వెలుగును పంచుతూ బతుకును బలిఇచ్చే కొవ్వత్తిని కాను….
కాసేపు మెరిసినా కళ్ళకద్దుకునేలా
బతుకునుసాగించే కర్పూరాన్ని కాను….
తానరిగిపోతూ కూడా సుగంధ పరిమళం అందిస్తూమురిసే గంధం
చెక్కను కాను…
అంధకారం అలుముకున్న బ్రతుకులో అజ్ఞానాన్ని తొలగించే
అక్షరం ముక్కను కాను…
నీడనిస్తూ పూలనిస్తూ ఫలాలనిస్తూ
ప్రాణవాయువు నందిస్తూ రకరకాల
గృహోపకరణాల రూపంలో సేవలందిస్తూ సస్యశ్యామలంగా
నా దేశాన్ని నిండుగా నిలుపుతూ…
మొడై పండుముసలిలా చిక్కి శ్యల్యమై ఎండుకట్టేగా మారి కడకు
కాలుతూ కూడా పరులకు పనికొచ్చే
తరువును అసలే కాను ……
ఇన్నాళ్లు సేవలు పొందడమే తెలిసిన నాకు సిగ్గుగా వుంది
మనిషై ఈ మట్టిలో పుట్టినందుకు
ఒక్క మంచి పనైనా చేయాలని సంకల్పించుకున్నా పైచేయి అంటే
చేయి అధించడం అని తెలుసుకున్నా!!!
Peddurti Venkatadasu
Peddurti Venkatadasu
పెద్దూరి వెంకటదాసు కవి, సాహితీ కిరణం మాసపత్రిక , చైతన్య భారతి సాహితీ సాంస్కృతిక సమాఖ్య సలహాదారులు. లేడీ కండక్టర్ -కథా సంపుటి ఆమె -కవితా సంపుటి త్రివేణి- రెక్కల శతకం తెలంగాణ కేసరి- కే సి ఆర్ పై రెక్కల సంపుటి ప్రచురించారు 9290910498
అమ్మను దేవతగా పూజించే నా దేశంలో… ప్రతిదీ అద్భుతమే…
సాంకేతికతలో ఈ అవనిలోనే తలమానికమై
అలరారుతున్నా!
నైతికతలోనూ నా దేశం
అన్ని దేశాలకు ఆదర్శమే…
ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య విషయంలో ఎన్నో
కొత్త ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నా
మన ఆధ్యాత్మికతతో అంటు కట్టుకున్న యోగా
విశ్వవ్యాప్తంగా ఆదరణకు
నోచుకోవడం ఆశ్చర్యమే-
చెట్టును పుట్టను గట్టును
గాలిని నీటిని వేటినీ వదలక
కళ్ళకద్దుకని ప్రకృతిని ప్రాణప్రదంగా
గౌరవించడం అపూర్వమే –
పుంఖాను పుంఖాలుగా పుస్తకాలను
వల్లే వెస్తే పుట్టలేదు ఇక్కడ భక్తి
మెదడు మొదళ్ళను తలుచుకొని
అనువంశికంగా మొలుస్తుంది
అది ఈ మట్టి శక్తి
ఒక చెంపపై కొడితే మరో చెంప
చూపించిన మహాత్ముణ్ణి గన్న
మన అవని – పరమ పావని
సౌశీల్య రాముణ్ణి రాజుగా కాక
దేవునిగా గుండెల్లో దాచుకున్న
ఈ దేశంలో పుట్టడమే మన భాగ్యం
నైస్వర్గికంగా కూడా మన దేశం
సర్వశ్రేష్ఠం అది మన సౌభాగ్యం!!
(స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా నా కవిత.)
వెలుగును పంచుతూ బతుకును బలిఇచ్చే-
కొవ్వత్తిని కాను…..
కాసేపు మెరిసినా కళ్ళ కద్దుకునేలా బతుకును సాగించే –
కర్పూరాన్ని కాను…..
తాను అరిగిపోతూ కూడా సుగంధ పరిమళాన్ని అందిస్తూ మురిసే –
గంధపుచెక్క ను కాను…..
అంధకారం అలుముకున్న బతుకుల్లో అజ్ఞానాన్ని తొలగించే –
అక్షరం ముక్కను కాను…..
నీడ నిస్తూ,పూలనిస్తూ,ఫలాలనిస్తూ, ప్రాణవాయువు నందిస్తూ –
రకరకాల గృహోపకరణాల రూపంలో సేవలందిస్తూ –
సస్యశ్యామలంగా నా దేశాన్ని నిలుపుతూ –
మొడై పండు ముదుసలిలా చిక్కి శల్యమై ఎండుకట్టేలా మారినా –
కడకు కాలుతూ కూడా పరులకు పనికొచ్చే –
తరువును అసలే కాను…..
అందుకే ఎందుకు ఈ బతుకు అనుకున్నా –
మనిషినై ఈ మట్టిలో పుట్టినందుకు –
నా జన్మభూమి కి ఒక్క మంచి పనైనా చేయాలనుకున్నా –
అవసరమైతే – దేశంకోసం
నా దేహాన్ని – అర్పించాలనుకున్నా!!
నిప్పులు చిమ్ముతూ నింగికెగిసే ఉపగ్రహ ప్రయోగం మంచి తిథి ఎంపిక తో మనదైన నమ్మకం తో
విజ్ఞాన శాస్త్ర కేతనాన్నెగురవేస్తున్నది
ఆధ్యాత్మిక మహిమకు,మన సంఖ్యాశాస్త్ర శక్తికీ ఇది
ఎదురులేని నిదర్శనం
ప్రపంచవ్యాప్తంగా
ప్రచండ వేగంతో
ప్రజాభిప్రాయమై వెలుగుతున్నది
ప్రాణ రక్షణ పాత్రోల్మీనమై
ఆరోగ్యానికిస్తున్న
ప్రాముఖ్యత
ఎన్ని కొత్త ఆవిష్కరణలు చోటుచేసుకుంటున్నా
మన ఆధ్యాత్మికత అంటుకట్టుకున్నా
యోగా విశ్వవ్యాప్తంగా జనాదరణ పొందిన యుక్తి కి
మన భక్తికి ఇది బలమైన తార్కాణం!
అవనిని జనని గా కొలిచే దేశంలో
పారే నీరైనా
పీల్చే గాలైనా
భక్తితో
భగవంతుని ప్రసాదమని
ఇక్కడి
జనం గుండెల్లో గూడు కట్టుకున్నది నమ్మకం!
అదే మనకు అనువంశికంగా అబ్బిన గుణం
అందుకే మాది కర్మభూమి అంటున్నారు ఈ దేశజనం!
నిండైన ఈ భావనతోనే సౌభ్రాతృత్వం
పరిఢవిల్లుతుంది
ఇక్కడ అనుదినం!!!
——– పెద్దూరి వెంకటదాసు
గొప్ప
పండితులే
కావచ్చు —
చూసేవాడు
జ్ఞాని!
కదపనోడికి
కాలువైనా
కడలే—
సొమరికన్నీ
అమావాస్యలే!
కడలికే కాదు
కార్యోన్ముఖులకూ..
చలించనిదే
ధీరత్వం!
అందరి కల
ప్రేమను పంచడం
కొందరి కళ–
కాగితంపువ్వు
పరిమళం పంచదు!
గెలవడానికి
రవి కూడా
రాత్రంతా ఆగాల్సిందే —
సహనంతోనే
వెలుగు సాధ్యం!
అందర్నీ
పలకరించేవే
వైఫల్యాలు–
పడిలేచినోడే
ప్రాజ్ఞుడు!