Home వ్యాసాలు “పాడిపంటల సిరి “మకర సంక్రాంతి”

“పాడిపంటల సిరి “మకర సంక్రాంతి”

మన పండుగలు వ్యక్తిని లౌకిక జీవితాన్నుంచి ఆధ్యాత్మిక చింతనకు మార్గనిర్దేశకత్వం సూచిస్తాయి మకర సంక్రాంతి మనకు సంప్రదాయ సిద్ధమైన గొప్ప పండుగ ఈ సంక్రాంతి పండుగ ఆనందోత్సవాలతో మూడు రోజులూ గొప్పగా జరుపుకుంటారు ఆధ్యాత్మిక సాంస్కృతిక సంపదకు భారతదేశం భారతీయ సంప్రదాయం సకల జనులకు ఆచరణ యోగ్యము.

“జననీత్వం హీవో కానాం సప్తమీ సప్త సప్తకే వ్యాహాతికే
వేది నమస్తే “…. అంటే సప్తాశ్వయలతో విరాజిల్లే ఓ సప్తమీ నీవు అన్ని లోకాలకూ మాతృకవి. సర్వ శక్తి సంపన్నుడైన ఈ లోకపు ప్రాణ ప్రదాత అయిన సూర్యభగవానుని ఈ లోకానికి అందించిన నీకివే వందనములు అంటూ “మకర సంక్రాంతి ” నాడు సూర్యు భగవానుని ఆరాధిస్తూ జనులు పూజలు నిర్వహిస్తారు.

“సంక్రాంతి “అంటే సూర్యాది గ్రహారాశుల అంతర గమనం అని చెప్పబడింది. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని “సంక్రమణం ” అంటారు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే కాలాన్ని “మకర సంక్రమణం ” లేదా “సంక్రాంతి” అంటారు.

‘సం ‘అంటే చక్కని,’ క్రాంతి’ అంటే ‘మార్పు’ కాబట్టి ‘సంక్రాంతి ‘ అంటే చక్కనైన మార్పు తో కూడిన చైతన్యం అని అర్థం. ‘మకరం’ మొసలి పట్టుకు సంకేతం. ‘సంక్రాంతి’ పండుగ పుష్య మాసంలో హేమంత ఋతువులో వచ్చే మకర సంక్రాంతికి ప్రత్యేకమైన విశిష్టత ఉన్నది

సంక్రాంతి పర్వదినాన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది. అంతవరకూ దక్షిణాయనంలో తిరుగుతున్నా సూర్యుడు ఉత్తరాయణంలో కి ప్రవేశిస్తాడు ఇది మహా పుణ్యకాలం. ఇది దేవతలకు ప్రీతికరమైన కాలంగా మన శాస్త్రాలు తెలుపుతున్నాయి ఆరోజు స్వర్గ ద్వారాలు తెరవడం ఉంటాయని ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినవారికి మోక్షప్రాప్తి కలుగుతుందని అందుకే భీష్మాచార్యులు ఉత్తరాయన పుణ్య కాలం వరకూ నిరీక్షించి పుణ్యకాలం మహాభారతంలో ఉంది . ఉత్తరాయణ కాలంలో మరణించిన వారి అంత్యక్రియలు సూర్యాస్తమయం లోగానే నిర్వహిస్తారు అదే దక్షిణాయానం సూర్యాస్తమయ కాలము లో మరణిస్తే ఆ ఆ మరుసటి రోజున సూర్యోదయమైన మొదటి కాలంలో అంత్యక్రియలు చేయడంలో గల అంతరార్థం ఉత్తరాయణం పుణ్యకాలం కావడమే.

ప్రతి సంక్రాంతి పర్వదినమున సంక్రాంతి పురుషుడు వాహనంపై అధిష్టించి వస్తాడనే విశ్వాసం వాహనాన్ని బట్టి ఆ ఏడాదిలో జరగబోయే సంఘటనలు ఊహిస్తారు

ఈ పండుగను నాలుగు రోజులు జరుపుకుంటున్నారు తొలి రోజున భోగి, మలి రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ, నాలుగవ రోజు ముక్కనుమ గాను కూడా జరుపుకుంటున్నారు. మకర సంక్రాంతికి ముందున్న సంక్రాంతి ధనుస్సుంక్రాంతి.

మన హైందవ సంస్కృతి ప్రాభావానికి దర్పణం సంక్రాంతి పండుగ. సూర్య సంక్రమణం ప్రతినెలా జరుగుతూ ఉంటుంది కానీ పుష్య మాసంలో జరిగే మకర సంక్రమణానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అదే సంక్రాంతి గా ప్రసిద్ధి పొందింది.
“దక్షిణాయాణే….. పాపం మూర్తీ భవత్ సర్వమ్ బహి ర్యాత్యుభరాయలే ” దక్షిణాయానం లో ఉన్న సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించగానే మానవులు చేసిన పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది.

మానవుడు ఐహిక విధి నిర్వర్తనం కోసం దైహికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి. బుతు చక్రభ్రమణంలో మార్గశిర, పుష్య మాసాలు హేమంత సంకేతాలు, గ్రీష్మ,వర్ష శరదృతువులు ముగుస్తూ మానవ జీవితంలో క్రమక్రమంగా వణుకు మొదలవుతుంది. ‘పారమార్ధిక చింత భాస్కర తేజం’మవో మకరంలో ప్రవేశిస్తే చిత్తమ సంధాన సౌభాగ్యం’ లభిస్తుందని అంటారు. వణుకుని తగ్గించి, ఉల్లాసాన్ని పెంచి “భోగి” యోగి కాగల మార్గం ఈ మాసంలో గోచరిస్తుంది
మకర సంక్రమణం నాడు ఉపయోగించే నువ్వులు, జొన్నలు, సజ్జలు వంటి ధాన్యాలు. గుమ్మడి, బీర, పొట్ల వంటి కూరగాయలు బంతి, చేమంతులు ,మానవుని శారీరక ఆరోగ్యానికి ప్రసాదాలు.

” భోగి ” అంటే భోగము అని హేమాద్రి పండితుడు భోగి విశిష్టతను గురించి తెలిపాడు. భోగి నాడు ఉదయం భోగిమంటలు వేస్తే అశుభాలు తొలగి పోతాయి భోగి పండుగ రోజు భోగిమంటల వల్ల హేమంత ఋతువులో చలితో పాటు విజృంభించే క్రిములు కీటకాలు ప్రాణులకి అపకారం కలిగిస్తాయి మన ప్రాచీనులు తెల్లవారుజామున వేసుకునే భోగి మంటల వల్ల వచ్చే దాహక శక్తికి క్రిములు నశిస్తాయి అనే రహస్యం తెలిసి భోగి మంటలను ఏర్పాటు చేశారు. ఈ భోగి పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకుంటే శుభ ఫలితాలు పొందుతారు దక్షిణాయనమున వీడ్కోలు పలికి ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతించే ఈరోజు ఈ భోగిపండుగ. ఈ భోగిమంటల వల్ల హేమంత రుతువులో చలితో పాటు విజృంభించే క్రీములు ప్రాణులకి అపకారాన్ని కలిగిస్తాయి కనుక మన ప్రాచీనులు ఎక్కువ సంఖ్యలో వుండే తెల్లవారుజామున వల్ల వచ్చే దాహక శక్తికి క్రిములు నశిస్తాయి అనే భావనతో భోగి మంటలను ఏర్పాటు చేశారు పండుగ రోజు సాయంత్రం ఐదు సంవత్సరాల బాల బాలికలకు రేగుపండ్లు చెరుకుగడలు చిల్లర నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. భోగి పండ్ల పేరిట పేరంటానికి వచ్చిన ముత్తయిదువులంతా పిల్లల తలపై రేగుపండ్లు పోయటం వల్ల పిల్లలకు తగిలిన దిష్టి పోతుందని ఆ సంవత్సరం అంతా శుభాలే కలుగుతాయని భావిస్తు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆశీర్వదిస్తారు. ఇలా చేయటం వలన ఎటువంటి దృష్టి దోషాలైనా నివారించేందుకు ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు.

సంక్రాంతి రోజున ప్రాతఃకాలంలోనే అభ్యంగ స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి చిన్నలు పెద్దలు ఆశీర్వాదాలు పొందుతారు ఆరోజు తెల్లవారగానే స్త్రీలు రంగవల్లికలతో ప్రతి ఇంటి ముందు శోభాయమానంగా అలంకరిస్తారు.కొత్తగా వచ్చిన ధాన్యంతో ఆవు పాలను కలిపి పొంగలి తయారుచేసి ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుని కి నివేదించిన తర్వాత ఇంట్లోని వారందరూ స్వీకరిస్తారు.ప్రతి సంవత్సరం పంటలు సమృద్ధిగా పండాలని భగవంతుని కోరుకుంటారు.

మూడవ రోజు కనుమ. పరోపకారమే ద్యేయంగా గల ఈ మూగ జీవాలను గౌరవించడమే నికి పశువులను శుభ్రంగా కడిగి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి మెడలో గజ్జెలు వేసి పూలమాలలు వేసి ప్రదక్షిణ చేయడం కనుమ. ఇది రైతులకు ప్రత్యేకమైన పర్వదినం సంవత్సరమంతా కష్టపడి నా శ్రమ ఫలితమైన ధాన్యరాశులు నిలుస్తాయి. ఇంటికి తెచ్చుకున్న కొత్త ధాన్యము తో పొంగలి చేసి సూర్యభగవానునికి నివేదిస్తారు మనకు ప్రత్యక్ష దైవమైన సూర్య దేవునికి సంబంధించిన పండుగ సంక్రాంతి ఈ మకర సంక్రాంతినాడు సూర్యోపాసన సూర్యారాధన విశిష్టమైనది సకల సృష్టి లోని ఏ ప్రాణీ సూర్య భగవానుని దివ్య శక్తి వల్లనే మనగలుగుతోంది ప్రాణదాత అయినా సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంగా భావించి సూర్యుణ్ణి పూజించాలి అని శాస్త్రవచనం. ఈ కనుమ రోజున పశువులను అలంకరించి పూజించిన అనంతరం వాటికి భక్ష్యములను తినిపించి మూగజీవాల పట్ల తమ ప్రేమను ప్రకటించుకున్నారు.హరిదాసులు గంగిరెద్దుల వారు బుడబుక్కలవారు పల్లెల్లో తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తూ గ్రామాలకు కొత్త శోభను వాతావరణాన్ని తీసుకొస్తారు.

ఈనాటికి నిజమైన జానపదుల పండుగ కళ్ళల్లోనే కనబడుతుంది మారుతున్న కాలంలో నేటి ఆధునిక యుగంలో కనుమరుగవుతున్న జానపద కళలు అంతరించిపోకుండా సంప్రదాయ పండుగ ఆనవాయితీ గా చేసుకోవడం నేటికీ పల్లెల్లో కనబడుతుంది. హరిదాసులు తెల్లవారుజామునే హరిలో రంగ హరి అంటూ హరి రామ కీర్తనలు స్మరణ లు చేస్తూ గ్రామాలలో ప్రజలను మేల్కొలుపుతారు. హరిదాసుల తల పై గుమ్మడి ఆకారపు ఇత్తడి పాత్రలు ధరించి ఆ పాత్రకు కుదురు చుట్టుకుని హరి కీర్తనలు పాడుతూ అనుగుణంగా చిందులు వేస్తారు. భక్తులు ప్రీతితో ఇచ్చే బియ్యాన్ని దక్షిణలు తీసుకుని భిక్ష పెట్టిన వారిని ఆశీర్వదిస్తారు చొక్కా ధరించి దాని మీద నల్లకోటు వేసుకుని ఎర్ర తలపాగా చుట్టుకుని మీద ఎర్రని బొట్టు పెట్టుకుని ఇంటి యజమానుల భవిష్యత్తును పాటల రూపంలో చెబుతూ ఇల్లిల్లూ తిరుగుతూ అంబ పలుకు జగదంబ పలుకు అంటూ ఆశీర్వదిస్తూ ధనం ధాన్యం భిక్ష స్వీకరించి దీవిస్తా రు. గంగిరెద్దుల వాళ్ళు పండుగ దినాలలో ప్రతి ఊరిలో దర్శనమిస్తారు. ఎద్దుల మెడలో గంటలు మువ్వలు గవ్వలతో అందంగా కొట్టిన వస్త్రాలు వృద్ధుడిపై సింహాద్రి అప్పన్న విగ్రహం కొమ్ములను వీపుపై రంగురంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. ధనుర్మాసమంతా ఉదయాన్నే గంగిరెద్దులతో పాటు శృతి సన్నాయి డోలు వంటి వాయిద్యాలు పట్టుకొని పల్లెల్లో వాటిని ఆడిస్తారు. వాయిద్యాలకు అనుగుణంగా బసవన్న తో నృత్యాలు చేయిస్తూ అయ్యగారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు అంటూ బల్లపై నాలుగు కాళ్లు పెట్టి మోకాళ్లపై నడిపించి ఒకే కాలుతో దండం పెట్టించి సంతోషపరిచే ఇచ్చే ధాన్యం వస్త్రం దక్షిణ కానుకలు స్వీకరించే సింహాద్రి అప్పన్న చల్లగా చూడాలని దీవిస్తారు. మన భారతీయ సంస్కృతికి అద్దంపట్టే సంక్రాంతి పండుగ పాలిచ్చే గోవులకు పసుపు కుంకుమ పనిచేసే బసవనికి పత్రీ పుష్పం లక్ష్మీ అనుగ్రహంతో పాడిపంటలు వృద్ధి చెందే పాడిపంటల సిరి మకర సంక్రాంతి.

ఈ సంక్రమణ కాలం లో ఎవరైతే దానధర్మాలు ఇతోధికంగా చేస్తారో అవన్నీ ఆ దానవ వీరులతో జన్మ జన్మ లోనూ లభిస్తాయని ధర్మసింధు తెలుపుతోంది మానవుడికి మోహన్ అనేది ముసలి పట్టుకుని వదలదు ఆ మోహన్ నుంచి తప్పించుకోవడానికి ఈ మకర సంక్రాంతి కాలంలో నువ్వులు వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు విరివిగా దానధర్మాలు చేయాలి అని పురాణ వచనం.

బొమ్మల కొలువులు, కోడి పందాలు, జంగమ దేవరలు గంగిరెద్దు దాసర్లు పశు పూజలతో లక్ష్మికి స్వాగతం పలుకుతూ సంప్రదాయ పద్ధతిగా జరుపుకునే మకరసంక్రాంతి వైభవ శోభకు పల్లె సీమలే సాక్ష్యం.

You may also like

Leave a Comment