ప్రముఖ రచయిత్రి గా, కవయిత్రిగా,పాఠ్యపుస్తకాల రచయిత్రిగా, సంపాదకురాలుగా, అధ్యాపకులు గా బండ సరోజన గారి జీవిత ప్రస్థానం ఎంతో ఆదర్శనీయమైనది. ఎక్కడ ఏ భేష జాలు లేకుండా సాదాసీదాగా ఉంటూ మనుషులను ప్రేమించే స్వభావశీలి. ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించినా, ఖచ్చితమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చినా ఆమె కామెనే సాటి. ఇటు రచయిత్రిగా అటు విద్యావేత్తగా వారి జీవిత ప్రయాణం మయూఖ పత్రిక ముఖాముఖి కార్యక్రమంలో తెలుసుకుందాం.
ప్ర : నమస్కారం మేడమ్! లద్నూరు నుండి లండన్ దాకా …. ఎట్లా ఉంది ఈ ప్రయాణం ?!
జ : ప్రయాణం అంటేనే ఎత్తుపల్లాలు, ఒడిదొడుకులు ఉంటయి. జీవితం కూడా అంతే !! నా జీవితం కూడా అందుకు భిన్నం ఏమీ కాదు .
ప్ర : మీ కుటుంబ నేపధ్యం ఏమిటి ? మీ వాళ్లల్లో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారా ?
జ : అస్సలు లేరు . అసలు మాది ఒక పక్కా వ్యవసాయ కుటుంబం. జనగామ దగ్గరలోని లద్నూరు మా ఊరు.
ప్ర : అప్పటి రోజుల్లో వ్యవసాయ కుటుంబంలో ఆడపిల్లగా మిమ్మల్ని ఎలా చూసారు ?!
జ : మా నాయనమ్మకు నా మీద శాన ప్రేమ ఉండేది. నన్ను బడికి పంపేవారు . నేను కూడా బాగనే చదువుకునే దాన్ని. అయితే .. నా తొమ్మిదవ ఏటనే నాకు పెండ్లి అయింది.
ప్ర : అవునా ?! బాల్య వివాహమన్న మాట. మరి వాళ్ళు ఎక్కడివాళ్ళు ?!
జ : మేనోళ్లే ! మెదక్ దగ్గర సిద్దన్నపేట వాళ్ళది. మేనత్త కొడుకే !!
ప్ర: వైవాహిక జీవితం మీ విద్యాభ్యాసానికి అడ్డు తగిలిందా? లేక మేనోళ్లే కనుక సహకరించారా?!
జ : అదేగద బాధ! స్త్రీ విద్య అనేదే వాళ్లకు తెలువదు. అందులోనూ ఉన్నత కుటుంబాలలో కూడా ఆడిపిల్లలకు ఏడో, పదో చదువంగనే పెండ్లిళ్లు చేసేటోళ్లు. ఇగ మా లాంటి కుటుంబాలలో చెప్పనే ఒద్దు.
ప్ర: అప్పట్లో చిన్నపిల్లలకు పెళ్లి అయినా కూడా ఒక వయసు వచ్చేదాకా అత్తవారింటికి పంపకపోయేవాళ్లు కదా?! మరి మీ విషయంలో ఎలా జరిగింది?
జ: అయ్యో.. దగ్గరోళ్ళు గనుక తోలుకపోయేటోళ్లు. పదేండ్ల పిల్ల అంటే ఎన్నో పనులకు ఆసరా అన్నట్టే. ఏ మాత్రం జాలి ఉండకపోయేది. పెండ ఎత్తుడు , సానిపి సల్లుడు , పక్కింటి నుండి బిందెల కొద్ది నీళ్లు మోసుడు , దంచుడు , ఇసురుడు, అన్ని పనులు అప్పుడే నేర్చుకోవాలె, చేయాలె కూడ. మా అత్త పని చేయకుంటే ఊరుకోక పోయేది. అట్ల అన్ని పనులు చేసి చేసి కట్టెపుల్ల లెక్క అయిపోయిన.
ప్ర. మరి ఆ చాకిరీ నుంచి విముక్తి కలగలేదా?!
జ. మొదలే చెప్పిన గద…మా నాయనమ్మకు నేనంటే ప్రాణం. ‘ చిన్న పిల్లను గింత చాకిరి కింద చంపుతవా ఏంది ?’ అని తన కూతురితో .. అంటే మా అత్తతో గొడవ పెట్టుకుని మా నాన్నకు బండి పంపమని మతలబు చేసి బండి రాంగనే నన్ను తీసుకుని మా ఊరికి వచ్చేసింది. ‘ పిల్ల ఆగం అయింది. ఇగ అక్కడికి తోలనే వద్దు.’ అన్నది.
ప్ర. మరి అప్పటి రోజుల్లో చాలా మంది సంతానం, ఇంటి నిండా మనుషులు .. ఇదంతా ఉండేది కదా ! పెళ్లి అయ్యాక కూడా ఆడపిల్ల ఇంట్లో ఉంటే మీ వాళ్ళు ఒప్పుకున్నారా ?!
జ : అదేమీ లేదు, మా నాన్న ‘ తీగకు కాయ బరువా?! మన పిల్ల కొన్నాళ్ళు మన దగ్గర్నే ఉంటది.
‘ అన్నాడు . నేను చదువులో చాలా తెలివైనదాన్ని. నన్ను మిడిల్ స్కూల్ వరకు చదివించాలని మా నాన్న కోరిక.
ప్ర . అంటే .. మళ్ళీ చదువు మొదలు పెట్టారా ?!
జ . అవును, అయితే .. నేను తెలివయిన దాన్నే గానీ , బడి దొంగని. అయినా కూడా సెవెంత్ క్లాస్ లో నేనే స్కూల్ ఫస్ట్ వచ్చాను.
ప్ర. మీకు సాహిత్యంపై ఆసక్తి ఏ వయసులో కలిగింది?! మీ ఇంట్లో ఎవరైనా సాహిత్యం అంటే ఇష్టపడేవాళ్లున్నారా ?!
జ . మా నాన్న ఆ రోజుల్లో .. అంటే నిజాం కాలంలోనే అయిదో తరగతి చదివాడు. ఆయన ఒక్కడే కొడుకు గనుక వాళ్ళింట్లో ఏం చేసినా చెల్లేది. నులక మంచంలో పడుకుని ఏవో పుస్తకాలు చదివేవాడు, పాడేవాడు కూడా. మా ఇంట్లో ఒక పెద్ద చెక్క సందుక నిండా ఉర్దూ పుస్తకాలుండేవి .
మా నాన్న అలవాటు నాకూ వచ్చింది. పిల్లల పుస్తకాలు బాగా చదివాను . అలా నాలో పఠనాసక్తి పెరిగింది.
5 comments
After Generating Millions Online, I’ve Created A Foolproof Money Making System, & For a Limited Time You Get It For FREE… https://ext-opp.com/RPM
After Generating Millions Online, I’ve Created A Foolproof Money Making System, & For a Limited Time You Get It For FREE… https://ext-opp.com/RPM
After Generating Millions Online, I’ve Created A Foolproof Money Making System, & For a Limited Time You Get It For FREE… https://ext-opp.com/RPM
An Ultimate Web-Hosting Solution For Business Owners https://ext-opp.com/HostsMaster
MobiApp AI – True Android & iOS Mobile Apps Builder (Zero Coding Required) https://ext-opp.com/MobiAppAI