“Hey,why have you closed the doors? My friends are still on the way,” Ravi eagerly spoke to the waiter at the cafe he had been waiting at for his friends.
As usual,the monkeys arrived in a large group and they would enter every door open. Now a days it has become the biggest problem not only for us but also the neighborhood community. Don’t know why these animals left the forests and are roaming around in the city,” the waiter answered impatiently.
By that time Ravi’s friends entered, cautiously escaping the attack from the monkeys.
The sun hung low over the city, casting long shadows across the concrete jungle as four friends – Ravi, a passionate environmentalist, Suma, a wildlife enthusiast, Arun, an urban planner, and Kavitha, a journalist – sat at a small café. They had met to discuss a growing problem that had captured everyone’s attention in recent weeks: wild animals, displaced by rampant deforestation, were making their way into the cities.
“Did you hear about the monkey attack yesterday?” Suma began, shaking her head in disbelief. “A group of them entered a school and snatched food from the kids. It’s getting worse every day.”
Ravi, ever the advocate for nature, leaned forward. “It’s not just the monkeys, Suma. I read that a cheetah was spotted near the highway last night. It’s no surprise, really. We’ve destroyed their homes. What else can they do?”
Arun sighed. “We’ve pushed them into a corner. Every time I approve a new urban plan, I see forests disappearing on the map. Green spaces are shrinking, and we’re leaving these animals nowhere to go.”
Kavitha, who had been quietly observing, spoke up. “It’s ironic. We’ve got Haritha Haram initiatives going on across the state – planting saplings to make up for deforestation. But, Ravi, you’ve been saying this for years. They’re not planting the right kinds of trees.”
“Exactly!” Ravi’s voice was filled with frustration. “It’s all ornamental. Sure, they plant saplings, but where are the fruit-bearing trees? Trees that actually provide food and shelter for wildlife. Instead, they’re planting decorative species that do nothing for the animals or even the ecosystem.”
Suma nodded in agreement. “I’ve seen this too. Animals aren’t coming to the city because they want to. They’re starving. With no fruits in the forests, they’re turning to human settlements for food. It’s tragic.”
Kavitha, ever the investigator, took out her notebook. “I’ve been covering stories on this for a while now. The government’s intention behind Haritha Haram is good, but there’s no long-term vision. If we don’t start planting fruit-bearing trees, if we don’t restore natural habitats, this is just going to keep getting worse.”
Arun leaned back, a look of deep concern on his face. “It’s not just about the animals. We’re seeing more floods, more droughts, even temperatures are rising. We’ve paved over wetlands, cut down forests, and dammed rivers. We’re so focused on building our cities that we forget nature is our lifeline. And yet, even when we harm it, nature still tries to help us.”
“What do you mean?” Suma asked, curious.
“Think about it,” Arun continued. “Trees absorb carbon dioxide, cool down cities, and prevent flooding. Wetlands filter water. Even the smallest creatures, like bees, are responsible for pollinating the plants that give us food. Nature keeps trying to balance things out, no matter how much damage we do. But it has its limits.”
Ravi chimed in, “Exactly. We take so much from nature, but give so little back. We build our roads and factories, thinking only of progress, but when floods wash away our homes or heatwaves kill crops, we act surprised. It’s like we’re blind to the fact that everything we need – clean air, food, water – comes from the very ecosystems we’re destroying.”
Suma sighed. “It’s human negligence, plain and simple. We’ve grown disconnected from the natural world, thinking it’s something to conquer or manage. But nature’s not an enemy. It’s been trying to support us all along.”
Kavitha nodded slowly, scribbling in her notebook. “That’s the story we need to tell, isn’t it? People need to see that by neglecting nature, we’re only hurting ourselves. And even though we’ve been careless, nature hasn’t given up on us. It’s still trying to help us survive, whether it’s through trees absorbing pollution or bees pollinating crops. But for how long?”
Arun looked thoughtful. “We need to rethink how we live. Urban planning can’t just be about expanding cities. It has to be about restoring balance. Imagine cities filled with green corridors, fruit-bearing trees, and wetlands that help manage floods. It’s possible, but only if we stop neglecting the natural world.”
Suma’s face lit up with a spark of hope. “Maybe we should start something ourselves. A campaign to make sure future afforestation efforts focus on the right kinds of trees. We can get the public involved. I’m sure people will support us if we show them how much better things can be.”
Kavitha jotted down notes quickly. “I can cover this in the paper, write about how critical it is. We could reach out to the government, local leaders, and citizens. Together, we might be able to create some awareness.”
Arun smiled. “I’ll make sure the urban planning council hears about this. I’ll push for fruit-bearing trees and better integration of green spaces. We’ve ignored this for too long.”
As they left the café that evening, they felt a renewed sense of urgency. The challenges were immense, but they knew that by restoring harmony between humans and nature, there was still hope. Nature, after all, had been patient for so long – it was time they started listening.
As they walked through the bustling streets, a lone monkey leapt from a building onto a nearby tree, looking for something that wasn’t there – a sign of the growing disconnect between nature and man, but also a reminder that nature, despite all it endured, still sought to help. It was now up to them to make sure that help wasn’t in vain.
We read in the history books that Ashoka has planted trees on both sides in the road. That gave not only fruits,but also shade to the travellers and animals. Taking a leaf from that, these four friends have started campaign on reforestation that too of useful trees, ecosystem protection, regenerative agriculture..etc . They could get both media and government’s help and support.
They have formed a group named ‘Go Green’ and created awareness among people about reduce, re-use and recycle. They have also started educating people towards reduction in plastic usage, wastage of food and usage of fossil fuels. They were also successful in making the farmers turn to cow based agriculture. A meagre attempt from a small group of friends has grown multifold and started to give tremendous results.
The ‘Go Green’ group received the Indira Gandhi Paryavaran puraskar for their efforts. The four friends have decided to use that cash prize also for the same purpose. They visited colleges and schools and educated the NextGen the various ways to protect the environment. They propogated one slogan ‘Restore Harmony’.
Kattekola Vidyullata
మాటల చెట్టు అంటే చెట్టు మాట్లాడుతుందనా లేక…….? గడ్డం సులోచన గారు రచించిన కవితా సంపుటి ‘మాటల చెట్టు’ చూసినప్పుడు కలిగిన సందేహం ఇదే.
సహజంగా కథ లేదా కవితా సంపుటి ప్రచురించేటప్పుడు ఆ సంపుటిలోని ఏదో ఒక శీర్షికను పుస్తకానికి పేరు పేరు పెట్టడం రివాజు. అలాగే ఈ పుస్తకమూ ఏమో, ఈ పేరుతో ఓ కవిత ఉందేమో అనుకున్నాను. పుస్తకం మొత్తం చదివాక తెలిసింది మాటల చెట్టు అంటే మరేదో కాదు ఆ కవయిత్రే అని. ఒక చెట్టులోని ప్రతిభాగం మనిషికి ఎలా ఉపయోగపడుతుందో అదే విధంగా సులోచన గారి ఈ సంపుటిలోని కవితలన్నీ.
గడ్డం సులోచన గారి కవితలన్నీ ఒకటికి మించి మరొకటి భేష్ అనిపించేలా ఉన్నాయి. తన కవితలకు వస్తువు కోసం వెతుక్కోలేదు. నిత్య జీవితంలో మన చుట్టూ జరిగే సంఘటనలే. మట్టి, మనిషి, మనసు, అమ్మ, నాన్న,చేదబావి, స్నేహం, జీవితం, అక్షరం, పల్లె, కాదేదీ కవిత కనర్హం అన్నట్లు ఉంటాయి ఆ కవితలు.
మట్టి గురించి, మట్టి వాసన గురించి ఆమె రాసిన మట్టి – మనిషి అనే కవితలో
ఎంతకమ్మనిది ఈ మట్టి వాసన
సమస్త సుగంధ ద్రవ్యాల సారం
ఈ మట్టి గంధం
అంటూ మొదలెట్టి
మట్టిలోనే మనుగడ
మట్టిని ప్రేమించ లేకపోతే మనం మనుషులం ఎలా అవుతాము?
మన కణం కణం లోని మూలకణం మట్టే
మనం కలిసేది ఈ మట్టిలోనే
ఎంత నిగూఢమైన కవిత ఇది!
అలతి పదాలలో అనంతమైన జీవిత సారాన్ని చూపించారు ఈ కవితలో
మనిషి జీవితంలో మట్టి వాసన మమేకమైపోయింది అంటూ సులోచన గారు రాసిన ఈ కవిత మనల్ని మన మూలాల్లోకి తీసుకువెళ్తుంది.
అందమైన పంజరం అనే కవితలో ఆవిడ కమ్మని గొంతుతో కూస్తున్న కోయిలకు చెప్తోంది
పిలవద్దు మళ్లీ నన్ను
ఎందుకంటే నేనాడపిల్లను
హద్దులుంటాయి
అని చెప్తూనే ఈ హద్దులను ఏర్పరిచిన తల్లిదండ్రులను తోబుట్టువులను సమాజాన్ని ఆమె తప్పు పట్టలేదు
నాక్షేమం కోరి
స్వేచ్ఛను హరిస్తారు
లోకానికి భయపడి
ఎంత చక్కని వివరణ. ఆడపిల్లకు కొన్ని హద్దులు ఉండక తప్పదేమో. దానిని తప్పుగా భావించకుండా తన కోసమే ఈ ఏర్పాటు అనుకుంటే బాగుంటుంది కదూ!
అలా అని స్త్రీ స్వేచ్ఛగా ఉండక్కర్లేదు అని చెప్పరు. మరో కవితలో
నేను ఎదుగుతా- వికసిస్తా- ప్రకాశిస్తా !
ప్రపంచానికి విలువల వెలుగులు పంచుతా
నాకు కాస్త చేయూతనివ్వండి, అణగదొక్కకండి అంటూ ఆర్తితో చెప్తారు.
ఒక్కసారిగా రెక్కలు మొలిచి
అనంత ఆకాశంలోకి ఎగరాలని ఉంది
అంటూ ఆడపిల్లల మనసును ఆవిష్కరించారు. ‘కత్తులు దూస్తున్న కొమ్మలు’, ‘తిరగబడితే’ కవితలు కూడా స్త్రీ గొంతును ఎలుగెత్తి చాటాయి.
అభిజాత్యం! అహంకారం! అధికారం!
ఇంకా ఎన్నాళ్లు?
యుగాలు మారినా మారని భావజాలం!
అంటూ సమాజాన్ని ప్రశ్నించాయి.
ఇక సులోచన గారు తాను చిన్నవయసులో పెరిగిన గ్రామీణ వాతావరణం గురించి అక్కడి జీవనం గురించి ఎంతో రమ్యంగా కవితలు రచించారు. పల్లెటూర్లో ఒకనాడు మగవారికి రచ్చబండ ఎంత ముఖ్యమో ఆడవారికి ‘చేదురుబాయి’ అంతే ముఖ్యంగా ఉండేది. వీళ్ళ సమావేశాలు, సమాలోచనలు, కష్టసుఖాల కలబోతలు, ఓదార్పులు అన్నీ అక్కడే. అటువంటి అనుభూతులు నేడు కరువయ్యాయి అంటూ వాపోతారు ఆవిడ.
‘పల్లె పడతులు’ అనే కవితలో
ముద్దొచ్చే పొద్దు తిరుగుడు పూలు
నా పల్లె పడతలు
వారి శ్రమ జీవన సౌందర్యం
జాతికి జీవనము
అంటూ గ్రామీణ మహిళల గురించి ఎంతో అందంగా వర్ణించారు.
తాను రోజూ పయనించే ఒక ఆటో డ్రైవర్ ‘పెద్దులు’ గురించి, అతని వ్యక్తిత్వం గురించి
బాడీగార్డ్ లా భరోసాగా ఉంటాడు
పేరుకు తగ్గ పెద్ద మనసు
అరుదైన విలక్షణ వ్యక్తిత్వం
అంటూ రాయడం ఆవిడ పెద్దమనుసును తెలియజేస్తుంది.
ఇంకా కాళోజీ నారాయణరావు గారి గురించి, గిడుగు రామ్మూర్తి పంతులు గారి గురించి, అంతరిస్తున్న నేటి బంధాలు అనుబంధాల గురించి ఆవిడ మనసు లోతుల్లోంచి వచ్చిన ప్రతి కవిత ఒక ఆణిముత్యమే అని చెప్పాలి. ఇలా రాస్తూ పోతే మీకు చదివేందుకు ఏమీ ఉండదు కదా! అందుకే ఈ ‘మాటలచెట్టుని’ తప్పక చదవండి. చక్కని పుస్తకం చదివిన అనుభూతిని మీరు పొందుతారు. ఇది సత్యం.
కానీ పుస్తకంలో ఆఖరి కవిత మిథునం గురించి చెప్పాల్సిందే!
భార్యాభర్తల జీవిత సారాన్ని మొత్తం ఈ పది పంక్తుల కవితలో ఎంత ఇంపుగా నింపారో. ఆ కవితను నేను వర్ణించే కన్నా మొత్తంగా రాస్తేనే బాగుంటుంది.
నువ్వు- నా హృదయపు తోటలో ప్రేమ మొలక
నేను- జత కలిసిన అందమైన ఆధారాన్ని
నీ వలపుల సుగందాన్ని
గమనం -జతగా ఒకరికి ఒకరం
తోడుగా నీడగా ఆశగా శ్వాసగా సాగటం
లక్ష్యం -జీవితాన్ని పండించుకుని
బరువు బాధ్యతల్ని తీర్చుకొని
పచ్చని పండుటాకులుగా గమ్యాన్ని చేరాలి
ముసి ముసి నవ్వులతో మురిసిపోవాలి
స్వేచ్ఛగా వాలిపోవాలి.
ఇదే కదా ప్రతి ఒక్క జంట, జంటగా కోరుకునేది. వావ్ సులోచన గారూ!!!
“రాజీవ్, అనిక కోసం మనం తగినంత చేస్తున్నామని నీకు అనిపిస్తోందా?” ప్రియ అడిగింది. అలా అంటున్న సమయంలో ఆమె కంఠం ఆందోళనతో నిండిపోయింది. ప్రతి రోజూ ఉదయం ఇద్దరూ కలిసి కాఫీ తాగే సమయంలో ఆ దంపతులు కుటుంబం గురించి, ముఖ్యంగా వాళ్ళ ప్రేమ ఫలం ఐనటువంటి చిన్నారి అనిక భవిష్యత్తు గురించి ఆలోచించడం, మాట్లాడుకోవడం చేస్తుంటారు. ఉదయం సూర్యుడు వంటగది కిటికీ గుండా తొంగి చూస్తూ, సొగసైన కౌంటర్‌టాప్‌పై వెచ్చని తన చూపులు ప్రసరిస్తున్నాడు.
హాల్ లో అద్దంలో చూసుకుంటూ షేవింగ్ చేసుకుంటున్న రాజీవ్, తన భార్య వైపు చూస్తూ,”మనం మన వంతు కృషి చేస్తున్నాం ప్రియా. మనిద్దరం కష్టపడి పని చేస్తున్నాం, తనకు కావలసినవన్నీ అందించేందుకు ప్రయత్నిస్తున్నాం కదా! ఇంకా నువ్వు ఎందుకు ఆందోళన చెందుతున్నావు?” అనునయంగా భార్యను అడిగాడు రాజీవ్.
“నాకు తెలుసు, కానీ కొన్నిసార్లు మనం పాపకు తగినంత సమయం ఇవ్వడం లేదని నాకు అనిపిస్తుంది. తను మంచి గ్రేడ్లతో మాత్రమే కాకుండా మంచి విలువలతో ఎదగాలని నేను కోరుకుంటున్నాను,” ప్రియఘ ఘ తన కాఫీ సిప్ చేసుకుంటూ కౌంటర్ వైపు వాలింది.
రాజీవ్ నిట్టూరుస్తూ ఆమె భుజం మీద చేయి వేసి ఆమెని దగ్గరకు తీసుకున్నాడు. “నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను. ఇకపై నేను ప్రతి సాయంత్రం, ఇంకా వారాంతాల్లో కూడా తన కోసం సమయాన్ని వెచ్చిస్తాను. ఇంకా నాన్న చనిపోయిన తర్వాత అమ్మ కూడా ఊర్లో ఒక్కతే ఉంది కదా, తనని కూడా ఇక్కడికి రమ్మన్నాను. మనం బిజీగా ఉన్న టైంలో అనికని కనిపెట్టుకొని ఉంటుంది. పాపతో ఉండడం వల్ల అమ్మ కూడా తన ఒంటరితనం నుంచి కాస్త కోలుకుంటుంది, ఏమంటావు?”
“నేనేమంటాను అనేది నువ్వు అమ్మని పిలవక ముందు చెప్పాలి. అత్తయ్య వచ్చి మనతో ఉండడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ కాస్త ముందుగా చెబితే పాపని మెంటల్ గా ప్రిపేర్ చేసేవాళ్లం. నీకు తెలుసు కదా ఈ కాలం పిల్లలు వాళ్ల ప్రైవసీ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు.”
అప్పుడే అనిక కిచెన్‌లోకి దూసుకొచ్చింది. ఆమె భుజంపై స్కూల్ బ్యాగ్ వేళ్ళాడుతోంది. “అమ్మా, నాన్నా, నాకు సైన్స్ ప్రాజెక్ట్‌లో మీ సహాయం కావాలి!”
ప్రియ నవ్వుతూ కూతురి స్థాయికి మోకరిల్లింది. “అఫ్ కోర్స్, బంగారం, ఏదీ, నీ ప్రాజెక్ట్ కోసం ఏం చేయాలో చూద్దాం.”
వారు ప్రాజెక్ట్‌లోకి ప్రవేశించే ముందు, డోర్‌బెల్ మోగింది. అది రాజీవ్ తల్లి శాంత. ఆమె వారితో కలిసి గడిపేందుకు వచ్చింది,
“అమ్మా, స్వాగతం!” రాజీవ్ ఆమె బ్యాగులు తీసుకుని ఆప్యాయంగా పలకరించాడు.
“హలో రాజీవ్. హలో ప్రియా, హలో అనికా బంగారం,” అంటూ సంతోషంగా పలకరించింది. ఏడు సంవత్సరాల వయసు ఉన్న అనిక ఒక రకమైన దినచర్యకు అలవాటు పడింది. తన తల్లిదండ్రుల అవిభక్త శ్రద్ధ, ప్రేమ మొత్తం తానే పొందేందుకు అలవాటు పడిన ఆమెను నానమ్మ రాక కలవరపరచింది. ఇప్పుడు తండ్రి తన సమయంలో కొద్దిగా నానమ్మతో గడపడం జీర్ణించుకోలేకపోయింది. ఆమె మర్యాదగా ఉంది కానీ దూరంగా ఉంది, అదీకాక, ఇతరులతో ఎలా సంభాషించాలో ఆమెకు తెలియదు. శాంత, అనిక సంకోచాన్ని గమనించి బాధపడ్డా,బంధాన్ని ఏర్పరచుకునేందుకు కొంత సమయం పడుతుందని అర్థం చేసుకుంది.
శాంత రోజూ ఉదయాన్నే లేచి వంటగదిలో ప్రియకు సాయం చేసేది. అది ప్రియకు సంతోషం కలిగించినా, రాజీవ్ వంటగదిలో ఏదైనా పని చేస్తుంటే వెంటనే ఆవిడ కలుగజేసుకుని, “ఇది ఆడవాళ్ళ పని, నువ్వు వెళ్లి హాల్లో కూర్చో రాజీవ్,” అని చెప్తూ ఉండడం, ఆవిడ అలా అన్నప్పుడు అనిక ఆమె వంక వింతగా చూడడం ప్రియ దృష్టిని దాటిపోలేదు.
దాంతో ఒకరోజు అత్తగారితో, “అత్తయ్యా మరోలా భావించకండి. మనం మాట్లాడే మాటలు, చేసే పనులు మన పిల్లల మనసుపై ఎంతో ప్రభావం చూపిస్తాయి. ఈ కాలంలో భార్యాభర్తలిద్దరూ సమానమైన ఉద్యోగాలు చేస్తూ కుటుంబ జీవనం సమతుల్యంగా నడపాలంటే ఇద్దరూ అన్ని పనులూ చేసుకోక తప్పదు. మీరు పాప ఎదురుగా ఆడపని మగ పని అంటూ మాట్లాడకండి. తర్వాతి తరానికి తప్పుడు సంకేతాలు ఇవ్వకండి. అర్థం చేసుకుంటారని అనుకుంటాను,” అంటూ సుతి మెత్తగా చెప్పింది. ఆలోచనలో పడింది శాంత.
ఒక సాయంత్రం, అలసిన పని రోజు తర్వాత, రాజీవ్, ప్రియా ఇంటికి తిరిగి వచ్చారు. శాంత మనవరాలికి హోంవర్క్‌లో సహాయం చేస్తున్న దృశ్యాన్ని చూసి ఆనందించారు. శాంత చేసిన సంప్రదాయ వంటల సువాసన అపార్ట్మెంట్ అంతా వ్యాపించింది.
“అమ్మా, అనిక ఈరోజు ఎలా ఉంది?” సోఫాలో కూలబడుతూ అడిగాడు రాజీవ్.
అలసిపోయిన కొడుకుని చూసి మృదువుగా నవ్వింది శాంత. “తను మంచిది. కానీ ఆ టాబ్లెట్‌తో ఎక్కువ సమయం గడుపుతోంది. నేను ఒక పుస్తకం చదవమని చెప్పాను, కానీ ఆమె తన స్నేహితులందరూ ఆన్లైన్ గేమ్ ఆడుతున్నారని చెప్పింది.”
ప్రియ, తన హ్యాండ్‌బ్యాగ్‌ని దింపి, నిట్టూర్చింది. “అమ్మా, ఈరోజుల్లో పిల్లలు ఆ విధంగానే స్నేహం చేస్తున్నారు. మేము ఆమెను సాంకేతికతకు దూరంగా ఉంచలేము. అంతేకాకుండా, తన అసైన్మెంట్లు కూడా ఆన్లైన్లోనే ఉంటాయి.”
శాంత చిన్నగా ముఖం చిట్లించింది కానీ నవ్వింది. “కాలం మారిందని నేను అర్థం చేసుకున్నాను, కానీ సమతుల్యత ఉండాలి. మీరు చిన్నతనంలో, ఆరు బయట ఆడేవారు, పుస్తకాలు చదివేవారు ఇంకా ఇంటి పనులలో సాయం చేసేవారు,ఔనా?”
రాజీవ్ కణతలు రుద్దుకుంటూ. “మాకు తెలుసు అమ్మా. మేము ప్రతిదీ కరెక్ట్ గా చేసేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఏం చేస్తాం?. ప్రపంచం మరింత పోటీగా ఉంది మరి అనిక దాని కోసం సిద్ధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం.”
శాంత, తన కొడుకు గొంతులోని అలసటను పసిగట్టింది, ఈ విషయాన్ని మర్నాటి వరకు వదిలేయాలని నిర్ణయించుకుంది. “నేను డిన్నర్ కి టేబుల్ సెట్ చేస్తాను. మీరిద్దరూ ఫ్రెష్ అప్ అవ్వండి.”
డిన్నర్ చేసేప్పుడు రాబోయే వారాంతపు ప్రణాళికల గురించిన సంభాషణలకు టైం . అనిక ఉత్సాహంగా తన సైన్స్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతోంటే శాంత ఒకింత గర్వంగానూ, మరో కాస్త ఆశ్చర్యంతోనూ వింది. రాత్రి భోజనం తర్వాత, అనిక మళ్ళీ తన టాబ్లెట్ పట్టుకుంది. రాజీవ్, ఇమెయిల్స్ చెక్ చేసుకుంటూ వాళ్ల గదిలోకి వెళ్ళిపోయాడు. అది చూస్తూ ప్రియ ఆలోచించింది.
మరుసటి రోజు ఉదయం, కాఫీ తాగుతూ ప్రియ రాజీవ్ తో, “అత్తయ్య చెప్పింది నిజమే! మనం గ్యాడ్జెట్స్ తో ఎక్కువ సమయం గడపడం వల్ల అనిక కూడా అలాగే అలవాటు పడుతోంది. మనం దీని నుంచి తన దృష్టి కాస్తయినా మార్చగలగాలి. దీని గురించి ఆలోచించు,” అని చెప్పింది.
కోడలి మాటలు విన్న శాంత సంభాషణకు ఇది సరైన సమయం అని నిర్ణయించుకుంది.
“రాజీవ్, ప్రియా, మీరు పాపని బాగా పెంచేందుకు మీ వంతు కృషి చేస్తున్నారని నాకు తెలుసు. మీరు కష్టపడి పని చేస్తున్నారు. తను కోరినవన్నీ అనిక కోసం అందిస్తున్నారు. కానీ అనిక నేర్చుకోవలసిన విలువల గురించి నేను ఆలోచిస్తున్నాను. సాంకేతికత ఇంకా విద్య ముఖ్యమైనవి, కానీ కుటుంబం, గౌరవం, బంధాలు కూడా అంతే ముఖ్యమైనవి.
ఆలోచనలో ఉన్న ప్రియ తల ఊపింది. “అత్తమ్మా, మీ ఆందోళన మాకు అర్థమైంది. మేము తనకు ఆ విలువలను నేర్పడానికి ప్రయత్నిస్తున్నాము, కానీ మా బిజీ షెడ్యూల్లతో ఇది సవాలుగా ఉంది. నేను ఒక పరిష్కారం ఆలోచించాను. కానీ దాని అమలులో మీ సహాయం కావాలి.”
“తప్పకుండా ప్రియా, నా పూర్తి సహకారం ఉంటుంది.”
ప్రియ ఒక్క క్షణం ఆలోచించింది.
“చిన్నగా ప్రారంభిద్దాం. ఎలాంటి గాడ్జెట్లు (స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు)లేకుండా, మనం అందరం వారానికి ఒక రోజు ఉంటే? కలిసి సమయాన్ని గడపొచ్చు, ఆటలు ఆడుకోవచ్చు, కథలు చెప్పుకోవచ్చు ఇంకా మన సంప్రదాయాల గురించి అనికాకు నేర్పించొచ్చు.”
రాజీవ్ దీనిని పరిగణనలోకి తీసుకున్నాడు. “ఇది బాగుంది.ఈ ఆదివారం అందరం గాడ్జెట్ లేని రోజుగా పాటిద్దాం. అంతా సరిగా ఉంటే ప్రతివారం అలాగే చేయొచ్చు,” తన అంగీకారం తెలిపాడు.
ప్రియ నవ్వింది, మార్పు కనుచూపుమేరలో ఉందని తేలిపోయింది. “అనిక కు ఇది నచ్చితే మనం ప్రతి వారం అలాగే చేయచ్చు.”
మరుసటి ఆదివారం, కుటుంబమంతా వారి మొదటి గాడ్జెట్ రహిత రోజును ప్రారంభించింది. శాంత పెసరట్టు ఉప్మా, అల్లం పచ్చడి సిద్ధం చేసింది. అందరూ కలిసి కూర్చున్నారు. అది తింటూ రాజీవ్, ప్రియ తమ బాల్యానికి చెందిన కథలను పంచుకున్నారు. అవి తల్చుకుంటూ ఇటువంటి అందమైన క్షణాలను ఎంతగా కోల్పోయారో గ్రహించారు. వారి బిజీ జీవితాల హడావిడిలో ఈ ఆనందాలను కోల్పోయారు. మొదట్లో ప్రతిఘటించింది అనిక. తన ఆన్లైన్ గేమ్‌లు, స్నేహితులను కోల్పోతానని ఫిర్యాదు చేసింది. శాంత, తన అనంతమైన సహనంతో, తన మనవరాలిని నిమగ్నం చేయడానికి మార్గాలను కనుగొంది. ఆమె అనికాను సాంప్రదాయ బోర్డ్ గేమ్‌లకు పరిచయం చేసింది. కుటుంబం అందరూ కలిసి అష్టా చమ్మా, వైకుంఠ పాళీ లాంటి ఆటలు ఆడుకోవడంతో అనిక సంబరపడింది. పురాణాల నుండి ఇంకా ఆమె చిన్ననాటి నుండి మనోహరమైన కథలను మనవరాలికి చెప్పింది శాంత. అలా రోజంతా తల్లీ తండ్రీ తనతోనే గడపడం అంతులేని ఆనందాన్ని ఇచ్చింది అనికకి.
వారు బోర్డ్ గేమ్స్ ఆడుతూ, పార్క్‌లో వాకింగ్ చేస్తూ, అనికాకు సాధారణ ఇంటి పనులను నేర్పిస్తూ రోజంతా గడిపారు. శాంత అనికాకు రంగోలిని ఎలా వేయాలో చూపించింది, దాని ప్రాముఖ్యతను వివరిస్తూ, ఒకరి చేతులతో అందమైనదాన్ని సృష్టించడంలోని ఆనందాన్ని వివరించింది. మొదట్లో సంకోచించిన అనిక త్వరగానే ముగ్గు వేయడం నేర్చుకుంది. ఆమె వేళ్లు ప్రతి చుక్కను, గీతను జాగ్రత్తగా వేయడంలో నిమగ్నం అయిపోయాయి.
వారాలు గడిచేకొద్దీ, గాడ్జెట్ లేని ఆదివారాలు వాళ్ళ కుటుంబ సంప్రదాయంగా మారాయి. అనిక ఆ రోజు కోసం ఎదురుచూడడం ప్రారంభించింది, కథలు, ఆటలతో పాటు తనకు నానమ్మతో ఏర్పడుతున్న ప్రత్యేక బంధాన్ని ఆస్వాదించింది. రాజీవ్ ఇంకా ప్రియ కూడా తమ కుమార్తెలో సానుకూల మార్పును గమనించారు-ఆమె తన చుట్టూ ఉన్న ప్రపంచంపై మరింత దృష్టి, గౌరవంతో వ్యవహరిస్తోంది. ఆమె ఇప్పుడు పుస్తక పఠనం కూడా చేస్తోంది.
ఒక ఆదివారం, వాళ్ళంతా కలిసి కూర్చున్నప్పుడు, అనిక తన చిన్ననాటి గురించి మరింత చెప్పమని నానమ్మను కోరింది. శాంత కళ్ళు వెలిగిపోయాయి. ఆమె తన సమయంలో పిల్లల పెంపకం, పండుగలు, సమాజ సమావేశాలు గురించి చెప్పింది. ఆ కథలలో ఎక్కడా టీవీ, ఫోన్ వంటివి లేకపోవడం అనికను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. “అవన్నీ లేకుండా మీరు ఎలా ఉండేవారు నానమ్మా?” తన ఆశ్చర్యాన్ని దాచుకోలేక అడిగేసింది.
నవ్వింది శాంత. “మీ అమ్మానాన్నను అడుగు,” అనడంతో వాళ్లకేసి చూసింది అనిక.
ఒక్కసారిగా బాల్యంలోకి వెళ్లిన రాజీవ్, ప్రియ, “నిజమే పాపా! మా చిన్నతనంలో టీవీ ఉంది కానీ ఇటువంటి స్మార్ట్ ఫోన్లు లేవు. మేం కాస్త పెద్దవాళ్లమయ్యాకే అవి వచ్చాయి. కానీ అవి ఇప్పుడు మన జీవితాల్ని పూర్తిగా ఆక్రమించేశాయి,” అని చెప్పారు.
నెలరోజుల తర్వాత, ఒక కుటుంబ సమావేశంలో, రాజీవ్ మాట్లాడటానికి లేచి నిలబడ్డాడు. “థాంక్యూ అమ్మా! నీ సహకారంతో ప్రియ ఆలోచనకు కార్య రూపం ఇవ్వగలిగాము. సంప్రదాయం, ఆధునికత సహజీవనం చేయగలవని మనం నిరూపించాం. ఆ రెండింటి బ్యాలెన్స్‌ని మేము కనుగొన్నాము. అనిక కూడా ఇప్పుడు ఎంతో మారింది. పైగా ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ దీని గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటోందిట. వాళ్ళ క్లాస్ టీచర్ నిన్న మమ్మల్ని పిలిచి మరీ దీని గురించి వివరాలు కనుక్కున్నారు. వీలైతే ఈసారి పేరెంట్ టీచర్ మీట్ లో మిగిలిన పేరెంట్స్ అందరికీ కూడా దీని గురించి చెప్పి, వీలైతే ఆచరించమని సూచిస్తాను అని చెప్పారు. ఈసారి పరీక్షల్లో అనిక క్లాస్ టాపర్ గా నిలిచింది. ఇదంతా నీ వల్లే సాధ్యమైంది.”
శాంత కళ్ళు సంతోషంతో మెరిశాయి. “నాకు మీ ఇద్దరి గురించీ గర్వంగా ఉంది రాజీవ్. మీరు ఇద్దరూ మంచి పేరెంట్స్ గా ఉన్నారు. పిల్లల పెంపకం ఎంత బాధ్యతతో కూడుకున్నదో గ్రహించి, తదనుగుణంగా నడుచుకుంటున్న మీకు హాట్సాఫ్. నిజానికి మా సమయంలో పిల్లల కోసం మేము ఇంతగా చేయలేదని ఒప్పుకోవాలి.తండ్రి అంటే సంపాదించి తెచ్చేవాడు, తల్లి పిల్లలకు వేళకు ఆహారం అందించడం, అప్పుడప్పుడు వాళ్ళ చదువుపై దృష్టి పెట్టడం మినహా పిల్లలతో ఇంత స్నేహపూర్వకంగా ఉండాలి అనే విషయం మేము గ్రహించలేదనే చెప్పాలి. మీ తరం వారు ఈ విషయంలో మాకు ఆదర్శంగా నిలిచారు. నిజానికి అప్పుడు మాకన్నా ఇప్పుడు మీరు ఇద్దరూ ఉద్యోగాలతో ఎంతో బిజీ. అయినప్పటికీ మంచి పేరెంటింగ్ యొక్క సారాంశం సంప్రదాయం ఇంకా ఆధునికత మధ్య ఎంచుకోవడంలో కాకుండా రెండు ప్రపంచాలలోని ఉత్తమమైన వాటిని మిళితం చేయడంలో ఉందని మీరు తెలుసుకున్నారు. మన ఇల్లు పాత విలువలు మరియు కొత్త ఆలోచనలు సహజీవనం చేసే అందమైన ప్రదేశంగా మారింది. అనిక మంచి చెడుల గుర్తింపు, గౌరవం మరియు ప్రేమతో పెరిగేలా చేసింది. మీరు నేటి తరం తల్లిదండ్రులకు ప్రతినిధులు.”
తపస్వి మనోహరం పత్రిక మరియు
శసాంగ్- అనుశ్రీ మెండు మరియు సేవా ఫౌండేషన్ వారి భాగస్వామ్యం తో నిర్వహించిన ‘ఈ తరం అమ్మానాన్నలు’ అంశం పై కథల పోటీలో రెండవ బహుమతి పొందిన కథ
“శ్వేతా ,ఏమిటే ఇంట్లో హడావుడి? ఇవాళ నీ పెళ్లి చూపులా ?అయినా ఈ రోజుల్లో కూడా ఇలా ఇంట్లో పెళ్లిచూపులు ఏవిటి? హాయిగా నువ్వు,ఆ అబ్బాయి ఎక్కడైనా బయట కలుసుకుంటే సరిపోతుంది కదా?”అడిగింది వర్ష చక్కగా ముస్తాబవుతున్న తన స్నేహితురాలిని .
“నువ్వు చెప్పింది నిజమే వర్షా. శరణ్ కూడా అదే అడిగాడు నన్ను ఫోన్లో, ‘ఇప్పుడు మా అమ్మ వాళ్ళూ , నేనూ అందరం కట్టు కట్టుకొని మీ ఇంటికి రావడం అవసరమా’అని. ‘అవసరమే’ అని చెప్పాను నేను,” జవాబు ఇచ్చింది శ్వేత.
“అదే, ఎందుకు? నువ్వు ఏదైనా బాగా ఆలోచించే చేస్తావనుకో, దీని వెనుక నీ ఆలోచన ఏమిటా అని ,”కుతూహలంగా అడిగింది వర్ష.
“నిజమేనే నువ్వు చెప్పింది. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నేను మాత్రమే వెళ్లి తనను బయట ఎక్కడైనా కలిస్తే కేవలం అతని భాహ్యరూపాన్ని చూడగలను,ఎందుకంటే ఏ రెస్టారెంట్ లోనే ఉన్నప్పుడు మనం చాలా వరకు,
మీ అలవాట్లు ఏంటి? ఇష్టాలు ఏంటి ?అని మాట్లాడుకున్నా అందులో ఎంతవరకు నిజాలు బయటకు వస్తాయో తెలియదు. అదే వాళ్ళ కుటుంబం అంతా వచ్చి అన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు మొత్తంగా వాళ్ళ కుటుంబం ఆలోచనా విధానం కాస్తైనా మనకు తెలుస్తుంది అనిపించింది.పెళ్లంటే కేవలం ఒక వ్యక్తి కాదు కదా! రెండు కుటుంబాల కలయిక అవ్వాలి కదా!”చెప్పింది శ్వేత.
“అందుకేనే నువ్వంటే నాకు ఇంత ఇష్టం. ఏ విషయమైనా లోతుగా ఆలోచించి, దాని మంచి, చెడు విశ్లేషిస్తావు. మంచి నిర్ణయం తీసుకుంటావు,” స్నేహితురాలిని పొగడకుండా ఉండలేకపోయింది వర్ష.
” సరే, సరే, నువ్వు భజన ఆపు. వాళ్ళు వచ్చినట్లున్నారు. ఈ అనుభవం నాకూ కొత్తగానే ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో,” ఫ్రెండ్ నోటికి తాళం వేసింది శ్వేత.
**************
“రండి, రండి, మీ అమ్మాయీ, అల్లుడూ రాలేదా?” శరణ్ కుటుంబాన్ని ఆహ్వానించారు శ్వేతా తండ్రి దశరథ్.
” లేదండీ ఆదివారమే అయినా మా అమ్మాయికి అసలు తీరికే ఉండదు. వారం మొత్తంలో మిగిలిపోయిన పనులన్నీ ఈ రోజే కదా చేసుకునేది,”సమాధానం ఇచ్చింది శరణ్ తల్లి సంధ్య.
అందరూ మాట్లాడుకుంటున్నారు. టీలు టిఫిన్లు కార్యక్రమం అంతా సినిమాలో చూపించినట్లు ప్రశాంతంగా గడిచిపోయింది. ఇందులో శ్వేత చెప్పిన ఒకరి కుటుంబం గురించి ఒకరు తెలుసుకోవడం ఎక్కడ ఉంది ?అందరూ నటించేస్తూనే ఉన్నారే, అనుకుంది మనసులో వర్ష.
శ్వేతా, శరణ్ విడిగా బాల్కనీలోకి వెళ్లి మాట్లాడుకున్నారు. ఇక భోజనాల సమయం అయింది. శ్వేతా వాళ్ళ అమ్మ రవళితో పాటు తనూ వంటగదిలోకి వెళ్లి భోజనాలు ఏర్పాట్లు అన్నీ దశరథ్ గారు కూడా చేస్తుంటే కాస్త ఆశ్చర్యంగా చూశాడు శరణ్.
” వంటలన్నీ చాలా బాగున్నాయి. శ్వేతా నీకు వంట వచ్చా? మా వాడు మంచి భోజనం ప్రియుడు అసలే,” అంది సంధ్య.
“ఆ, మా శ్వేతకే అన్న మాటేమిటి? మా అబ్బాయి ధీరజ్ కూడా వంట చేయడం బ్రహ్మాండంగా చేస్తాడు. అంతెందుకు దశరథ్ కి కూడా చాలా వంటలు వచ్చు,” చెప్పింది రవళి గర్వంగా.
“ఏంటి ఇంట్లో మగవాళ్ళందరి చేతా వంట చేయిస్తానని గర్వంగా చెబుతున్నారు? మా ఇంట్లో మగవాళ్ళకి కూర్చున్న చోటికి మంచినీళ్లు కూడా అందించాలి తెలుసా?” అదేదో చాలా గొప్ప విషయం అయినట్లుగా చెప్పింది సంధ్య.
ఒక్క క్షణం అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. తేరుకుని నెమ్మదిగా అడిగింది రవళి,”అదేమిటి వదినగారూ? మీరు నాలాగే ఉద్యోగం చేస్తున్నారని విన్నాను?”
“ఔనండీ,నేను బ్యాంకు మేనేజర్ గా చేస్తున్నాను. అయితే మాత్రం? ఇంటి బాధ్యత అనేది ఆడవారిదే కదా? నేను ఇంటా,బయటా అన్ని పనులు సమర్థవంతంగా చేసుకోగలను. మా అమ్మాయికి కూడా అదే నేర్పించాను. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐనా, ఇంట్లో పనులన్నీ స్వయంగా చేసుకుంటుంది. ఇక మిగిలిపోయిన పనులు వారాంతంలో చేసుకుంటుంది. అయినా,అందుకే కదా మన ఆడవాళ్ళని ‘మల్టీ టాలెంటెడ్ మహారాణి, అని పొగిడేది,” చాలా గర్వంగా జవాబు ఇచ్చింది సంధ్య.
” ఎవరండీ అన్నదా మాట? అయినా అదేమన్నా గొప్ప బిరుదు అనుకుంటున్నారా? ఆ ముళ్ళ కిరీటం మన తలపై పెట్టి మగవాళ్ళు ఎంచక్కా మనల్ని (ఆడవాళ్ళని) వెర్రి వాళ్ళని చేస్తున్నారు. మీలాంటి ఆడవాళ్లంతా దానిని మోస్తూ, ఎన్ని తరాలైనా మార్పు లేకుండా ఆడవాళ్లకు తప్పుడు మార్గదర్శకం చేస్తున్నారు” ఆవేశంగా మాట్లాడుతోంది రవళి.
“మమ్మీ, ఎందుకంత ఆవేశం?” తల్లిని ప్రసన్నం చేసేందుకు ప్రయత్నించింది శ్వేత.
” అలా చెప్పమ్మా, మా ఆవిడ అన్న దాంట్లో తప్పేముంది, మీ అమ్మ అంత కోపంగా సమాధానం చెప్పడానికి?” భార్యకి వత్తాసు పలక పోయాడు శరణ్ తండ్రి వినోద్.
“ఆవేశం కాదులే బుజ్జీ, ఇది ఆవేదన. రెండు తరాల ముందు వరకు ఆడవాళ్లు ఇంట్లోనే ఉండేవారు. భర్త సంపాదించి తెస్తే ఇంట్లో అన్ని పనులు చూసుకునేవారు. పైగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కనుక ఇంట్లో ఉండే ఆడవాళ్ళంతా కలిసి పని చేసుకునేవారు. అప్పుడు ఎవరికీ ఎక్కువ శ్రమ ఉండేది కాదు. కానీ ఇప్పుడు? ఆర్థిక అవసరాల మూలానో సమానత కోసమో ఆడవాళ్లు మగవారితో సమానంగా బయటికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటప్పుడు, ఇంట్లో పనిని సమానంగా పంచుకోవాలి కదా ఈ మగవాళ్ళు,” అందరికీసి చూసింది రవళి.
“మీ ఇంట్లో లాగా అందరి ఇళ్లల్లో అలవాటు ఉండదు కదా ఆంటీ?” అడిగాడు శరణ్ .
“ఔను బాబూ,నిజమే. ఏ పనైనా, ఏ అలవాటైనా, ఎక్కడో అక్కడ మొదలవ్వాలి కదా? ఈరోజు అలవాటు లేదు కనుక రేపు చేసుకోను అంటే కుదరదు కదా? మన జీవితంలో చాలా అలవాట్లు వయసుతో పాటు మార్చుకుంటూ ఉంటాం. ఇదీ అలాగే. ఎక్కడో చోట ఎప్పుడోకప్పుడు మొదలుపెట్టాలి కదా!” సర్ది చెప్పబోయాడు దశరథ్
“ఔను శరణ్, నువ్వు చెప్పేది నిజమే. అలాగే అంకుల్ చెప్పేది కూడా నిజమే. అలవాటు ఎక్కడో చోట మొదలుపెట్టాలి కదా! ఇందులో తప్పంతా మగవారిదే అని చెప్పలేను. మీ అమ్మ లాంటి,అక్క లాంటి ఆడవారిలో పరివర్తన రావాలి ముందు. ఆవిడా, నేనూ ఇంచుమించు ఒకే వయసు వాళ్ళమే. కానీ ఈ మల్టీ టాస్కింగ్ అనే భ్రమలో ఉండిపోయి ఆవిడ చూడు నాకన్నా ఓ పది సంవత్సరాలు పెద్దదానిలా ఉన్నారు.బుజ్జి చెప్పింది ఆవిడకి బీపీ, డయాబెటిస్ అన్నీ ఉన్నాయి అని. అవన్నీ ఇంత త్వరగా ఎందుకు వచ్చాయి ?కావలసిన దానికన్నా ఎక్కువ స్ట్రెస్ టెన్షను తీసుకోవడం వల్లనే కదా?మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఈ విషయం గురించి ఆలోచించారా? మీ అమ్మ ఇంట్లో పని అంతా చేస్తూ ఉంటే మీ నాన్నగారు కూర్చొని ఆర్డర్లు పాస్ చేస్తూ ఉండడం చూస్తూ పెరిగిన మీరు అలాగే తయారై ఉంటారు కదా?”రవళి మాటలకు ఆలోచనలో పడ్డాడు శరణ్.
“ఔనాంటీ మీరు చెప్పింది అక్షరాల నిజం. మా స్నేహితులలో కూడా చాలామంది ఇళ్లల్లో అమ్మలు మాత్రమే వంటగదిలో ఉండి, నాన్నలు ,మిగతా కుటుంబ సభ్యులూ అదీ తమకు సంబంధం లేని అంశంగా ప్రవర్తిస్తూ ఉండడం వల్ల అదే సహజం, ధర్మం అని అనుకున్నాను కానీ దీని గురించి ఇంత లోతుగా ఎప్పుడూ ఆలోచించలేదు. కనీసం మా తరం నుంచి అయినా మగవారిలో మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉంది అని ఇప్పుడే అర్థం అవుతోంది. ఈరోజు నుంచి మా ఇంట్లో అమ్మకు వంటగదిలో, ఇంటి పనుల్లో తప్పకుండా సాయం చేయడం అలవాటు చేసుకుంటాను. అంతేకాదు, మా బావగారికి కూడా ఈ విషయంలో కాస్త అవగాహన కలిగించి, మా అక్క కూడా మా అమ్మలా త్వరగా అనారోగ్యం కొని తెచ్చుకోకుండా చూస్తాను,”మనస్ఫూర్తిగా చెప్పాడు శరణ్.
“నిజమేరా శరణ్, రవళి గారు చెప్పినట్లు ఇందులో నా తప్పు కూడా చాలా ఉంది. నేనే కాదు నాలాంటి చాలామంది ఆడవాళ్ళలో ముందు పరివర్తన రావాలి. కుటుంబ ఆర్థిక భారాన్ని ఆడవాళ్ళం పంచుకుంటున్నప్పుడు పనిభారాన్ని కూడా అలాగే పంచుకోవాలి. అందరికీ అన్ని పనులు వచ్చి ఉండాలి. అలా కనీసం మా పిల్లలనైనా సిద్ధం చేయకపోతే ముందు ముందు కాలంలో వివాహాలు నిలబడవు. ఈరోజు కాదు,ఈ క్షణం నుంచే నేను మారుతున్నాను. శరణ్ భోజనాలు అయిపోగానే మేము, పెద్దవాళ్ళంతా రెస్ట్ తీసుకుంటాము. టేబుల్ అంతా నీట్ గా సర్దేందుకు శ్వేతకి నువ్వు సాయం చెయ్యి. నాకు కాబోయే కోడల్ని కష్టపెట్టకు అర్థమైందా?” సీరియస్ గా అంటున్న సంధ్యని చూస్తూ సరదాగా నవ్వేసుకున్నారు అందరూ.
“చాలా బాగుంది శ్వేతా .నువ్వు చెప్పినట్లు ఈ పెళ్లిచూపుల తతంగం వల్ల ఈరోజు నేను కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను. నీ ఆలోచనకు హ్యాట్సాఫ్,” చెప్పింది వర్ష.
ట్రింగ్ …ట్రింగ్ ..
ఫోన్ మోగడం తో వంట గదిలో నుంచి వచ్చింది సుజాత “హలో, హలో ,నేను అమ్మా నీ శీను ని మాట్లాడుతున్నాను.”
” చెప్పు బాబూ, ఏంటి సంగతి అంత ఆనందంగా ఉన్నావు?”
” ఆ అవునమ్మా ! ఆనందం కాదు అంతకు మించి. నా (నీ) కల నెరవేరింది అమ్మా. నేను కలెక్టర్ పోస్ట్ కి సెలెక్ట్ అయ్యాను.. ఇప్పుడే రిజల్ట్స్ వచ్చాయి. వెంటనే నీకు ఫోన్ చేస్తున్నాను.
ఈ క్షణం నీ పక్కన ఉండి ఉంటే బాగుండు. నీ కళ్ళల్లో ఆ వెలుగులు చూస్తే బాగుండు అనిపిస్తోంది అమ్మా. రాత్రి ట్రైన్ కి బయలుదేరి వస్తాను.”
“ఏంటి శ్రీనూ, నువ్వు చెప్పేది నిజమా? మన కల నెరవేరిందా? సో గ్రేట్ నాన్నా! కంగ్రాట్యులేషన్స్! మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు. ఎంతో గర్వంగా ఉంది. సరే వెంటనే బయలుదేరిరా.
నువ్వు వచ్చేసరికి నీకు ఇష్టమైన బొబ్బట్లు, ఆవ పెట్టిన పులిహోర చేసి ఉంచుతాను. మీ స్నేహితులను కూడా భోజనానికి పిలువు. ఈ ఆనందం వాళ్ళ అందరితో షేర్ చేసుకుందువు గానీ.”
“అలాగే అమ్మా. అలా అయితే ముద్దపప్పు ఉంచు. ఆ వెంకట్ గాడికి మన ఇంట్లో ముద్దు పప్పు ఆవకాయ అంటే ప్రాణం. మీ అమ్మ అంత బాగా ఆవకాయ ఎవరూ చేయలేరు రా అంటాడు. ఇక ఉంటాను మరి. వాళ్ళందరికీ ఫోన్లు చేయాలి. బై,”
” బై శీను, జాగ్రత్త. బయలుదేరినప్పుడు ఫోన్ చెయ్,” చెప్పింది సుజాత.
ఫోన్ పెట్టేసి ఆనందభాష్పాలు తుడుచుకుంటూ సోఫాలో కూర్చుంది. మనసు గతంలోకి జారిపోయింది అప్రయత్నంగా.
“అది కాదమ్మా, నువ్వు ఇప్పుడు భర్తను వదిలేస్తే ఈ పిల్లాడిని పెట్టుకుని ఎలా బతుకుతావు? నువ్వు చేస్తున్నది ప్రైవేట్ ఉద్యోగం. ఆ సంపాదనతో పిల్లాడిని చదివించడం సాధ్యమవుతుందా? మంచో చెడో పిల్లాడి కోసమైనా నువ్వు సర్దుకుపోవాలి అతడితో,” తన తల్లి మాటలు.
“లేదమ్మా అతనితో కలిసి ఉంటే నా పిల్లాడికి మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది అనిపిస్తుంది నాకు. అతడి చెడు ప్రవర్తన పిల్లాడి పెరుగుదల పై ప్రభావం చూపిస్తుంది. నాకది ఇష్టం లేదు. నేను నా శ్రీనూని ఒక గొప్ప పౌరుడిగా తీర్చిదిద్దాలి అనుకుంటున్నాను.సాధ్యమైతే వాడిని కలెక్టర్ గా చూడాలనుకుంటున్నాను. నన్ను ఈ విషయంలో ఇబ్బంది పెట్టకు. అతనితో కలిసి ఉండమని చెప్పకు, ప్లీజ్.”
ఏ ధైర్యంతో ఆ నిర్ణయం తీసుకుందో తెలీదు కానీ తన భర్త తనను మోసం చేస్తున్నాడని, తిరుగుబోతు గా మారాడని తెలియగానే అతడితో విడాకులకు సిద్ధమైంది.
కానీ అమ్మ చెప్పిన మాట నిజమే. తన ప్రైవేట్ టీచర్ ఉద్యోగం తో కొడుకుకి మంచి చదువు చెప్పించడం కష్టం. కనుక దీనికి ఏదైనా చేయాలి. శ్రీను ని బాగా చదివించాలి. ఎలా? ఏం చేయటం? ఆలోచిస్తూ ఉండగా ఒక మంచి ఉపాయం తట్టింది సుజాతకి.
అవును కరెక్ట్ అలా చేస్తే తనతోపాటు తన లాంటి మరికొందరు మహిళలకు కూడా ఉపాధి కల్పించవచ్చు. సంపాదన పెరుగుతుంది కనుక ఇబ్బంది ఉండదు.
కానీ తను అనుకున్నది ఆచరణలో పెట్టి ఫలితం రావడానికి కనీసం ఒక ఏడాది కాలం పడుతుంది, అప్పటి వరకూ తనూ, పిల్లాడు బ్రతకడానికి తన వద్ద ఉన్న డబ్బు సరిపోతుందా? మళ్లీ ఆలోచనలో పడింది సుజాత.
తన ఆలోచనని, ప్రణాళికను అన్నగారితో చర్చించింది. చిన్ననాటి నుంచి అన్నయ్య తను మంచి ఫ్రెండ్స్. తన ప్రతి సంతోషంలో, కష్టంలోనూ తోడు ఉన్నవాడు అన్నయ్య. ఇది కూడా తన ధైర్యానికి కారణం కావచ్చు.
“చాలా బాగుంది సుజాతా. నీకు ఎలాగు వంట చేయడం ఇష్టం కదా. నీ చేతి వంట అమోఘంగా ఉంటుంది కాబట్టి తప్పక విజయం సాధిస్తావు. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అన్నా వదినలు ఉన్నారని మర్చిపోకు,” అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించాడు అన్నయ్య.
అదిగో ఆరోజు తన ఆలోచనల్లో మొదలైనది “అమ్మ చేతి వంట” అనే క్లౌడ్ కిచెన్. పూర్తి శాకాహార ఆంధ్ర భోజనం.
ఉన్నపళంగా హైదరాబాద్ వచ్చేసింది తను. భర్త (తను) ఉద్యోగం చేస్తున్న ఊరిని వదిలి. అయితే ఇక్కడ తన చిన్ననాటి స్నేహితులు చాలామంది ఉన్నారు. వారికి ఫోన్ చేసి చెప్పింది తను వస్తున్నానని.
తన స్నేహితురాలు సీత ఎంతో సహాయం చేసింది. ఉండేందుకు ఇల్లు చూసి పెట్టడమే కాక ఆమె భర్త వ్యాపారంలోనే ఉండడంవల్ల తను వ్యాపారం ప్రారంభించడానికి కావలసిన సరుకులు వస్తువులు వంటివి అతని స్నేహితుల వద్ద హోల్ సేల్ ధరలకు ఇప్పించడం వంటి ఎన్నో.
చివరికి తను విడాకులకు అప్లై చేసేందుకు లాయర్ గారిని కూడా పరిచయం చేసింది సీత. ఆమెకు ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి.
ఆ విడాకుల ప్రహసనం మామూలుగా జరిగిందా? తను మగవాడిని కనుక ఎంతమందితో తిరిగినా తప్పులేదనే అహంకారంతో ఉన్న భర్త, అంతే గొప్పగా అతనికి వత్తాసు పలికే అత్తగారు ఎన్ని విధాలుగా ఇబ్బందికి గురి చేయడానికి ప్రయత్నించారు!
తనకు తెలియకుండా
పిల్ల వాడిని కలుసుకుని వాడి బుర్రలో తనకు వ్యతిరేకంగా విషం నూరి పోయడానికి కూడా సిద్ధపడ్డారు.
పాపం శీను, చిన్న పిల్లవాడు. తల్లా,తండ్రా అంటే ?కానీ వాడు చాలా తెలివైనవాడు. అంతేకాక చిన్ననాటి నుండి తానే లోకంగా బ్రతుకుతున్న తన తల్లి మనసు అర్థం చేసుకున్నాడు. తన తోటే ఉన్నాడు. తనని పూర్తిగా నమ్మాడు.
తన భర్త లాంటి మగవారిని ఏం చేయాలి అసలు? కాలం ఎంత మారినా తాము మారమని, మగవాడు అంటే అదేదో దేవుడు అన్నంత అహంకారం. తాను విడాకులు అనే సరికి ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు తల్లీ కొడుకులు. అయినా తన తప్పు ఒప్పుకునేంత ఔన్నత్యం లేదు కదా!
అతని తప్పు మూలానే తాను విడాకులు కోరుతున్న విషయాన్ని కోర్టులో ప్రూవ్ చేసుకోడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.
తన అన్నయ్య స్నేహితుడైన ఒక ఇన్స్పెక్టర్ సహాయంతో సాక్ష్యాలను సేకరించగలిగింది.
కేవలం విడాకులతో వదిలేయాలా లేక తనను మానసికంగా ఇంత బాధపెట్టిన అతడినిజైలుకు పంపించాలా? ఎన్నో ఆలోచనలు.
కొత్తగా మొదలు పెట్టిన వ్యాపారం ఒకపక్క, కోర్టు కోసం తిరగటం ఒకపక్క. ఈ మధ్యలో బంధువులలో గుసగుసలు. వీటన్నిటినీ అధిగమిస్తూ శ్రీను చదువుకు ఏమాత్రం అంతరాయం కలుగకుండా చూసుకుంటూ తన వ్యాపారంపై దృష్టి పెట్టలేక పోతోంది.కానీ పోరాడాలి, గెలవాలి అన్న తపన, గెలుస్తాను అనే ఆత్మవిశ్వాసం ఏనాడు విడవలేదు సుజాత.
ఏదైనా వ్యాపారం మొదలు పెట్టి అందులో విజయం సాధించడం సినిమాలో చూపించినంత సులువైన విషయం కాదు అని అర్థమైంది సుజాతకు.
అందులోనూ తన లాంటి ఒంటరి మహిళలకు ఆ పోరాటం ఇంకా ఎక్కువ. కానీ పోరాడితే విజయం తప్పక సాధించగలం అని నిరూపించింది కూడా తను.
తను ఆనాడు ఒక శాఖగా ప్రారంభించిన “అమ్మ చేతి వంట” తన అయిన వాళ్ళు, స్నేహితుల ప్రోత్సాహం తో పాటు హైదరాబాద్ నగర వాసుల ప్రోత్సాహంతో, వారి శాఖాహార అవసరం తీరుస్తూ, వారిచ్చిన మంచి ఫీడ్ బ్యాక్ వలన ఈరోజు నగరంలోని వివిధ ప్రాంతాలలో 8 శాఖలుగా విస్తరించింది.
అన్ని శాఖలలో కలిపి దాదాపు 50 మందికి పైగా ఆడవారు పనిచేస్తున్నారు. వారంతా తనలాగా జీవితంలో ఏదో విధంగా దెబ్బతిన్నవాళ్లే.
కొత్త శాఖను ప్రారంభించినప్పుడల్లా కనీసం ఒక నెల రోజులు తను అక్కడే ఉంటూ అక్కడ వంట చేయడానికి వచ్చిన వారికి ప్రతి ఆహారం తను అనుకున్న రుచి వచ్చేలా ఎలా చేయాలో కొలతలతో నేర్పించడం చేసింది .
అందువల్ల అన్ని శాఖలలోనూ ప్రతి రోజూ ఒకే రుచి. రుచి, శుచి, నాణ్యత విషయంలో కాంప్రమైజ్ కాకపోవడం వల్ల తను అనుకున్న విధంగా విజయం సాధించగలిగింది.
వ్యాపారం లో ఎంత బిజీగా ఉన్నా శ్రీను చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఎప్పుడూ మర్చిపోలేదు సుజాత. మంచి కాలేజీలో ఇంటర్ చదివాడు.
ఫ్రెండ్స్ అంతా ఇంజనీరింగ్ చదువుతున్నా తన ఆశయం అది కాదని తెలుసు కనుక డిగ్రీలో చేరాడు శ్రీను. చదువులో ఎప్పుడూ అశ్రద్ధ చూపలేదు. పీజీ చదువుకుంటూనే సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాడు.
తల్లి కష్టం, మనసు అర్థం చేసుకున్నాడో ఏమో చిన్ననాటి నుంచి తల్లి కలనే తన కలగా చేసుకుని కలెక్టర్ అవడం కోసమే చదివాడు. గత రెండు ప్రయత్నాలు విఫలం అయినప్పుడు కుంగిపోకుండా ముచ్చటగా మూడో ప్రయత్నంలో సఫలీకృతుడయ్యాడు.
ఈ సంతోషానికి అవధులు ఉన్నాయా? అసలు ఇది నిజమేనా? తను కలగంటోందా? చేతి మీద గిల్లుకుంది సుజాత. ‘అబ్బా!’ నొప్పి తెలుస్తోంది. అయితే ఇది నిజమే అన్నమాట.
వెంటనే ఈ ఆనందాన్ని తన తల్లిదండ్రుల తోటి, అన్నా వదినల తోటి పంచుకోవాలి. తన స్టాఫ్ అందరికీ శ్రీను వచ్చాక పెద్ద పార్టీ ఇవ్వాలి.
“అమ్మా, నేను కలెక్టర్ అయిన తర్వాత నువ్వు ఇంక ఏ మాత్రం కష్టపడొద్దు.నాతోటే ఉండాలి. ఈ ఆంటీలందరికీ నేను ప్రభుత్వ రుణాలు వచ్చేలా చేసి సొంత వ్యాపారాలు చేసుకునేలా చేస్తాను,” అని చెప్పే శ్రీను అంటే వాళ్ళందరికీ ఎంత ఇష్టమో. ఈ వార్త విని చాలా సంతోషిస్తారు. ఆలోచిస్తూ సోఫాలోంచి లేచింది తన పుత్రోత్సాహాన్ని అందరితో పంచుకోవడం కోసం సుజాత.
రచన : కట్టెకోల విద్యుల్లత
6302805571