ఇంతవరకు జరిగిన కథ:
ఆమని మనవడి పుట్టినరోజు వేడుకకు హాజరైన మైథిలి, మాలినిలు ఆ వేడుక పూర్తి కాగానే అదే ఊళ్లో ఉంటున్న పద్మిని ,హాసిని ,చంద్రికలను కలుస్తారు. వీరంతా ఒకప్పుడు విజయవాడలో ఒక ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాలలో కలిసి పని చేసినందున వీరి మధ్య గాఢమైన స్నేహం అల్లుకుంటుంది. పద్మిని, హాసిని ,చంద్రికలకు ప్రభుత్వ కొలువులు దొరకటంతో వారు ఆయా ఊళ్లకు వెళ్లిపోతారు. ఉద్యోగాలపోటీని తట్టుకోలేని మైధిలి ,ఆమని, మాలినిలు అవే ప్రైవేటు ఉద్యోగాలతో కుస్తీ పడుతుంటారు . గట్టి ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత ఉన్న మైధిలి కూడా అలాంటి అవకాశాన్ని దొరకపుచ్చుకోలేక ఇటు ఇంట్లోనూ అటు సమాజంలోనూ వివక్షకు గురవుతుంది .ఏ కాలమైతే ఆమని భర్త రామారావు గారిని ఉన్నతమైన మనిషిగా మలిచిందో అదే కాలం మాలిని పట్ల నిర్దాక్షిణ్యంగా పసుపు కుంకుమలకు దూరం చేసి పరోక్షంగా ఒంటరిని చేయటం , హాసిని పట్ల ఆమె భర్త ప్రవర్తించే వైఖరిలాంటి దుఃఖపూరిత విషయాలు తెలుసుకున్న మైధిలి బాధతో కదిలిపోతుంది. మేమంతా నీకు అండగా ఉంటామని ధైర్యం చెప్తారు హాసినికి మిత్రురాండ్రంతా
ఇక చదవండి
మేము వడ్డించుకుందామనే లోపులోనే అన్నయ్యగారు కొన్ని పదార్థాలు, అమని కొన్ని పదార్థాలు మా ప్లేట్లలో వడ్డించి, వాళ్ళు వడ్డించే పదార్థాలకి నో చెప్పే అవకాశం లేకుండా చేశారు మొత్తానికి ఇద్దరూ కలిసి. సరదాగా కబుర్లాడుకుంటూ భోజనం ముగించాము. రామారావు అన్నయ్యగారు జోక్స్ కట్ చేస్తూ, తనకు ఉద్యోగం వచ్చిన కొత్తలో జరిగిన కొన్ని సంఘటనలు చెబుతుంటే కడుపుబ్బా నవ్వుకున్నాం. మా టీచింగ్ పీరియడ్లో చూడటమే ఆయనని. సరదాగా మాట్లాడ్తారు రామారావు అన్నయ్య అని మాలిని చెబ్తుండగా, చాలాసార్లు వినివున్నాను గానీ, ఇంత క్లోజ్‌గా, సరదాగా స్వంత అన్నయ్యలాగా మాట్లాడటం చూస్తుంటే ఆ అభిమానానికి నా కండ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి. అది వారికంట కనపడకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నించాను నేను.
మాలిని వాళ్ళ కొడుకు, కోడలు ఉండేది, ఆమని వాళ్ళు ఉండేదీ అదే ఊరు. కానీ నేనే చాలా సంవత్సరాల తర్వాత కలిసి, చూస్తున్నందువల్లనో ఏమో… నిన్నటికి నిన్న పద్మిని దంపతులు, చంద్రిక వాళ్లింటో, వారు చూపించిన అభిమానం, మాలిని వాళ్ళ కొడుకు, కోడలు నన్ను రిసీవ్ చేసకుని అక్కున చేర్చుకున్న తీరు… ముఖ్యంగా మా అందరి పిల్లలు (ఒక్క హాసినికి మినహాయించి) మా కాలేజీలోనే, అంటే మేము పని చేసిన కాలేజీ విద్యార్థులవ్వటం వల్ల అప్పట్లో మేడమ్ అని సంభోదించినా, అప్పుడప్పుడు ఫోన్లలో పలకరింపు ద్వారా ఆంటీగా మారిపోయా. ఈరోజు అది నన్నెంతో సంతోషానికి అంతకు మించిన సంతృప్తిని మూటకట్టించింది. ఇలాంటి స్నేహితులుంటే చాలుగదా! వీరి ముందు సొంత చుట్టాలైనా బలాదూరే నన్పించింది. ఇదేమాట మాలినితో అంటే ‘‘అంతేనబ్బా’’ అంది తను కూడా.
ఓ గంట కూర్చున్నాక, బస్టాండుకు బయల్దేరాను నేను, అందరి దగ్గరా సెలవు తీసుకుంటూ. మాలిని, ఆమని ఇద్దరూ బస్టాండుకు వచ్చి, బస్ వచ్చేవరకు నిరీక్షించి, రాగానే నన్ను బస్సెక్కించి జాగ్రత్త అని చెప్పి, బైబై చెబుతూ, ఆటోలో వాళ్ళిద్దరూ వారి వారి ఇండ్లకు వెనుతిరిగారు.
***
ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ. మా జీవితాలు పరచిన ఎర్ర తివాచీలు అసలే కావు. ఇంటా, బయటా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, ముఖ్యంగా కుటుంబ విషయాల్లో ఎన్నో ఢక్కా మొక్కీలు తిని పడిలేస్తూ, లేస్తూ పడుతూ… ఇదిగో ఈనాటికి అన్ని బాధ్యతలూ తీరిపోయాయి కాబట్టి నిన్నటి పుట్టినరోజు వేడుకని అంత ఆనందమయం చేసుకోగలిగాము.
టిక్కెట్ అన్న కండక్టర్ పిలుపుతో మనీ పర్సు తెరచి సరిపడా డబ్బులిచ్చి టికెట్ తీసుకొని, పర్సులో పెట్టి విండోకి దగ్గిరగా జరిగి కూర్చున్నాను.
వాతావరణం ఎంతో ఆహ్లాదంగా అనిపించసాగింది. కిటికీలోంచి చల్లని గాలి మొహానికి తాకి, నా ఆహ్లాదానుభూతిని అది రెట్టింపు చేసింది.

ఆమని అందమైన పేరు. కానీ పేరుకీ, జీవితానికీ ఎటువంటి లంకె కుదరదు ఒక్కోసారి. కాలం కుదిపే కుదుపులకు అతీతులం కాదెవరమూ. వాటిని తట్టుకుని నిలబడేదే గదా జీవితమంటే.
ఒకరకంగా చెప్పాలంటే మా ఫ్రెండ్సందరి పేర్లూ చాలా సౌందర్యవంత మైనవే. అలా సాగిపోవాలనే ఆశతోటి మా తల్లిదండ్రులు చిన్నతనంలో పెట్టినవే. కానీ మానవుడు తలచేదొకటి, జీవితంలో జరిగేది వేరొకటి. అందరమూ ఈ కాలచక్ర భ్రమణంలో ఎదురయ్యే కష్టాలతో ఈడ్వబడుతూ అప్పుడప్పుడూ అతిథుల్లా పలకరించే సంతోషాలను బూస్టింగ్‌లా భావిస్తూ గెలుస్తూ ఓడిపోతూ, కొన్నాళ్ళు ఓడిపోతూ, గెలుస్తామనే ఆశతో కొన్నేళ్ళు… గెలుపు, ఓటముల కలయికే జీవితమనే యదార్థాన్ని జీర్ణం చేసుకుంటూ కాలంతో నడిచిన వసంతాలు కొన్ని.
ఏంటో ఈమధ్య బాగా వేదాంతం పుట్టుకొస్తోంది నాలో. ఇది వయసుతో పాటు ఆపాదింపబడినదా లేక జీవిత వాస్తవాల నుండి ఎగజిమ్మిన లావాలా చిలకరింపా? ఏదో మొత్తానికి వాటన్నింటినీ తట్టుకుంటూ, ఒకరకంగా చెప్పాలంటే మొండిగా అధిగమిస్తూ… ఇవాళ ఇలా నిలబడిగలిగాం మేమంతా. ఇంటింటికో చరిత్ర అన్నట్లుగా ఒక్కో కుటుంబానిది ఒక్కోగాథ. ఒక్కొక్కసారి జీవితంలో తెలుపు, నలుపుల మలుపులు. ఈనాటికీ చదరంగంలాంటి జీవిత పాఠాల, గుణపాఠాల గడులను నేర్పు అనే ఓర్మితో, ఒంటపట్టిన పాఠాలను నెమరువేస్తూ బంధాలను నిలుపుకుంటూ, గుణపాఠాల బడిలో ఇంకా నిత్య విద్యార్థులుగానే వెలుగుతూ అవసరమైన అంశాలను సేవ్ చేసుకుంటూ మనోవ్యాధికి గురిచేసి కుంగుబాటుని రానివ్వగల సంఘటనలను మొదడు నుండి డిలీట్ చేసుకుంటూ… అప్పుడప్పుడూ ఇదిగో ఇలా ఈ స్నేహ పరిమళాలను రీఛార్జ్ చేసుకుంటూ బ్రతుకు బ్యాటరీని వెలిగించుకుంటున్నాం.
మధ్యలో ఏదో ఊరొచ్చింది. పల్లీలు అమ్మేవాడి కేకలు చెవిలో ఘొల్లు మంటుంటే, ఆలోచనలతో ఓ కునుకు తీసిన నాకు గబుక్కున మెలకువ వచ్చింది.
మనసు మాయలమారి పుట్ట అంటారు చాలామంది. మనకు కోరికలను చుట్టేసి మనచుట్టూ మాయలనే పుట్టలాగా చుట్టగల నేర్పరి. కానీ నేను అనుభవాల పుట్ట, అల్లరి పుట్ట, జ్ఞాపకాల మాళిగ అని కూడా అంటాను, ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా.
మనం ఖాళీగా ఉన్నామని పసిగడితే చాలు ఒక్కో జ్ఞాపకాన్ని గాని, ఒక్కో సంఘటననుగాని మనమీదకు అస్త్రంగా సంధించి చోద్యం చూస్తూ మన మానసిక బలాబలాలను లెక్కగట్టే ఓ గొప్ప యంత్రమే మన మనసు.
వ్యసనాలు కొక్కేనికి తగిలించే చొక్కాలు కావు. అవి మనుష్యుల్ని రాపాడిరచి, చీడపురుగులై వ్యక్తిత్వాలను నిలువెల్లా కూల్చేస్తాయి. ముందు సరదాగానే మొదలవుతాయి. తర్వాత అలవాట్లుగా మారి కూర్చుంటాయి. వాటికి బానిసలుగా మారిన వారితో అనుక్షణం దాసోహం చేయించుకుంటాయి. చిత్తు చిత్తు చేస్తాయి జీవితాలను. ఒక్కరితోపోదు ఈ పీడ. చెట్టు వేళ్లను పెకిలిస్తే, ఇక చెట్టుకున్న కొమ్మలేం పచ్చగా ఉంటాయి? పూలేం పూస్తాయి? కాయలేం కాస్తాయి? చివరికి అంతా నాశనమే. వ్యసనాల బారినపడిన కుటుంబాలదీ అదే పరిస్థితి. మేల్కొంటే జీవితం మధ్య పేజీలో ఉన్నా ఆనందమే అంతటా. జీవితం వంద పేజీల పుస్తకమైతే మా జంటలన్నీ సెంటర్ పేజీని క్రాస్ చేసిన చదువరులమే!
ఆమధ్య పురా స్నేహితురాలు కలిసింది. తనపేరు సువర్ణ. ఇంచుమించు నా వయసే. మనసు మాణిక్యం. పేరుకు తగ్గట్టే పసిడి వర్ణం, గులాబీ వర్ణం రెండూ కలిపితే ఏర్పడే మేనిఛాయ తనది. పెద్ద పెద్ద కండ్లు. తీర్చినట్లుండే కనుబొమ్మలు. ఇంద్రధనువులా వంపు తిరిగి నల్లగా ఉంటాయి. వంకీల జుత్తు. పోనీ వేసుకుంటుంది. చేతినిండా మట్టిగాజులు. మాటలో సౌమ్యం. నడతలో నమ్రత. చీరకట్టులోనైనా, డ్రెస్‌లోనైనా తిరిగి చూడాలనిపించే అందమైన, ఆకర్షణీయమైన రూపం. నవ్వినపుడు తళుక్కుమనే పలువరుసని చూస్తే దానిమ్మ గింజలు కూడా అలుగుతాయేమో నన్పిస్తుంది. మా ఇద్దరిదీ ఒకేవూరు. వారి శ్రీవారిది, మా శ్రీవారిదీ ఒకటే డిపార్టుమెంటు అవ్వటం మూలంగా తరచుగా అనేకంటే దాదాపు అన్ని పెండ్లిళ్లల్లో, వేడుకల శుభసమయాల్లో కలుస్తుంటాం. అలా పరిచయం కాబడ్డ మేము క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోవటానికి ఎన్నో రోజులు పట్టలేదు.
తరచుగా కలిసినపుడు, అదే చాలా ఏండ్ల నాటి సుపరిచయమై కష్టసుఖాలను మనసు విప్పి చెప్పుకునే స్థాయికి ఎదిగేట్టు చేసింది. అలాగే సంత రోజుల్లో కూడా కూరగాయలు కొనుక్కోవటానికి వెళ్లినపుడు లేదా ఏదైనా షాపింగ్ సమయాల్లో కలిసేవాళ్ళం, సరదాగా ఉండేవాళ్లం.
అప్పుడప్పుడు ఫోన్లలో పలకరింపులు, ఛాటింగ్‌లు ఉండనే ఉంటాయి. ఒకసారి కలిసినపుడు… ఎప్పుడూ కలివిడిగా, సందడిగా తిరిగే తను ముక్తసరిగా మొహంలో ఏదో చెప్పనలవికాని బాధ గూడు కట్టుకున్నట్లు కనిపిస్తే, నేనే అడిగాను ‘ఏంటి సువర్ణా ఇలా ఉన్నావు? మొహంలో హుషారు కనబడట్లేదేంటి? పిల్లలకేమన్నా ఒంట్లో బాగోలేదని కబురొచ్చిందా?’ అన్నా. ‘ఊహూ…’ అంటూ తల అడ్డంగా ఊపింది కాదన్నట్లుగా.
‘మరి మీ వారికి ఏమైనా అనారోగ్యమా’? అని అడిగా.
దానికీ కాదని మళ్లీ తల అడ్డంగా ఊపింది. ఈసారి తన కండ్లలో సన్నని నీటిపొరను చూశాను. ఎందుకో నా మనసు కలుక్కుమంది. ఆనోటా, ఈనోటా వాళ్లింటాయన గురించి విన్నాను. తర్వాత ఒకరిద్దరి ద్వారా తెలిసినది ‘నిజమే… సువర్ణ వాళ్ళాయన చాలా అనుమానం మనిషి’ అని. నాకెందుకో బాగా డౌట్ వచ్చింది. ఆ హాల్లో సత్యనారాయణ వ్రతం జరుగుతోంది. బాగా పరిచయస్తులవ్వటంతో మేము అంటే నేను, సువర్ణ ముందుగానే వెళ్ళాము. ఆలస్యంగా వెళితే బాగోదని. ఈ వ్రతం, పెట్టుబడులు అవ్వీ ఇవ్వీ అయ్యేటప్పటికి కనీసం గంటన్నర పైచిలుకే పట్టేట్లుంది. ఇక లాభం లేదు. తన మనసెందుకో బాగా బాధపడుతోందని అర్థమైంది. కనుక్కోవాలనుకున్నాను. అది గృహప్రవేశ ఫంక్షను. అంతకుముదే అవతలి రూంలో గణపతి హోమం చేశారు. ఇవతలి రూంలో వ్రతం పెట్టుకున్నారు. దీపారాధన వెలిగించబడి ఉన్నది గదా స్వామి వారి మంటపం ముందు ఫ్యాన్లు బంద్ చేసేశారు. నిజంగా ఆ హోమపు పొగ ఇవతలికి కూడా బాగా వస్తోంది. ఈ వంకతో తనని ‘కాసేపు అటు బైట కూర్చుందాం రా… పొగ తగ్గాక లోపలికి వద్దాంలే’ అంటే, సరేనని తల ఊపింది.
గట్టిగా అడిగితే చాలు ఆ కన్నీటి కుండలైన ఆ కండ్ల నుండి ధారగా మారటానికి సిద్ధంగా ఉన్నాయి కన్నీళ్ళు. నెమ్మదిగా తన భుజం చుట్టూ లాలనగా నా రెండు చేతులను చుడుతూ ‘ఏమైంది?’ అని అడిగా. ఇక నీవు చెప్పకపోతే ఊరుకోనన్నట్లుగా చూశాను. చెప్పకపోతే వదిలేలా లేదనుకుంది కాబోలు, అటూ ఇటూ తటపటాయిస్తూ చూసింది నాల్గువైపులా భీత హరిణిలా.
గృహ యజమాని, భార్య, వారి పిల్లలు వ్రతం చేసుకుంటున్నారు బుద్ధిగా దగ్గిర బంధువులని పిలవబడే వాళ్ళు వారి చుట్టూ జంపఖానాల మీద కొందరు మోకాళ్లనొప్పి, నడుము నొప్పి బాధితులు కుర్చీలలో కూర్చుని శ్రద్ధగా స్వామివారి కథను వింటన్నారు. మగవాళ్ళు బైట వరండాలో కూర్చుని లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు.
‘మనవేపు ఎవరూ చూడట్లేదుగాని, ఏంటమ్మాయి ఈరోజు చాలా మూడీగా ఉన్నావు’ అని నిలేశా. ఏ ఇంటిలోనైనా ఉత్తరం సందు వదులుతారు గదా. అలానే ఉంది ఆ ఇంటికి కూడా. అక్కడే సేఫ్ అని నే అటుదారి తీశా, కుర్చీ తీసుకుని, నాతోపాటే తానూ తన కుర్చీ తెచ్చుకుంది అక్కడికి.
గతంలో చిన్ని చిన్ని విషయాలు చెప్పి బాధ పడేదికానీ, దానిని మించిన బాధ పడ్తోందీరోజు అన్పించింది తన వాలకం చూస్తుంటే. కండ్లనిండా ధారగా కురుస్తున్న కన్నీటిని కర్చీఫ్‌తో అద్దుకుంటూ, సన్న గొంతుకతో, కేవలం నాకు మాత్రమే వినపడేటట్లుగా లో గొంతుకతో చెప్పటం ప్రారంభించింది. మా కష్టసుఖాలేవి కలబోసుకున్నా అవి మా కడుపులోనే ఉంటాయి. ఒకరిమీద మరొకరికి అలాంటి నమ్మకం ఉంది మాకు ఇప్పటికీ, ఎప్పటికీ. అది మాకు బాగా తెలుసు.
‘‘నేను రోజూ యోగా క్లాస్‌కి తెల్లవారురaామునే వెళ్తాను కదా!’’ అంది దుఃఖాన్ని తమాయించుకుని.
‘‘అవునూ’’ అన్నాను. తను, నేనూ యోగా క్లాసులో కూడా తను ముందు వెళితే, నా మ్యాట్‌ను ప్రక్కనే వేసి ఉంచేది. అలాగే ఒకవేళ నేను ముందుగా వెళ్ళినపుడు నా ప్రక్కనే తనకు మ్యాట్ వేసి ఉంచేదాన్ని. దాదాపు రెండేళ్లు యోగా క్లాస్ మేట్స్‌మి కూడా. తర్వాత నాకు కొంచెం అనారోగ్యంగా ఉండటంతో ఒక సంవత్సరం అయిపోతుంది వెళ్ళక. ఇంట్లోనే ప్రాణాయామం చేస్తాను. రోజూ సాయంత్రాలు యాభై నిముషాలు తగ్గకుండా నడుస్తాను. నా జ్ఞాపకాలకు బ్రేక్ వేస్తూ తనను ‘తర్వాతేం జరిగింది?’ అన్నా కండ్లతోటే.
యోగా సెషన్‌లో చివరిరోజు వార్షికోత్సవం లాగా చేస్తారు. బాగా అనుభవజ్ఞులైన యోగా టీచర్ జిల్లా కన్వీనర్‌గా పిలువబడే యోగా గురువు ఒకరిద్దరు హాజరవుతారు. యోగాపట్ల మీమీ స్పందన తెల్పండి అని అందరితో మాట్లాడిస్తారు. అందరితో అదే హాలులో ఆటలాడిస్తారు. మెమొరీ పవర్ పెంచేవీ, ఐక్యతను వృద్ధి చేసేలాంటి వాటితోటి. మధ్యలో ఆధ్యాత్మిక విషయాలను మన మనసులలో పదిలం చేసుకునే దిశగా భగవంతుని మీద ఉండే కీర్తనలు, పాటల కేసట్లను పెట్టి మనల్ని కండ్లు మూసుకోమని సూచనలిస్తూ భజనలు చేయిస్తారు. నిజంగా ఎంతో పారవశ్యంతో కూడిన ఆధ్యాత్మికానందాన్ని పోగు చేసుకుంటాం ఈ కార్యక్రమం ద్వారా. ఆరోజు ఫలహారం అందరికీ అక్కడే సమకూర్చబడుతుంది. మనల్నే పండ్లు తెమ్మంటారు. కొంతమంది ఆరోజు డ్రైఫ్రూట్స్ లాంటివి కూడా తెస్తారు. ఆ హాలే క్యాంటీన్. మనమే కుక్స్. మనం తెచ్చినవే వెరైటీ టిఫిన్స్. మధ్యలో ఒక గంట స్వల్ప విరామం కేటాయిస్తారు. అక్కడ నీనా అనే తేడాగానీ ఉచ్ఛ, నీచ, ఆడ, మగ బేధాలేవీ ఉండవు. ఉండేదల్లా అంతా ఒకే కుటుంబమనే సద్భావన మాత్రమే. అందరూ తెచ్చిన పండ్లన్నీ ముక్కలుగా కోసి, ఎంతమంది ఉంటే అంతమందికి ప్లేట్లలో పంచుతారు. వండిన ఆహార పదార్థాలు టిఫిన్‌కు నిషిద్ధం ఆరోజు. ఒకరోజు ముందే ఈ విషయాన్ని సూచిస్తూ మీతోపాటుగా ఇంకో ఇద్దరికి సరిపడా పండ్లు తెమ్మని చెబుతారు. కోసిన ఆ పండ్ల ముక్కలన్నీ కలిపితే బోల్డవుతాయి. అందరి కడుపునిండగా ఇంకా కొన్ని పదార్థాలు మిగిలిపోతే ఇంటికొచ్చేటప్పుడు ఎవరికి కావాలంటే వారిని తినమంటారు. ఎవరైనా కొబ్బరినీళ్ళు తెచ్చినా, ఫ్రూట్స్ సలాడ్స్ లాంటివి తెచ్చినా, వాటినీ గ్లాసుల్లో పోసిస్తారు అందరికీ. ఇలా బ్రేక్‌గా ఇచ్చిన గంట సమయం సరదా సరదా కబుర్లతో ఇట్లే గడిచిపోతుంది. టాయిలెట్స్‌కి వెళ్లొచ్చేవారు వెళ్లొస్తారు. అందరం అక్కయ్య, అన్నా, తమ్ముడు, చెల్లి లాంటి ఆప్యాయతా పూర్వక పిలుపులే. ట్రైనర్స్‌ని గురువుగారని సంబోధిస్తాం. వాలంటీర్లను చిన్న గురువుగారంటాం నవ్వుతూ. ఎక్కడా ఎలాంటి అమర్యాద పూర్వక వాతావరణాన్కిగానీ తావుండదు. యోగా హాల్ అంటే పవిత్ర దేవాలయం. మధ్య మధ్యలో గురూజీల ప్రసంగాలు ఉంటాయి. వాటి తర్వాత మరికొన్ని యోగాసనాలు, తర్వాత మళ్లీ ఏవైనా రెండు ఆటలు, మళ్లీ స్పీచ్, స్పందనలు ` ఇలా ఒకదాని తర్వాత మరో అంశం నిర్వహింపబడుతూ ఎక్కడా బోర్ అనేదానికి తావులేకుండా ఆరోజు మరపురాని రోజుగా మలుస్తారు యోగా గురువులు.
ఉదయం ఐదు గంటలకు ప్రారంభమైన యోగా ఈ చివరిరోజు మాత్రం దాదాపు ఇదంతా పూర్తయ్యేసరికి పదకొండున్నర, పన్నెండు అలా అయిపోతుంది. చెప్పలేదు కదూ! సాధకులందరూ గురూజీని దుశ్శాలువాతో సన్మానించి మెడలో పూలదండను సమర్పిస్తారు. కొంతమంది వారి వారి శ్రద్ధాసక్తుల మేరకు నూతన వస్త్రాలు కూడా సమర్పించటం కద్దు. కానీ ఈ వస్త్ర సమర్పణ అనేది అనివార్యం కాదు. మరి నాకేం గురుదక్షిణ ఇస్తారు? మీరంతా అని గురువుగారు అడిగిన ప్రశ్నకు సాధకులంతా తమకు తోచిన రీతిలో సమాధానమిస్తుంటే ఆయన నవ్వుతూ ఇవన్నీ ఏమీ వద్దు! మీరు నేర్చుకున్న ఈ యోగావిద్యను మీ వంతుగా మరో ఇద్దరికి పరిచయం చేయండి. ఒకవేళ కుదరక రోజూ క్లాసుకు హాజరవ్వకలేకపోయినా మీరు ఈ నేర్చుకున్న క్రియలను అభ్యాసం చెయ్యండి. సంపూర్ణ ఆరోగ్యంతో
ఉండండని దీవిస్తారు. ఎంతోమంది బాబాల పేరుతో, స్వామీజీల పేరుతో ఫలాపేక్షతోటే నడుస్తున్న నేటి సమాజంలో ఎటువంటి స్వలాభాన్ని ఆశించకుండా మరో ఇద్దరికి మీ వంతుగా నేర్పండని కోరటమే గురుదక్షిణ అని చెప్పిన సంస్కారవంతమైన ఈ యోగా గురుపరంపర యొక్క విలువలను ఆచరించి, తరించటమే తప్ప ఏమిచ్చి కొనుక్కోగలం. ఈ యోగ కుటుంబం నేర్పిన నిస్వార్థ పూరితమైన కుటుంబిక సంస్కారాలను ఎన్ని లక్షలు పెట్టినా కొనగలమా?
‘గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన’ అన్న రీతిగా కొంతమంది యోగా చేసేవారిని చులకనగా చూస్తూ, పొద్దున్నే వెళ్తున్నారంటే ఏదో కూడని పనికే
వెళ్తున్నారనే కాలం. ఇలాంటి పచ్చకామెర్ల రోగులను ఏ వైద్యుడు బాగుచేయగలడు? ఏ గురువులు సంస్కారాలనందివ్వగలరు? ఏ ఉపాధ్యాయుడు సత్ప్రవర్తన గురించి బుర్రకెక్కేట్టు పాఠాలు బోధించగలడు? పుట్టుకతో వచ్చిన బుద్ధి పిడకలతో పోవాల్సిందే. సరిగా ఇలాంటి కోవలోకే వచ్చే ఓ ఆణిముత్యం సువర్ణ వాళ్ల పతిదేవుడని తెలిసింది తను వెళ్లబోసుకున్న విషయాలు ద్వారా.
‘‘అతగాడి మనస్తత్వమిదేనని తెలుసుగదా మొదట్నుంచి? నువ్వెందుకు అతిగా బాధపడుతున్నావ్?’’ అన్నా.
‘‘అదికాదు మైథిలీ… యోగాసనాలు అన్నీ అయిపోయిన తర్వాత శవాసనం వేయమంటారు గదా, నాదసలే వంకీల జుట్టు, లేచినపుడు కొద్దిగా జుట్టు చెదురుతుంది గదా! పోనీకి పెట్టిన క్లిప్పు తీసేస్తా, శవాసనం వేసినపుడు. అందుకు అనుమానపు చూపులు వెళ్ళగానే. ఒక్కోరోజు మరీ గుర్రుగా ఉంటాడని చెప్పింది’’ వాపోతూ.
‘‘ఏం చెబితే అర్థమవుతుంది అతనికి? ఎలా చెబితే అర్థమవుతుందో? నాకేం అర్థం కావట్లేదు. ఒక్కోసారి బాగా ఏడుపొచ్చేస్తుంటుంది’’ అని చెబుతుంటే నాకు చాలా బాధ అన్పించింది సువర్ణను చూడగానే.
‘‘మొన్న వారం రోజుల క్రితం యోగా సెషన్ పూర్తయింది మైథిలీ. ఎప్పటిలాగే వార్షికోత్సవంలాగా చేస్తారు గదా ముగింపు పండుగంటూ. నీకు తెల్సు గదా..’’ అంది. ‘‘అవును’’ అన్నాను.
నేనైతే నాకున్న ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్ల మానివేశానుగానీ, సువర్ణ మానకుండా వెళుతూనే ఉంది యోగా క్లాసులకు.
ఇలాగా మాకీరోజు సెషన్ చివరి రోజు. లేటవుతుంది. మధ్యాహ్నం పన్నెండయి పోతుందని చెప్పిందట భర్తతో. సరేనని అన్నాడట. వాళ్ళకు జావ తాగే అలవాటు, టిఫిన్ తినగానే. తనొక్కడే గదాని వదిలెయ్యలేదు మైథిలీ. ఇడ్లీ వేసి హాట్ ప్యాక్‌లో సర్దా. పల్లీ చట్నీ కూడా చేశా తినలేరని. పక్కనే కొరప్పొడి డబ్బా
ఉండనే ఉంటుంది ఎప్పుడూ. జావచేసి ఫ్లాస్కులో పోశా. అన్నీ ఎదురుగా డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టానని చెబితే సరేనన్నారు.
వాళ్ళకు పెరడు పెద్దది. పూలమొక్కలవీ బాగా ఉంటాయి. రోజూ ఊడుపు ఎక్కువే. అయినా ఏనాడు విసుగు కనిపించదు తన మొహంలో ఎప్పుడైనా అటుగా వెళ్లినపుడు వాళ్లింటికి వెళ్లటం అలవాటే నాకు. ఏ సమయంలో చూసినా చాలా
శుభ్రంగా ఉంటుంది వాకిలి గాని, పెరడుగానీ. ఇలా ఎలా సాధ్యమని అడిగితే, రెండుపూటలా శుభ్రంగా ఊడుస్తానని చెప్తే, నాకెంతో ముచ్చటేసేది. అట్లా అన్ని పనులూ చేసి, తనను ఉదయం తినటాన్కి, తాగటాన్కి కావలసినవి సిద్ధం ఏసి చెప్పి వచ్చినా ఆరోజు ‘‘ఏంటే ఇంత ఆలస్యమయింది? ఆ జుట్టంతా రేగిపోయి
ఉందేంటి? ఎక్కడ పడుకుని వచ్చావు ముండా’’ అని బూతులు తిడుతూ గొంతును పిసకబోయాడట. తన మెడచుట్టూ బిగుసుకుంటూన్న వాడి రెండు చేతులనూ ఎట్లాగో బలవంతంగా విడదీసుకుని నేను గదిలోకి పోయి చాలాసేపటిదాకా తలుపులేసుకున్నా భయంతోటి’’ అని సువర్ణ చెప్తుంటే తనగుండె వేగంగా ఎగిరిపడటాన్ని గమనించా. మొహమంతా బాధతోటి వివర్ణమైపోయింది.
‘‘ఇంతకుముందు అనుమానంగా చూసేవాడు, కోపంతో టీకప్పు విసిరేసేవాడు, టీ బోగోలేదంటూ. కూరలు ఎంత రుచిగా వండినా కుదరలేదు, నీ ధ్యాస ఎక్కడ ఏడుస్తోందని చాలా చులకన చేసి మాట్లాడేవాడట. అప్పుడు పిల్లలుండేవారట. ఎందుకు డాడీ అనవసరంగా మమ్మీని తిడుతున్నారని పిల్లలు గట్టిగా నిలదీస్తే, తన గదిలోకి పోయి ఆరోజంతా అలకపాన్పు ఎక్కేవాడట. ఎన్నిసార్లు పిలిచినా భోజనానికి రాకపోతే, చివరికి తనే ఉసూరనిపించి భోజనం ప్లేట్లో పెట్టి, గదిలో టీపాయ్ మీద పెట్టి వచ్చేదట. సువర్ణ మంచినీళ్లు, పెరుగు, రసంతో సహా. మళ్ళీ మధ్యలో తనెళ్లి కనబడితే ఎక్కడ మధ్యలో అహంతో చెయ్యి కడిగేసుకుంటాడోననే జాలితో. ఇదిగో ఇదే వీక్‌పాయింట్ ఆడాళ్లందరిదీ. మన తప్పులేకుండా తిట్లుపడటం, ప్రతి చిన్నదానికి సాకులు పెట్టి హేళనగా మాట్లాడే మాటల్ని భరించటం. మన కుటుంబాలే ఇలా ఏడ్చాయా? లోకంలో ఉన్న కొంపలన్నీ ఇట్లాగే తగలడ్డాయా? లేదా మన కొంపల్లోనే ఇలా ఉంటాయా అన్పిస్తుంటుంది ఒక్కోసారి ఇలాంటివన్నీ వింటుంటే.
మళ్ళీ సువర్ణ ఏమనేదో తెలుసా ‘‘మైథిలీ… ప్లేటు మొత్తం ఖాళీ చేసేశాడు, ఒక్క చుక్క కూడా విడవకుండా పెరుగు మొత్తం తాగేసేవాడట. దొంగపిల్లి నాకినట్లుగా వుండేదట ఆ ఖాళీ అయిన పెరుగు కప్పును చూస్తుంటే అని చెప్పి నవ్వేది తర్వాత. అది దొంగపిల్లి కాదు, బలిసిన పెద్ద గండుపిల్లి. జంగు పిల్లి’’ అని నేను తిట్టుకునేదాన్ని మనసులో.
‘‘ఆకలైతే వాడే తింటాడులే అని ఈసారి నేనేం పట్టించుకోలేదు. ఈరోజు నా ధర్మంగా నేను అన్నం, కూరా వండి పెట్టాను టేబుల్ మీద. నన్ను నేను సమాదాయించుకుంటూ చెయ్యని తప్పుకు నేనెందుకు కడుపు మాడ్చుకోవాలని ఓ రెండు ముద్దలు పెట్టుకుని తిని చెయ్యి కడుక్కున్నాను. ఈసారి నాకు తినమని కూడా అడగాలనిపించలేదు. నా దారిననే వెళ్ళి పిల్లల రూమ్‌లో పడుకున్నాను. తర్వాత రెండు రోజులదాకా నాకు చాలా డిప్రెషన్‌లాగా అనిపించింది’’ అంటూ ఎంతో బాధతో చెబుతుంటే నా ప్రాణం విలవిలలాడిపోయింది తన బాధాపూరితమైన మాటలు వింటుంటే.
‘‘మరి ఆ రెండు రోజులూ ఏం చేశాడు మీ ఆయన? తిండి తిన్నాడా? లేదా’’ అని అడిగా… ఒకింత బాధతో మిళితమయిన కోపంతో’’
‘‘ఆ… ఎందుకు తినలా! శుభ్రంగా మెక్కాడు. నంగనాచిలా ఆ మరుసటిరోజే చికిన్ తెచ్చి, నాకు కనబడేటట్లు టేబుల్ మీద పెట్టాడు. వండు అన్నట్టు. నా బాధను, కోపాన్ని తమాయించుకుని వండి పెట్టాను. శుభ్రంగా తిన్నాడు సిగ్గులేకుండా’’ అన్నది. తన మనసు ఎంత వేదనకు గురయితే ఈ మాట వచ్చిందోనని అనుకున్నా.
‘‘మరి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నావా? మానేశావా యోగాకి వెళ్ళటం? మీ ఇంటి దగ్గర ఉన్న విమలా, రత్నమ్మ గార్లతో కలిసేగా వెళ్ళేది, వచ్చేదీ’’ అన్నా.
‘‘అవును, అయినా వాడికి అనుమానం పొరలు కమ్మి, కండ్లు కనబడని గుడ్డోడవుతాడు. అదే మావాడి స్పెషాలిటీ’’ అంది విరక్తిగా.
‘‘ఆ… ఎందుకులే పెంటగోల అని మానేశాను. యోగాకు వెళ్లట్లేదంది. ఇట్లా బాధపెట్టి బెదిరించి, మాన్పించాలనేగా వాడి ప్లానంతా. వాడనుకున్నది సాధించుకున్నాడు. చివరికి నన్ను నాల్గు గోడలకి బందీ చేసి’’ అన్నది మళ్ళీ కోపంగా.
ఇదివరకు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కొంతలో కొంతవరకు నయం. ఆలోచించేవాడు మాట వదలాలంటే. ఇప్పుడు వాళ్ళిద్దరూ బెంగుళూరులో
ఉంటన్నారుగా ఉద్యోగాల్లో. ఇక వీడు మరీ పేట్రేగిపోతున్నాడు. ఒక్కోసారి ఏం వాగుతున్నాడో కూడా తెలవట్లేదు. ఆనోటికి హద్దూపద్దూ ఉండట్లేదని వాపోయింది సువర్ణ.
అందంగా పుట్టడం సువర్ణ చేసుకున్న పాపమా? అందంగా ఉన్న తమ కూతుర్ని, ఉద్యోగస్తుడూ… లక్షణంగా పెండ్లాన్ని చూసుకుంటాడని నమ్మి ఇతగాడికిచ్చి కట్టబెట్టిన తల్లిదండ్రులదా?
మగడు ఏదన్నా పడుండాలి. వాడికి కోపమొస్తే భరించాల్సిందేనమ్మా అంటూ సాగదీసే సదరు అత్తగారి టెంపరితనమా?
నిజంగానే ‘కాకి ముక్కుకు దొండపండు’ అనే సామెతకు నూటికి రెండొందల శాతం కరెక్టు సువర్ణ భర్తగారి విషయంలో. నాకు ఆ పేరెత్తి ఇదీ అని చెప్పాలన్నా కంపరమెత్తుతుంది ఇప్పటికి కూడా.
ఇలా చాలా విషయాలు తెలుస్తుంటాయి అప్పుడప్పుడు తన ద్వారా. అందుకే నాకు సువర్ణ భర్త అంటే ఏవగింపు. తను కూడా ఇంతకు మునుపు ఎంత బాధలో ఉన్నా మా ఆయన, మావారు అని సంబోధించేది నాతో మాట్లాడేటప్పుడు. ఎంత బాధ సలుపుతుంటే, మనసులో ఎంత విరక్తి పుడితే వాడు, వీడు అని తిడ్తుంది భర్తను. నాకు తప్పులేదనిపించింది. మరి తక్కువ పనులు చేశాడావాడు అని పిలవబడుతున్న సదరు సువర్ణ గారి మొగుడుగారు.
నువ్వు తెల్లగానే ఉంటావు గదా, నీకెందుకు క్రీములు, పౌడర్లు అని సాధించేవాడట. కొత్త బట్టలు కట్టుకుంటే ఓర్చుకోలేడట. మంచిగా తల దువ్వి జడ వేసుకున్నా అనుమానమేనట… ఎవరన్నా ఇంటికి అతిథులు వస్తే, అందులో
వాళ్ళు పురుష పుంగవులైతే తనను మంచినీళ్ళు కూడా తేనీయడట. ఒకసారి అలాగే టీ పెట్టి పట్టుకెళితే, నానా బూతులూ తిట్టాడట వాళ్ళు వెళ్ళిన తర్వాత. ఇక అప్పట్నుంచి అతగాడికే టీ కప్పులు ట్రేలో పెట్టి అందిస్తే తీసుకెళ్లి వాళ్లకిస్తాడట. దొడ్లో అంట్లు తోముతుంటుంటే రోజూ కుర్చీ వేసుకుని కూర్చొని, ఆ సమయానికి పేపరో, పుస్తకమో చదువుకుంటున్నట్లు నటిస్తాడట. మొదట్లో అర్థమయ్యేది కాదట సువర్ణకు. దొడ్డివైపు తలుపులు వేసేవుంటాయట. తియ్యరట ఎప్పుడూ. అయినా వాడికి అనుమానమేనట. ఒకసారి పౌడర్లో సున్నం కలిపాడట. మామూలుగా రోజూ రాసుకున్నట్లు రాసుకుంటే, మొహమంతా పొక్కిపోయి ఎలర్జీ వచ్చి, ఆసుపత్రికి వెళితే ఆ పౌడరును చూసి అందులో సున్నం కలిసిందని చెప్పారట డాక్లర్లు. మళ్ళీ ఇంకోసారి స్ప్రే బాటిల్లో హ్యాండ్ వాష్ లాంటిది కలిపాడట. ఇదీ వాడి నిర్వాకమేనని తెలిసి వాళ్ళ పెద్దబ్బాయికి చూపిస్తే ‘నిజమే మమ్మీ ఇందులో హ్యాండ్ వాష్ కలిపాడు అని తండ్రిని ఛీత్కరించుకున్నాడట.’ వాళ్ళ డాడీ వెలగబెట్టే నిర్వాకాలన్నీ తెలుసు పిల్లలకు. వాళ్ళేం చిన్నవాళ్ళు కాదుగా! అందుకే ఏదన్నా శుభకార్యానికి వెళ్ళాలంటే ఆ… డాడీ ఎందుకు మమ్మీ? మనమే వెళ్లొద్దాం అంటారట. తండ్రి అంటే అతను చేసే పనుల వల్ల ఎంత విలువ తగ్గిపోతోంది తండ్రిగా తనకు అని ఒక్కోసారి చెప్పి నిట్టూరుస్తూంటుంది సువర్ణ.
‘ఇన్ని చేస్తున్నా, మావారంటే నాకు చాలా ఇష్టం మైథిలీ’ అంటుంది నాతో ఒక్కోసారి.
‘‘కానీ నా ప్రేమను గుర్తించడు. ఎప్పుడు సందు దొరుకుతుందా అని ఎదురుచూస్తుంటాడు సూటీ పోటీ మాటలు వదలటానికి’’ అన్నది మళ్ళీ.
నమ్మకం లేనిచోట ప్రేమ ఉండదంటారు నిజమే. భార్యమీద, ఆమె నడత మీద అస్సలు ఏమాత్రం నమ్మకం లేదు. అందుకే అంత ఆవేదన సువర్ణకు.
శుభ్రంగా ఉంటుంది వాకిలి గాని, పెరడుగానీ. ఇలా ఎలా సాధ్యమని అడిగితే, రెండుపూటలా శుభ్రంగా ఊడుస్తానని చెప్తే, నాకెంతో ముచ్చటేసేది. అట్లా అన్ని పనులూ చేసి, తనను ఉదయం తినటాన్కి, తాగటాన్కి కావలసినవి సిద్ధం ఏసి చెప్పి వచ్చినా ఆరోజు ‘‘ఏంటే ఇంత ఆలస్యమయింది? ఆ జుట్టంతా రేగిపోయి
ఉందేంటి? ఎక్కడ పడుకుని వచ్చావు ముండా’’ అని బూతులు తిడుతూ గొంతును పిసకబోయాడట. తన మెడచుట్టూ బిగుసుకుంటూన్న వాడి రెండు చేతులనూ ఎట్లాగో బలవంతంగా విడదీసుకుని నేను గదిలోకి పోయి చాలాసేపటిదాకా తలుపులేసుకున్నా భయంతోటి’’ అని సువర్ణ చెప్తుంటే తనగుండె వేగంగా ఎగిరిపడటాన్ని గమనించా. మొహమంతా బాధతోటి వివర్ణమైపోయింది.
‘‘ఇంతకుముందు అనుమానంగా చూసేవాడు, కోపంతో టీకప్పు విసిరేసేవాడు, టీ బోగోలేదంటూ. కూరలు ఎంత రుచిగా వండినా కుదరలేదు, నీ ధ్యాస ఎక్కడ ఏడుస్తోందని చాలా చులకన చేసి మాట్లాడేవాడట. అప్పుడు పిల్లలుండేవారట. ఎందుకు డాడీ అనవసరంగా మమ్మీని తిడుతున్నారని పిల్లలు గట్టిగా నిలదీస్తే, తన గదిలోకి పోయి ఆరోజంతా అలకపాన్పు ఎక్కేవాడట. ఎన్నిసార్లు పిలిచినా భోజనానికి రాకపోతే, చివరికి తనే ఉసూరనిపించి భోజనం ప్లేట్లో పెట్టి, గదిలో టీపాయ్ మీద పెట్టి వచ్చేదట. సువర్ణ మంచినీళ్లు, పెరుగు, రసంతో సహా. మళ్ళీ మధ్యలో తనెళ్లి కనబడితే ఎక్కడ మధ్యలో అహంతో చెయ్యి కడిగేసుకుంటాడోననే జాలితో. ఇదిగో ఇదే వీక్‌పాయింట్ ఆడాళ్లందరిదీ. మన తప్పులేకుండా తిట్లుపడటం, ప్రతి చిన్నదానికి సాకులు పెట్టి హేళనగా మాట్లాడే మాటల్ని భరించటం. మన కుటుంబాలే ఇలా ఏడ్చాయా? లోకంలో ఉన్న కొంపలన్నీ ఇట్లాగే తగలడ్డాయా? లేదా మన కొంపల్లోనే ఇలా ఉంటాయా అన్పిస్తుంటుంది ఒక్కోసారి ఇలాంటివన్నీ వింటుంటే.
మళ్ళీ సువర్ణ ఏమనేదో తెలుసా ‘‘మైథిలీ… ప్లేటు మొత్తం ఖాళీ చేసేశాడు, ఒక్క చుక్క కూడా విడవకుండా పెరుగు మొత్తం తాగేసేవాడట. దొంగపిల్లి నాకినట్లుగా వుండేదట ఆ ఖాళీ అయిన పెరుగు కప్పును చూస్తుంటే అని చెప్పి నవ్వేది తర్వాత. అది దొంగపిల్లి కాదు, బలిసిన పెద్ద గండుపిల్లి. జంగు పిల్లి’’ అని నేను తిట్టుకునేదాన్ని మనసులో.
‘‘ఆకలైతే వాడే తింటాడులే అని ఈసారి నేనేం పట్టించుకోలేదు. ఈరోజు నా ధర్మంగా నేను అన్నం, కూరా వండి పెట్టాను టేబుల్ మీద. నన్ను నేను సమాదాయించుకుంటూ చెయ్యని తప్పుకు నేనెందుకు కడుపు మాడ్చుకోవాలని ఓ రెండు ముద్దలు పెట్టుకుని తిని చెయ్యి కడుక్కున్నాను. ఈసారి నాకు తినమని కూడా అడగాలనిపించలేదు. నా దారిననే వెళ్ళి పిల్లల రూమ్‌లో పడుకున్నాను. తర్వాత రెండు రోజులదాకా నాకు చాలా డిప్రెషన్‌లాగా అనిపించింది’’ అంటూ ఎంతో బాధతో చెబుతుంటే నా ప్రాణం విలవిలలాడిపోయింది తన బాధాపూరితమైన మాటలు వింటుంటే.
‘‘మరి ఆ రెండు రోజులూ ఏం చేశాడు మీ ఆయన? తిండి తిన్నాడా? లేదా’’ అని అడిగా… ఒకింత బాధతో మిళితమయిన కోపంతో’’
‘‘ఆ… ఎందుకు తినలా! శుభ్రంగా మెక్కాడు. నంగనాచిలా ఆ మరుసటిరోజే చికిన్ తెచ్చి, నాకు కనబడేటట్లు టేబుల్ మీద పెట్టాడు. వండు అన్నట్టు. నా బాధను, కోపాన్ని తమాయించుకుని వండి పెట్టాను. శుభ్రంగా తిన్నాడు సిగ్గులేకుండా’’ అన్నది. తన మనసు ఎంత వేదనకు గురయితే ఈ మాట వచ్చిందోనని అనుకున్నా.
‘‘మరి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నావా? మానేశావా యోగాకి వెళ్ళటం? మీ ఇంటి దగ్గర ఉన్న విమలా, రత్నమ్మ గార్లతో కలిసేగా వెళ్ళేది, వచ్చేదీ’’ అన్నా.
‘‘అవును, అయినా వాడికి అనుమానం పొరలు కమ్మి, కండ్లు కనబడని గుడ్డోడవుతాడు. అదే మావాడి స్పెషాలిటీ’’ అంది విరక్తిగా.
‘‘ఆ… ఎందుకులే పెంటగోల అని మానేశాను. యోగాకు వెళ్లట్లేదంది. ఇట్లా బాధపెట్టి బెదిరించి, మాన్పించాలనేగా వాడి ప్లానంతా. వాడనుకున్నది సాధించుకున్నాడు. చివరికి నన్ను నాల్గు గోడలకి బందీ చేసి’’ అన్నది మళ్ళీ కోపంగా.
ఇదివరకు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కొంతలో కొంతవరకు నయం. ఆలోచించేవాడు మాట వదలాలంటే. ఇప్పుడు వాళ్ళిద్దరూ బెంగుళూరులో
ఉంటన్నారుగా ఉద్యోగాల్లో. ఇక వీడు మరీ పేట్రేగిపోతున్నాడు. ఒక్కోసారి ఏం వాగుతున్నాడో కూడా తెలవట్లేదు. ఆనోటికి హద్దూపద్దూ ఉండట్లేదని వాపోయింది సువర్ణ.
అందంగా పుట్టడం సువర్ణ చేసుకున్న పాపమా? అందంగా ఉన్న తమ కూతుర్ని, ఉద్యోగస్తుడూ… లక్షణంగా పెండ్లాన్ని చూసుకుంటాడని నమ్మి ఇతగాడికిచ్చి కట్టబెట్టిన తల్లిదండ్రులదా?
మగడు ఏదన్నా పడుండాలి. వాడికి కోపమొస్తే భరించాల్సిందేనమ్మా అంటూ సాగదీసే సదరు అత్తగారి టెంపరితనమా?
నిజంగానే ‘కాకి ముక్కుకు దొండపండు’ అనే సామెతకు నూటికి రెండొందల శాతం కరెక్టు సువర్ణ భర్తగారి విషయంలో. నాకు ఆ పేరెత్తి ఇదీ అని చెప్పాలన్నా కంపరమెత్తుతుంది ఇప్పటికి కూడా.
ఇలా చాలా విషయాలు తెలుస్తుంటాయి అప్పుడప్పుడు తన ద్వారా. అందుకే నాకు సువర్ణ భర్త అంటే ఏవగింపు. తను కూడా ఇంతకు మునుపు ఎంత బాధలో ఉన్నా మా ఆయన, మావారు అని సంబోధించేది నాతో మాట్లాడేటప్పుడు. ఎంత బాధ సలుపుతుంటే, మనసులో ఎంత విరక్తి పుడితే వాడు, వీడు అని తిడ్తుంది భర్తను. నాకు తప్పులేదనిపించింది. మరి తక్కువ పనులు చేశాడావాడు అని పిలవబడుతున్న సదరు సువర్ణ గారి మొగుడుగారు.
నువ్వు తెల్లగానే ఉంటావు గదా, నీకెందుకు క్రీములు, పౌడర్లు అని సాధించేవాడట. కొత్త బట్టలు కట్టుకుంటే ఓర్చుకోలేడట. మంచిగా తల దువ్వి జడ వేసుకున్నా అనుమానమేనట… ఎవరన్నా ఇంటికి అతిథులు వస్తే, అందులో
వాళ్ళు పురుష పుంగవులైతే తనను మంచినీళ్ళు కూడా తేనీయడట. ఒకసారి అలాగే టీ పెట్టి పట్టుకెళితే, నానా బూతులూ తిట్టాడట వాళ్ళు వెళ్ళిన తర్వాత. ఇక అప్పట్నుంచి అతగాడికే టీ కప్పులు ట్రేలో పెట్టి అందిస్తే తీసుకెళ్లి వాళ్లకిస్తాడట. దొడ్లో అంట్లు తోముతుంటుంటే రోజూ కుర్చీ వేసుకుని కూర్చొని, ఆ సమయానికి పేపరో, పుస్తకమో చదువుకుంటున్నట్లు నటిస్తాడట. మొదట్లో అర్థమయ్యేది కాదట సువర్ణకు. దొడ్డివైపు తలుపులు వేసేవుంటాయట. తియ్యరట ఎప్పుడూ. అయినా వాడికి అనుమానమేనట. ఒకసారి పౌడర్లో సున్నం కలిపాడట. మామూలుగా రోజూ రాసుకున్నట్లు రాసుకుంటే, మొహమంతా పొక్కిపోయి ఎలర్జీ వచ్చి, ఆసుపత్రికి వెళితే ఆ పౌడరును చూసి అందులో సున్నం కలిసిందని చెప్పారట డాక్లర్లు. మళ్ళీ ఇంకోసారి స్ప్రే బాటిల్లో హ్యాండ్ వాష్ లాంటిది కలిపాడట. ఇదీ వాడి నిర్వాకమేనని తెలిసి వాళ్ళ పెద్దబ్బాయికి చూపిస్తే ‘నిజమే మమ్మీ ఇందులో హ్యాండ్ వాష్ కలిపాడు అని తండ్రిని ఛీత్కరించుకున్నాడట.’ వాళ్ళ డాడీ వెలగబెట్టే నిర్వాకాలన్నీ తెలుసు పిల్లలకు. వాళ్ళేం చిన్నవాళ్ళు కాదుగా! అందుకే ఏదన్నా శుభకార్యానికి వెళ్ళాలంటే ఆ… డాడీ ఎందుకు మమ్మీ? మనమే వెళ్లొద్దాం అంటారట. తండ్రి అంటే అతను చేసే పనుల వల్ల ఎంత విలువ తగ్గిపోతోంది తండ్రిగా తనకు అని ఒక్కోసారి చెప్పి నిట్టూరుస్తూంటుంది సువర్ణ.
‘ఇన్ని చేస్తున్నా, మావారంటే నాకు చాలా ఇష్టం మైథిలీ’ అంటుంది నాతో ఒక్కోసారి.
‘‘కానీ నా ప్రేమను గుర్తించడు. ఎప్పుడు సందు దొరుకుతుందా అని ఎదురుచూస్తుంటాడు సూటీ పోటీ మాటలు వదలటానికి’’ అన్నది మళ్ళీ.
నమ్మకం లేనిచోట ప్రేమ ఉండదంటారు నిజమే. భార్యమీద, ఆమె నడత మీద అస్సలు ఏమాత్రం నమ్మకం లేదు. అందుకే అంత ఆవేదన సువర్ణకు.
అభద్రతా భావంలో కూరుకుపోయిన వాడి చెవులకు ‘రామా’ అన్నా బూతుమాటే. వాళ్ల చూపులకు, వాళ్ల బుద్ధులకు కూడా పచ్చ కామెర్ల రోగమే నన్నడిగితే.
‘‘అమ్మా కథ పూర్తయింది. అందరూ వచ్చి స్వామివారికి దండం పెట్టుకోండి’’ అన్న పంతులుగారి పిలుపుకు మేము కూర్చున్న చోటు విడిచి వ్రతం జరిగే దగ్గరకొచ్చి దండం పెట్టుకుని, హారతి అద్దుకుని ప్రసాదం తీసుకున్నాము. గిఫ్ట్‌లు ఆ దంపతుల చేతుల్లో పెట్టి భోజనాలు ముగించుకుని, ఆటో ఎక్కి ఎవరి వీధి మలుపు వరకు వాళ్ళని దింపేటట్లుగా ఆటోవాలాతో మాట్లాడుకున్నాము.
‘‘ఏ విషయంలోగానీ, ఏ సందర్భంలోగానీ నువ్వసలు డిప్రెస్ అవ్వకూడదని, నీ పిల్లలు కూడా ఎదిగి, ప్రయోజకులై, స్వతంత్రంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నువ్వేమీ బెంగపడకు’’ అని సువర్ణకు ధైర్యం చెప్పాను నేను.
‘‘అవును నా ధైర్యం నా పిల్లలే. కొద్దిరోజులే ఇక, ఓపిక పడతా. లిమిట్స్ దాటి పూర్వంలాగా బాధలు పెడితే మాత్రం నా కొడుకుల దగ్గరకు బెంగుళూరుకు వెళ్ళిపోతాను’’ అని చెప్పింది నిశ్చయంగా, స్పష్టంగా సువర్ణ.
‘‘మరి ఇవే మాటలు మీ ఆయనతో కూడా చెప్పకపోయావా?’’ అన్నా.
‘‘అతగాడు పాముతో సమానం. చెబితే కాచుక్కూచుంటాడు పోనీయకుండా! మళ్ళీ ఏదో ఓ సందర్భం సృష్టించుకుని చెలరేగిపోడూ… అప్పుడు నేనే ఆ అనుమానపు పడగను నా కాళ్ళతో అణిచి పారేస్తానంది’’ ధృఢ నిశ్చయంతో.
‘‘మరి అక్కడికి కూడా వస్తేనో?’’ అన్నా సందేహంగా.
‘‘రాడు. ఏ మొహం పెట్టుకుని వస్తాడు. వాడికి ఎన్ని గుండెలు?’’ అంది ధృడ చిత్తంతో నవ్వుతూ.
ఆ నవ్వు చూసి ‘స్థిమిత పడిరదిలే… హమ్మయ్యా’ అనుకున్నా…
‘‘మరి ఇప్పుడంటే వాళ్ళు సింగిల్స్. రేపు వాళ్ల పెండ్లిండ్లయితే ఎలా? మళ్ళీ ప్రశ్నార్థకం కాకుండా చూసుకోవాలిగదా నీ భవిష్యత్తును’’ అన్నా సువర్ణతో.
దానికి తన భవిష్యత్ ప్రణాళికని కూడా చెప్పింది.
ఓటమి నుంచే పట్టుదల, పట్టుదల నుండి సాధించాలనే తపన, ఆ తపన నుండే గెలుపుదారులు తెరుచుకుంటాయనుకుంటా.
‘‘పెండ్లప్పుడు వాళ్ళ పుట్టింటివాళ్లు పెట్టిన బంగారం పదితులాలదాకా ఉంటుందట. దానిమీద తనకే గానీ వేరే ఎవ్వరికీ హక్కు లేదన్నది’’
‘‘ఆ పది తులాల బంగారం అమ్మేసి, నేను బొటిక్ పెట్టుకుంటా’’నంది.
సువర్ణ మంచి టైలరమ్మ. కచ్‌వర్క్, ఎంబ్రాయిడరీ, వెరైటీ వెరైటీ మోడల్స్‌లో బ్లౌజులు బాగా కుడుతుంది. ఫ్రాకులు, శారీఫాల్సు, పంజాబీస్ కూడా బాగా కుడుతుందని పేరుంది వాళ్ల వీధిలో. తనను కాదని స్టిచ్చింగ్‌కి బైటకి వెళ్ళరెవరూ.
ఈ అనుమానం రోగం బాగా ముదిరిన తర్వాత ఏదో కొద్దిగా సుస్తీ చేస్తే ఆ వంకతోటి ఆ టైలరింగ్‌నీ అటకెక్కించాడని మొత్తుకుంది ఓసారి.
‘‘మరి నీ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మళ్ళీ అడగకపోయావా?’’ అన్నాను.
‘‘కుట్టుకుంటానని అంటే లేనిపోని ప్రేమంతా నామీద ఒలకబోసి నీకెందుకు నేనున్నానుగా! ఏది కావాలంటే అది కొనిపెడతా. డబ్బులు అవసరమైతే నేనిస్తాగా? అంటే సరేననుకున్నా. ఆ టైలరింగ్‌కు సంబంధించిన మిషను వగైరాలన్నీ అమ్మేశాడు. నేనూ నమ్మాను. ఒక సంవత్సరం అన్నట్లుగా అన్నీ చేశాడు. తరువాతి నుంచి మొండిచెయ్యే చూపేవాడట. కావలసినవి సమకూరుస్తాడు. కానీ పైసా కూడా చేతికి చిక్కనివ్వడు’’ అని చెప్పింది గతకాలపు చేదును గుర్తు చేసుకుంటూ’’ సువర్ణ.
ఆర్థిక స్వాలంబనను అటకెక్కేట్లు చేసి తమపైనే ఆధారపడేట్లు చేసుకుంటూ అభివృద్ధి పథంలో నడిచే అవకాశం లేకుండా చేయటం. ఇది ఒక రకపు టాలెంట్. ఇలా రెక్కలు విరిచి వేయబడిన సువర్ణలెందరో ఈ సమాజంలో.
***
కొందరు వైట్ కాలర్స్ టాలెంటెడ్ పర్సన్సు, వీరి దర్జా, ఠీవి… ఆ తీరేవేరు. భార్యల ఎ.టి.ఎమ్. కార్డులు వారి జేబులోనే నివాసముంటాయి. ‘సొమ్మొకడిది సోకొకడిది’ అంటే ఇదేనేమో ననిపిస్తుంటుంది నాకు అప్పుడప్పుడు.
పండక్కో, పబ్బానికో ఏ చీరో కొనటం, పెద్ద మొత్తంలో ఏరియర్స్ లాంటివి ఏవో రావటంతో ఓ చిన్న నగలాంటి ఉంగరమో, బొంగరమో లాంటిది కొని, ఇదుగోనోయ్ నీకు గిఫ్టు అంటూ మురిపించటం. ఇంకో విడ్డూరమేంటంటే వాళ్ళ అప్ అండ్ డౌన్ బస్ ఛార్జీల డబ్బు వాళ్ళ మొహాన కొట్టటం. ఇంతే ఇక కష్టపడి సంపాదించుకున్న జీతపురాళ్లను పూర్తిగా ఏనాడు చూసిన పాపాన పోని వాళ్ళు ఎంతమందో ఈ మాయదారి ఏ.టి.ఎమ్. లొచ్చాక. పే బిల్స్‌లో చూసి మురిసిపోవటమే మన ఉద్యోగినుల పని.
ఇంత చేస్తున్నా గుర్తింపుకు నోచుకోని మహిళలెందరో. ఇటు ఇంట్లో, అటు బయటా చచ్చే చాకిరీ చేసి, అనారోగ్యంలోకి నెట్టివేయబడుట, కృంగిపోయేవారు మరెందరో. ఇలా ఆలోచిస్తే నా బుర్రలో ఠక్కున హాసిని సంసారం గుర్తుకొస్తుంది. తనదే జీతమెక్కువ. ఇంట్లో పని కూడా తనకే ఎక్కువ. పెండ్లైన క్రొత్తలో ఏదో ప్రైవేటు డిగ్రీ కాలేజీలో ఆఫీస్ వర్క్ చేసేవాడట భర్త. చాలాచోట్ల మారాడట. ఎక్కడా స్థిరత్వం ఉండదట. ‘ఏదన్నా చిన్న తేడాలు వస్తాయి. వదులుకుని ఇంట్లో కూర్చుంటే ఎలా అనే ఆలోచన కూడా ఉండదు మైథిలీ’ అని వాపోతుంటుంది ఒక్కోసారి నాతో.
‘‘మరి వేరే ఎక్కడైనా ట్రై చెయ్యవచ్చుగదా? సిస్టమ్ వర్క్‌తో పాటుగా పి.జి.లో మ్యాథ్స్ క్వాలిఫికేషన్ వుందిగదా! ఖాళీగా ఉంటే ఏం తోస్తుందని’’ అడిగా.
‘‘ఎందుకు మైథిలీ… నా జీతం ఉందిగా! అతడిరక కష్టపడటమెందుకు, ఇలా ఉంటాయి అతగాడి భావాలు’’ అని చెప్పి బాధపడుతుంది.
‘‘నన్ను బస్టాండులో దింపటం, సాయంత్రం వచ్చి పికప్ చేసుకోవటం ఆయన పని. ఓ… దీనికే తెగ ఇబ్బంది పడిపోతుంటాడని’’ చెప్పింది వేదన స్వరంతో.
‘‘మరీ అలా రికామీగా ఉంటే ఎలా పొద్దుపోతుంది మీ ఆయనకి?’’ అని అడిగితే టైముకి అన్నీ తింటూ, టీలు తాగుతూ హ్యాపీగా కాలం వెళ్లదీస్తుంటాని’’ నవ్వురాక, ఏడ్వలేక చిన్నబుచ్చుకున్న ముఖంతో చెప్పింది.
హాసిని గూడా తెల్లగా అందంగా, బక్కపలచగా బాగుంటుంది. పి.జి. చేసింది. గవర్నమెంటు మహిళా కళాశాలలో వర్క్ చేస్తోంది లెక్చరర్‌గా.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అది జీవితం ఎందుకవుతుంది? మన అగిడినవన్నీ ఇస్తే వాడు దేవుడు ఎందుకవుతాడు? ప్రతిమనిషి గుండెలో ఏదో ఒక బాధ మేకులా గ్రుచ్చుకుంటూనే ఉంటుందనుకుంటాను. గాయాలు చేసేది కాలమే. వాటిని మాన్పగల శక్తీ కాలానిదే. మరపునిచ్చేదీ కాలమేనంటాం. ఇది నిజమేనా? ఏమీ కాదనే నన్పిస్తుంది నాకు మనసుకు మాత్రం. అన్నీ మనకు మనమే చేసుకుని మన అనుభవాలను, అనుభూతులను కావాలని ఆపాదిస్తూ ఆత్మవంచన చేసుకుని బ్రతికేస్తున్నామేమో అనిపిస్తుంటుంది. కాలంలో కలిపి నడకసాగించలేని పరిస్థితులే ఇలాంటి ఆలోచనల పుట్టుకకు నాంది అనుకుంటాను.
లేకపోతే ఏమిటి? కాలం కుంటినడక నడస్తోందంటాం (మనం) కాలం నవ్వుతోందంటాం, పరుగులు పెడుతోందంటాం. ఒకింత గర్వంతో మనం విజయం చేపట్టిన వేళల్లో కాలాన్ని కట్టేస్తాననే ప్రగల్భాలు కూడా పలుకుతాం.
అంటే ఒక సందర్భాన్ని మన మనసు సంతోషంగా స్వీకరిస్తే నాకు కాలం కలిసివచ్చిందంటాం. దుఃఖపూరితమైన క్షణాల్ని యుగాలతో పోలుస్తాం. కానీ కాలం కాలమే. వీచేగాలి, పారేనీరు, కాసే ఎండ… వీటిల్లో హెచ్చుతగ్గులుండచ్చు. కానీ కాలం ఎప్పుడూ తన పంథాలోనే తన చట్రంలోనే చరిస్తుంటుంది. కాలానికి ఏ అనుభూతులూ, ఏ సంవేదనలూ, సంఘర్షణలూ, స్థాయీ బేధాలూ, ఉచ్ఛనీచాలూ, ప్రాంతీయ బేధాలూ ఉండవు. మనమెలాగూ ఆ చట్రంలో పడి నలుగుతున్నాం. కనీసం కాలాన్నైనా ఫ్రీగా వదిలేద్దాం.
కానీ కాలంలాగా మనం కూడా ఏ భావాలనూ తగిలించుకోకుండా ఏ వేదనలలో మునిగిపోకుండా కాలాన్నే ఊతకర్రగా చేసుకుని నడవ గలిగే స్థాయికి ఎదగగలిగితే జీవితమంతా ఆనందమయమేగదా! కానీ అలా ఉండలేమే! అదేగదా వచ్చిన చిక్కంతా!
కొన్నినాళ్లామె ఆమనిని మరచిన శిశిరం. కాకపోతే మిగతా ఋతువులన్నీ కూడా గ్రహణంలా ముసురుకున్న వేదనాభరితం. బాధలో ఉన్నా, దుఃఖాల్లో
ఉన్నా, కష్టాల్లో ఉన్నా నేనింతే, నా బ్రతుకింతేననే డిప్రెషన్‌లో పడి కృంగిపోవటం సహజం. కానీ అదే మారని పరిస్థితులలోనా ఓర్మితో, పిల్లల కోసమో, సమాజంలో పరువు పోతుందనే విజ్ఞతతోనే నడుచుకోగలిగిన ఇండ్లు భవిష్యత్తులో శిశిరాలను సైతం తొంగిచూడటానికి తావీయని పచ్చదనాలతో నిండిన వసంతాలే. ఇందుకు నిలువెత్తు సాక్ష్యమే. ఆమని, రామారావు అన్నయ్య గార్ల జీవితం. ‘భోగి కానివాడు యోగి కాలేడనే’ సామెత ఎంత నిజమో! అసలు ఈ సామెతలు, నానుడులు, హితోక్తులూ, ఛలోక్తులూ ఎంత విజ్ఞానాన్ని తాగి చిరయశస్సును పొందుతూ నేటికీ సజీవంగా మిలమిలలాడుతున్నాయోగదా!
తన చుట్టుపట్ల ఉండే వాతావరణం వాటిని అంటిపెట్టుకుని ఉండే పరిస్థితులు, మనుష్యులను చాలా ప్రభావితం చేస్తాయి.
రామారావుగారిది ఆఫీసర్ స్థాయి ఉద్యోగం. తిన్నగా ఉన్నా, ఉండనీయని స్నేహితుల బృందాలు. వాళ్లల్లో వాళ్ళ సహ ఉద్యోగులు కూడా ఉండచ్చు. అవసరం కోసం మచ్చిక చేసుకుని మనమేలు కోరుతున్నట్లు నటిస్తూ ఎంతోమంది పబ్బం గడుపుకుంటున్న వాళ్ళే ఈ రోజుల్లో. అలాంటి పబ్బపు మేఘాలకు చిక్కిన వారి కుటుంబం చాలా రోజుల వరకు తారల మిలమిలలు లేని నింగిలా, మబ్బులు కమ్మిన జాబిలిలా వెలవెలా బోవటం నేను కళ్లారా చూసినదాన్ని. కానీ ఏనాడూ ఇలా అని తనకు తానుగా ఎవరికీ చెప్పుకోని స్వాభిమాని నా ఫ్రెండ్ ఆమని ఆనోటా ఈ నోటా తెలిసిందేంటంటే ఫ్రెండ్సుని నమ్మి వారికి ష్యూరిటీ సంతకాలు పెట్టటం, ఈయన మెతకదనాన్ని చూసి వాళ్లు సకాలంలో బ్యాంకులో కట్టాల్సిన వాయిదాలు కట్టకపోవటం… అందుకుగాను అన్నయ్యగారి జీతం చాలావరకు కట్టయి పోవటంతో కష్టాలు మొదలయ్యాయని ఆమని ఒకసారి నాతో చెబుతూ నువ్వు విన్నది నిజమే మైథిలీ అన్నది.
‘‘మా వారికి పేకాట రాదు. అయినా బలవంతంగా కూర్చోపెట్టే వాళ్లట ఆయనను స్నేహితులు. ఆటరాదు, డబ్బులన్నీ పోయేవి. పోనీ ఆపేసి వచ్చేయొచ్చు కదా ఈయన. రాకుండా తెల్లవార్లూ కూర్చొని ఆరోగ్యాన్ని, నిద్రను, డబ్బును అన్నీ పోగొట్టుకొని వచ్చేవారు.
దానితో నాకు బాగా కోపం వచ్చేది. మనస్పర్థలు మొదలయ్యేవి. అవి మర్చిపోవాలనే సాకుతోనో, లేదా ఫ్రెండ్స్‌కు కంపెనీ ఇచ్చే నెపంతోనో, లేదా ఎలా ఉంటుందో రుచి చూద్దామనే వంకతోటో మొదలౌతాయి వ్యసనాలన్నీ. నేను చాలా పరిధిలో ఉంటాను. అస్సలు లిమిట్స్ దాటవనే సమర్థింపులు చేస్తూ, చేసిన తప్పులు కప్పిపుచ్చుకోనే ఇలాంటి పురుష పుంగవుల నైజాలు. వాళ్ళకేనా బాధలు, కష్టాలు… ఇంటా బయటా చచ్చే చాకిరీ చేసుకుంటూ నెలకు పట్టుమని రెండురోజులు కూడా సెలవు దొరకని ప్రైవేటు ఉద్యోగాలతో నలిగిపోతూ… ఆ దొరికే రెండు సాధారణ సెలవుల సౌకర్యాన్ని కూడా తాను వ్యక్తిగత ఇబ్బందులకు వాడుకోలేని అశక్తురాలు స్త్రీలు ఎప్పటికీ. ఆ రెండు సెలవుల్ని కూడా పిల్లలకి ఒంట్లో బాగోలేకపోతేనో లేదా అవసరాలు తీర్చుకోవటాన్కి ఇంటికొచ్చే చుట్టాల్ని చూసుకోవటానికో ఎగిరిపోతాయి. మరి ఇలాంటప్పుడు ఆడవాళ్లు కూడా తాగి తందనాలాడాలా? ఇబ్బందులు మర్చి పోవటాన్కి చీట్లపేక ఆడాలా? లేక బీడీలు, సిగరెట్లు తాగాలా?
నిజంగా కుటుంబపరంగా స్త్రీల సేవలు గుర్తింపుకు నోచుకోనివి. కనీసం ప్రేమకాదుగదా, కృతజ్ఞతాపూర్వక చూపులు కూడా తాకలేని దూరతీరమే వీరిది. పైగా ఇల్లాలంటే, ఆడదంటే ఇంట్లో పనులన్నీ వాళ్ళే చూసుకోవాలని ఉవాచలు. ఏం ఇద్దరూ ఠంచనుగా కొలువులకు పోవాల్సిన వాళ్ళేగదా! చెరోపని చేసుకుంటే తప్పేంటి? ఇలాంటి మాట లెప్పుడైనా స్త్రీ నోటివెంట వచ్చాయో! ఇక అగ్గి మీద గుగ్గిలాలే వేగుతాయి ఆ ఇండ్లలో. నూటికో, కోటికో ఉంటారేమో మరి పుణ్యమూర్తులు. భార్యలకు అన్ని పనుల్లో సాయపడుతూ. ఇలా జరిగితే స్త్రీ, పురుష వివక్ష అనే పదం ఈ రోజుల్లో వినపడేదికాదేమో. అంటే కచ్చితంగా ఇంటా, బయటా స్త్రీలు శ్రమించే శ్రమకు విలువ కనీస గౌరవం కూడా తక్కువే. మళ్ళీ పెద్ద సంస్కారపు రాయుళ్లలాగా మైకాసురులవుతూ స్త్రీ పురుష సమానత్వం గురించి తెగ లెక్చర్లు దంచుతారు. సమానమే గానీ, మాకంటే కొంచెం తక్కువగానే సమానమంటూ వింతైన కోర్కెను మనసులో నాటుకుని, దాన్ని పెంచి పోషిస్తున్న మేధావి వర్గముంది నేటి సమాజంలో ఎక్కువగా.
గట్టి ఎదురుదెబ్బలు రెండు, మూడు తగిలితేగానీ మనిషి స్వతహాగా మారడంటారు. ఇది చాలా వాస్తవం. ఇటు వాయిదాలు చెల్లించక తన జీతం కటింగ్‌లతో పోవటం, అటు వ్యసనాలకు అప్పగించిన దోస్తులు. ఇటు పిల్లలకు ఇంటర్ పూర్తయి సిటీకి పై చదువులకు పంపాల్సిరావటం, పై చదువుల కోసం పంపగలగాలంటే, డబ్బుల విషయంలో జాగ్రత్తపడకపోతే ఎన్ని ఇబ్బందులతో ఊపిరాడక నలిగిపోతామోననే విషయాలతో జ్ఞానోదయమైందనుకుంటా… ఆయనలో చిన్నచిన్నగా మార్పు రావటం మొదలైంది మైథిలీ అని అంటూ… ఎవరైతే తనను ఆర్థిక నష్టాలకు గురి చేశారో, వారికి దూరంగా ఉంటూ, అప్పోసొప్పో తెచ్చుకున్న డబ్బుల్తో పిల్లల్ని పై చదువులు చదివిస్తున్నామని అంటూ, రిటైర్మెంటుకు దగ్గరకు వస్తుంటే ఎవరైనా స్వంత ఇల్లు కట్టుకోవాలని లేదా భార్యకు నగలు చేయించాలనో అనుకుంటారు. నేనేమీ చేయించలేకపోయాను నీకంటూ అన్నారట ఆమనితో రామారావుగారు బాధపడుతూ.
‘‘మరి నువ్వేమన్నావ్?’’ అన్నాను నేను ఆమనితో
‘‘ఏమంటాను మైథిలీ! పూర్వపు మనిషిలా ఉంటే చెడామడా కడిగేద్దును. ఇప్పుడిప్పుడే ఎవరేంటో తెలుసుకుంటున్నారు. ఇలా మనిషిగా మారుతున్నారు గదా!
‘‘పోనీ ఒక వడ్డాణం చేయించమని అడగకపోయావా’’ అన్నా నవ్వుతూ.
ఇది హేళనగా అడిగిన ప్రశ్నకాడు సుమా… ఆమని గొంతు బాధతో కూరుకుపోయి ఉంది. కొంచెమైనా స్వస్థ పరచాలనే ఉద్దేశ్యంతో నవ్వుతూ అడిగాను.
సన్నగా నవ్వు విన్పించింది ఆమని మాటల్లో. హమ్మయ్యా అనుకున్నా నాలోనేను.
మళ్ళీ తనే ‘‘నాకు నగల సంగతేమోగాని, ఉన్న ఈ ఇల్లు కూడా అమ్మాల్సి వచ్చేట్లుంది’’ అన్నది.
వాళ్ళు ఐదేళ్ళ క్రితం ఎలాగో ఐదు సెంట్ల భూమిలో ఒక మూడు గదుల ఇల్లు, విశాలమైన స్థలమూ ఉన్నది కొనుక్కుని అద్దె ఇళ్ల బాధను దాటుకున్నారు. అప్పుడు మా ఫ్రెండ్సంతా సంతోషించాము. కానీ ఆమని మాటలతో ఆ సంతోషం కాస్తా ఎగిరిపోయింది నాలో. ఇంకో రెండు మూడు నెలలో దిగిపోతారు. మరి అప్పుడెట్లాగా అని నా మనసు పీకులాడిరది.
అదే అన్నా తనతో ‘‘మరి ఎలాగా?’’ అని
‘‘ఏం చేయాలి మైథిలీ? ఇది తప్ప వేరే దారేలేదు. ఆ మాయదారి వాళ్ళకు షూరిటీలు పెట్టిన పాపానికి బాగా అప్పుల్లో పడిపోయాం. అదీగాక ముగ్గురి పిల్లల చదువులూ. నాది గొప్ప జీతమా అంటే అదీకాదు. అనామత్తే. బెనిఫిట్స్ ఎప్పటికొస్తాయో ఏమో! రిటైర్మెంట్ ఠంచనుగా వస్తుందిగానీ, రావాల్సిన డబ్బులు తొందరగా రావుగా అన్నది.
అదీ నిజమేననుకున్నాను మనసులో.
‘‘పోనీ ఆ వచ్చే డబ్బులతో ఉన్న అప్పుల్ని తీర్చేసి మీకు సరిపడా ఓ చిన్న ఇల్లు కొనుక్కోవటమో లేదా ఏదో అపార్టుమెంట కొనుక్కోవటమో చెయ్యొచ్చుగా?’’ అన్నా తనతో.
‘‘నిజమే గానీ పిల్లల చదువులకు చేసిన అప్పుల మీద వడ్డీలకు వడ్డీలు బాగా పెరిగిపోయాయి’’ అంటూ
‘‘అవన్నీ తీరిపోతే, పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడిపోతే చాలనుకుంటున్నాం ఇద్దరం’’ అంది.
‘‘మీరిద్దరూ ఓసారి కూర్చుని బాకీలు ఎంత ఉన్నాయి? ఎంత మిగుల్తున్నాయి? వచ్చేవాటిల్లో అని చూసుకుపోయారా?’’ అంటే
‘‘ఆ ముచ్చట కూడా అయింది. అంత పెద్ద మొత్తంగా ఏమీ మిగలవు. ఇల్లు కొనుకోవటాన్కి కూడా సరిపోవు’’ అన్నది.
ఇంకా మరీ లోతుగా తరచి అడిగితే తన మనసునింకా బాధపెట్టినట్లు అవుతుందని విరమించుకున్నాను నేను ఆ ప్రయత్నాన్ని.
పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తమేదీ లేదంటారు పెద్దవాళ్ళు. ఇది నూటికి నూరుపాళ్ళూ నిజమేనని నమ్ముతాను నేను. అగ్నిలో పుటంబెట్టి పైకి తీసిన బంగారంలా తేలారు ఆమని వాళ్ళ ఆయన. ఆయన మాటతీరు, సరదాగా కలివిడిగా ఇంటికొచ్చిన మనుష్యుల్ని కలుపుకుని ఆప్యాయంగా మాట్లాడేతత్వం చూస్తుంటే, ఔరా! ఆయన ఈయనేనా? అని ఆశ్చర్యం కలగకమానదు చూసేవాళ్లకి. ఆమని అంటే అమితమైన ప్రేమ ఇప్పుడు కొట్టొచ్చినట్లు కన్పడుతోంది రామారావు గారిలో.
ఇప్పుడు మేమంతా అరవైని దిగ్విజయంగా దాటిన వాళ్ళమే. వయస్సు రీత్యా కొద్దో గొప్పో ఆరోగ్యంలో తేడాపాడాలు రావటం, వాటిని గీత దాటనియ్యకుండా చేయటం కోసంగా మందులు వాడుకోవటం తప్పనిసరిగా మారిపోయింది మా దినచర్యలో.
ఆమని ఎక్కడ మందులు వేసుకోవటం మర్చిపోతుందోనని ఎక్కువ శాతం రామారావు అన్నయ్యగారే టైమ్‌కు ఏ ఏ మందులు ఇవ్వాలో, వాటిని ఇవ్వటం, గ్లాసుతో మంచినీళ్ళు అందించటం… ఇంకా ఇవ్వేనా! ఇంటి పనులలో కూడా సాయం చేస్తున్నారట. ఇవన్నీ వింటుంటే ముచ్చటేసింది నాకు. ఎప్పుడు మనం వాళ్ళింటికి వెళ్ళినా ప్రక్కప్రక్కనే కూర్చొని ఆదిదంపతులలాగా అన్పిస్తారు నా కంటికి.
‘‘ఏమోయ్! మేమెళ్ళాక దిష్టి తీసేసుకోండి ఇద్దరూ’’ అంటే నవ్వటం తనవంతవుతుంది ఆమనికి.
పెళ్ళైన కొత్తలో ఎలాగైతే ఒకరికొకరుగా అన్యోన్యంగా మసలుకుంటామో మళ్ళీ పిల్లలకు చదువులయిపోయి, పెండ్లిండ్లయిపోయి ఎవరికి వాళ్ళు సెటిలయిపోయి వాళ్లవాళ్ల ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ల సంసారంలో వాళ్ళు కిందా మీదా పడ్తూ, వాళ్ళ కుటుంబాల్ని నడుపుకుంటున్నప్పుడు మళ్ళీ మనకు పూర్వస్థితే. గిద్దెడు బియ్యమే. వృద్ధాప్యంలోకి ప్రవేశిస్తున్నామంటే మరో బాల్యంలోకి అడుగు పెట్టడమే. కాకపోతే ఆ బాల్యంలో మనకు జ్ఞానం లేదు, చీకూ చింత అసలే లేదు. మరి ఈ బాల్యంలో భర్తకి భార్య పసిపాప, భార్యకి భర్త పసిపిల్లాడు. మళ్ళీ ఆ గిద్దెడు గింజల్ని ఉడకేసుకుని తినటమే. కావలసినంత ఖాళీ సమయం. అప్పుడు ఏమైతే మనం కోల్పోయిన అభిరుచులున్నాయో వాటిని అప్పుడు తీర్చుకుంటే ఒక్కళ్లే ఉంటున్నామనే బెంగా ఉండదు. ఖాళీగా ఉన్నామనే చింతా ఉండదు. ఏమంటారు? అంతేగదా? నేను చెప్పింది రైటేనా? నాతో మీరు ఏకీభవిస్తారని భావిస్తా.
ఇవే మాటలు మా ఫ్రెండ్సంతా బైఠాయించినపుడు తన్నుకుంటూ తన్నుకుంటూ బైటికొచ్చేస్తుంటాయి ఆశువుగా.
‘‘అబ్బా నేను మాత్రం హాయిగా పుస్తకాలు చదివేస్తూ కాలం గడిపేస్తానన్నా’’ వాళ్ళతో ‘‘నేను పుస్తకాల పురుగుని. పుస్తకాల ముచ్చును’’ అన్నా సరదాగా నవ్వుతూ.
‘‘యూ ఆర్ ఏ వెరీ గుడ్డు బేబీ’’ అంది చంద్రిక.
‘‘చిత్తం… చిత్తం…’’ అన్నట్లుగా తలూపా నేను.
‘‘ఆ… నేను ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, యోగాకి వెళ్తానంది’’ మాలిని కూడా నవ్వుతూ.
‘‘నేను హాయిగా విశ్రాంతి తీసుకుంటానబ్బా… నాకిలాగే హాయిగా
ఉంది’’ అన్నది చంద్రిక.
తను ఇటీవలే రిటైర్డయింది. నాల్గు నెలలు కూడా అవ్వలేదింకా. ఆ మధ్యలో తను అనారోగ్యానికి గురై మెడికల్ లీవు కూడా తీసుకుంది. అందుకనే వేరే ఏమీ మాట్లాడలేకపోయాము మేము.
‘‘మరి నువ్వు’’ అన్నాము ఆమని వైపు చూస్తూ…
ఇప్పుడు నేను బొమ్మలు గీస్తాను. నా అభిరుచికి ప్రాణం పోస్తూ, మళ్ళీ దాన్ని తిరిగి ప్రారంభిస్తా’’ అంది.
‘‘బొమ్మలకు రంగులు కూడా వెయ్యమన్నాను’’ నేను తనతో సూచనగా.
అంగీకారంగా తల ఊపింది తృప్తిగా ఆమని.
‘‘పద్మిని మిగిలిందన్నట్లుగా తనవైపు చూశాము’’ మేము.
మేమేమడుగుతామో తనకు తెలుసు. మేము ప్రశ్నించే అవసరం లేకుండానే ‘‘మావారు రియల్ ఎస్టేట్ బిజినెస్ చూస్తున్నారు గదా! కొద్దిగా పని ఎక్కువవుతోంది బిజినెస్ పెరగటం వల్ల. ఎవరైనా ఓ కుర్రాడిని చూసి సహాయంగా పెట్టుకోవాలన్నారు మావారు’’ అంటూ
‘‘ఓ ఐదారేండ్లు నేను హెల్ప్ చెయ్యగలను ఆఫీసు పనుల్లో. అలా చేస్తే నాకూ టైం పాసవుతుందిగదా! అన్నా మావారితో’’ అని నవ్వింది పద్మిని.
‘‘ఓ.కే.’’ అన్నాము మేమంతా. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్న ఫోజుతో.
‘‘మా ఇంట్లోనే ఓ గది ఆఫీసుకు కేటాయిద్దామనుకుంటున్నాను.’’ అంది పద్మిని.
తధాస్తు అన్నాము మేము. ఇక మిగిలినది హాసిని. ప్రస్తుతం మాకంటే కనీసం ఓ పన్నెండు, పదమూడేళ్ళ చిన్నది.
‘‘నిన్ను ఇప్పుడు అడగలేని పేదవాళ్ళం మేము’’ అన్నాను. పెద్దవాళ్లం అంటే అది రోటీన్. పేదవాళ్లం అన్నందుకు అందరూ మనఃస్ఫూర్తిగా నవ్వారు. వాళ్లతో నేనూ శృతి కలిపాను.
***
మాకు తెలిసిన వాళ్లింటికి వెళ్లాల్సొచ్చింది ఒకరోజు వారిని పలకరించటానికి. సరే. అదే దారివెంట వెళితే రెండో వీధిలోనే శాలినిగారూ
వాళ్లుండేది. చాలారోజులైంది ఆ మేడమ్‌ని చూసి అని… నన్ను వాళ్ళింటి దగ్గర డ్రాప్ చేయండి’’ అని అన్నా మా వారితో. సరేనని నన్ను వాళ్ళింటి దగ్గర దింపి, మావారు బైట పనులున్నాయని వెళ్ళిపోయారు వెంటనే. నేను నెమ్మదిగా గేటు తీసుకుని లోపలికి వెళ్ళాను. ఆ ఇంటి వాతావరణం నాకెంతగానో నచ్చుతుంది. పచ్చగా ఉండే చెట్లు, పూలతో నిండుగా ఉండే పూలమొక్కలు, గేటు తీసుకుని లోపలికి వెళ్ళగానే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తాయి మనసుకు. దాన్ని ఆస్వాదిస్తూ నేను ద్వారబంధానికి ముందు అమర్చబడిన మెస్‌డోర్ లోంచి ఇంట్లోకి చూశా. ఏంటి అలికిడి లేదు? అని తేరిపార చూస్తే, లోపల హాల్లో ఒంటరిగా కుర్చీలో కూర్చొని ఉన్నారు శాలిని మేడమ్‌గారు. తను కూర్చున్న కుర్చీకి ఎదురుగా ఉన్న టేబుల్ మ్యాట్‌పై రెండు మోచేతులూ ఆన్చుకుని, ఆ చేతుల మధ్యలో తలపెట్టుకుని, కండ్లు మూసుకుని ఉన్నారు. ఏదో తదేక దీక్షలో ఉన్నట్లుగా.
‘‘మేడమ్‌గారూ బాగున్నారా?’’ అన్న నా పిలుపుకు ఉలిక్కిపడి లేచి, నెమ్మది నెమ్మదిగా అడుగులేస్తూ వచ్చి, మెస్‌డోర్ బోల్ట్ తీశారు. ఎప్పుడూ హుషారుకు ప్రతిరూపంగా ఉండే ఆవిడ, బాగా నీరసపడిపోయినట్లుగా ఉన్నారు. ఆ టేబుల్ మ్యాట్ మీద కొన్ని పాత మ్యాగజైన్లు. ఆరోజు దినపత్రిక చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
‘‘ఏంటి నీరసంగా కనబడుతున్నారు? ఒంట్లో బాగోలేదా?’’ అని కుశల ప్రశ్న వేశాను. నాకు కూర్చోవటానికి సోఫా చూపించి, నా ప్రక్కనే వచ్చి కూర్చుంటూ ‘‘ఆ… అసలు బాగోటం లేదండీ వారం రోజుల్నుంచి. అమ్మా, నేనూ కలసి ఈ మధ్య ఊరెళ్తున్నాం అని చెప్పాగదా మీతో.’’ తను అక్కడే ఆగిపోయింది. ‘‘ఇంకొంత మంది బంధువులను కలవాలని. ఇంటికి తాళం పెట్టి వెళ్లాం. అసలే రోజులు బాగోలేదు. అందుకని ఇక నేను వెళ్లిన పని కాగానే వచ్చేశాను’’ అన్నారు నాతో డీలాపడ్డ స్వరంతో.
‘‘మీ అమ్మగారుండి ఉంటే బాగుండేది ఈ సమయంలో మీకు తోడుగా’’ అన్నా.
‘‘అవునండీ… కానీ తను నా దగ్గరకొచ్చి సంవత్సరం దాటిపోయిందిగదా! ఇక్కడుంటే తనూ, నేనూ ఇద్దరమే. బిక్కు బిక్కుమంటూ ఉండాలి. అక్కడైతే మా వాళ్లంతా దగ్గర్లోనే చుట్టుప్రక్కల ఊళ్లల్లో ఉంటారు. ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడొచ్చి కలిసి వెళ్తుంటారు అమ్మా వాళ్ళని. పాపం నా దగ్గర చాలా రోజులుండిపోయిందిగదా. తనూ కొద్దిరోజులు, మా పిన్నిలు, బాబాయిలు, మా మామయ్యల దగ్గర ఉండొస్తుంది అని నేను వచ్చేశానండీ’’ అన్నారు మళ్లీ శాలినిగారు.
భర్తకీ, శాలినిగారికీ ఏవో మనస్పర్ధలున్నాయని తెలుసు నాకు లోపాయికారిగా. మాతో పరిచయమున్నప్పటి నుండి భార్యాభర్తలిద్దరూ ఫ్రెండ్స్‌లా కలిసిపోతారు. ఎక్కడకి వచ్చినా చక్కగా మాట్లాడతారు. అందరితో కలివిడిగా ఉంటారు. మా ఇంటికొచ్చినప్పుడల్లా పిల్లలకు ఏవో ఒకటి తెచ్చేవాళ్లు తినటాన్కి. వట్టి చేతుల్తో అస్సలు వచ్చేవాళ్లుకారు. కానీ భార్యభర్తల మధ్య ఏముందో గానీ ఎక్కువశాతం ఎడమొగం, పెడమొగం గానే ఉంటారు. వాళ్ళకి బాగా తెలుసున్న వాళ్లుమటుకు ‘‘వాళ్ళమధ్య ఎప్పుడూ ఇగోల మాటలు చెలరేగుతుంటాయి’’ అంటారు.
కానీ చాలా రోజుల క్రితమే తెలిసింది. ఏ చెడు అలవాట్లు ఉంటే సంసారంలో కలతలు రేగుతాయో ఏమైతే ఉండకూడదో అలాంటి గుణాలే శాలినిగారి ఇంటాయనలో వాళ్ళ వేరు కుంపట్లవటానికి మూలమని. అవును ద్వేషించినా, సహించవచ్చునేమోగానీ పరాయి స్త్రీలకు అలవాటు పడ్డ భర్తలను ఏ భార్యలు భరించగలరు చెప్పండి? అసలే స్వాభిమానం పాళ్లు ఎక్కువ. స్వావలంబన కలిగిన మహిళ తను. అసలు వాళ్లు విడిపోవటాన్కి ఇదే సరైన కారణమని శాలినిగారి మాటల ద్వారానే తెలిసి చాలా బాధపడ్డాను.
ప్రస్తుతంలోకి వస్తూ ‘‘ఏంటి? ఏమైందని అడిగితే ఎలర్జీ వచ్చేసింది బాగా. గొంతుకు ఇన్ఫెక్షను వచ్చింది. దానితోబాటుగా జ్వరం తగిలింది. ఈరోజే కాస్త చారన్నం తిన్నానని’’ చెప్పారు. తన వాలకం చూస్తూంటే ఇంకో నాల్గురోజులైతే తప్ప తేరుకోలేరని తెలిసిపోతోంది.
కూర బాగోలేదని, అన్నం మాడిరదని, ఫ్రిడ్జ్‌లో వాటర్ బాటిల్సు పెట్టలేదనేవి కుంటి సాకులు మాత్రమే. మనమంటే అయిష్టత ఏర్పడినపుడు మనమెంత గొప్పగా రుచిగా చేసినా ఏవీ నచ్చవు, రుచించవు మగవాళ్ళకి. ఇలాంటి వంకలు చూపించి మనకు మనస్తాపం కలిగించి, మనమీదనే అలుగుతోందని, అఖాండాలు వేసి ప్లేటు ఫిరాయిస్తూ వాళ్ళను ప్రశ్నించలేని విధంగా తయారు చేస్తున్నారు ఆడవాళ్ళని మగజాతిలో చాలామంది. ఈ మందిలో శాలిని సదరు భర్తగారు కూడా ఒకరని వేరే చెప్పక్కర్లేదనుకుంటాను.
వాళ్ళ వారి గురించి చెబుతూ మా ఆయనగా పిలవబడే ఇప్పటి జల్సారాయుడు రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్నాడు. ఇప్పుడు ఈయనగారి వయసు చూసి వస్తుందా ఏ ఆడదైనా. నిజమైన ప్రేమతో వస్తుందా? చెప్పండి డబ్బు ఆశకు కాకపోతే తప్ప?’’ అంటూ
‘‘ఇతగాడికింకా ఒళ్లూపై తెలవట్లేదు. ఆ పెన్షనూ, బెనిఫిట్లూ రాగానే ఆ ఉంచుకున్నది అన్నంలోనో, టిఫిన్‌లోనో ఇంత మందు కలిపిపెట్టడం, వాడు చావటం ఖాయం’’ అని విరక్తి నిండిన బాధతో అన్నారు.
నిజమే, డబ్బుకు ఆశపడి వచ్చేవాళ్ళు ఎంతోమందిని చూస్తున్నాం సమాజంలో నేడు. ఉంచుకున్న వాడిని హత్య చేసి డబ్బు, నగలతో పరారయ్యేవాళ్లు ఎంతమందిలేరు? శాలినిగారు బాధతో చెప్పినా వందశాతం వాస్తవ విషయమే అది.
‘‘నాకు నా పిల్లలిద్దరూ రెండు భుజాలండి. వాళ్ళు చాలు నాకు. నాకున్నదేదో వాళ్లిద్దరికీ ఇచ్చేస్తాను. నాకెందుకండీ ఈ నగలు, బంగారం అదీను’’ అంటే ‘‘కొద్దిరోజులుంచుకోండి. ఇప్పుడే ఎందుకు ఇవ్వటమ’’న్నాను నేను శాలినిగారితో. ‘‘ఏమోనండి. నాకు ఉండటానికి ఇల్లు ఉంది. పెన్షన్ డబ్బులు వస్తాయి. నా ఒక్కదానికి ఎక్కీ తక్కీ’’ అన్నారు వైరాగ్యంతో. అవును మేడంగారి పిల్లలిద్దరూ బంగారాలు. ఒక్కదానివి ఎందుకు అక్కడ? మాతో వచ్చి ఉండు’’ అని ఫోన్ చేసినప్పుడల్లా అంటుంటారట శాలినిగారు.
‘‘ఆ… ఇప్పట్నుంచే ఎందుకు? లేవలేనినాడు ఎటూ తప్పదు’’ అన్నారు.
అదీ నిజమే ననిపించింది నాకు. ఎందుకో ఈ రోజు శాలిని గార్ని చూస్తే పాత గాయాలన్నీ రేగినట్లన్పించసాగింది ఆవిడ వాలకం, మాటలు చూస్తుంటే. అందులోంచి ఆవిడను బదలాయించాలని, ‘‘ఈ పదవినోదం నింపుదాం రండి!’’ అన్నా సరదాగా. టేబుల్ పైనున్న ఈనాడు ఆదివారం అనుబంధ పుస్తకం చూపిస్తూ.
శాలిని గారికీ ఇష్టమే, ఇలాంటి పజిల్స్ నింపటమంటే. తను అంతకుముందే సగం పైగా పూర్తిచేశారు. మిగతావి ఇద్దరం కల్సి ఆలోచించి కంప్లీట్ చేశాము. ఇద్దరమూ కాసేపు బడిపిల్లలుగా మారిపోయాం. కొన్ని అతి చిన్న పదాలే. బుర్రలు బద్దలు కొట్టుకున్నంత పని చేస్తేనే గాని జవాబులు దొరకలేదు. ఇది తలచుకుంటూ తెగ నవ్వుకున్నాం ఇద్దరం.
‘‘టీగానీ, కాఫీ గానీ తాగుతారా?’’ అన్నారు శాలినిగారు నాతో.
‘‘ఏమ్మా బాగా హుషారొచ్చినట్లుంది మీకు’’ అన్నా నవ్వుతూ.
‘‘అవునండీ మైథిలీ… కొంచెం హాయిగా ఉంది ప్రాణానికి. మీరొచ్చి మాట్లాడుతూ, ఇద్దరం కలిసి పదవినోదం నింపుతుంటే సమయమే తెలియలేదని తనూ నాతో నవ్వారు. గంటన్నర దాటిపోయింది వచ్చి. ‘‘మళ్ళీ వస్తా’’నని చెప్పి నేను మావారికి ఫోన్ చేసి చెప్పా ‘‘రండి తీసుకువెళ్లండి’’ అని. కాసేపటికి బైట బైకు హారన్ వినపడగానే నేను బైటికి వచ్చి, శాలినిగారికి బై చెప్పి బండెక్కాను. తను కూడా మాకు బై చెప్పి ‘‘వస్తూండండి మైథిలిగారూ.. అప్పుడప్పుడు’’ అని మరీ మరీ చెప్పి లోనికి వెళ్ళిపోయారు గేటు వేసుకుని.
వయసు పెరుగుతుంటే జ్ఞానంతోపాటుగా నలుగురికీ ఆదర్శంగా ఉండగలగానిగానీ, నా బాధ్యతలన్నీ తీరిపోయాయిగదా, నేను మళ్ళీ మొదటికే వస్తా, నా ఇష్టం వచ్చినట్లుంటానంటే, అలాంటి మగవాళ్లకి మనం ఏం చెప్పగలం? ఒకటే కుటుంబంగా ఉన్నవాళ్ళం పిల్లల్ని వేరొక ఇంటికి ఇచ్చిపుచ్చుకుని సంబంధాలు కలుపుకున్నాక ఎవరైనా గానీ తమలో ఉన్న లోపాలను తగ్గించుకోవాలనే ఆలోచన రాకపోతే అది ముందుముందు తమ బిడ్డల భవిష్యత్తుకు ఎంతటి అరిష్టం కలుగజేస్తుందో తెలుసుకోని మనిషి కూడా మనిషేనా అనిపిస్తుంది నాకు. అంతేగదా! ‘‘మీ నాన్న ఇట్లాగదా! లేకపోతే మీవాళ్లు ఇట్లాగదా అని రేపటిరోజున మన పిల్లలతో వారి అత్తింటివాళ్లు గొడవపెడితే అది క్షేమదాయకమా? చెప్పండి. అంతా, అన్ని రోజులు మంచిగా ఉంటాయనే గ్యారంటీ ఏముంది? కోపతాపాలు, అలకలు, అభిప్రాయ బేధాలు రావటం సహజం భార్యాభర్తల మధ్య. కోపంతో ఉన్నప్పుడు మీవాళ్లిట్లా, మీ వాళ్లిట్లా అని దెప్పుతారుగా అల్లుళ్లు, కోడళ్లు. మంచి చేస్తారో, చేయరో తరువాతి సంగతి. ముందు ఆ వచ్చిన కోపం మొత్తాన్ని దెప్పుళ్లతో వెళ్లగక్కేస్తారు! ఈ ఆలోచన మగవాళ్లకి ఎందుకు రాదో ఏంటో? మళ్లీ అందరికీ తీర్పులు చెప్పే పెద్దలే, మనం ఏమన్నా చెబుతే ఇల్లు వినిపించుకోదు. ఇంటికి ఆవేశమే తప్ప ఆలోచన చెయ్యలేదు ఒక్కోసారి. బైట నుంచి వినపడే ఎన్ని ఇగోల సూక్తిముక్తావళులను పానం చేసిందో ఏమో అన్ని పరిస్థితులను అవగాహనతో ఆకళింపు చేసుకోవాల్సిందిపోయి, గట్టిగా, ధృడంగా నిలబడాల్సిన ఇల్లు కర్కశంగా, కఠినంగా మారిపోతుంది. నేను లేకపోతే నీకు నీడేది? అన్ని ప్రశ్నించే అహంకారమా? లేక నేనేగా నీకు గత్యంతరమనే ధీమానా? ఎప్పుడు సందు దొరుకుతుందా? సాకులు ఎత్తిచూపుతానంటూ విశ్వరూపాన్ని ప్రదర్శించటానికి సిద్ధమైపోతుంది. చూపిస్తే ఎవరికి నష్టం? చూసేవారికి, వారితో పాటుగా ప్రభావితులకు అన్ని విధాలుగా నష్టమేగదా.
మరి ఇంత చిన్న ఇంగిత జ్ఞానాన్ని కూడా మరచిన ఇండ్లు కేవలం ఇంత ఇసుక, సిమెంటు, ఇటుకలు గానే మిగిలిపోతాయి. మరి అలాంటప్పుడు బంధాలు బీటుపడవా? అందరం ఉప్పు, కారమే తింటున్నాం గదా! ఎంత తమాయించుకున్నా ఒక్కసారైనా కోపం రాకుండా ఉంటుందా? సర్దుబాటు అవసరం ఇద్దరిలో ఉండాలి కూడానూ. కానీ దానికీ లిమిట్స్ ఉంటాయి గదా! వయసుతో బాటు బి.పి. కూడా పెరుగుతుంది కదా! మాటా మాటా పెరిగితే ఇళ్లు విరిగిపోతాయి. బంధాలు ముక్కలైపోతాయి. ఇళ్ళు విరిగిపోతే మరమ్మత్తు చేసుకోవటానికి సామాగ్రి ఉంటుంది. కానీ ఒక్కసారి విరిగిన మనసును మరమ్మత్తు చేయటమంటే ముడిపడ్డ దారాన్ని ముడివేయటమే. ఎన్నిసార్లు ముడివేస్తే అది హృదయానికి అంత గట్టిగా పెళుసుగా తాకుతూ భరించ శక్యంగాని బాధను అనుభవింపజేస్తుంది. అందుకే మాట తూలద్దు అంటారు పెద్దవాళ్ళు. కోపంలో కూడా ఆచితూచి అవసరమైనంత వరకు మాట్లాడే వారిని జ్ఞాని అంటాను నేను. ఎంత గొప్ప గొప్ప చదువులు చదివితే ఏం లాభం? ఇలాంటి ఆలోచనా సరళి వంటబట్టించుకోనప్పుడు? ఇంకొంతమంది అనుకుంటారు ఒకేఒక్క గట్టిగా తిట్టో, కోప్పడో ఎదుటివాళ్ల మాటను మూయించి, తన మాటనే పెత్తందారీతనాన్ని ప్రతిధ్వనింప చేస్తారు. ఒకేరకం పూలతో నిండిన తోటకంటే వివిధ వర్ణాల పూలతో వికసించి పరిమళించేదే గదా నిజమైన వనం. తోటలో పక్షుల కిలకిలారావాల మాదిరిగా ఇంటామెకు కూడా మాట్లాడే అవకాశం
ఉండాలి, ఇవ్వాలి ఇంటాయన. పిల్లల మాటలు కూడా వినబడుతుండాలి అదేగదా కళకళలాడే ఇల్లంటే? ఎవరూ లేరు? ఏదీలేదు… వాళ్ళంతే అంటారు. నా దారిన నేనుంటానంటే అది కేవలం నిర్జీవంగా మారిన భవనం మాత్రమే. అది చూపరులకు ఎంతో గొప్పదిగా, ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కానీ ఆ ఇంటివారికి అది కేవలం తాటిచెట్టు నీడనే.
నీడతో పాటు చిరునవ్వులు చిందించగల ఆహార్యం, దానికి తోడుగా జీవితాంతం పంచివ్వగల అనురాగం, ప్రశాంతతా, సంపద ఇంటాయన దగ్గర అక్షయంగా ఉండాలి.
***
శరత్కాలపు వెన్నెల అనుకుని ఆనందించటానికి, చూచి అనుభూతించటానికి. చంద్రునికి రెండు పక్షాలుంటాయి. ఒక పక్షంలో అంటే
శుక్లపక్షంలో వెలుగుతాడు. కృష్ణపక్షంలో వీగుతాడు క్రమేపీ. కానీ చంద్రిక నా దోస్తు. ఇప్పటివరకు తన జీవితం ఒంటరి పోరాటమే. ఆ ఇంటి చంద్రుడు ఎప్పుడూ కృష్ణపక్షంలోనే జీవిస్తాడు. ఆ మసకలో ఇక చిన్న చిన్న తారల వెలుగేం కనబడుతుంది? చంద్రిక ఏం తళుకులీనుతుంది? కానీ జీవితాన్ని నిలుపుకోవాలనే పట్టుదలతో చదువుతో ప్రభుత్వ కొలువు సంపాదించుకోవటానికి వివిధ పరీక్షల్లో నెగ్గటానికి తిప్పలు పడిరది. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకుని తన చిన్ని తారల్ని వెలిగించుకోగలిగింది. వెలుగునివ్వగలిగింది. ముగ్గురు పిల్లల్ని చదివించుకుని, మంచి సంబంధాలు చూచి పెండ్లిండ్లు చేసింది. పురుళ్లు పోసింది. బాధ్యతలు తీర్చుకుంది. సమాజంలో సెభాష్ అనిపించుకుంది. పుట్టింటివారి నుంచి లభించిన అండ అంగబలంగా చెప్పుకుంటే, చంద్రిక అర్థబలం ఉద్యోగమే. సంపాదించిన తన సంపాదనే. తన విలాసాల మత్తులో కృష్ణపక్షం తేలుతూ చంద్రలోకాన్ని బాధ్యతా రాహిత్యంలోకి నెట్టిన కృష్ణపక్షం నెమ్మదిగా జీతం చూసి ఇటు దిక్కుకు పయనం మార్చాడట.
‘‘మరి నువ్వేమనలేదా చంద్రికా?’’ అన్నా నేను.
‘‘పిల్లల పెండ్లిండ్ల బాధ్యతలను బాధ్యతగా స్వీకరిస్తావా? అని అడిగా నిర్మొహమాటంగా’’ అంది చంద్రిక.
‘‘ఇంట్లో ఉండి తినటానికి, జనాభా లెక్కలోని తన పేరు చూపించటానికే ఇష్టపడ్డాడుకానీ, బాధ్యతలంటే నావల్లకాదు అని చేతులెత్తేశాడని’’ చెప్పి బాధపడిరది.
‘‘ఈ విషయంలో మరి నువ్వేం నిర్ణయం తీసుకున్నావని’’ అడిగితే…
బదులుగా ‘‘మా ఆయన తన ఉద్యోగంలో లంచాలు మరిగి, ఎప్పుడూ సస్పెన్షన్‌లోనే ఉద్యోగమంతా. ఒకసారి మేనేజ్ చేసి, మా నాన్నగారున్నప్పుడు వాళ్ళకాళ్లు వీళ్లకాళ్లు పట్టుకుని, డబ్బు పెట్టాల్సిన చోట పెట్టి ఇప్పించగలిగారు పోస్టింగ్‌ను మళ్ళీ యథాతథంగా. కానీ ప్రతీసారీ అలా కుదరదు గదా మైథిలీ’’ అని వాపోయింది చంద్రిక.
నిజమేనన్నట్లుగా తల ఊపాను నేను.
‘‘నాకు జీతం బాగా వస్తుందని తెలుసుకుని, ఒకసారి మళ్ళీ స్కెచ్ వేశాడు. కానీ నా మనసప్పటికే విరిగిపోయింది. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. నష్టమేంటో, లాభమేంటో తెలుసుకునే వయసుకి వచ్చారు వాళ్లు. పిల్లల కోసమైనా ఇంట్లోకి రానిద్దామనుకున్నా. కానీ వాళ్లు ససేమిరా నో చెప్పారు.
అన్ని రకాల ఢక్కామొక్కీలు తిని, రాయిలాగా మారిపోయింది నా మనసు. బాధ్యత తీసుకోనన్నాడు. పోనీ వ్యసనాలనేమన్నా వదులుకున్నాడా? అదీలేదు. రోజూ ఇల్లు గడుపుకుంటూ పిల్లలని, వాళ్ళకి రెక్కలొచ్చేదాకా మోస్తూ, వాళ్ళకు పెండ్లిండ్లు చేసేదాకా ఆర్థిక భారం నామీదేననే విషయం స్పష్టమైపోయింది. వీటన్నిటితోపాటుగా తన రోజువారీ ఖర్చులకి కూడా నామీదే ఆధారపడతాడని కూడా అర్థమైపోయింది.’’
నేను వింటూ మధ్య మధ్యలో ‘ఊ..’ కొడుతున్నాను. స్త్రీ మనసు ఎంతో సున్నితమైనది. అలాంటి సున్నిత మనస్కురాలైన చంద్రిక మనసు ఎంతగా వేదనకు గురి అయితే ఇలా మారింది పాపం. అందరూ ఉన్నా నాఅనే వాళ్ళున్నారని చెప్పుకోవటానికి ఆధారం లేని జీవితం తనది. ఐనా స్వాభిమానంతో నెగ్గుకొచ్చింది. ఏ సందర్భం వస్తుందా? రాళ్లు వేద్దామని చూసే సమాజంలో బ్రతుకుతున్నాం ప్రస్తుతం అందరం. తనూ అందులో భాగమేనని వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను.
‘‘రాళ్లు పడీ పడీ, ఆ దెబ్బలు తినితినీ ఏడవటం కూడా మరిచిపోయా మైథిలీ!’’ అనటంతో నా మనసంతా బాధతో కెలికినట్లయింది.
‘తన మొహం మీద మాత్రం చిరునవ్వే ఎప్పుడూ. ఏమీ ఇవ్వకపోయినా తనకు ఓ మంచి ఉద్యోగాన్ని, చిరునవ్వుని ప్రసాదించాడు ఆ దేవుడు’ అనుకుంటుంటాను నేను అప్పుడప్పుడు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను.
‘‘ఒక్కోసారి రాత్రిళ్ళు పిల్లలకు బిస్కెట్లు ప్యాకెట్లు తినడానికి కొనిచ్చి, నేను పస్తులు పడుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి.’’ అని నవ్వుతూ చెప్పింది నాతో.
‘‘ఇంకా అదేనవ్వు. ఇదెలా సాధ్యం?’’ అని అడిగా ఆశ్చర్యంగా.
‘‘రాటుదేలిపోయానన్నిటికీ. ఇప్పుడు నవ్వుతున్నాగానీ, ఈ బాధలు తట్టుకోలేక ఏడ్చిన రాత్రులెన్నో. అప్పట్లో తిండికీ ఉపవాసమే, నిద్రకూ ఉపవాసమే. కానీ దేవుడు మాత్రం నాకు చిరునవ్వుతో సహవాసం ఇచ్చినందుకు నేను చాలా ఋణపడి ఉంటాను’’ అంది నాతో.
‘‘దేవుడెక్కడున్నాడు? ఉన్నాడా?’’ అని అడిగా నవ్వుతూ.
‘‘ఆ… నిజంగానే ఉన్నాడబ్బా!’’ అంది.
నాకర్థంకాక నివ్వెరపోయా…
‘‘మనలో ఉన్న ఆత్మవిశ్వాసం, దానితోపాటు అబ్బే ధైర్యమే దేవుడంటే’’ అని క్రొత్త నిర్వచనాన్నిచ్చిన చంద్రికకు హృదయంలోనే ధన్యవాదాలర్పించాను.
పనుండి ఈమధ్య మా స్నేహితురాళ్లుండే ఊరెళ్లాను. చాలా రోజులైందని అక్కడే ఉండే చంద్రికను కలవటానికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన నన్ను చూసి చాలా సంబరపడిపోతూ `
‘‘ఏమండీ ఇటురండి. ఎవరొచ్చారో చూడండి’’ అంటూ ‘‘మా మైథిలీ మేడంగారు’’ అంటూ నన్ను పరిచయం చేసింది.
ఆశ్చర్యపోవటం నావంతయింది.
‘‘మేడమ్‌గారూ బాగున్నారా?’’ అంటూ కూర్చున్న మా ఇద్దరికీ మంచినీళ్ల గ్లాసులు తెచ్చిచ్చి, ఓ నిమిషం మాట్లాడి లోపలికి వెళ్ళిపోయాడు చంద్రిక వాళ్ళాయన.
‘‘ఇదేంటీ? మళ్లీ ఇదెప్పట్నుంచి?’’ అని అడిగాను చంద్రికను.
‘‘ఏంలేదు. నాకామధ్య గుండెకు సంబంధించిన జబ్బు చేసిందని చెప్పాగా? అప్పుడు నన్ను పలకరించాలనే నెపంతో వచ్చిచేరాడు. మళ్ళీ నన్ను చేరి, నా పెన్షన్ డబ్బుని తినటానికేనని తెలుసు. కాని కొద్దిరోజులు చూద్దాం అనుకుని ఏమీ అనలేదు.’’ అంది చంద్రిక. ఇదే అదనుగా ఇంట్లో చేరాడని చెప్పింది.
‘‘మరిప్పుడు బాగానే ఉంటున్నాడా?’’ అని అడిగా.
‘‘ఆ… బాగానే ఉంటున్నాడని’’ చెప్పింది.
‘‘అలవాట్లలో మార్పొచ్చిందా?’’ అన్నా.
‘‘ఆ… ఫరవాలేదు. సిగరెట్లు పూర్తిగా మానేశాడు. డాక్టర్లు వార్నింగిచ్చారట. పొగ పీల్చటం మానకపోతే ఊపిరితిత్తుల కేన్సర్‌కు దారితీసే ప్రమాదముందని’’
‘‘ఓహో… అదన్నమాట’’ అన్నాను.
‘‘మరి సురాపానమో?’’ అంటూ నా సందేహం వెలిబుచ్చాను.
‘‘ఇప్పుడు డైలీ లోంచి వీక్లీలోకి మారాడంది’’
‘‘మొత్తం మీద మనిషిలో చాలా మార్పు వచ్చిందన్నమాట’’ అన్నా సందేహం వీడీ వీడనట్లుగా.
‘‘మాంసం కూరలయితే తనే వండేస్తాడు. రోజూ వంటగది పనుల్లో సాయం చేస్తున్నాడు. కూరలు తరిగివ్వటం, రాత్రిపూట చపాతీలకు పిండి కలిపివ్వటం, సాయంత్రాలు స్నాక్స్ తేవటంలాంటివి చేస్తున్నాడు’’ అంది చంద్రిక.
నాకు కొంచెం సంతోషమన్పించింది. మంచిగా ఉన్నప్పుడు పట్టించుకోకుండా బలాదూర్లు తిరిగినా, చంద్రిక కొంచెం సిక్ అయి, చేసుకోలేని రోజుల్లో సహాయంగా ఉంటున్నాడులే’ అని తృప్తిపడ్డాను.
తన కండ్లలో కూడా అదేభావం దోబూచులాడిరది.
‘‘పిల్లలు వచ్చి వెళ్తున్నారా’’ అని అడిగా తనను.
‘‘ఆ… మొన్న రిటైర్మెంట్ ఫంక్షన్‌కి, నాకు బాగోలేనప్పుడు మళ్లీ అడపాదడపా వాళ్లని చూడాలన్పించినపుడు వచ్చి వెళ్తున్నారు’’ అంది చంద్రిక.
‘‘వాళ్ళ కోపం పోయిందా తండ్రిమీద’’ అని అడిగా.
‘‘మొదటిసారి వచ్చినపుడు వాళ్ళ నాన్నతో మాట్లాడలేదెవరము. ఇక నేనే నెమ్మది నెమ్మదిగా నచ్చచెప్పటం ప్రారంభించా పిల్లలకు. వాళ్ళు కూడా తమ తండ్రిలో వచ్చిన మార్పు గమనించి, మామూలుగా మాట్లాడుతున్నారు’’ అన్నది.
చంద్రిక మొహంలో ఇదీ అని కనిపెట్టటానికి వీలులేని ఒకలాంటి స్థితప్రజ్ఞత కనపడిరది. తిరిగివచ్చాడని సంతోషంగానీ, గొడవలైతే వెళ్ళిపోతాడనే బెంగగానీ ఏమీలేవు.
‘‘హమ్మయ్య… ఇక మొత్తం సంతోషమే నీ జీవితంలో’’ అన్నా.
ఇంతలోకి ఎప్పుడు ఛాయ్ తయారుచేశాడో? మా ఇద్దరికీ చెరో కప్పు ఛాయ్ ఇచ్చి తనో కప్పుతో లోపలి గదిలోకి వెళ్ళిపోయాడు చంద్రిక భర్త.
టీ తాగటమయిపోయాక చంద్రికతో వెళ్ళొస్తానని చెబుతుంటే, వాళ్ళాయనను కూడా పిలిచింది హాల్లోకి రమ్మని.
బైటికొచ్చినతను ‘‘మీ సార్ బాగున్నారా మేడంగారూ?’’ అని అడుగుతూ పిల్లల గురించి కుశల ప్రశ్నలు వేశాడు.
‘‘ఆ బాగానే ఉన్నారని’’ చెప్పి, చంద్రికతో ‘‘ఆరోగ్యం జాగ్రత్త చంద్రికా’’ అని చెప్పి బైటికి దారి తీశాను. తను కూడా నాతోపాటు రాబోతుంటే, ‘‘వద్దు వద్దు… నువ్వు విశ్రాంతి తీసుకో’’ అని చెప్పి నేను బైటికొచ్చేశాను.
తనింకా బాగా కోలుకోలేదు. ఆ జబ్బున పడ్డ ఇబ్బంది ఆమె శారీరక పరిస్థితి చూస్తే అర్థమవుతోంది నాకు.
నేనెప్పుడూ ఊహించని సంఘటన ఎదురైంది. నేనే కాదు మా ఫ్రెండ్స్ ఎవ్వరమూ ఊహించని విషయమిది. కాలం మనుష్యుల్లో మార్పు తీసుకొస్తుందంటారు. గాయాలు చేసే శక్తి, తిరిగి వాటిని మాన్పే శక్తి కాలానిదే అంటారు.
పుట్టినప్పుడు బ్రహ్మదేవుడు మన తలరాతలు రాస్తాడంటారు. కానీ ఈ విధాత రాసే తలరాతల కంటే కాలం గీసిన గీతలదే పైచెయ్యేమో.
ఆ రాతలకు పరిహారాలుంటాయి. మరి కాలం గీసే గీతలను చెరిపేయగల ఎరైజర్ ఎక్కడుంటుంది? ఎవరి దగ్గరుంటుంది? ఒకవేళ మనం గట్టిగా చెరిపివేసుకోవాలని తపన పడ్డా పేజీలు చిరిగిపోతాయేగానీ, కాలం గీసిన గీతలు చెరిగిపోతాయా? అన్నీ ప్రశ్నలే… జవాబు తోచని, రాని ప్రశ్నలే! అయినా కొన్ని కొన్ని సందర్భాలెదురైనపుడు, కొందరి జీవితాలను పరిశీలించినపుడు ఇవే ప్రశ్నలు దూసుకెళ్లినట్లనిపిస్తుంది నా మనసు కవాటంలోకి. కొండ చిలువలా చుట్టుకున్న, అంటిపెట్టుకున్న కృష్ణ పక్షాల్లో నిజమైన మార్పు రావాలంటే ఒక జీవితకాలం చాలదేమో.
***
‘‘కొడుకుకి, కోడలికి నా అవసరం తీరిపోయింది. ఇప్పుడిక్కడ వ్యర్థ పదార్థంగా పడివుండటం కంటే చేతనైనంత వరకూ నేనే ఇలా కష్టపడి పదో, పరకో సంపాదిస్తాను. స్వంతిల్లు ఎలాగూ ఉండనే ఉంది. వృద్ధుల ఫించను, మావారికొచ్చే ఫించను… ఇవి చాలునాకు’’ అంది మాలిని నాతో ధైర్యంగా.
ఇదిగో ఈ ఒక్కగది చాలు నాకు. ఇందులోనే నాక్కావల్సిన కొంచెం సామాను ఎప్పుడైనా బుద్ధి పుట్టి కొడుకు, కోడలు, పిల్లకాయలు ఇంటికొస్తే సరిపడే విధంగా ఫ్రిడ్జ్, రెండు మంచాలు, గ్యాస్‌పొయ్యి, ఓ టేబుల్ ఉంచుకుని, మిగతా సామానంతా సన్‌షేడ్స్ మీద సర్దించేశా పనివాళ్ళతో…’’ అంటూ ఆ హాలు లాంటి గదిలో ఉంచుకున్న సామాన్లను చూపించింది మాలిని నాకు.
వెరీగుడ్… అనుకున్నా మనసులో
అధైర్యం, పిరికితనం పోయాయి మాలినిలో. పూర్తిగా కొడుకుమీద ఆధారడిపోవటంతో కోడలికి చులకనగా మారిపోయింది మాలిని. తరాల్లో మార్పులు వచ్చినప్పుడల్లా వారి అభిప్రాయాల్లో కూడా పలు మార్పులు వస్తాయని వాటికి ఇరువైపులా వారు సర్దుబాటు కాలేనపుడు కుటుంబంలో ఎలాంటి దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయో, అవి ఎంత తీవ్ర ఫలితాలనిస్తాయోననే విషయం మేం ఎంతగా చెప్పినా పట్టించుకోని అనేకంటే ఒకరకంగా తనలో ఏర్పడిన ‘ఒంటరిగా ఉంటే బ్రతకలేనేమో’ అనే ఊహ భయపెట్టిందిన్నాళ్లూ మాలినిని. ఇప్పుడా భయాన్ని, బ్రతకగలననే ధైర్యం తరిమికొట్టింది. దగ్గిరగా ఉంటే నిజంగానే ప్రేమలుండవు. దూరంగా ఉంటేనే కాస్తో, కూస్తో ప్రేమలూ, అభిమానాలూ మిగిలి ఉంటాయి అనే విషయాన్ని ఆలస్యంగానైనా గ్రహించిన మాలిని ఆత్మవిశ్వాసపు ప్రతీకగా నిలబడిరది నాముందు.
తనకు షేక్ హ్యాండిచ్చి… ‘‘సెభాష్ మాలినీ…’’ అన్నా మనఃస్ఫూర్తిగా.
‘‘మరి ఏమిటి నీ భవిష్యత్ ప్రణాళిక?’’ అని అడిగా.
దానికి ప్రతిగా నన్ను చెయ్యిపట్టి ఎంతో సంతోషంగా చిన్నపిల్లను తీసుకువెళ్తున్నట్లు, తానూ ఓ చిన్న పిల్లైపోతూ వాళ్ల ఇంటి వెనుకకు తీసుకెళ్లి చూపించింది.
ఆ స్థలం చూసి, నేను చాలా ఆశ్చర్యపోయాను. మాలిని భర్త కాలం చేసిన తర్వాత మాలిని ఎక్కువగా కొడుకు దగ్గరే ఉండిపోవటంతో, ఈ స్థలమంతా చెత్తచెదారం, కలుపుతో నిండిపోయి ఉన్న జాగాలో ఇదెలా సాధ్యం? అనుకున్నా. సంకల్ప బలం గట్టిగా ఉంటే, సాధించలేనిది ఏదీలేదనే దానికి నిలువెత్తు సాక్ష్యం. మాలినిjైు నా ముందుందనిపించింది.
ఒక ప్రక్కన వంగ, గోరు చిక్కుళ్లు, టమాటా, పచ్చిమిర్చి, బీర, సొర పాదులు… ఇంకోవైపు జాగాలో సగం, వివిధ రకాల ఆకుకూరల మడులు, మిగతా సగంలో గులాబీలు, రెండురకాల కనకాంబరాలు, పందిరికి పాకించిన సన్నజాజి, విరజాజి మొక్కలు పచ్చపచ్చగా అప్పుడే పట్టిన పూత పిందెలతో, కూరగాయ మొక్కలు నవనవలాడుతూ తలలాడిస్తున్న ఆకు కూరల మడులు, విచ్చుకోవటాన్కి పోటీ పడుతున్న ఎరుపు, తెలుపు, గులాబీ మొగ్గలు, వీటితో పోటీకి సిద్ధంగా ఉన్న కనకాంబరాలు… అన్నీ ఓ క్రమపద్ధతిలో పేర్చినట్లుగా ఉన్న ఆ చిన్న సైజు పెరటి తోటను చూస్తుంటే ఒకవైపు ముచ్చటగానూ, మరోవైపు ఇలా తయారు చేయటానికి ఎంత శ్రమపడ్డదో మాలిని అని అనుకుంటే తన మీద ఉన్న వల్లమాలిన స్నేహం కాస్తా గౌరవంగా మారిపోయింది నా మనసులో. నిజంగా ఎంతో సంతోషంతో తనకు మనఃస్ఫూర్తిగా ‘‘అభినందనలు’’ చెప్పా.
‘‘థాంక్యూ మైథిలీ…’’ అంది ప్రతిగా.
‘‘ఇక నేను ఈ పెరటి తోట వదిలి ఎక్కడికీ వెళ్లను, వెళ్లలేను. ఎవరైనా నన్ను చూడాలనుకుంటే వాళ్లే వస్తారు. వచ్చి రెండ్రోజులుండిపోతారు’’ అన్నది నిక్కచ్చిగా.
నిజంగా పెరటి తోటన్నా… అందులోని మొక్కలన్నా పిల్లలతో సమానం. కాసింత మట్టి, కూసింత నీరు పోస్తే మనకు ఎంతో ప్రేమతో, కృతజ్ఞతగా పండ్లను, పూలను, ఆకుకూరలను, కాయగూరలను ఇస్తాయి. అన్నానికి ఆదరువుగా మారతాయి. పిల్లలైనా కోపంతో మనల్ని ఎప్పుడైనా కసురుకుంటారేమోగానీ… ఇవి ఎప్పుడూ తలలూపుతూ మనకు స్వాగతం పలుకుతాయి తప్ప చీదరించుకోవు మనల్ని చూడగానే. కొందరు మనుష్యుల్లాగా మూతి ముడుచుకోవు. మరొకొందరిలాగా చీటికీ, మాటికీ విసుక్కోవు. కయ్యం పెట్టుకోవు. ఈర్ష్యా ద్వేషాలకు అతీతం. తెలిసిందల్లా ఇవ్వడమే.
ఇలా ఆలోచిస్తున్న నన్ను తన చేత్తో కుదుపుతూ ‘‘రా మైథిలీ… ఇంట్లో కూర్చుందాం’’ అంది.
‘‘అబ్బే వద్దు. వద్దు… ఇక్కడే హాయిగా, చల్లగా, అంతకుమించి స్వచ్ఛంగా ఉంది’’ అనటంతో
తనకూ, నాకూ ఓ రెండు కుర్చీలు ఇంట్లోంచి తీసుకొచ్చి వేసింది. కూర్చున్నాం తృప్తిగా ఇద్దరం. కడుపునిండా మాట్లాడుకున్నాం.
‘‘ఇక్కడ వారం వారం సంత జరుగుతుందిగదా! ఆ సంతకు పంపించేస్తాను వాటిని’’ అంది నాతో, కూరగాయలవైపు చూపిస్తూ.
‘‘ఇంటి చుట్టుప్రక్కల వారికి అపుడపుడు ఇచ్చినా చాలా కూరగాయలుంటాయి ఇంకా. అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నా’’ అంది మాలిని.
ప్రతి మాట తన గొంతులో ఆత్మ విశ్వాసపు తళుకులను అద్దుకుంటూ మరొకసారి తను ‘‘స్వాభిమానమూర్తిగా’’ సాక్షాత్కరించింది. సాధికారత కొట్టొచ్చినట్లు కనపడిరది తన ప్రతి అడుగులో.
***
‘‘ఊ… తర్వాతేమైంది?’’ అంది మైథిలి సువర్ణతో.
‘‘బంగారం అమ్మద్దు మమ్మీ. మేమిద్దరం చెరో రెండు లక్షలు ఇస్తాము’’ అన్నారు భార్గవ్, నవీన్‌లు.
‘‘మరి తీసుకోకపోయావా?’’ అంది మైథిలి.
‘‘నాకీ ఆస్తిపాస్తులు, నగానట్రా మీద ఏమాత్రం మోజులేదు మైథిలీ. అవి పెట్టుకుని సంతోషంగా గడపాల్సిన రోజులన్నీ భారంగానే గడిచిపోయాయి. ఇప్పుడు దేనికోసం ఇవన్నీ. నాతోపాటు అవమానాన్ని హేళనలను సమపాళ్లలో స్వీకరించాయి నా ఒంటిమీద నగలు. ఒక్కోసారి అవి కూడా దెబ్బలు తిన్నాయి. ఆ కరడుకట్టిన అనుమానాహంకారపు చేతుల్లో నన్ను బాధించిన గతకాలపు చేదును సమూలంగా తుడిచివేద్దామనుకుంటున్నాను. నాతోపాటుగా నా నగలకు స్వాభిమానపు పునర్జన్మ నిస్తాను మైథిలీ’’ అంది సువర్ణ.
ఆమె గొంతులో ధృఢ నిశ్చయం అంతకు మించి పట్టుదల, పట్టుదలకు మించి స్వశక్తితో తన కాళ్లమీద తాను నిలబడుతూ అనుమానపు పడగను అణగద్రొక్కాలనే స్వీయ ఆలోచనలకు పడ్డ బీజం మొలకెత్తి వృక్షంలా వ్రేళ్లూనటానికి ఇంతకాలం పట్టిందన్నమాట అనుకుంది మైథిలి తన మనసులో.
‘ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు’ అనే పాత సామెతను తిరగరాసిన తన నేస్తం సువర్ణ మీదున్న ఆప్యాయత, వాత్సల్యం రెట్టింపయ్యాయి.
‘‘స్త్రీల స్వాభిమానం, పట్టుదలలు ` మహిళా జగతికే వెన్నెలలన్నమాట’’ అన్నా సువర్ణతో.
‘‘మరి ఎప్పుడు నీ కార్యాచరణకు శ్రీకారం చుడుతున్నావు?’’ అన్నా సువర్ణతో.
‘‘వచ్చేవారమే’’ అంది సంతోషంగా.
‘‘మరి బొటిక్‌కి కావాల్సిన సామాగ్రి అంతా సమకూర్చుకున్నావా?’’ అన్నా సువర్ణతో.
‘‘ఆ… ఆ పనులన్నీ చకచకా సాగిపోతున్నాయి. గతంలో ఓ కిరాణా షాప్ నడిచిందట దాంట్లో. అది ప్రస్తుతం ఖాళీ అయిందట. దాన్నే మేము ఐదు సంవత్సరాలు లీజుకు తీసుకున్నాము. పిల్లలిద్దరూ దగ్గరుండి ఆ ఫార్మాలిటీస్‌కు సంబంధించిన పనులు చూసుకున్నారు. ఎవరికి ఖాళీ దొరికిన సమయంలో వాళ్లు దగ్గరుండి కార్పెంటరీ వర్కు చేయిస్తున్నారు. ఒక ఏకాండి హాలు పెద్దదిగా ఉంది. దీనికంటే కొంచెం చిన్న గదిలాంటిది ఆ హాలుకు వెనుకగా ఉంది. ప్రస్తుతం సరిపోతుంది. కప్ బోర్డ్సు మేమే పెట్టించుకుంటామని అడిగితే ఓనర్ ఒప్పుకున్నారు. స్టిచ్చింగ్‌కు వచ్చే బట్టలు పెట్టటానికి, మగ్గంవర్క్ చేసినవి, ఎంబ్రాయిడరీ చేసినవి తగిలించటాన్కి వీలుగా వార్డ్ రోబ్ లాంటిది, క్లాత్ కటింగ్‌కి ఓ పెద్ద టేబుల్. ఇలా, ఓ చిన్న క్యాష్ కౌంటర్ లాగా ఇలా… ఏవైతే ముఖ్యమో అలాంటివి చేయిస్తున్నాము’’ అంటూ
‘‘ప్రస్తుతం నాకు టైలరింగ్‌లో సహాయానికి ఒక ఆడమనిషిని, మగ్గం వర్క్ చేయటానికి ఒక మగ మనిషిని మాట్లాడదామనుకుంటున్నా’’ మైథిలీ అంది నాతో.
‘‘చాలా ఫాస్ట్‌గా ఉన్నావ్!’’ అన్నా నవ్వుతూ.
‘‘నా గతాన్ని ఓవర్‌టేక్ చేయాలంటే ఫాస్ట్‌గా ఉండాలిగా అంది’’ ప్రతిగా నవ్వు గొంతుకతో.
నా మనసులో కొద్దిగా సందేహం మిగిలింది. అందుకే అన్నా సువర్ణతో `
‘‘భార్గవ్, నవీన్ వాళ్ళు డబ్బు ఇస్తామన్నప్పుడు తీసుకోవచ్చు గదా! ఎందుకు వద్దన్నావు?’’
‘‘అది కాదు మైథిలీ… వాళ్ళిద్దరూ అపార్టుమెంటు కొనుక్కుంటున్న క్రమంలో పేమెంటుగా పెద్ద మొత్తాన్నే చెల్లిస్తున్నారు నెలనెలా. దానికితోడు ఇద్దరూ చెరో చిట్టీ కూడా వేస్తున్నారు. అందుకే ఇక నేను అడగదలుచుకోలేదు. ఒకవేళ వాళ్లు ఇలాంటి పేమెంట్లు, చిట్టీలు కట్టాల్సి లేకపోయినా అడగకూడదనుకున్నా. ఇప్పటికీ వాళ్ళిస్తామన్న డబ్బులు తీసుకోలేదని కొద్దిగా అలిగారు రెండ్రోజులు. నేనే సర్ది చెప్పా వాళ్లను. నెమ్మదిగా అలకమాని దార్లో పడ్డారు’’
‘‘అదే ఎందుకు తీసుకోలేదని నా డౌటనుమానం’’ అన్నా సువర్ణతో
‘‘అసలు విషయం చెప్పనా’’ అంది నాతో.
(సశేషం)

1 comment
https://shorturl.fm/GAWz9