్ళించి చేతలో నిరూపించేట్లు వాస్తవిక పని జరిగేట్లు చూస్తుంది. ఉద్యమాలకు పిడికిలి ఎత్తిస్తుంది. అనుకున్న సాధింపజేస్తుంది. కవిత్వానికి ఉన్న బలమది. సాహిత్యంలో ఉండే గొప్పతనమేమిటంటే కవి మన ఎదురుంగ కూర్చు ని తన అంతరంగాన్ని ఎదుటి పాఠకునిముందు ఆవిష్కరిస్తాడు. ఆడుతాడు, ఆడిస్తాడు. పాడుతాడు. నవ్విస్తాడు. ఏడిపిస్తాడు. ఎంత పెద్దా, చిన్నా ఐనా దోస్తవుతడు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో, రాష్ట్ర సాధన తరువాత ఎంతోమంది కవులు కనిపిస్తున్నారు. వీరిలో చాలామంది అప్పటివరకూ తమలో కవిత్వశక్తి ఉన్నా పరిస్థితుల
ప్రభావంవలన బయటపడనివారైతే కొంతమంది కొత్తగా కలం పట్టినవారు. కవిత్వం గురుముఖంగా నేర్చుకునేది కాదు. తనలో ఉన్న భావాల్ని అక్షరీకరించడం. ఐతే ఇది గురువులద్వారా నేర్చుకోకున్నా సవరింపులు, సరైన పంథాల ఎంపికవంటి మార్గదర్శన సూత్రా
లు కొన్ని అవసరం. ఇది అసలు సిసలు కవిత్వం రావడానికి ఉపకరిస్తుంది. ముఖ్యంగా నాణ్యమైన కవిత్వం సరైన అధ్యయనం ద్వారా సాధ్యం. అటువంటి నాణ్యత, మేలిమిగ ల కవి, కవిత్వ సిద్ధహస్తుడు డా. నందిని సిధారెడ్డిగారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా ఉండి ఎన్నో సాహిత్య కార్యక్రమా
లు, పనులు, సృజనలతో విరామం లేకుండా ఉండి కూడా సిధారెడ్డిగారు తనకిష్టమైన క విత్వాన్ని వీడలేదు. మన కాలంలో ఉన్న కవి అని సగర్వంగా ప్రకటించుకోగలిగిన కవివర్యులు సిధారెడ్డి సర్. ఆత్మీయ పలకరింపుతో అందరినీ దగ్గర చేసుకోగలిగిన ఆయన వ ్యక్తిత్వమే ఆయన కవిత్వం.

“ఎన్ని ప్రక్రియల్లో రాసినా ఇష్టమైన ప్రక్రియ కవిత్వమే. నను అన్నిటికన్నా ముందుగా కవిగా గుర్తించడానికే ఇష్టపడతాను” అంటారాయన.
కదిలించే ఏ విషయాన్ని, సంఘటనను చూసినా కవి కలం తక్షణం స్పందిస్తుంది. కవిత వెల్లివిరుస్తుంది. అలా సిధారెడ్డిగారి కవితామాలికలు ఎన్నో సంపుటాలుగా తెలుగు పాఠకులను అలరించాయి. ఆ పరంపరలోనే వచ్చిన మరొక సంపుటి ‘నీటి మనసు’. ఏ ఆడంబరాలు, ఏ హడావిడి లేకుండా కేవలం కవితలతో వచ్చి ధాటిగల పుస్తకం నీటి వ ఎనసు. కవిత్వం మీద ప్రేమతో వెలువరిస్తున్న నా ఎనిమిదో సంపుటి ఇది అంటూ కవిత వంపట్ల ప్రేమను ప్రకటిస్తాడు. అక్షరం పట్ల ప్రేమ ఉన్న ప్రతీ మనిషికీ నచ్చే పుస్తకమిది.
పుస్తకంలోని ప్రతి మాట, ప్రతి అక్షరం శరీరాన్ని, మనసును కదిలిస్తుంది. ఏ వయసువారినైనా అలరిస్తుంది, సునాయసంగా మనసుకు ఎక్కుతుంది. ఇందులోని కవితలలో భావాల ధారతప్ప చిన్నవీ, పెద్దవి అనే తేడా కనిపించదు. మంజీరా రచయితల సంఘంద్వారా వెలువరించిన నీటి మనసును “ఉద్యమాలను ప్రేమించి, అక్షరాలను ప్రేమించి, జీవితాన్ని ప్రేమించలేక లోకం విడిచి వెళ్లిన చైతన్య ప్రకాశ్ కు, ఆ జ్ఞాపకాలకు అంకితమిస్తున్నట్లు” ఈ పుస్తకంలో పేర్కొన్నారు సిధారెడ్డిగారు ఇక కవితా పేటికను తెరిస్తే మొదటి కవితే కలను ప్రేమించే మనిషిగా కనిపిస్తాడు కవి. నిలబడని, కూలబడనీ కల ఎలానైనా ఉండనీ ఫత్వాలు వర్తించని, పేటెంట్స్ రైట్స్ లేని కలలతోనే కవి సగం జీవితమని నా కలలు నావని చెబుతాడు. అలవాటయిన భాష అంతర్జాతీయం మాట్లాడితే ఇక్కడి ప్రజలేం కావాలని ప్రశ్నిస్తాడు. మోకాలి నెత్తురులో లోకాలు పాకుతున్న పసిపాప గోస మాట్లాడొద్దా? అని అడుగుతాడు. వాండ్ర
మట్టి ముట్టినవాడు లేడు, పెళ్ళ తీసినవాడు లేడు, అటు తొవ్వ తొక్కినవాడు లేడు యత్రమే మహానుభావా…. అంటాడు. కవి ఎటుంటడు? కన్నీళ్ళు తుడుచుకుంటున్న, గాయాలు తడుముకుంటున్న ఊరివైపే ఉంటడు. నగరంలో ఊరినెత్తురు అల్లుకుపోయే ఉంటాడు.

భూమినైతే కోస్తవు, కొండయితే పక్కకు తిరుగుతవు అంటే ఏంచెప్తది…. అది నది. కొండను చూస్తూ ఇంత ఎత్తా! అంటే ఏం చెప్తది అది దాని రూపం. భూమిని పట్టు కుని ఎంత విశాలం! ఎంత సహనం! అంటే ఏం చెప్తది అదే భూమి అని వాటి సహజాతి కాల్ని చెబుతూ ఔనుకదా! అని అనేట్టు విస్మయపరుస్తాడు.
పాడుచూపుల మధ్య, ముళ్ళతోవల నడుమ చెరువొడ్డు గుర్తించారా? గుండెకు తడి లేదు మరి మాట తడి ఏమైంది? అంటాడు. రక్తాన్నేమి, రాజకీయాన్నేమి…. నీరు దేన్నయినా కడుగుతుంది నీటి భాష నాది గర్వంగా ప్రకటిస్తాడు.
సిధారెడ్డి కవిత్వాన్ని అందుకోవడం ఎంత కష్టమో అంత సులభం. ఎంత సులభమో అంత కష్టం. ఊరే జలలో సౌందర్యం, పారే నదిలో గాంభీర్యం, చిన్నపిల్లాడి
లా వాక్రవాహం, పెద్దవారి తెలిసినతనం ప్రతీదీ స్పష్టంగా దొరికే కవిత్వం తనది. ముం దుతరం, ఈ తరం, నాతో ఉన్న నావారు అందరికీ కృతజ్ఞతలు అని తెలిపే కృతజ్ఞతావా త్యాలు సిధారెడ్డికి మనిషి అంటే ఎంతిష్టమో చెప్తుంది. ఈత తెలిసినవాడు కొలను కనబడితే ఆగలేడు. ఆలోచన వచ్చిందే తడవుగా కవి
త్వంలోకి జారక సిద్ధుడు అగలేడు. తనువెల్లా నాదమైన కవికి తాళాలు, తబలాలు కావాలా సహజగానమే అతని బాణి అంటాడు. నీ పాటలు ఆకాశంలో ఎగురుతుంటే పడగొట్టేవాళ్ళుంటారు. తడిగుణం విడువకు అక్షరాలను వెదజల్లడం మరువకు. శత్రువులు మింగుడుపడని మిత్రులూ తప్పరు. ఏడ్చేవాళ్ళు ఏడువనీ, నవ్వేవాళ్ళు నవ్వనీ, నీకేం పని! అని ఆశావాదాన్ని నూరిపోస్తాడు. పట్టుదలకు పర్వతాలెంత ప్రయాణానికి సముద్రా
లెంత ఊహాశాలి ఒళ్ళు విరిస్తే ఆకాశం పసిపాపలా అంబాడదా అని వెన్ను తట్టుతాడు.
భాగ్యనగరంగురించి రాస్తూ నువు గుర్తించవు లాలనగా నీ భుజంమీద ప్రేమలు వాలుతాయి. కంటిమీద ఒంటిమీద ఇన్ని సొగసులు కురుస్తుంటే వెళ్ళాలనుకున్నా వెళ్ళలేవు అని ఈ నగరం యొక్క గొప్పతనాన్ని కవిత్వీకరిస్తాడు. మనసులేనా మీనార్లు పలకరిస్తాయి. కవులేనా విగ్రహాలూ రోజుల తరబడి కవిత్వం చెబుతాయి. అలలు ఆలకిసాయి. అలలు అలుగా స్పందిస్తాయి. పండితులేనా ఇరానీ టేబుళ్ళు ప్రసంగిస్తాయి కప్పుల
ు చప్పట్లు కొడతాయని అద్భుతంగా నగరం గొప్పతనాన్ని కట్టెదుట నిల్పుతాడు. తలకు
ఆదర్శాలు చుట్టుకొని తలపడడానికి సిద్ధంగా ఉన్నట్లుంటుంది. కార్తెల మెడలో ఇన్ని స్వ ప్నాలు వేసి నిన్ను నన్ను తయారుచేసిన ఈ తోట చదువుల ఖజానా. ప్రపంచం మనిషికిచ్చిన నజరానా. చరిత్ర తెరిచిన పెద్దర్వాజా అంటాడు ఓయూ ను గురించి. 100 సంవత్సరాల పురాతన చదువుల ఆలయంగురించి ఎంత బాగా వర్ణించారో అధునాతనమైన రాహగిరి గురించి కూడా అంతే వర్ణన. రాహగిరిలో కేరింతలు, దోరవయసు దొరసానులు,
హాఫ్ పాంట్ల హాటుబాబులు అని వారి ఉత్సాహాన్ని వివరిస్తూనే ప్రపంచానికి హామీపడవలసిన తరం నెట్లో చిక్కిపోతున్న చిన్నతనానికి విచారపడతాడు. ఎవరెంత ఆత్రపడినా ఏ లైటు ఎప్పుడు వెలగాలో అప్పుడే వెలుగుతుందనే తత్వబోధను చేస్తాడు సిగ్నల్ కవితద్వాం జంటనగరాల జనాభాను దవడకు పెట్టుకుని ఆడిపోసే ఆటోవాలా, నగర కంపు నషాలానికెక్కినా నవ్వలేక నవ్వుతున్న మున్సిపల్ బండి, మెట్లమీద అలసటను, ఆలస్యాన్ని
నిట్టూర్చే కండక్టర్, ముందుకు ముందుకు బైకు నిలిపే గడుసు మనస్తత్వాలు ఇలా మ
నం రోజూ చూసేవే ఐనా సిద్ధుని కలంనుండి జాలువారినపుడు అవి కొత్తగా ముచ్చటగొల్పుతాయి. ఎదుటివారి బ్రతుకు సుఖం, నాదెంత అల్పమని భావించే జీవి జీవికను ఊరకుక్క, పెంపుడుకుక్కల స్వగతాలలో తెల్పుతాడు. బంధువయేదీ, బాటయేది, నడిచే కాళ్ళలో కట్టె అయేదీ, పిడుగులు పడేది, వసంతం పూసేది మాటలోనే ఉందంటూ మాట మహత్తును కాపాడుకోమంటాడు. రానిదానిగురించి ఎక్కిరిస్తవ్, ఒచ్చిందేంటో చెవి
– ఇనుకోమంటూ, మైకు పట్టరాదు మాటలు పేర్చరాదు. నాగలి పెట్టొస్తది బువ్వ పెట్టాస్తది. కుర్చీలెక్కరాదు పైస లెక్కరాదు. అయితేం కుర్చి దించొస్తది భూమికి జానెడెత్తు నడిస్తె భూమ్మీదికి దించొస్తది అంటూ అహానికి పోయే మనిషికి ఇగురం చెబుతడు. బలపీనుల పక్షాన నిలబడి వారి బలమేందో ఋజువుజెప్తడు. వారి వారి స్థానాల గొప్పతనాన్ని పంతంగా సపోర్ట్ చేసుకునే తూనీగలాంటి పిల్లలు, ఏమీ లేకున్నా ఎంతో సంతోషంతో దీపంలా వెలిగే పిల్లలగురించి చెప్తారు. పేలని పటాకులను దివాళి పొద్దున్నే దీనంగా వెతికే దోస్తులు అంటాడు వారిని. రాజకీయాలకు, పదవులకు అతీతమైనది కలం అంటాడు. అధికారం ఎన్నుకొన్నంతకాలమే నువ్వు. అక్షరం ప్రపంచం బతికున్నంతకాలం కవి బతుక
లతాడని, పడి ఉండడానికి కాసులు, పెంకాసులు కావివి, అక్షరాలు అంటూ సాహిత్యాని ్న శిఖరాన నిలబెడ్తాడు. సహజత్వాలు, స్వభావాలు కోల్పోయిన నగర జీవితానికి కృతకవే పతాకమంటూ ఋతువులు తెలియని నగరంలో ఋతుధర్మం పాడుతున్న కోయిలను
చూసి నవ్వుకుంటాడు. ఈ మందిమాట పట్టుకుని వచ్చినవుగానీ ఉన్న ఊరు కన్నతల్లిని విడిచి పెట్టి వచ్చినవుగానీ ఎవల ఊరిది? నువు ఎంత వెతికినా తెలిసిన మొఖం, మనిషి ముఖం కనిపించదురా నాయనా! అని తాను గమనించింది చెప్తడు. ఓదారుస్తడు.
కడలి అటు ఖండానికి ఇటు ఖండానికి తాడు కట్టి ఊయలూగుతుంది అంటాడు. ఆకాశయానంలో కూడా ఈ కవి కైత కల్టాడు. అక్షరానికి మువ్వల పట్టీలు తొడ
ఎగుతడు. ఆస్టిన్లో బందారం, బూరుగు వొర్రెనూ చూడొచ్చు, అమెరికాలో ఉండి నల్లవ ఎలా చూడొచ్చు కని లోపల దుంకుతున్న నయగరా చూడటానికి లోతు కావాలి ఎత్తుకు ఎదగాలి అంటాడు. రోనొక్ విమానంలో పాతబస్సు పల్లె వెలుగులను దర్శిస్తడు. రోనొక్ సారస్వతంలో సిద్దిపేట గ్రంథాలయం తలుపులు తెరుస్తడు. హైదరాబాద్ కొచ్చినా, ఆస్టిన్కు వెళ్ళినా కవి బందారపు దారాన్ని అంటి పెట్టుకునే ఉంటాడు. మాతృభూమిని మదిలో
దాచుకున్న వైనం తేటతెల్లమౌతునే ఉంటది. ఖండాలు దాటినా ఊరి పరిమళాల్ని ఆసా ్వదిస్తనే ఉంటది. మరమనుషులనుకుంటాం కానీ మనిషిని చూడగానే మనిషి తడిసిపోతడు. కొత్త చిగురుతో కళకళలాడుతుంటడు. డల్లాస్ ఉల్లాసం డబీలుర గడబిడ ఏదైనా
మనిషే అన్నప్పుడు స్వచ్ఛమైన సిదారెడ్డి నవ్వు ఎదురుగా నవ్వుతూ కనిపిస్తది. ఇలా ఒకో ్క కవితనూ ఒలుస్తూ ఉంటే రసధార కురుస్తూ ఉంటది. అతని కలంలో కొండ ఆకుపచ్చని అంగరఖా వేసుకుని ధ్యానిస్తుంది. చెట్లు ఎన్నో ఋతువులను ముడిచి ఆత్మవిస్వాసాన్ని వీస్తాయి. ప్రాసతో పసందునిస్తాయి. చదువుకుని మిడిసిపడే, సంపాదించి ఎగిరిపడి నీరసపడే వారికి తన కవితల ద్వారా నాట్లు, రోడ్లు, కంకరేసే కార్మికుల జీవనోత్సాహాన్ని జీ
వన సంబురాన్ని చూపిస్తాడు. ఐజాల్ లో మిజోల ఎర్రని, సన్నని యవ్వనం రంగు లుంగీల్లో సోయగం వెదజల్లుతుంది. పసిపిల్లలు ముసి ముసినవ్వులు విసురుతారు అంటూ నగరాల్లో కార్లు, భవనాలు ఎన్నైనా ఉంటాయ్. కానీ శిఖరాలను అధిరోహించిన నిస్సర్గ న
గరం ఐజాల్. ఎక్కడైనా సూర్యుడు ఉదయిస్తడు. ఐజాల్ ను చూడడానికి గంటముందే ఉరికొస్తడు అనే అత్యద్భుతమైన వర్ణన ఐజాల్ సౌందర్యాన్ని కళ్ళముందు నిలుపుతది. ఐజాలను త్వరగా చూడాలని కోరుకుంటది. పుష్ప సమయాల కాలం చెబుతూ ప్రపంచంలో పూలదొక ప్రపంచమని సహజ లక్షణాల నిర్భయత్వాన్నీ, సహజత్వాన్ని చెబుతాడు. సిధారెడ్డి సొంతూరుని, మనిషిని ఎంతగా ప్రేమిస్తాడో! గుండె గాయపడితే, కన్నీరొలికితే సెల్ ఫోన్ తుడవలేదు. జ్వరంతో కాలే శరీరాన్ని సాఫ్ట్ వేర్ నిమరలేదు. గుర్తించు నీ బంధం మనిషే, నీ అస్థిత్వం ఊరే అంటాడు.
తగ్గిపోతున్న సీతాకోకచిలుక, తూనీగలు, తేనెటీగల సంతతి పై చింతపడుతూ రాసిన అందం విషాదం కంటనీరొలికిస్తుంది. ఎవర్నో దించి, ఎవర్నో ఎక్కించుకుని, ఎవం పిలిచినట్టే వెళ్ళే రైలు, అక్కడి స్టేషన్ లో వాకింగ్ చేస్తున్న మనిషి తన శరీర బరువును దించుకోవడానికి సతమతమౌతాడని నవ్వుకుంటూ, ఆమెమాత్రం తట్ట మూట సంచి సంసారం బరువు మోస్తు సాగిపోతుంటే నివ్వెరపోతాడు. చిన్నప్పుడు కనిపించినంత దూరం
తరచిచూసిన విమానం, నేడు అందులో కూర్చున్నా, మేఘాలు తాకుతున్నా చిన్నప్పటి ఆ స్థితి, అందులో ఆనందం ఇందులో ఉండదని చెప్పే స్థితిలో వైరాగ్యం కనిపిస్తుంది. గాయపడినా బతుకునే ప్రేమిస్తా, సుడిగాడ్పు చుట్టినా బతుకంతా నడుస్తా, నా తొవ్వ నడుస్తా అని తన విజయ యాత్రను ప్రకటిస్తాడు కవి. జీవికి జీవనానికి జలం అవసరాన్ని చేప్పె నీటిమనసు కవిత నీటి గొప్పతనాన్ని కొత్తగా ఆవిష్కరిస్తుంది. మరింత గౌరవాన్ని పెంచి నీటిముందు మోకరిల్లేలా చేస్తుంది. ఒక కవితలో విశాలమైన ఇంట్లో ఇరుకు మనసుల గుట్టు చెప్తాడు. ఇంకో కవితలో పనిరాదనుకుని హృదయాన్ని ఆ గోడదగ్గర వదిలివెళారు. పనికిరాకుండా పోతుందా అని అతడు తీసుకున్నాడంటారు.

‘గుండె పలిగే దుఃఖం’ వాక్యంలో ‘పగిలే’ అనవచ్చు కానీ రాసింది సిధారెడ్డి, భాషపట్ల మస్తు పాణమున్న మనిషి. తను, తనవారు మాట్లాడే ‘పలి?’
అనే అంటడు. నీరు ఇంట్లోకి, చేన్లోకి ‘ఇరాం’ లేకుంట ప్రవహిస్తది. ‘మాటాడుతనే ఉన
‘ ఇలాంటి మాటలు చదువుతుంటే సిధారెడ్డిగారే ఎదురుంగ వచ్చి మనతో మాట్లాడుతు న్నట్టు, కవిత చదువుతున్నట్టు దృశ్యం సాక్షాత్కరిస్తుంది. ఇలా ఈ పుస్తకంలోని భాష గురించి చెప్పేదేముంది! తెలంగాణమే ఆయన, ఆయనే తెలంగాణం. సిధారెడ్డిగారి కవిత్వం చదువుతుంటే కవి ఐనవారికే కాదు, సామాన్యునికి సైతం కలం పట్టాలనిపిస్తుంది. కవితను ప్రవహింపజేయాలనిపిస్తుంది. అతని కవిత చదలవుతున్నప్పుడు ఆ స్ఫూర్తి కలుగుతుంది. అంతటి ఉద్వేగం ఊపేస్తుంది. సహజాతం కవితలో తనను తాను ఆవిష్కరించుకుంటూ సిధారెడ్డి అందరికీ అందుతాడు. ఎవరికీ అందడు. ఒక కోపం…. ఒక ఓపిక… ఒక ఆర్తి… ఒకింత సాహసం… ఒకింత రాజీ… సిధారెడ్డి మారాడు.  సిధారెడ్డి మారడు. ‘వాక్యం శాశ్వతం’ కవితలో ఒకరో
జు దేశం విడిచిపోతాను మరొక రోజు లోకం విడిచిపోతాను అయితేమి? అక్షరాల సాక్షిగా
జీవించే పుస్తకం నేను. వర్ధిల్లే వాక్యం నేను అంటారు.
సలలిత భావాలు, అభివ్యక్తులు, అంతరంగ మహాసంద్రాలు, అంతే తెలియ
ని లోతులు ఎన్నో మరెన్నో నిక్షిప్తమైన చిన్ని పుస్తకం “నీటి మనసు’. ఇందులోని ఒక్కో అక్ష
రబింధువూ సింధువై అగుపిస్తుంది. బిందెలో పట్టక సిద్ధుని జటలలో నిలిచిన గంగ సాక్షాత్కరిస్తుంది. నీటిమనసు
నందినీ సిధారెడ్డి
పబ్లికేషన్స్ : మంజీర రచయితల సంఘం
ప్రతులకు : అన్ని పుస్తక దుకాణాలు

You may also like

Leave a Comment