చంచ న్మాయాప్రపంచ స్థితి లయకరణాద్యంత తంత్రస్వతంత్రం
కంబాలాభప్రతాపం కపటపటు పటాలంబిత ప్రాఙ్నితంబం
రంగజ్జంఘాల జంఘాయుగ మపరిమితానందనందాభివంద్యం
వందే యాదక్షమాభృత్కటక పటుభుజారంహ లక్ష్మీనృసింహమ్ !
తాత్పర్యం: అస్థిరమైన ఈ మాయా ప్రపంచం యొక్క ఉనికికీ, మహా ప్రళయంలో లయమై పోవటానికీ, సమస్త సృష్టి పరిరక్షణకూ, పోషణకూ, ఆదినుండీ అంతమువరకూ అన్నింటికీ కారణభూతమైన స్వతంత్ర చిద్రూపుడూÑ అపార పరాక్రమశాలిjైున ఆంజనేయునితో సముడగు ప్రతాపశాలీÑ తన మాయాబలంతో వస్త్రంవలె తూర్పుపర్వతాన్నంతా కప్పివేసినవాడూÑ ప్రకాశిస్తూ శీఘంగా కదలగల బలిష్ఠములైన రెండు పిక్కలు కలవాడు, తనయుని బాల్య చేష్టావిశేషాల చేత అంతులేని ఆనందాన్ని పొందిన నందునిచేత నమస్కరింపబడినవాడూ అయిన ` యాదగిరిపై నెలకొని తన బలిష్ఠములైన భుజముల బలపరాక్రమాలను ప్రదర్శిస్తున్న ` శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని నమస్కరిస్తున్నాను.
విశేషాలు: ‘‘య ద్దృశ్యం త న్నశ్యం’’ అని వేదాంతులు నొక్కి వక్కాణించారు. ఇంద్రియ గోచరమయ్యే ప్రతిదీ నశించిపోయేదే అని దీని భావం! సమస్త చరాచర సృష్టినీ తనలోని అంతర్భాగంగా చేసుకుని అంతా తానుగా కనిపించే ఈ ప్రపంచం (చంచత్GమాయాGప్రపంచంR) కదులుతూ ఉన్నట్లుగా కనిపించే మాయాప్రపంచమే! ఈ ప్రపంచం యొక్క ఉనికి (స్థితిR) అంటే జన్మించినట్లుగా కనిపించి, ఇదంతా నిజమేనని భ్రమింపజేసి, (లయR) కొంతకాలం అందరినీ మాయలో ముంచి, శోక`మోహాదులకు గురిచేసి, నశించిపోతున్నట్లుగా అనిపించి, చివరికి మహాప్రళయ సమయంలో సమస్తాన్నీ తనలో కలుపుకునే మహాసముద్రంగా కనిపించి, ఈ (జన్మలయల) మధ్య కాలంలో (కరణR) రక్షింపబడుతూ, వృద్ధి చెందుతూ ఉన్నట్లుగా అందరినీ భ్రమింపజేసే ఈ మాయా ప్రపంచం (స్థితిGలయGకరణGఆద్యంతGతంత్రGస్వతంత్రంR) పుట్టుకకూ, వృద్ధికీ, నాశానికీ తానే మూలకారణమైన సర్వతంత్ర స్వతంత్రుడు ఆ లక్ష్మీనరసింహస్వామి!
బమ్మెర పోతన మహాకవి కూడ భాగవతంలో ఈ విషయాన్ని ఈ విధంగా పేర్కొన్నాడు ` ‘‘ఎవ్వనిచే జనించు జగ, మెవ్వని లోపల నుండు, లీనమై యెవ్వని యందు డిరదు, పరమేశ్వరుడెవ్వడు, మూలకారణం బెవ్వ, డనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానjైునవాడెవ్వడు, వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్’’ అంటూ ఆ పరమేశ్వరుణ్ణి వేడుకున్నాడు.
(కంGబాలGఆభGప్రతాపంR) ‘క’ అనే ఏ కాక్షరానికి ఉన్న నానార్థాలలో వాయుదేవుడు అన్న అర్థం కూడ ఒక్కటి. వాయుదేవుని బాలుడు (కుమారుడు) ఆంజనేయస్వామి. బాలశబ్దానికి చిన్న శిశువు అన్న అర్థం కూడ ఉంది. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే ఆంజనేయుడు ఉదయిస్తున్న సూర్యుణ్ణి పండుగా భావించి, మింగటానికి పైకెగిరిన విషయం తెలిసిందే కదా! అంతటి పరాక్రమశాలి ఆంజనేయుడు. సీతజాడ తెలిసికొని వచ్చిన ఆంజనేయుణ్ణి, అతని పరాక్రమాన్ని మెచ్చుకున్న సుగ్రీవుడు లక్ష్మణునితో ఇలా అంటాడు ` ‘‘కార్యసిద్ధి ర్మతి శ్చైవ తస్మి న్వానరపుంగవే, వ్యవసాయ శ్చ వీర్యం చ శ్రుతం చాపి ప్రతిష్ఠితమ్, జాంబవా న్యత్ర నేతా స్యా దంగద శ్చ మహాబలః హనూమాం శ్చా ప్యధిష్ఠాతా న తస్య గతి రన్యథా’’ ‘‘వానశ్రేష్ఠుడైన ఆ హనుమంతునిలో కార్యసిద్ధి, తెలివితేటలు, పట్టుదల, పరాక్రమము, విద్య అన్నీ నెలకొన్నాయి. ఏ పనిలో జాంబవంతుడు, మహాబలుడగు అంగదుడు నాయకులుగా ఉంటారో, హనుమంతుడు తోడుగా ఉంటాడో ఆ పని వేరు విధంగా కాదు. అంటే తప్పకుండా జయప్రదం అవుతుంది’’ అని అంటాడు.
తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు. ఇంద్రుడు సమస్త దేవతాగణానికీ, దేవలోకానికీ అధిపతి కూడా! దైత్యదానవుల తాకిడి నుండి ఇంద్రుణ్ణీ, దేవలోకాలను రక్షించేవాడు శ్రీహరి! వాళ్ళు పన్నే చిత్ర విచిత్రములైన మాయోపాయాలన్నిటినీ ఛేదిస్తూ ` అనంతమైన, అభేద్యమైన కవచంగా నిలిచేవాడు విష్ణుమూర్తి! (కపటGపటుGపటGఆలంబితGప్రాక్GనితంబంR) రాక్షసుల దాడి నుండి సురలోకాన్ని కాపాడటం కోసం (కపటR) తన విష్ణుమాయ అనే (పటుGపటR) దృఢమైన వస్త్రంతో (ఆలంబితGప్రాక్GనితంబంR) కొండ మధ్య భాగం వలె స్థిరమైన సురలోకాన్ని కప్పి, రక్షిస్తున్నాడు. నితంబం అంటే కొండ (పర్వతం) యొక్క నడిమి భాగం అని అర్థం. విష్ణుమాయ నిరంతరం దుర్మార్గుల బారి నుండి (ప్రాక్GనితంబంR) దేవ లోకాలను కాపాడుతూ ఉంటుందని భావం!
పిక్కల్లో బలం ఉంటే కాని శత్రువులను ఎదిరించి పోరాడి విజయం సాధించలేము. యుద్ధంలో (రంగత్GజంఘాలG జంఘాయుగంGఅపరిమితGఆనందGనందGఅభివంద్యంR) తన బలపరాక్రమాలను ప్రదర్శించాడు శ్రీకృష్ణావతారంలో శ్రీహరి. దానిని చూడటం వలన అపరిమితమైన ఆనందం కలిగింది నందగోపుడికి. భక్తితో శ్రీకృష్ణపరమాత్మను (శ్రీహరిని) స్తుతించి నమస్కరించాడు నందుడు.
అనంత మహిమాన్వితుడై, యాదాద్రిపై నెలకొని తన బలిష్ఠములైన భుజముల బలమును ప్రదర్శించుచున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని కవి భక్తి ప్రపత్తులతో స్తుతించి నమస్కరిస్తున్నాడు.
శ్రీ యాదాద్రీశా వైభవమ్-10
previous post
1 comment
యాదాద్రీశుని కీర్తించిన చక్కని శ్లోకానికి ఆధ్యాత్మిక సాహిత్య విషయాలతో ఆచార్యులవారు చక్కని భాగ్యమును అందించారు. వారికి, సంపాదకులకు వందనములు. ఈ శ్లోకం ఏ గ్రంథంలో ఉందో, రచయిత ఎవరో తెలుపవలసినదిగా మనవి. నిత్యపారాయణం చేయవలసిన శ్లోకం.