అవసరాలకు పిలిచి మరీ అప్పులిచ్చే జగదీశ్ దురాశతో వడ్డి వ్యాపారం కూడా మొదలుపెట్టాడు. తీసుకున్న అప్పులు సమయానికి తీర్చకుండా ఉంటేనే జగదీష్ ఆత్మశాంతిస్తుంది. ఎందుకంటే నెలవారీ అప్పనంగా వచ్చే వడ్డిలు, చక్రవడ్డిలంటే అతనికి చక్రపొంగలిలా మహారుచిగా ఉంటాయి కాబట్టి.
ఎందుకో అతనికి ధనదాహం రోజురోజుకీ పెరిగిపోతోంది. క్రమక్రమంగా రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించి, అడ్డంగా కోట్లు ఆర్జించాడు. ఈ అక్రమ సంపాదనంతా బ్యాంకుల్లో వేస్తే ఇన్‌కంటాక్స్ కట్టాలి కదాని, అతి తెలివితో కరెంసీ నోట్లను గోనె సంచుల్లో వేసి కట్టి గోడౌన్ నింపేశాడు.
ఒకప్పుడు ఎకరాల్లో భూమిని కొని, ప్లాట్లు చేసి యాభై రెట్లకి అమ్మి లాభాలు చవిచూశాడు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే పూర్తిగా తారుమరైపోయింది.
హైటెక్ గిరాకీని తట్టుకోవాలంటే కనీసం గజాల్లో కూడా ప్లాట్లు దొరకటం కష్టమైపోయింది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో చదరపు అడుగుల్లోనే వ్యాపారం చేయవలసి వస్తోందని తెగ మదనపడిపోయాడు. అందుకే అయితే ఎస్టేట్ మానేసి, వెంటనే కొత్త బిజినెస్ చేయాలని డిసైడయ్యాడు.
అదే సమయంలో జగదీష్‌కి ఒక సూపర్ ఐడియా ఒకటి ప్లాష్ అయ్యింది. ఇక ఏ మాత్రమూ ఆలస్యం చేయకూడదని, తన ప్లాన్‌ని అమలు చేయటానికి వెంటనే సైంటిస్ట్ ప్రజాపతి ఇంటికి కారులో బయలుదేరాడు.
* * *
లేక లేక పుట్టిన కొడుకుకి చక్రవర్తి అని పేరు పెట్టుకున్నారు. సాంబయ్య, రంగాబాయి దంపతులు. సాంబయ్య కూలీనాలీ చేస్తూ భార్యను ప్రేమగా చూసుకునేవాడు. చక్రవర్తిని మాత్రం గవర్నమెంటు స్కూలుకి పంపుతున్నారు. ఎందుకంటే ఆ స్కూల్లో ఒకపూట భోజనం పెడుతున్నారు. అలాగే ఉచితంగా క్లాసు పుస్తకాలు కూడా ఇస్తున్నారు. భార్య రంగాబాయికి జ్వరం వచ్చింది. ఎంతకాలమైనా జ్వరం తగ్గకపోగా అది జబ్బుగా మారిపోయి మంచానపడిరది. ఆమె వైద్యం కోసం అప్పులు చేయవలసి వచ్చింది. రాను రాను సరిjైున వైద్యం అందకపోవటంతో హఠాత్తుగా రంగాబాయి స్వర్గస్తురాలయ్యింది.
భార్య తోడు లేకపోవటంతో సాంబయ్యకు ఏదో వెలితిగా ఉండేది. ఎప్పుడూ ఆమె గురించే ఆలోచిస్తూ పరధ్యాన్నంగా ఉండేవాడు. ఆడ దిక్కులేని ఏ మగాడికైనా జీవితం మీద విరక్తి పుడుతుంది అనే దానికి బహుశా ఇదే ఉదాహరణేమో! అదే వైరాగ్యం, బెంగగా మారి తట్టుకోలేని స్థితిలో చివరికి సాంబయ్యకు గుండెపోటు వచ్చి భార్య దగ్గకు వెళ్ళిపోయాడు.
చక్రవర్తి టెన్త్‌క్లాసు చదువుతూనే చిన్న చితకా పనులు చేస్తూ తన కాళ్ళమీద తను నిలబడ్డాడు. కానీ చిక్కంతా ఇక్కడే ఎదురైయ్యింది. అమ్మ వైద్యం కోసం నాన్న తీసుకున్న అప్పులు తీర్చుమంటూ జగదీష్ అనుచరులు చక్రవర్తిని నిత్యం వేదించసాగారు. ఈ సమస్య చక్రవర్తి చదువుకు బ్రేక్ వేసింది. తండ్రి బాటలోనే కాయకష్టం చేస్తూ జగదీష్‌కి పదివేలు అప్పు కాస్తా తీర్చేశాడు.
ఉండటానికి ఇల్లు లేదు. కొంతకాలం పాడుబడిన ఇళ్ళల్లోనూ చెట్లకిందా జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. ఆ తరువాత సిమెంట్ పైపుల్లో నివసించసాగారు. అక్కడ కూడా అతనికి చుక్కెదురైయ్యింది. మున్సిపాలిటి వాళ్లు వచ్చి ‘‘ఇక్కడ మేము మంచినీళ్ళ పైపులైన్సు వేయాలి. వెంటనే నువ్వు ఇక్కడ నుండీ ఖాళీ చేయాలి’’ అని చెప్పి చక్రవర్తిని వెళ్లగొట్టారు. అప్పుడే అతని దగ్గరున్న రేడియోలో నుండీ ‘‘పయనించే ఓ చిలుకా ఎగిరిపో! పాడై పోయెను గూడూ’’ పయనించే ఓ చిలుకా! అనే ఘంటసాల మాస్టారు పాడిన పాట వింటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. తన దగ్గరున్న పెట్టెనూ, ఇంజనీర్ సర్ విశ్వేశ్వరయ్య ఫోటోని చేత పట్టుకొని బ్యాగును సర్దుకుని సిమెంట్ పైపుల నుండీ బయటకు వచ్చేశాడు చక్రవర్తి.
చాలీచాలని కూలి డబ్బులతో తన జీవితకాలంలోనే ఇల్లు కట్టటం అసాధ్యమనే ఆలోచనల ఆవర్తనాలలో మునిగిపోయాడు పాపం గరీబు చక్రవర్తి.
* * *
సైంటిస్ట్ ప్రజాపతికి తన ప్లాన్ వివరంగా చెప్పాడు. దానికి తగ్గట్టే ప్రయోగం చేసి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అద్భుతమైన మందును తయారుచేయమని చెప్పాడు జగదిష్. ఇక తప్పనిసరి పరిస్థితులలో ప్రయోగం చేయటానికి ఒప్పుకున్నాడు సైంటిస్ట్ ప్రజాపతి. లేకుంటే చిత్రహింసలకు గురిచేస్తానని బెదిరిస్తున్నాడు.
సైంటిస్ట్ ప్రజాపతి చేస్తున్న ప్రయోగానికి కావలసిన రసాయనాలనూ, ఇతర లేబరేటరీ పరికరాలనూ సిద్దం చేశాడు. జగదీష్ తన గెస్ట్‌హౌస్‌లోనే ప్రయోగశాలను ఏర్పాటుచేశాడు. తాను కనిపెట్టబోయే మందుకోసం పగలూ రాత్రీ నిర్విరామంగా ఎన్నో గ్రంథాలు చదువుతున్నాడు. ఇంకా మరెన్నో మెడికల్ మ్యాగజైన్లు కూడా రిఫర్ చేస్తున్నాడు. ఇప్పుడు గెడ్డాలు, మీసాలు బాగా పెరిగిపోయి అసలు ఎవరు గుర్తుపట్టలేనటువంటి వ్యక్తిగా మారిపోయాడు సైంటిస్ట్ ప్రజాపతి.
‘‘ఇంకా ఎంతకాలం ఇలా కాలయాపన చేస్తావ్? అని కోపంతో సైంటిస్ట్ చెంప చెళ్లుమనిపించాడు జగదీష్. ఈ అనూహ్య చర్యకు ప్రజాపతి స్పృహ తప్పి కిందపడిపోయాడు. అతను తిరిగి కోలుకునే సరికి రెండు రోజుల సమయం పట్టింది. మీరు కొట్టిన దెబ్బలు సైంటిస్ట్ మెదడుమీద తీవ్ర ప్రభావం చూపించాయని డాక్టర్ సుధాకర్ నిర్ధారించాడు.
మొత్తానికి రెండు రోజుల తరువాత సైంటిస్ట్ మళ్ళీ చురుకుగా ప్రయోగాలు చేయటంతో, హమ్మయ్యా నన్ను బతికించావు దేవుడా! అని ఊపిరి తీసుకున్నాడు జగదీష్.
ప్రజాపతీ! నేను చెపుతున్నది జాగ్రత్తగా విను. ఇప్పుడు నీవు తయారుచేయబోయే మందు తీసుకున్నవాళ్లకు పూర్తిగా మతిమరుపు వ్యాధి వచ్చేయాలి. దానితోపాటు మందు స్లో పాయిజన్ లాగా కూడా పనిచేయాలి. అది కళ్లెర్ర జేసి బెదిరించటంతో భయపడిపోయాడు పాపం సైంటిస్ట్ ప్రజాపతి. కానీ ప్రభుత్వం నుండీ అనుమతి లేకుండా మరియూ ‘‘ప్రాణ హానికరమైన మందులు తయారుచేయటం చట్టరీత్యా నేరం’’ అని చెప్పినందుకే ప్రజాపతిని చిత్రహింసలకు గురిచేస్తున్నానడు జగదీష్.
సైంటిస్ట్ ప్రయోగాలు చేయటం మొదలుపెట్టి సుమారు సంవత్సరకాలం కావస్తోంది. అందుకే జగదీష్ జుట్టు పీక్కుంటున్నాడు. అసహనంతో రగిలిపోతున్నాడు. చివరికి సైంటిస్ట్‌ని చిత్రహింసలకు గురిచేయటం ప్రారంభించాడు.
‘‘ప్రజాపతీ! నేను చెప్పినట్లు త్వరగా ఆ మందును, ఫార్ములానూ వెంటనే కనిపెట్టకపోతే నీ తాట తీస్తాను, చంపేస్తాను’’ అర్థమయ్యిందా! అని కోపంతో జగదీష్ ఊగిపోతున్న సమయంలో ప్రజాపతి భార్య ప్రసన్నాదేవి లేబరేటరీలోనికి ఆదుర్ధాగా ప్రవేశించింది.
నీచుడా! నా భర్తను నిర్భంధించి ఇలా చిత్రహింసలకు గురిచేస్తూ ఆయనచేత ప్రాణాంతక ప్రయోగాలు చేయిస్తున్నావా! అంతేకాకుండా ప్రాణాంతకమైన మాదకద్రవ్యాలను, నకిలిమందులను తయారుచేయిస్తున్నావు. నువ్వు సర్వనాశనమైపోతావు. నువ్వొక దేశద్రోహివి. ప్రతీ నెలా నీ మనుషులు మా ఇంటికి వచ్చి ఇచ్చింది ఇలాంటి పాపిష్ఠి సొమ్మా! అంటూ ఉగ్రరూపం దాల్చిన ప్రసన్నాదేవి జగదీష్‌పై ఆగ్రహంతో విరుచుకుపడిరది.
శభాష్ ప్రసన్నాదేవిగారు! అసలు నేనే మిమ్మల్ని తీసుకురమ్మని చెపుతామనుకున్నాను. కానీ ‘‘వెతకిపోయిన తీగ కాలికి తగిలినట్లు మీరే వచ్చేశారు’’. ఇక్కడున్న దృశ్యాన్ని కళ్ళారా మీరే స్వయంగా చూశారుగా!
వెంటనే అతని అనుచరులు అక్కడున్న సైంటిస్టుని అతని భార్యనూ సీరియస్‌గా చూస్తూ రివాల్వర్లతో కవర్ చేశారు.
మేడమ్ ప్రసన్నాదేవిగారూ! నాకు కావలసిన మందును, ఫార్ములానూ త్వరగా తయారుచేసి నాకిచ్చేస్తే, అక్షరాల కోటి రూపాయల బహుమానంతో ఇదిగో ఇప్పుడే మీవారినీ మీతోపాటు ఇంటికి క్షేమంగా పంపించేస్తాను ఆవేశంగా అరిచాడు జగదీష్. వెంటనే ఆమెను కూడా బంధించారు జగదీష్ అనుచరులు.
* * *
చక్రవర్తికి కూడా వయసుతో వచ్చే సహజమైన కోరికలు చాలా ఉండేవి. ఒకరోజు అదే పనిమీద రెడ్‌లైట్ ఏరియాకి వెళ్ళాడు. అక్కడ కూడా చక్రవర్తికి ఎదురు దెబ్బ తగిలింది. పోలీసుల రైడిరగ్‌లో దొరికిపోయాడు.
ఇదేం న్యాయం? అమ్మాయిల్ని వదిలేసి కేవలం విటులనే అరెస్టులు చేయటం, వారికే శిక్షలు వేయటం ఏమిటి? ఇది ముమ్మాటికి అధర్మం! అని ధర్నా చేశాడు. దాంతో చక్రవర్తికి నెలరోజులు జైలుశిక్ష పడిరది.
అసలు ఈ రోజుల్లో బ్రతుకే ఒక సమస్యగా మారిపోయింది. ‘‘తాను దూర సందు లేదు, మెడకో డోలా!’’ అన్నట్లు ఇక పెళ్లి చేసుకోవటం ఎందుకు? అని డిసైడ్ అయిపోయాడు. తనకు సంసారంతో పనిలేదు కాబట్టి చిన్న ఇల్లు కట్టేద్దాం అని దీర్ఘంగా ఆలోచిస్తూ మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారి ఫోటోని చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు చక్రవర్తి. ఎందుకో అతనికి మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారు వంటి గొప్ప ఇంజనీర్ కావాలనే కోరిక చాలా బలంగా ఉంది. మరి ఇంజనీర్ కావాలంటే బాగా చదువుకోవాలి కదా! దానికి ఎంతో డబ్బు కావాలి! ఏం చేస్తాం? నా తల్లిదండ్రులకు కూడా నన్ను విడిచివెళ్లిపోయారు అంటూ నిట్టూర్పుతో ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారి ఫోటోని చూస్తూ కన్నీళ్ళు పెట్టుకునేవాడు. అందుకే అమ్మానాన్న ఫోటోలతోపాటు ఆ మహానీయుడి ఫోటోకు కూడా రోజూ నమస్కరించి తన దినచర్యలు ప్రారంభించసాగాడు చక్రవర్తి.
నాకు ఆరు గజాల భూమి కావాలి అని రియల్ ఎస్టేట్ వ్యాపారిని అడిగాడు చక్రవర్తి. ‘‘ఆరు గజాలు భూమి కావాలంటే స్మశానంలో మాత్రమే దొరుకుతుంది’’ అని కోపంతో ఊగిపోయాడు రియల్టర్ రాజబాబు
మీకు కావలిస్తే మార్కెట్ రేటు కంటే డబుల్ ఇస్తాను. నాకు ఆరు గజాల ప్లాటు కావాలని అతనితో గొడవ పెట్టుకున్నాడు. నేనే కాదయ్యా ఈ దేశంలో ఎక్కడికిపోయినా ఆరు గజాల ఇంటి స్థలాన్ని ఏ ఒక్కరూ నీకు అమ్మరు గాక అమ్మరు! అని సూటిగా చెప్పేశాడు రియల్టర్ రాజబాబు.
దాంతో చక్రవర్తి కోర్టును ఆశ్రయించాడు. వ్యాపారం చేసేవాళ్ళు కొనుగోలుదార్లకి కావలసినంత స్థలం అమ్మాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అయినా ఆరుగజాల స్థలంలో నువ్వు ఇల్లు ఎలా కడతావని జడ్జిగారు చక్రవర్తిని ప్రశ్నించాడు.
సార్! మిలార్డ్! నేను కొనుకున్న ఆరు గజాల స్థలంలో మూడు అంతస్తులు కడతాను. మూడవ అంతస్తులో నా బెడ్‌రూమ్‌తోపాటు వంటగది ఉంటుంది. రెండవ అంతస్తులో వాష్‌రూమ్ ఉంటుంది. ఇక మొదటి అంతస్తులో నేను చచ్చిపోతే నా సమాధి ఉంటుంది. నాకు అప్పుడు స్మశానాల సమస్య కూడా ఉండదని చెప్పాడు. ఇక లాయర్‌కు ఫీజు ఇవ్వలేకే తన కేసును తానే వాదించుకుంటున్నాననీ, అలాగే కట్టబోయే ఇంటి ప్లాన్ కూడా తానే వేసుకున్నాననీ, ఆయనా తాపీ మేస్త్రి చేతనే ఇల్లు కట్టిస్తానని కోర్టుకు సవినయంగా తెలియజేశాడు గరీబ్ చక్రవర్తి.
చక్రవర్తి లాజికల్ రీజనింగ్‌ని మెచ్చుకొని అతన్ని అభినందించాడు జడ్జ్. అయితే నీ ఇంట్లోనే సమాధి కట్టటం చట్టరీత్యా నేరం అని చెప్పి మొదటి అంతస్తులోనే కిచెన్ కమ్ డైనింగ్ రూముగా కట్టుకో! అని మొట్టికాయలు వేసింది న్యాయస్థానం.
సార్! ఇప్పుడు నేను అమీర్ చక్రవర్తిెనైపోయాను సార్! అని ఆనందంతో కేరింతలు కొడుతూ జడ్జ్గారితో సహా కోర్టులోని వారందరికీ దండాలు పెట్టాడు చక్రవర్తి.
* * *
యాహూ! యురేఖా! యాహూ! నేను సాధించాను. నేను కనుగొన్నాను. ప్రపంచంలో అందరికన్నా నేనే గొప్ప సైంటిస్టుని అంటూ ప్రయోగశాలలో బ్రహ్మానందంతో పరుగులు తీస్తుండగా అప్పుడే లోపలికి వస్తున్న జగదీష్‌ని ఢీ కొట్టాడు. దాంతో ఆయన కాస్తా బోర్లా పడిపోయాడు.
ఓరి నీ తస్సాదియ్యా! ఇదంతా నీ ఆనందమా! ఇంతకీ ఏం సాధించావో త్వరగా చెప్పి ఆ ఫార్ములా పేపర్లు నాకిచ్చేయ్ అంటూ ఉబ్బి తబ్బిబ్బైపోయాడు జగదీష్.
ఇదిగో ఇటు చూడండి ఇనది యస్.యమ్.టి. అనే మందు. అంటే ‘‘స్మార్ట్ మెడిసన్ టానిక్’’ దీని ఖరీదు లక్ష రూపాయలు. ఈ టానిక్ ఒక బాటిల్ మందును వాడిన వారికి పూర్తిగా మతిమరుపు వ్యాధి వచ్చేస్తుంది. అంతేకాదు ఈ మందు మీరు చెప్పినట్లు స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది. మీ దగ్గర అప్పులు తీసుకున్నవారి మీద ఇది ప్రయోగించవచ్చును. వారి ఆస్తులు,డబ్బులు మీ పేరు మీద వ్రాయించుకోవచ్చును అని చెప్పి ఆనందంతో గంతులు వేశాడు సైంటిస్ట్ ప్రజాపతి.
వెంటనే సైంటిస్ట్ చేతుల్లోంచి ఫార్ములా పేపర్లు లాగేసుకుని సైంటిస్ట్ ప్రజాపతిని క్రూరంగా కాల్చి చంపేశాడు కలియుగ రాక్షసుడు జగదీష్!
రక్తపు ధారలతో తడిసిపోయిన ప్రజాప్రతిని సైంటిస్ట్ జగదీశ్ అనుచరులు అతి క్రూరంగా అక్కడి నుండీ ఈడ్చుకుంటూపోయి ట్రక్కులో పడేశారు. పోతూ పోతూ గోడౌన్ నుంచి మూడు గోనె సంచుల డబ్బుల మూటలు కూడా గుట్టుచప్పుడు కాకుండా మోసుకొచ్చి ప్రజాపతి డెడ్‌బాడీ కనిపించకుండా గోనెసంచులతో కప్పేశారు. ఎందుకంటే తక్కువ జీతం ఇచ్చి అతి కిరాతకమైన వెట్టిచాకిరీ పనులు చేయించుకున్న యజమాని జగదీశ్‌పై కక్షతో. ‘‘ఒరేయ్! మన బాస్గాడికీ కరెక్ట్‌గా పవర్ఫుల్ డోస్ ఇచ్చాము కదూ! అని చీర్స్ కొట్టి విస్కీలో మునిగిపోయారు. అయినా మన బాస్‌కి కావలసిన ఫార్ములా పేపర్లు, రానే వచ్చాయిగా! వీడిని ఇంకా కాల్చటం, పూడ్చటం ఎందుకు? డబ్బులు దండగ! అని అర్ధరాత్రి ఊరి బయటకు తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో పడేసిపోయారు.
అప్పటివరకూ ఊపిరి బిగపట్టి మరణించినట్లు నటిస్తున్న ప్రజాపతికి వెంటనే ప్రాణం వచ్చినట్లయింది. వెర్రిమాలోకాలు నేను చచ్చిపోయాను అనుకున్నారు. అసలు నేను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నట్లు ఈ కుర్ర నాగన్నలకు తెలియదుగా! అని తనలో తానే నవ్వుకుంటూ పైకి లేస్తుండగా, సరిగ్గా అప్పుడే కూతురు సుప్రజ వచ్చి తండ్రిని కారులో ఎక్కించుకుని సురక్షితంగా ఇంటికి తీసుకువెళ్ళింది.
నాన్నా! మరి మీ గుండెల్లోంచి అలా రక్తం ధారగా ఎలా వచ్చింది? అని ఎంతో ఆసక్తితో అడిగింది కూతురు సుప్రజ. చూడు సుప్రజ నేను సైంటిస్ట్‌ని, పైగా మీ నాన్నని, తెలివైనవాడిని కూడా. రక్తం ధారగా వచ్చేందుకు ఒక కెమికల్ ట్యూబ్‌ని కన్పించకుండా ఏర్పాటు చేసుకున్నాను. నాకు తెలుసు ఏ క్షణంలోనైనా జగదీష్ నన్ను చంపేస్తాడని! అందుకే తెలివిగా ఈ ప్లాన్ చేశాను! అని అంటుండగా! అందుకే మీరు ఇంకొక జిలేబి తినాలి అంటూ వడ్డించింది భార్య ప్రసన్నాదేవి. ఒకటికాదోయ్ రెండు జిలేబీలు వడ్డించవోయ్ ప్రసన్నా అంటూ ప్రేమతో ఆ రోజు లంచ్‌ని హాయిగా ఆనందంగా ముగించారందరు.
ఐటి కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సుప్రజ సమాజసేవ చేస్తు ఒకరోజు గరీబ్ బస్తీలో చక్రవర్తికి బట్టలు, దుప్పట్లోతోపాటు ఆహార పదార్థాలు అందజేసింది. ఆ రోజు అతనిని గమనించింది, అతనిలో ఏదో ప్రత్యేకత ఉందని గ్రహించింది. దానికి ముఖ్యమైన కారణం చక్రవర్తి సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటాన్ని చూస్తూ కూర్చోవటమే.
అప్పటి నుండీ చక్రవర్తిని తరచు కలుస్తూ ఉండేది సుప్రజ. అతని ఆలోచనలను, ఆశయాలను అక్షర రూపంలోనికి తీసుకు వచ్చింది. ఎందుకో మరి సుప్రజతో పరిచయం వలన చక్రవర్తి జీవనంలో కొంగ్రొత్త చిగురుటాశలు అంకురించాయి. వారిద్దరి ప్రేమాలతగా వెనకేసుకుపోతోంది.
చక్కూ! కంగ్రాట్స్ లేషన్స్! వచ్చేవారం అమ్మా నాన్న నువ్వు నేనూ అందరం కలిసి ఢల్లీి వెళుతున్నం అంటూ అమితానందంతో చక్రవర్తిని హత్తుకుపోయింది సుప్రజ.
అసలు ఇదంతా ఏమిటీ అంటూ ఉక్కిరి బిక్కిరైపోయాడు చక్రవర్తి. పొల్యూషన్ నివారణకు నీవిచ్చిన పరిష్కార సూచనకు నీకు ప్రధానమంత్రిగారు అవార్డు ఇవ్వబోతున్నారు. అంతేకాదు, నీతోపాటు నాక్కూడా అవార్డు వస్తోంది తెలుసా! అని సుప్రజ చెప్పేసరికి చక్రవర్తి అమితానందభాష్పాలతో ఉక్కిరిబిక్కిరయ్యాడు.
ఒక్కసారిగా అమ్మా నాన్ననూ, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారిని స్మరించుకున్నాడు చక్రవర్తి.
అపరిశుభ్రతో విజృంభించే అంటువ్యాధులు రాకుండా ‘‘స్మార్ట్మెడిసిన్ టానిక్’’ కనిపెట్టిన సైంటిస్ట్ ప్రజాపతిని అవార్డుతోపాటు పదిలక్షల నగదు పురస్కారంలో సన్మానించారు ప్రధానమంత్రి.
పెట్రోల్, డిజిల్ మోటార్ వాహనాలు వాడకంతో వచ్చే కార్బన్మోనాక్సైడను బయటకు రాకుండా ప్రతీ వాహనానికి ఒక సిలెండర్ ఏర్పాటు చేసుకోవచ్చుననే అద్భుతమైన పరిశోధనకు చక్రవర్తిని అవార్డుతోపాటు, పదిలక్షల రూపాయలు నగదు పురస్కారంతో సన్మానించారు ప్రధానమంత్రి.
దోమలను, అంటువ్యాధులను తక్షణమే నివారించటానికి చెత్త, చెదారములను ‘‘ప్రతిరోజు శుభ్రపరచండి, చెత్తను తక్షణమే తరలించండి’’ అనే స్పాట్ పేమెంట్ ప్లాన్ అచరణయోగ్యంగా ఉందని సుప్రజను పురస్కారంతో సన్మానించారు ఆరోగ్యశాఖామంత్రి.
మానవ కళ్యాణానికి కోసం మరియు అభివృద్ధికి మాత్రమే పరిశోధనలు, ఆవిష్కరణలు చేయాలని, అంతేకాని వినాశకర ప్రయోగాలను చేసేవారిని ప్రభుత్వం తప్పకుండా శిక్షిస్తుంది అని ప్రధాని హితవు పలికారు.
జగదీశ్ చేపట్టిన మానవ వినాశకర, దురాలోచన ప్రయోగాలకు రెండు సంవత్సరాలు జైలుశిక్ష పడిరది.
అసలు పెళ్ళే చేసుకోనన్న చక్రవర్తి సుప్రజ ప్రేమలో పడ్డాడు, అలాగే ఆమె వద్ద కడుపునిండా చదువుకున్నాడు.
తన జీవితంలో ఇల్లే కట్టలేమన్న చక్రవర్తి ఇల్లు కూడా కట్టుకున్నాడు, ఒక ఇంటివాడయ్యాడు. చక్రవర్తి సుప్రజల కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది. ఇది చాలా అరుదైన, ఆదర్శమైన కళ్యామని ప్రశంసించారు ప్రముఖులు మరియు పెళ్ళివారు.
ఇది ‘‘స్మార్ట్మెడిసన్ టానిక్’’ దీని ఖరీదు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే! ఇది జనరల్ టానిక్. ఆరోగ్యం కోసం అందరూ త్రాగవచ్చు అని చెప్పి టానికి బాటిల్‌ని అల్లుడు చక్రవర్తికి కానుకగా అందించారు ప్రసన్నదేవి, ప్రజాపతి దంపతులు.
పెళ్ళివారే సాక్షాత్ కళ్యాణదేవతలై సుమాక్షతలతో ఆశీర్వదించారు.
‘‘ప్రజాహితమును కోరినవాడే ప్రజాపతి.’’
Konduri KashiVishveshwara Rao
Konduri KashiVishveshwara Rao
పేరు : కొండూరి కాశీవిశ్వేశ్వరరావు వృత్తి : (అ) ఆయుధ కర్మగారం మెదక్ (రక్షణశాఖ)లో ఉద్యోగం 1988 ` 2008 వరకు చార్జిమెన్ / చీు గా పదవీ విరమణ (ఆ) సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, మినిష్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్, కేంద్ర ప్రభుత్వశాఖ, రామాంతపూర్, హైదరాబాద్‌నందు 2016 ` 2020 వరకు టెంపరరీ ూణష ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాను. ప్రవృత్తి : కవిగా, రచయితగా సాహిత్యం ద్వారా సమాజాన్ని చైతన్యం పర్చటం. 3. రచయితగా, కవిగా, రచనా వ్యాసంగంలోకి ప్రవేశించిన సంవత్సరం తొలిరచన : 1988 ‘‘నిండు సున్న’’ కవిత ‘‘విశ్వరచన’’ మాసపత్రిక ఏప్రియల్, 4. సాహిత్యస్ఫూర్తి : ఆచార్య ఆత్రేయ, వేటూరి సుందర రామ్మూర్తి, డా॥ దాశరథి కృష్ణమాచార్య, డా॥ సి.నారాయణరెడ్డి డా॥ పోతుకూచి సాంబశివరావు, శ్రీ ఆర్.కె.నారాయణ్ 5. ఇప్పటివరకూ వ్రాసిన కవితలు, : 300 కథలు : 50 గేయాలు : 100 వ్యాసాలు : 30
శ్రీ త్యాగరాజ గానసభలో రసజ్ఞులతో కిటకిటలాడుతున్న సంగీత కచేరీలో రామాచార్యులుగారి సంగీత గాత్రం బహు రసవత్తరంగా సాగిపోతోంది. కానీ ఇంతలో కొంతమంది పొగరుబోతు యువతరం సరాసరి సభా వేదిక పైకి వచ్చి రామాచార్యులుగారు పాడుతున్న త్యాగరాజ కృతిని అవహేళన చేశారు. అంతటితో ఊరుకోక ఇదే కీర్తనను మోడరన్ శైలియైన ఫ్యూజన్లో పాడమని అహంకార ధోరణిలో ఆదేశించారు.
సభావేదికపైకి వచ్చిన పోకిరీ మూకను అదుపు చేయటానికి సెక్యూరిటీ గార్డులు కూడా వేదికపైకి వచ్చి వారిని అదుపు చేయటానికి లాఠీచార్జ్ చేశారు. ప్రక్క వాయిద్యాలైన ఫిడేలు, మృదంగం మరియు కంజీరా, తాళములు ఒక్కసారిగా ఆగిపోయాయి. రామాచార్యులుగారు ఈ అనూహ్యమైన సంఘటన చూచి తీవ్ర ఆవేదనకు లోనై కోపంతో ఆయన ముఖమంతా కందగడ్డలా తయారయ్యింది.
అయినా పొగరుబోతు యువకులు మాత్రం ‘‘రామాచార్యులుగారు మీరు మోడరన్ స్టైల్లో, ఫ్యూజన్లో ఇదే కీర్తను పాడి తీరాలి’’. అప్పుడే మీరు నిజమైన సంగీత సామ్రాట్ అంటూ రెచ్చగొట్టే ధోరణిలో నినాదాలిచ్చారు.

రామాచార్యులుగారు తన రాగి పాత్రలోని మంచినీళ్ళను గడగడా త్రాగి అదే త్యాగరాజ కీర్తనను మోడరన్ స్టైల్లో, ఫ్యూజన్ శైలిలో అద్భుతంగా ఆలాపించారు. ఆయనకు మధుర గానానికి మంత్ర ముగ్ధులైన ఆబాలగోపాలం పరవశించిపోయారు. తప్పట్లతో రామాచార్యులుగారిని అభినందించారు. తదనంతరం ప్రేక్షకులంతా నిలబడి ఆయనకు ‘‘స్టాండిరగ్ ఒవేషన్’’ను గౌరవ సూచకంగా తెలియజేశారు.
కళాకారులందరికీ సన్మాన కార్యక్రమం అయిన తరువాత ఆయన ప్రసంగిస్తూ ‘‘కళాకారులకు ముఖ్యంగా గాయకులకు శాస్త్రీయ సంగీతమైనా లేక ఆధునిక డిస్కో, ఫ్యూజన్ సంగీతమైనా ఒక్కటే. కానీ మాయొక్క బృందానికి ముందుగా మీరు తెలియజేస్తే మేము కచేరీకి కావలసినంత రిహార్సల్స్ చేసుకుంటాము. అలాగని సంగీత కళాకారులంతా ఇలాంటి ప్రకియలు, జుగల్ బందీలు అప్పటికప్పుడే పాడలేరు. కానీ నాకూ, నా బృందానికీ ఇలాంటి సమస్యలు, అభ్యర్థనలు ఎదురవుతాయన్న ధోరణిలో మేము ఫ్యూజన్ సంగీతాన్నికూడా సాధనచేయటం, తద్వారా మీ అభినందనలు పొందటం మా అదృష్టంగా భావిస్తున్నాను.
రామాచార్యులుగారు ప్రసంగిస్తూ… ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలోని పాల్గొన్న యువతరానికి ప్రత్యేక కృతజ్ఞతలు అని చెప్పటంతో పోకిరీ మూక యొక్క అహం దెబ్బతింది. వెంటనే ఆ ప్రక్కగా ఉన్న పూలకుండీలను తీసుకొని ఆయనపైన విసిరేసి, వేగంగా అక్కడ నుండీ పారిపోయారు.
ఆయన తలకు తీవ్రగాయం అవటంతో హుటాహుటిన ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అక్కడ ఆయనకు రెండు రోజులు వైద్యం చేశారు డాక్టర్లు.
* * *
క్లాస్ ఫస్ట్ మోక్ష. అంతేకాకుండా మిగతా ఐచ్ఛిక విషయాలలోను, పోటీలలోను కూడా ఎన్నో ఉత్తమ బహుమతులను అందుకొంది రామాచార్యులుగారి పెద్దమ్మాయి మోక్ష. విరామ సమయంలో తోటి విద్యార్థులందరూ కాఫిటేరియాకెళ్లి హాయిగా బాతాఖానీ కొడుతున్నారు. కానీ మోక్ష మటుకూ తరగతి గదిలోనే కూర్చుని పాఠ్యాంశాలు చదువుతూ, వ్రాసుకుంటోంది. అదే అదనుగా తీసుకున్న అజయ్ కుమార్ మోక్ష దగ్గరకు ఏదో పుస్తకం కావాలనే ఒంకతో రావటం మొదలుపెట్టాడు.
అజయ్ కుమార్ నిజంగానే చదువుతాడేమోనని నమ్మి తన పుస్తకాలను అతనికిచ్చింది. అదే అదనుగా చేసుకొని ఆ పుస్తకాలలో ప్రేమ లేఖలను వ్రాసి మోక్ష కిచ్చాడు. ‘‘మోక్ష నా మాట విను, ఒక్కసారి నాతో అలా పార్క్ కి రా హాయిగా మనసు విప్పి మాట్లాడుకుందాం’’ అంటూ ఏవేవో మాయ మాటలు చెప్పేవాడు.
ఒక రోజు మోక్ష అజయ్ కుమార్ మాట్లాడుతుండగా ప్రిన్స్‌పాల్ తరగతి గదిలోకి వచ్చాడు. ఏం చేస్తున్నారిక్కడ మీరిద్దరు? అంటూ కోపంతో ప్రశ్నించాడు. సార్! మోక్ష రమ్మంటేనే నేను వచ్చాను. ఇవిగో మోక్ష నా కిచ్చిన పుస్తకాలు చూడండి. అంతేకాదు సార్! నన్ను ప్రేమిస్తున్నట్లు ప్రేమ లేఖ కూడా రాసింది సార్! అని ఆమె పుస్తకంలో నుండీ ఒక ఉత్తరాన్ని ప్రిన్స్పాల్కి ఇచ్చాడు మాయామాటల పోకిరీ అజయ్‌కుమార్. ఈ సంఘటన జరుగుతున్న సమయానికి తోటి విద్యార్థులంతా తిరిగి తరగతి గదికి వచ్చి మోక్షని, అజయ్కుమార్లను దోషులుగా చూశారు.
కాలేజీ గోడలపై మోక్ష, అజయ్కుమార్లపై పిచ్చిరాతలు రాశారు ఆకతాయి విద్యార్థులు. మోక్ష తండ్రి రామాచార్యులు వచ్చి ప్రిన్స్‌పాల్‌తో మాట్లాడారు. అసలు మా అమ్మాయి ఎవరితోనూ మాట్లాడదండీ. తన చదువేదో తను చదువుకుంటుంది. మా అమ్మయాని మాత్రం నా మీద దయఉంచి డిబార్ చేయకండి అని ప్రాధేయపడటంతో ప్రిన్స్‌పాల్ శాంతించాడు.
‘‘రామాచార్యులుగారు మీ అమ్మాయి చాలా మంచిదని నాకు తెలుసు, ఈ కాలంలో కూడా ఇలా మెత్తగా ఉంటే మన నెత్తిమీద ఎక్కి నాట్యం చేస్తారందరూ’’ అని ఆయనకి ధైర్యాన్ని చెప్పటంతో సంతోషంతో ఇంటికి చేరుకున్నాడు ఆయన. అయినా ఆ రోజు సభలో మీరు ఫ్యూజన్ సంగీతం పాడకుండా ఉంటే బాగుండేది. ఒకవేళ పాడేరే అనుకోండి! అనవసర ప్రసంగం ఇవ్వకుండా ఊరుకోవచ్చుగా! అంటూ భార్య శ్యామలాదేవి దీర్ఘాలు, అభాండరాగాలు తీసింది. ‘‘దీన్నే మూలిగే నక్కపైన తాటిపండు పడటం అంటే’’ అని కోపంతో చిరాకు పడ్డాడు రామాచార్యులు.
ఆ రోజు ఇంట్లో ఎవరూ భోజనాలు చేయలేదు. దాదాపు వారం రోజుల వరకూ మోక్ష కాలేజీకి వెళ్ళలేదు. అక్కా నీవు ఇలా డిగ్రీ స్థాయికి వచ్చి కూడా గట్టి పడకపోతే ఈ సమాజంలో నీవు బ్రతకటం చాలా కష్టం. అందుకే నాలాగా మాటకు మాట రఫ్ గా జవాబు చెప్పటం నేర్చుకో. ఇలాంటి పొగరుబోతు మూకలున్నారనే కదా నేను కరాటే కూడా నేర్చుకుంటున్నానని అక్కను ఓదార్చింది చెల్లాయ్ దీక్ష.
మోక్ష డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉంది. దీక్ష సెకండ్ ఇయర్ చదువుతోంది. నాన్నా! నాకు డిగ్రీ చదవటం ఇష్టం లేదు. నీకు లాగానే మన శాస్త్రీయ సంగీతం, నాట్యం నేర్చుకుంటానని చిన్నమ్మాయి దీక్ష అడగడంతో సంగీతంతోపాటు మన కూచిపూడి నాట్యం కూడా నేర్పిస్తూ చిన్న కుమార్తెను ప్రోత్సహిస్తున్నాడు పెద్ద మనసున్న రామాచార్యులు.
కాలక్రమేణా పరిస్థితులు చక్కబడుతున్నాయని తలచిన మోక్ష తిరిగి కాలేజీ కెళ్ళటం ప్రారంభించింది. కానీ మోక్ష మనసులో ఏదో భయంగానే ఉంది. అంతేకాకుండా ఏదో తప్పుచేసిన దానిలా బాధపడుతోంది. దారిలో అమ్మవారి గుడికెళ్ళదామని అటుగా నడుస్తుండగా, అతివేగంగా వచ్చిన ఇన్నోవా కారులో పొగరుబోతు మూకతో రింగ్ లీడర్ అజయ్ కుమార్ వచ్చి మోక్షని కిడ్నాప్ చేసి వేగంగా తీసుకుపోవటం మెరుపు మెరిసినట్లు క్షణాల్లో జరిగిపోయింది. ఊరి పొలిమేర్లకు ఆమెను తీసుకుపోయారు. పొగరుబోతు మూకలందరూ మోక్షని పైశాచికంగా పాడుచేసి, తమ మృగ కామ వాంఛను తీర్చుకున్నారు. ఆ తరువాత కాళ్లు చేతులూ కట్టేసి నదిలోకి విసిరేశారు. కేకలు వేయటానికి నోరు కట్టేసి ఉంది. నీళ్ళు త్రాగి త్రాగి ఊపిరాడక కట్లు విడిపించుకోవటానికి విశ్వం ప్రయత్నం చేసి విఫలమైపోయింది పాపం. మోక్షకి మోక్షం వచ్చేసింది.
* * *
డిగ్రీలు పూర్తి చేసిన తరువాత తన ఇద్దరు కుమార్తెలకూ వివాహాలు చేద్దాం అనుకున్నారు రామాచార్యులు దంపతులు. కానీ విధి ఆడిన భయంకర నాటకంతో ఇలా దారి తప్పిపోయింది జీవితం అని ప్రతిక్షణం కుమిలిపోతున్నారు.
పొగరుబోతు అజయ్ కుమార్ స్నేహితులతో కలసి మోక్షను బలాత్కారం చేసి, హత్యచేసినా న్యాయస్థానాలకు వాటికి సంబంధించిన సరైన ఆధారాలు దొరకలేదు. దొరకకుండా చేశాడు అజయ్‌కుమార్ తండ్రి. ధన మదంతో చట్టాన్ని మాయచేసి కేసును కొట్టేయించిన కలియుగ రాక్షసుడు.
చిన్నమ్మాయి దీక్ష తండ్రివలే తను కూడా సంగీత కచేరీలు ఇస్తోంది. దీక్ష నాట్యంలో ప్రవీణతను సాధించి కూచిపూడి మరియు ఇతర రంగస్థల ప్రదర్శనలు ఇస్తోంది. అందుకే దీక్షకు సినిమా అవకాశాలు కూడా రావటం మొదలయ్యాయి.
ఒకరోజు నాటకోత్సవంలో ‘‘మహిషాసుర మర్థిని’’ నాటకం వేస్తున్నారు. అందులో మహిషాసుర మర్థినిగా దీక్ష నటిస్తోంది. కానీ ఆ రోజు నిత్యం తమ బృందంతో వచ్చే మహిషాసుర పాత్ర వేసే కళాకారుడు ఆ రోజు రాలేదు. గ్రీన్‌రూమ్‌లో మేకప్ వేసుకుంటోంది దీక్ష. ఇంకొక కొత్త కళాకారుణ్ణి తీసుకొచ్చి వేషం వేయించి నాటకానికి సిద్ధం చేయించాడు మేనేజర్ మాణిక్యాలరావు.
మహిషాసురమర్ధిని నాటకం మొదలయ్యింది. నాటకంలోని ప్రతి సన్నివేశం రక్తి కట్టడంతో ఆహుతులు కరతాళ ధ్వనులు చేస్తూ ఈలలు, అరుపులు, కేకల మధ్య నాటకం మంచి రసవత్తరంగా సాగుతోంది.
ఓరీ మహిషాసురా! భక్తులనూ, బలహీనులను దేవతలను సైతం అరాచకంగా హింసిస్తున్నావు కదరా! నీకు ఈనాటితో ఆయువు మూడిరది. నీ అకృత్యాలన్నీ అంతమయ్యే కాలం దగ్గరపడిరది! అని భయంకరంగా విజయవికట్టాహాసం చేసింది విజయదుర్గ.
అయిగిరినందిని విశ్వవినోదిని…. అనే స్తోత్రాన్ని ఆలపిస్తూ మహిషాసురుని మీదకు ఒక్కొక్క అస్త్రాన్నీ ప్రయోగించింది. విజయదుర్గ, కాళీమాత మరియూ అపరచండీ దీక్ష. ఆమె ప్రయోగించే అస్త్రాల నుండీ తనను తాను కాపాడుకుంటున్నాడు మహిషాసురుడు.
ఆ మహిషాసురుని వేషంలో ఉన్న వ్యక్తిని ఎక్కడో చూచినట్లుంది అపరచండి దుర్గjైున విజయ దుర్గ దీక్షకు. అతడే అజయ్‌కుమార్ అని గుర్తించింది. వెంటనే ఆమెకు పూనకం వచ్చి రౌద్ర దుర్గగా మారింది. అతనిని అంతం చేయటానికి ఇదే అదునైన సమయం అని సంకల్పించింది దీక్ష. ఆమె మనసులో అమాయకురాలైన అక్క మోక్ష రూపం కదలాడుతోంది. ఇదే సరైన సమయమని పళ్లు గట్టిగా బిగించి కాళికాదేవిని ప్రార్థించింది. దీక్ష నాటభైరవి రాగాన్ని దిక్కులు పెక్కటిల్లేలాగా ఆలపిస్తూ, అవని కృంగిపోయే లాగా నాట్యం చేస్తోంది.
దీక్ష వెనకాల ఇంకా 8మంది అమ్మవార్లు వేషధారులై ఆయుధాలు ధరించి వున్నారు. అదే సమయంలో భారీ ఎత్తున భూకంపం సంభవించింది. అనుకోకుండా శరవేగంతో అమ్మవారి చేతినుండి త్రిశూలం జారి మహిషాసురుని (అజయ్‌కుమార్ కుక్షిలో దిగబడిరది) రక్తం కక్కుకుంటూ మహిషాసురుడు ఆర్తనాదాలు చేస్తూ మరణించాడు. సైకో శాడిస్టు అజయ్‌కుమార్ అంతరించిపోయాడు. దుష్టసంహారిణి విజయదుర్గ.
భానుడి ప్రతాపం రోజురోజుకీ పెరుగుతూ, ఎండలు చుర్రుమంటున్నాయి. ఎక్కండి! ఎక్కండి! ఎల్లిపోదాం అని కేకలేస్తూ ప్రయాణీకులను బస్సు లోపలికి కూరుతున్నాడు క్లీనర్ కన్నబాబు. ఈ మాటలు నువ్వు గంటసేపటి నుండీ చెపుతున్నావు తెలుసా! అసలు ఎక్కడికెళ్ళారయ్యా మీ డ్రైవరూ కండక్టరూ? అని తమ అసహనం ప్రదర్శించారు ప్రయాణీకులు.
బస్సుపైనా, లోపలా కూడా లగేజీతో నిండిపోయింది. వాటిల్లో మూటలు, కోళ్ళ గంపలున్నాయి. ఒక కుర్రాడైతే రెండు మేకల కాళ్ళకు బంధంవేసి, తాడును గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు. బస్సులో సీట్ల కోసం ఆడంగుల తగాదా మొదలైయ్యింది. మగరాయుళ్ళు మటుకూ వేరుశనక్కాయలు తింటూ పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు. తిన్న వేరుశెనగ తొక్కలను బస్సు లోపలే వేస్తున్నారు.
ఎవరయ్యా! దారికడ్డంగా ఇలా చేపల బుట్టలను బస్సులో ఏసింది? మరి మీరు మేకలను, కోళ్ళను ఎక్కించలేదా? బస్సు నీ ఒక్కడిదే కాదు బాబూ మరి మన అందరిదీ! అంటూ చమత్కరించాడు చేపల చిన్నయ్య.
మీ మేకలు చూడవయ్యా, ఒంటేలు, రెండు చేసి ఎలా పాడుచేశాయో అని ఒకడంటే, నీ చేపల బుట్టల్లోంచి నీచువాసన నీళ్ళు ఎలా కారతన్నాయో చూడు! అంటూ వాగ్వాదానికి దిగారు. అయినా బస్సు మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదు.
మొత్తానికి డ్రైవర్ వచ్చి డ్రైవింగ్ సీటులో కూర్చున్నాడు. ప్రయాణీకులందరీని ఒకసారి విమానం పైలట్‌లా చూసి, వెంటనే సిగరెట్ వెలిగించి, సినిమా పాటలు పెట్టాడు. ఇదుగో అందరూ టికెట్ సరిపడా డబ్బులు ఇచ్చి బేగా టికెట్ తీసుకోండి. టికెట్! టికెట్! అంటూ చిటికెలేస్తూ టికెట్లు కొడుతున్నాడు కండక్టర్.
ఇంతలో ఒక ప్యాసింజర్ బీడీ వెలిగించాడు. అసలే బస్సులో ఒకటే ఉక్కపోతగా ఉంది. దానికి తోడు ఈ సిగరెట్ల బీడీల పొగతోడైంద అని తిట్టేసరికి గబగబా మూడు దమ్ములులాగి బీడీని పడేశాడు అతను.
అప్పటికే కికిరిసిన బస్సులోకి స్కూలు పిల్లలూ, కూరగాయలవాళ్లు, చిన్నా చితకా వ్యాపారులు ఇంకా ఎక్కుతున్నారు.
అందుకే సత్తిరాజు ముందుగానే బస్సెక్కి హాయిగా పేపర్ చదువుకుంటున్నాడు. సత్తిరాజు ఆ చుట్టుప్రక్కల నాలుగు గ్రామాలకి ఒకే ఒక మెడికల్ స్పెషలిస్ట్, అదే ఆర్.యం.పి. డాక్టర్, వారాని ఒకసారి టౌనుకెళ్ళి ఒక సినిమా చూసి, పేషంట్లకి ఇవ్వవలసిన మందులు, ఇంజక్షన్లు కొని తెచ్చుకుంటాడు.
ఇదుగో డబ్బులు తీసుకో! టౌనుకి ఆరు టిక్కెట్లు ఇవ్వమన్నాడు ఓ ప్యాసింజర్. మరి ఆరుగురినీ చూపించమన్నాడు కండక్టర్. మేము ముగ్గురం మగ మనసులం. ఇంకా ముగ్గురు ఆడ టికెట్లు.ఇప్పుడే బాత్రూమ్కెళ్ళారని చెపుతుండగానే వాళ్ళు ముగ్గురూ పరిగెత్తుకుంటూ వచ్చి బస్సు ఎక్కేశారు.
ఈ గందరగోళంలో, డాక్టర్‌గారూ ఒకసారి పేపరు ఇస్తారా! అని డాక్టర్ సత్తిరాజు చేతుల్లో నుండీ విసురుగా దినపత్రికను లాగేసుకున్నాడు వెనకసీటు స్కూలు మాస్టారు.
కండక్టర్ రైట్! రైట్! అని చెప్పటంతో బస్సుస్టార్ట్ అయ్యింది. బస్సు కదిలిందిగా! ఇక ఉక్కపోత ఉండదు, హాయిగా గాలేస్తోంది లే! అంటున్నారు ప్రయాణికులు. బస్సు ఒక ఫర్లాంగు దూరం వెళ్ళేలోపే బస్సులోకి నల్లని దట్టమైన పొగ కమ్ము కొచ్చింది. పొగతోపాటు కిరసనాయిల్ వాసనతో ప్రయాణీకులు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఇంజన్ని రైజ్ చేశాడు డ్రైవర్. అంతే! బస్సు ఆగిపోయింది.
తుమ్ముతున్నవాళ్ళు కొందరైతే, మరికొందరు వాంతులు కూడా బస్సులోనే చేసుకున్నారు. ఇదేం బస్సురా నాయనా! టాపునిండా చిల్లులే! ఇక కింద నుండి రోడ్డు కన్పిస్తోంది. ఇంజను సౌండూలో ఒకరి మాటలు ఇంకొకరికి వినిపించటంలేదు. కళ్లు మండటంతో ప్రయాణీకులు బస్సు దిగిపోతున్నారు.
డ్రైవరూ, క్లీనరూ కలసి ఏదో రిపేరింగు చేస్తున్నారు. స్టార్ట్ అవుతోంది, మళ్ళీ ఆగిపోతోంది. కానీ డాక్టర్ సత్తిరాజు, స్కూలు మాష్టర్ మటుకూ బస్సులోనే కూర్చుండిపోయారు. ఒకవేళ తాము కిందకు దిగితే మళ్ళీ సీటు దొరకదేమోనని.
డాక్టర్‌గారూ! ఈ పేపర్లో రాసిన దినఫలాలు నిజంగా జరుగుతాయంటారా? అని అదోలా అడిగాడు స్కూలు మాష్టారు. చూడండి మాష్టారు అది మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకీ దినఫలంలో మీకు ఏం రాసుందేమిటి? అని ఉత్కంఠగా అడిగాడు డాక్టర్ సత్తిరాజు. మీరు వస్తువులు కోల్పోతారు జాగ్రత్త! ప్రయాణాలలో అటంకాలు ఎదురౌతాయి అని రాసుంది. అయినా నా దగ్గరేముండిపోవటానికి? ఈ బ్యాగు ఒక్కటేగా? ఇది నా చేతిలోనే ఉంటుందిగా! అని చెప్పి కిందకి దిగాడు. కళ్లు మండటంతో సత్తిరాజు కూడా బస్సుదిగక తప్పలేదు.
దాదాపు రెండు గంటలు రిపేరింగు చేసినా బస్సు స్టార్ట్ అవలేదు. ప్రయాణీకులు కాస్తా, ఆందోళనకారులుగా మారిపోయారు. అసలు ఇలాంటి డొక్కు ప్రయివేటు బస్సుకి లైసెన్సు ఇచ్చిందెవరు? దీన్ని కాల్చిపారేయాలి అని రెచ్చిపోతున్నారు. దాన్ని మనం కాల్చక్కర్లేదు నాయనా! అదిగో పొగ ఇంకా ఎక్కువగా వస్తోందిగా! అదే కాలిపోతుందిలే! అని అంటూ డాక్టర్ సత్తిరాజు ఇంటికి తిరుగు ముఖం పెట్టాడు. అలాగే తిట్టుకుంటూ కండక్టర్ దగ్గర టికెట్ డబ్బులు తిరిగి తీసుకొని వెళ్ళిపోతున్నారు ప్యాసింజర్లు.
స్కూలు పిల్లలకి మాత్రం బస్సు ఇలా పాడైపోవటం ఆనందంగానే ఉంది. ఆడుతూ పాడుతూ ఇంటికెళ్ళిపోయారు. మాష్టారు స్కూలుకు ఆలస్యంగా చేరుకున్నాడు. మొఖానికి పట్టిన చెమట తుడుచుకుందామని తన చిన్న టర్కీటవల్‌ని బ్యాగ్‌లోంచి తీయబోయాడు. ‘‘అరే! ఆ టవల్‌ను బస్సీటుమీద వేసుకొని కూర్చున్నాను.’’ అది కాస్తా బస్సులోనే మర్చిపోయాను. అయితే పేపర్లో రాసిన దినఫలం రైట్! రైట్ అనుకున్నాడు.
‘‘కండక్టర్ రైట్! రైట్! అన్నా బస్సు మాత్రం అక్కడే ఉంది.’’
అన్నపూర్ణ హోటల్ యజమాని విజయభాస్కర్‌కు ఇద్దరు కొడుకులు. పెద్దబ్బాయి సృజన్ డిగ్రీ చదువుతూ కూడా తండ్రికి చేదోడువాదోడుగా హోటల్ పనులు చేస్తున్నాడు. కానీ చిన్నబ్బాయి సుధీర్ మాత్రం అలా కాదు. తన స్వంత హోటల్లో పనిచేయటానికి కూడా నామోషీగా ఫీల్ అవుతాడు. ఎప్పుడు చూచినా టిప్‌టాప్‌గా టక్ చేసుకొని, టై కట్టుకొని మరీ స్నేహితులతో అల్లరిచిల్లరగా తిరగటమే అతని పని.
ఒకప్పుడు చిన్న షెడ్డులో ప్రారంభమైన కాఫీ హోటల్, అంచలంచలుగా వృద్ధి చెందుతూ ఇప్పుడూ పెద్ద హోటలై పోయింది. ఒరేయ్ సుధీర్ మన స్వంత పనులు చేసుకోవటానికి సిగ్గు పడకూడదురా! వీలు కుదిరినపుడు నువ్వు కూడా అన్నయ్యలాగా ఏదో ఒక పనిచేయరా! ఎందుకంటే మన జీవనాధారం ఈ హోటలే కాబట్టి. దీనివల్లే కదా మీరిద్దరూ డిగ్రీలవరకూ చదువుతూ వచ్చారు అని అమ్మ అన్నపూర్ణ అంటుంటే, వద్దమ్మా! ‘‘తమ్ముడికి పనిచెప్పకండి, వాడిని బాగా చదువుకోనివ్వండి’’ అంటూ సృజన్ తమ్ముణ్ణి పెద్దరికంగా సమర్థించాడు.
దాంతో సుధీర్ ఆగడాలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఒకవేళ ఎప్పుడైనా క్యాష్‌కౌంటర్‌లో కూర్చుంటే, కొంత డబ్బు కొట్టేసేవాడు. అలాగే స్నేహితులందరికీ టిఫిన్లు, కాఫీలు ఫ్రీగా ఇచ్చి, ఏదో పెద్ద ఘనకార్యం చేసిన వాడిలా కాలర్ ఎగరేసి మరీ ఫోజులు కొట్టేవాడు.
అన్నపూర్ణ హోటల్ రుచికరమైన టిఫిన్లకూ, అభిరుచిగల భోజూజనానికి మారుపేరుగా మారింది. అందుకే హోటల్ నిరంతరం జనంతో కిటకిటలాడుతోంది. హోటల్ నిర్వాహణలో భార్య అన్నపూర్ణ పాత్ర, నిరంతర శ్రమ ఎంతో ఉంది. అదంతా తన శ్రీమతి సమర్థవంతమైన ప్లానింగ్ మహిమేనని విజయభాస్కర్ విజయగర్వంగా అందరికీ చెపూతు ఉంటాడు.
కొడుకులిద్దరికీ ఘనంగా వివాహాలు జరిగాయి. ఇద్దరు కోడళ్ళు నలుగురు పిల్లలతో ఇల్లు కళకళలాడిరది. తల్లిదండ్రులు ఒకరి తరువాత ఒకరు కాలగమనంలో కలసిపోయారు. నాన్న చెప్పిన అనుభవసారాన్ని నెమరువేసుకుంటూ క్రమశిక్షణతో హోటల్‌ను నడుపుతున్నాడు సృజన్. కానీ తల్లిదండ్రుల కోసం గుండెనిండా బెంగ పెట్టుకున్నాడు.
ఇప్పుడు తమ్ముడి పరిస్థితి అదుపు ఆజ్ఞ లేకుండా పోయింది. నిజం చెప్పాలంటే రౌడీలా తయారయ్యాడు. సృజన్ చెమటోడ్చి సంపాదించిన డబ్బును దుబారాగా ఖర్చు చేస్తున్నాడు. ఇక ఇలా ఊరుకుంటే లాభం లేదని, ఒకటికి రెండుసార్లు సున్నితంగానే తమ్ముణ్ణి మందలించాడు. దాంతో ఇంకా రెచ్చిపోయి, అన్నయ్యను దుర్భాషలాడాడు.
సరిjైున సమయం దొరికింది కదా అని ఒక కొత్త పన్నాగాన్ని ప్రయోగించాడు సుధీర్. అయినా నాపై నీ పెత్తనం ఏమిటి? నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను. నన్ను కమాండ్ చేయాలని చూడకు. ‘‘నువ్వు పెద్దవాడివే అవ్వచ్చు, కానీ నీ హద్దుల్లో నువ్వుండు’’ అని ఆవేశంగా తిట్టేసరికి సృజన్‌కి కోపం తారాస్థాయికి చేరింది. అదీ కాస్తా కొట్లాటకు దారితీసింది.
అంటే ఏమంటావ్? అని సృజన్ తమ్ముణ్ణి నిలదీశాడు. నీకు దమ్ముంటే ఆస్తిలో నీ వాటాను నాకు పంచేయ్! అని అన్నయ్యను రెచ్చగొట్టాడు సుధీర్. ఇది చాలదు అన్నట్లు తోడికోడళ్ళు ఇద్దరూ రంగంలోకి దిగి, అక్కడ భయంకరమైన దృశ్యాన్ని సృష్టించారు. ఆ సమయంలో నాన్న చెప్పిన అమృతవాక్కులను గుర్తు చేసుకున్నాడు సృజన్. నీకు ఎలాంటి కష్టాలు, సమస్యలు ఎదురైనా సహనాన్ని పాటించు. అప్పుడు నీ యొక్క సహనమే నీ సమస్యలకు పరిష్కారాలను కూడా చూపిస్తుంది ` నాన్న.
నీవు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఇంట్లో గొడవ జరిగిన వారం తరువాత సామరస్య వాతావరణం నెలకొంది. అనేక గందరగోళ ఆలోచనలతో సృజన్‌కు నిద్రలేకుండా పోయింది. ఇప్పుడు తను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావటంలేదు. ఇక చేసేది లేక ఆస్థిని రెండు భాగాలుగా పంచుకున్నారు అన్నదమ్ములు.
ఎవరికివారు సపరేటుగా హోటళ్లు పెట్టుకున్నారు. అమ్మ నాన్నకు సహకరించినట్లే, సహధర్మచారిణి హిమజ కూడా సృజన్‌తో కలసి అన్ని పనులూ ఓపికగా చేస్తోంది.
కానీ సుధీర్‌కు భార్య సునంద సహకారం అంతంత మాత్రంగానే ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరికీ అతి తెలివితేటలు ఎక్కువ. ఆచరణ తక్కువ. చేస్తున్న వంటల్లో శుచి, శుభ్రత పాటించేవాళ్ళు కాదు. దీనివల్ల చేసిన వంటకాలు తొందరగా పాడైపోయేవి. దానికి తోడు కష్టమర్లు ఎక్కువగా తినకుండా ఉండటానికి అన్నంలో సున్నం కలిపేవాళ్ళు. పైకి ఘుమఘుమల వాసనలు బాగా వచ్చేవి. తీరా తిందామనుకునేవారు తినలేకపోయేవారు. సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉన్నా దాహం తీర్చుకోలేని పరిస్థితిలా ఉండేది వారి దుస్థితి.
కూరలు, సాంబారుల్లో గూబగుయ్యిమనిపించే కారం వేసి, పట్టపగలే నక్షత్రాలు కన్పించే బిల్లు చేతికిచ్చేవారు. పాపం గొడ్డుకారం తట్టుకోలేక కష్టమర్లు బెంబేలెత్తి పారిపోయేవారు.
ఇదేంటండీ? మీరు గొడ్డుకారం వంటకాలు వడ్డిస్తే మేము మాత్రం ఎలా తింటామనుకుంటున్నారు? అని జనం నీలదీసి అడిగేసరికి ‘‘మీరు తింటే తినండి లేకపోతే బయటకుపొండి’’ అంటూ సునంద తిట్ల దండకం మొదలుపెట్టింది.
చూడండి! అక్కడ మీ అన్నయ్యగారి హోటల్లో టిఫిన్లతోపాటు భోజనాలు కూడా ఎంతో రుచికరంగా ఉంటున్నాయి. అక్కడ భోజనంలోకి అరటిపండో, మామిడిపండో వడ్డిస్తున్నారు. అవి లేకుంటే ఏదైనా స్వీటుని స్పెషల్‌గా ఇస్తున్నారు. అంతేకాదండీ! ఆ హోటల్లో భోజనంచేసిన తరువాత వక్కపొడి, సోంపు, పాన్లు కూడా ఇస్తున్నారు అని ఒక వ్యక్తి ధైర్యంగా సుధీర్‌ని క్లాస్ తీసుకున్నాడు.
అప్పుడు మళ్ళీ సునంద కళ్ళెర్రజేసి, అతని మీదకు విరుచుకుపడిరది. మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ‘‘మా హోటల్లో నచ్చితే తినండి, లేకపోతే బయటకుపొండి’’, మా హోటల్లో తిన్నవారికి పట్టు చీరలివ్వటం, పేరంటటాలు చేయటం, తాంబూలాలివ్వటం లాంటి చెత్త మర్యాదలు చెయ్యటం మావల్ల కాదు. వంటల్లో కల్తీ వంటనూనెలు వాడటం, నిల్వ ఉంచిన కూరలు, సాంబర్లు వడ్డీంచడం, ఎక్కువగా జరగడంతో జనం ప్రభుత్వానికి కంప్లయింట్ ఇచ్చారు. దాంతో ఫుడ్‌ఇనస్పెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేసి కేసు బుక్ చేశాడు. అలాగే 5వేల రూపాయలు జరిమానా విధించారు. ఇది మొదటిసారి కాబట్టి కేవలం వార్నింగ్ ఇచ్చామని, లేకుంటే జైలుశిక్ష కూడా విధించే అవకాశముందని కోర్టులో మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు.
ఇంత జరిగినా తమ తప్పులను వీరిద్దరు సరిదిద్దుకోలేకపోయారు.
రోజు రోజజుకీ ఆమె కొట్లాటలు మితిమీరిపోయాయి. హోటల్ దివాలా స్థాయికి చేరుకొంది. ఆ కారణంగానే సుధీర్‌కి సహనం, అశాంతి బాగా పెరిగిపోయాయి. అవి తట్టుకోలేకే చిటికీమాటికీ సునందను తిట్టటం, మొదలుపెట్టాడు. ఒకరోజు ఉక్రోషంతో ఆమెను చావబాదాడు.
సునంద అహం దెబ్బతిన్నది. అసలు మీకు బిజినెస్ చేయటం చేతకాక నన్ను కొట్టటం ఏమిటి? అని భర్త సుధీర్‌ని ఆవేశంతో చెంపదెబ్బకొట్టింది. ఇంట్లో జరిగిన ఈ గొడవతో పిల్లలు భయభ్రాంతులకు లోనయ్యారు. ఇంట్లో అందరూ కలసి భోజనం చేసి ఎన్నో రోజులైయ్యింది. పాపం పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారు.
సుధీర్ ఇద్దరమ్మాయిలూ బిక్క ముఖంతో పెదనాన్నింటికి వెళ్ళారు. వీళ్ళిద్దరూ చెప్పిన విషయాలు విని పెద్దమ్మ, పెదనాన్న ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఆ తరువాత కొంత సమయానికి తేరుకొని పిల్లలతో కలసి భోంచేశారు.
పెదనాన్న మీరే ఎలాగైనా మా అమ్మకు, నాన్నకు సహాయం చేయాలి. ప్రస్తుతానికి అమ్మా నాన్నల దగ్గర డబ్బులు అసలే లేనే లేవు అని చెపుతూ బోరున ఏడ్చేశారు ఇద్దరమ్మాయిలూ.
సృజన్ పేరుకు తగ్గట్టు చాలా సున్నితమైన మనసున్న వ్యక్తి. తను చెబితే తమ్ముడూ, మరదలూ వినకపోవచ్చని భార్య హిమజను సుధీర్ ఇంటికి పంపించాడు. మళ్లీ అందరూ కలిసుండటానికి సుధీర్, సునంద ససేమీరా ఒప్పుకోలేదు. అప్పుడు సృజన్ రంగంలోకి దిగి హోటల్ బిజినెస్ నష్టాల్లో మునిగిపోయిన తమ్ముణ్ణి ఓదార్చాడు.
మొత్తానికి అన్నయ్య, వదినల ప్రేమా ఆప్యాయతలకి సుధీర్, సునందలు కరిగిపోయారు. నన్ను క్షమించు అన్నయ్య అని అంటూ, ఇంతకీ నీ హోటల్ బిజినెస్‌కి ఎక్కువగా లాభాలు రావటానికి గల రహస్యాలేమిటి? అని వినయంగా అడిగాడు.
తమ్ముడి పశ్చాత్తాపంతో అడిగిన మాటలకు సృజన్ కళ్ళు చమర్చాయి. ఆ రోజుల్లో నాన్న చెప్పిన మాటలు సృజన్ గుర్తుచేసుకొని చెపుతున్నాడు.
ప్రతీ వ్యాపారంలో లాభనష్టాలు చాలా సహజమైనవి. ప్రతి బిజినెస్‌లోనూ కష్టమర్లు ఉంటారు. కానీ మన హోటల్ కూడా ఒక బిజినెస్సే అని అందరూ అనుకుంటారు. ఈ హోటల్ వ్యవస్థలో వ్యాపారం కన్నా సేవాభావం చాలా ముఖ్యమైనది.
హోటల్ కొచ్చేవారంతా అన్నార్థులే. అందుకనే మనకు లాభం రాకపోయినా, రుచికరమైన, నాణ్యమైన ఫలహారాలను, భోజనాన్ని అతిథులకు వడ్డించాలి. మనంగానీ మంచి రుచికరమైన వంటకాలు వండి వడ్డిస్తే హోటల్ బిజినెస్‌లో నష్టం రానే రాదు. ఒకవేళ అధిక లాభాలు రాకపోయినా, నష్టాలు మాత్రం రానే రావు.
అందుకనే హోటల్‌కి వచ్చే వాళ్ళందరూ అతిథి దేవుళ్ళే, కష్టమర్లు కానేకాదు అని నాన్నగారు ఆనాడు చెప్పిన మాటలను సృజన్ చెపుతూ ఉంటే అందరూ శ్రద్ధగా విన్నారు. ఆ తరువాత అందరూ కలసి విందు భోజనం చేశారు.
మళ్లీ అన్నపూర్ణ హోటల్ అతిథిదేవుళ్ళతో కళకళలాడుతోంది.
అతిథి దేవోభవ
ఆడిటోరియంలో ‘‘కాలేజీ వార్షికోత్సవ సభ’’ దేదీప్య కళాకాంతులతో ప్రారంభం అయ్యింది. కాలేజీ సెక్రటరీ పోడియం మైక్‌లో ఒక్కొక్క విద్యార్థినీ పరిచయంచేసి, వారిని వేదికపైకి ఆహ్వానిస్తోంది. బహుముఖ ప్రజ్ఞాశాలియైన సెక్రటరీ పద్మావతి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటంలో ఆమెకు ఆమే సాటి.
కవిత్వం, నాటకం, సంగీతం ఇంకా వివిధ రంగాల విద్యార్థులు వేదికపైకి వచ్చి ముఖ్యఅతిథి, ప్రిన్స్‌పల్ చేతుల మీదుగా తమ బహుమతులను జ్ఞాపికలతోపాటు అందుకుంటున్నారు. ఇప్పుడు చిత్రకళలో మన కాలేజీకి గర్వకారణమైన ఇంద్రవర్మను వేదికపైకి ఆహ్వానిస్తున్నాం! విజయ కరతాళ ధ్వనులతో ఆడిటోరియం దద్దరిల్లింది.
కానీ ఇంద్రవర్మ మాత్రం ఎందుకో నిదానంగా వస్తున్నాడు. అతడు ప్రియ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రియ తన చిత్రకళను ప్రోత్సహించింది. తను వేసిన ప్రతి చిత్రానికీ రంగులు, మెరుగులు దిద్దించిన తోటి సహ విద్యార్థిని ప్రియను కూడా వేదికపైకి పిలవమని సెక్రటరీకి చెప్పాడు.
కానీ ప్రియ రాకపోవటంతో, పెయింటింగ్ పోటీలో మొదటి బహుమతి, జ్ఞాపికనూ అందుకున్నాడు ఇంద్రవర్మ.
అదే సమయంలో ఇంద్రవర్మ స్నేహితులు అందంగా ప్యాక్చేసిన ఒక పెద్ద ఫోట్ పోట్రైట్ను వేదికపైకి తీసుకొచ్చారు. ముఖ్యఅతిథి, ప్రిన్స్‌పల్ సంయుక్తంగా ఆ పోట్రైట్ను ఆవిష్కరించారు.
అది ఒక స్త్రీ మూర్తి కళాఖండం. ఆమెలో ఒక అమ్మ ఉంది. ఆ చిత్రంలో ఓ చిన్నారి, అక్క, చెల్లెలు, వదిన, భార్య అందరూ కన్పిస్తున్నారు. ఆమెలో ప్రత్యేకంగా ఒక స్నేహితురాలు కన్పిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన సృష్టి అంతా స్త్రీ మూర్తిలోనే అంతర్లీనంగా ఉందన్న ఇంద్రవర్మ నిర్వచనం రసజ్ఞులను ఆకట్టుకొంది.
ఈ పెయింటింగు నేను నా తోటి విద్యార్థిని ప్రియతో కలసి చిత్రించాను. అందుకే ఈ బహుమతి మా ఇద్దరికీ చెందుతుందని ప్రియను కూడా వేదికపైకి ఆహ్వానించాను. నాకు రంగులు వేయటం నేర్పిన మన కళాశాలకి గుర్తుగా, దీనిని ‘‘ప్రియజ్ఞాపిక’’గా సమర్పిస్తున్నాను అని ఇంద్రవర్మ ఆనంద భాష్పాలతో కూడిన ఉద్వేగ చిరుప్రసంగంతో మళ్ళీ ఆహుతులంతా కరతాళ ధ్వనులతో, స్టాండిరగ్ ఒవేషన్ ఇచ్చారు.
చూస్తూ చూస్తూండగానే కాలేజీ జీవితం తెలియకుండా హాయిగా సాగిపోయింది. ఎన్నో జ్ఞాపకాలు, అనుభూతులు, చదువుల తల్లి దేవాలయ ప్రాంగణంలో నేర్పుతుంది.
మీరు కూడా స్వయంగా పెన్సిల్ గీతలతో బొమ్మలు వేయాలి. బాపుని గుర్తు చేసుకోండి. బొమ్మలు వేయగలరు. వేసిన బొమ్మలకు వాటర్ కలర్స్ వేయండి. అప్పుడు మీకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. వేసిన చిత్రాలు మీకు నచ్చాయి అంటే మీరు కళాకారులే! వాటిని చూచిన స్నేహితులు, కుటుంబసభ్యులు మీకు ఇచ్చే కాంప్లిమెంట్లు ఎన్నో ఉంటాయి సుమా! అవి ఆనాడు పాఠాలు చెప్పిన గురువుగారి మాటలు, ఇంకా జ్ఞాపకం వస్తూనే ఉన్నాయి ఇంద్రవర్మకు.
కాలేజీలో విద్యార్థులందరూ…. నువు ఇంద్రవర్మవు కావు ` రవివర్మవే అనే వాళ్ళు. ‘‘ఏనాటికైనా మన ఇంద్రవర్మ ప్రపంచ ప్రఖ్యాత పికాసో వంటి గొప్ప చిత్రకారుడు అవుతాడని’’ ప్రసంసించాడు ప్రిన్సిపల్.
అసలు ఈ అభినందల, ప్రసంశల వెల్లువకు సూత్రధారి ప్రియ. ఇవన్నీ అందుకోవటానికి ఆమెకే అర్హత ఉందని ఆవేదన చెందాడు. ప్రియను చూడటానికి అతని హృదయం పరితపిస్తోంది. కేవలం పెయింటింగ్ మీదే కాకుండా, చదువు మీద కూడా శ్రద్ధ పెట్టాలని తనకు వెన్నుదన్నుగా నిలిచింది ప్రియ.
ప్రియ స్ఫూర్తితోనే డిగ్రీలో ర్యాంకు సాధించాడు. ఆమె చెప్పకపోతే నిజంగానే తన చదువు అటకెక్కి కూర్చునేది అని తెలుసుకున్నాడు.
డిగ్రీ రెండో సంవత్సరంలో కూడా ఇంద్రవర్మకు అత్తీసరు మార్కులే వచ్చాయి. దాన్ని అలుసుగా తీసుకొన్నాడు హరిప్రసాద్. ఇంద్రవర్మను అవమానించాడు. ఒరేయ్! నీకు తక్కువ మార్కులు వచ్చాయని బాధపడకు. హాయిగా రోడ్డు పక్కన దేవుడు బొమ్మలు గీసుకున్నావనకో! ఏకంగా కాసుల వర్షమే కురుస్తుందన్నాడు. బాబు రవివర్మ! నీకు చదువెందుకు? మాకు లాగా మార్కులతో పనేంటి? అసలు రంగులు లేకపోయినా, బొగ్గులతో కూడా బొమ్మలేసి డబ్బు సంపాదిస్తావ్! అని కించపర్చాడు ఉదయ్‌కుమార్. వీరిద్దరికీ ప్రవీణ్, శేఖర్లు తోడై అగ్నికి ఆజ్యం పోసేవాళ్ళు. వాళ్ళు మారరు! ర్యాగింగ్ చేసి చేసి నెగిటీవ్‌గా తయారైపోయారు.
ఇంద్రవర్మకు ఉద్యోగం వచ్చింది. అయినా అంత సంతోషంగా లేదు. ప్రతీ క్షణం ప్రియా ఆలోచనలే. అసలు ప్రియ ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. మనసు బాగోపోయినా, మనశ్శాంతి కోసం పెయింటింగ్ వేస్తున్నాడు. అది గ్రహించిన కంపెనీలోని సహ ఉద్యోగులు ‘‘ఆర్ట్ పెయింటింగ్ గ్యాలరీ’’ ప్రదర్శన ఏర్పాటు చేశారు. అనూహ్యమైన స్పందన వచ్చింది.
ఇప్పుడు ఇంద్రవర్మ వేసిన పోట్రైట్లకు ఇతర దేశాలలో గిరాకీ పెరిగింది. ఇంద్రవర్మ భారతదేశంలో ప్రముఖ చిత్రకారునిగా అవార్డును అందుకున్నాడు. గౌతమబుద్ధుడు చెప్పినట్లు ‘‘నీవు ఏది ఆలోచిస్తే, అదే అవుతావు’’ ఔను! నేను ఇప్పుడు గొప్ప కళాకారుణ్ణి అయ్యాను అని గౌతమబుద్ధుని బొమ్మకు నమస్కరించాడు.
కానీ ఇంద్రవర్మ మనసులో మాత్రం ఏదో వెలితి, అశాంతి గూడుకట్టుకున్నాయి. హాలులో కూర్చుని టి.వి. చూస్తుండగా కొరియర్ వచ్చింది. ఆతృతతో కవర్ తెరిచాడు. అందులో ప్రియ వ్రాసిన ఉత్తరం, అంతే! వెంటనే ఒక్కసారిగా ఎగిరి గంతేసి…. యా! హూ… అంటూ గట్టిగా కేకవేశాడు.
కొడుకు వేసిన కేకకి వంటింట్లోంచి వచ్చిన తల్లి ‘‘అదేమిటిరా అంత గట్టిగా అరిచావ్! అని అడిగింది. అసలు తల్లిని పట్టించుకుంటేగా!
హలో ఇంద్రవర్మ! నేను అమెరికాలో నువ్వు వేసిన అపూర్వ కళాఖండాలు చూసి ఎంతో ఆనందించాను. నా సంతోషాన్ని వెంటనే ఫోన్ చేసి నీకు చెప్పాలనుకున్నాను. కానీ ఎందుకో నాకు అప్పుడు హిందీ సినిమా హీరోయిన్ కరీనా కపూర్ మాటలు గుర్తుకు వచ్చాయి. అవి ‘‘నేను ఉత్తరాలకే ఎక్కువ ప్రాముఖ్యత నిస్తాను. నా స్నేహితులకూ, బంధువులకూ ఉత్తరాలే వ్రాస్తుంటాను.’’ ` కరీనాకపూర్.
మనకున్న ప్రేమ, బాధ, ఆనందాలను ఉత్తరాల ద్వారా అయితే బాగా వివరంగా తెలియజేస్తాం. అలాంటి అమూల్యమైన ఉత్తరాలను జీవితాంతం పదిలంగా దాచుకుంటాం. అలాగే అప్పుడప్పుడూ చదువుకుంటాం కూడా. అందుకే నేను స్వీటు తిన్న తరువాత హాట్ తినను. ఎందుకంటే మనసారా మాధుర్యాన్ని ఆస్వాదించాలి కాబట్టి.
ఇంద్రవర్మ! నువ్వు నేను కలలు కన్నట్టు గొప్ప పెయింటర్ అయినందుకు నాకు చెప్పలేనంత గర్వంగా ఉంది. కంగ్రాట్యులేషన్స్ ఇంద్రా.
‘‘ఇంద్రవర్మ! నువ్వంటే నాకు చాలా ఇష్టం.’’ మన ప్రేమను జీవితాంతం అనుభవించాలంటే మనం పెళ్ళి చేసుకోకూడదు. ఈ విషయంలో నన్ను క్షమించు. శ్రీ కృష్ణుడు ఆరువేల భామలకు మధుర ప్రేమికుడు. వారి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే. మన ప్రేమ కూడా జీవితాంతం మధురతరంగిణిలా ప్రవహించాలి. రెండు రోజుల్లో నేను ఇండియాకి వస్తున్నాను. మిగిలిన అన్ని విషయాలు అక్కడ నెమరేసుకుందాం!
` నీ ప్రియ స్నేహితురాలు
ఉత్తరం చదివిన ఇంద్రవర్మ దృష్టి టి.వి. చానల్లో కన్పిస్తున్న బ్రేకింగ్ న్యూస్‌పై పడిరది, ‘‘బోయింగ్ విమానం సముద్రంలో కూలిపోయింది” చూపిస్తున్న ఫోటోలలో ప్రియ ఫోటో, పేరునూ స్పష్టంగా చదివి సోఫాలో కూలబడిపోయాడు ఇంద్రవర్మ.
