Home వ్యాసాలు మహోన్నత వ్యక్తి గుంటూరు శేషేంద్ర శర్మ

మహోన్నత వ్యక్తి గుంటూరు శేషేంద్ర శర్మ

by Cheedella Seetha Lakshmi

ఈయన రచనలు చదివి ముగ్ధులై అనేకమంది తమ అభిప్రాయాలను లేఖాముఖంగా వెల్లడించారు. శేషంద్ర కావ్యభూమిక (చర్చలు,లేఖలు) యుగ కవి శేషేంద్ర చర్చలు, లేఖలు ఈకోవకు చెందినవే పుస్తక రూపంలో ప్రకటించబడ్డాయి. కానీ స్వయంగా శేషేంద్ర ఉత్తరాలు అంటూ ఏమీ లేవు. శేషేంద్ర కావ్య ప్రశంస, రచనా తీరుతెన్నులు, కావ్య జగత్తులో శేషేంద్ర స్థానం మొదలైనవి లేఖల వల్ల తెలిసే అవకాశం ఉంది.

“నా దేశం నా ప్రజలు” శేషేంద్ర కలం నుండి జాలువారిన కృతి. ఈ కావ్యం హిందీ భాష లోకి “మేరీ ధర్తీ మేరీ లోగ్” పేరుతో ఓం ప్రకాష్ నిర్మల్ గారు అనువాదం చేయగా “My country my People” అను పేరుతో శేషేంద్ర స్వయంగా ఇంగ్లీషులోకి అనువాదం చేసి అంతర్జాతీయ ఖ్యాతి పొందారు.

నా దేశం నా ప్రజలు కావ్యం పై పలువురి అభిప్రాయాలు:

“ఆర్.ఎస్. సుదర్శనం”: వచన కవిత్వం కాదు ప్రవచన కవిత్వమని చెబుతూ “ఎత్తుగడలో దృక్పథంలో, ఇతివృత్తంలో, నిర్మాణ సౌష్టవంలో విలక్షణమైన నూతన సృష్టి అని ప్రస్తుతించాడు.

“అమరేంద్ర”: కవిత్వం బాగుందని మెచ్చుకుంటూనే రసావేశం ఒక ఇతివృత్తంలో ఒదిగితే ఇతిహాసానికి పరిపూర్ణత రాగలరని నా భావం” అంటూ విమర్శించారు.

“అద్దేపల్లి రామ్మోహన్ రావు”:

ప్రతి పంక్తిలో కవిత్వం ఉందంటూ “సింబాలిక్ గా మిస్టిక్ గా ఇమేజిస్టిక్ గా మీరు చెబుతున్న భావాలు పతితలో గొప్ప అనుభూతిని కలిగించగలవు” అంటాడు.

మాదిరాజు రంగారావు “ఆధునిక చైతన్యానికి ప్రతినిధి”ఈ కావ్యం అంటాడు.

“అనుముల కృష్ణమూర్తి”:

“ఆగమైన ఆంధ్రాన్ని మరింత ఆగం చేసి కోతిలా ఆడిస్తున్నారు గాడిద కొడుకులు. వాల్మీకి, భవభూతుల అంశతో ఈ కాలంలో జన్మిస్తావా… ఆంధ్రప్రభ లో ఇద్దరు పచ్చి బజారు లంజల మధ్య ఎగతాళికి గురైన ఏ పార్వతి తల్లి వలెనో ఉంది నీ కవిత” అనే భావాన్ని వ్యక్తపరుస్తూ ఎంతో విన్యాసం చూపిస్తూ రచన చేశాడు అంటాడు.
ఈ కాలంలో కవిత్వం సరిగా రావడం లేదు. శేషేంద్ర కవిత్వం చాలా గొప్పదని ప్రస్తుతించాడు.

డాక్టర్ భాను “ఒక మాటలో చెప్పాలంటే ఒక చెంబులో అంబుధి ఇముడుస్తాడు వాస్తవ మానవతను ధరిస్తాడు” అని వివరించాడు.
ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి:
“ప్రాక్ పాశ్చాత్య సాహిత్య పరిజ్ఞాన సమృద్ధి ఇందులో స్ఫుటంగా కనబడుతుంది” అని ఆవేశం, ఆలోచన మీ కవిత్వంలో ఉందని అంటాడు.

మండే సూర్యుడు కావ్యం పై పలువురి అభిప్రాయాలు:

“నాగభైరవ కోటేశ్వరరావు”:

“తన కవితా కిరణ సందోహంతో కవితాప్రియుల జడత్వాన్ని మంచులాగా కరిగించాడు. నిజమైన కవితానందాన్ని అందించాడు”. అంటూ ఈ కవిత్వంలో సింబాలిజమ్ ఉంది అని చెప్పాడు. నాగరికతకు మూలం శ్రమ, చెమట బిందువు అని కవి విశ్వాసం. చెమటబిందువు శ్రమజీవికి ప్రతీక. శ్రమజీవి మండే సూర్యుడు. శ్రమజీవి లోక శ్రేయస్సును కోరినట్లే మండే సూర్యుడు లోక కళ్యాణ కారకుడే.

“కలచవీడు మురళీధర్”:

“నూతన దృక్పథంతో ప్రాచీన నవ్య రీతులను మేళవించి విప్లవ పంథాలో నడిపిన గేయ సంకలనం”అంటాడు.

“రక్తరేఖ పై పలువురి అభిప్రాయాలు

శేషేంద్రగారి డైరీయే రక్తరేఖ
మాలతీ చందూర్ గారు 1952-74 మధ్య కాలంలో “మీ ఊహల్లో విహరించిన విహంగాలకు, ఆలోచనలకు
నిక్షిప్తం చేసిన ఈ రచన హృదయ కమలాన్ని అరుణ కిరణంతో స్పందింపజేసే రక్తరేఖ” అంటారు.

జానకీ జానీ గారు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ అందరూ కవులమని చెప్పుకుంటారు కానీ,వివిధ విషయాల మీద నిర్దిష్టమైన అభిప్రాయాలు కలిగి ఉన్నవాళ్లు అరుదు అంటారు.

“ఋతుఘోష కావ్యం పై అభిప్రాయాలు:

శ్రీ శ్రీ తన అభిప్రాయాన్ని కవిత రూపంలో వెల్లడిస్తూ “నీ పోయెమ్స్ నన్ పసంద్ చేసేన్”అంటూనే

“శ్రీనాధుని క్రీడల్లో
అల్లసాని వాడల్లో
కూడా దొరకని పద చిత్రం
విచిత్రం కడు పవిత్రం
ధుమాగా ఉంది ఇమేజి రమారమి కవుల సమాధి”

అంటూ శేషేంద్ర గారి నూతన పద వైచిత్రీ ప్రయోగాన్ని ప్రశంసించాడు.

పుట్టపర్తి నారాయణ చార్యులు గారు తన అభిప్రాయం తెలుపుతూ:

పింగళి సూరన, నన్నయ, తిక్కన, శ్రీనాథులను శేషేంద్ర పుణికి పుచ్చుకున్నాడు అని అంటూ “శర్మ గారికి ప్రాచీన సాహిత్యం పై గౌరవం ఉంది,నవకవులపై సానుభూతి ఉంది. ఆస్తికత ఉంది. సంశయమూ ఉంది. బీదలపై సానుభూతి, వారు బాగుపడలేదేమోనని అక్కసూ,కర్మవాదంపై విశ్వాసమూ ఇన్ని భావాల మధ్య నలిగిన, నలుగుతూ ఉన్న ఆత్మ పెట్టే ఘోష “ఋతుఘోష” అని వ్యాఖ్యానించారు.

“ఆచంట జానకిరామ్ గారు”: ఋతుఘోష కావ్యాన్ని ఋతువులను వర్ణిస్తూ
ప్రతి ఋతువు చివర ఒక పద్యమో రెండు పద్యాలో బీదవారి గురించి, అనాధల గురించి,ఆకలి దప్పికలతో అలమటించే వారిని గురించి జాలికరమైన, ఒక్కొక్కప్పుడు బాధాకరమైన వర్ణన ఉంటుంది. నా దృష్టిలో ప్రధానంగా ప్రకృతి రమ్యతను గురించిన ఈ కావ్యం లో అటువంటి ప్రస్తావన తెచ్చి పెట్టుకున్నట్లు ఉంటుంది. ఆ విషయాలను గురించి వేరే రచనలు సాగించవచ్చు. తీరిక ఉండి, ఓపిక ఉంటే. కానీ ఇక్కడ అవి పానకంలో పుడకలు లాగా అడ్డు తగులుతూ ఉండటమే కాక ఈ సందర్భంలో అటువంటి ప్రస్తావన
చేస్తున్నప్పుడు కవికి సహజంగా ఉండవలసిన నిజాయితీ కొంత కొరవడుతున్నట్టు తోస్తుంది” అని విమర్శల వర్షం గుప్పించారు.

“శశాంక గారు” శర్మ గారిని కవి పండితుడని అంటూనే పశ్చిమాన బిఎస్ ఇలియట్ తోనూ,తూర్పున జగన్నాధ పండితరాయలతోనూ పోల్చవచ్చును అంటారు.

స్వర్ణ హంస గ్రంథం పై అభిప్రాయాలు:

సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి గారు భట్టహర్షనైషద కావ్యమును గూర్చి వ్రాయబడిన విమర్శ గ్రంథం అని అంటూనే ఇది
“పీహెచ్ డి” డిగ్రీ కొరకు రాయబడిన విమర్శ వ్యాసం వలె ఉన్నది అని అభిప్రాయపడ్డారు.

_కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి” గారు నైషధీయ చరిత్రము అనగా జీవుని చరిత్ర మనియూ, హంస గమనము యోగానుష్టానమనియూ చెప్పి కావ్య గత శ్లోకార్థాలను వివరించే పద్ధతి శాస్త్ర సమ్మతముగా ఉందన్నారు.

నరుడు నక్షత్రాలు గ్రంథం పై విమర్శ:

ఇది వ్యాసాల సంపుటి. చక్కని విమర్శనాత్మక, పరిశోధనాత్మకమైన వ్యాసాలని శివప్రసాద్, జగన్నాథ్ సూచించడం జరిగింది లేఖల ద్వారా.

ఈ విధంగా పరిశీలించినట్లయితే కేవలం శేషంద్ర కావ్యాలపై వచ్చిన అభిప్రాయములకే ఈ లేఖలు పేర్కొనడం జరిగింది అని చెప్పవచ్చు.

శ్రీశ్రీ,విశ్వనాథ,జలసూత్రం, సన్నిధానం,దివాకర్ల, పుట్టపర్తి, వేలూరు శివరామశాస్త్రి ఇలా ఎంతోమంది విజ్ఞుల చేత కొనియాడబడటం బట్టి శేషేంద్ర రచనా వైభవాన్ని అంచనా వేయవచ్చు.

ఇలా ఆఫునిక కవులలో, పండితులలో శేషేంద్రకు గల సముచిత స్థానం ఈ లేఖల ద్వారా విదితమవుతుంది.

జీవన చిత్రం

తెలుగు సాహిత్యంలో తనదైన బాట వేసి నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అంటూ ఒకే పాటతో తెలుగు సినిమా పరిశ్రమలో తన పేరు నమోదు చేసుకున్న ప్రముఖ రచయిత,విమర్శకుడు ఆధునిక సాహిత్య పోకడలు రుచి చూపిన డా.గుంటూరు శేషేంద్ర శర్మ నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా లోని నాగరాజుపాడు గ్రామంలో సుబ్రహ్మణ్య శర్మ,అమ్మాయమ్మ దంపతులకు 1927 సంవత్సరం అక్టోబర్ 20 వ తేదీన జన్మించాడు.
గుంటూరు ఏ సి కళాశాలలో డిగ్రీ చేసి మద్రాసు లా కళాశాలలో లా డిగ్రీ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఎన్నో రచనలు చేసిన గొప్పకవి.వక్త,విమర్శకుడు.
ఎన్నో పురస్కారాలు,అవార్డులు శేషేంద్రను వరించాయి.కేంద్రసాహిత్య అకాడమీ అవార్డ్,భారత ప్రభుత్వ రాష్ట్రేన్రు బిరుదును, కలకత్తా రాష్ట్రీయ హిందీ అకాడమీ అవార్డును, తెలుగు విశ్వవిద్యాలయం వారిచే గౌరవ డాక్టరేట్ ను పొందారు సంస్కృత, ఆంధ్ర ,ఆంగ్ల భాషల్లో పండితులైన శేషేంద్ర పద్యరచన, వచన కవిత్వం రెండింటిలో సమాన ప్రతిభ చూపిస్తూ ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాజనిత కవి. ఈయన ప్రత్యేకత వచన కవిత్వానికి కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రుడు. ఇంత గొప్ప మహాకవి 2007 మే 30వ తేదీ గుండెపోటుతో కన్నుమూశారు.అయినా ఆయన రచనల ద్వారా చిరంజీవి.

కేంద్ర సాహిత్య అకాడమీ వారు ప్రకటించిన అవార్డు శేషేంద్ర కీర్తికిరీటంలో కలికితురాయి. ఈయన ఆధునిక కాలంలో జీవించి ఉన్న ప్రసిద్ధ ఆంధ్ర కవులలో మహోన్నత వ్యక్తి ( లెజెండ్) గా పేర్కొనవచ్చును.

డా.చీదెళ్ళ సీతాలక్ష్మి
విశ్రాంత సహాయ ఆచార్యులు

You may also like

2 comments

డా చీదెళ్ళ సీతాలక్ష్మి November 25, 2023 - 3:22 am

చాలా బాగుంది వ్యాసం.గుంటూరు శేషేంద్ర శర్మ గారి కెఖలపై సమగ్ర వ్యాసం..

Reply
Saatyaki S/o Seshendra Sharma November 5, 2024 - 4:17 am

సహస్రాబ్ది దార్శనిక కవి
కవిర్విశ్వో మహాతేజా
గుంటూరు శేషేంద్ర శర్మ
Seshendra: Visionary Poet of the Millennium
http://seshendrasharma.weebly.com/

జననం 1927 అక్టోబరు 20నాగరాజపాడు, నెల్లూరుజిల్లా

మరణం 2007 మే 30 (వయసు 79)హైదరాబాదు

తండ్రి సుబ్రహ్మణ్య శర్మ
తల్లి అమ్మాయమ్మ
భార్య / జానకి
పిల్లలు వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు)

కవి విమర్శకుడు
ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ…………… గుంటూరు శేషేంద్ర శర్మ కవిగా , విమర్శకుడిగా , దార్శనికుడిగా వింధ్య పర్వతం లాంటి వారు .
– ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
(21 ఆగస్టు, 2000)
“ఆధునిక తెలుగు కవిత్వానికి శేషేంద్ర అనే ఒక అభివ్యక్తి అలంకారాన్ని కానుక చేసి అద్వితీయ స్థానాన్ని పొందిన కవి శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ. భాషలో, భావంలో దృక్పథ ప్రకటనలో కవి కుండాల్సిన నైతిక ధైర్యం ఆయన రాసిన ప్రతిపాదంలోనూ కనిపిస్తుంది. కవి సామాజిక, సాంస్కృతిక నాయకుడై జాతిని నడపాలని భావించిన శేషేంద్ర కవిసేన పేరుతో ఒక మహా ఉద్యమాన్నే నడిపారు. సాహిత్య రంగంలో శేషేంద్ర ఎప్పుడూ ఒక సంచలనమే. సొరాబు నుంచి ఆయన ఆధునిక మహాభారతం దాకా గరీబు వెంట నడిచారు. ఆయన అభివ్యక్తి ప్రభావానికి లొంగని కవులు తెలుగులో అరుదుగా కనిపిస్తారు.
– పుస్తకం.నెట్

* * *
పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు.
భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు,
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు.
గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.
నాదేశం – నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు.
కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు.
ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు,
వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు,
ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.
బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.
ఒకానొకశైలీనిర్మాత.

– యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం)
అ.జో. – వి. భొ. ప్రచురణలు 1999
———–
అధునిక వాగనుశాసనుడు శేషేంద్ర
“గుంటూరు శేషేంద్ర శర్మ నా దేశం నా ప్రజలు (1975) ఆధునిక ఇతిహాసంగా చెప్పబడింది. అభివ్యక్తిలో, ఆలంకారికతలో, వస్తు విన్యాసంలో కవి తనదైన వ్యక్తిత్వాన్ని ముద్రించుకున్నాడు. విప్ణవభాషా విధాతగా పేరుగన్నాడు. ఈయన కవిసేన మేనిఫెస్టో (1977) పేరుతో ఆధునిక కావ్యశా!స్తాన్ని కూడా రచించి నేటి యువతరాన్ని ఆకర్షిస్తున్నాడు. పద్యాల్గో వచన కవితా ప్రక్రియలో కావ్యాలనేకంగా రచిస్తూ సమకాలిక కవితారంగంలో శిఖరాయమానంగా వెలుగుతున్నాడు. కొంగ్రొత్త (ప్రయోగాలతో కావ్యభాషా స్వరూపంలో మార్చుతెస్తున్న ఆధునిక వాగనుశాసనుడు శేషేంద్ర.”
ఆచార్య పేర్వారం జగన్నాథం
సంపాదకుడు
అభ్యుదయ కవిత్వ్యానంతర ధోరణులు,
(ప్రచురణ 1987)
మాజీ వైస్ ఛాన్సలర్,
తెలుగు యూనివర్సిటీ)
Visionary Poet of the Millennium
seshendrasharma.weebly.com

Reply

Leave a Comment