అరె ఉత్తమ్ నువ్వా ఎప్పుడొచ్చావ్ . అదేంట్రా ఇలా అయ్యావ్ గుర్తే పట్టలేదు. జుట్టంతా ఏమైందిరా మొత్తం బట్టతల అయింది. రా … రా..అంటూ లోనికి ఆహ్వానించాను . పది రోజులయింది పెద్దమ్మా వచ్చి . మీకు తెలుసుగా నాకున్న సమస్య ఆ పనిమీదే వచ్చాను. పాండమిక్ టైం కదా! UK నుండి వచ్చానని ఇంట్లోనే వుండమన్నారు పద్నాలుగురోజులు. పెదనాన్నతో మాట్లాడదామని వచ్చాను.
నీ కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏమో ! పిచ్చోడిలా తయారయ్యావ్ . పెళ్ళి అయిందగ్గర్నుండి గొడవలే ‘
సాత్వికం సున్నితం అయిన మనుషులంటే ఎందుకింత వివక్షో దేవుడికి. అత్తింటోళ్ళు అందరూ వేధిస్తున్నట్లు పెట్టింది కేసు సుకన్య. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఎన్నాళ్ళుగానో. తల్లిదండ్రులిద్దరికీ ఆరోగ్యం అంతంతే . వీడేమో Uk లో ఏదో జాబ్ చేస్తున్నాడు.
వీడొచ్చిన రెండు మూడు రోజులకే తల్లికి బాలేదట . మరో రెండు రోజులు చూసి నిన్ననే పెద్ద హాస్పిటల్ లో చేర్పించాడట . దూరదేశాల్లో వుండే పిల్లలు తల్లిదండ్రుల మీద ప్రేమతో అవసరం వున్నా లేకున్నా పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో జాయిన్ చేయడం బాగా ఎక్కువైంది.
స్నేహితులుగా విడిపోతే బాగుంటుందన్న సలహా తో .. ఇన్ని సంవత్సరాల విసుగుతో .. సరే నంటూ వెళ్ళిపోయాడు .
ఆహాస్పిటల్ కెళ్ళి తల్లిని చూద్దామంటే చూడనివ్వరట . మంచిగ నేవుంది అంటూ రోజు లక్షల్లోనే ఫీజు వసూలు చేస్తున్నారట . పెరిగి పోతున్న బిల్లు చూసి మేం వేరే హస్పిటల్ కెళ్తాం డిస్చార్జీ రాయమంటే రాయకుండా నువ్వే చూద్దువు రా అంటూ తీసుకెళ్ళి దూరం నుండి ఆమె చెయ్యి లేపి అదిగో నిన్ను గుర్తు పట్టింది మాట్లాడుతున్నది చూడు
చూడు అంటూ బైటికి పంపారట వీడిని. నిజమేనేమో మెరుగవుతున్నదేమో అని సంతోషంగా ఇంటికి చేరి తండ్రికి చెప్పాడట . ఆ సాయంత్రమే ఆమె చనిపోయినట్లు కబురు . హతాశులయ్యారు .
ఆ బిల్లు చూసి ఏడవాలో .. తల్లి పోయిందని ఏడవాలో .. అర్ధం కాని అయోమయ పరిస్థితి . ఇంత బిల్లు ఎందుకయిందనే ప్రశ్నకు కంఠశోశే మిగిలింది.
డబ్బు లేదు .. అమ్మ లేదు .. భార్య లేదు .
విధి ఎంత విచిత్రం ! వీడు రావడమేంటి – తల్లి పోవడమేంటి ఆ పదిరోజులన్నా చూసుకో గలిగాడు. తల్లిని చివరి దశలో ‘ తండ్రిని అక్క దగ్గర వుంచి కొండంత భారంతో తిరిగి వెళ్ళాడు.
కొన్ని జీవితాలు ఇంతే
previous post
1 comment
కార్పొరేట్ వైద్యశాలల మోసాలకు ఒక ఉదాహరణను చక్కగా అందించిన శ్రీమతి సుమతి గారికి అభినందనలు.