తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ ఒక గొప్ప వేడుక. వర్షాకాలపు చివరలో, శీతాకాలపు తొలి రోజుల్లో వచ్చే బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంత సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ప్రకృతి వివిధ వర్ణ శోభితమై అలరిస్తూ ఉంటుంది. రకరకాల పూలతో తయారు చేసే బతుకమ్మలు లక్ష్మీదేవి పార్వతీదేవి అంశం గారు ప్రకృతికి ప్రతిరూపం గానూ భావిస్తారు. కాలం స్త్రీ పురుషరూపాత్మకమై చైత్రం మొదలు భాద్రపదం వరకు సగభాగం పురుష రూపాత్మకంగా మరో సగభాగం అశ్వయుజ మాసం మొదలు పాల్గొన మాసం వరకు గల కాలం స్త్రీ రూపాత్మకం. స్త్రీ రూపాత్మకమైన ఆశ్వీయుజ పార్టీ మీ నుండి తొమ్మిది రోజులు శక్తి ఆరాధన జరుగుతుంది. శరదృతువులో బంతి చామంతి గునుగు పూలు తంగేడు గోరింటా మొదలైన పూలు విరబూస్తాయి ఆడపిల్లలు ఈ పువ్వులను సేకరించి అందమైన రూపం ఇచ్చి ‘ ‘బతుకుఅమ్మా’ అని అమ్మవారిని కీర్తిస్తూ ఆడి పాడుతారు.
సద్దుల బతుకమ్మ రోజున ప్రొద్దున్నే మగవారు తంగేడు, గునుగు,గోరింటా గన్నేరు,కట్టెపువ్వు,బంతి, చామంతి మొదలైన పువ్వులు తీసుకొస్తారు. ఇత్తడి పళ్లెం లేదా తాంబాలములో గుమ్మడి లేదా బాదాం ఆకులను పరిచి, వాటిపై గుండ్రంగా తంగేడు పూల వరస చుట్టి తరువాత గుమ్మడి, గునుగు,కట్ల, రుద్రాక్ష, మంకెన,మల్లె,బంతి,చామంతి మందార, పోకబంతి పూలతో వరుసలు పేర్చి బతుకమ్మను అందంగా గుడి గోపురంలా పేర్చుతారు గునుగు పూలకు రంగులు అద్ది దొంతరలుగా పేర్చడం మధ్యలో ఏర్పడిన ఖాళీ స్థలంలో తంగేడు ఆకుల్ని నింపుతారు. బతుకమ్మ శిఖర భాగంలో తంగేడు పూలు పరచి అందులో పసుపు గౌరమ్మను తమలపాకులో ఉంచి దేవుడి ముందు ఉంచుతారు. వత్తి పత్తిని బతుకమ్మకు నాలుగు వైపులా అలంకరిస్తారు. బతుకమ్మను జంటగా పేర్చడం ఆచారం వాటిలో పెద్దది తల్లి బతుకమ్మ చిన్నది పిల్ల బతుకమ్మ అంటారు. తర్వాత పులిహోర దద్దోజనం రొట్టెలు బెల్లంతో చేసిన మలేదా అనే లడ్డూలు మొదలైన సభ్యులు తయారుచేసి బతకమ్మ ముందు పెట్టి దీపం పెడతారు. సాయంత్రం కొత్త బట్టలు కట్టుకొని ఇంటిముందు ముగ్గుపెట్టి ఈ బతుకమ్మను మధ్యలో ఉంచి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాడుతూ చుట్టూ తిరుగుతూ ఆడుతారు ఇరుగుపొరుగు మహిళలు కూడా తమ బతుకమ్మలను తీసుకొచ్చి కలుపుతారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఒక్కటే ఐక్యత ప్రేమతో కలిసి దైవదంగా చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ ఆడతారు.
చీకటి పడుతుండగా తమ ఆటలను ఆపి బతుకమ్మలను చేతిలో కానీ తలమీద కానీ పెట్టుకుని అందరూ కలసి ఊరేగింపుగా వెళ్లి ఊరి చెరువులో గాని బావిలో గాని నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పైన పెట్టిన గౌరమ్మను తీసుకుని ముత్తయిదువలు తమ ఐదోతనాన్ని కాపాడమని మంగళ సూత్రాలకు రాసుకుంటారు ఆ తర్వాత సద్దులను తిన్నాక ఇంటి దారి పడుతూ,తిరుగు ప్రయాణంలో మళ్లీ పాటల సందడి మొదలవుతుంది. బతుకమ్మ పండుగ కొత్త జీవన స్ఫూర్తిని నింపుతుంది.