నువ్వు ముందు మనిషివి. – సాహిర్ లూథియాన్వి ఉర్దూ కవిత.
ఈ హిందువూ.. ముస్లిం అనే ముద్రలు ఏమిటసలు ? నువ్వు హిందువు కాదు..ముస్లిమువీ కాదు.
మనిషికి పుట్టిన వాడివి ..మనిషివే అవుతావు.
నువ్వుపుట్టగానే ..ఇప్పటిదాకా ఇంకా నీకు ఒక పేరంటూ ఎవరూ పెట్టలేదు.
అదే మంచిది..ఇక
నీకు ఏ మతం తోటీ సంబంధమే ఉండదు.
ఏ ప్రాపంచిక జ్ఞానం అయితే మనిషిని ఈ సమాజానికి పంచిందో.. ఆ జ్ఞానమే మనుషులమధ్య తేడాలు చూపించలేదు.. అభియోగాలూ మోపలేదు.
అందుకే…మనిషీ
నువ్వు మారుతున్న కాలానికి ఒక నూతన మానవుని ప్రతీకగా గుర్తింపబడతావు.
విషాదమేంటంటే.. ఆ మాలిక్ …ప్రతి ఒక్కరినీ మనిషిగా మాత్రమే చేసాడు.
మనమే ఆ మనిషిని హిందువుగానో ..ముసల్మాన్ గానో మార్చేసాము.
మరి..ప్రకృతి కూడా చేసిందదే !అది … మనందరికీ ఒకటే భూమిని ఇచ్చింది..…
* * *
స్త్రీ పురుషుడికి జన్మ నిస్తుంది కానీ-(ఔరత్ నే జనమ్ దియా మర్ధో కో…)సాహిర్ లూథియాన్వి ఉర్దూ కవిత.
స్వేచ్చానువాదం-గీతాంజలి
ఈ పురుషులు ఎలాంటి వాళ్ళో చూడండి…
స్త్రీలు వాళ్ళకి జన్మ నిస్తే..వాళ్ళు మాత్రం
ఆ మాతృమూర్తులను
కృతజ్ఞతే లేకుండా ఎప్పుడంటే అప్పుడు
ఇష్టం వచ్చినట్లు
నలిచి .. నాశనం చేసి., బాజారులో డబ్బుల కోసం తూకం వేసి మరీ అమ్మకానికి కూర్చోబెడతారు.
హృదయంలో పెట్టుకొని పూజించాల్సిన ఆమెతో..విలాసవంతుల దర్బారుల్లో నగ్నంగా నాట్యం చేయిస్తారు.
చెప్పు కోవడానికి కూడా.. ఎంత సిగ్గుచేటంటే., ఆమె మర్యాదస్తులనబడే వాళ్ళకే పంచ బడుతుంది.
ఎంత వివక్షో చూడండి..
పురుషులేమో ఎంత నేరాలనైనా బాహాటంగా చేయచ్చు కానీ ..స్త్రీకి ఏడవడం కూడా నిషిద్ధమే !
మగవాడికి పడుకోవడానికి లక్ష పరుపులు… స్త్రీకి మాత్రం ఒకటే చితి !
మగవాడికి ఉల…
* * *
ఇలాంటి లోకం దొరక్కపోయినా నష్టం లేదు !(ఏ దునియా అగర్ మిల్ భి జాయే తో క్యా హై?)
– సాహిర్ లూథియాన్వి ఉర్దూ కవిత.
ఒక్క రాజ ప్రసాదాలు..సింహాసనాలు… వజ్రాల కిరీటాలు మాత్రమే కనిపించే లోకం., హృదయం ఉన్న మనుషులే కనిపించని లోకం ..
దొరికితేనేం.. దొరక్కపోతే నేఁ?
మనిషికే శత్రువుగా మారిన ఈ సమాజం..
ఈ డబ్బు పిచ్చి ఉన్న మనుషులు మాత్రమే నిండిన ఈ లోకం..దొరికితేనేం..
దొరక్కపోతేనేఁ?
వాళ్ళ మొఖాల్లోకి చూడండి ఒకసారి..
ఇక్కడ ప్రతి ఒక్కరూ గాయపడి ఉన్నారు.. దాహం గొని ఉన్నారు.
కళ్ళలో అయోమయం..గుండెల్లో విషాదం నిండిపోయి ఉన్నారు.
ఓహ్హ్..ఇది మనుషులు ఉంటున్న స్థలమేనా ..? లేక
దుఃఖం ఒక్కటే పొంగి పోరాలుతున్న శోక మందిరమా ?
అసలు.. దయేలేని ఈ లోకం..
దొరికితేనేం… దొరక్క పోతేనేం?
మనిషి అస్థిత్వ…
* * *
ఆ అరుణోదయం..తప్పక వస్తుంది..!(ఓ శుభహ్ కభీ తో ఆయేగి !- ) –సాహిర్ లూథియాన్వి ఉర్దూ కవిత.
స్వేచ్చానువాదం–గీతాంజలి.
–––––—————————–
ఇన్ని చీకటి యుగాల నిరీక్షణ తరువాత…రాత్రి పరదాలు కూడా తొలిగాక..
దుఃఖపు మేఘాలు సాంతం కరిగిపోయాక.. అప్పుడు సంతోషపు సముద్రాలు పొంగిపొర్లుతాయి.
ఆకాశం నృత్యం చేస్తుంది.. ఈ భూమి పాటలు పాడుతుంది…
ఇక చూడు..ఆ ఉదయం తప్పక వస్తుంది.
ఏ రోజు కోసమైతే మనం క్షణం క్షణం మరణిస్తూ బతికామో.. ఏ రోజు కోసం..అమృతం లాంటి కాలాల్లో కూడా విషాన్ని గుక్కలు గుక్కలుగా గుటకలు వేశామో..
ఆ రోజు..
ఆకలి..దాహం గొన్న మన ముంగిళ్లలో మనం కోరుకున్న ఉదయం మెరిసిపోతూ నిలుస్తుంది !
నిరాశ పడకు మిత్రమా..
ఇప్పుడు కనీసం భూమికున్న విలువైనా రక్తమాంసాలున్న మనిషికి లేకపోవచ్చు గాక !
మన ఆకాంక్షలకూ కనీస గుర్తిం…
[1:23 PM, 6/14/2022] Niharini: ఆ అరుణోదయం..తప్పక వస్తుంది..!(ఓ శుభహ్ కభీ తో ఆయేగి !- ) –సాహిర్ లూథియాన్వి ఉర్దూ కవిత.
స్వేచ్చానువాదం–గీతాంజలి.
–––––—————————–
ఇన్ని చీకటి యుగాల నిరీక్షణ తరువాత…రాత్రి పరదాలు కూడా తొలిగాక..
దుఃఖపు మేఘాలు సాంతం కరిగిపోయాక.. అప్పుడు సంతోషపు సముద్రాలు పొంగిపొర్లుతాయి.
ఆకాశం నృత్యం చేస్తుంది.. ఈ భూమి పాటలు పాడుతుంది…
ఇక చూడు..ఆ ఉదయం తప్పక వస్తుంది.
ఏ రోజు కోసమైతే మనం క్షణం క్షణం మరణిస్తూ బతికామో.. ఏ రోజు కోసం..అమృతం లాంటి కాలాల్లో కూడా విషాన్ని గుక్కలు గుక్కలుగా గుటకలు వేశామో..
ఆ రోజు..
ఆకలి..దాహం గొన్న మన ముంగిళ్లలో మనం కోరుకున్న ఉదయం మెరిసిపోతూ నిలుస్తుంది !
నిరాశ పడకు మిత్రమా..
ఇప్పుడు కనీసం భూమికున్న విలువైనా రక్తమాంసాలున్న మనిషికి లేకపోవచ్చు గాక !
మన ఆకాంక్షలకూ కనీస గుర్తింపు లేకపోవచ్చు.
కానీ ఏదో ఒకనాడు ఈ భూమ్మీద..మనిషి గౌరవాన్ని అబద్ధపు ధనంతో కొలవని రోజు మాత్రం తప్పక వస్తుంది.
ఎప్పుడైతే… పాపపు డబ్బు కోసం ఆడదాని శరీరం అమ్మ బడదో..
ఎన్నడైతే ఆమె ఆకాంక్షలు నలిచి వేయ బడవో…
ఆరోజు వచ్చినప్పుడు.. ఈ నిస్సిగ్గు సమాజం సిగ్గుతో చితికిపోతుంది.
ఆ ఉదయం ఎప్పటికైనా వచ్చి తీరుతుంది.
అయితే వినండి .,
ఆ ఉదయాల్ని మేమే తెస్తాం !
తెచ్చి తీరుతాం..
అది మా వల్లే సాధ్యం అవుతుంది !
ఏ రోజైతే భూమి తిరగ బడి ప్రతిజ్ఞ చేస్తుందో..నిరపరాధులు జైళ్ల నుంచి విముక్తమవుతారో..
పాపపు గృహాలు బద్దలు అవుతాయో.. అన్యాయపు శృంఖలాలు తెగిపోతాయో..
ఆ ఉదయాల్ని మేమే తెస్తాము!
ఏ సమాజంలో అయితే నేరస్థులు పోషింపబడరో…
ఎక్కడైతే పిడికిలి బిగించి నినదించే
చేతులు ఖండించబడవో.. ఎక్కడ ఆత్మ గౌరవంతో నిటారున నిలబడ్డ శిరస్సులు అణిచివేయబడవో..
ఎప్పుడైతే ..జైళ్లు..బందీలు లేని ప్రజా స్వామిక పరిపాలనలో ఉంటామో..
ఆ ఉదయాన్ని మేమే తెస్తాం.
ఏ రోజైతే …. పొలాల్లోంచి రైతుల.. మిల్లుల నుంచి కార్మికుల శ్రమకు సమాజంలో సరైన విలువ కట్టబడుతుందో ..
నిస్సహాయులైన..గూడు లేని బీద జనం అంతా ఉపిరాడని బిలాల్లాంటి ఇరుకు ఇళ్ళల్లోంచి బయట పడతారో ..
అప్పుడు… నిజంగానే ఆ క్షణాల్లో.. లోకం అంతా శాంతీ..సంతోషాలనే పుష్పాలతో అలంకరించుకుని హర్షాతిరేకలతో మునిగిపోతుంది.. ఆ అరుణోదయాల్ని మేమే తెస్తాం!
ఖచ్చితంగా
తెచ్చి తీరుతాం.!
ఇది రేపటి లోకానికి మా వాదా!
స్వేచ్చానువాదం-గీతాంజలి
———-స్వేచ్చానువాదం- – గీతాంజలి