Home వ్యాసాలు “ప్రదేశాలు వాటి ప్రాచుర్యాలు

“ప్రదేశాలు వాటి ప్రాచుర్యాలు

by nellutla Indrani

మయూఖ పత్రిక పాఠకులకు కానుక అని చెప్పడానికి ఈ పత్రికలో ప్రచురించిన ఎన్నో సాహిత్య విషయాలు ఒక కారణమైతే, ఇంద్రధనుస్సు శీర్షిక లో విభిన్న రచనలు మరో కారణం. “ప్రదేశాలు వాటి ప్రాచుర్యాలు ” శీర్షికలో భాగంగా ఆగస్టు మయూఖ లో ‘అల్జీరియా ‘ దేశం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు బోట్స్వానా గురించి తెలుసుకుందాం. ప్రపంచం మన అరచేతిలోకి వచ్చినా , కన్నుల్లో నింపుకుని ఆనందించే అవకాశం వస్తే చాలా బాగా ఉంటుంది. ప్రపంచం లోని ఇతర దేశాల కంటే భిన్నంగా ఆఫ్రకా ను చూడాలి . అక్కడి ప్రకృతి ని గురించి ఇలా నాలుగు మాటలలో నేను రాస్తున్నా, అవకాశం వస్తే మీరందరూ చూడండి. ప్రస్తుతం ఈ వ్యాసం లో బోట్స్వానా ను చూడండి.

“అద్భుత దృశ్యాల బోట్స్వానా

బోట్స్వాన ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఈ దేశానికి దక్షిణ మరియు ఆగ్నేయ సరిహద్దులలో సౌత్ ఆఫ్రికా ఉంది.
పడమట మరియు ఉత్తర సరిహద్దులలో నమీబియా దేశం ఉంటుంది.

ఉత్తర సరిహద్దులలో జింబాబ్వే కూడా ఉంది తూర్పున కొన్ని వందల మీటర్లు మేర స్వల్ప సరిహద్దుగా జాంబియా ఉంది.
బోట్స్వానలో ప్రాచుర్యం పొందిన కొన్ని ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందులో 1. చోబె నేషనల్ పార్క్, 2. ది ఒక్వంగ డెల్టా మరియు 3. కలహారి డెసర్ట్ చాలా ప్రాముఖ్యత చెందిన ప్రదేశాలు.
చోబె నేషనల్ పార్క్ లో హ్యూజ్ ఎలిఫెంట్స్, చాలా పెద్ద పర్సనాలిటీ కలిగిన ఎలిఫెంట్ బఫెలోస్ మరియు నేషనల్ పార్క్ లకు గర్వాన్ని పెంచే మృగరాజులు ఎన్నో వీక్షకులకు కన్నుల విందు చేస్తాయి.

కోతికొమ్మచ్చిలాడే బబూన్స్ మరియు రకరకాలైన పెద్ద పెద్ద పక్షులతో చోబె నేషనల్ పార్క్ నిండి ఉంటుంది
ఈ నేషనల్ పార్క్ ను “ట్రూ వైల్డ్ లైఫ్ పారడైజ్” అని అభివర్ణించొచ్చు. అక్కడ ఉన్న నదుల్లో హిప్పోపోటమస్లు (నీటి ఏనుగులు) అత్యంత ఆనందంతో ఎప్పుడూ జలకాలాడుతూనే ఉంటాయి.

ఇప్పుడు ఇక ఒక్వంగా డెల్టా గురించి తెలుసుకుందాం. ఈ డెల్టా ప్రాంతం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు పొందింది. ఈ డెల్టా ప్రాంతం “7 వండర్స్ ఆఫ్ ద ఆఫ్రికాలో” ఒకటి. రకరకాల పక్షులు, జింకలు, నదులు మరియు చిన్నచిన్న కాలువలతో ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుంది.

ఇక బోట్స్వానాలో అతి ప్రసిద్ధి చెందిన కలహారి డెసర్ట్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా అందమైన, విశాలమైన ఎడారి ప్రాంతం.
ఈ ఎడారి దాదాపు 9,30,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
ఈ ఎడిరిలో మీర్కాట్స్(Meerkats) అనే చిన్న ముంగీస జాతికి చెందిన జంతువులు ఉంటాయి.
వీటికి ఈ పేరు డచ్ భాష నుండి వచ్చిందనీ, సంస్కృత భాష ప్రకారం దీనికి ఈ పేరు మర్కటం నుండి వచ్చిందని అంటుంటారు.
ఈ జంతువులు తమ రెండు కాళ్ళ మీద నిలబడి ఏదో వచ్చే వింతను చూస్తున్నట్టుగా పోజు పెడతాయి. ఇవి నిజంగా ఫోటోల కోసం పోజు పెట్టినట్టుగానే ఉంటాయి. ఈ కలహారి డెసర్ట్ లో “బుష్మన్”(Bush-man) అనే ట్రైబల్ తెగలు ఉంటాయి. ఈ జాతివారికి చాలా ప్రత్యేకత ఉంది. వీరు చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడ డెసర్ట్ లో దొరికే రకరకాల మూలికలతోనే నయం చేసుకుంటారు. వీరి కను దృష్టి చాలా షార్ప్ గా ఉంటుంది.

“గాడ్స్ మస్ట్ బి క్రేజీ” The God’s Must be Crazy) అనే English సినిమాలో ఈ బుష్మన్ల గురించి చాలా బాగ చిత్రీకరించారు. వీరి జీవన శైలి గురించి, వారు నివసిస్తున్న పరిస్థితుల గురించి ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. ఈ ఎడారి లోని “సోడి హిల్స్” (Tsodi) రాక్ ఆర్ట్స్ గా చాలా ప్రసిద్ధి చెందింది.
చాలా వందల సంవత్సరాల క్రితం ఈ తెగవారు అక్కడి సోడో హిల్స్ లో రాళ్లపైన చిత్రీకరించిన జంతువుల బొమ్మలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి.
ఇన్ని వింతలతో,
ఇంత చక్కని ప్రదేశాలతో ఆనందాన్ని ఇచ్చే బోట్స్వానా (Botswana) దేశాన్ని మీరు తప్పకుండా విజిట్ చేయండి.

You may also like

Leave a Comment