ఆర్తనాదాలు చేస్తున్న అడవిలో పండు వెన్నెలలో నిండు గర్భిణీగా ఒక తల్లి చేసిన యుద్ధన్నీ జయించి జన్మించింది వెన్నెల.
ప్రాపంచిక మానవసంబంధాలను జయించి భుజావా వ్యవస్థ నుండి సమాజ మనుగడ ను కాపాడడానికి చీకటి పులుముకుంది ఈ వెన్నెల.
అక్షరాల వెలుగులో కారు చీకట్లు కమ్మిన అడవి మార్గంలో, ఆకాశం కూడా కనబడని నిండు అరణ్యంలో, కొండల్ని ఎక్కింది కోణాలను దాటింది, వాగులు వంకలు ఈదుతూ ఆయుధం చేపట్టింది వెన్నెల.
ఉద్యమంలో ఒక సమిధ గా మారాలి అనుకున్న వెన్నెల సమస్యగా మారిందని తాను ప్రేమించిన ఉద్యమ ప్రేమ వెన్నెలను హతమార్చింది.
అడవుల్లోకి వెళ్లేముందు వెన్నెల తెల్లగా స్వచ్ఛమైన ప్రేమతో విప్లవ మీద గౌరవంతో తన కళ్ళను ఎర్రగా మార్చుకుని వెళ్ళింది,
కానీ చివరకు ఎర్రని రక్తంతో తడిసి మాంసంముద్దగా మారింది.
అయినా తను అనుకున్నది సాధించింది తన ప్రేమను చేరుకున్నది , విప్లవంలో సమిధగా మారింది ప్రమిదగా ఆరిపోయింది.
వెన్నెల నీ ప్రేమ అనంతం, అనాణ్యమైన ని విప్లవాస్ఫూర్తి ఆ అరణ్యం ఎప్పుడు ఘోషిస్తూనే ఉంటుంది.
వెన్నెల నువ్వు అడవికాచిన వెన్నెలవై, విప్లవ కాగడావై ఇప్పటికీ వెలుగునిస్తూనే ఉంటావు.
ఇంత గొప్ప కథకు ప్రాణం పోసిన వేణు అడుగుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు, చివరిగా వెన్నెలకి రెడ్ సెల్యూట్,