ఆకాశంలో సగం అని కితాబు లిచ్చినా,ఆకాశమే మీది అని కీర్తిస్తున్నా నేటి మహిళలు ప్రస్తుత సమాజంలో అనునిత్యం ఎన్నో ఆటుపోట్లను,ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. తమదైన అనురాగం,ఆప్యాయతలతోవాటిని అధిగమించి జీవితంలో నిలిచిగెలుస్తున్నారు. హద్దులు దాటిన అమానుషత్వానికి, పైశాచిక తత్వానికి పరాకాష్ట గా మారిన పురుష నైజానికి ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. ఈ క్రమంలో
తమదైన స్వావలంబన,సాధికారతలనే మంత్రంతో తమ అస్తిత్వాన్ని సుస్థిరం చేసుకున్నతీరును ప్రతిబింబింపచేసే ” అయితే మీరే ….(భుజాలు తడుముకుంటున్నారుగా!) ” అనే పేరుతో సోంపాక సీత రచించిన
నవల
ను పాఠకులంతా ఆదరించాలని ఆకాంక్షిస్తూ… ఈ నవల ధారావాహిక గా మీ కోసం !
కొండపల్లి నీహారిణి
పత్రికా సంపాదకురాలు
ఆటోలో కూర్చున్న స్నేహితురాళ్లిద్దరి దృష్టి ఒకేసారిగా తమకు కుడివైపు ఎదురుగా ఉన్న సందు మొదట్లో నిలబడిన వ్యక్తి మీదుగా నిలిచిపోయాయి.
‘‘ఆ… ఆ… అతనేనండి. పద్మినిగారి వాళ్ళాయన’’ అంది మాలిని, మైథిలితో.
‘‘అవునా? సరిగా చూడండి… పద్మినిగారి తాలూకు అవునో? కాదో?’’ అనే ఓ చిన్న సందేహాన్ని వ్యక్తం చేసింది మైథిలి.
ఇంతలో ఆ సందు మొదటికి వచ్చిన ఆటో ఆగటమూ…
ఆయన ‘‘ఆ… ఇక్కడే నండి. ఇదేనంటూ’’ దిగమని ఆటోవానికి ఆపమన్నట్లుగా చేత్తో సైగ చేయటం క్షణాల్లో జరిగిపోయాయి.
మాలిని, మైథిలి ఇద్దరూ ఆటో దిగి, ఆటోవాలాకు ఆటోచార్జి ఇచ్చేసి, చేతిలో ఉన్న చిన్న చిన్న బ్యాగులను తీసుకుని వారు ఆటోలోంచి దిగుతూ పద్మిని వాళ్ళ ఆయన్ని విష్ చేస్తూ పలకరించారు.
మాలిని ఉండేది, పద్మిని ఉండేది ఒకే ఊరవటం మూలాన తను అప్పుడప్పుడు పద్మినిని కలవటంతో తను, పద్మిని వాళ్ళ ఆయనతో బాగానే కలివిడిగా మాట్లాడేస్తోంది. మైథిలి మాత్రం మాట్లాడడానికి కొంచెం బిడియపడుతోంది. ముప్ఫై ఏండ్లు దాటిపోయింది పద్మినిని, వాళ్ళ భర్తను, పిల్లల్ని చూసి. మనుష్యులలో మార్పు వాళ్ళ వయసును బట్టి వస్తుంది సహజంగా. ఆ వయసువల్ల వచ్చిన మార్పు తప్ప ఆయన మాట్లాడే తీరు, చూపే ఆప్యాయతలో ఏమాత్రం మార్పు రాలేదనిపించింది మైథిలికి ఆర్.పి.గారిని చూస్తుంటే.
ఆ అన్నట్టు ఆర్.పి.గారే మా ఫ్రెండైన పద్మిని గారి ఇంటాయన. ఆర్.పి.గారని షార్ట్‌కట్‌లో పిలవటం అలవాటు పద్మినికి. ప్రస్తుతం పండక్కి పద్మినివాళ్ళ పిల్లలు ఇంటికి రావటం మూలంగా మనవళ్లు, మనవరాళ్లకు అన్నం తినిపిస్తుండటంతో తాను రాలేక వాళ్ళాయనను ఆ వీధి చివరి వరకూ వెళ్లండంటూ, వాళ్లు వీధిని సరిగా గుర్తు పడతారో లేదోనని అంటే తానే వచ్చినట్లుగా చెబుతూ `
‘‘ఇదేనండీ మైథిలిగారూ! పైన ‘పి’ అని అక్షరం పెట్టుకుంది తనపేరే’’ అంటూ మూడవ అంతస్తుపైన అందంగా అమర్చిన ‘పి’ని చూసిస్తూ, చిరునవ్వు నవ్వారాయన.
‘‘ఆ… మా ఫ్రెండునంటున్నారు గానీ మీ పేరులో గూడా ‘పి’ ఉందిగదా’’ అన్నా, నేనూ నవ్వుతూ.
నెమ్మదిగా గేటు తీసుకుని మాలిని, నేనూ, ఆర్.పి.గారూ లోనికి వెళ్లాం.
మెట్లు ఎటువైపున్నాయా అని వెతికే పనిలో పడ్డాను నేను.

ఇంతలో ‘‘లిఫ్ట్ ఉందండీ’’ అన్న ఆర్.పి. గారి మాటతో ఓ చల్లని తెమ్మెర మనసును హాయిగా తాకిన ఫీలింగ్ కలిగింది నాకు.
లిఫ్ట్‌లో రెండో అంతస్తులోకి తీసుకెళ్ళారు మాలినిని, నన్నూ.
మారాక కోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఎంతో ఆనందం, అంతకు మించిన ఇష్టాన్ని కలగలుపుకున్న ముఖారవిందంతో గుమ్మంలో ప్రత్యక్షమైంది పద్మిని. ఎడమ చేతిలో మనవళ్ళకు అన్నం తినిపిస్తున్న గిన్నె, కుడిచేతికి అంటిన పప్పూ, అన్నం ఇవేవీ గుర్తు రాలేదు పద్మినికి. సరాసరి అలాగే వచ్చేసింది.
చాలా రోజులు కాదు, ఏండ్లే అయింది ఒకళ్ళకొకరం చూసుకుని. నేను అమాంతంగా పద్మినిని హగ్ చేసుకున్నా.
‘స్నేహమంటే ఇదిగదా!’ అనిపించింది ఒక్కసారిగా. ఆ హగ్‌లో కలిగిన తీపి అనుభూతిని వర్ణించటానికి ‘మధురం’ అనే పదం కూడా సరిపోదనిపించింది.
‘‘ఏమోయ్! మీ ఫ్రెండ్స్ వచ్చిన సందర్భంలో ఓ మంచి టీ దట్టించవోయ్!’’ అన్నారు ఆర్.పి.గారు చమత్కారం నిండిన గొంతుకతో.
‘‘ఆ… అవును… వాళ్ళకే టీ పెడతా… మీకేం లేదుపోండీ!’’ అంతే చమత్కారం నిండిన గొంతుకతో అంటూ పద్మిని చెయ్యి కడుక్కోవటానికి వంటగదిలోకి వెళ్ళింది.
‘‘ఇప్పుడే వద్దండి టీ… ఫంక్షన్ నుండి ఇటే వస్తున్నాం. భోజనాల ఏర్పాట్లు బాగా చేశారు ఆమనివాళ్లు. కడుపునిండుగాగా లాగించేశాము. గులాబ్‌జాంలు అద్దిరిపోయాయ్. ఐస్‌క్రీమ్ కూడా రెండుసార్లు పెట్టించుకుని మరీ తిన్నాము. ఇంకా భుక్తాయాసమే తీరలేదండి’’ అంది మాలిని, వంటగదిలోకి వినపడేటట్లుగా.
నేను పద్మిని పిల్లల్ని పలకరిస్తున్నాను వరుసగా. పద్మిని, ఆమని దాదాపుగా అక్కడ ఉండేవాళ్ళే. ఏదో ఓ సందర్భంలో కలుస్తూనే ఉంటారు. ఏ సందర్భం కుదరకపోతే కనీసం రెండు నెలలకోసారైనా గెట్ టు గెదరో లేదా కిట్టీ పార్టీ లాంటిదో ఏదో ఒకటి పెట్టుకుని ఆ వంకతో కలుసుకుంటూ, మనసారా మాట్లాడుకుంటూ కష్ట, సుఖాలన్నీ కలబోసుకుని మనసు తేలిక పరుచుకుంటూ రిలాక్సేషన్ పొందుతుంటారు. వీరితో ఇంకో ముగ్గురు కూడా కలుస్తారు. వాళ్ళెవరంటే ఒకరు హాసిని, మరొకరు చంద్రిక, ఇంకొకరు ఆమని.
‘‘అసలిప్పుడు ఎవరింటి నుండి ఫంక్షన్ పూర్తి చేసుకుని వచ్చామంటే, ఆమని వాళ్ల మనవడి బర్తడే పార్టీ నుండి పిలిస్తే… తప్పకుండా హాజరవ్వాలనే పట్టుదలతో బయల్దేరి వచ్చా. వచ్చాగదా, అందర్నీ ఓసారి కలుసుకుని రావటమే నా ప్రయాణంలోని మరో ఆంతర్యం.
***
‘ఎప్పుడో గ్రహణాలు పాఠం చదువుకున్న గుర్తు చిన్నప్పుడు. కానీ నాకు పట్టింది అనారోగ్య గ్రహణం. ఎప్పుడు అది నన్ను విడుస్తుందో తెలియటం లేదు. అసలు నేను ఈ లోకం విడిచేదాకా నన్ను విడిచిపెడుతుందో? లేదో? ప్రశ్నార్థకమే! ఖగోళ శాస్త్రవేత్తలు, భూగోళం బోధించే లెక్చరర్లూ ఐతే మాత్రం దీనికి కచ్చితంగా క్రొత్త పేరు పెట్టి తీరుతారు అనుకుంటూ’ మనసులో నాకు నేనే నవ్వుకున్నాను, ఏడవలేక నవ్వారంటారే అలాగన్నమాట.
‘‘అసలు సంగతి మీకు చెప్పటం మర్చేపోయాను సుమా… నేను, మాలిని, పద్మిని, హాసిని, చంద్రిక, ఆమని… మేమంతా విజయవాడలో ఒక పాపులర్ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశాము. ఇదిగో అదే స్నేహం ఇప్పటికీ కొనసాగుతుందని గర్వంగా చెబుతాను. ఏ పొరపొచ్చాలు లేకుండా అప్పటి నుండి ఈనాటివరకు. వాట్సాప్ గ్రూపులో వేడుకలు, పండుగలు, పబ్బాలు అన్నింటికీ సంబంధించిన వాట్సాప్ ఫొటోలు అన్నీ పోస్టు చేసుకుంటాం, శుభోదయాలతో పాటుగా. ఇది మాకు దూరంగా ఉంటున్నామే, కలవలేకపోతున్నామనే ఫీలింగును దూరం చేస్తుందని గ్యారంటీగా చెప్పగలను. అసలు ఇంత బంధం ఏర్పడటానికి ముఖ్యకారణం మా పిల్లలంతా, మేం బోధించిన కళాశాలలోనే ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.
అటు తర్వాత చంద్రిక, హాసిని, పద్మినిలకు ప్రభుత్వ ఉద్యోగాలు రావటం, వేర్వేరు ఊళ్ళల్లోకి బదిలీమీద వెళ్ళిపోవటం… అదీనుగాక ఇప్పట్లాగా పెద్ద ఫోన్లు కాదుగదా కనీసం మాకు అప్పట్లో చిన్న ఫోన్లు కూడా మార్కెట్లోకి రాకపోవటంతో, మాలో కొందరితో కొందరికి లంకెలు తెగిపోయి ఇదిగో మళ్ళీ ఓ సంవత్సరం క్రితం ‘స్నేహిత ఫ్యామిలీ’ అనే పేరుతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకుని, మళ్ళీ మేము అపూర్వ స్నేహ వైభవంలోకి అడుగుపెట్టే అవకాశం కల్పించింది. పెద్ద ఫోను, అందులోని ఫేస్‌బుక్ లదే అగ్రస్థానం. మేము కలిసేందుకు మార్గం ఏర్పాటు చేసిందని నేను గట్టిగా చెప్పగలను.
ఇంతలో పద్మిని వాళ్ళ మూడో అమ్మాయి లాస్య అందరికీ టీలు తెచ్చింది. మాటల ప్రవాహాలు రసవాహినిలా దొర్లిపోతున్నాయి. ఇల్లంతా పద్మినివాళ్ళ మధుర ఫలాలతో సందడి సందడిగా ఉంటే, హాల్లోని నేలంతా బొమ్మలతో రంగుల హరివిల్లులా సంతోషమంతా అక్కడే క్రుమ్మరించినట్లుగా తళుకులీనుతోంది. పెద్దలందరిదీ ఒక లోకం, పిల్లలందరికీ మరో లోకంగా… మొత్తం అందరం ఎవరి లోకాల్లో వాళ్ళే సంతోష తరంగాలమవుతున్నాం.
‘‘మైథిలీ, మాలినీ రండబ్బా! కాసేపు గదిలోకెళ్ళి విశ్రాంతి తీసుకుందురుగానీ’’ అన్న పద్మిని చేసిన సూచనాప్రాయానికి మేం అంగీకారంగా తల ఊపుతూ, పడకగదిలోకి వెళ్ళి, హాయిగా నేనూ, మాలిని చెరో దిండుకూ మా తలలిచ్చేసి, మా కెదురుగా కుర్చీలో కూర్చున్న పద్మినిని ` ‘‘నీవు కూడా మాతోపాటు కాసేపు వచ్చి ఒరగరాదూ?’’ అన్నా చనువుగా.
‘‘లేదోయ్! ఇలా ఎదురుగా కూర్చుంటే, మీ ముఖాలు కనబడుతుంటే బాగుంటుంది. అందుకే ఇలా కూర్చున్నా’’ అంది పద్మిని.
పిల్లల పెండ్లిండ్లు, పురుళ్లు, పుణ్యాలు, శుభకార్యాలు మొదలుకుని ఇండ్లు కొనుక్కోవటం, తను ప్రిన్సిపల్‌గా ప్రమోషన్ వస్తే తిరస్కరించటం లాంటి ఇబ్బందులన్నీ వీటితో పాటుగా చంద్రిక, ఆమని, రిటైర్మెంట్ ముచ్చట్లతో పాటుగా, మనవళ్ల, మనవరాళ్లు సాధించిన విజయాలు ఒకటేమిటి… అన్నీ దృశ్యరూపాలై మా అంతరంగాలను ఆనంద సముద్రంలో ముంచి తేల్చాయి.
ఎప్పుడు కిచెన్‌లోకి వెళ్ళిందో ఏమో… మాకూ, తనకూ ప్లేట్ల నిండా స్నాక్స్, స్వీట్లు తెచ్చి ముందు పెట్టింది, తినాల్సిందేనన్నట్లుగా చూశాయి పద్మిని కండ్లు మావైపు. ప్లేట్లలో ఉన్న స్వీట్సు రుచికంటే పద్మిని మాపై చూపే ఆప్యాయతే ఇంకా తియ్యగా అనిపిస్తోంది మాకు.
‘‘సరేగానీ పద్మినీ… మీ దగ్గర కార్డ్సు ఉన్నాయా?’’ అని అడిగా నేను.
‘‘ఆ మా దగ్గర ఎప్పుడూ ఉంటాయి. మా అల్లుళ్లొచ్చినపుడు మేం అంతా కలిసి సరదాగా ఆడుతాం’’ అని తను చెప్పటంతో ఆశ్చర్యపోవటం నావంతయింది.
‘‘పాతవయితే మా ఆర్.పి.గారు అసలాడరు. వాళ్ళు అటు ఊళ్ళ నుండి రాగానే ఈయన గారిటు కొత్త ప్లేకార్డ్సు తెస్తారని’’ చెప్పింది పద్మిని నవ్వుతూ.
నాకు ఆ మాటలు వినగానే హుషారొచ్చేస్తోంది.
‘‘అయితే పాత సెట్టుంటే ఒకటి తీసుకురా పద్మినీ’’ అనటం ఆలస్యం, వెంటనే పద్మిని తన పతిదేవులకు, కార్డ్సు చూడండనే ఆర్డర్ జారీ చేయటం, క్షణకాలంలో జరిగిపోయింది.
ఆ… ఆయనేం సెట్ చేస్తారులే కాసేపట్లో అనుకున్నా నా మనసులో.
మాలిని స్నాక్స్, స్వీట్లను రుచి చూస్తూ, వాటికి పద్మిని చెప్పే ముచ్చట్లను అద్దుకుంటూ ఎంజాయ్ చేస్తోంది.
‘‘నువ్వు తినవా మైథిలీ?’’ అని పద్మిని అనటంతో…
‘‘ప్లీజ్… అబ్బా ఏమీ అనుకోకు. నాకు పొట్ట చాలా నిండుగా ఉంది’’ అంటూ తను నొచ్చుకోకూడదని కారాని కొద్దిగా తీసుకుని నోట్లో వేసుకున్నా.
‘‘ఊ… చాలా బాగున్నాయి’’ ఎప్పుడు చేశావని అడిగా తనను.
‘‘చేయటమా? ఏమన్నానా? రెండు మోకాళ్లకి ఆపరేషన్ జరిగినప్పటి నుంచి, స్టౌ దగ్గర ఎక్కువసేపు నిలబడి వంటే చేయలేకపోతున్నా. ఇంకా పిండివంటలు కూడానా!’’ అని నిట్టూరిస్తూ… ‘‘లేదు మైథిలీ… మా కాలనీలో ఒకావిడ ఆర్డర్ మీద మనకు ఏ ఐటం కావాలంటే అది చేసిస్తుంది. బాగానే తయారు చేస్తుంది. పిల్లలొస్తున్నారని ఆర్డరిచ్చానని’’ చెప్పింది పద్మిని.
‘‘అవును నిజంగానే మనం ఇంట్లో చేసుకున్నట్లుగానే ఉన్నాయబ్బా’’ అంది మాలిని.
‘‘‘కార్డ్స్’ అన్నీ కలిసిపోయి ఉన్నాయి. ఒక సెట్ కలెక్ట్ చేయమన్నా, మా వారితో’’ అంది పద్మిని.
మాటవరుసగా అన్నా పద్మినితో. నా మనసులోని ఇష్టాన్ని గమనించి, భర్తకి కార్డ్సును సెట్ చేయ్యమనటం చూస్తుంటే పద్మిని పట్ల నా మనసులో స్నేహ మాధుర్యం ఉప్పొంగుతోంది.
‘‘ఆ… అయిపోయింది… ఓ ఐదు నిముషాల్లో తీసుకొస్తా’’ నన్న జవాబు వినపడిరది అటునుండి.
అన్నట్లుగానే ఠంచనుగా ఐదు నిముషాల తరువాత ఒక ప్లే కార్డ్సు సెట్ టీపాయ్, పిల్లలు రాసుకునే పరీక్ష అట్ట, వాటితో పాటుగా పాత నోట్సు, స్కోర్ వేయటానికి ఓ బాల్ పెన్నుతో సహా ప్రత్యక్షమయ్యారు ఆర్.పి.గారు.
***
తమ బండిమీద ఫ్రెండ్స్ ఇళ్లకు దింపటమో, మళ్లీ తీసుకురావటమో లేదా వాళ్లు మన ఇళ్లకొచ్చినపుడు కాసేపు కూర్చుని మర్యాద పూర్వకంగా మాట్లాడుతూ కబుర్లు కలపటమో… ఇంతవరకే తెలుసు తనకు. ఎక్కువ శాతం పెరిగిన ఏరియర్స్, రిటైర్మెంట్ తర్వాత రావలసిన బెనిఫిట్స్ ఇవే మాటలుంటాయి మా ఇంటికి ఎవరొచ్చినా. కానీ ఇక్కడ పూర్తి విరుద్ధంగా ఉంటూ, ఎటువంటి భేషజాలకు తావీయని సందడితో, కలుపుగోలు తనంతో కూడిన సంభాషణలు నడుస్తుంటే, ఆనంద లోకాల్లో విహరిస్తున్న అనుభూతి కలుగుతోంది నాకు.
ఇంతలో పేకల్ని చకచకా కలపటం, మాలినినే ముందుగా కార్డ్సు వేయమనటం, తను నల్గురికీ వేయటం, చకచకా జరిగిపోయాయి. సాధారణంగా మన మహిళలకు సంబంధించిన (ఫ్రెండ్స్) వస్తే ఏదో మర్యాదకో, మొహమాటానికో వచ్చి ఓ రెండు నిమిషాలు మాట్లాడటం, తర్వాత ఏదో పనున్నట్లుగా, వాళ్లు బైటకు వెళ్ళిపోవటమో లేకపోతే పనున్నట్లుగా లోపలికి తమ గదిలోకి వెళ్ళిపోయి ఫోన్‌లో ఏదో ఓ సినిమా చూసుకోవటం, ఇంటికి వచ్చినవాళ్ళు వెళ్ళిపోగానే హమ్మయ్య అని లోలోపల అనుకుంటూ, హాల్లోకి వచ్చి టి.వి. ముందు కూర్చోవటం. ఇలానే జరుగుతుంది దాదాపుగా మా ఇంట్లో. కానీ ఆర్.పి.గారు కూడా సరదాగా కూర్చుని ఆడటం, వాళ్ళావిడ పద్మిని మీద చెణుకులు విసరటం, మాలినికీ నాకు ఎలా ఆడితే కౌంట్ తగ్గుతుందో కొన్ని టిప్స్ చెప్పటం… సరదాగా నవ్వుకోవటాలు… టైమ్ ఎలా గడిచిపోయిందో తెలియటం లేదు మాకు. అందరూ బాగానే షోలు కొడుతున్నారుగానీ, నాకు పట్టుకోవటం చేతగాక, చేతిలోంచి కార్డ్సు జారిపోతుంటే నాకే నవ్వొస్తోంది. మా అల్లుళ్లు వచ్చినప్పుడు అందరం సరదాగా కూర్చుంటాం, ఆడుకుంటాం అని పద్మిని అన్న మాటలను మననం చేసుకుంటుంటే ఆర్.పి.గారు గురించి, నాకు ఆశ్చర్యంతో కూడిన వింత దృశ్యం కండ్లముందు కదలాడిరది.
‘‘మళ్ళీ ఒకసారి చాయ్ పెట్టవోయ్!’’ అని అనటంతో పద్మిని వంటగదికి వెళ్ళింది. చిన్న విరామం తీసుకున్నాం అందరం.
ఏదో ఫోన్ వస్తే ఆర్.పి.గారు బాల్కనీలోకి వెళ్ళారు, ఆన్సర్ చేసేందుకు.
నేను, మాలిని వాష్‌రూంకి వెళ్ళొచ్చాం.
‘‘అవునండీ… పద్మినీ వాళ్ల అల్లుళ్ళు చాలా మంచివాళ్ళండీ… తనకు ఫోన్లు లాంటివి బహుమతులు కూడా ఇస్తూంటారట అప్పుడప్పుడు’’ అంది మాలిని నాతో.
అల్లుడంటే హోదాని వెలగబెట్టాలనుకునే కోవలోకే వస్తారు కొందరల్లుళ్లు. కానీ ఇక్కడ వరుసగా ఆశ్చర్యపు టపాసులు పేలటంతో మేమున్న ఆ గదితోపాటు నా మనసంతా హర్షపు వెలుగులతో నిండిపోయింది. మాటల, ఆశ్చర్యాల ఫలహారంతో నిండిపోయింది నా కడుపు. అందుకే సగం కప్ మాత్రమే టీ తాగగలిగాను. మిగతా సగం మాలిని కప్‌లో కొంచెం, ఇంకొంచెం పద్మిని కప్‌లో పోసేశాను, తాగమంటూ.
సరదాగా ఆడిన ఆటకు వేసిన స్కోర్‌ను చూశాను నేను. అందరూ బాగానే జాగ్రత్తగా ఆడారు. ఎప్పుడో పిల్లలు చిన్నప్పుడు సరదాగా మొద్దాట ఆడిన గుర్తు నాకు. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఆడటం ఆనందాన్నిచ్చింది. చెప్పద్దూ… నా స్కోర్. దిగ్విజయంగా రెండొందలు దాటేసింది. అంటే నేనే ఓడిపోయానని అర్థమైంది. అసలింతకీ నా పట్టుదల మీదే పద్మిని వాళ్ళాయనతో చెప్పి, పేకల్ని సెట్ చేయించటం, అందరం సరదాగా ఆడటం జరిగింది. ఇంతలోకి హాసిని నుండి ఫోన్ వచ్చింది పద్మినికి. ‘మైథిలిని, మాలినిని అక్కడే ఉండమను, నేనో గంటలో వచ్చేస్తా, మావారితో కలిసి’ అని దాని సారాంశం. ఆ ఇల్లంతా సంతోషాలకి చిరునామాగా అన్పించింది. నాకు.
నెమ్మదిగా మా ఫ్రెండ్స్ ముగ్గురమూ హాల్లోకి వచ్చాం. మా మేడమ్స్ అంటూ పద్మిని పిల్లలు ముగ్గురూ కూడా మాతో చేరిపోయారు.
‘‘ఎంతో సంతోషంగా అనిపిస్తోంది మిమ్మల్ని చూడగానే’’ అంటూ మాతో ఫొటోలు తీసుకోవటం… వాళ్ళ పిల్లల్ని మాకు పరిచయం చేయటం… ఇలా అన్నీ ఎవరి ప్రమేయం లేకుండానే ఒకదాని వెంట మరొకటి జరిగిపోతూ, సమయం అరచేతిలోని ఇసుకలా జరజరా జారిపోతోంది.
అదిగో అప్పుడు హాసిని హడావుడి చేస్తూ రానే వచ్చింది. రాగానే అమాంతం నన్నూ, మాలినిని వాటేసుకుంది. తన కండ్లలోని సంతోషపు చెమరింత నా చూపుల్నుండి తప్పించుకోలేకపోయింది. ‘ఏంటి?’ అని కనుసైగతోనే ప్రశ్నించా హాసినిని.
‘‘చాలా సంవత్సరాలైందిగా మిమ్మల్ని చూసి. అప్పుడెప్పుడో కలిపి పనిజేసినప్పుడు, మళ్ళీ ఇన్నేళ్ళకు’’ అంటూ తాను కూడా కండ్లతోటే సమాధానమిచ్చింది.
మళ్ళీ ఫోటోస్ సెకండ్ సెషన్ స్టార్టయింది. అయితే కొన్ని, పద్మినివాళ్ల హజ్బెండ్ తీస్తే, మరికొన్ని హాసిని వాళ్ళాయన జనార్థన్‌గారు తీశారు.
ఏంటో జనార్ధన్‌గారు లోపలికి రావటము బిడియంగానే వచ్చారు, సోఫాలో కూడా ఓ మూలకు ఒదిగి ఒదిగి కూర్చున్న తీరుని చూస్తే చాలా సిగ్గరిలాగా
అనిపించారు మాకు. అది గమనించిన హాసిని… తన భర్తను ఈ వాతావరణంలో పడేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఫొటోలు కూడా తీసేపని భర్తకు అప్పగించిందేమోనన్పించింది నాకు మనసులో.
లోపలికి రాగానే నేనూ, మాలిని కూడా జనార్థన్‌గార్ని పలకరించాము. హాసినికి పెండ్లి అయిన చాలా రోజుల వరకు అనేకంటే, కొన్ని సంవత్సరాలు వరకు అనచ్చేమో. ఆ… అవును ఇదే నిజం. అప్పుడు జనార్ధన్‌గారు కూడా విజయవాడలో ఉండటం వల్ల ఎప్పుడైనా మాల్స్‌లోగానీ, బిగ్‌బజారు లాంటి వాటి దగ్గర కలిసినపుడు నాతో, ‘ఈయన మావారు. పేరు జనార్థన్‌గారని హాసిని పరిచయించటం అన్నీ గుర్తొచ్చాయి మళ్ళీ ఒకసారి. నవ్వు ముఖమే అతనిది. బాగానే మాట్లాడుతున్నారు. మాటల మధ్యలో తమకు ఇద్దరు పిల్లలని, బాబుకు చదువు పూర్తయి బెంగుళూరులో ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పెద్ద ఉద్యోగమే చేస్తున్నట్లుగా, పాపేమో హైదరాబాదులో మెడిసిన్ రెండవ సంవత్సరం చేస్తున్నట్లుగా చెప్పారు జనార్థన్ గారు. మేము ఊకొడ్తున్నాం.
‘‘చూడండి… చూడండి… ఏమీ ఎరగనట్లుగా నంగనాచిలా ఎంత వినయంగా మాట్లాడుతున్నాడో’’ అంటూ నా చెవిలో గుసగుసగా చెప్పింది హాసిని.
‘‘ఉష్… ఊరుకోమ్మా… వినపడుతుందని’’ కొద్దిగా నెమ్మదిగా మందలించినట్టుగా అన్నాను తనతో.
మా ఫ్రెండ్సుకి ఈతని గురించి చాలా విషయాలు ముందుగానే తెలుసన్నట్లుగా నావైపు చూస్తూ ముసి ముసి నవ్వులు నవ్వుతూ, సంభాషణ మళ్లించే ప్రయత్నాలు చేశారు మాలిని, పద్మినిలు. నాకూ గతంలో కొన్ని విషయాలు జనార్థన్ గారి గురించి చూచాయగా తెలిసి బాధపడ్డాను. హాసిని మంచి ఎడ్యుకేటెడ్. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులే. హాసినే చిన్నపిల్ల వాళ్ళ ఇంట్లో. ఎత్తుగా, తెల్లగా, బక్కపల్చగా అందంగా ఉంటుంది. అల్లారు ముద్దుగా పెరిగినట్లుగా అన్పించేది తన మాటలు వింటుంటే. అప్పుడప్పుడూ చంద్రిక ద్వారానో లేకపోతే ఆమని ద్వారానో సమాచారం తెలిసేది ఫోన్‌లో మాట్లాడుకునేటప్పుడు. వీలు చూసుకుని నేను వెళ్లేలోగా కొంతైనా హాసినిని ఊరడిరచాలనే నా నిర్ణయం. బాగా బలపడిరది. ఆలోచిస్తూనే హాసినిని క్లియర్‌గా గమనించటం మొదలెట్టా. పైకి తను నవ్వుతూ మాట్లాడుతున్నా, హాసిని మనసులో గూడు కట్టుకున్న బాధ తొంగి చూస్తూనే ఉంది. కంటి చెమరింపు ద్వారా అది బహిర్గతమవుతుంటే నా మనసంతా ఒక్కసారిగా దేవేసినట్టయిపోయింది.
‘‘ఇక మేము బయల్దేరుతామని చెప్పటంతో గబగబా లిఫ్ట్‌లో క్రిందకి వచ్చి ఆర్.పి.గారు తమ కారుని బైటకి తీశారు.
‘‘నేనూ వస్తాను’’ అంది పద్మిని.
‘‘అవును, చంద్రికను చూసి చాలా రోజులైంది. నేను కూడా వస్తానంది’’ హాసిని.
అలా మేం నలుగురం కారులో బైలుదేరాం, చంద్రికను కలవటానికి, వాళ్ళింటికి. ఆర్.పి.గారి డ్రైవింగ్. ఆ సీటు ప్రక్కనే ఎడమవైపు అయినా ఆయనగారి కుడిభుజంగా వర్థిల్లుతున్న మా పద్మినమ్మ, వెనుక సీట్లో నేనూ, మాలిని, హాసిని కూర్చుని మళ్లీ కబుర్ల తోటలోనికెళ్ళి సరదాల మల్లెల్ని, సంతోషాల జాజుల్ని, ఛలోక్తుల సంపెంగల్ని మనసు గదినిండా నింపుకున్నాం. మా కారు వెనుకే తన బండిమీద మాతో కూడా వస్తున్నారు జనార్థన్‌గారు. నెమ్మదిగా కారు దిగి మేము చంద్రికావాళ్ళుండే ఫస్ట్ ఫ్లోర్‌లోకి వెళ్లటానికి మెట్లు ఎక్కబోతుండగా, నలభై ఏళ్లుంటాయేమో, ఆ అమ్మాయికి పెళ్ళైందిటలేగానీ నైటీలో చిన్నగా అన్పిస్తోంది.
‘‘రండి… రండి మేడమ్‌గార్లు. మీ కోసమే చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్నాం’’ అంది నవ్వు ముఖంతో.
నా మోకాళ్లు మెట్లెక్కటానికి బెట్టు చేస్తాయి. మెట్లెక్కాల్సిన సందర్భం ఎదురైనప్పుడల్లా సహజంగా నా కండ్లు లిఫ్ట్ కోసం వెతుకుతాయి. నా ఆలోచనకు నాకే నవ్వొచ్చింది. వెళ్ళిన ప్రతి భవనానికీ లిఫ్ట్ ఉండాలని నియమమేమీ లేదుగదా! అని నా ఆలోచనకు నేనే మనసులో నవ్వుకుంటూ కాళ్ళకి పని చెప్పటం మొదలుపెట్టాను. మా దయ్యాలు… క్షమించండి నెయ్యాలు పై మెట్టుదాకా చేరిపోయారు. నేనేమో నత్తలాగా నెమ్మది నెమ్మదిగా రెయిలింగ్ పట్టుకుని సగం మెట్లవరకూ చేరాను. హమ్మయ్య అనుకుంటూ మొత్తానికి మొదటి అంతస్తుకి చేరుకునేసరికి, చంద్రిక ఎదురుగా రానే వచ్చింది ‘‘వెల్‌కమ్ డియర్స్’’ అంటూ.
ఆ ఆత్మీయత నా మదిని తాకిన వెంటనే నా అలసట, కాలినొప్పి ఎటు ఎగిరిపోయాయో తెలవదు. నా మనసే గాదు, అక్కడికి చేరుకున్న మా ఫ్రెండ్సందరి మనస్సులు చిన్నపిల్లలు మాదిరిగా గంతులేస్తున్నాయి!
‘‘అబ్బా… రావేమో… అటునుంచి అటే వెళ్ళిపోతావేమో ననుకున్నా’’ అంది చంద్రిక నిష్టూరంగా మారబోతున్న స్వరాన్ని తమాయించుకుంటూ.
‘‘అలా ఎలా అనుకున్నావు చంద్రికా? ఇక్కడిదాకా వచ్చి, నిన్ను చూడటానికి రాకుండా ఎలా ఉంటానని అనుకున్నావ్?’’ అనేసరికి ఒక అంగలో వచ్చి, ఎంతో ఆనందంతో నన్ను హగ్ చేసుకుని కండ్లనీళ్ల పర్యంతమైంది చంద్రిక.
‘‘ఏంటోయ్! మమ్మల్నిలాగే వాకిట్లోనే ఉంచి, ఇట్నుంచి ఇటే గెంటేస్తావా ఏంటి?’’ అని నవ్వింది పద్మిని చంద్రికవైపు చూస్తూ.
‘‘అదేంలేదబ్బా! రండి…’’ రండంటూ లోపలికి తీసుకెళ్ళి, మాకు సోఫా చూపించి, కూర్చోమని చెప్పి, హడావుడిగా ఫ్రిజ్ దగ్గరకు పరిగెత్తబోతున్న చంద్రికతో దబాయించినట్లుగా మాట్లాడుతూ `
‘‘ఏం తల్లీ! రాకరాక మీ ఇంటికి వస్తే, మమ్మల్ని ఇంత ఇరుకులో కుదేస్తావా?’’ అంది మాలిని, తాము కూర్చున్న సోఫా చూపిస్తూ.
నిజానికి మా నల్గురుకూ సరిపోయే సోఫానే అది. కానీ ఎందుకో చంద్రికను ఉడికించాలనిపించింది మాకు.
‘‘అయ్యో! మీరొచ్చిన ఆనందంలో కన్ఫ్యూజ్ అయిపోయానబ్బా’’ అంటూ ఇంకో కుర్చీ చూపించి, తనూ ఎదురుగా ఉన్న ఓ కుర్చీలో కూర్చోబోయింది చంద్రిక.
‘‘ఏంటి… వచ్చి ఇంతసేపైనా కనీసం మంచినీళ్లైనా ఇచ్చేదుందా? లేదా?’’ అని గట్టిగా అడిగింది పద్మిని, చంద్రికను.
‘‘అయ్యో! సారీ అబ్బా… మిమ్మల్ని చూసిన సంతోషంలో అడగటం మర్చేపోయానని’’ నొచ్చుకుంది చంద్రిక.
ఇంతలో మెట్ల దగ్గర కనబడిన అమ్మాయి పైకి వచ్చి, చనువుగా `
‘‘మేడమ్స్ బాగున్నారా మీరంతా?’’ అంటూ ఎంతోకాలం పరిచయం
ఉన్న అమ్మాయిలా అడిగేసరికి మేము అవాక్కయ్యాము.
‘‘తను మా గ్రౌండ్ ఫ్లోర్‌లో అద్దెకు ఉంటుంది. చాలామంచి అమ్మాయి. నాకు ఇంటిపనుల్లో సాయం చేస్తుంది, పేరు సుజాత.’’ అని చంద్రిక చెబుతుంటే…
తను ఎంత అండగా ఉంటుందో అన్ని పనులలో అనే విషయాన్ని చంద్రిక ముఖ కవళికలను పరిశీలించిన వారికెవరికయినా ఇట్టే అర్థమైపోతుందన్పించింది మాకు.
‘‘అబ్బే! అదేం లేదండీ… అక్క అలాగే చెబుతుంది వచ్చిన వాళ్ళందరికీ’’ అంటూ తను వంటగదిలోకి వెళ్లబోతుంటే, ఆపినంత యుద్ధం చేయాల్సి వచ్చింది సుజాతతో మాకు.
‘‘అద్దెకున్న వాళ్ళలో కనీసం ఒక్కళ్ళైనా ఇలాంటి మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళుంటే చుట్టాలు కూడా బలాదూరే’’ అంది హాసిని.
‘‘అవునని’’ మేమంతా హాసిని మాటలకు వత్తాసు పలికాము. అంతేగదా మరి! బంధువులొస్తే వాళ్ళు సాయం చేసేమాట ఎలావున్నా, కూర్చున్న చోటునుంచి లేచేవరకూ అన్నీ అందించాలి. ఇంతటితో అయిపోతుందా అంటే ఆహా… పెట్టుపోతలు ఏమాత్రం తగ్గినా ఈసారికి సర్దుకుందామనే ఇంగిత జ్ఞానం ఇసుమంతైనా ఉండని వారి శాతమే ఎక్కువ ఈ రోజుల్లో. పైగా ఒకరు వృద్ధిలోకి వస్తున్నారంటే, మరొకరికి అసూయా ద్వేషాలు. వీటితో బంధుత్వాలు వీగిపోతుంటాయి అప్పుడప్పుడూ. మళ్ళీ ఏ శుభకార్యానికో అతుకు పెట్టుకున్నా మళ్లీ ఎప్పుడో ఏదో ఓ సందర్భంలో పుటుక్కుమని తెగటం, దానితో కారాలు, మిరియాలు నూరటాలు… అబ్బో ఇది ఓ చేటభారతమే అవుతుందనుకుంటా.
‘‘వీళ్ళంతా మా ఫ్రెండ్సురా సుజాతా. చాలా సంవత్సరాలు విజయవాడలో కలిసి పనిచేశాం’’ అని ఆ అమ్మాయికి మమ్మల్నందరినీ పేరుపేరునా పరిచయం చేసింది చంద్రిక.
‘‘చెప్పద్దూ.. ఆ అమ్మాయి సుజాతను చూస్తుంటే మాకందరికీ చాలా ముచ్చటేసింది. ఇంతలోకి తను ‘‘కొంచెం పనుందక్కా’’ అంటూ చంద్రికకు చెపుతూ`
‘‘ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నందుకు, ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా అది కంటిన్యూ అవుతున్నందుకూ ‘‘మీరంతా గ్రేట్’’ అంటూ మా దగ్గర బై చెప్పి, క్రిందకి వెళ్ళిపోయింది సుజాత.
వద్దంటున్నా వినకుండా దబదబా ఫ్రిజ్జు ఓపెన్ చేసి, అందులోంచి పెప్సీ తీసుకొచ్చి, తలా ఒక గ్లాస్‌లో పోసిచ్చింది చంద్రిక.
ప్లీజ్ నాకది వద్దంది మైథిలి. ఈమధ్య వాట్సాప్‌లో చెక్కర్లు కొడుతున్న కూల్‌డ్రిరక్స్‌కు సంబంధించిన మెసేజులన్నీ కండ్లముందు కదలాడుతుండగా.
‘‘అసలే నేను బయట ఫుడ్ గానీ, ఇలాంటి డ్రిరక్సు తీసుకునే అలవాటు చాలా తక్కువ నాకు. ఎవరైనా బలవంతం పెట్టినా వాళ్ళని నొప్పించకూడదనే
ఉద్దేశ్యంతో కొంచెమే తీసుకుంటా. నా మనసులో ఉద్దేశ్యం గ్రహించిన దానిలా స్ప్రైట్ ఓ చిన్న గ్లాసులో పోసి చేతికిచ్చింది తాగమని. ఇక కాదనలేక అయిష్టంగానే తాగాను, చంద్రిక ఫీలవుకూడదని.
ఏ కబుర్లలోంచి ఎటు వెళ్తున్నామో మాకే తెలవనంతగా లోకాభి రామాయణం కాదులెండి గానీ, అంత హంగామా దొర్లింది మా మాటల్లో. అంతా ఆ ఊళ్ళో ఉండేవాళ్ళే. నేనొక్కదాన్నే వేరేవూరు నుంచి వచ్చా, ఫంక్షన్‌కి అటెండవటం కోసంగా.
‘‘ఇక వెళ్ళొస్తాం చంద్రికా’’ అని చెప్పి లేచాం అంతా.
‘‘ఉండండి’’ అంటూ లోపలికి వెళ్ళి పసుపు, కుంకుమ పెట్టటం కోసంగా, చీరలు, జాకెట్ పీసులు తెచ్చి, బొట్టుపెట్టి అందరికీ ఇచ్చింది, వద్దన్నా వినలేదు చంద్రిక.
‘‘నీవు త్వరగా ఇల్లు కదిలిరావుగా మైథిలీ’’ అంటూ అనురాగం నిండిన కండ్లతో చూస్తూ. మర్చిపోకుండా వచ్చినందుకు కృతజ్ఞతా పూర్వకంగా నావైపు చూసింది చంద్రిక. తేలికపడిన మనసులతో, స్నేహ మాధుర్యాన్ని పదిలంగా దాచుకున్న హృదయాలతో క్రిందికొచ్చాము.
వద్దన్నా వినకుండా, చంద్రిక కూడా మాకు బై చెప్పటాన్కి మాతో పాటే వచ్చింది. రిటైర్మెంట్ లైఫ్‌ని కుటుంబపరంగా ఎంజాయ్ చేస్తున్నా, అనారోగ్యాన్ని కప్పిపుచ్చలేని చంద్రిక శరీరం ఆయాస పడుతోంది. తనని అలా చూడగానే ఎందుకో నా మనస్సు ఉస్సురనిపించింది. కష్టం, సుఖం, బాధలు, ఆటంకాలు అన్నీ అనుభవించిన మనిషి చంద్రిక. లక్కీగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకున్న అదృష్టవంతురాలు. కాబట్టే ఇద్దరు ఆడపిల్లల్ని చదివించి, మంచి సంబంధాలు చూసి, పెండ్లిండ్లు చేసింది. కొడుకుని కూడా చదివించి ప్రయోజకుడిని చేసి, తగిన సంబంధాన్ని కలుపుకున్నది. పేరుకు అందరూ ఉన్నా, ఒకరకంగా చెప్పాలంటే తన కష్టం మీదే భర్త, ఇద్దరు తమ్ముళ్లు, తండ్రి గెటానా అవుతున్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చినా, అదే చెరగని చిరునవ్వు ముఖం మీద అప్పటికీ ఇప్పటికీ తనది.
‘‘అయ్యో పాపం వాళ్లిద్దర్నీ పైకి పిలవమని చెప్తే పట్టించుకోలేదేం హాసినీ’’ అంది నొచ్చుకుంటున్నట్లుగా జనార్థన్, ఆర్.పి. గార్లను చూస్తూ చంద్రిక.
‘‘ఆ… మనమధ్యన ఉంటే మనకూ ఉండదు, వాళ్లకీ ఉండదు ప్రైవసీ’’ అంది పద్మిని వాళ్ళ వారివైపు చిలిపిగా చూస్తూ.
‘‘అవునవును పిలుస్తేనేమో ఎక్కడొచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తామోనని మీ అనుమానం. అందుకే మీకు ఇబ్బంది కలిగించటం ఎందుకులే పాపం అని మేం ఇక్కడే ఆగిపోయాం’’ అన్నారు జనార్థన్‌గారు సెటైరికల్‌గా.
‘‘అబ్బో బాగానే మాట్లాడుతున్నాడే… మూగ మనిషి!’’ అన్నా హాసినివైపు చూస్తూ.
‘‘వీడు పెట్టిన టార్చర్‌కి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’’ అంది నాతో గతం గుర్తు తెచ్చుకుంటూ.
వింటే ఏం గొడవ పెడతాడో ఇంట్లోనని కొంచెం భయంగా చూశా హాసినివైపు. అతగాడు పార్క్ చేసిన బండివైపు వెళ్ళటం చూసి హమ్మయ్య అనుకుని గుండెలనిండా ఊపిరి పీల్చుకున్నా. నువ్వు ధైర్యంగా ఉండాలి హాసినీ. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. చీటికీ మాటికీ ఇలా బేలగా అయిపోకూడదు. గతం ఒక గ్రహణ మనుకో. కాస్త కాస్త వదిలిపోతోందిగా. కొంచెం ఫరవాలేదు ఇక్కడికి వచ్చాక మార్పు వచ్చిందని చెప్పావుగా అంటూ నాకు తోచిన రీతిలో హాసినిని సముదాయించాను.
‘‘నామీద మనసునిండా అనుమానం పెట్టుకుని దానికి ద్వేషాన్ని తగిలించి, మా అక్కలకు నామీద లేనిపోనివి ఎక్కించి వాళ్ళ దృష్టిలో నన్ను తప్పుగా చూపించి, వాడు మాత్రం మంచివాడుగా ముద్రవేసుకున్నాడు. ఇప్పటికీ అదంతా నటనే’’ అంది నాతో.
‘‘మరి మనం మాటల్లో పడి, చాలా లేటయింది. ఏమైనా కోపమొస్తుందేమో మీవారికి నీమీద’’ అన్నా సంశయంగా.
‘‘అదేం ఉండదు మైథిలీ… ఇలా ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్ళినా, వాళ్ళతో సరదాగా టైం స్పెండ్ చేసినా ఏమీ ఫీలవడు కాకపోతే అదో రకం సైకో మెంటాలిటీ’’ అంది బాధగా.
అనవసరంగా హాసినిని కదిపి మానుపట్టిన గాయాన్ని రేపానేమోననే గిల్టీ ఫీలింగ్‌తో తన చేతిని నా చేతిలోకి తీసుకుంటూ `
‘‘మేమంతా నీకున్నాం. నువ్వు ఎప్పుడూ ఒంటరిదానివి కాదు. ఎప్పుడూ నువ్వు ఒంటరిగా ఫీలవ్వద్దు’’ మరీ మరీ చెప్పా.
కండ్లలోంచి ఎప్పుడెప్పుడు దూకుదామా అని ఎదురుచూస్తున్న కన్నీళ్ళు, కొద్దిసేపైతే కండ్లలోంచి దూకటానికి సిద్ధంగా ఉన్నాయి.
‘‘అవును, మిమ్మల్నంతా చూశాక నేను ఒంటిరిని కాను. నాకు ఇంతమంది ప్రాణ స్నేహితులున్నారనే ధైర్యం వచ్చింది’’ అన్నది రాబోయే కన్నీటికి అడ్డుకట్ట వేస్తూ హాసిని.
ఇంతలోకి వాళ్లాయన బైక్ తేవటంతో తను బైక్‌మీద, మేము కార్‌లో కూర్చున్నాము. మరొకసారి చంద్రికకు తృప్తిగా వీడ్కోలు చెప్పి, వెనుదిరిగాము మేము.
నన్నూ, మాలినిని ` మాలిని వాళ్ళింటి దగ్గర డ్రాప్ చేసి, పద్మిని దంపతులు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు.
***
మాలిని కొడుకు రమేష్, కోడలు రజని… వీళ్ళకి ఇద్దరు బాబులు. పెద్దవాడు అరుణ్, చిన్నవాడు కరణ్. సెలవురోజులు కావటంతో కొడుకు, కోడలు కల్సి ఏవో కిరాణా సామాను తెచ్చుకోవాలని బైటకు వెళ్తుంటే, ‘‘మేమూ వస్తాం, మాకు ఐస్‌క్రీమ్ కొంటామన్నారుగా మాకు. ఇప్పుడే కావాలి? మేమూ వస్తాం, తీసుకెళ్లండని పట్టు బట్టడంతో తీసుకువెళ్ళాల్సి వచ్చింది ఆంటీ…’’ రజని చెప్పింది నాతో నవ్వుతూ. రమేష్ చేతిలో బాగానే ఉంది కిరాణా లగేజ్. ఐస్‌క్రీం తిన్నారేమో ఇష్టంగా పిల్లల మొహాలు కళకళలాడుతున్నాయి.
‘‘ఏంటి రమేష్ చాలా బరువు బాధ్యతలు మోసేస్తున్నావ్?’’ అన్నా చిరునవ్వుతో.
‘‘అవును ఆంటీ!’’ చూడండి ఎన్ని సామాన్లు కొనిపించిందో నాతో’’ అంటూ రజనివైపు చిలిపిగా చూశాడు రమేష్.
మాలిని మురిపెంగా చూసుకుంటోంది కొడుకును, కోడలిని.
‘‘అవును ఆంటీ! ఈరోజు హాలిడే గదా! ఇప్పుడైతేనే కుదురుతుంది సామాన్లు సర్దుకోవటానికి’’ అంటూ తన హ్యాండ్ బాగ్‌లో ఉన్న కీ తీసుకుని తాళం తీసి, డోర్ తెరిచింది. లోపలికి వెళ్ళాం… నేనూ, మాలినీ వాళ్లతో పాటుగా.
‘‘ఇల్లు సూపర్‌గా ఉంది రమేష్’’ అన్నా.
‘‘అవునా ఆంటీ!’’ అన్నాడు చనువుగా చిరునవ్వుతో.
‘‘ఆంటీకి కాఫీ కలుపు’’ అన్నాడు భార్య రజనీతో రమేష్.
‘‘అమ్మా రజనీ ఇప్పుడే వద్దురా! ఇవాళ చాలాసార్లైంది ఇప్పటికే. అసలేం వద్దమ్మా. వంట కూడానూ వద్దు ఇద్దరికీ’’ అన్నాను నేను.
‘‘అవును నానీ. మధ్యాహ్నం ఫంక్షన్ భోజనం హెవీ అయింది. మళ్ళీ పద్మిని మేడం, చంద్రికా మేడం వాళ్ళిళ్లల్లో స్నాక్స్, కూల్ డ్రిరక్స్ తీసుకునే వరకూ’’ వదలలేదు మమ్మల్ని అన్నది మాలిని తన కొడుకు రమేష్‌తో.
‘‘ఐతే టిఫెనన్నా తినండి’’ అంటూ రమేష్ బైటికి బయలుదేరబోయాడు, వేడివేడిగా ఇడ్లీలు తెస్తానంటూ.
ఇక మరీ ఏమీ తినకపోతే బాధపడతారని సరేనన్నాను తల ఊపుతూ.
ఇంతలో ఈ మాటలు విన్న రజని, హాల్లో ఉన్న మా దగ్గరకు వచ్చి `
‘‘ఆంటీ, ఇడ్లీ పిండి ఉంది, ఇడ్లీలు వేసిస్తా వేడివేడిగా. బైటిఫుడ్ ఎందుకు’’ అంది రజని.
‘‘ఇప్పుడే షాపింగ్ చేసుకుని వచ్చారు. మళ్ళీ నీకు డబుల్ పని అవుతుంది గదమ్మా’’ అన్నా రజనీతో.
అబ్బే అదే లేదంటూ కిచెన్‌లోకి దారి తీసింది రజని.
మాతో చాలాసేపు ఆ ముచ్చట్లూ, ఈ ముచ్చట్లూ మాట్టాడి `
‘‘అవును ఈసారి అంకుల్‌ని కూడా తీసుకురండి మా ఇంటికి’’ అన్నాడు మాటల మధ్యలో రమేష్.
‘‘అయ్యో! నీకు తెలవనిదేముంది రమేష్. బంధువుల ఫంక్షనైతే తప్ప ఇల్లు త్వరగా కదలరు. వచ్చినా మళ్లీ రాత్రికల్లా ఇంటికి చేరుకోవ్వాల్సి వస్తోంది’’ అన్నా తనతో.
‘‘ఏం కాదులెండి! రమ్మని తీసుకురండి ఆంటీ… మీరు గట్టిగా రమ్మంటే రాకుండా ఉంటారా?’’ అన్నాడు రమేష్.
‘‘నీకంటే మీ మమ్మీకి తెలుసు బాగా మా ఆయన గారి సంగతి’’ అన్నా.
‘‘అవును అన్నయ్యగారు తొందరగా బైల్దేరరు ఊళ్ళంటే’’ అంటూ తల పంకించింది మాలిని.
తను పుట్టి పెరిగిన వాతావరణం, చిన్నప్పటి (ఫ్రెండ్స్) అదీగాక ఇంటి చుట్టూరా ఉండే బంధువులు. అంతేగాకుండా ఆయన చదువుకున్న కాలేజీలోనే రిటైర్డ్ అవటం. తర్వాత కూడా సర్వీస్ మోటివ్‌తో నడిచే వ్యక్తిత్వమే తనది. అందుకే అభిరుచికి అనుగుణంగా ఆల్ పెన్షనర్స్ ఆఫీస్‌లో బాధ్యులలో ఒకరుగా ఉండటం తన సర్వీసును అందించటం నేటివరకూ నిరాటంకంగా జరిగిపోతోంది అంటూ మాలిని, నేను మాట్లాడుకున్నాం. మావారి గురించి అన్నీ వింటూ ఊ కొడుతున్నాడు రమేష్.
మధ్య మధ్యలో తన కళాశాల విశేషాలు, భార్య రజని పనిచేసే కళాశాల వివరాలుÑ మా పిల్లల వివరాలు, పద్మిని, చంద్రిక పిల్లల వివరాలు అన్నీ దొర్లసాగాయి మాటల్లో. ఒక్క హాసిని పిల్లలు తప్ప మిగతా మా అందరి పిల్లలూ సీనియర్లు, జూనియర్లు ఒకరికొకరు. ఎందుకంటే దాదాపుగా మా పిల్లలంతా ఒకే ఏజ్ గ్రూప్ అవటంతో మేము, మా ఫ్రెండ్సెవరింట్లో కలిసినా దాదాపుగా ఈ కబుర్లన్నీ రిపీట్ అవుతూనే ఉంటాయి, మా మధ్యన, పిల్లల మధ్యన. అందరికీ ఇష్టమైన కబుర్లవటం వలన ఎన్నిసార్లు విన్నా విసుగు అన్పించదు ఎవరికీ. ఇది కదా, నిస్వార్థ పరమైన ఆప్యాయత అంటే అన్పిస్తుంది నాకు ఈ ముచ్చట్ల వనం పురివిప్పి నాట్యం చేస్తుంటే.
‘‘ఈ కబుర్లకు కామాలే తప్ప, ఫుల్‌స్టాప్ పడదని తెలుసు అందుకే, రమేష్ ఫ్రెష్ అవ్వు వెళ్లు’’ అన్నా నేను
సరేనన్నట్లుగా తల ఊపి లోపలికి వెళ్ళాడు రమేష్.
ఇంకా మా ఇద్దరి ముచ్చట్ల లింకును బలవంతంగా తెంచి, నెమ్మదిగా మాలినికి కేటాయించబడిన అనేకంటే తను ఇక్కడికి వచ్చినప్పుడల్లా అంటే కొడుకు, కోడలు దగ్గర ఉండాల్సి వచ్చినప్పుడల్లా ఉండే రూమ్ అంటే సబబేమో. ఆ రూమ్‌లోనికి వచ్చి ఒకరి తర్వాత ఒకరు ఫ్రెష్ అయ్యాము. ఇళ్లలో బాగా పంజాబీస్, డ్రస్సులలో, నైటీలలో ఉండే అలవాటేమో చీరలు మార్చుకుని నైటీలు వేసుకోగానే ప్రాణానికి, శరీరానికి కూడా హాయిగా అన్పించసాగింది మాకు. ఇద్దరం బాల్కనీలో వేయబడిన కుర్చీలలో కూర్చున్నాం. అపార్టుమెంటు క్రింది భాగమంతా ఇది ఫలానా, ఇది ఫలానా అని చేత్తో చూపిస్తూ వరుసగా చెప్పుకొస్తోంది మాలిని నాతో. ఇంతలో అత్తయ్యా, ఆంటీ రండి టిఫెన్ తిందురుగానీ అంటూ పిలుస్తూ మా దగ్గరకు వచ్చింది రజని.
బాగా పరికించి చూస్తున్నా రజనిని. పసుపు, తేనె కల్సిన వర్ణంలో ఉంది ఆమె ముఖం. తీరైన కనుబొమ్మలు. నవ్వినపుడు తళుక్కుమనే పలువరుస, నల్లగా ఉండే కురులు. కొంచెం బొద్దుగా తయారైంది. గతంలో మా ఊరు ఒక ఫంక్షన్‌కి వచ్చినప్పుడు చూసిన దానికంటే ఇప్పుడు. షాపింగ్‌కు వెళ్ళొచ్చి వెంటనే వంట డ్యూటీలోకి నేరుగా వెళ్ళిపోయిందనటాన్కి సాక్ష్యంగా తన నుదుటి మీద చిరుచెమట అలుముకుంది. దానిపై లైటు కాంతి పడటం వల్ల రంగోలీ మీద జల్లిన తళుకుల్లాగా మెరవసాగాయి. ఈ అమ్మాయి, రమేష్ ఇద్దరూ లెక్చరర్లే, డిగ్రీ కాలేజీలో. చాలా చిన్న వయస్సులోనే జాబ్సు కొట్టుకున్నారు. ‘ఇద్దరూ కష్టపడి సంపాదించుకుంటున్నారు. చక్కగా రెండు అపార్టుమెంట్లు కొనుకున్నారు.’ అని మాలిని చెప్పింది ఒకసారి. ఒకటేమో హైదరాబాద్‌లోనట. ఇదిగో ఇప్పుడుంటున్నది రెండవది. ఇంకా సంవత్సరం కూడా కాలేదు గృహప్రవేశం అయి. రమ్మని పిలిచారు గానీ మేము రాలేకపోయాము ఆ టైంకి. ఇంట్లో బంధువులుండటం వల్ల.
‘‘ఏంటమ్మాయి! మీ ఇంటితోపాటు, నువ్వు… మీరిద్దరూ తెగ పోటీపడిపోతున్నారు తళుక్కుమంటూ’’ అన్నా చిరునవ్వుతో.
తను నవ్వేసింది చిరు సిగ్గుతో. ‘‘మీరలాగే అంటారాంటీ ఎప్పుడూ… ముందు మీరు రండి టిఫిన్‌కు అని మరోసారి చెప్పి తను డైైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి, హాట్ ప్యాక్ ఓపెన్ చేసి, మా ఇద్దరికీ ఇడ్లీలను ప్లేట్లు నిండుగా పెట్టి, పల్లీ చట్నీ, కారప్పొడితో వడ్డించింది. వాటర్ బాటిల్స్‌ని సిద్ధం చేశాడు రమేష్.
‘‘నేనేమన్నా కొత్త చుట్టాన్నా ఏంటి రమేష్? మేము తెచ్చుకుంటాంగా కావలసినవి’’ అన్నా నవ్వుతూ.
తను కూడా ప్రతిస్పందనగా నవ్వుతూ ‘‘చల్లారిపోతాయి ఆంటీ త్వరగా తినేయండి’’ అంటూ తనకు ఏదో సిస్టమ్ వర్క్ ఉందని చెప్తూ తన బెడ్‌రూంలోకి వెళ్ళిపోయాడు రమేష్.
అసలు మజ్జిగో లేకపోతే ఇద్దరం చెరో గ్లాసుడు పాలో తాగి పడుకుందాం, పొట్ట లైట్‌గా ఉంటుందనుకున్నాం, ఆటోలో వచ్చేటప్పుడు మాలినీ, నేను. ఇప్పుడు పూర్తి వ్యతిరేకంగా మారిపోయింది మా ప్లానంతా. ఇడ్లీలు తెల్లగా, మృదువుగా నోట్లో వేసుకుంటుంటే ఇట్టే కరిగిపోతున్నాయి. ప్లేట్లు ఖాళీ అయిపోయాయి. మాలిని, నేను ఒకళ్ల మొహం ఒకళ్లు చూసుకుని ఒకటే పగలబడి నవ్వుకున్నాం, మా తిండిని మేమే చూసుకుంటూ.
రజనీని పిలిచి ‘‘చాలా థాంక్సమ్మా. మళ్లీ నా బొజ్జ ఫుల్ అయిపోయిందని’’ చెప్పా తనతో.
‘‘అసలు భోజనం చేస్తే మాకూ తృప్తిగా ఉండేది’’ అంది తను.
‘‘కాదమ్మా… అంకులు, నేనూ రోజూ నైట్ ఓట్స్‌గానీ, టిఫిన్‌గానీ ఇలా’’ అని ఖాళీ ప్లేటును చేత్తో చూపిస్తూ, ‘‘ఇలా తింటాం’’ అన్న నా మాటలకు చిరునవ్వులు చిందిస్తూ చూసింది రజని.
‘‘ఆంటీ రెస్ట్ తీసుకోండి. పడుకోండి’’ అనటంతో మాలినీ, నేను ఇద్దరం రూమ్‌లో బెడ్‌పై చేరిపోయాం.
అప్పుడు లింకు తెగిన కబుర్ల ప్రవాహానికి మళ్లీ లాకులు తెరిచాం. ముందు టిపినీలు తినటం, ఆ వెనుక మందులు తినటం మామూలే ననుకుంటూ ఎవరు వేసుకోవాల్సిన టాబ్లెట్లను వాళ్ళం మింగాము, తీసిన లాకులకు బ్రేకులు వేస్తూ.
ఫ్రెండ్సుతో కలిసినప్పుడల్లా మాటల్లో సాధక బాధకాలు దొర్లటం అతి సహజం. ఇప్పుడెలా ఉంది తను? ఫరవాలేదు ఫ్రీగా మాట్లాడుతోందా? అని అడిగా మాలినిని. తన కోడలిని ఉద్దేశ్యించి.
‘‘ఆ… అంతేనండీ… అన్నీ చేసి పెడుతుంది. డైనింగ్ టేబుల్ మీద తినమని. వాడు రమేష్ కూడా అంటాడు రోజూ. ‘మమ్మీ నువ్వు మాత్రలు వేసుకోవలసిన దానివి మాతోపాటు లేకపోతే అందరం తినటం అయ్యేవరకు ఆగటం దేనికి, తినేయ్యెచ్చుగా టైముకని ఒక్కోసారి కోప్పడుతుంటాడని’’ కూడా చెప్పింది మాలిని.
‘‘వాళ్ళిద్దరూ తినకుండా, ముఖ్యంగా పిల్లలు తినకుండా, నాకేమీ తినబుద్ధి కాదు’’ అంది మాలిని.
అందులో వాళ్ళకంటే నేను ముందుగా తింటే బాగోదనే సంకోచం వినపడిరది స్వరంలో.
మాలిని భర్త కాలం చేశారు. ఇప్పుడు తను ఒంటరి. భర్త రిటైర్మెంట్ అనంతరం వచ్చిన బెనిఫిట్స్‌ను కొడుకుకే ఇచ్చేశామని చెప్పింది గతంలో. ఇప్పుడు ఆర్థికంగా కొడుకు మీదే ఆధారం. అన్ని అవసరాలు, మెడికల్‌కు సంబంధించినవి సైతం సమకూరుస్తాడు. కానీ కొడుకు ముందు చేయి చాచలేని, నోరు తెరిచి అడగలేని సందర్భాలు, అవసరాలూ ఉంటాయి గదా! ఏమని అడుగుతా? నాకేమో అభిమానంగా ఉంటుంది అడగలేను అని తన ఇబ్బందిని తెలియజేసింది మాలిని.
నిజమే కొడుకులని అనే కాదు, కట్టుకున్న భర్తను కూడా అడగలేని పరిస్థితులుంటాయి కుటుంబాల్లో అదే సంపాదిస్తూ ఉంటే, ఉద్యోగంలో ఉంటే ఒకప్పుడు కాకుంటే మరోసారైనా కాస్త అడిగే ఆస్కారం ఉంటుంది. అదీ లేకపోతే నిజంగా కష్టమే. ఎందుకంటే ఇలాంటి ఒడిదుడుకులకు అతీతమేం కాదు నా పరిస్థితి కూడా.

52 comments
https://shorturl.fm/6539m
https://shorturl.fm/j3kEj
https://shorturl.fm/xlGWd
https://shorturl.fm/Xect5
https://shorturl.fm/Xect5
https://shorturl.fm/0oNbA
https://shorturl.fm/VeYJe
https://shorturl.fm/LdPUr
https://shorturl.fm/Kp34g
https://shorturl.fm/nqe5E
Earn passive income this month—become an affiliate partner and get paid! https://shorturl.fm/Rxeu2
Refer friends, collect commissions—sign up now! https://shorturl.fm/nMUcn
Earn passive income on autopilot—become our affiliate! https://shorturl.fm/nwTsn
Earn passive income this month—become an affiliate partner and get paid! https://shorturl.fm/IbR9A
Start earning every time someone clicks—join now! https://shorturl.fm/Mapug
Boost your income effortlessly—join our affiliate network now! https://shorturl.fm/iD4vS
Start sharing, start earning—become our affiliate today! https://shorturl.fm/3eJWv
Monetize your traffic with our affiliate program—sign up now! https://shorturl.fm/1Zv3M
Promote our products—get paid for every sale you generate! https://shorturl.fm/VgXqv
Share your unique link and earn up to 40% commission! https://shorturl.fm/6XYgn
Earn passive income this month—become an affiliate partner and get paid! https://shorturl.fm/mcGVz
Turn your audience into earnings—become an affiliate partner today! https://shorturl.fm/P6NH2
Join our affiliate program and start earning today—sign up now! https://shorturl.fm/MvtHW
Tap into unlimited earnings—sign up for our affiliate program! https://shorturl.fm/bkwGd
Join forces with us and profit from every click! https://shorturl.fm/TSdvr
Start earning on autopilot—become our affiliate partner! https://shorturl.fm/3Rra4
Share our link, earn real money—signup for our affiliate program! https://shorturl.fm/JExEr
Monetize your traffic instantly—enroll in our affiliate network! https://shorturl.fm/tZ5CN
Share our products and watch your earnings grow—join our affiliate program! https://shorturl.fm/fgYzY
Boost your income—enroll in our affiliate program today! https://shorturl.fm/L2va1
Invite your network, boost your income—sign up for our affiliate program now! https://shorturl.fm/mPbUx
Boost your profits with our affiliate program—apply today! https://shorturl.fm/O5GQ4
Turn traffic into cash—apply to our affiliate program today! https://shorturl.fm/FVdzv
Monetize your influence—become an affiliate today! https://shorturl.fm/1hGZG
Tap into unlimited earnings—sign up for our affiliate program! https://shorturl.fm/QJvzR
Turn referrals into revenue—sign up for our affiliate program today! https://shorturl.fm/Eg4iB
Promote our brand and get paid—enroll in our affiliate program! https://shorturl.fm/k3YgA
Get started instantly—earn on every referral you make! https://shorturl.fm/EgvP0
Refer customers, collect commissions—join our affiliate program! https://shorturl.fm/nXm8p
Monetize your traffic with our affiliate program—sign up now! https://shorturl.fm/Gs63k
Maximize your income with our high-converting offers—join as an affiliate! https://shorturl.fm/GwXnd
Refer and earn up to 50% commission—join now! https://shorturl.fm/vQ3Tp
Promote our products—get paid for every sale you generate! https://shorturl.fm/jZ0wF
Share your unique link and earn up to 40% commission! https://shorturl.fm/Z8kwW
Promote our products and earn real money—apply today! https://shorturl.fm/7OIGC
Get rewarded for every recommendation—join our affiliate network! https://shorturl.fm/lkqHj
Join our affiliate program and start earning today—sign up now! https://shorturl.fm/rb7tI
Turn traffic into cash—apply to our affiliate program today! https://shorturl.fm/DjTzy
Start sharing our link and start earning today! https://shorturl.fm/nVaq3
Unlock exclusive rewards with every referral—enroll now! https://shorturl.fm/xHtQ1
Start profiting from your network—sign up today! https://shorturl.fm/I4ZEG
Promote our brand, reap the rewards—apply to our affiliate program today! https://shorturl.fm/egYCh