జోరుగా వర్షంపడుతుంది , హోరుమని వీచే గాలికి కిటికీ తలుపులు టపాటపా కొట్టుకుంటున్నాయి.
అప్పుడే మెల్లగా నిద్రలోకి జారు
కుంటున్న శైలజ ఆ చప్పుడుకి
ఉలిక్కపడి లేచింది. అయ్యో
కిటికీలు తెరిచివున్నట్టున్నాయి,
అను కుంది మగతగా.పక్కలో పిల్లలిద్దరూ మంచి నిద్ర లో ఉన్నారు. భర్త సాగర్ ఆఫీస్
పనిమీద ఢిల్లీ వెళ్ళారు, నిద్రవల్ల అరమోడ్పు కళ్ళతో మెల్ల మెల్లగ మెట్లు దిగి ,హాల్లోకి వచ్చింది శైలజ. అది ఒక డూప్లెక్స్ భవంతి, ఈ మధ్యనే పక్కనే ఉన్న పాత ఇంట్లోనుండి, కొత్తగా కట్టుకున్న ఈ ఇంట్లోకి మారారు. శైలజ హాల్లోకి వచ్చి, అన్నపూర్ణమ్మ
గదిలోకెల్లి చూసింది. అత్తయ్య
నిద్ర పోతున్నారు, కిటికీలు
మూసే ఉన్నాయి,వర్షం ఎక్కువైనట్టుంది, ఉరుములూ
మెరుపులూ, పిడుగులూ
గాబరా పడుతూ ముందు గదిలో కిటికీ తలుపులు తెరచి ఉండటంతో, మూయడానికి కిటకీ దగ్గరగా వచ్చిన శైలజకి బయట వరండాలోఎవరో
వున్నట్టనిపించింది. ఒక్కసారిగా గతుకుమన్నది,భయమేసింది.వీధిలైట్లు కూడా లేవు కరెంటు పోవటంతో అంతా చిమ్మ చీకటిగా ఉంది. మెరుపుల వెలుతురు లో అస్పష్టంగా కనిపిస్తుంది. అర్ధరాత్రి దాటింది ఇంట్లో అత్తయ్య,పిల్లలూ తప్ప ఎవరూ లేరు.సమయానికి
శైలజ మరిది ఆనంద్,తోడి
కోడలు రాధ కూడలేరు ,ఊరెళ్లారు.
ఎలా ఏం చెయ్యాలో పాలు
పోలేదు శైలజకు,మెల్లగా ధైర్యం
కూడ గట్టుకొని వీధి తలుపులు
తెరిచిబయటికెల్లింది.మెరుపుల వెలుతురుకు కనిపించింది ,ఎవరో బాగా పెద్దావిడ పడి పోయి వుంది, స్పృహ లేనట్టుంది .
బాగా తడిచి పోయింది పాపం హృదయం ద్రవించింది శైలజకు అమ్మా అంటూ పిలుస్తూ కుదిపింది లేపడానికి ప్రయత్నించింది, లేవలేదు,
గబగబా పరిగెత్తుకుంటూ లోపలికివెళ్ళిఅన్నపూర్ణమ్మనుపిలుచుకొచ్చింది. ఆమె కూడా చాలా జాలి పడింది. పాపం ఎవరో ఏమిటో అంటూ ఇద్దరూ చెరొకవైపు పట్టుకుని అతికష్టంగా లోపటికి తీసుకొచ్చి దీవాన్ పై పడుకో
బెట్టారు. ఆవిడ మెల్లగా కళ్ళు తెరిచింది బాగా నీరసంగా మూల్గుతుంది దాదాపు అన్నపూర్ణమ్మ వయసంతే ఉంటుంది ఆవిడది కూడా అరవైకి డభ్భైకి మధ్య లో వుంటుందేమో.
ఏమైందమ్మా ఎక్కడి నుంచి వొచ్చావ్,నీ పేరేమిటీ అడిగింది
అన్నపూర్ణమ్మ.
సుభద్రమ్మ ,అని చెప్పింది చాలా నీరసంగా వాల్ల వైపు చూస్తూ రొప్పుతూ ,రెండు చేతులు జోడించింది,కృతజ్ఞతగా కళ్ళల్లో నీరు కారిపోతున్నాయి.
చలితో వొణికి పోతుంది
మాట్లాడలేక పోతుంది.
పర్వాలేదమ్మా రేపు మాట్లాడదాము లే గానీ బట్టలు బాగా తడిసి పోయాయి మార్చుకొనీ కాసిన్ని
ఈ పాలు తాగి పడుకోమ్మా ఈపక్క గదిలో ,గది చూపించి, అంది అన్నపూర్ణమ్మ , శైలజ తెచ్చిన
పాలూ బట్టలూ ఇస్తూ.
ఉదయాన్నే ఢిల్లీ నుండి సాగర్
వచ్చాడు. పొరుగూరు వెల్లిన ఆనంద్, రాధ కూడవచ్చేసారు.
అన్నపూర్ణమ్మ గారి కొడుకులు సాగర్, ఆనంద్ మంచి ఉన్నతమైన ఉద్యోగాలలో స్థిర పడ్డారు. రామ లక్ష్మణుల్లా ఎంతో చక్కగా కలిసుంటారు. అన్నపూర్ణమ్మ నూ ఎంతో ప్రాణంగా చూసుకుంటారు.
సాగర్ కి ఇద్దరు పిల్లలు
ఆనంద్ కీ ఇంకా పిల్లలు కాలేదు.
తోడికోడళ్ళిద్దరు కూడ భర్తల, అడుగు జాడల్లో నడుస్తూ, అత్తగారి మాటకి విలువ నిస్తూ
ఎంతో ఆప్యాయంగా కలిసుంటారు.మొత్తానికి అదొక ఆదర్శకుటుంబం. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కాఫీలు తాగుతుండగా, రాత్రి జరిగిన విషయం అంతాచెప్పారు అన్నపూర్ణమ్మ,శైలజ. సాగర్
ఆనంద్ లకు.సాగర్ వింటున్నాడు. అదేవిటమ్మా ఎవరో ఏమిటో
తెలుసుకున్నారా పదా చూద్దాం అని ,ఆనంద్ ఇంకా ఏదో అంటూండగా,ఇంతలో సుభద్రమ్మ గది లోనుండి బయటకు వచ్చింది.
వాల్ల వైపు చూసింది. అందర్నీ అలా చూస్తూ వుంటే ఎంతో ముచ్చటేసింది, ఇల్లంటే
ఇలా ఉండాలి అనుకుంది సుభద్రమ్మ మనసులో.
లేచారా రండి ఇలా కూర్చోండి ఎంతో ఆదరంగా అంది అన్నపూర్ణమ్మ.
ఇందాక వచ్చి చూసాను బాగా
అలసి పోయి నట్టున్నారు పడు
కోనీలే అని వచ్చేసాను, అంది శైలజ కాఫీ సుభద్రమ్మ కిస్తూ.
పిల్లలు స్కూల్ కి, పెద్దవారు
ఆఫీస్ కి వెళ్ళిన తరువాత
సుభద్రమ్మ దగ్గర కూర్చుని తన వివరాలన్నీ తెలుసుకున్నారు.
అన్నపూర్ణమ్మ, శైలజ.రాధ అందరికీ ఫలహారాలుతెచ్చింది,
సుభద్రమ్మ వాల్లది పక్కనే ఉన్న
పల్లెటూరు. మధ్యతరగతి కుటుంబం, ఇద్దరు కొడుకులు, భర్త కాలం చేసారు.కొడుకు
లిద్దరూ యేవో చిన్న చిన్న
వ్యాపారాలుచేసుకుంటున్నారు
భర్త వున్నప్పుడే ఇద్దరికీ పెళ్ళిల్లు అయ్యీయి, ఇద్దరికీ చెరిద్దరూ పిల్లలు. కోడళ్ళిద్దరూ కొరివి దయ్యల్లాంటి వారు.
కొడుకులు కోడళ్ళ చేతిలో
కీలు బొమ్మలు, మనుమలూ
మనుమరాల్లు కాస్త పెద్దగ
య్యేదాకా బాగానే చూసుకు
న్నారు. తరువాత మొదల
య్యాయి చీదరింపులూ,
చీత్కారాలు, అవమానించ
టాలు.చివరికీ కొడుకులిద్దరూ ఊర్లో
లేని సమయం చూసి, కోడళ్ళి
ద్దరూ,కూడ బల్కొని, సుభద్రమ్మ పై దొంగతనం అంట గట్టి ఇంట్లోంచితరిమేశారు. బంధువుల ఇళ్లకు వెల్లడానకి మొహం చెల్లక వీధిన పడింది. సుభద్రమ్మ.
రెండ్రోజుల నుండి ఎక్కడెక్కడో
తిరగి తిరిగీ బాగా నీరసించి ఇక నడిచే ఓపిక లేక వీల్లింటి ముందు పడి పోయింది.జరిగింది తెలిసీ చాలా బాధపడ్డారు.అత్తా కోడళ్ళు. మీరు చేసిన మేలు ఎప్పటికీ మరిచి పోలేనండి, ఇక వెళతానండి “అని రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అంది సుభద్రమ్మ.
“అదేమిటి అంత నీరసంగా ఉన్నారు. ఎలా వెలతారు,మీకొడుకులు,
మీకోసం వెతుకుతున్నా రేమొ
భోంచేసాక మా కార్లో పంపి స్తాను అంటూ వారించింది
అన్నపూర్ణమ్మ.
వద్దండి ఇక నేనాయింటికి
వెళ్ళను , నా కొడుకుల గురించి
నాకు బాగా తెలుసు, పీడా విరగడైందనుకునుంటారు.
అయితే ఏదైనా ఆధారం
దొరికే వరకు ఇక్కడే ఉండండి, అంది శైలజ. ఇక కాదనలేక
పోయింది సుభద్రమ్మ. ఎటూ వెల్లే ఓపిక లేకపోవటంతో.
మర్నాడు పనిమనిషి చాలా ఆలస్యంగా వచ్చింది. గంగా ఏం ఇంత లేటుగా వచ్చావ్
అడిగింది శైలజ. “మా గల్లీ లో పెద్ధ గలాటా జరిగిందమ్మగారు”అంది .
ఏం జరిగిందేవిటి?.
మా గల్లీ సివరింట్లో రంగమ్మ
సచ్చి పోయి పది దినాలైందడి.
దాని కో కూతురుంది.ఎన్నా
ల్నుంచి కాపు కాత్తున్నాడో, ఓ రౌడీ ముండా కొడుకు పాడు చెయ్య
బోతే ఎవరో చూసి దాన్ని కాపాడారండి.
వాడు మళ్ళీ ఎలాగైనా వస్తాడు
నేను బత్కను ఉరేసుకుంటానని
ఒకటే గొడవండి అంది గంగ.
కాసేపయ్యాక గంగ ఆ
అమ్మాయిని తీసుకొచ్చింది.
శైలజ చెప్పడంతో.చూడమ్మా ఇక నుంచి నువు ఒంటరి దానివి కాదు, ఇక్కడే వుండు మేమంతా ఉన్నాం ఆప్యాయంగా అంది శైలజ ,ఆ అమ్మాయితో.
ఇదంతా చూస్తున్న సుభద్రమ్మ
కు చాలా ఆశ్చర్యమేసింది.
ఏమిటమ్మా ఇది ఎంత మందినని ఇలా…ఏదో అనబోతుంటే, ఇదంతా మా అక్క కి అలవాటే లెండి, ఇలా ఎందరికో ఆధారం చూపి పంపింది అంది రాధ, మళ్ళీ అందీ ,అక్కా ఈసారీ అలా పంపించంటం కాదు మన
పాత ఇల్లు ఖాళీ గానే ఉందిగా
దాంట్లో ఉంచి ,ఏదైనా కుటీర పరిశ్రమ లాంటిది మొదలు
పెడదాం, వాల్లకి పనీఉంటుంది
ఆశ్రయం దొరికినట్టూఉంటుంది
అంది రాధ శైలజ తో.
చక్కగా చెప్పావమ్మా చదువు కున్న దానివి అని పించావ్, అంది శైలజ రాధను మెచ్చుకుంటూ
సంతోషంగా.అవును దేశమంతటా ఇలాంటి అభాగ్యులు ఎందరో ఉంటారు వాళ్ళ నందరినీ కాపాడ లేక పోయినా మన కళ్ల ముందున్న
కొందరికైనా ఆశ్రయం కల్పించి
చేయూత నిస్తే చాలు. అంది అన్నపూర్ణమ్మ. హియర్ హియర్ మా వంతు సహకార మేమిటో చెప్పమ్మా అన్నారు ,అప్పుడే ఆఫీస్ నుండి వస్తున్న సాగర్,స్కూల్ నుండి పిల్లలను తీసుకొస్తున్న
ఆనంద్ లు.
ఇల్లంతా సంతోషంతో నిండి , ఆనందాల హరివిల్లై విరిసింది.
Author