వారాల ఆనంద్ జ్ఞాపకాల ఊరేగింపు (యాదోంకీ బారాత్) మహా జోరుగా, మరెంతో ఘనంగా అలుపూ విరామం లేక ఆరు దశాబ్దాల చరితను పలకరిస్తూపాఠకులను పులకరింప చేస్తూ సాగుతుంది. కరీంనగర్ ఊపిరిగా మొదలైన ఈ బారాత్ వేములవాడ, సిరిసిల్ల, అగ్రహారం, మంథని, చొప్పదండి, హైదరాబాద్ ఇలా ఒకటీ రెండూ కాదు, తెలంగాణా ఊర్లన్నీ తిరుగుతూ, ఢిల్లీపురవీధులకి కూడ ఏగి పలు అవార్దుల, రివార్దుల హారతులందుకుంది.ప్రతి ఊరినీ అక్కడి వ్యక్తులనూ పరిచయం చేస్తూ మనల్ని తనతో పాటు తీసుకెళ్తుంది. ఈ ఘనమైన బారాత్ ప్రయాణంలో ఇది అది అనిలేకుండా ఎన్నో విషయాలు మనకు పరిచయమవుతాయి. పలు సంస్థలకు, కార్యక్రమాలకూ జరిగిన రూపకల్పన, పలు సాహితీ ప్రక్రియల వివరణ, ఎందరోసాహితీ వేత్తల పరిచయం, దేశ విదేశ సినిమాల విశ్లేషణ, పలు ప్రింటింగ్ విధానాలు, డాక్యుమెంటరీ సినిమాలు తీసే ప్రక్రియలు ఇలా ఎన్నింటినోవివరిస్తుంది. ఈ జ్ఞాపకాల ఊరేగింపులో వందల కొద్దీ వ్యక్తులపేర్లు ఎదురొస్తాయి. కొన్ని తెలిసినవి, మరెన్నో తెలియనివి. ఇందులోఒక దగ్గర అనంద్ చెప్పినట్టు కొన్నిపేర్లు హాయి చెప్తే, కొన్ని హలో చెబుతాయి. ఇంతకుముందే పరిచయం ఉన్నవాళ్ళు హాయిచెబితే, కొత్తవాళ్ళు హలో చెప్పారు అని ఆయనేఒక చోట అన్నారు. అంతేకాదు కొన్నిచాఫ్టర్లలో హలొ చెప్పిన పేర్లు ఆ తరువాతిచాఫ్టర్లలో హాయి కూడా చెప్పేస్తాయి. అంటే ఆ పేర్లు మళ్ళీ మళ్ళీ ఎదురవుతూ మనకి అంతగానూ పరిచయమవుతాయి. ఇక్కడ మామూలు వ్యక్తులే కాదు, పలు సినీ నటులు, దర్శకులు, మరెందరో సాహితీవేత్తలు కూడా కలుస్తారు. అక్కడక్కడా దేశ విదేశసినిమాలూ పరిచయమవుతాయి, ఆపాత మధురాలైన అలనాటి హిందీ, తెలుగు పాటలు పలకరిస్తాయి, కూనిరాగాలుతీపిస్తాయి, మది నింపుతాయి. ఈ పుస్తకంలో 80 వదశకం నుంచి 2014 వరకు కరీంనగర్ లో సాహితీ పరంగా, ఫిలిం సొసైటీ పరంగా జరిగిన ఎన్నో కార్యక్రమాల వివరణదొరుకుతుంది. ఎస్.ఆర్.ఆర్. కాలేజీ పరిధిలో జరిగిన కోర్సుల వివరాలు చేపట్టిన పలుఅభివృద్ది కార్యక్రమాలు, అందుకు ఎంతగానో సహకరించినఉపాధ్యాయులు, కలెక్టర్లు, మంత్రుల వివరాలు ఇలా ఎన్నో పొందుపరచబడ్డాయి. కరీంనగర్ నేను పుట్టి పెరిగిన ఊరే. మా ఊరిలోనా చుట్టూతానే ఇంత ప్రపంచం ఉండిందా, ఇన్ని కార్యక్రమాలు జరిగాయా, ఆప్రపంచం నాకు తెలియలేదే, అందులో నేను లేనే అని నాకు చాలా చోట్ల అనిపించింది. ముఖ్యంగాఫిల్మ్ అప్ప్రీషియేషన్ కోర్స్ నేనూ చేసిఉండాల్సిందని, ఫిలిం సొసైటీ లోని మంచి మంచిసినిమాలు చూసి ఉండాల్సిందని అనిపించింది.
ఈ యాదోంకీ బారాత్ ఒక సృజనకారుడి ప్రయాణం.సృజనకారుడైన వాడు తనను తాను వ్యక్తం చేసుకోవటానికి ఏదో ఒక్క రూపమే ప్రధానం కాదనినేను విశ్వసించాను అని చెప్తూ ఆనంద్ తన సృజనను,అన్నిరంగాల్లో చూపించారు. కధలు, కవితలు, విశ్లేషణలు, ఫిల్మీకరణలు, ఫిల్మ్ సొసైటీ స్థాపనలు,బోధనలు, ఉత్సాహాలు, ప్రోత్సాహాలు అన్నిటా తానైతను ఎరిగిన, తిరిగిన, ప్రపంచాన్ని మన కళ్లముందు అక్షరీకరించారు అనటం కంటేదృశ్యీకరించారు అనటం బాగుంటుంది. అయితే ఈ సృజనకారుడిప్రయాణం పర్సనల్ కాదు. సమాజంతో, సాహిత్యంతో, సినీ ప్రపంచంతో ముడిపడి ఉన్న ఎన్నో యదార్ధ సంఘటనల చిత్రణ. ఈయదార్ధ సంఘటనలకు అక్షరరూపం ఇవ్వడం వల్ల అది భావి తరాలకు ఒక సాధికారిక చరిత్రగా మిగులుతుంది.కొన్ని దశాబ్దాల క్రితం ఉన్నసామాజిక పరిస్థితులు, మార్పుకోసం జరిగిన ప్రయత్నాలు, కార్యక్రమాలులాంటివి అర్ధమవటానికి, అలాటి వాటిని ముందుకు తీసుకెళ్లడానికి, ఈ పుస్తకం ఒక ఆలంబన అవుతుంది. . జీవితంఎల్లవేళలా పూల పానుపు కాదు. అది నవ్విస్తుంది,ఏడిపిస్తుంది, ఎత్తున నిలబెడుతుంది,ఎత్తి కుదేస్తుంది. ఎంతటి సృజనకారుడిని కూడా ఊహించనిమలుపులు తిప్పుతుంది. కొన్ని చిన్న చిన్న మలుపులైతే కొన్నిపెద్ద కుదుపులు. జీవితంచీకటి వెలుగుల సంగమం అంటూ పుస్తక ముఖచిత్రం చెప్పకనే చెప్తుంది. “ ఓటమి నాకు ఊపిరి కాదుఅలవాటు కాదు దినచర్య కాదు అది చీకటిలాఎదురు వస్తుంది, చిటికెస్తేపరిగెడుతుంది…” అంటూ అలాటిఆటుపోట్లను ఎదుర్కొంటూ, సమాజంలో తనదైన స్థానాన్నినిలబెట్టుకుంటూ తన సృజనకి విరామం ఇవ్వకుండా సాగిన ఆనంద్ ప్రయాణం ‘జ్ఞాపకాల ఊరేగింపు’ ఎంతో ఇంట్రెస్టింగ్ గాసాగుతుంది. ఇందులో దాదాపు ప్రతి చాప్టర్ ఒక కవితతో మొదలవుతూ ఆ చాఫ్టర్లో ఎలాంటిజ్ఞాపకాల సందడిని మనం చూడబోతున్నామో చెప్పకనే చెప్పుతుంది, మన మూడ్ ని దానికి సిద్ధం చేస్తుంది. కొన్నిసార్లు పేజీనిండుగా టెక్స్ట్ ఉంటె ఆమ్మో ఇంత ఉందా చదవాల్సింది అనిపిస్తుంది. అలా కాకుండా మధ్యమధ్యలో ఉన్న ఈ కవితలు చూపుకి, మనసుకి కూడాఆహ్లాదాన్నిస్తాయి. అలా కవిత్వమూ, వచనమూ కలగలిసిన ఈ ప్రయాణంచదువుతుంటే ఒక మంచి పుస్తకం చదువుతున్న ఫీల్ కలుగింది. నాకయితే ఎక్కడా, ఏ పేరా కానీ, ఏ పేజీ కానీ స్కిప్చెయ్యాలి అనిపించలేదు. యదార్ధ గాధలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానేఉంటాయి. ఒక యదార్ధ గాధ, ఒక వ్యక్తి జీవిత చిత్రణఅయిన ఈ యాదోంకీ బారాత్ మొదలుపెడితే ఆగకుండా చదివిస్తుంది, చదివినవారి జ్ఞాపకాలను తడుముతుంది. ప్రత్యేకించి కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడలలో పుట్టి పెరిగినవ్యక్తులకు, ఇది ఒక నాస్టాల్జియా. ఇక పుస్తకం రాసిన వారి గూర్చి చెప్పుకోవాలంటే, దొరికిన వృత్తి వారి ప్రవృత్తి అయిందో లేక వారి ప్రవృత్తికితగిన ఉద్యోగం దొరికిందో తెలియదుగాని వారి వృత్తి ప్రవృత్తి రెండూ ఒకదానికొకటి పెనవేసుకుని సాగింది. వారిజీవితం. చేస్తున్న వృత్తిని ఒక సామాజిక భాద్యతగా స్వీకరించి, నిరంతరంగా అటు సాహితీ సేవచేస్తూనే, నవతరంలో సాహితీ బీజాలు నాటటానికి, వారిలో విశ్లేషణా శక్తి,ఆసక్తికలిగించడానికి, సృజనాత్మకతను పెంపొందించటానికి, అన్ని విధాలా కృషి చేశారు. వారి బహుముఖప్రజ్ఞ, చేసే పనిలో గల నిబద్దత ఈ బారాత్వేసే ప్రతి అడుగులో కనిపిస్తుంది. నాకు ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ కొండంత ఆశ్చర్యం కలిగించిన విషయం ఒకటుంది, అదేమిటంటేఆరు దశాబ్దాలసంఘటనలలో ఎదురైన వ్యక్తులు, చూసిన సినిమాలు, చదివిన పుస్తకాలు, జరిగిన సభలు, సభా కార్యక్రమాలు అన్నింటి గురించి పేర్లతో సహా చెప్పగలగడం. దాంతోఆనంద్ బహుముఖ ప్రజ్ఞావంతులే కాదు, వెరీ న్యాచురల్లీ ‘ఆర్టిఫిష్యల్ ఇంటెలిజెన్స్’ బ్రెయిన్ గలవారు అని. అయితే వీరి ప్రజ్ఞ పేర్లుగుర్తుంచుకోవటంలోనే కాదు, మంచి అందమైన పేర్లుపెట్టటంలో కూడా ఉంది. అవి పుస్తకాలకు అవొచ్చు,ఆర్టికల్స్కిఅవొచ్చూ, జరిపినకార్యక్రమాలకు అవొచ్చు. నాకు చాలా ముచ్చట కలిగించిన పేర్లలో కొన్ని, ‘కర్ర ముక్కలలో కమనీయ రూపాలు’, ‘కల్లోల జిల్లాలో ఎగసిన వచన కెరటాలు’, ‘మౌనం మాట్లాడింది’, ‘అజ్ఞాతవాసంలో అందాల మ్యూజియం’, ‘వీక్షించండి-సమీక్షించండి’, ‘మేకప్ టు ప్యాకప్’. “నా గడిచిన జీవితాన్నిగుర్తుచేసుకోవటమే కాదు, ఇది ఖచ్చితంగా తిరిగిజీవించడమే” అంటూ తన అనుభవాల్ని, తన జీవితాన్ని చాలా లైవ్లీగా ప్రెజెంట్ చేశారు. అతి పెద్దజీవన్మరణ సమస్యని ఎదుర్కొని ..‘గతం’ పొరలు పొరలుగా తెరలుతెరలుగా పేర్చుకున్న జ్ఞాపకాల అర‘వర్తమానం’ క్షణ క్షణం నడక ‘భవిష్యత్తు’ రూపం దిద్దుకునే కలలమంచుపల్లకి అంటూ ఒకఆశావహ దృక్పధంతో వారాల ఆనంద్ తన జ్ఞాపకాల ఊరేగింపును ముగించగా చదివినవారికి ఇది ఒక అందమైన జ్ఞాపకంగామిగులుతుంది.+++++++++++++++++బొడ్ల అనురాధ anubodla@gmail.com ++++++++++++
‘యాదొంకీ బారాత్- జ్ఞాపకాల ఊరేగింపు’ రచన: వారాల ఆనంద్
పేజీలు -180, వేల: రూ.250/ ప్రచురణ: ప్రాజ్ పోయెట్రీ ఫోరం, కరీంనగర్-505001
కాపీలకు: V.Indira RaniNo.302, R.V.ANUKURA,STREET No-22, MANCHIREVULA NARSINGI, HYDERABAD #9440501281ORNAVAYUGA BOOK HOUSE, HYDERABAD.TeluguBooks.in – Largest collection of Telugu books Online – TeluguBooks.in (Navodaya Book House)