ఆధునిక కథ:
” ఎంత సేపు అలా ఏడుస్తూ కూర్చుంటావు? లే.. లే .! లేచి ముఖం కడుక్కో .వంట మొదలు పెట్టు. సాన్వి .ఎలా బెంగటీలుతున్నదో చూడు. దీని కోసమైనా నువు ధైర్యం తెచ్చుకో! ” డైనింగ్గ్ టేబుల్ వద్ద కూతురు సాన్విని ఒడిలోకి తీసుకొని ఏడుస్తున్న శారదను సముదాయిస్తూ అంది నీహారిక.
రాత్రి ఎనిమిదవుతున్నది. ఇల్లు బోసి పోయింది. ఇంట్లో ఏడుపు తప్ప ఏ అలికిడి లేదు. సాన్వి అమ్మను అతుక్కొని బిక్కుమంటూ చూస్తోంది.
కళ్లు తుడుకుంది శాగద.
” వారం రోజులైంది. అద్వైత్ జాడలేడు. ఎవరికి చెప్పుకోను?”
నీహారిక అర్థం చేసుకుంది. అర్థం చేసుకుంది కాబట్టే పలకరిద్దామని , ధైర్యం చెపుదామని వచ్చింది.
” నేనున్న గదనే! మేమంత లేమా ? లోకం గొడ్డు పోయిందా? ఎన్నో మహిళా సంఘాలున్నాయి. కలుద్దాము.” అనునయంగా అంది నీహారిక.
నీహారికకు అసలు విషయం తెలుసు. అది గుర్తు చేయకుండా కర్తవ్యం గుర్తు చేసింది.
అందరు ఉండీ శారద ఒంటరిదైపోయింది. కుల పట్టింపులు వదిలి, కుటుంబాలు వదిలి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తల్లి దండ్రులు దూరమయ్యారు. అత్తమామలు దూరమయ్యారు. అద్వైతే సర్వస్వం అనుకుంది. ఇపుడతడు తన జీవితంలోంచి తప్పుకున్నాడు. ఇపుడు తనకు ఎవరి ఆసరా లేని ఒంటరి. ఈ పాప , ఆ చిరుద్యోగం తప్ప తనకంటూ ఇపుడెవరూ లేరు. ఏవేనో గుర్తొచ్చి వెక్కి వెక్కి ఏడ్చింది శారద.
” ఇపుడవన్నీ అనుకోవడం దేనికే? జరిగిందేదో జరిగి పోయింది. అందరు అట్లనే ఉంటరా? కులాలు వేరైనా ప్రేమించుకున్నాం అంటే తల్లిదండ్రులే పెళ్లి చేసిస్తున్నారు.
పెళ్లికి వెల్లినవాళ్లకు కూడా వాల్లవి వేర్వేరు కులాలని … ఇష్టపడితే తల్లి దండ్రులే పెళ్లి చేసారని తెలియదు. ఇరు వైపులా రాకపోకలు సాగుతున్నాయి. అందరు కలిసి పోతున్నారు. ఇపుడు కులాల పట్టింపులెక్కడున్నాయి? మీ అమ్మా నాన్నలు , అత్తమామలు గట్లాంటోల్లు.. గట్ల ఎవరుండరు? ఒక్కతే బిడ్డ అని ఒక్కడే కొడుకనివద్దంటే ఏమై పోతరో అని వాల్లే సంప్రదాయం ప్రకారం పెళ్లి చేస్తున్నరు. అద్వైత్ ఇట్ల చేస్తడని ఎవరం ఊహించ లేదు.” సముదాయిస్తూ అంది నీహారిక.
నీహారిక సాన్విని తీసుకుంది. వెచ్చని నీళ్లతో స్నానం చేయించింది.
” ముందు ఈమెకు స్నాక్సు పాలు వేడి చేసివ్వు ” అధి నీహారిక.
శారద తేరుకొంది. మరో మనిషి తోడుంటే ఎంతో ధైర్యం.
నీహారికకు చూచాయగా తెలిసింది. అద్వైత్ మరొకరితో తిరుగుతున్నాడని! ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని! ఇలాంటివి అడిగి తెలుకోవలసినవి కావు. తెలిసినా తెలియనట్టు ఉండి పోవడమే ఉత్తమం.
అలా వీలైనపుడల్లా నీహారిక శారదకు సాన్వికి తోడై నిలుస్తున్నది. ఇపుడు
సాన్వికి మూడేళ్లు. ఇంకా బడికి అలాటు కాలేదు. డే కేర్ సెంటర్లో వదిలి డ్యూటీకి వెళ్తున్నది శారద.
*. *. *. *
రోజులు గడుస్తున్నాయి.
అద్వైత్ ఇంటికి రావడం లేదు. ఇంటి కిరాయ ఎలాగోలా శారద తానే కడ్తున్నది. తన ఏటి యం కార్డు తన చేతిలో ఉంది. ఇపుడు తన సంపాదనపై తనకే పూర్తి హక్కు. సాన్విపై కూడా పూర్తిగా తనకే హక్కు. తనను ఇలా వుండు, ఇలా వండు… అంటూ అలసిపోయి వచ్చిన తనకు పనులు పురమాయించే వారెవరూ లేరు.
శారదకు కొద్ది కొద్దిగా ఒంటరి జీవితం అలవాటవుతున్నది. ఒంటరిగా ఉండడంలోని స్వేచ్చ ఆనందం, సాన్వి అల్లరి ఆనందం తన తీరిక అంతా తనకే సొంతం.
శారదలో పెరుగుతున్న ఆత్మ విశ్వాసం చూసి నీహారిక చాలా సంతోషపడింది. నీహారిక తన భర్త విజయ్ తో శారద భవిశ్యత్ గురించి చర్చించుకున్నారు. ఆమెజీవితంలో కలుగ జేసుకోకూడదు. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా తాము మద్దతుగా నిలబడాలనుకున్నారు. ముందుగా ఆమె తల్లిదండ్రులను,
అత్తమామలను కదిలించాలను కున్నారు. మూడేళ్ల ఎడబాటుతో కన్న పేగు కొ్టుకుంది. మనవరాలు సాన్వి అందరిని కలిపింది. వాల్లు వస్తూ పోతున్నారు.
శారదకు తన జీవితంలో కోల్పోయిన అనుబంధాలు మారాకు తొడిగి కుదుట పడ్డాయి. ప్రేమ మైకం తొలగిపోయి శారదకు జీవితం అంటే ఏమిటో తెలుస్తున్నది. . ఈ కొత్త జీవితంలో శారద ఎన్నో విషయాలు నేర్చుకుంది. రెండేళ్లు గడిచాయి. ఆమె ఇప్పుడు తన స్వంత వ్యక్తిత్వం పై నిలడింది. సాన్విది ఇపుడు బడికి వెళ్లే వయసు .
అద్వైత్ ఎక్కడున్నాడో తెలిసింది. శారద , నీహారిక కలిసి మహిళా సంఘాలను కలిసారు. మహిళా కమిషన్ ను కలిసారు.
” ఆమె ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆమెకు నాకు పెళ్లి కాలేదు ” అన్నాడు.
అంత నీచంగా మాట్లాడుతాడని శారద ఊహించలేకపోయింది.
వెంటబడి ప్రేమించానని చెప్పిన డైలాగులు గుర్తుకు వచ్చాయి. అలాంటి మాటలతో శారద ఆత్మగౌరవం దెబ్బ తిన్నప్పటికీ బలంగా నిలబడింది. అందరి మద్దతుతో కోర్టులో కేసు వేసింది.
మళ్లీ అవే డైలాగులు చెప్పాడు అద్వైత్. శారద మనస్సు పూర్తిగా విరిగి పోయింది. విరక్తి కలిగింది. తనకు పెళ్లే కాకపోతే సాన్వికి నాన్న ఎవరు? ఆలోచించి తాడో పేడో తేల్చుకోవాల్సిందే అనుకుంది శారద.
శారద తమ సమావేశాల ఫోటోటోలను వెతికింది. ప్రారంభ పరస్పర చర్యలు వెచ్చదనం, కనెక్షన్ భావనతో నిండి ఉన్న ఆ ఫోటోలను ఇంత వరకు ఎవరికి చూప లేదు. ఇపుడా రహస్య ఆలింగనాలు , సాన్వి కడుపులో ఉన్నపుడు తన పొట్టమీద పెట్టిన ముద్దులు చిగురిస్తున్న శృంగారాన్ని, వారి కలలను వారు కలిసి జీవితాన్ని బతకాలనుకున్న నిర్ణయించుకున్న క్షణాలను ఆ ఫోటోలు గుర్తు చేసాయి.
ఆనాటి అతని సంభాషణలు గుర్తుకు వచ్చాయి.
” మనది నిర్మలమైన ప్రేమ. నీ కళ్ళలోకి చూస్తుంటే, నేను వెతుకుతున్నది నువ్వేనని నేను నమ్ముతున్నాను. నీవు నాకోసమే పుట్టావు అనిపిస్తోంది. నీవు లేని ఈ జీవితం వ్యర్థం…. ” అలా సాగి పోయేది వరద.
తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ఎలా వుండాలో ఏం చేయాలో… ఎన్నో చెప్పాడు.
శారద తద్వారా తలెత్తే సమస్యలనుగుర్తు చేసింది. అతడే ధైర్యం చెప్పాడు.
సాన్వి పుట్టిన మూడేళకే తన యవ్వనం సడలి పోయిందా? అతని మనసు అట్లా ఎలా మారింది ? అంత పెద్ద మాటలు ఎలా అనగలిగాడు?
” శారదా! నేనేం కోరుకుంటున్నానో నాకే తెలియదు. బహుశా మన పెళ్ళికి బయట నన్ను నేను వెతక్కోవాలి! “
“అలాంటి మాటలు ఎలా చెప్పగలిగాడు? మన ప్రేమ చిరస్థాయిగా ఉంటుందనుకున్నాం. మీ నుండి ఇలాంటి మాటలు నేనెప్పుడూ ఊహించలేదు.”
జ్ఞాపకాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఫోటోలు తీసుకొని నీహారికను వెంట తీసుకుని అడ్వకేట్ వద్దకు నడిచింది.
*. *. *.
అలా వారి బంధం చెడిపోయిన నేపథ్యంలో, శారద ఆత్మశోధన. ఒంటరిగా కానీ కృతనిశ్చయంతో, ఆమెకు తెలియని మార్గాల్లో ప్రయాణించింది, దారిలో అనేక అనుభవాలు, సూటి పోటి మాటలు, వంకర చూపులు ఎన్నో ఎదుర్కొంది. దయగల అపరిచితులు ఆమెకు మిత్రులుగా మా
మారడంతో, ఆమె తన స్వంత బలం బలగం పొందగలిగింది. సాన్వితో , భావోద్వేగ ఆలింగనంలో వారి బంధం బలపడింది, ప్రేమ యొక్క శాశ్వత శక్తికి సాన్వి చిహ్నంగా మారింది. శారద అచంచలమైన విశ్వాసం ఉజ్వల భవిష్యత్తును రూపొందించుకోవాలనే ఆమె సంకల్పానికి తోడై నిలిచింది.
కొత్తగా వచ్చిన స్వాతంత్ర్యంలో, శారద స్వంత గుర్తింపు పెరిగింది.
తన కొత్త మిత్రుల మద్దతుతో, ఆమె న్యాయ పోరాటాలను చేపట్టింది, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ నిలిచింది.
ఎంతో ఎత్తుకు ఎదిగిపోయి శారదను చూసి నీహారిక “శారదా, నువ్వు అనుకున్నదానికంటే బలంగా ఉన్నావు. నిన్ను నువ్వు నమ్ముకో! ఈ పోరాటం. నీలో ని నిజమైన సామర్థ్యాన్ని ఆవిష్కరిస్తుంది.”
“నువ్వు చెప్పింది నిజమే. నేను ఈ కష్టాలను అధిగమించి లక్ష్యంతో నిండిన జీవితాన్ని సృష్టిస్తాను. నాకు సాన్వికి అదే ఆనందం.” అంది ారద.
అద్వైత్ ఆత్మ విశాసం గర్వం ఎగిరి పోయింది.
అతని అంతర్గత గందరగోళాన్ని గ్రహించిన , అతని న్యాయవాది రెండు సూచనలు చేసాడు. సంధికోరుకొని తిరిగి కాపురం చేస్తానని అర్థించడం. అది. ీలుకాని ఎడల కేసు విత్ డ్రా చేసుకొమ్మని క్షమాపన కోరడం.
“అద్వైత్ ! సత్యాన్ని ఎదుర్కోవడానికి, క్షమాపణ కోరడానికి ధైర్యం కావాలి. విరిగిపోయిన బంధాలను చక్కదిద్దడానికి, ప్రేమలో మరోసారి సాంత్వన పొందేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా?”
” నా తప్పును గ్రహించాను. పోగొట్టుకున్న వాటిని తిరిగి నిర్మించుకోవాలనిపిస్తున్నది. ” అన్నాడు అద్వైత్.
-అతను ఒకసారి ప్రేమించిన స్త్రీతో రాజీపడాలని ఆశించాడు. అయితే శారద అనుభవాలు వేరు. అద్వైత్ ఊహించని విధంగా శారద రూపాంతరం చెందింది, ఆమె జీవిత ప్రయాణం ఆమెను బలమైన మహిళగా మార్చింది. తనకు తెలిసిన శారద వేరు. ఇపుడు పోరాడుతున్న శారద వేరు.
శారద గతకాలపు కలలకు వీడ్కోలు పలికి, వర్తమానాన్ని స్వీకరించింది. ఒకప్పుడు తను ప్రేమించిన అద్వైత్, తన ఆనందానికి తనదైన వెర్షన్ను కనుగొందని తెలిసి అద్వైత్ గుండె వేదన చల్లబడింది.
దృఢత్వానికి ప్రతిరూపమైన శారద తన జీవితాన్ని పునర్నిర్వచించింది. ఆమె పక్కన తన కుమార్తెతో, అత్త మామలతో, అమ్మా నాన్నలతో కలిసి ఉంటున్నది. ఇపుడామె ఒంటరి కాదు. ఆమె జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. వారి గత ప్రేమ యొక్క ప్రతిధ్వనులు విన దల్చుకోలేదు. భవిష్యత్తు వాగ్దానం వేరైధి.
ఆమె తల్లిగా , కూతురుగా, కోడలిగా తన పాత్రను మలుచుకుంది.
ఓదార్పుని పొందింది. ముందున్న సవాళ్లను స్వీకరించింది.
అద్వైత్ ఉద్యోగం ఊడిపోయింది. జైలు శిక్షపడింది. ఉద్యోగం చేస్తున్న భార్యపై మేన్ టేనెన్సు కేసు వేశాడు అద్వైత్.
శారద నవ్వుకుంది. ఆ రెండో భార్య ఏమైందో తెలియదు. అద్వైత్ గర్వం అణిగి పోయిన దుకు విజయగర్వంతో నీహారికను బిగ్గరగా హత్తుకుంది.
అలా శారద ఒంటరి ప్రయాణంలో మరో మూడేళ్లు గడిచాయి. ఎన్నో అనుభవాలు పోరాటాలు. ఎందరో మద్దతు నిలిచారు.
ఒంటరి పోరాటంలో కన్నీరు కార్చింది. ఏకైక కూతురు శారద కంట కన్నీరు చూడ లేకపోయారు… కన్న పేగు కదిలింది. కడుపులో దాచుకున్నారు. అత్తామామలకు మనవరాలంటే ప్రేమ. ఎన్నాళ్లకు తమ ఇంట్లో మళ్లీ పసిపిల్ల కేరింతలు. ఆ పసి నవ్వులకు మురిసిపోయారు. కొడుకే చెడిపోయాడు. కోడలు మంచిది అని తెలుస్తూనే ఉంది. మాకు పెళ్లే కాలేదన్న కొడుకు వాదన విన్నాక వీడు తమ కడుపున చెడ పుట్టాడని బాధ పడ్డారు. కోడలు మనవరాలు తమ తో ఉంటే ఎంత సౌఖ్యంగా ఆనందంగా వుండేదో అనుకున్నారు. అలా కలిసి పోయారు. ఇపుడు వాల్లందరికి గారాల మనవరాలంటే ప్రాణం. మనవరాలు ఆటపాటలతో అన్ని మరిచి పోయారు. బయట సంఘర్శన. ఇంట్లో ఆనందం.
ఈ కొత్త జీవితం లో అనేక విషయాలు తెల్సుకుంది శారద.. ఇపుడు జైల్లో వున్న అద్వైత్ ఉద్యోగం పోయి శారద మీద మీద వేసిన మనోవర్తి కేసు
కేసు వాసుతీసుకుంటానన్నాడని అతని అడ్వకేటు తో కబురు పెట్టింది గుర్తుకు వచ్చి నవ్వుకుంది శారద. ఇపుడు తనకేమైందని అతనిని ఆహ్వానించడం?
అతని లోని మార్పుతో తనకేమీ సంబంధం లేదు.
ఇపుడీ సింగిల్ పేరెంట్ జీవితమే బాగుంది. అపుడు కులాంతరాల పేరిట దూరమైన అమ్మా నాన్నా అత్తమ్మా మామయ్యా అంతా నాతోనే వున్నారు.
ఈ ఉమ్మడి కుటుంబమే బాగుంది. అతడు మల్లీ తన జీవితంలోకి ప్రవేశించడం దేనికి? తన అడ్వకేటుకు అదేమాట చెప్పింది. ఆ మాట చెప్పాక తనకెంతో బరువు దిగిపోయినట్టు ఉత్సాహం.. శారద మునుపటి శారద కాదు.
ఎన్నో అనుభవాలతో ఎదిగిపోయింది. వదిలేసిన వాడి జీవితమే వాడిపోయింది.
శారద తన జీవితాన్ని తిరగ రాసుకుంది.
స్కూటర్ పై సాన్వి స్కూల్లో దింపి నవ్వుతూ టాటా చెప్పి యధావిధిగా డ్యూటీకి స్కూటర్ స్టార్ట్ చేసి బయల్దేరింది శారద.