Home బాల‌సాహిత్యం శ్రీరామచంద్రమూర్తి

శ్రీ గురుభ్యోన్నమః. సభకు నమస్కారం. నా పేరు రొంపిచర్ల శ్రీ రంగ సిద్ధార్థ. నేను ఎనిమిదో తరగతి, ఏఏఎన్ఎం అండ్ వివిఆర్ఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, గుడవల్లేరు, విన్నకోట గ్రామము, కృష్ణాజిల్లా, ఆంధ్రపదేశ్ నుండి వచ్చాను. నేను ఈరోజు రామాయణంలోని శ్రీరామచంద్రమూర్తి పాత్ర గురించి చెప్పబోతున్నాను.

మనిషి ఎక్కడ, ఎలా ప్రవర్తించాలో, ధర్మాన్ని ఎలా అనుసరించాలో, ధర్మాన్ని ఎలా అనుసరించాలో ధర్మాన్ని పట్టుకున్నవాళ్ళు ఎంత గొప్పవాళ్లు అవుతారో యుగాలు మారిపోయిన శ్రీ రామచంద్రమూర్తి యొక్క జీవిత వృత్తాంతం నేటికీ పసిపిల్లలకు కూడా తమ తల్లుల చేత రామాయణ కథగా చెప్పబడుతోంది. అందులోని పాత్రలు, స్వభావాలు నేటి మానవాళికి మచ్చు తునకలు.

రామో విగ్రహవాన్ ధర్మః సత్యధర్మ పరాక్రమః అనగా రాముని వంటి ఆదర్శమూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో న భవిష్యత్. అయోధ్య నగరానికి రాజయిన దశరథ మహారాజు, కౌసల్యదేవిల పుత్రుడు, శ్రీరామచంద్రుడు. శ్రీరాముడు ఒక రాశి భూతమైన ధర్మము.  ఆయన సత్యము చేత లోకాన్ని గెలిచాడు. శుశ్రూష చేత గురువులను గెలిచాడు. తన యొక్క దాన గుములతో దీనులను గెలిచాడు. శ్రతువులను తన యొక్క పౌరుష పరాక్రమాలు చేత గెలిచాడు. ధర్మము చేత సమస్తాన్ని గెలిచాడు. ఇలా 16 గుముల కలయికతో నరునిగా నడయాడిన పరిపూర్ణ అవతారఁ శ్రీరామావతారం. బుద్ధి, సాత్వికత, మధురమైన భాష, నిరాడంబర జీవితం, నిర్మలమైన మనస్సు తత్వం, నిస్వార్థత, మితభాషి, నిగర్వి, ఏకపత్నీవ్రతుడు, పరాక్రమవంతుడు, సదాచారాము పాటించేవాడు, సమయస్ఫూర్తి కలవాడు, పిత్రు ఆజ్ఞాపరిపాలకుడు, గురువు మాట శాసనం, తండ్రి మాట శిలాశాసనంగా భావించేవాడు, ఇన్ని సుగుణాలను మకుటంగా ధరించి ప్రజారంజకంగా పాలించి రామ రాజ్యంగా పేరొందిన శ్రీరామచంద్రమూర్తి గురించి మూడు నిమిషాలు కాదు మూడు గంటలు చెప్పినా చాలదు.

శ్రీరాముని గురిఁచి నేను మీకు ఇచ్చే సందేశం

ఒకటవ తరగతి నుండి ఐఏఎసం, ఐపీఎసంవరకూ రామాయణాన్ని ఒక పాఠ్యాంశంగా బోధించాలి.

రాముని నమ్ముకున్నవారికి అంతా విజయమే ఉదాహరణకు హనుమంతుడు.

రాముని ఆశ్రయించిన వారు కీర్తిని, ఉత్తమ గతులను పొందుతారు. ఉదాహరణకు జటాయువు పక్షి.

ధర్మోరక్షతి రక్షితః ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మమే మనల్ని రక్షిస్తుంది.

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం

ఇంతటి అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారములు. ధన్యవాదములు తెలుపుకుంటూ శ్రీరామ రక్ష సర్వజగ్రదక్ష.

జై శ్రీరామ్

You may also like

Leave a Comment