Home పుస్త‌క స‌మీక్ష‌ సీతమాట – బంగారు మూట పద్య మాలిక

సీతమాట – బంగారు మూట పద్య మాలిక

by Dr. Nannapuraju Vijayasri

సీతమాట శతకకర్త డా. చీదెళ్ళ సీతాలక్ష్మి విశ్రాంత సహాయాచార్యులు ప్రభుత్వ డిగ్రీకళాశాల ఇబ్రాహింపట్నం రంగారెడ్డి జిల్లా
అనేక కవితలు, కథానికలు, కథలు, పద్యాలు, వ్యాసాలు, వ్యంజ కాలు, మొగ్గలు, గజల్స్, గేయాలు, హైకూలు అనేక ప్రక్రియలుపలు రచనలు చేశారు అనేక పత్రికలలో ప్రచురించబడ్డాయి తెలుగులో లేఖాసాహిత్యం పై పి . హెచ్ . డి.సిద్ధాంత గ్రంధం ముద్రణ 2004 లో జరిగింది . తేలుగు కావ్యావతారికలలో సాహిత్య విమర్శ 15, వ శతాబ్దంవరకు ఎమ్. ఫిల్ . పరిశోధనాగ్రంథం ‘ ముద్రణ 2019 లో జరిగింది జానకీ రాఘవీ యం – జననీశతకం ముద్రణ 2017 లో జరిగింది
నందగిరి ఇందిరాదేవి కథలు సంపాదకులు డా. చీదేళ్ళ సీతాలక్ష్మి, పరిమి వెంకటసత్య మూర్తి తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురణ 2018 లో జరిగింది నంద గిరి ఇందిరాదేవి అమ్మమ్మ కధలు సంపాదకులు డా. చీదెళ్ళ సీతాలక్ష్మి పరిమి వెంకట సత్యమూర్తి తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురణ 2019 లో జరిగింది
మేడ్చల్ సాహిత్య వేదిక దర్పణం సాహిత్య వేదిక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు నిష్కల్మష వ్యక్తిత్వం ఉపన్యాస ధోరణి రచనా కౌశల్యం ప్రేమ స్వభావం ఆమె సహాజలక్షణం సంపూర్ణ మద్దతు తెలిపె సత్యమూర్తి అండదండ తో అనేక విజయాలు సాధించే సీతాలక్ష్మ వ్యయ ప్రయాసాలకోర్చి 202 సీతమాట పద్యాలను నేటియువతి యువకులకు అందించాలని అనేక పరిష్కార మార్గాలను పద్యంలో చూపించారు ఇది అమూల్యమైన పుస్తక రాజ మిదిఅక్షరజ్ఞానం కలిగిన వారు అందరూ చదివి ఆలోచించే పుస్తకము అందులో సూచించిన పరిష్కార మార్గాలు వినిపిస్తూ ప్రచురించిన అమూల్యమైన పుస్తకము అందరుచదివి ఆలోచించడమే కాదు అందులో సూచించిన పరిష్కార మార్గాలు అనుసరించాలి ఎలాంటి విపత్కరపరిస్థితుల్లో కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు

ఇందులో ధైర్యం,చైతన్యం,సామాజిక న్యాయం,దైవం,అమ్మ,భాష,సెల్ ఫోన్,హిందువులకు బుర్కా పద్ధతి వద్దని,విద్యార్థులు శ్రద్ధగా చదవాలని,ప్రియుని మాటలు నమ్మరాదని,అధిక అలంకరణ మంచిది కాదని,మంచి స్నేహం చేయాలని,సంస్కారం ఉండాలని,గర్వం పనికిరాదని,బద్ధకం విడాలని,వ్యాయామం చేయాలని,తల్లిదండ్రులను గౌరవించాలని, బార్య భర్తలు అణ్యూ ణ్యంగా వుండాలని,తృప్తిగా జీవించాలని, చెడుపనులుచేయరాదని,కాళోజీ గురించి,ఉగాది గురించి,వలిగొండ రైలు ప్రమాదం గురించి,రాజకీయం గురించి,వలస కూలీలు వ్యద,రైతు వ్యధలు,లాక్ డౌన్ గురించి, అమరుల త్యాగం, మధ్యపానం మానాలని, ఆలోచించి మాట్లాడాలని, చెల్లెలిని ప్రేమగా చూసుకోవాలని, శ్రమించి పనిచేయాలని, వినయ విధేయతలు వుండాలని, బందువులు మనకు బాధ వచ్చినప్పుడే సహా యం చేసిన వారే నిజమైన బం దువులు అన్నారు .
201 పద్యాలతో చిత్తగించరయ్య సీతమా ట. అని బోధించిన డా. చీదెళ్ళ సీతాలక్ష్మి ఆటవెలది పద్యాలతో అనేక అంశాలు జోడించి వ్రాసిన నీతి శతకం సీత మాట
స్తబ్దత సృజన శీలత మానవీయత కలసి పుష్పించిన పుస్తకం సీత మాటమంచి చెడులను సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక పరిశీలనలు ఉన్నాయి .సాహిత్యంలో వస్తున్న క్రమమార్పుల పట్ల బాధ్యతాయుతమైన అధ్యయనం అనుభవప్రాధాన్యత గల భావోద్వేగం పొందిన అనేక అంశాలతోరణం .ప్రయోగశీలమైంది వాస్తవికతను దృశ్యమానం చేశారు అర్థం కానివి విడమరిచి లోతుపాతులు తెలుసుకొనిస్పష్టంగా ఉన్నఅనేక సమస్యలను పద్యరూపకంగా సృజన శీలంగా అభివ్యక్తం చేశారు .
“చదువు లేన్ని యున్నసంస్కారమొకటే”
లేనిచోపశువుతో సమానం శిల్పం కోసం పాకులాడుతూ భావాన్ని నష్టపరుచుకోలేదు .భాష కోసం వెతుక్కోలేదు ఏవో అక్షరాల సమూహాన్ని అతికించే ప్రయత్నం చేయలేదు సహజంగా అతి సులభశైలిలోశతకాన్ని వివరించారు .
వినూత్న దృశ్య కోణాలు అన్వేషించారు సీతగారు
“ఆత్మహత్య యనగ అవహేళనకరము” బ్రతుకుచు సాధించు అన్నారు.
ఉన్నయంతలో నెయున్న తంబుగ నుండు
ఆశ పెంచుకొనకు మధికముగను
కలిగినంత తృప్తి ; తోలు గును శోకము
చిత్తగించరయ్య సీత మాట
అని చక్కగ తృప్తి గోప్పతనం వివరించారు
మాయమాట చెప్ప మనసు పాడైపోవు
చెప్పు మాటలెపుడుచెవికి యింపు
మంచి చెడు నెరుంగుమనిషియేశ్రేష్టుడు
చిత్తగించరయ్య సీత మాట
మాయ మాటలు వినరాదని అందులోని మంచి చెడును గ్రహించి నిర్ణయం తీసుకోవాలన్నారు.
ప్రవహించే పద్యం సౌకుమార్యం మృదుల స్వభావం సున్నితత్వం, లాలన, పాలన, పలుకరింపు, ఒడుపుగా నీతిని బోధించడం మాట్లాడుకునే అంత సహాజంగా ఒదిగిపోయె పద్యాలు
ఎదుటి వారి నెవడు యెంత బాధించినా
సహనమునను వాడెసజ్జనుండు
నిజము దెలసినంత నీరేను నీచుడు
చిత్తగించరయ్య సీతమా ట
విద్యార్థులకు సహానం గోప్పతనం వివరించారు
శిలనులి సృశింప శిల్ప మౌను నిజము
లోహమెంత కాల్చ లొంగునంత
కష్టజీవి కెపుడు కాలమ్ము కలిసోచ్చు

చిత్తగించరయ్య సీతమా ట
విద్యార్థులు కష్టపడాలనికష్టపడితేనే ఫలితం వస్తుందని అన్నారు.
నిద్రాణ స్థితి నుంచి యువత మేలుకోవాలని మానవ పురోగతికి చిహ్నందౌర్భాగ్యపు పరిస్థితులు తలుచుకొని సంస్కృతిని దెబ్బతీయరాదని అన్నారు.
లంగ వోణి నేడు తుంగలో త్రోక్కిరి
వంటి కతుకుబట్ట వండ రయ్యే
వెకిలి వేషమంత విష సంస్కృతిని దెల్పు
చిత్తగించరయ్య సీతమా ట
సంస్కృతి సాంప్రదాయాల గురించి వివరించారు
భారమనుచు మీరు భావింప వలదులే
తల్లి తండ్రులంత తల్లడిల్ల
నిన్ను వదిలి వేయ నీ వెట్లు ఎదిగేవు
చిత్తగించరయ్య సీతమా ట
పూర్వ కాలంలో తల్లి దండ్రులను కడవరకు ప్రేమతో చూసేవారు . ప్రస్తుతం అనాధ ఆశ్రమం లో వేస్తున్నారని ఆవేదన వ్యక్త పరిచి అలా చేయ రాదని యువతకు నీతిని బోధించారు .
తెలుగులో లేఖా సాహిత్యం సిద్ధాంత గ్రంధంగా తెలుగు కావ్యా వతారికలలో సాహిత్య విమర్శ యం . ఫిల్‌ ‘ సిద్ధాంత గ్రంథంగా కొత్తగా వస్తున్న మార్పులకు అనుగుణం గా సీతమాట ద్విశతి బాల్య వివరాలు తెలియ జేసే జానకీ రాఘవీయం ఆనాటి ఆచారం సంప్రదాయాలు సంస్కృతిని ప్రతి భిం బించే శతకం జానకీ రాఘవీ యం
వ్యవస్థ మార్పుకు అద్దం పట్టిన తీరుతెన్నులు సీత మాట శతకం ప్రతి ఒక్కరు చదివే పుస్తకం

You may also like

Leave a Comment