Home అనువాద సాహిత్యం ‘అనువాద కుసుమాలు..’

‘అనువాద కుసుమాలు..’

by Jwalitha

1930లో జన్మించి తన పద్దెనిమిదవ ఏట కవిత్వం ప్రారంభించి 1993లో నోబుల్ బహుమతిని పొందిన డెరెక్ వాల్కాట్ కవితలు ఈ ఫిబ్రవరి 2022 ‘అనువాద కుసుమాలు..’

మరణశాసనం

మనోవేదనంతా రెండు పద్ధతులతో మెలితిప్పుతోంది

ఒకటి అద్దెగుర్రాలను అనుసందానించిన గద్యం ,

నేను సంపాదించిన నా బహిష్కరణ.

మసకవెన్నెల ప్రకాశంలో సుదీర్ఘ సముద్రతీరాన ప్రయాసతో ప్రయాణం

కమిలి, కాలిన

చర్మాన్ని విడిచి

ఈ సముద్రపు ప్రేమ – అదే స్వీయ ప్రేమ.

మీ మాటలను మార్చుకోవాలంటే.. మీ జీవితాన్ని మార్చుకోక తప్పదు.

పాత తప్పిదాలను సరిదిద్దలేను నేను

అలలు దిగంతాలను అలంకరించి తిరిగి వస్తున్నాయి

సముద్రపు కాకులు అరుస్తున్నాయి ఛాందసపు మాటలతో

ఎగువ రేవులో కుళ్ళిపోతున్న దోనెలు

విషపుముక్కుల పక్షులగుంపులతో ఆ ద్వీపాంతరం నిండిపోయింది..

ఒకప్పుడు దేశం పట్ల ప్రేమ ఉంటే చాలు అనుకున్నాను, ఇప్పుడు, నేను వేరే మార్గం ఎంచుకున్నా, స్థలమే లేదు ఆ దోనెలో

నేను ఎదురు చూశాను కుక్కల వంటి ఉత్తమ మేధావుల

రవ్వంత సహాయం కోసం

నాకు వయసు మీద పడుతుండగా, కాలిన చర్మం

కాగితం వలె నా చేతి నుండి రాలుతుంది,

సన్నని ఉల్లిపొరలా

*పీర్ జింట్ చెప్పే పొడుపు కథల వలె

హృదయంలో ఏమీ లేదు,

చావును గురించి భయం కాదది.

ఎందరో చనిపోయారని నాకు తెలుసు.

వారందరూ సుపరిచితులే, అన్ని పాత్రల్లో ఉన్నారు,

కానీ.. అగ్నిలో వారు ఎలా మరణించారు..,

ఆ దేహాలకు ఇక పై ఏ భయాలుండవు

కొలిమిలా మండే భూమి వలన

ఆ సూర్యుని బట్టీ వంటి బూడిదకుప్ప,

ఈ మేఘావృతమైన, మేఘరహితమైన నెలవంక ప్రకాశంతో

ఈ రేవు మళ్లీ ఖాళీ పేజీలాగా తెల్లగా మారుతుంది

దాని సమానత్వమంతా  అసమాన ఆగ్రహమే.

(*పీర్ జెంట్ నార్వేకి చెందిన కవి, నాటకకర్త)

***

ఆంగ్ల మూలం: డెరెక్ వాల్కాట్ట్ (Derek walcott)

తెలుగు సేత : జ్వలిత

Codicil

Schizophrenie, wrenched by two styles, one a hack’s hired prose, I earn my exile. I trudge this sickle, moonlit beach for miles,

tan, burn

to slough off

this love of ocean that’s self-love.

To change your language you must change your life.

I cannot right old wrongs.

Waves tire of horizon and return.

Gulls screech with rusty tongues

Above the beached, rotting pirogues,

they were a venomous beaked cloud at Charlotteville.

Once I thought love of country was enough, now, even if I chose, there’s no room at the trough.

I watch the best minds root like dogs

for scraps of favour.

I am nearing middle

age, burnt skin

peels from my hand like paper, onion-thin

Peer Gynt’s riddle.

At heart there’s nothing, not the dread

of death. I know many dead.

They’re all familiar, all in character,

even how they died. On fire,

the flesh no longer fears that furnace mouth

of earth,

that kiln or ashpit of the sun

nor this clouding, unclouding sickle moon

whitening this beach again like a blank page.

All its indifference is a different rage.

***

ముగించబోతున్నాం

నేను నీటిపై జీవిస్తున్నాను,

ఒంటరిగా.. భార్యా పిల్లలు లేకుండా..

నేను ఈ స్థితికి రావడానికి చుట్టుముట్టిన ఎన్నో కారణాలు

చుట్టూ బూడిద నీరున్న చిన్న ఇల్లు,

పాత సముద్రపు దిశగా ఎల్లప్పుడూ తెరిచుండే కిటికీలు, అలాంటి వాటిని మనమెప్పుడూ కోరుకోము,

కాని మనంతట మనమే తయారు చేసుకున్నవవి.

మేము బాధపడుతున్నాము..,

సంవత్సరాలు గడుస్తున్నాయి,  సరుకులు దింపుతుంటాం,

కానీ మన అవసరానికి కాదు

సమస్యలలో… ప్రేమ అనేది పాలిన నీటికింద సముద్రగర్భంలో స్థిరపడిన రాయి.

ఇప్పుడు, నాకు ఏమీ అవసరం లేదు

కవిత్వం నుండి నిజమైన అనుభూతి కానీ,

జాలి లేదు, కీర్తి లేదు, చికిత్స లేదు. నిశ్శబ్దంగా భార్య,

మేము బూడిద నీటిని చూస్తూ కూర్చుంటాము,

మరిక అతి మామూలుగా జీవితంలో కొట్టుకు పోతూ చెత్తతో నిండిపోయి శిలల్లా జీవిస్తూ..

నేను అనుభూతిని మరచిపోవాలి,

నా బహుమతిని మరచిపోవాలి,

అది నాకు జీవితంలో అన్నిటి కంటే పెద్ద కష్టం..

***

ఆంగ్ల మూలం: Derek Walcott

తెలుగు సేత: జ్వలిత

Winding Up

I live on the water,

alone. Without wife and children.

I have circled every possibility

to come to this:

a low house by grey water,

with windows always open

to the stale sea. We do not choose such things,

but we are what we have made.

We suffer, the years pass,

we shed freight but not our need

for encumbrances. Love is a stone

that settled on the seabed

under grey water. Now, I require nothing

from poetry but true feeling,

no pity, no fame, no healing. Silent wife,

we can sit watching grey water,

and in a life awash

with mediocrity and trash

live rock-like.

I shall unlearn feeling,

unlearn my gift. That is greater

and harder than what passes there for life.

****

డెరెక్ వాల్కాట్ ఇరవయ్యవ శతాబ్దపు కవి, అతను జనవరి 23, 1930న లెస్సర్ యాంటిల్లెస్‌లోని సెయింట్ లూసియా ద్వీపంలో జన్మించాడు. అతను కవలశిశువుగా జన్మించాడు. అతని తండ్రి, పెయింటింగ్ చేసేవాడు కవిత్వం రాసేవాడు, డెరెక్ మరియు అతని కవల సోదరుడు ఒక సంవత్సరం వయస్సులో ఉన్నప్పుడు అతడు మరణించాడు.

అందువల్ల, కుటుంబం సభ్యులు  చెప్పిన కథలు తప్ప వాల్‌కాట్‌కు తన తండ్రి గురించి ఏమీ తెలియదు. అతని తల్లి కళలను ఇష్టపడే ఉపాధ్యాయురాలు. ఆమె తన పిల్లలకు కవిత్వం చెబుతుండేది. తన జీవితంలోని ప్రారంభ దశల్లో, వాల్కాట్ తన కుటుంబ సభ్యులు ఎదుర్కొన్న కఠినమైన పరిస్థితుల గురించి తెలుసుకున్నాడు మరియు కొన్నింటిని స్వయంగా ఎదుర్కొన్నాడు. ఈ కష్టాలలో కొన్ని ఎంపిక చేయబడినవే అతని కొన్ని కవితలకు ప్రేరణగా మారాయి. ప్రత్యేకించి, వాల్కాట్ యొక్క నానమ్మ అమ్మమ్మ బానిసత్వ యుగంలో జీవించారు.  బానిసత్వం గురించి అతను తన రచనలలో చాలాసార్లు ప్రస్థావించాడు. అతని తల్లి స్థానిక మెథడిస్ట్ చర్చిని నడిపించడంలో నిమగ్నమై ఉంది, అయితే అక్కడి ప్రధానమైన కాథలిక్ సంస్కృతితో కుటుంబం మసకబారినట్లు భావించింది.  అతను రాయబోయే కవిత్వంపై కూడా గణనీయమైన ప్రభావం చూపింది, అలాగే సాధారణంగా వాల్‌కాట్ విద్యాభ్యాసం సెయింట్ మేరీస్ కళాశాలలో గడిపిన సమయం, అతను వెస్ట్ ఇండీస్ విశ్వవిద్యాలయం కళాకారుడిగా అతనికి స్ఫూర్తిదాయకంగా నిరూపించబడింది. కళ పట్ల ఉన్న ఈ అభిరుచి అతన్ని థియేటర్, ఆర్ట్ క్రిటిక్‌గా ఉద్యోగం చేయడానికి 1953లో ట్రినిడాడ్‌కు వెళ్లేలా చేసింది. అతని మొదటి ప్రధాన సాహిత్య విజయం 18 సంవత్సరాల వయస్సులో వచ్చింది, అతను తన తల్లి నుండి డబ్బు తీసుకున్నాడు మరియు యంగ్ XII కాంటోస్ (1949) కోసం 25 కవితలు (1948) మరియు ఎపిటాఫ్‌ను స్వయంగా ప్రచురించాడు. సుమారు ఆరు సంవత్సరాలు ట్రినిడాడ్‌లో నివసించిన తర్వాత, వాల్‌కాట్ ట్రినిడాడ్ థియేటర్ వర్క్‌షాప్‌ను స్థాపించాడు.  అతని నాటకాలలో ఎక్కువ భాగాన్ని తయారు చేస్తుంది, దీని తరువాత, వాల్కాట్ తన సమయాన్ని చాలావరకు ప్రయాణాలలో గడిపాడు.

ఆ తర్వాత అతడు ప్రపంచం మరియు కరేబియన్ సాహిత్యానికి ఒక సాంస్కృతికవేత్తగా మారాడు. అతను బోస్టన్ యూనివర్శిటీలో సాహిత్యం యొక్క ప్రొఫెసర్‌గా బోధిస్తూ గడిపాడు. 1992లో అతని సాహిత్యానికి నోబెల్ బహుమతిని అందుకోవడమే ఇప్పటి వరకు ఆయన సాధించిన గొప్ప విజయం.

***

ఇష్మెంట్ టు డా 1992లో సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు.

కవిత్వం

డెరెక్ వాల్కాట్ రచనలలోని సాధారణ ఇతివృత్తాలు కరేబియన్ సంస్కృతి మరియు చరిత్రపై దృష్టి కేంద్రీకరించబడింది, వలసవాదం యొక్క ప్రభావాలు, భాషతో సంబంధం తెలుస్తోంది. అతను కొన్నిసార్లు ఇంగ్లీష్ నుండి కరేబియన్, పాటోయిస్ నుండి ఫ్రెంచ్ వరకు మిక్స్ భాషలను ఉపయోగించాడు. అదనంగా, వాల్‌కాట్ యొక్క కవిత్వం వివిధ కాలాల ప్రదేశాలలో విస్తరించి ఉంటుంది మరియు కరేబియన్‌లోని సంస్కృతులు మరియు ప్రజల మధ్య సంక్లిష్టమైన సంబంధాలను చూపే సంఘటనలుంటాయి.

“ది సీ ఈజ్ హిస్టరీ” అనే కవితలో వాల్కాట్ నాటి భయానక పరిస్థితులను పరిశోధించడం ద్వారా ఆఫ్రికన్ చరిత్రకు సంబంధించి కరేబియన్ చరిత్రను వివరించగలిగాడు.

ఈ కాలపు చరిత్ర చాలా వరకు సముద్రంలో బంధించబడిందని, “ఆ గ్రే వాల్ట్‌లో” మరణించిన ఆఫ్రికన్ ప్రజల జీవితాలలో: బానిస ఓడలు  మిడిల్ పాసేజ్ లో మునిగిపోయాయని ఆయన సూచించారు. వాగ్దాన భూమిని వెతుకుతూ బైబిల్ (నిర్గమకాండము)లో యూదుల పారిపోవడానికి బలమైన పోలికలను కూడా తన కవిత్వం లో చెప్పాడు.

***

You may also like

Leave a Comment