Home వ్యాసాలు సాహిత్యం లో దళిత నవల ప్రస్థానం

సాహిత్యం లో దళిత నవల ప్రస్థానం

by Butam Mutyalu

సాహిత్యచరిత్ర అంటే క్రమానుగతం నుండి భవిశ్యత్తుకు ఎలా పరిణామిస్తు వచ్చిందో విడమరచి చెప్పెదే సాహిత్యచరిత్ర. సాహిత్యచరిత్రకు పితామహుడుగా చెప్పబడినవ్యక్తి హిపోలిటెన్, ఇతను ప్రా న్స్ దేశస్తుడు. 1863లో ఇతను సాహిత్య చరిత్రకు వ్రాసిన ముందుమాటలో మూడు ప్రాథమికాంశాల ను సూచించాడు. అవి1) విశిష్టమైన ప్రతిభ. ప్రత్యేక వ్యక్తిత్వం, శక్తి ఉన్నజాతి. 2) ఆజాతి జీవించినకాలం, సందర్భం 3) దానిని నియంత్రించే బావ పరిసరం. ఈ మూడింటి సమ్మేలనంతో రూపొందిన సృజనాత్మ క అభివ్యక్తి క్రమాన్ని నిరూపించి చెప్పడం సాహిత్యచరిత్ర. ‘నోవెల్లా’ అనే ఇటాలియన్ పదం నుండి నో వెల్(నావెల్) అనే పదం ఏర్పడింది ఇది క్రీ.శ.1350లో బొకేషసీయా() తన రచన కామెరన్ కు నావెల్లా స్టోరియా అని పేరు పెట్టాడు. కొత్తపదం అని అర్ధం. తర్వాత ఆంగ్లంలో 1579లో జానీలి యుప్లస్ పేరుతో మొదటి అంగ్ల నవలా రచనకు నాంది పలికాడు. 18వ శతాబ్ది నాటికి స్కాటయ్యగంలో ఆంగ్ల 0లో నవల ఉచ్చ స్తితి కి చేరింది. తెలుగులో సాహిత్యచరిత్ర రచన 1876సంవత్సరం నుండి మొదలైం ది .తెలుగులో గురజాడ శ్రీరామమూర్తి తో మొదలై కందుకూరి వీరేశలింగం పంతులు, వంగూరి సు బ్బారావు, చెంచయ్య, మంత్రిప్రగడభుజంగరావు, బోగరాజు నారాయణ మూర్తి, కె.వెంకటనారాయణం రావు, దివాకర్ల వెంకటావదాని, పింగళి లక్ష్మీకాంతం, ఆరుద్ర, ఇంద్రగంటి హనుమశాస్త్రి, జి.నాగయ్య, ము దిగంటి సుజాతారెడ్డి, ద్వా.నా. శాస్త్రి, మొదలగు వారెందరో సాహిత్యం మీద దృష్టి మరల్చి సాహిత్య చరి త్ర రాశారు. ఐతే వారి ద్వారా సాహిత్యచరిత్ర పరిపుష్టం కాలేదు. ఆధునిక సాహిత్య చరిత్ర 1940లో కు రుగంటి సీతారామ భట్టాచార్యులు, పిల్లలమర్రివెంకటహనుమంతరావులు మొదల్బెట్టారు. కవిత్వా నికి అనేకులు పెద్దపీట వేశారు కాని మిగతా ప్రక్రియల్ని అంతగా పట్టించుకోలేదు. ఆలోటును పూరిం చడానికి పొంగి శ్రీరామ అప్పారావు నాటకానికి స్థానం కల్పించగా, పోరంకి దక్షిణామూర్తి కథకు ప్రా దాన్యమిచ్చారు. బొడ్డపాటి కుటుంబరాయశర్మ, మొదలినాగబూషణశర్మ, పుల్లాబొట్ల వెంకటేశ్వర్లు నవ లా చరిత్రని రికార్డు చేశారు. ఐతే ఇటీవలి కాలంలో సాహిత్యంలో మార్పుల పర్యవసానంగా అస్థిత్వ ఉద్యమాల మూలంగా దళిత సాహిత్యంప్రవాహమై ఎగసింది ఈ ఉద్యమ స్ఫూర్తితో దళిత సాహిత్య చరిత్రను డా, పిల్లిశ్యాంసన్ రికార్డు చేశారు.

ఆధునిక తెలుగు సాహిత్యలో నాటకం, కథ, కవిత్వం కంటే ఎకువ మంది ప్రజాదరణ పొందిన ది నవల మాత్రమే నవల జన జీవిత సమస్యలని, వాస్తవజీవిత దృక్పథాల్ని వివరించడంలో అగ్రభాగా న నిల్చింది. పల్లెజనుల జీవితం వారి దైనందిన జీవనం, సంస్కృతి, ఆచారాలు, సాంప్రదాయాలు, గ్రావీ ణ, పట్టణ, ఉన్నత మద్యతరగతుల జీవితాలు, రైతులు, కార్మికుల జీవితాలు, ఉన్నత చదువులు చ విన ఉద్యోగాలు రాని యువత, సమాజాన్ని విశ్లేషించే మేధావి వర్గజీవితాలు, వారి ఆలోచనలు, సం వేదనలు, దృక్పదాలు, సంక్లిష్టతలు, సంవేదనలు హేతువాద దృక్పదాలు, బౌతిక ఆధ్యాత్మిక జీవనం, మానసిక బావాత్మక ప్రపంచం, మతం, కుల దృక్పదాలు అతి సునిశితంగా, సూక్ష్మంగా ఆవిష్కరించే ప్ర కీయ నవల. ప్రపంచ విప్లవాల ఫలితంగా, పారిశ్రామిక విప్లవాల పర్యవసానంగా ఏర్పడిన మార్పులు, సమాజంలో ప్రజాకాంక్షలు వెల్లివిరిస్ ప్రజాస్వామ్యం రుపుదాల్చి యూరప్ సాహిత్యంలో నవలా ప్రక్రి

య ఏర్పడటానికి నాంది పలికింది. పాశ్చాత్య సంస్కృతి భారతదేశంలో వేల్లూనుకుని నవల పురుడు పోసుకోవడానికి కారణభూతమైంది.

తెలుగు నవలా సాహిత్యంలో మొదటి నవలగా కందుకూరి వీరేశలింగం పంతులు రచించిన రాజశేఖర చరిత్ర’మును సాహిత్యకారులు పేర్కొనిరి. దీనికంటే ముందుకొందరు పింగళిసూరన రచిం చిన కళాపూర్ణోదయము మొదటి నవలగా కొందరు సాహితీవేత్తలు పేర్కొనిననూ, నవలా లక్షణమైన కల్పితకథయైననూ వచన లక్షణము లేకపోవుటచే దానిని తిరస్కరించిరి. అట్లే కొక్కొండ వెంకటరత్నం రచన ‘మహస్వేత’ పేర్కొనిరి. దీనికి మూలాధారము బాణుని సంస్కృత కావ్యం కాదాంబరి. ఐతే తె లుగులో ఇది ప్రతిభావవంతమైన రచన కాలేకపోయినదని దానిని తోసిపుచ్చినారు. అటుతరువాత నర హరి గోపాలకృష్ణ శెట్టి రచన శ్రీరంగరాజ చరితము (1872), దీనికే సోనాబాయి పరిణయము’ అని మరో పేరు దీనిని కొందరు మొదటి నవలగా గుర్తించినప్పటికీ నవలకుండాల్సిన పూర్తి లక్షణములు లేవని నవలాలక్షణములైన వాస్తవిక సమకాలీన జీవిత చిత్రణ, కథాకథన పద్ధతి, కల్పితమైన ఇతివృత్తం, పా తల చిత్రణ, సంవిదానంలు పూర్తిగా కల్గినది కందుకూరి వీరేశలింగం పంతులు గారి రాజశేఖర చరిత్ర ము( 1880 ) అని తేల్చిరి. అదే తెలుగు లో తొలి నవలగా గుర్తింపు పొందినది. ఐతే (ఇదియును ‘అలి వర్ గోల్డ్స్మెత్ రచించిన thevicarofwakefield రచన ప్రభావంతో రాయబడినది). తర్వాతి కాలంలో కొన్ని అనువాద నవలలు వచ్చాయి. గాంధీజీ సంఘసంస్కరన, హరిజనోద్ధరణ పిలుపు ప్రభా వంతో ఉన్నవలక్ష్మీనారాయణ 1921 నుండి 1922 మద్య కాలంలో తను జైలులో ఉండగా ‘మాలపల్లి న వల రాశాడు. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన నవల అంటరాని జీవితాలను దళితేతరులుసృజించి రాసిన మొదటి దళిత నవల. ఆనాటి సామాజిక పరిస్తితులు, స్వాతంత్ర్యోద్యమకాంక్ష, బలియమైన స దర్బం అది. ఐతే మాలపల్లి నవల బాష సరళతరంగా ఉండడం పల్లెజనులకు అర్థమయే రీతిలో ఉం డటం అటు జానపదులను, పండితులను, సాహితీవేత్తలను విశేషంగా ఆకట్టుకొని ఆనాడు అందరి మ న్ననలు పొందిన నవల. దలితేతరులు రాసిన తొలి దళిత నవలా ఇదేకావడం విశేషమే అయినను ఇది దళితనవలగా గుర్తింపబడలేదు. అటుతర్వాత విశ్వనాథవారి వీరవల్లుడు దళిత సానుబూతి రచనగా మి గిలింది. నగరులైన నవలా రచయితలు దళితజీవితాలను కథా వస్తువుగా స్వీకరించలేక పోయారు.

సాహిత్యంలో దళితులు చైతన్యవంతులై తమ జీవితాలను కథావస్తువులుగా స్వీకరించి నవలలు రాయడం మాత్రం 1985 నుండి ప్రారంబమైంది. వందేండ్ల సాహిత్య చరిత్రలో ఉన్నవ లక్ష్మనారాయణ గారి ‘మాలపల్లి’ • విశ్వనాథవారి ‘వీరవల్లుడు’ మినహ దళిత సానుబూతి రచనలు మచ్చుకైనా కనిపించవు. చుండూరు కారంచేడు ఘటనలతో చైతన్యమై దళితవాదాన్ని బలపరుస్తూ దళిత రచయితలు రాసిన నవలలు రాశిలో ఎక్కువ కనిపించక పోయినా ప్రతిభావవంతమైన రచనలుగా వాసికెక్కాయి. ఈ క్రమంలో మోహన్ రావు’ఖాకీ బతుకులు’, చిలుకూరి దేవపుత్రో’పంచమం’, వేముల ఎల్లయ్య’కక్క, సిద్ది’, భూతంముత్యాలు ‘సూర, పురుడు, ఇగురం, మొగలి మాలచ్చువమ్మ నవలలు’, జి. కళ్యాణరావు’ అంటరాని వసంతం’, కదిరె కృష్ణ ‘ పొద’, వరకుమార్ గుందేపంగు మైల, నేను బానిసన పోలీసు దుఃఖం నవలలు జాజుల గౌరి వోయినం. గడ్డం మోహన్ రావు కొంగవాల్ కత్తి నవల, మంథని శంకర్ ” జక్కులు” ఇప్పటి వరకు వచ్చిన దళిత నవలలు. ఇందులో ప్రధానంగా దళితజీవితాలను, వారి సంస్కృతి, సాంప్రదాయాలని, సమాజం లో వారికి జరుగుతున్న మోసాలు, కుల పీడనలను ప్రతిబింబిస్తూ వచ్చిన నవలలు వేవ సి’ భూతం ముత్యాలు ‘సూర, పురుడు, ఇగురం’ మాత్రమే.

దళిత సాహిత్య ప్రభావంతో వాడ జనపదుల జీవన శైలీ ఒరవడిని అందిపుచుకొని దళిత సాహిత్యాన్ని సుసంప న్నం చేస్తున్న రచయిత బూతం ముత్యాలు. ఇతను ఇప్పటికి ఐదు నవలలు తీసుకొచ్చారు. ఇతని మొదటి నవల’సూర’ రచనా కాలం 2004. పురుడు ( 2007), ఇగురం (2012), మొగలి (2016), మాలచ్చువమ్మ (2021)నవలలు 

 సూర నవల పరాశ్రయరీతిలో సాగుతూ, సమకాలీన పరిస్థి తులను ఆకలింపు చేసుకొని దళిత జీవితాలను, ముఖ్యంగా మాలల జీవితాలను సాహిత్య యవనికపై ఆవిష్కరించారు.

ఈ నవలలో దళితులు శ్రమదోపిడికి గురయారు. ఆర్థికంగా నష్టపోయారు, ఆంద విశ్వాసాలలో కూ రుకు పోయారు. దాని పర్యవసానమే ముగింపులో హత్యలు. జారకాంతలు దలితులలోనే కాదు అగ్ర వర్ణాలలో ఉన్నట్టు నవలలోని రంగి-కళమ్మ పాత్రల ద్వారా నిరూపించాడు. అంబేద్కర్ ఆశయాలను ప్రతిబింబిస్తూ వర్ణాంతర వివాహం, దళితులకు విద్యతో నవల సాగడం ఈతరపు నవలలో హైలైట్గా నిల్చిందనుటలో సందేహం లేదు. ఇలా నేటి సమకాలీన సమాజపోకడ, మూఢాచారాలు, నిమ్న వర్గాల జీవితాలను ప్రతిభావవంతగా చిత్రించాడు రచయిత…

దళిత తెలుగు నవలా సాహిత్యం వికాసంలో నవల విశిష్టమైనది, అంటరాని భాషగా పండితులకు బూతు బాషగా ఎంచి సాహిత్యంలో తిరస్కారబావానికి గురైనబాష దళిత తెలుగు సాహిత్య యవనికపై మట్టిమనుషుల పరిమళాలను గుబాలింప చేసింది. సమాజంలో నిచ్చెనమెట్ల కులసంస్కృతిలో సమానత్వ జపం చేసె కుహనా మేదావుల ముసుగులు తొలగెటట్టుచేసింది. సాంప్రదాయకులను, అభ్యుదయబావజాలికులను, ప్రగతిశీలబావజాలికులకు క ంటకమై నిల్చి, సాహితీ విమర్శ కులను విస్మయపరుస్తూ, సంచలనాత్మక దళిత నవలలు నేడు చరిత్రలో నిలిచాయి. వాసిలో నిలిచిన దళిత నవలలు రాశి పరంగా తక్కువ. ఈ క్రమం లో మరిన్ని రచనలు దళిత జీవితాలను రికార్డ్ చేస్తూ రావలసిన అవసరం ఎంతైనా వుంది. ఆదిశగా అడుగులు పడతాయని ఆశిస్తూ..  

You may also like

Leave a Comment