అస్సాం ని గేట్ వే ఆఫ్ ఈశాన్య భారతదేశం గా పరిగణిస్తారు.ఈసారిఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అస్సాంరాష్ట్రాన్ని దర్శించుకునేందుకు ఎంచుకున్నాం. విమానంలో హైదరాబాదు మీదుగా గౌహతికి వెళ్ళాం.
అస్సాం ప్రాంతం చాలా భాగం ఎగుడు, దిగుడు,కొండలు,గుట్టలు లోయలుగా ఉండే ఈ ప్రదేశాన్ని మొదటగా అసమా దేశంగా పిలిచేవారు కాలక్రమేనా అసమా పేరు కాస్త అస్సాంగా స్థిరపడింది.
గౌహతి విమానాశ్రయం నుండి దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించి ముందుగా నీలాంచల్ పర్వత శ్రేణిలో ఉన్న కామాఖ్య ఆలయానికి చేరుకున్నాం. ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఇది 51 శక్తిపిఠాల్లోఒకటి.ఇక్కడే దశమహావిద్యలనే పేరు గల కాళీ, తార, భువనేశ్వరి,బగలాముఖి, చిన్నమస్త,భైరవి,ధూమావతి, కమలాంబిక, షోడసి, మాతంగి అనే పది వేరు వేరు ఆలయాలు ఉన్నాయి. కామున్ని దహించిన ప్రదేశంగా దీనికి కామాఖ్య అనే పేరు స్థిరపడింది.
ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించబడినదిగా భావిస్తున్న ఈ ఆలయం 16వ శతాబ్దంలో అన్య మతస్తుల దాడుల్లోద్వంసం కాగా 17వ శతాబ్దంలో కుచ్ బీహార్ రాజు నర నారాయణుడు పునర్ నిర్మించాడనిశాసనాధారాలు ఉన్నాయి. ఈ ఆలయం మూడు మండపాలుగా నిర్మించి ఉంటుంది. మొదటి ప్రాకారంలో గుహలా ఉండి గర్భాలయంలో నల్లటి బండరాయి ఉంటుందిదీనికి పూజలు జరుగుతాయి ఆ గుహలో రాతి మీద ఎప్పుడు జలం ఊరుతూ ఉంటుంది అందువల్ల ఎప్పుడు తడిగా ఉండి ఆలయమంతా చిత్తడిగా జారుతూ ఉంటుంది.
ప్రతి సంవత్సరం జూన్ రెండవ వారంలో అంబుభాషి సమయంలో నాలుగు రోజులు ఈ ప్రాంతంలోని ఆలయాలన్ని పూర్తిగామూసి వేయబడతాయి. ఈ ప్రాంతంలో ఇంకా అనేక ఆలయాలు ఉన్నాయి. సమయాబావంవల్ల ముఖ్య ఆలయాలను మాత్రమే దర్శించుకొని ఆ రోజు సాయంత్రం బ్రహ్మపుత్ర నదిలోని క్రూయిజ్విహారయాత్ర కోసం బయలుదేరాం.
ఇక బ్రహ్మపుత్రా నది విశేషాల్లోకి వస్తే బ్రహ్మపుత్ర ఆసియాలోని ముఖ్యమైన నదుల్లో ఒకటి. చాలా నదులు సహజంగా స్త్రీ పేరుతో పిలువబడగా బ్రహ్మపుత్ర మాత్రమే పురుష నామముతో పిలవబడటం విశేషం.ఈ నదిటిబెట్లో నైరుతి ప్రదేశంలో యార్లు నదిగా పుట్టి దక్షిణ టిబెట్లో దిహన్ నదిగా ప్రవహించి హిమాలయాలలోని లోతైన లోయలోకి ప్రవహించి దాదాపు 2900ల కిలోమీటర్లు ప్రవహించి చివరగా బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని పరివాహక ప్రాంతం దాదాపు 650 చదరపు కిలోమీటర్లు. ఈ నది ప్రత్యేకత ఏంటంటే సముద్రం లాగానే ఈ నదిలోకూడాఅలలు ఉవ్వేత్తున ఎగిసి పడతాయి. ఇది భారతదేశం, బంగ్లాదేశ్, భూటాన్, చైనా దేశాల్లో ప్రవహిస్తుంది.
2011లోమేము మొట్టమొదటిసారి మానససరోవరం వెళ్ళినప్పుడు ఉత్తర హిమాలయాల్లోని కైలాస పర్వతం దర్శించినప్పుడు అతి తక్కువ ప్రవాహంగా ఉండే ఈ నది ప్రవాహ వేగం దాదాపు పదివేల అడుగుల ఎత్తులో ప్రవహించి ప్రపంచంలోని అన్ని నదుల కన్నా ఎత్తుగా ప్రవహిస్తున్న నదిగా కూడా రికార్డుల్లో ఉంది.కొన్ని ప్రాంతాల్లో ఈ నది వెడల్పు దాదాపు 12 కిలోమీటర్ల నుండి 24 కిలోమీటర్లు పైబడి కూడా ఉండి కొన్ని ప్రాంతాల్లో దాదాపు60 నుండి 70 అడుగుల లోతు ఉంటుంది. ఇదిప్రపంచంలోనే 9 వ అతిపెద్ద నది.
ఇక మా క్రూయిజ్ప్రయాణం లోహిత్ గాట్లోప్రారంభం అయింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సూర్యాస్తమయం చూడడానికి చాలామంది క్రూయిజ్ ప్రయాణం ఎంచుకుంటారు. క్రింది భాగంలో రూ.650 వసూలు చేస్తారు కానీ సంగీత శబ్దాలు ఎక్కువగా ఉండటం వల్ల మేము పై భాగంలోకి వెళ్ళాము దీనికి రూ.750 రుసుముగా ఉంటుంది.
దాదాపు ఒక రెండు గంటలు క్రూయిజ్ లో నది విహారం చేశాం. చుట్టుపక్కల ఉండే నదిలోని దీవులు, ఎత్తైన భవనాలు వాటి అలంకరణలు, వాటి ప్రతిబింబాలు నీటిలో ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. ఇప్పటివరకు చాలా క్రూయిజ్ లలో తిరిగిన అనుభవం ఉన్నాఈ క్రూయిజ్ అనుభవం మాత్రం అనిర్వచనీయంగా ఉంది.క్రూయిజ్ లో భోజనం ముగించుకొని వసతి గృహానికి చేరుకున్నాం.
ఆ మరుసటి రోజు ఉదయం ఉపాహారం ముగించుకొని తదుపరి యాత్రా ప్రదేశం ఐనకజీరంగానేషనల్ పార్క్ చూడ్డానికి బయలుదేరాం. గౌహతి నుండి దాదాపుగా 204 కిలోమీటర్ల దూరంలో ఉన్న కజీరంగా చేరడానికి దాదాపు 5 గంటలు పడుతుంది. మధ్యలో దారిలోని కొన్ని ప్రదేశాలను దర్శించుకుని నాలుగు గంటల వరకు కజీరంగాలోని మా వసతి గృహానికి చేరుకున్నాం.
ఆరోజు రాత్రి భోజనం ముగించుకుని విశాలమైన మా వసతి గృహంలో విహరించినప్పుడు ఆకాశం మొత్తం నల్లని చుక్కల చీర కట్టుకుందా అనిపించి చిన్నప్పటి మధురస్మృతులను గుర్తుకు తెచ్చింది. రాత్రి సమయంలో పెరట్లో నులకమంచం పై అమ్మ పక్కన పడుకొని అమ్మ చెప్పే చక్కటి చందమామ కథలు వింటూ ఆకాశంలో నుండి జారిపడుతున్నట్లుగా అనిపించే నక్షత్రాలను లెక్కపెడుతున్న రోజులు గుర్తుకు వచ్చి మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఆ రాత్రంతా అలానే నక్షత్రాలను చూస్తూ ఉండిపోవాలని అనిపించింది.
ఆ మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకే కజిరంగా పార్కుకు చేరుకున్నాం. ఇక కజిరంగా పార్కు నేపథ్యం చూస్తే ఇది ప్రపంచంలోనే హెరిటేజ్ పార్క్ గా గుర్తింపు పొందిన ఈ పార్కు 1905లో స్థాపించబడి 1974లో నేషనల్ పార్కుగా అవతరించింది. దాదాపు 70,780 ఎకరాలు కలిగి ఉన్న ఈ పార్క్ మధ్య నుండి బ్రహ్మపుత్రా నది కూడా ప్రవహిస్తుంది. ఈ పార్కు ప్రపంచంలోనే మూడింట రెండువంతులు ఒక కొమ్ముగల ఖడ్గమృగాలకు ఈ పార్క్ ఆతిథ్యమిస్తోంది. దాదాపు 3 వేల పై చిలుకు గల ఖడ్గ మృగాలు ఇందులో ఉన్నట్లు అంచనా.ఒక్కొక్క ఖడ్గమృగం 1600 కేజీల నుండి 2700 కేజీలవరకు ఉంటాయి. ఇవి అపాయం ఉన్నట్టు గమనిస్తే గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతాయి. ఈ పార్కులో 57% నీటి గేదెలు, ఏడు జాతుల రాబందులు, ఏనుగులు, జింకలు, మెరిసే జింకలు,క్యాపడ్ లంగూర్లు,చిరుత పులులు, ఎలుగుబంటులు, బెంగాల్ ఫాక్స్, హిమాలయన్స్ స్క్వేరిల్ తో పాటు 385 రకాల పక్షుల జాతులు ఉన్నట్లు15 రకాల క్షీరదాలు ఉన్నట్లు అంచనా.
కజీరంగా పార్కులో ఏనుగులపై స్వారీ మరియు 5 జోనులలో జీప్ సఫారీలు ఉంటాయి. ఏనుగు సఫారీఉదయము 6 నుంచి 7వరకుమరియు 7 నుంచి 8వరకుఅనుమతిస్తారు. జీప్ సఫారీ ఎనిమిది గంటలకు మొదలవుతుంది. జీప్ సఫారీలో ప్రయాణించి ఖడ్గమృగాలను, ఏనుగుల గుంపును, జింకల గుంపును, నీటి గేదెలను మాత్రమే చూడగలిగాం కానీ స్వేచ్ఛగా తిరుగుతున్న జంతువులను చూస్తుంటే ఒకవైపు సంతోషం ఇంకోవైపు హఠాత్తుగా వేరే జంతువులు వచ్చి మీద పడతాయోఅన్న భయం కలగలిపి ఒక విధమైన కొత్త భయం కలిగినా జీప్సఫారీ మాత్రం అద్భుతంగా అనిపించింది. ఇంకా కొన్ని పక్షుల జాతులను కూడా చూశాం ఒకే మారు 4 నుండి 5 జీపులను ఒక ఫారెస్ట్ గార్డ్అనుమతిస్తారు.
చాలా దూరంలో టైగర్ కూడా చూసామని కొందరు చెప్పారు కానీ మాకు మాత్రం కనబడలేదు. మధ్యాహ్నం వరకు జీప్ సఫారీ పూర్తి చేసుకుని అదే ప్రాంతంలోని అరుదైనమొక్కలుమరియుఅంతరించిపోతున్నజాతులమొక్కలుకలిగిఉన్న పార్క్ కి వెళ్ళాం. ప్రపంచంలోని అరుదైన మొక్కలనుసేకరించి ఇందులో ఉంచారు. చాలా రకాలైన అరుదైన పుష్పాలు, అరుదైన మొక్కలు చూసి సంభ్రమాచార్యలకు లోనయ్యాం. ఆ తదుపరి ఈ పార్క్ లోనే దాదాపు 30 రకాల అస్సాం (PHOTO 5) వంటకాలతో వడ్డించిన బాహుబలి భోజనం ఎంతో సంతృప్తిని ఆనందాన్ని కలుగజేసింది.
సాయంత్రం వరకు పార్క్లోని వివిధ ప్రాంతాలు దర్శించి ప్రత్యేకంగా కొన్ని వందల రకాల వెదురు బొంగుల పార్కునుకూడాదర్శించి ఆశ్చర్యపోయాం. సాయంత్రం అక్కడే అస్సాం కళాకారులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ నృత్యకార్యక్రమాలు వీక్షించి ఆ పరిసర ప్రాంతంలోని తేయాకు తోటల్లో ఫోటోలు తీసుకొని మా వసతి గృహానికి చేరుకున్నాం.
ఆ మరుసటి రోజు కజీరంగా నుండి సాంస్కృతిక కళలకు నేపథ్యమున్న తేజ్ పూర్ బయలుదేరాం. దారిలో కొసాయి అనే గ్రామంలో అతి ఎత్తైన మహా మృత్యుంజయ లింగం దర్శించుకుని ఈ ప్రాంతంలో రాక్షస గురువైన శుక్రాచార్యుడు మృత్యుంజయ మంత్రంతో తపస్సు చేశాడని ఆ తదుపరి స్థానికులు ఈ ప్రాంతంలో అతిఎత్తయిన శివలింగాన్ని ప్రతిష్టించి ఇప్పటికీ పూజలు కొనసాగిస్తున్నారని స్థానికులువిషదికరిస్తేవినిఅపురూపమైనప్రాంతంచూశామనేసంతృప్తితోతేజ్పూర్కిచేరుకున్నాం. తేజ్ పూర్ లో బాణాసుర రాజుచే నిర్మించబడ్డ పురాతన ప్రముఖ మహా భైరవ ఆలయం దర్శించుకున్నాం. ఇక్కడి శివలింగం ప్రతి సంవత్సరం క్రమంగా పెరుగుతున్నట్టు స్థానికులు చెప్పారు. అక్కడినుండి బ్రహ్మపుత్రా నది తీరంలో బాణాసుర రాజు తన కుమార్తె ఉష అనిరుద్ ని ప్రేమించిన విషయం తెలుసుకొని ఆమెను బంధించి ఉంచిన ప్రదేశమైనా అగ్నిగర్ దర్శించుకున్నాం. ఈ అగ్నిగర్ గుట్ట పై భాగంలో ఉంటుంది. ఈ ప్రాంతం నుండి బ్రహ్మపుత్రా నది ప్రవాహాన్ని, సూర్యోస్తమయ అందాలను బ్రహ్మపుత్రా నది పైన నిర్మించిన అతిపెద్ద బ్రిడ్జి నిర్మాణాన్ని,తేజ్ పూర్ పట్టణాన్ని వీక్షిచం. ఇక్కడి నుండి బ్రహ్మపుత్ర ఘాట్లనుకూడా దర్శించుకుని అక్కడి తేయాకు తోటలను దర్శించుకుని వసతిగృహం చేరుకున్నాం.
విహంగ వీక్షణవీక్షణంలా సాగిన ఈ మా నాలుగు రోజులు అతి ముఖ్యమైనఅస్సాం ప్రాంతాల ఈ ప్రయాణం ఈరోజుతో ముగిసింది.