చరిత్ర అనగా జరిగిన కాలంలోని విషయాలు,రాతల ద్వారా మనషుల గురించి గాని సమాజం గురించి గాని మానవ పరిణామ క్రమాన్ని తీర్చిదిద్దిన అన్ని అంశాలను పరిశీలించి అధ్యయనం చేసి భద్రపరచడిన దానినే మనం చరిత్ర అంటాము .
చరిత్ర రచనా శాస్త్రం ప్రకారం చరిత్రకారుల కలాల నుండి జాలువారిన అంశాలు ప్రభుత్వ ఎప్పుడైతే రచనా ముద్రణ గావించి వెలుగులోకి తేస్తుందో దానిని చారిత్రక ఆధారాలు అని అంటారు. సింధూ నాగరికత కాలం నుండి బ్రిటిష్ పాలన వరకు అన్ని విషయాలను పరిశీలించిన మీదట హస్తినలో చరిత్ర సృష్టించిన ఒక మహాపురుషని జాడ చరిత్రలో కనిపించకపోవడం అప్పటి ప్రభుత్వ తప్పిదమే. ఇంతటి గొప్ప ధైర్యం సాహస గల మహా పురుషుడు,బలయోధుడు, ధనికుడు,
పెద ప్రజల పేన్నిది, ఆసియా ఖండంలోనే అతి పెద్ద వ్యాపారం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది అని ఈ సందర్భంగా చేపవచ్చు. అతను ఎవ్వరో కాదు అతడే *బాబా లక్కీషా బంజారా*
బాబా లక్కీషా బంజారా 04 జులై 1580 వ సంవత్సరంలో దేశ రాజధాని ఢీల్లీ సమీపంలోని రాయిసిన తండాలో జన్మించారని గోర్ వంశం బంజారా ఉపజాతి భాట్ గోత్రం వడ్త్యా నాన్న పేరు గోదూనాయిక్ బణజారా, తాత ఠాకూర్ నాయక్ బణజారా వద్ద ఇంట్లోనే విద్యాభ్యాసం తో పాటు భారతియ సంస్కృతి సభ్యతా నేర్చుకున్నారు.అతని అర్ధాంగి పేరు పారాబాయి, పుత్రులు ఏడుగురు కూతురు ఒక్కరూ అందులో హేమ,హడి,నగైయా,హియా,పూండియా, బక్షి, బాలాజ్ కూతురు సీతా, మొదలగు విరి కుటుంబ. జాదవ్ బన్సీ భాట్ ఖాతా పుస్తకంలో బంజారా భాట్ ఆధారంగా ఖైరపూర్ ముజాఫర్ ఆలిపూర్ జిల్లా పాకిస్థాన్ లో జన్మించారని, సిక్కుల చరిత్ర ఆధారంగా హరియ్యాణ రాష్ట్రలో జన్మించారని కొందరి వాదన మరణం తేది 28-మే 1680 కొత్త ఢిల్లీ సమిపంలోని మలచాతండాలో అతను 99 సంవత్సరాలు 10 నేలలు జీవించారని అంటారు. వృతిరిత్య వ్యాపారం చేసెవారు ప్రపంచంలో ఆసియాఖండంలో నే అతి పెద్ద ధనవంతుడు అని చెప్పవచ్చు.అతని వద్ద జీతగాళ్ళు లక్షల్లో ఉండేవారు, గుర్రాలు లక్షల్లో,ఏనుగులు లక్షల్లో,ఆవులు లక్షల్లో ఎడ్లు, ఎడ్లబండ్లు లక్షల్లో అతని వద్ద ఏది ఉన్నా అవి అన్నీ లక్షల సంఖ్యలో ఉండేవని లక్ష శబ్దం అపభ్రంసం చెంది లక్కీషాగా మారిందని అందుకే అతనిని లక్షబంజారా అని, లక్కీబంజారా అని, లక్కీరామ్ నాయక్ బంజారా అని లాఖాబణజారా అని, లక్కీషాబంజారా అని వివిధ పేర్లతో పిలిచేవారు.
బాబా లక్కీషా బంజారా మొఘల్ సామ్రాజ్యానికి చెందిన ప్రముఖ సైనికులకు గుర్రాలకు సంబంధించిన కళ్ళేము,
ఇతరఇతర సామాగ్రిలు వివిధ రకాల సరుకులు ఉప్పు, పప్పు, కారం, పసుపు, బెల్లం, మసాలా దినుసులు మొదలగు ఏడ్ల బండ్లు పైన రవాణ చెసేవారు.అంతేకాకుండా ఢిల్లీ నుండి పాకిస్థాన్ లోని లాహోర్, పెషావర్, కాబుల్, కాందహర మొదలగు ప్రాంతాలలో కుడా ఎడ్లబండ్లు, గుర్రాలబండ్ల పైన ముఖ్యంగా ఉప్పు ఇతరసరుకులు రవాణ చెసేవారు దారిలో గుర్రపుబండ్లు , ఏండ్లబండ్లు జీతగాళ్ళుకు స్వేదా తిర్చడానికి దారిలోని వివిధ ప్రాంతాలలో తండాలు ఏర్పాటు చేసారు.అతను పెద్ద భూస్వామి ఉండటం వలన ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిలు అన్ని అతని అధినంలో ఉండేవి వాటిలో రాయసిన,మరాచి, నరేల ,బరాఖంబా ఢిల్లీ నగరాన రాయిగడ్ తండా మొదలగు ప్రాంతాలు అయిన పరదిలో ఉండేవి.ప్రస్తుతం ఉన్న పార్లమెంటుభవనం, రాష్ట్రపతి భవనం, ఎర్రకోట, ఇండియా గేట్, చాందినీ చౌక్, చావడిబజార్, దర్యాగంజ్ ,ఢీల్లి ఇప్పటి మెట్రో ప్రాంతం ఢీల్లి కంటోన్మెంట్ మొదలగు ఇతని ఆధిపత్యంలో ఉండేవని సిక్కుల చరిత్ర ఆధారంగా తెలుస్తోంది. లక్కీసాబంజారా వద్ద పనిచేసే జీతగాళ్ళులంతా ఢిల్లీ లోని ఎర్రకోట, పూరానా ఖిల్లా,లోడిగార్డేన్,సబ్దర్ జంగ్,ఎలియాదర్వాజా మొదలగు నిర్మాణానికి, ఎడ్లబండ్లుతో భవనానికి సంబంధించిన రాళ్ళు, ఇటుకలు,సున్నం, లోహపు వస్తువులు తలుపులు, మొదలగు సామాగ్రిని మోసినారని చెప్పుతారు.
మొఘల్ సామ్రాజ్యానికి చివరి చక్రవర్తిగా ఔరంగజేబు క్రీ శ 1658 వ సంవత్సరం నుండి 1707 వ సంవత్సరం వరకు రాజ్యాన్ని పరిపాలించారు.దేశాన్ని పాలించిన అత్యంత వివాదాస్పదమైన మరియు కౄరమైన వ్వక్తిగా పేరు సంపాదించారు అతని కాలంలో మొఘల్ సామ్రాజ్యాం అత్యంత విస్తీర్ణం సాధించి దక్షిణన మహా రాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మొదలగు ప్రాంతాలలో ఆధిపత్యం కొనసాగింది.అతని కాలంలో హిందువులు, సిక్కులు, ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండి నిరంతరము పీడించబడుతూ భయపడుతూ కాలం గడిపేవారు. సిక్కు మతములో తోమ్మిదవ గురువు అయిన గురు టేక్ బహదూర్ మత మార్పిడికి నిరాకరించడంతో అతనికి 11 నవంబర్ 1675 వ సంవత్సరంలో భాయిజేతా,భాయిగురుభక్షసింగ్ కళ్ళముందే ఢీల్లీ నగరం లోని చాందినీ చౌక్ వద్ద శిరశ్చేదం చేయించాడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు. ఢీల్లీ సుబేదారుల ఆజ్ఞా ప్రకారం గురువు యొక్క పార్థీవదేహాన్ని చాందినీచౌక్ నుండి తిసుకొని వేళ్ళి అంతిమ సంస్కారాలు చెయ్యుటకు ఎవ్వరు కుడా ధైర్యసాహసాలు చెయ్యలేదు.ఒక రోజు భాయి నానురాయ ఇంట్లో భాయి జేతా,ఉదా అందరూ కలిసి సమావేశమై గురువు దేహ అంతిమ సంస్కారాలు గురించి చర్చించి చివరికి నానురాయ నిర్ణయం ప్రకారం బాబా లక్కీషాబంజారా మాత్రమే ఈ పని చెయ్యగలడని ఒక నిర్ణయానికి వచ్చారు.లక్కీషా బంజారా తన యొక్క కొడుకులు మరియు జీతగాళ్ళతో ఐదువందల ఎడ్లబండ్లు తీసుకోని చాందినీ చౌక్ బయలుదేరి గురువు టేక్ బహదూర్ పార్థీవ శరీరాన్ని ఔరంగజేబు సైన్యాంతో కోట్లాడి రాయిసిన తండాకు తీసుకునివచ్చి గురువు తల లేని మొండెంను అతని ఇంట్లోనే ఉంచి ఇంటికి నిప్పుపెట్టి గురువు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.ఇది సిక్కు మతములో బాబా లక్కీషా బంజారా సృష్టించిన కొత్త అధ్యాయంగా చెప్పవచ్చు.అంతటి బల యోధుడు, వీరుడు,శురుడు, కార్యనిర్వాహకుడు,కర్తవ్యదీక్షాపరునిగా, అన్యాయాన్ని ఎదిరించే సాహసం, శత్రువులను ఎదురించే ధైర్యం తన ధైర్య సాహసంతో ఔరంగజేబు సైన్యాన్ని గడగడలాడించి వెన్నులో వణుకు పుట్టించిన ధీరుడు బాబా లక్కీషా బంజారా. ఇంతటి గొప్ప నాయకుని గురించి భారతదేశ చరిత్రలో స్థానం కల్పించక పోవడం విచారకరం.
*భారతీయ రోడ్లకు పునాది*
భారతీయ రోడ్లకు బాబా లక్కీషాబంజారా పునాదులు వేసారని, అడవుల్లో గోవులను మేపి ఎక్కడైతే చీకటి పడుతుందో ఆ ప్రాంతంలో ఢేరాలను ఏర్పాటు చేసి అచ్చటనే ఉండేవారు ఆ ఢేరాలే ఇప్పటి తండాలు లక్కీషాబంజారా ఆవులు,ఎడ్లు, నడచిన చేసిన మార్గాలు మరియు లక్షల సంఖ్యల ఎడ్లబండ్లతో ఉప్పు ఇతర సరుకులు రావాణా చెసారు.అవి ఏ ఏ మార్గాల నుండి రవాణా చేసినారో దానిని పరిశీలించిన అప్పటి
బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసి గారు దానినే ఆధారంగా చేసుకుని,1853 వ సంవత్సరంలో రోడ్డు,రైలు వ్వవస్థాను ప్రారంభించారు.
అపర భగీరథుడు బాబా లక్కీషాబంజారా
భగీరథుడు గంగానదిని భూవికి తీసుకుని రావడానికి తపస్సు చేసి శివుడు అనుగ్రహించడంతో గంగాను తలపై మోపి జటాజూటంలో బంధించి ఒక పాయను నెల పైకి వదలినాడు అని పురాణాలలో విన్నాం. 16 వ శతాబ్దంలో
బాబాలక్కీషా బంజారా తన వద్ద ఉన్న లక్షల ప్రజలకోసం,లక్షల మూగజీవాల కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ ఝీల్ ను నిర్మించి జనాలను,ముగజీవాలను దప్పిక తీర్చాడాని తవ్వించారని చెరువులో నీళ్ళు రాకపోవడంతో తన స్వంత కోడుకుకోడళ్ళలను నీళ్ళ కోసం బలిదానాలు చేసినాడని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. సాగర్ జిల్లా లోని సాగర్ చెరువు బుందేల్ ఖండ్ చెరువు, రేవులు వందల ఎకరాల విస్తరణంతో ఇప్పటికీ ఉన్నాయి ఇది ప్రత్యేక్షసాక్షం. సాగర్ ఝీల్ ( లాఖాబంజారా ఝీల్ ) అనుపేరుతో ఇప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో ఉంది. లాఖా బంజారా ఝీల్ ను సందర్శించిన అప్పటి భారత ప్రథమ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ జవహర్లాల్ నెహ్రూ సాగర్ చెరువును భారతదేశపు స్విట్జర్లాండ్ అని అన్నారు.
ఢిల్లీనగరంలోని బారాబంఖీ, నరేలా ,లోహగడ్, కాసంగ్ గంజ్ రాయమల్ కాంజీ, పురాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లోని మథూరా, వృంధావన్ బరేలి మొదలగు నగరాల్లో లక్కీషా బంజారాఖ తవ్వించిన బావులు, చెరువులు రేవులు ఇప్పటికీ మనకు దర్శనమిస్తాయి.
*ఆదిలాబాదు జిల్లా నార్నూరులో విగ్రహము*
ఆఖీల భారతీయు బంజారా సేవా సంఘం జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు గౌ, శ్రీ ,అంబర్ సింగ్ తిలావత్ గారు, బంజారా సేవా సంఘం అదిలాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు లంబాడీ ముద్దుబిడ్డ గౌరవ శ్రీ స్వర్గీయ బానోత్ జాలంసింగ్ గారు ప్రస్తుతం నార్నూర్ సర్పంచ్ బానోత్ గజానంద్ నాయక్, శీవాజీ పటేల్ , రాథోడ్ ఉత్తం బానోత్ సూరేష్ ఆడే విశ్వనాథ్ , చౌహాన్ యశ్వంత్ రావు నాయక్ మరియు సమస్త గ్రామస్థుల సాహాయసాకారంతో బాబా లక్కీషాబంజారా కాంస్యావిగ్రాహాన్ని తేది 05-02-2014 న నార్నూర్ మండలంలోని విజయనగర్ కాలని నార్నూర్ నుండి భీంపూర్ వెళ్లే రోడ్డు ప్రభుత్వ ఆసుపత్రి కుడలి సమీపంలో మహానాయకుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. బాబా లక్కీషాబంజారా విగ్రాహాం భారత దేశంలో ఢీల్లీ నగరంలో ఒకటి మరియు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో ఒకటి దేశమంతటా రెండు మాత్రమే ఉన్నాయని సమాచారం.
భారత దేశంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త,ఒక గొప్ప రాజు లక్కీషా బంజారా విగ్రహాన్ని పార్లమెంటు ప్రాంగణంలో ఏర్పాటు చేసినట్లయితే ఇది దేశంలోని 15కోట్ల బంజారాలతో పాటు విదేశాల్లో ఉన్న సమస్త గోర్ బంజారా సముదాయాన్ని గౌరవించినట్లు ఉంటుంది.
2 comments
అపర భగీరథుడు బాబా లక్కీషా బంజారా అనే శీర్షికతో నా వ్యాసానికి తెలంగాణ సాహిత్య ద్విమాసిక అంతర్జాల మాస్ పత్రిక మయూఖలో అందంగా ఆకర్షణీయంగా ప్రచురించిన గౌరవ సంపాదకులు
కొండపల్లి నిహారని గారికి, వారి కార్యవర్గ గౌరవ సభ్యులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.. రాథోడ్ శ్రావణ్ లెక్చరర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంద్రవెల్లి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ 504311
మయూఖ అంతర్జాల పత్రిక సంపాదకులు గౌరవ డా. కొండపల్లి నీహారిణి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు