Home వ్యాసాలు తెలంగాణ తొలి పొద్దు – కాళోజి

తెలంగాణ తొలి పొద్దు – కాళోజి

by Kancharla Mahesh

నేను ప్రస్తుతాన్ని నిన్నటి స్వప్నాన్ని రేపటి జ్ఞాపకాన్నిఅని చెప్పుకునే జీవిత తత్వానికి నిదర్శనం కాళోజీ. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో తెలంగాణ పోరుగడ్డపై జన్మించిన మడికొండ మణిరత్నం కాళోజీ నారాయణరావు. కాలానికి అతీతమైన కవి, మన కాలపు వేమన, ఒక శతాబ్దాపు జీవన ప్రమాణంతో ప్రతి నిమిషం పోరాటాన్ని స్వాసించి కవిత్వీకరించిన వ్యక్తి, తెలంగాణ తొలి పొద్దు, తెలంగాణ ప్రతిధ్వని, రాజకీయ,సాంఘిక,చైతన్య కార్యక్రమాల సమూహాహారం మన కాళోజీ.. కరుడు కట్టిన హృదయాలను కదిలించే అక్షరాలను ఆయుధంగా మలచే కవిత్వాలు రాసిన ప్రజాకవి.

స్వయంగా కాళోజి  నేనింకా నా నుండి మా వరకు రాలేదు అని తనలో ఉన్నటువంటి  సాదాసీదామైన వ్యక్తిత్వాన్ని వ్యక్తీకరించాడు. కాళోజీ కవితలు ప్రజల గుండెల్లో నిరంతర ప్రవాహిలా మారుమోగుతూ ఉంటాయి. ఆయన కవిత్వాలు,కథలు,నవలలు వర్తమాన పరిస్థితులను అద్దం పట్టించే ప్రతీకలను కలిగి ఉంటాయి. ఎక్కడ అన్యాయం, ఎక్కడ అనిచివేత, ఎక్కడ ఆకలి మంటలు ఉంటాయో అక్కడ కాళోజీ యొక్క కవిత్వం వినబడుతుంది.

ఆకలి మంటలు ఒకచోటఅన్నపు రాశులు ఒకచోటఅనే అక్షరాల పూదోటలో నేటి కాలపు ఆర్థిక అసమానతలను వ్యక్తీకరించే భావాన్ని అక్షరీకరించాడు.

ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు పదును పెడుతుందివిద్యా ప్రాముఖ్యతను, విద్యకున్న ఔన్నత్యాన్ని సాధారణ ప్రజానీకానికి అర్థమయ్యే విధంగా అనువర్తించాడు.

పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా దేశానిదిఅన్న నినాదం జాతీయ ఉద్యమ స్ఫూర్తిని, మానవతా దృక్పథాన్ని, తన బాధ్యతను, ప్రజల యొక్క కర్తవ్యాన్ని కవిత్వీకరించాడు.

తెలంగాణ ప్రజల యొక్క గొడవను నా గొడవగా చేసుకొని సమాజ చైతన్యం కోసము అహర్నిశలు కృషిచేసిన తెలంగాణ పెద్దదిక్కు కాళోజీ నారాయణరావు. ఒకవైపు కవిత్వం,మరొకవైపు రాజకీయం మెలకువలు తెలిసిన మహాకవి కాళోజి. నేటి కాలపు రాజకీయ పరిస్థితులకు కూడా అనువర్తించే కవిత్వాన్ని ఆనాటి కాలంలోనే చిత్రీకరించిన గొప్ప కవి.

అభ్యర్థి పార్టీ వాడను కాదు. పాటి వాడని చూడు అని రాజకీయ దుమారం లేపే సూక్తిని అక్షరబద్ధం చేశాడు. కాళోజీ  యొక్క ఎన్నో కవిత్వాలు,కథలు, నవలలు నేటి కాలపు యువకులకు యువ రచయితలకు కవులకు ఆదర్శంగా నిలిచాయి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని ముందుండి నడిపించి,తెలంగాణ భాష,యాస,సంస్కృతి పట్ల హేళన చేసిన వారిని చెంప చెల్లుమని విధంగా తెలంగాణ భాష సొగసులను ,అందాలను తన కవిత్వంలో గుభాలించాడు.

పరాయి భావాలు

 పరాయిచూపులు

 పరాయి భాష

పరాయి చెవులు

పరాయినడక

పరాయి చేతలు

అట్లా కాకూడదని నాతిక్కఅని పరాయి అనే పదాన్ని విధంగా వ్యతిరేకించాడు కనబడుతుంది.

నిజాం నిరంకుశత్వాన్ని ఎదురించి ప్రజలను ఏకం చేయడానికి గణేశు ఉత్సవాలను నిర్వహించాడు. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అన్యాయాన్ని ఎదిరించినప్పుడే నా గొడవకు ప్రాప్తి,సంతృప్తి కలుగుతుంది. ప్రజలను ఏకతాటిపై తీసుకురావడానికి తన కవిత్వానికి పదును పెట్టి,ప్రజల్లో చైతన్యాన్ని రగులుగొల్పి, పాలకుల పట్ల తప్పులను ఎత్తి  చూపించే ప్రజాగలం కాలోజి. ఆంధ్ర మహాసభతో మొదలుపెట్టి తన ఉద్యమాన్నిఆర్య సమాజం, గ్రంధాలయ ఉద్యమంగా,క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని జైలు జీవితాన్ని గడిపిన మహాకవి.

రాజకీయ కోణంలో అక్షర సత్యాలను జీవిత సత్యాలను నిర్మొహమాటంగా ఉద్ఘాటించే కవి కాళోజి.”అక్షరాలను అడ్డుగా పెట్టుకుని ఎదిగిన వారు ఎందరో

అక్షరాలను ఆత్మగా చేసుకుని బ్రతికిన వారు కొందరే అని మోసం చేసే వ్యక్తులకు,ఆత్మగా భరించి వ్యక్తులకు మధ్య సంబంధాన్ని తన కవిత్వం ద్వారా ప్రజానీకoలో చైతన్యాన్ని తీసుకొచ్చాడు. తాను చేసిన సేవకులను భారత ప్రభుత్వం గుర్తించి పద్మవిభూషన్, జీవన గీతికి ఉత్తమ అనువాద అవార్డులను ప్రచురించింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో బైరాన్ పల్లి ఘటనకు చలించి పోయిన కాళోజి కాలంబు రాగానే కాటేసి తీరాలి అని అక్షరాలను ఆయుధంగా రజాకారులపై సవాళ్లు విసిరాడు..

భాష రానిది ఏమి వేషము రా

భాష వేషమేవరి కోసము రా?

తెలుగు బిడ్డ వై తెలుగు రాదంచును

సిగ్గు లేక ఇంకా చెప్పుకుంటే0దుకురా?

అన్య భాషలు నేర్చు ఆంధ్రము రాదంచు

సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా? అని నెగ్గు తేల్చుతూ విశ్వాసంతో తెలంగాణ భాషా పట్ల,తెలుగు భాషా పట్ల తన యొక్క ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించుకున్నాడు.

చెమ్మగిలని కనుల బ్రతుకు కమ్మదనం చాటలేవు

చెమ్మగిలని కనుల బ్రతుకు కమ్మదనం చూడలేవుసాటి మనిషికి కష్టం వచ్చినప్పుడు చలించని గుండె అది గుండె కాదు. అదే విధంగా జీవితంలో కనులు చెమ్మగిలకపోతే బ్రతుకులో ఉన్నటువంటి కమ్మదనాన్ని అర్థం చేసుకోలేడు మానవుడు.. మానవతావాదిగా తాను నిరూపించుకున్నాడు. ఇవన్నీ గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం 1946- 51 మధ్యలో జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొని,తెలంగాణ భాషా సాధనకై నిరంతరం కృషి చేసిన తెలంగాణ దివిటి మన కాళోజీ.

You may also like

Leave a Comment