Home Uncategorized గ్రీష్మ ఋతు (జూన్)మయూఖ సంపాదకీయం

గ్రీష్మ ఋతు (జూన్)మయూఖ సంపాదకీయం

by mayuukha

ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే ముందు మన అవగాహన ఎంత గా ఉంది అనేది కూడా ఒక అంచనా వేసుకోవాలి . అప్పుడే మనం అనుకున్నది ఏ స్థాయిలో ఉందో, మనమే స్థాయిలో ఉన్నామో తెలుస్తుంది . నిత్య జీవితంలో ఎన్నో విషయాలను మనసులో భద్రపరుచుకుంటాం. అప్పుడు తేదీల్లోని రోజులకు, సంవత్సరాలకు ఎంతో కొంత ప్రాముఖ్యత ను ఏర్పరుచుకుంటాం.
అట్లాగే ఇప్పుడు ఈ జూన్ జూలై నెలల్లో ను ముఖ్యమైన విషయాల తేదీలను జ్ఞానం తోనే కాదు హృదయం తోనూ తలుచుకునే ప్రయత్నం చేద్దాం.ఏప్రిల్ 22 వ తేదీని ధరిత్రి దినోత్సవం గానూ ,
గత నెల మే 1వ తేదీన కార్మిక దినోత్సవం విశేషంగానూ పాటించే విషయాలన్నీ వసంత ఋతువు లో చర్చించుకున్నాం.
అయితే ఇప్పుడు కేవలం దినోత్సవాల ప్రత్యేకత లు చెప్పడం కాదు ఇది. మానవ మనుగడకు కీలకం గా చెప్పుకునే యోగా గురించి , పెరుగుతున్న జనాభా గురించి పరామర్శించుకోవడం .

అంతరిక్ష గర్భాలను , భూ గర్భాలను శోధించే విజ్ఞానాన్ని సాధించిన మనిషి , తను నివసించాల్సిన భూమికి ,తన ఉనికికి ఏం ముప్పు కలుగబోతుందో తెలుసుకోలేకపోతున్నాడు. ఏదైనా నేర్పుతో కొంత వస్తుంది కానీ త్రికరణశుద్ధితో చేస్తే ఎంతో సాధించగలడు. తన కృషితో శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని అయితే సంపాదించుకున్నాడు గాని అది అతి పోకడలకు పోతే ఏం నష్టం కలుగుతుందో ఊహించడం లేదు . ఎంతసేపు వ్యక్తిగత జీవితం గురించే గాని నలుగురి గురించి ఆలోచించడం లేదు.

ఐదు వేల ఏళ్ళ క్రితమే యోగాను పరిచయం చేశారు మన భారతీయ ఋషులు. శరీరానికి మెదడుకు సమన్వయ సంబంధాలు బాగుండేలా అంటే మంచి కనెక్షన్ ఉండేలా చేస్తుంది యోగా. ఒక క్రమబద్ధమైన జీవన శైలికి అలవాటు చేస్తుంది యోగా. మానసిక శక్తి పెరుగుతుంది . ఎముకలు , కండరాలు బలపడతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఏ వ్యాధులు తొందరగా దరిచేరకుండా ఉంటుంది. . గుండె ఊపిరితిత్తులు సరిగా పని చేస్తాయి. జీర్ణక్రియ చక్కగా జరుగుతుంది,సమస్థితి తో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. కాబట్టి ఆకలి సరిగా అవడమూ, ఎంత తినాలో అంతే తినాలి అనే స్ఫురణ కు రావడం వీటివల్ల నిద్ర సరిగా పట్టడమూ వంటి ఆరోగ్య సూత్రాలకు సంబంధమైన ఉపయోగాలు ఎన్నో కలుగుతాయి . దీనితో మనసుకు స్వాంతన చేకూరుతుంది.
అయితే, యోగాను ఆధ్యాత్మిక ప్రయోజనం గానే గతంలో చూడటం వల్లనే జన సామాన్యులకు వెళ్లలేదు. కాని ‘యోగా‘ అంటే వ్యాయామ సాధనల సమాహారాల రూపం. యోగ మానవాళి భౌతిక మానసిక విలువలను సమతుల్యంగా ఉంచుతుందని తెలుసుకోవాలి. యోగ ఒక కళ . ఒక ఆరోగ్యకరమైన ప్రక్రియ . జీవనాన్ని ఉల్లాస పరిచే క్రియ. యోగ వల్ల వ్యక్తి చైతన్యం కలుగుతుంది దాని ద్వారా విశ్వ చైతన్యం కలుగుతుంది. ఇది గ్రహించే 2014 సంవత్సరంలో జూన్ 21వ తేదీని “అంతర్జాతీయ యోగా డే “నిర్ణయించి ఐక్యరాజ్యసమితి /యు యెన్ సంస్థ ఇలా యోగా కోసం ఒక ప్రత్యేక మైన రోజును ప్రకటించింది.
అలాగే జూలై 11వ తేదీని వరల్డ్ పాపులేషన్ డే ప్రపంచ జనాభా దినోత్సవం గా జరుపుకుంటున్నాము. ప్రపంచం మొత్తం మీద ఐదు మిలియన్ల జనాభాకు చేరుకున్నది అన్న స్పృహ తో భయం కలిగి, అప్పుడు 1987లో ప్రపంచజనాభా దినోత్సవం అనేది ఏర్పాటు చేయడమైంది . ఇప్పుడు మూడింతల జనాభా పెరిగింది. కాని తగ్గిందేమీ లేదు. పాపులేషన్ డే అంటే ఉత్సవంగా చేసుకొని జనాభాను అధికం చేయడం కొరకు కాదు, పాపులేషన్ నియంత్రణ కోసం అనేది అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఏర్పడింది. జంతుజాలానికే కుటుంబం అనేది ఉండగా ఇక మనుషుల మైన మనకు కుటుంబవ్యవస్థ లేకుంటే ఎట్లా! కుటుంబం అనడానికి వివాహం అనేది పునాది. తోడు నీడ ఉండాలి అనే కాన్సెప్టుతో పెళ్లి అనేది ముఖ్యం అనుకుని ఈ వ్యవస్థను ఏర్పరిచారు. మంచి ఉద్దేశంతో ఏర్పరిచింది కానీ కొందరు దురలవాట్ల తో దురుద్దేశాలతో దీనిని భ్రష్టు పట్టిస్తున్నారు .కుటుంబ వ్యవస్థ ను గుర్తించి , ప్రపంచం లోని అన్ని మతాలవారు ఈ కుటుంబ వ్యవస్థ ను పాటించి , ఇప్పుడు నియంత్రణను కూడా ఒప్పుకుని , సముచిత స్థానాన్ని ఇస్తున్నారు. కేవలం కొన్ని మతాలలో మూఢత్వం తో కుటుంబ నియంత్రణ చేయవద్దని మొండి గా వాదిస్తుంటారు. వారు తప్పకుండా ఆలోచించాల్సిన విషయమే ఇది.
కుటుంబంలో సభ్యులు పెరగడం వలన సంపాదన ఎక్కువ అవుతుంది అనే ఆలోచనతో కంటారు, అంటే సంపాదించే చేతులు ఎక్కువవుతాయి అని అనుకుంటారు . కానీ , కుటుంబం పెరగడం వలన ఈ పావర్టీ అనేది ఎక్కువ అవుతుంది .
మరీ వింతైన విషయం ఏమిటంటే అమ్మాయిలు పుడితే అబ్బాయిలు పుట్టేదాకా కనడం అనేది. ఇంకా ఏ కాలంలో ఉన్నారో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆడపిల్ల అయినా మగపిల్లవాడు ఐనా తల్లిదండ్రులను వృద్ధాప్యం లో చూసుకోగలరు అది పెంపకం లో ఉంటుంది. దీని విషయం లో ప్రభుత్వాలు , సంస్థ లు , సంఘం సేవకులు ప్రజల లో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలి. ఇంట్లో సంతానం ఎక్కువైతే ప్రపంచం లో జనాభా ఎక్కువ అవుతుంది.
జనాభా ఎక్కువ అవడం వలన అన్నీ నష్టాలే , కష్టాలే. వస్తు వినియోగాలు పెరుగుతున్నాయని ఉత్పత్తులు పెంచడం , దీనితో పొల్యూషన్ పెరగడం . గ్లోబల్ వార్మింగ్ అనేది ఎంతో ముఖ్య విషయం అయ్యింది . ఉదాహరణకు ప్లాస్టిక్ వినియోగం తీసుకున్నట్టయితే , ఎలిమినేట్ యూజ్ ఆఫ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్ అనేది వచ్చింది . అంటే ప్లాస్టిక్ బ్యాగులను ఇంటికి తీసుకువచ్చి ఒకసారే వాడి పడేయకుండా దాన్ని మళ్ళీ మళ్ళీ ఉపయోగించి ఇక అది పనికిరాదు అనుకున్నప్పుడే పడవేయడం . ఎన్నో ఏళ్ల క్రితం పాతిన దైనా ప్లాస్టిక్ అనేది భూమిలో కరిగిపోని వస్తువు. ఇది భూ పర్యావరణానికి హాని చేస్తుంది . అంటే తద్వారా మానవాళికి హాని జరుగుతుంది అని అర్థం. దీన్ని కంట్రోల్ చేయడం కొరకు జూలై 3ను వరల్డ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఫ్రీ డే గా ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ లేని జీవితాన్ని ఊహించడం కష్టమై పోయిన కాలమిది. ఈ సమస్యల నుండి బయట పడడానికి కొత్త కొత్త ప్రయోగాలు శాస్త్రజ్ఞులు చేయవలసి వస్తున్నది . ఇందులో భాగంగా , ప్లాస్టిక్ అనేది నాన్ బయోడిగ్రేడబుల్ థింగ్ కాబట్టి దాన్ని అంటే వాడి పడేసిన ప్లాస్టిక్ ను సిమెంటు లో కలిపి రహదారి రోడ్డు వేయడానికి వాడుతున్నారు. ఇలా ఒకదానితో మరొకటి ముడిపడి సమస్యలు , పరిష్కారాలు ఇదే నేటి గ్లోబలైజేషన్ కు కారణం అవుతున్నాయి.
ఇవన్నీ , ఈ నష్టాలన్నీ తగ్గాలంటే పచ్చదనంతో కళకళలాడే గృహ వాతావరణం, మహా వృక్షాల సమేతమైన మహారణ్యాల పెంపకం పైన దృష్టి పెట్టాలి. ఇదే తక్షణ కర్తవ్యం.
**

మయూఖ పత్రిక పాఠకులకు కొన్ని విషయాలు:-
మయూఖ పత్రిక open చేయగానే సంపాదకీయం పైన కుడివైపు చిన్న 3 గీతలు ఉంటాయి వాటిని క్లిక్ చేస్తే విషయ సూచిక వస్తుంది. మీకు వరుసగా కవితలు, వ్యాసాలు, కథలు, అనువాద సాహిత్యం, బాల సాహిత్యం, పుస్తక సమీక్ష లు , ఇంద్రధనుస్సు , ధారావాహిక నవల వంటి విషయాలు కనిపిస్తాయి. ఏది చదవాలనుకుంటే దానిపైన క్లిక్ చేస్తే అవి వస్తాయి . ఇంద్రధనుస్సు లో వివిధ కళ లో సమాహారం గా , సినీ గేయ విశ్లేషణ , కార్టూన్లు, చురకలు, యాదాద్రీశ వైభవమ్,అనర్ఘరత్నాలు, గళ్ళ నుడికట్టు వంటి అంశాల తో ఉంటుంది .
పాత సంచికలు చదవాలంటే స్క్రీన్ ను పైకి జరిపితే కనిపిస్తాయి . ఏ రచయిత పేరు పైన క్లిక్ చేస్తే ఆ రచయిత ఇదివరకు రాసిన అంశాలు కూడా వస్తాయి. స్క్రీన్ పైకి అంటుంటే పాత ఆర్టికల్ లు వస్తాయి. మీ అభిప్రాయాలు పెట్టవచ్చు.
తెలుగు సాహిత్యం కోసం కృషి చేస్తున్న మయూఖ పత్రిక తెలుగు వారి సాహిత్యాభిలాష కోసమే పనిచేస్తున్నది. మీ మీ రచనలను
mayuukhathemagazine@gmail.com కు పంపించ గలరని మనవి చేస్తున్నాను.
మరో విషయం మయూఖ వచన కవితల పోటీ లో బహుమతులు గెలుచుకున్న కవితలను ప్రత్యేక సంచికగా తీసుకొస్తాము అని తెలియజేస్తున్నాను .
*_

You may also like

Leave a Comment