అందరికి నమస్కారములు. నా పేరు చిరుహాసిని. నేను ఏడవ తరగతిలో చదువుకుంటున్నాను. నేను ఈ రోజు గజేంద్రుని గురించి చెప్పబోతున్నాను.
క్షీరసాగరంలో త్రికూట పర్వతం మీద ఒక పెద్ద అడవి ఉన్నదీ, ఆ అడవిలో ఒక గజరాజు అనేక ఆడ ఏనుగులతో కలిసి తిరుగుతూ అక్కడే ఉన్న సరోవరంలోకి దిగి దాహం తీర్చుకుంటూ ఉండగా అందులోనున్న మొసలి గజేంద్రుని కాళ్ళుపట్టుకున్నది. అసలు ఎవరి గజరాజు?
పూర్వం ఇంద్రాజ్ఞామునుడు అనే రాజు అగస్త్యమునిని ఉదాసీనంగ చూడటంవల్ల ఏనుగు జన్మ ఎత్తి నానా బాధలు పడమని అగస్త్యుడు శపించాడు, మరి ఈ మకరం ఎవరు? దేవలుడనే ముని శాపం వల్ల హు హు అనే గంధర్వుడు మొసలి రూపం ఎత్తాడు. ఈసారి మకారులు విధివశాత్తు ఒకచోట చేరి ఈ విధంగా ఘోర పోరాటం సాగించారు.
కరి దిగుచు మకరి సరసికి
కారదరికిని మకర దిగుచు కరికరి బెరయన్
కరికి మకరి మకరికి గరి
బరమగుచును నతల కుతల భటులరుదు వడన్
అన్నట్లుగా ఒకసారి కరి రాజుది పైచేయి అయితే మరొకసారి మకరిపై చేయిగా నిలుస్తూ వారు జరుపుతున్న పోరాటంవల్ల సరస్సులోని జలచరాలన్నీ ప్రాణాలు కోల్పోయాయి.
మోహమనే పెద్ద తీగతో కట్టబడిన పాదాన్ని విడిపించుకోలేని జీవుడి లాగా గజేంద్రుడు మొసలి వాడి కోరలకు చిక్కవేయి ఎల్లకాలం తీవ్రపోరాటం సాగించాడు. తన బలమంతా ఉడిగిపోతున్నది.
గజేంద్రునికి తనలో శక్తి ఉన్నంతవరకు ఏ దేవుడు గుర్తుకు రాలేదు. నిజానికి గజేంద్రుడు విష్ణుభక్తుడు. కానీ అహంకారంతో తనని గెలిచిన వారు లేరన్న ధీమాతో వేయి సంవత్సరాలు పోరాడి
లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబట్ట ప్రాణముల్ ఠావుల్ దప్పెను మూర్చ వచ్చి అంటూ అప్పుడు నివే దప్ప ఇతఃపరం బెరుగ అని శ్రీమన్నారాయణుని ప్రార్థించాడు. రావే ఈశ్వర కావవె వరదా అంటూ అనేక రీతులుగా మొరపెట్టుకున్నాడు.
కలదందురు దీనులయెడ – కలడందురు పరమయోగి అంటూ అనేక రీతులుగా వేడుకున్నాడు.
ఒక మలాప్త ఓ వరద నన్ను కావవే అని ఎలుగెత్తి పిలుస్తున్న తన భక్తుడైన గజరాజు ఆర్తనాదం విష్ణువుకి వినిపించింది. శంఖ చక్రాలను పరివారాన్ని కూడా వదిలి శ్రీ లక్ష్మికైనా చెప్పకుండా ఉన్న ఫలంగా వచ్చాడు, ఆ మొసలిని సంహరించి గజరాజును కాపాడాడు శ్రీహరి.
మానవుడు తనకి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు నాయంత బలవంతులు, పరాక్రమవంతులు లేరని విర్రవీగుతారు, సత్తువ తగ్గి, కష్టకాలం వచ్చినపుడు భగవంతుడు గుర్తుకు వస్తాడు అనే నగ్న సత్యం గజేంద్రమోక్షం కథ వల్ల మనకి తెలుసు్తన్నది. భగవంతున్నీ సర్వకాలం సర్వావస్థలందు ధ్యానించుకోవాలని, కేవలం కష్టాలు వచ్చినపుడు కాదనే నీతిని బోధిస్తుది గజరాజు కథ.