Home ఇంద్రధనుస్సు స్వరాంజలి-11

స్వరాంజలి-11

by Krishna Kumari Yagnambhatt

ముత్తుస్వామి దీక్షితులవారు సంగీత శాస్త్ర రహస్యాలు ఇమిడ్చి కీర్తనలు రచించారు. అంతేకాదు, వీరు ఇతర శాస్తాల నెన్నింటిలోనో అపారమైన జ్ఞానం ఉన్నవారు. ఈ జ్ఞానమంతా వారి కీర్తనలలో గమనించవచ్చును. “గురు గుహ” ముద్రతో వీరు రచించిన కీర్తనలు సంస్కృతంలో ఉన్నప్పటికీ తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైనవి.

వెంకట మఖీ సంప్రదాయాన్ని అనుసరించి రాగ నామాలు కీర్తనలో వచ్చేవిధంగా రచించడమే కాకుండా సూళాదిసప్త తాళాలతో నవావరణ కీర్తనలు, నవగ్రహ కీర్తనలు రచించారు. ఇటువంటి అపూర్వ రచనలు ఏ వాగ్గేయకారుడు కూడా చేయలేదు. ప్రపంచంలో అన్ని రకాల సంగీతం కంటే భారతీయ సంగీతం ముఖ్యంగా రాగానికి చాలా ప్రాధాన్యం ఇచ్చింది. ఒక్కొక్క రాగం, దాని స్వరసమూహాలు, స్వరప్రస్తారాలు ఎంతో ప్రత్యేకంగా పేర్కొనదగినవి. అటువంటి ప్రత్యేకత కల్గిన “రాగం” పట్ల దీక్షితుల వారి అవగాహన అద్భుతం. అందువలననే వారి కీర్తనలకు ఒక ప్రత్యేకత కల్గింది. రచన ఎంత ప్రౌఢంగా ఉన్నప్పటికి, మంత్రపూరితములైనప్పటికి, వారి రచనలు ప్రాచుర్యాన్ని పొందడానికి కారణమైంది వారి రాగ పద్ధతి. దీక్షితులవారి కీర్తనలు శ్రేష్ఠమైన సంస్కృతి పాండిత్యము, స్వరరాగ పద్ధతిపాటు భక్తి, ధ్యానము కూడా కలిసి శాస్త్రసమ్మతిని రచింపబడ్డాయి. ఈ ఉదాహరణ చూడండి.

 ప్లల వి:

నీలోత్పలాంబికే నిత్య శుద్ధాంబికే మామవ!

అనుప్లల వి:

 త్రిలోక జననీ త్రిభువన మోహిని

త్రైలోక్య చక్రలాసిన

సత్ గురుగుహ విశ్వాసిని!

చరణం :

మాయా ప్రభంజాతీత సవరూపిణీ

 ముచుకంద బాకట పాలిని వరదాయిని

“ఛాయా గౌళ” రాగ రంజని నిరంజని

సాయుజ్యాది దాయిని సచ్చిదానంద రూపిణి !

 ఈ నాటికి కూడా చాలా మంది విద్వాంసులు సంగీత సభ ప్రారంభంలో దీక్షితుల వారి కృతి అయిన హంసధ్వని రాగంలోని వాతాపి గణపతింభజే ఆలపిస్తారు.

వీరి కీర్తనలలోని మంత్రశాస్త్ర తత్త్వంవారి మంత్రశాస్త్ర సమర్థతని, వైదుష్యాన్ని తెలియచేస్తాయి. వైదిక సంస్కృతం, లౌకిక సంస్కృతంలో చాలా వైవిధ్యం ఉంది కానీ, దీక్షితులవారి కృతులలో అతి సహజంగా సంస్కృత భాష ఒదిగిపోయింది.

దీక్షితులవారు తమ భక్తిని అనేక రకాలుగా ప్రదర్శించలేదు కానీ ఏ దైవాన్ని అర్పించినా అమేయమైన సమర్పణ భావనతోనే రచనలు చేశారు. భగవంతుడు భక్తుడు అన్న సంబంధం తప్ప ఇతర ప్రక్రియలను వారు ఉపయోగించలేదు. ఇది వారి అనన్య భక్తి తత్పరతకు తార్కాణం.

 ఈ కీర్తనను చూడండి

ప్లల వి:

శ్రీ మహా గణపతి రవతుమాం

 సిద్ధి వినాయకో మాతంగ్ ముఖ: !

అనుప్లల వి:

 కామ జనక విధీంద్ర సన్నుత

 కమలాలయ తట న్నివాసొ

 కోమలధర పల్లవ పద ఖర

 గురుగుహోగ్రజ శివాత్మజ!

చరణం:

 సువర్ణా కర్ణణ విఘ్న రాజో

పాదాం బుజో గౌర వర్ణ వసన ధరో

 బాలచంద్రో నరాది వినుత లంబోధరో

 కువలయ స్వ విషాణ పాశాంకుశ

 మోదక ప్రకాశ కరో భవ జలధి నావో

 మూల ప్ర కృతి సవభావ సూకతరో

 రవి సహసర సన్నిభ దేహో

 కవి జననుత మూషిక వాహో

 అవనత దేవతా సమూహో

 ఆవినాశ కైవల్య గేహో !

You may also like

Leave a Comment