నారాయణ, పద్మ ఇద్దరి పిల్లల తల్లితండ్రులు. రష్మికి ఏడేళ్ళు, రాకేష్ కు ఐదేళ్ళు. నారాయణ మెకానిక్ గా పని చేస్తాడు. పద్మ ఇంట్లోనే ఉంది పిల్లల్ని చక్కగా చూసుకుంటుంది. ఇంటి పనంతా చక్కగా చేసుకుంటుంది పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది. నారాయణ తల్లిదండ్రులు వారి సొంత ఊరిలో ఉంటుంటారు. ఎప్పుడైనా వచ్చి పోతుంటారు.
రాత్రి పిల్లల్ని పడుకోబెట్టేటపుడు రాకేష్ చెవి నొప్పిగా ఉందన్నాడు. “ఎం లేదులే స్కూలు ఎగ్గొట్టటానికి ఎదో ఒకటి చెప్తావ్” అని పద్మ పడుకోబెట్టింది. కాని లోపల ఆలోచిస్తోంది. మూడు, నాలుగు రోజుల్నుంచి ఇలాగె చెపుతున్నాడు. రేపు చెవిలో టార్చి లైటు వేసి చూడాలి అనుకున్నది.
పొదున్న రాకేష్ లేస్తూనే “అమ్మా! నా చెవిలో నుంచీ ఏదో కారుతోంది” అన్నాడు. పద్మ దగ్గరకొచ్చి చూసింది. చెవిలో నుంచీ చీము కారుతున్నది. వెంటనే భర్తకు చెప్పింది. నారాయణ ఆసుపత్రికి వెళదమన్నాడు.
రాకేష్ ను తీసుకొని భార్యాభర్త లిరువురు సృజన్ పిల్లల ఆసుపత్రికి వెళ్లారు. చెవిలో నుంచీ చీము కారుతున్నదని మందులు ఇవ్వమని అడిగారు పద్మ, నారాయణలు.
డాక్టరు టార్చి లైటు చెవిలో వేసి పరీక్షించాడు చీము పట్టిపోయి ఉన్నది. మందు వేసి మొత్తం చెవిని శుభ్రం చేసి మరల పరీక్షించాడు. లోపల అగ్గిపుల్ల ముక్క కనిపించింది కానీ తియ్యటానికి రావటం లేదు. మత్తిచ్చి చిన్న ఆపరేషన్ చేసి తియ్యాలి అసలు చెవి లోపలికి ఆగ్గిపుల్ల ఎన్నిరోజుల క్రితం పెట్టుకున్నాడో అనుకుంటూ డాక్టరు వివరాలడిగాడు.
ఏమో డాక్టరు! నాకేమి తెలియదు మూడునాలుగు రోజుల్నుంచి చెవి నొప్పిగా ఉందని చెపుతున్నాడు కానీ నేనే వినలేదు చూడలేదు అంటూ పద్మ చెప్పింది డాక్టర్ తో.
మీరు ఇంట్లో అగ్గిపుల్లలు చెవిలో పెట్టుకొని గులిమిని తీసుకుంటుటారా? అది చూసి పిల్లవాడు కూడా చేసుంటాడు. అగ్గిపుల్ల తల విరిగిపోయి చెవిలోనే ఇరుక్కు పోయింది. పెద్దవాళ్ళు ఏ పని చేస్తే పిల్లలు చూసి అదే చేస్తుంటారు అన్నాడు డాక్టర్.
అంతలో పద్మ “ఇదిగో ఈయన అగ్గిపుల్లలతోనే గులిమి తిసుంటాడు సార్. నేనేన్నో సార్లు చెప్పాను పిన్నిసులతో తీసుకోవాలని వినలేదు” అంటూ భర్త మీద చెప్పింది.
“ ఏయ్ ఊరుకో మీ ఆడోళ్ళ దగ్గరంటే పిన్నిసులుంటాయి మా మగాళ్ళ దగ్గర ఎందుకుంటాయి. అగ్గిపెట్టెలో పుల్లలే ఉంటాయి” అంటూ నారయణ భార్యను గద్దించాడు.
“ సరే లేమ్మా ఇప్పుడు పిల్లవాడికి కొద్దిగా మత్తిచ్చి చిన్న ఆపరేషన్ చెయ్యాలి భయపడవద్దు. లోపల ఉన్న పుల్లను తిసేస్తా” అంటూ డాక్టరు ఆపరేషన్ థియేటర్ కు వెళ్ళాడు.
కాసేపటి తర్వాత డాక్టరు బయటకు వచ్చి “ పిల్లవాడి చెవిలో నుంచీ పుల్లను తిసేశాం. ఒక వారం రోజులు చెవిలో చుక్కల మందు వేసుకోవాలి చెవిలోకి నీళ్ళు పోకుండా చూసుకోవాలి జాగ్రత్త” అని నారయణ కు చెప్పాడు.
తర్వాత పద్మ వైపు తిరిగి “ చూడమ్మా, చిన్నపిల్లలు వేరుశనగ గింజలు, శనగపప్పు విత్తులు వంటికి కూడా చెవిలో పెట్టుకుంటుటారు. పిల్లల దగ్గర ఏ వస్తువు కనపడకపోయినా అనుమానించాలి. నోట్లో, ముక్కులో, చెవిలో పెట్టుకొని దాదాపు వారం రోజులు దాటి ఉండవద్దు. అది చెవిలో ఉండి, ఉండి ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఇంకా ఎక్కువైతే లోపల కర్ణభేరి పాడాయి పోయి చెవుడు వచ్చే అవకాశముంటుంది. అందువలననే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నీకు ఇద్దరు పిల్లల్ని చూసుకోవటం కష్టమైతే మీ అత్తా మామల్ని తెచ్చి ఇంట్లో ఉంచుకోండి. పసి పిల్లల్ని పెంచేతపుడు పెద్దవాళ్ళ సలహాలు, అనుభవాలు చాల అవసరం. ప్రతి చిన్న సమస్యకు డాక్టరు దగ్గరకు పరుగెత్తలేరు కదా! పిల్లలు ఇలా ఎవరి చెవుల్లో వాళ్ళు పెట్టుకోవటమే కాదు వేరే పిల్లల చెవుల్లోనే, ముక్కుల్లోనే కూడా పెడుతుంటారు. ఇంట్లో ఉన్నా సోదరుల, సోదరికో ప్రమాదాలు తెచ్చిపెడుతూ ఉంటారు. జాగ్రత్తగా చూసుకోండి” అని వివరంగా చెప్పి పంపించాడు డాక్టరు.
డా.కందేపి రాణీప్రసాద్
డా.కందేపి రాణీప్రసాద్
Dr. kandepi Raniprasad Managing director Srujan children hospital Sircilla Telangana రచనలు:: పూలతోట,నెలవంక,నందివర్ధనం,స్వీటీ,మిల్కీ, ఓ చిలుకా,పూలజడ, Quarantine, botanical zoo. వంటి 40 పుస్తకాల రచన. Hospital waste material తో సుమారు 3000 బొమ్మలు మరియు టీచింగ్ aids తయారీ కు 3 వరల్డ్ రికార్డులు లభించాయి. బాల సాహితీ పూర్ణిమ,బాల సాహితీ కౌముది,కల భారతి, కవితా వాణి,బిరుదులు ప్రదానం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం , తెలంగాణ ప్రభుత్వ జిల్లా ఉత్తమ సాహితీ వేత్త, తెలంగాణ ప్రభుత్వ ఉత్తమ జిల్లా మహిళా రచయిత్రి పురస్కారాలు 100 కు పైగా లభించాయి. రచనలు:: పూలతోట,నెలవంక,నందివర్ధనం,స్వీటీ,మిల్కీ, ఓ చిలుకా,పూలజడ, Quarantine, botanical zoo. వంటి 40 పుస్తకాల రచన. Hospital waste material తో సుమారు 3000 బొమ్మలు మరియు టీచింగ్ aids తయారీ కు 3 వరల్డ్ రికార్డులు లభించాయి. బాల సాహితీ పూర్ణిమ,బాల సాహితీ కౌముది,కల భారతి, కవితా వాణి,బిరుదులు ప్రదానం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం , తెలంగాణ ప్రభుత్వ జిల్లా ఉత్తమ సాహితీ వేత్త, తెలంగాణ ప్రభుత్వ ఉత్తమ జిల్లా మహిళా రచయిత్రి పురస్కారాలు 100 కు పైగా లభించాయి.
ఓ ఇంటి పెరట్లో పొట్లకాయ పాదు, దొండకాయ పాదు ఇంకా రకరకాల కూరగాయల మొక్కలు ఉన్నాయి. ఆ ఇంటి యజమాని చక్కగా అన్నిరకాల కూరగాయల మొక్కల్ని ప్రేమగా పెంచుకుంటున్నాడు. పక్కపక్కనున్న పందిళ్లపై పాకి ఉన్న పొట్లకాయ, దొండకాయ తీగలు రోజు మాట్లాడుకుంటూ ఉంటాయి. పైకి మామూలుగా మాట్లాడుతున్నప్పటికి పొట్లకాయకు తాను బాగా పొడుగ్గా ఉంటానని అహంకారం ఉంది. పొడుగ్గా ఉంటే అందంగా ఉంటారని అనుకుంటుంది ఇలా మొదలైన దాని అహంకారం పెరిగి పెరిగి పొగరుగా రూపుదిద్దుకున్నది.
పొట్లకాయకు తాను పొడుగ్గా అందంగా ఉంటాననే కాకుండా, దొండకాయ పొట్టిగా, అందవికారంగా ఉంటుందని అనిపించసాగింది. అలా ఆలోచన వచ్చిందే తడవుగా తాను దొండకాయకన్నా గొప్పదాన్నిని అనుకోవడంతో పాటు దొండకాయను అవహేళన చేయడం మొదలు పెట్టింది. ఈ మాత్రం సమయం దొరికినా, ఏ చిన్నపాటి అవకాశం లభించిన దొండకాయను వదలడం లేదు. పొట్లకాయ మాటలకు దొండకాయ చాలా బాధపడుతోంది. కానీ ఏం చేయలేకపోతున్నది. దూరంగా పారిపోదామా అంటే జంతువులకు ఉన్నట్లు తమకు కాళ్ళు చేతులు లేవాయే. ఎక్కడ ఉన్నవాళ్లం అక్కడే ఉండాలి. తమ తల్లిదండ్రులు ‘ఇరుగుపొరుగుతో మంచితనంగా ప్రేమగా ఉండాలి’ అని చెప్పారు. అందుకే పొట్లకాయతో ఎంత ప్రేమగా ఉన్న అది ఊరుకోవడం లేదు. దాని పొడుగును చూసుకొని విర్రవీగుతోంది. దొండకాయ తననింతపొట్టిగా పుట్టించినందుకు దేవుణ్ణి తిట్టుకొంది. ‘నేనెందుకింత అందవిహీనంగా ఉన్నాను’ నేను చేసిన పాపమేమిటి? అనుకుంటూ రోజు తనలో తాను కుమిలిపోసాగింది.
ఈ వ్యవహారన్నంతా ఆ పక్కనే ఉన్న కాకరపాదు గమనించింది. విషయం కొద్దిగా అర్థమైన పూర్తిగా తెలుసుకుందామని దొండకాయను పలకరించింది. అడిగిందే తడవుగా తన మనసులోని బాధనంతా చెప్పేసుకుంది దొండకాయ. ‘నేను పొట్టిగా ఉండటం నా తప్పా? పొట్లకాయ ఎలా కూరగాయగా మానవులకు పనిచేస్తుందో నేను కూడా అలాగే కూరగాయగా పనికొస్తున్నాను కదా!’ అంటూ బోరుబోరున ఎడ్చింది. కాకరకాయ దొండకాయను ఊరడిస్తూ ఇలా చెప్పింది. ‘దేవుని దృష్టిలో గొప్ప, తక్కువ తేడా లేదు. అందరూ సమానమే. ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది! కాబట్టి మొదట నువ్వు ఏడవడం మానేసి ప్రశాంతంగా ఆలోచించు! అన్నీ నీకే అర్థమవుతాయి!’ అన్నది.
దొండకాయ కొద్దిగా ఏడుపు ఆపి కళ్ళ నీళ్ళు తుడుచుకొని సరిగా కూర్చుంది.అప్పుడు కాకరకాయ మరలా ఇలా చెప్పింది. “చూడు! నన్ను కూడా అందరూ చేదు చేదని అసహ్యించుకుంటారు. పిల్లలైతే నన్నసలు ముట్టుకొనే ముట్టుకోరు. ఇంకా నా చర్మం మూడుతలు పది ఉంటుందని ముసలమ్మని అంటూ ఎగతాళి చేస్తారు. అయినా నేను ఇవేవి పట్టించుకొను. నన్ను ఇంతగా అసహ్యించుకున్నా షుగర్ వ్యాది ఉన్నోళ్ళు నన్ను ఎంతో ప్రేమగా తింటారు. నాలో షుగరు వ్యాధిని తగ్గించే గుణాలు ఉన్నాయట. మానవులు తినటానికి కూరగాయగా పనికిరావడమే కాకుండా వారి వ్యాధుల్ని కూడా తగ్గించగలుగుతున్నానన్నసంతోషం ముందు ఈ ఎగతాళులు ఎంత మాత్రం నన్ను బాధించవు! అలాగే నువ్వు కూడా ముందు బాధపడటం మానెయ్యి. చక్కగా తిని ఆరోగ్యంగా ఉండు. చూడు నీరసంతో ఎలా చిక్కి శల్యమయ్యావో!”. దాంతో దొండకాయ కొంత ఊరట చెందింది. ‘అంతేనంటావా! నాకు ఈ లోకంలో గుర్తింపు ఉందంటావా?’ ఇంకా పూర్తిగా అనుమానం పోక అడిగింది.
చూడు దొండకాయ మిత్రమా! అసలు నీ గొప్పదనం నీకు తెలియడం లేదు. మానవుల్లోని మహా మహాకవులు అందగత్తెలైన స్త్రీల పెదవుల్ని ‘దొండకాయ వంటి పెదవులు’ అని నీతో పోలుస్తారు తెలుసా! నేవ్వెమో కధలు చదవవు. నీకేమో పుస్తకాలు చదివే అలవాటే లేదాయే! అతిలోక సుందరులైన రంభ, ఊర్వశి, మేనకల్నైనా ఎర్రగా పండిన దొండపండు వంటి పెదవులు’ అంటూ పొగడాల్సిందే. నీ ప్రత్యేకత ఎవరికీ లేదు! అంటూ వివరిచింది.
ఇప్పుడు దొండకాయకు ఇంకాస్త ధైర్యం వచ్చింది. ‘ నేనీ అందమైన ఆడవాళ్ళ పెదవుల్లా ఉంటానా’ అనుకుంది. ‘నేను ప్రత్యేకమైనదాన్నని నాకు తెలిసొచ్చింది. నాకు పిరికితనం పోయి ఆత్మవిశ్వాసం వచ్చింది. మరి ఈ పొట్లకాయ ఆగడాలు ఇలా భరించాల్సిందేనా! దీనికేం దారిలేదా!’ మళ్ళీ బేలగా అడిగింది. దానికి కాకరకాయ సమాధానంగా దొండకాయ తల నిమురుతూ ఇలా చెప్పింది. ‘చూడు మిత్రమా! ప్రతిదానికీ ఒక సమయమంటూ ఉంటుంది. ఆ సమయం వచ్చినపుడు ఏది ఎలా జరగాలో అలా అరుగుతుంది. దాని మాటలు పట్టించుకోవద్దు. సృష్టిలో ఎన్నో మొక్కలు ఉన్నాయి. ఏడిపించేవారిని వదిలేసి నీతో మంచిగా ఉండేవారితో స్నేహం చెయ్యి. ఏమి బాధపడకు. ధైర్యంగా ఉండు’ అంటూ ఉపదేశించింది. దాంతో దొండకాయ పూర్తిగా శాంతించింది. పొట్లకాయను మరిచి మిగతా స్నేహితులతో సంతోషంగా ఉండసాగింది.
ఇలా ఉండగా ఒకరోజు ఉదయం నిద్రలేచేసరికి ఇంటి యజమాని పొట్లపాదును తీసేస్తున్నాడు. తీగలన్నీ పీకెసి చెట్టు మొదలును తవ్వేస్తున్నాడు. పొట్లకాయ విపరీతమైన బాధతో ఏడుస్తున్నది. తనను చంపొద్దని యజమానిని ప్రాధేయపడుతుంది మౌనంగా. యజమాని అలా దొండకాయకు అర్థం కాలేదు. ఎంటా అని పక్కనే ఉన్న కాకరచెట్టు వంక చూసింది.
అప్పుడు కాకరచెట్టు ఇలా చెప్పింది. రాత్రి యజమాని వాళ్ళ చిన్న కొడుకు చీకట్లో పొడుగ్గా పెరిగిన పొట్లకాయను చూసి పాము అని జడుసుకున్నాడట. రాత్రి నుంచి జ్వరం తగ్గలేదు. పిల్లాడు బాగా భయపడ్డాడు అందుకే యజమాని పొద్దున్నే ఈ చెట్టును పీకెస్తున్నాడు. చూశావా ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నువ్వు దాని పొగరు చూసి భయపడ్డావు. దాని ఆకారాన్ని చూసి పొట్లకాయ గర్వించింది కానీ పిల్లాడు పామని ఎలా భయపడ్డాడో చూడు. మన గొప్పదనాన్ని ఇతరులు గొప్పగా చెప్పుకోవాలి కానీ మనకు మనమే గొప్పనుకోకూడదు. నువ్వు ఇకనుంచైనా ఆత్మవిశ్వాసంతో మెలుగు. ఎవరేం చెప్పినా, ఎవరేం అన్నా పట్టించుకోవద్దు. నీ సంతోషమే నీకు ముఖ్యం.
