Home వ్యాసాలు 84 వేల మంది మునులున్న నైమిశారణ్యం ఎక్కడుంది ? విశిష్టత ఏమిటి !?

84 వేల మంది మునులున్న నైమిశారణ్యం ఎక్కడుంది ? విశిష్టత ఏమిటి !?

మనకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ నైమిశారణ్యములో సూత మహర్షి శౌనకాది మునులందరికీ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహత్యం చెప్పినట్లుగా చెబుతారు. ఈ విషయం మనం విన్నదే ! మనకు తెలిసిందే ! ఈ నైమిశారణ్యం ఎక్కడుంది ? నైమిశారణ్యం విశిష్టత ఏమిటి ? ఈ వ్యాసంలో తెలుసుకుందాం !!

నైమిశారణ్యంలోనే మహాభారతాన్ని రచించినట్టు తెలుస్తోంది. మహా భారతం, రామాయణం, వాయుపురాణం, వరాహపురాణాల్లో నైమిశారణ్య ప్రస్తావన ఉంది. వేదవ్యాసుడు వేదాలను, అన్ని పురాణాలను తన శిష్యులకు బోధించిన పరమ పావన ప్రదేశం నైమిశారణ్యం.

నైమిశారణ్యం వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి. ఇక్కడ వనరూపిగా నున్న స్వామికే ఆరాధన జరుగుతుంది. ఆళ్వార్లు కీర్తించిన సన్నిధిగాని పెరుమాళ్ళు గాని ఇక్కడ లేవు. నైమిశారణ్యం ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో లక్నోకు 94కి.మీ. దూరంలో ఉంది. గోమతి నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం వేలాది సాధు సన్యాసులు తపమాచరించే పవిత్ర ప్రదేశం.

నైమిశారణ్యం చరిత్ర

ఆదిలోకంలో లోకహితార్ధమై బ్రహ్మమనోమయమగు నొక చక్రమును గల్పించెను. ఆ చక్రమును సత్యలోకమునుండి దొర్లించెను. (నేమి అంటే బండి చక్రపు కమ్మి అని అర్ధం) ఆ చక్రము దొర్లి దొర్లి అన్ని లోకములు దాటి భూలోకమునందు వ్రాలెను. అమిత వేగమున వచ్చి వచ్చి భూమిట్ట పల్లములలో చక్రముకమ్మి విచ్చి పోయిన ప్రదేశములో “నైమిశ” మయ్యెను . ఆ ప్రదేశములోని వనము గూడ నైమిశారణ్యమయ్యెను.

వాయు పురాణాన్ని అనుసరించి దీనికి సంబంధించిన ఒక గాథ ప్రాచుర్యంలో ఉంది. మహాభారత యుద్ధం అనంతరం కలియుగ ఆరంభం అయే సమయంలో శౌనకాది మహామునులు కలియుగ ప్రభావం లేని పవిత్ర ప్రదేశాన్ని తాము యజ్ఞం నిర్వర్తించుకునేందుకు చూపమని బ్రహ్మను ప్రార్థిస్తారు. బ్రహ్మ ఒక పెద్ద చక్రాన్ని సృష్టించి ఈ చక్రం వెంట కదిలివెళ్ళండి ఈ మనోమాయా చక్రం ఏ ప్రదేశంలో ఆగి విరిగిపోతుందో ఆ ప్రదేశం చాలా పవిత్రమైనది, యజ్ఞర్హత గలది అని చెబుతాడు. మునులంతా చక్రాన్ని అనుసరించి వెళ్ళగా ఈ నైమిశారణ్య ప్రాంతంలో ఒకచోట చక్రం ఆగి విరిగిపోతుంది. చక్రం విరిగిన ప్రదేశంలో ఉదృత రూపంలో జలం ఉద్భవించి లింగాకృతిలో పొంగిప్రవహిస్తుంది. మహాశక్తి ఆ ప్రవాహాన్ని ఆపివేస్తుంది. ఈ పవిత్ర ప్రాంతం శక్తిపీఠంగా రూపొంది లింగధారిణి శక్తి రూపం అయిన లలితా దేవి ఆలయంగా పేరుగాం చింది. చక్రం ఆగిన ప్రదేశం చక్రతీర్థం అయింది.’నిమి’ అంటే చక్రకైవారం, అరణ్యం – అడవి. చక్రం విరిగిన అరణ్యం కనుక నైమి శారణ్యంగా పేరుగాంచింది. వరాహ పురాణం ప్రకారం లిప్త కాలంలో విష్ణువు అసురు లను ఈ ప్రాంతంలో సం హరిస్తాడు. నిమి (లిప్త) అంటే సెకండులో అసురుల్ని సంహరించిన ఈ అరణ్యం నైమిశారణ్యంగా పేరొందినదని పేర్కొన బడింది. ఇక్కడే వ్యాస పీఠం, దధీచి కుండం ఉన్నాయి. శ్రీ ఆదిశంకరులు ఇక్కడి లలితాదేవిని దర్శించి ‘లలితా పంచకాన్ని’ రచించినట్టు చెబుతారు.

వేల సంవత్సరాలు ఋషులు, మునులు తపస్సు చేసిన తపోవనం ఇది. పరమ పవిత్ర దివ్య ప్రదేశం నైమిశారణ్యం. చక్రతీర్థం ఒడ్డున చక్రత్తాళ్వారు, వినాయక, శ్రీరామ లక్ష్మణ సీతా ఆలయాలు ఉన్నాయి.

గోముఖినది మార్గంలో వ్యాస ఘాట్ ఉంది. మరోవైపు శుకమహర్షి ఆలయం ఉంది. ఈ ఆలయానికి దగ్గరలో కొండపై ఆంజనేయ ఆలయం ఉంది.

నైమిశారణ్యం దివ్య దేశంలోని మూల విరాట్టు దేవరాజన్. శ్రీమన్నారాయణుడు. తూర్పుముఖంగా ఉన్న ఈ ఆలయం లోని అమ్మవారు పుండరీకవల్లిగా పూజలందుకుంటోంది. చక్రతీర్థం, గోముఖినది, సెమీతీర్థం, దివ్యవిశ్రాంత తీర్థాలలో స్నానం పవిత్రతను అందిస్తాయి.

శివపురాణంలో కూడా నైమిశారణ్య ప్రస్తావన ఉంది. అప్పటి పాంచాల, కోసల రాజ్యాల మధ్యన నైమిశారణ్యం ఉండేది. ఫాల్గుణ మాసంలో ఇక్కడ వైభవంగా ఉత్సవాలను నిర్వహి స్తారు. ఈ ఆలయం చుట్టుప్రక్కల పంచప్రయాగ, వ్యాసగడి, సూతగడి, చక్రతీర్థం, శ్రీహనుమగడి, పంచ పాండవ, శంకర మందిరాలు, వటవృక్షం, గోమతినది, దధీచి, సీతారామ ఆలయాలు ఉన్నాయి.

చక్రతీర్థం, శ్రీహనుమగడి, పంచ పాండవ,శంక మందిరాలు,వ్యాసగద్దె, సూతగద్దె, గోమతి నది, దేవరాజేశ్వరమందిరం, ఆనందమయి ఆశ్రమం, సేతుబంధరామేశ్వరం, దధీచి, సీతారామ మొదలైనవి ఉన్నాయి.రుద్రావర్తము అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ నీటిలో పాలు అభిషేకిస్తే ఆ పాలు నీటిలో కలవకుండా క్రిందకువెళ్ళిపోతాయని విశ్వసిస్తున్నారు. ఆ అడుగున శివమూర్తి ఉంది.
నైమిశారణ్యం,విశేషాలు, విశిష్టతలు
నైమిశారణ్యములో వర్ణించబడిన చెట్లు, వృక్షాలు, లతలు. సరళ,తెల్ల తెగడ, కొండగోగు,ఉమ్మెత్త, దేవదారు, చండ్ర, మామిడి, నేరేడు, వెలగ, మర్రి, రావి, పారిజాత, చమ్దన, అగరు, నకుల (పొగడ),ఏడాకుల పొన్న సప్తవర్ణ , పునాగ, సురపొన్న, నాగకేసర నాగకింజల్కము నాగకేసర , శాల,తాటి, తమాలము (చీకటిమాను), మద్ది, చంపక సంపెంగ.

నైమిశారణ్యం ఆలయం ఎనిమిది స్వయంవ్యక ఆలయాలలో ఒకటి. శ్రీరంగం, శ్రీముష్ణం, సాలగ్రామం, తోతాద్రి, తిరుమల, పుష్కరం, బద్రి, నైమిశారణ్యం ఇవి స్వయంవ్యక్త ఆలయాలుగా పేరుగాంచాయి.నైమిశారణ్యం తొమ్మిది తపోవనాల్లో ఒకటి. దండకారణ్యం,సైంధవారణ్యం, జంబుకారణ్యం,
పుష్కరారణ్యం, ఉత్పలారణ్యం, బదిరికారణ్యం, జంగాలారణ్యం, అరు పుత్తరణ్యం, నైమిశారణ్యం ఇవి తొమ్మిది తపోవనాలు. గయ క్షేత్రం చరణ గయగా, బద్రిశిరోగయ, నైమిశారణ్యం నాభిగయగా పేరుగాంచాయి. ఇక్కడ ఉన్న గోమతినదీ స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు.

ఇక్కడక మిశ్రిక్ అనే ప్రాంతంలో దధీచి కుండం ఉంది. ఇంద్రుని కోరికపై వృత్రాసురుణ్ని వధించేందుకు మహర్షి దధీచి ఈ కుండంలో స్నానం చేసి తన ఎముకలను వజ్రాయుధంగా మలచి ఇంద్రునికి సమర్పించి త్యాగజీవి అయ్యడు.

శ్రీరాముడు….

శ్రీ రాముడు అశ్వమేధ యాగం చేసినదీ. లవకుశులను కలుసుకున్నది ఇక్కడే. సీతాదేవి పేరున శ్రీరాముడు బ్రాహ్మణులకు దానం చేసిన గ్రామమే నేటి ‘సీతాపురం’ అని అంటారు. శుక్రాచార్యుల వారి ద్వారా ఈ క్షేత్ర పవిత్రత గురించి తెలుసుకున్న ప్రహ్లాదుడు, ఇక్కడి తీర్థాలను దర్శించినట్టు చెబుతారు. అరణ్యములో దాదాపు 84 వేల మంది ముళ్ళతో షాపు నక్క మహర్షి సమావేశమై తొలిసారి భాగవత పారాయణం చేసింది ఇక్కడే. ఏదైనా చూడు మహాభారత కథలు మొదట తన కుమారుడు శుభ మహర్షికి ఇక్కడే చెప్పాడు శిష్యుడైన వైశంపాయనుడు ఇక్కడే ఓ మహాయాగం నిర్వహించి మహాభారత పారాయణం చేశాడు. వర్షం పాయనుడు చెప్పిన కథను చూతుడు మరోసారి శ్రవణ కాదు మురళి అందరికీ ఇక్కడే చెప్పాడు. ఇలా ఎంతో ప్రాముఖ్యత ఉన్న అరణ్యం ఇది ఇక్కడ వ్యాస మహర్షి ఆశ్రమం ఉన్నది.

అని అంటారు. శుక్రాచార్యుల వారి ద్వారా ఈ క్షేత్ర పవిత్రత గురించి తెలుసుకున్న ప్రహ్లాదుడు, ఇక్కడి తీర్థాలను దర్శించినట్టు చెబుతారు. ఇక శౌనకాది మహర్షులకు సూతమహాముని మహాభారత కథను తొలిసారిగా వినిపించినది ఇక్కడే !

ఇది ఋషులు నివసించిన ధ్యానం చేసిన మరియు వారి సాధన చేసిన అరణ్యం ఇది తపో భూమి లేదా ధ్యానం చేసిన భూమి. ఈ ప్రాంతంలో వారు కేంద్రీకరించిన సామూహిక శక్తి నైమిశారణాయను భారతీయ ప్రదేశాలలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. నైమిశారణ, నైమిష్, అని కూడా పిలుస్తారు. నాలుగు యుగాలలో నాలుగో ప్రాథమిక తీర్థాలు లేదా తీర్థయాత్రలు ఉండేవని చెబుతారు మొదటి యుగంలో అంటే సతయోగంలో నైమిశారణ్యం త్రేతా యుగములో పుష్కరం, ద్వాపరలో కురుక్షేత్రం, కలియుగంలో గంగానది ఉన్నాయి. ఆడవి ఇప్పుడు లేదు. చక్కగా చదును చేయబడిన రోడ్లు. యాత్ర స్థలంగా మార్చారు.

You may also like

1 comment

Mia448 November 30, 2025 - 12:45 am Reply

Leave a Comment