ఆధునికత అంటే అన్నీ ఉండటం, సకల సౌకర్యాలు అనుభవించడం, యాస భాషల్లో హుందాగా ఉండటం, ఖరీదైన బట్టలు కట్టుకోవడం అనుకుంటాం. కానీ ఆధుకత అంటే ఇవేవీ కావు అనేది ప్రకృతిని దగ్గరి నుంచి గమనిస్తూ, వాటిని అనుభూతి చెందితే తప్ప అర్థమే కాదు. వాస్తవానికి ఇప్పటికీ ఆ్రఫికా ఖండంలోని నల్లవాళ్ళను చూస్తే వాళ్ళు ఇంక ఆధునికతకు అందిపుచ్చుకోలేదు. చాలా వెనుకబడి ఉన్నారు అనుకుంటాం. కానీ అదేమీ నిజం కాదు. నిజానికి ప్రకృతిలోని సకల జీవరాశుల్లో మనిషి మాత్రమే అన్నింటికి దూరంగా నివసిస్తూ ఆధునికత పేరుతో గదుల్లో బంధించుకొని కూర్చున్నాడు. మిగతా ఏ జీవరాశి ప్రకృతికి దూరంగా బంధించుకొని కూర్చొలేదు. పశుపక్షాదులు అన్ని కలిసిపోయి, ఆనందిస్తూ, ప్రకృతిని అనుభూతి చెందుతూ స్వేచ్ఛగా విహరిస్తున్నాయి ఒక్క మనం తప్ప. ఇది ప్రకృతికి ఎంత విరుద్ధం కదా…?
నిజానికి నాగరికతలు అన్నీ నదుల వెంట విలసిల్లాయి అని చరిత్ర చెబుతుంది కానీ ఇవాళ ఆ నదుల వెంట మనం ఎక్కడున్నాం…. మనం లేము కానీ మిగతా జీవకోటి అంతటా అక్కడ కొలువు తీరింది. మనం గమనిస్తున్నామో లేదో కానీ మనిషి పుట్టుక నదుల దగ్గరే మొదలై చివరకు నదుల దగ్గరే ముగుస్తుంది, ఒక్క మధ్య జీవితం తప్ప. అందుకే ప్రకృతికి దూరంగా బతుకుతున్న మనం కనీసం అప్పుడప్పుడైనా ఆ నదుల దగ్గరకు వెళ్ళి ఆ జీవితాన్ని అనుభూతి చెందాలి. అందుకే ప్రపంచంలోని వివిధ దేశాలలోని నదీ తీరాలలో పర్యటించాలనే మా కోరికను ఈసారి కెన్యావైపు మళ్ళించాం. నైల్ నది ప్రవహించే దేశాలలో కెన్యా కూడా ఒకటి. నైల్ నదీ తీరంలో నడవాలనే కోరికతో హైదరాబాద్ నుండి కెన్యాకు బయలుదేరాం.
మేం ముంబాయి నుండి కెన్యా రాజధాని నైరోబీకి తక్కువ రేట్లలో టికెట్లు బుక్ చేసుకున్నాం. మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూతురు నైరోబీలో నివసిస్తుంది. ఆమె మాకు చాలా తక్కువ ఖర్చులో కెన్యా అందాలన్నీంటిని చూసేలా ఒక ఓపెనం టాపం జీపం మాట్లాడి మమ్మల్ని కెన్యాకు ఆహ్వానించారు. మాతోపాటు ఇంకే జంట, ఒక లేడీ డాక్టరు, మరో మహిళా వ్యాపారవేత్త మొత్తం ఆరుగురం కలిసి ఓపెన్ టాప్ జీప్‌లో మా ప్రయాణం మొదలెట్టాం.
ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నేను కెన్యా పర్యటనకంటే ముందు వికారాబాద్ దగ్గర ఉన్న అనంతగిరి హిల్స్ కు వెళ్ళి వచ్చాను. అక్కడికి వెళ్ళినప్పుడు ట్రెక్కింగ్ చేస్తూ ఉంటే స్లిప్ అయి కిందపడ్డాను. అప్పటి నుండి కొద్దిగా నడుం నొప్పి స్టార్ట్ అయింది. అందువల్ల కెన్యా పర్యటనలో జీపులో ముందు సీట్లో కూర్చున్నాను.
మొదట మేము నకూర్ సరస్సుకు వెళ్ళాం. ఇది భూమధ్య రేఖకి దగ్గరగా ఉంది. ఇక్కడి ప్రకృతి దృశ్యాలను చూడాలంటే రెండు కండ్లు చాలవు. వర్ణిస్తే ఒక దృశ్యకావ్యంగా అవుతుంది. ఈ సరస్సు చుట్టూ యోఫోర్బియా చెట్లు ఉన్నాయి. ఇదొక ఔషధ మొక్క. ఈ పేరు బొంతజెముడు. దాని శాస్త్రీయ నామం యుఫోర్బియా. సహజంగా చెట్లనగానే ఒకలాంటి భావన కలుగుతుంది. దాని తెలుసుకోవాలనే తపన నాలో పెరిగి. ఈ మొక్కలు ఎక్కువగా కొండ దిగువ ప్రాంతాలైన గలస మట్టి నేలల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఈ చెట్టును గీరినప్పుడు, లేదా గిల్లినప్పుడు తెల్లని పాల లాంటి ద్రావం కారుతుంది. ఈ చెట్లు కొమ్మలు… కొమ్మలుగా పైకి ఎగబాకుతాయి. చెట్లు పైకి ఎదిగే కొద్ది కింది కొమ్మలు రాలిపోతాయి. ఇంకా యుఫోర్బియా చెట్లతోపాటు ఎల్లో ఫీవరం చెట్లు కూడా చాలా అందంగా ఉన్నాయి.
అత్యంత అందమైన నకురు సరస్సు….
దూరంగా కొండలు… పక్కనే ఉన్న ‘నకురు సరస్సు’ అందాల్ని చూడాలని వెళ్ళాం. కెన్యాలో నకూరు నేషనల్ పార్క్ కు దగ్గరలో ఉండటంవల్ల దీనికి నకూరు సరస్సు అని పిలుస్తారు. ఇది తూర్పు ఆఫ్రికన్ ఫాల్ట్ జోన్ వెంట ఉన్న సహజ జలాశయాలలో ఇదొకటి. ఈ సరస్సు సముద్రమట్టానికి 1759 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది ఎత్తయిన పర్వత జలాశయాలలో ఒకటి. నకూరు సరస్సులో ఫ్లెమంగోలు గూడు కట్టుకోవడంవల్ల ఈ సరస్సు అత్యంత ప్రసిద్ధి చెందింది. ఈ పక్ష్లు సంఖ్య చాలా తక్కువ. ఫ్లెమింగోలతోపాటు పెలికాన్లు ఇక్కడ ఎక్కువగా నివసిస్తాయి. ఇంకా వీటితోపాటు లేకం నకూరులో పెద్ద సంఖ్యలో జంతు జాతులు నివశిస్తున్నాయి. ఖడ్గమృగాలు, ఇంపాలా జింక, ఉగాండా జిరాఫీ, నీటిమేక, ఆఫ్రికన్ గేదె, క్షీరదాలు, వివిధ రకాల సరీసృపాలు ఉన్నాయి. వీటిని చూడటానికి ఎక్కడెక్కడి నుండో పర్యాటకుల వేలసంఖ్యలో అక్కడికి వస్తారు.
ఫెలికాన్ పక్షుల సందడి….
సరస్సు నిండా ఫెలికాన్ పక్షులు వేలసంఖ్యలో విహారిస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఫెలికాన్ పక్షుల గురించి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నా… ఈ పక్షులకు పొడవాటి ముక్కు, పొట్టితోక, చిన్నకాళ్ళు, పెద్ద రెక్కలు, గోధుమ లేదా తెలుపు రంగులో ఉంటాయి. ఇవి ఎక్కువగా భారతదేశం, ఆఫ్రికా, ఇరాక్ దేశాలకు వలస వెళ్తుంటాయి. మన దేశంలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దుల్లోని కొల్లేరు సరస్సుకు ఇతర దేశాల నుండి ఫెలికాన్లు వస్తాయి. ఫెలికాన్ రంగునుబట్టి అవి ఏ దేశానికి చెందినవో గుర్తించవచ్చు. స్పాట్ బిల్ట్, డాల్మెషియ్, పింక్ బ్యాక్డ్, ఆస్ట్రేలియాన్, పెరువియన్ ఇలా బోలెడు ఉన్నాయి. సైబీరియా, ఆస్ట్రేలియా, అమెరికన్ వైట్ ఫెలికాన్లు అక్కడ వేసవిని భరించలేక వేల కిలోమీటర్లు దాటి వచ్చి…. ఇక్కడ శీతాకాలాన్ని ఆస్వాధిస్తాయి. అయితే మేం చూసిన నకూర్ సరస్సులో మాత్రం గోధుమ రంగు ఫెలికాన్లు వేల సంఖ్యలో ఉన్నాయి. ఇవి బాగా ఎత్తు నుండి నీటిలోకి మునిగి లోతుగా డైవ్ చేసి చేపల్ని పడతాయి. ఫెలికాన్ల గురించి ఎందుకు ఇంతగా చెప్తున్నంటే ఇవి మన దేశంలోని కోల్లెరు సరస్సుకు ప్రతి ఏటా డిసెంబర్ లేదా నవంబర్ మాసంలో మన దేశానికి వలస వచ్చి సందడి చేసి వెళ్తాయి కాబట్టి.
ఇలే మేం రెండు గంటలపాటు సరస్సు వెంట అటూ… ఇటూ తిరుగుతూ…. పక్షులతో ఫోటోలు దిగాం. ఒక విధంగా మేం నకూరు సరస్సును వదిలి వెళ్ళలేకపోయాం. ‘ఇంకొంచెం టైం ఇక్కడే స్పెడ్ చేస్తే బాగండు కదా’ అనిపించింది. ‘ఇక చాలు, ఇక్కడి నుండి బయలుదేరండి’ అన్నట్టుగా అప్పుడే వర్షం మొదలైంది. దాంతో మేం పరుగో పరుగో అనుకుంటూ జీప్ లోకి వెళ్ళి కూర్చోన్నాం.
నైవాషా సరస్సు….
నకూరు సరస్సు నుండి నేరుగా నైవాషా సరస్సుకు వెళ్ళాం. ఇదొక స్వర్గధామమనే చెప్పవచ్చు. ఇక్కడ నైవాషా సరస్సు సముద్రమట్టానికి 1886 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది రాజధాని నైరోబికి వ్యాయవ్యంగా ఉన్నటువంటి మంచి నీటి సరస్సు. ఈ సరస్సులో దాదాపుగా 400 పైగా పక్షులు ఉన్నాయి. ఈ సరస్సులో మరొక అద్భుతం తెల్లటి కొంగల సందడి. ఇవి ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సరస్సులోని తెల్లటి కొంగలు మరో రకమైన అందంగా చెప్పొచ్చు. వాటిని చూసి చాలాసేపు ఎంజాయ్ చేశాం.
మాసాయి మారా నేషనల్ పార్క్….
ఇది కెన్యాలో ప్రధాన వన్యప్రాణుల పార్క్‌ల్లో ఒకటి. ఇది టాంజానియా సరిహద్దుల్లో నైరుతి కెన్యాలో ఉంది. ఇక్కడంతా నేల గడ్డిభూములతో నిండుకొని ఉంటుంది. ఇదొక అద్భుతమైన దృశ్యం. రంగురంగుల సంస్కృతి, వన్యప్రాణుల విన్యాసాలు పర్యాటకులను ఆనందింపజేస్తాయి. దీనిలోకి ప్రవేశించాలంటే ఇతర దేశీయులకు 80 డాలర్ల వరకూ చార్జ్ చేస్తారు. మేము టికెట్ ఒక సఫారిలో లోపలికి వెళ్ళాము. అక్కడికి వెళ్లగానే మాకు మసాయి మారా గిరిజనులు స్వాగతం పలికారు. అక్కడే మాకు వారు భోజనం ఏర్పాటు చేశారు. భోజనానికి మాకు లావు బియ్యంతో అన్నం, మటన్ క్రరీ వండారు. దాంతోపాటు బ్రెడ్, వెన్న, జామ్ పెట్టారు. భోజనం చేసిన వెంటనే అందరం కలిసి మాసాయి మారా నేషనల్ పార్క్ చూడటానికి వెళ్ళాం. మారాయి మారా నేషనల్ పార్క్ చూడటానికి వెళ్ళాం. మాసాయి మారా నేషనల్ పార్క్‌లో చాలా రకాల పక్షులు నిరంతరం గాల్లో విహరిస్తుంటాయి. రాబందులు, క్రెస్టెడ్ ఈగల్స్, మరబౌ కొంగలు, గినియా కోళ్ళు, సోమాలి ఉష్ణపక్షి, కిరీటం కలిగిన క్రేన్లు, పిగ్మీ ఫాల్కన్లు ఇంకా చాలా ఉన్నాయి. మావో ప్రజల (మాసాయి) భాషలో ‘మారా’ అనే పదానికి అర్థం ‘మచ్చలు’ అని. నిజానికి దూరం నుండి చూస్తే ఈ ప్రాంతంలోని మైదానం మొత్తం చిన్న చిన్న చెట్లతో మచ్చలుగా కనిపిస్తుంది. మారా మైదానాలు నల్లటి చారలతో పెయింట్ వేసినట్లు కనిపిస్తాయి. నిజంగా ఇదొక అరుదైన దృశ్యం. కెన్యా అంతటా సుమారు రెండు మిలియన్ల అడవి దున్నలు, సుమారు రెండు లక్షల జీబ్రాలు, అర మిలియన్ గజెల్లు ఇంకా ఇతర శాఖాహార జంతువులున్నాయి. చిరుతపులి, సింహాలు, హైనాయిడ్ కుక్కలు, అలాగే నక్కలు, రాబందులు, మరబౌ వంటి మాంసాహారులు కూడా ఉన్నారు.
ఇక మేం వెళ్ళిన రోజు జరిగిన సంఘటన గురించి ఈ సందర్భంగా చెప్పాలి. మేం చేరుకునేసరికి అక్కడ మైగ్రేషన్ మొదలైంది. మైగ్రేషన్ అంటే ఏమిటి అనే సందేహం రావొచ్చు. మైగ్రేన్ అంటే ఏం లేదు జంతువులు గుంపులుగా ఒక ప్రాంతం నండి మరొక ప్రాంతానికి వలస వెళ్లడం. తరచూ మన దగ్గర కూడా చూస్తుంటాం. ఆఫ్రికా, దక్షిణ అమెరికా నుండి కొన్ని కొంగలు, పక్షులు వలస వచ్చి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. మేం ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇదే సంఘటన జరుగుతుంది. కొన్ని లక్షల సంఖ్యలో అక్కడ అడవి దున్నలు కనిపించాయి. అవి చూడటానికి పెద్ద పెద్ద బ్రరెల్లా ఉండి జుట్టు కూడా ఉంటుంది. అన్నీ కలిసి లక్షల సంఖ్యలో ఒక దగ్గర గుమ్మి గూడతాయి. అవి నడిచే దార్లు చూస్తే ఎక్కడో పేరంటానికి పిలిచినట్టుగా వెళ్తుంటాయి. ఒకదాన్ని మరొకటి పిలిచినట్లుగా ఒకదాని మరొకటి పరిగెత్తుకుంటూ వెళ్తాయి.
ఇవన్నీ ఒకే వరుస క్రమంలో ఎక్కడెక్కడి నుండో వందల కిలోమీటర్లు నడిచి అన్ని ఒకచోటకి చేరతాయి. ఈ అడవి దున్నలు (వైల్ బిట్స్) అన్నీ ఒక చోటకి చేరాక…. మాసాయి కాలువ అవతలివైపు ఉండే గట్టులోకి చేరతాయి. అవతలివైపు మొత్తం పచ్చగడ్డితో నిండి ఉంటుంది. ‘మనం అక్కడికి వెళ్తాం’ అని ఆ జంతువులు మాట్లాడుకుంటాయట అని స్థానికులు చెబితే ఆశ్చర్యపోయాను. నిజంగా అలాగే అనిపించింది ఆ అడవి దున్నలు పరుగులు చూస్తే…
అవి ఎప్పుడైతే ఈ మాసాయి నది దగ్గరీ వస్తాయో…. వాటిల్లోంచి ఐదు లేదా ఆరు అడవి దున్నలు నీటిలోకి తొంగి చూస్తాయి. అలా రోజంతా ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటలవరకు నీటిలోకి తొంగి చూస్తూ, వాటిల్లో అవి మాట్లాడుకున్నట్లు అన్నీ ఒకే చోటకు చేరుతాయి. ఎప్పుడైతే మొసళ్ళు తక్కువగా ఉన్నాయో, అవి కనిపించడం లేదా అని వాటికి అనిపిస్తుందో అప్పుడు అన్నీ కలిసి ఒక దాని వెనుక ఒకటిగా నదిలోకి దూకుతాయి. అవతలివైపు ఒడ్డు చేరడానికి ఇదొక మార్గం. దీనినే మైగ్రేషన్ అంటారు. మేం మధ్యాహ్నం ఒంటి గంటకి వెళ్ళి నాలుగు గంటలవరకు ఈ మైగ్రేషన్ దగ్గర ఉన్నాం. ఆ క్షణం ఎంత ఉద్విగ్నంగా ఉందో చెప్పలేను. ఈ మైగ్రేషన్ దృశ్యాన్ని చూడటానికి చాలామంది కొన్ని నెలల తరబడి ఎదురుచూస్తారు. మేం వెళ్ళిన గంటలో ఇది చూడటం మా అదృష్టం అనీ, చాలా సంతోషంగా అనిపించింది.
అక్కడి నుండి వెళ్తూ ఉంటే వందల ఏనుగులు, జీ్బ్రాలు, సింహాలు, పులులు, అడవి దున్నులు అన్నీ కలిసి ఒకేచోట ఆహారం తినడం చూశాం. మాకు ఒక అడుగు దూరంలో ఒక పెద్ద సింహం తిరుగుతూ ఉంటే దానినే చూస్తూ ఒక గంట సమయం గడిపాం. ఆ రోజు ఒక 60 సింహాలవరకూ చూశాం. అవి కూడా 4 నుండి 5 సింహాలు గుంపులు… గుంపులుగా కలిసి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాం.
ఈ మైగ్రేషన్ అప్పుడు మొసళ్ళు కూడా ఎక్కడో దాక్కుని, అవి నది దాటుతున్నప్పుడు వాటిని చంపి తింటాయని చెప్పారు అక్కడి స్థానికులు. అవి తినడం మొదలవగానే మిగతా జంతువులు ఆగిపోతాయని చెప్పారు మాతో వచ్చిన గైడ్. ఇలా జంతువ అంత గ్రహింపును కలిగి ఉండటం చాలా ఆనందంగా అనిపించింది. ప్రాణరక్షణ గురించి ఆలోచించడం ఎంత విడ్డూరం. లక్ష జంతువులు గుమిగూడటమేమిటి? అవి అన్నీ ఎవరో చెప్పినట్లుగా బార్డర్ దాటడమేంటి? అని చాలాసేపు ఆలోచించాను. జంతువులకు కూడా అద్బుతమైన తెలివితేటలు ఉంటాయి. కాకపోతే మనలా మాటలు రావు అంతే తేడా. అన్ని సింహాలు ఉన్నా, వందలమంది యాత్రికులు చూడటానికి వచ్చినా, సింహాలు ఏమీ అనడం లేదు. స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అవి అన్నీ చూసి మేం రాత్రి కావడంతో భోజనం కానిచ్చేశాం. మసాయి మారా గిరిజనులు మా గుడారాలకు వచ్చారు. ఆ రాత్రి వారి డ్యాన్స్ చూశాం. వారు స్వయంగా వండిన అన్నం, కూరలు తిని అక్కడే ఉన్న మా గుడారంలో పడుకున్నాం.
కిలి మాంజారో….
ఈ మధ్యకాలంలో తరచూ మనం వింటున్న పేరు. ఒకటి శంకర్ దర్శకత్వం వహించిన రోబో సినిమాలో ‘కిలో మంజారో భలా భల్లి మంజారో యారో యారో’….. అంటూ ప్రస్థావన వస్తే, రెండోది ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రల్లోని సోషల్ వెల్ఫేర్ హోటల్లో చదువుతున్న పిల్లలు ఆ్రఫికాలో అతి ఎత్తయిన ఈ పర్వతాన్ని అధిరోహించినట్టు మనం వార్తల్లో చూస్తున్నాం. కేవలం 13 ఏండ్ల చిన్న వయసులోనే పూర్ణ మాలవత్ కిలి మంజారోని కూడా ఎక్కి రికార్డు సృష్టిఁచడం ఒకటైతే అనంతపురం జిల్లా అగ్రహారానికి చెందిన తొమ్మిదేండ్ల అమ్మాయి కిలి మంజారోని అధిరోహించిన వార్తను కూడా మనం చూశాం. అంటే ఇంత చిన్న పిల్లలు కూడా వెళ్ళిన వార్తలు మనం చూశాం. చిన్న పిల్లలు కూడా ఈ కిలిమంజారో పర్వతాన్ని చాలా సునాయాసంగా ఎక్కడం అధిరోహించడం చూసిన నేను. కెన్యా వెళ్ళినప్పుడు నేనెందుకు చూడలేను అని అక్కడికి వెళ్ళి చూడటం జరిగింది.
మర్నాడు మేం మసాయి మారా నేషనల్ పార్క్ నుండి ఉదయం కిలి మంజారో చూడటానికి బయలుదేరాం. కిలిమంజారో పర్వతం టాంజానియా రాష్ట్రంలో ఉంది. కానీ కెన్యా సరిహద్దుకు దగ్గరలో ఉందని తెలిసి చూడటానికి వెళ్ళాం. పర్యాటకుల సందడితో కిలిమంజారో నిండిపోయి ఉంది మేం వెళ్ళేసరికీ. ప్రముఖ రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే కిలిమంజారో పర్వతం గురించి ఒక కథ కూడా రాశారు. అది ‘కిలి మంజారో స్నో’ ఇది మొదటిసారి ఎస్కైర్ పత్రికలో 1936లో ప్రచురించబడింది. ఈ కథ ఆధారంగా సినిమాలు కూడా తీశారు. దీన్నిబట్ఠి అర్థం చేసుకోవచ్చు ఈ పర్వతం ప్రాముఖ్యతను.
ఇది రెండు మిలియన్ సంవత్సరాల పురాతనమైన అగ్నిపర్వతం. ఆ్రఫికాలోనే ఎత్తయిన అగ్నిపర్వతం. ఇక్కడ సినిమా షూటింగంలు నిరంతరం జరుగుతునే ఉంటాయి.
కిలిమంజారో అంటే అర్థం ‘ప్రకాశించే పర్వతం’ అని. ఈ పర్వతం పై భాగం మొత్తం తెలుగురంగులో ఉండటంవల్ల ఈ పేరు పెట్టారు. కిలిమంజారో చుట్టూ, పరిసరా ప్రాంతాల్లో ఎలాంటి పర్వతాలు లేవు. మొత్తం చదునుగా ఉండే మైదాన ప్రాంతం. ఇది ఉష్ణమండల మైదాన ప్రదేశం. ప్రముఖంగా కెన్యాలో మొక్కలు, జంతువులు, ఎత్తయిన పర్వతాలు పర్యాటకులను ముగ్ధమనోహరులను చేస్తుంది. ఈ పర్వతం కింది భాగంలో పంట పొలాలు, గడి్డతో నిండి పచ్చని తివాచీల కనిపిస్తుంది. ప్రపంచ నలుమూలల నుండి కిలిమంజారోని చూడటానికి వస్తుంటారు. ఇది టాంజానియా దేశానికి ప్రధాన పర్యాటక ఆధాయ వనరుగా చెప్తుంటారు.
కిలిమంజారో నుండి నేరుగా ‘హెల్స్ గేట్ నేషనల్ పార్క్’కు వెళ్ళాం. అక్కడి నుండి ఒక గుట్టపైకి ఎక్కి దిగాం. తర్వాత ఒక జలపాతం దగ్గరకు వెళ్లడానికి బయలుదేరాం. ఎన్నో కొండల మధ్య ఒక్కొక్కరం దాటాలంటే, అంతా పాచిగా ఉంది. జాగ్రత్తగా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఆ కొండకి ఆనుకొని ఒక్కొక్క అడుగూ జరుగుతూ ఎంతో కష్టంగా ఆ వాటర్ ఫాల్ దగ్గరకు వెళ్ళి, మరలా తిరిగి వచ్చాం. దీనికి హెల్స్ గేట్ అనే పేరు నిజంగా సార్థకమే.
అక్కడి నుండి ఎలిఫెంట్స్ ఆర్ఫనేజ్ కి వెళ్ళాం. అక్కడ చాలా పిల్ల ఏనుగులు ఉన్నాయి. వాటికి స్నానం చేయించడం, వాటితో చిన్న చిన్న ఫీట్స్ చేయించడం అన్నీ చూసి మేం తిరిగి వచ్చేశాం. కెన్యాలో నైలునదీ ప్రవాహం చూశాం. పరీవాహాక ప్రాంతంలో నడక సాగించాం. కెన్యా లేకం నుండి తెల్లటి మంచులా నీరు ప్రవహిస్తుంది.
లేక్ విక్టోరియా…
దీనిని ‘సోర్చ్ ఆఫ్ నైలు’ అంటారు. విక్టోరియా లేకంలో పుట్టి బురుండి, రువాండా, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, టాంజానియా, కెన్యా, ఉగాండా, ఇథియోపియా, సూడాన్, సౌత్ సుడాన్, ఇంకా ఈజిప్టులలో ప్రవహిస్తుంది.
ముచేబిసన్ జలపాతం…
దీన్ని కబలేగా జలపాతం అని కూడా అంటారు. ఉగాండాలో ఉన్న ఈ జలపాతం నైలునదీ ప్రవాహంతో ఏర్పడింది. నైలునది ప్రవహిస్తున్న అన్ని ప్రాంతాలలోనూ జంతువులు, నీటి జంతువులు, చింపాంజీలు, బర్రెలు, ఏనుగులు ఉంటాయి. వీటిని మూర్ఛపోన్ ఫాల్స్ వద్ద కూడా చూడొచ్చు. ఈ ప్రాంతమంతా ఒక నేషనల్ పార్క్. నైలు నదిలో ప్రయాణించడానికి క్రూజెసం, వైట్ వాటర్ రాఫ్టింగ్ వంటివి ఈ ప్రాంతాలలో ఉన్నాయి. ఈ నైలునది వెంట ఆఫ్రికా క్రూజర్ పార్క్, కెన్యా సఫారీ ఉన్నాయి. ఈ నైలు నది ‘ఫాదర్ ఆఫ్ ఆఫ్రికన్ రివర్స్’ అనే పేరుతో ప్రసిద్ధి అంటారు.
ఈక్వేటర్ ప్రాంతమైన ఉగాండాలో మొదలుపెడితే, వైట్ నైల్, బ్లాక్ నైల్ గా మారుతుంది. ఈజిప్టులో నైలునది మట్టి నల్లగా ఉండి, ‘కెమ్ ఆర్ కెమి’ అనే పేరుతో ప్రసిద్ధి నొందింది. కెమ్ ఆర్ కెమి అంటే బ్లాక్ అని అర్థం. అంటే ఎప్పుడైతే వరదలు వస్తాయో ఈ ప్రాంతమంతా నల్లటి మట్టితో నిండిపోతుంది, అందుకే బ్లాక్ అంటారు.
7వ శతాబ్దికి చెందిన ప్రఖ్యాత గ్రీసు రచయిత హోమర్ రచన ‘ఒడిస్సీ’లో నైలునదిని నల్లటి దృఢమైన పురుషునిగాను, ఈజిప్టును స్త్రీ గాను తను అభివర్ణించాడు. ఇది అద్భుతమైన కల్పన.
నాకు ఈ నైలునది గురించి కొత్తగా వర్ణించాలని అనిపించింది. బ్లూ నైల్, వైట్ నైల్ ని చూసినప్పుడు ఈ బ్లాక్ నైల్‌ని చూసినప్పుడు ఇంద్రధనస్సులోని ఏడు రంగులతో ప్రతిబింబిస్తాయి. ఎలాగంటే అది అథియోపియాలో బ్లూ నైల్, కెన్యాలో వైట్ నైల్, ఈజిప్టులో బ్లాక్ నైల్. ఈ జలపాతం గుండా ఈ నది పారి ఇంద్రధనుస్సులు ఏర్పడి ఏడురంగులతో అందరినీ మురిపిస్తుంది. ఇన్ని రంగులమయంతో అలరారే నది ప్రపంచంలో ఇది ఒక్కటేనేమో… నైలు నది హంగులు, పొంగులు అందాలు, నేషనల్ పార్కులు అన్నీ చూసి సంతోషంగా తిరిగి వచ్చాం.
భూ మధ్య రేఖ (ఈక్వేటర్)
మేము కెన్యా పర్యటనల్లో చూసిన వాటిల్లో తప్పక చెప్పుకోవాలసింది భూ మధ్య రేఖ ప్రాంతం. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు భూ మధ్య రేఖ గురించి చదవడం తప్ప అక్కడ ఎలా ఉంటుందో అనేది అనుభవంలోకి రాలేదు. మేుము ఉన్న కెన్యాలో భూ మధ్య రేఖ ప్రాంతం ఉందని తెలియగానే దాన్ని ఎటైనా చూద్దామని బయలుదేరాం. ఈ భూమధ్య రేఖ అనేది 11 దేశాల గుండా పోతుంది. అందులో ఒకటి కెన్యా. ఈ భూమధ్య రేఖ ఉన్న ప్రాంతంలో మార్చ్ 20 నుండి సెప్టెంబర్ 20 మధ్య కాలంలో పగలు, రాత్రి సమానంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో సంవత్సరం పొడగున వాతావరణం ఒకటే ఉంటుంది. భూ మధ్య రేఖలు దూరం పోయిన కొలది వాతావరణంలో హెచ్చుతగ్గులు వస్తాయి.
మేము ఉన్న ప్రాంతం నుండి ఒక మూడు గంటల ప్రయాణంలో భూ మధ్య రేఖ ఉన్న ప్రాంతానికి చేరుకున్నాం. అక్కడ విలేజ్ లాంటివి, ఇల్లు లాంటివి లేవు కానీ రోడ్డుమీద ఒక దగ్గర ఇది భూమధ్య రేఖ ప్రాంతం అని సూచించేలా ఒక బోర్డు పెట్టారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన యాత్రికులు అక్కడి ఫోటోలు దిగుతూ ఆనందిస్తున్నారు. మేము ఆ ప్రాంతంలో దిగి కాసేపు చుట్టు పక్కల గమనించి వెనక్కి వచ్చాము.