A WINTER EVENING

by Palakurti Dinakar

A WINTER EVENING                               – Anugu Narasimha Reddy
Like characters in a play
One after the other
crossing the crossroads
A mother dragging her child home
Shop keeper closing his shutters to ‘call it a day’
Lamp post chasing the twilight with intensified energy
Feeling chill, clouds trying to hid above the sky
The wind by hugging the snow whispering the story of a spirit silently
Sparrows practicing silence sitting among the leaves of a tree
Evening ‘Azaan’ flowing from the heart of a mosque
like a moral story from a monastery
Snow dries in the air as there is ‘no room’ to fall
Moonlight looking for the mirrors of the wall to shine
Stars winking their eyes somberly
Nandivardanam* climbing the gate to touch the heaven
As the roads exhibiting their narrowness daily
Someone trying to cut across the ‘sea of chill’ with his bike
It’s like painting a black image on the blackest canvas
The circle around the light is dancing
The village is covered tightly by the cold blanket
Hating the unnatural makeup of the so-called dearest
Protesting on multistoried buildings
Exhibiting enmity on aberrant urbanization
The breeze turned towards the sons of the soil

The fruit-cart at the corner
The plum jujube at the crossroads
Fried groundnut under the electricity pole
Inviting affectionately
The ‘mother chill’
The poor only provides shelter.

(Translated from Original Telugu Poem ‘Seethakalam … Sayamkalam’ by Dr. Palakurthy Dinakar)
*Flower plant called Nerium Coronarium

 

నాటకంలో పాత్రధారుల్లా

ఒక్కరొక్కరే చౌరస్తా దాటేస్తుంటారు

ఓ తల్లి వీపులో చరిచి పిల్లను లాక్కెల్తుంది

అమ్మింది చాల్లే అనుకొని

షాపాయన షెటర్ లాగేస్తుంటాడు

ముసకైన కొద్దీ హుషారై

చీకట్లను తరిమేస్తుంది దీపస్థంభఁ

మబ్బులకు చలేసి నింగిపైకెక్కి దాక్కుంటై

మంచును కావులించుకున్న గాలి రహస్యంగా

బూచి కథ చెబుతుంది

చెట్ల ఆకుల నడుమ పిచ్చుకలు

నిశ్శబ్ధాన్ని సాధన చేస్తుంటాయి

మున్నాశ్రమంలో నీతి గీతంలా

మజీరు హృదయం నుండి

సాయంకాలపు అజా ప్రవహిస్తుంది

కురవడానికి జాగా లేక మంచుగాల్లో కలుస్తుంది

వెన్నెల మెరవడానికి గోడల అద్దాల్నివెతుక్కుంటుంది

మూస్తూ తెరుస్తూ చుక్కలు

కన్ను గీటుదాటాడుతుంటాయి

దేవలోకాన్ని తాకి రావాలని

నందివర్ధనం గేటెక్కి చూస్తుంది.

రోజు కురుచదనం రోడ్లమీద ప్రదర్శన చేస్తుంటే

ఒకడు మహా నిరసనగా ఎడతెగని చలి సముద్రాన్ని

బైకు బాకుతో కోసుకుపోతాడు

నల్లటి కాన్వాసుమీద నల్లరంగు బొమ్మేసినట్లు

మనుషులంతా మసక చీకట్లో కలుస్తుంటారు

దీపం చుట్టూ వలయం నర్తిస్తుంది

ఊరి చుట్టూ చలి దుప్పటి ముసురుకుంటుంది

ఐనవాళ్ళు ఆహార్యం మీద అయిష్టంతో

బహుళ అంతస్తుల భవనాలపై నిరసనలతో

నాజూకుల, నాగరీకాల కృత్రిమత్వాలపై విరోధంతో

చలిగాలి మట్టి బిడ్డల దిక్కు మళ్ళుతుంది.

మూలమీద పండ్ల బండి

చౌరస్తాలో రేగుబండ్లు

కరెంటు స్థంభం కింద వేగిన పల్లీ

సాదరంగా ఆహ్వానిస్తై

చలి తల్లి దాక్కునేందుకు కూడా

పేద బతుకులే ఆశ్రయమిస్తై

You may also like

2 comments

గురిజాల రామశేషయ్య November 4, 2021 - 12:34 pm

పాలకుర్తి దినకర్ గారి ఆంగ్లీకరణంలో భావగ్తెరహణ పరంగా తెలుగులో దాగున్న నుడికారం (diction) నాజూగ్గా తేటపడుతున్న విధానం స్పష్టమవుతున్నది. తెలంగాణ నుండి మయూఖ పక్షాన మరింత కవిత్వం ఇంగ్లీష్ ద్వారా ఇతర భాషా ప్రపంచానికి అందేందుకు దినకర్ గారి కలంకారీ పనితనం మరింత మెరుగు పూతలతో పూనుకోవాలి. ఈ మాటలు నా శుభాభినందన పూర్వక శుభాకాంక్షలు.

Reply
గురిజాల రామశేషయ్య November 4, 2021 - 12:37 pm

పాలకుర్తి దినకర్ గారి ఆంగ్లీకరణంలో భావగ్రహణ పరంగా తెలుగులో దాగున్న నుడికారం (diction) నాజూగ్గా తేటపడుతున్న విధానం స్పష్టమవుతున్నది. తెలంగాణ నుండి మయూఖ పక్షాన మరింత కవిత్వం ఇంగ్లీష్ ద్వారా ఇతర భాషా ప్రపంచానికి అందేందుకు దినకర్ గారి కలంకారీ పనితనం మరిన్ని రాతలతో పూనుకోవాలి. ఈ మాటలు నా శుభాభినందన పూర్వక శుభాకాంక్షలు.

Reply

Leave a Comment