సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి పది కోట్ల మందికి పైగా హాజరు అవుతారని అంచనా. ములుగు జిల్లా కంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా, కేవలం తెలంగాణలోనే గాక అఖిల భారత దేశంలోనే వనదేవతలుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క-సారక్క. ‘‘దేశంలోనే అతి పెద్ద గిరిజనజాతర’’గా గణతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. మన రాష్ట్రము నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్,ఒడిషా,చత్తీస్గఢ్,జార్కండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్దీ భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది.
ఎవరీ సమ్మక్క-సారక్కలు
నేటి జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండల ప్రాంతములోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు వేటకని వెళ్లినప్పడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నాడు. సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులూ, సింహాలూ ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెని దైవాంశ సంభూతురాలిగా భావించారు. కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలుచుకునేవారు. సమ్మక్క హస్తవాసి వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసేది. ఆమె చేత్తో ఆకుపసరు ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదట. ఆమెను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజు కిచ్చి పెళ్ళి చేసాడు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు, మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు ‘‘పగిడిద్దరాజు’’ కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు, అతడిని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారం పై దండెత్తుతాడు. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. కాని సుశిక్షితులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది.ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది, వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాప రుద్రుడు ఆశ్చర్య చకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుక గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యంలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు, కానీ ఆ ప్రాంతములో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.జాతర విశేషాల
జాతరలో మరొక దృశ్యం.జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగి పోతారు.మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యద్ద స్థానానికి తరలిస్తారు. వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పించుకుంటారు. గిరిజన వాళ్ళె కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు సుమారు కోటికి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర, ఈ జాతర ఆసియా లోనే అతి పెద్ద జాతర.
తెలంగాణా కుంభమేళా
జంపన వాగులో స్నానం చేసే భక్తులు తెలంగాణాలో జరిగే అతిపెద్ద విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర, ఈ జాతర రెండు ఏండ్లకు ఒక సారి జరుగుతుంది, సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు, కాని 1940 తర్వాత తెలంగాణా ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ఏటేట జనం పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఈ గద్దేలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణేలను తీసుకు వస్తారు. పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణా నుండే కాకుండా మధ్య ప్రదేశ్, చెత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాలనుండి సుమారు కోటికి పైగా భక్త జనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు.
ఈ జాతర భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర. 2008 ఫిబ్రవరిలో జరిగిన జాతరకు సుమారు 90 లక్షల మంది వచ్చారని అంచనా. ఇది విగ్రహాలు లేని జాతర. సమ్మక-సారలమ్మ జాతర గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మొదలై నాలుగు రోజుల పాటు జరుగుతుంది. హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం వరకు పెద్దలకు రూ.90, పిల్లలకు రూ.45 లు బస్ చార్జి ఉంటుంది. కాకతీయ రాజులైన ప్రతాపరుద్రుడిపై పోరు సలిపి వీరమరణం పొందిన గిరిజన వీరవనితలైన సమ్మక్క-సారలమ్మలను స్మరించుకుంటూ ఈ జాతర జరుగుతుంది. కుంభమేళ తర్వాత భారీగా భక్తజనం పాల్గొనే ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం 1996లో రాష్ట్ర పండుగగా ప్రకటించింది. రాష్ట్రం నుంచే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, మహారాష్ట్ర, ఒడిషా తదితర పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులతో మేడారం ప్రాంతం జనసంద్రాన్ని తలపిస్తుంది. భక్తి పారవశ్యంతో, పూనకాలతో ఊగిపోతూ లక్షలాది భక్తులు సమ్మక్క-సారలమ్మ మొక్కులు చెల్లించు కుంటారు. కోయ గిరిజనుల ఉనికికోసం పోరు సల్పిన సమ్మక్క-సారలమ్మ జాతర కీ.శ.1260 నుంచి 1320 వరకు ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్ర చక్రవర్తి కాలం నుంచి కొనసాగు తున్నట్లు స్థల పురాణాలు తెలుపుతున్నాయి.
ఆ కాలంలో మేడారం ప్రాంతాన్ని పడిగిద్దరాజు పరిపాలించే వారు. ఇతను కాకతీయుల సామంతరాజు. అప్పటి కరీంనగరాన్ని పాలించిన మేడరాజుకు మేనల్లుడైన పడిగిద్ద రాజు సతీమణి సమ్మక్క. ఆమెకు పగిడిద్దరాజుతో వివాహం జరిపించారు. పగిడిద్దరాజు, సమ్మక్క దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు సంతానం. మేడారం పరిగణాలను కోయరాజులు కాకతీయులకు సామంతులుగా ఉండి పరిపాలించేవారు.ఓసారి మూడు, నాలుగేళ్ళ పాటు మేడారం ప్రాంతంలో అనావృష్టి ఏర్పడిరది. దీంతో ప్రజలు పన్నులు కట్టలేని దయనీయ స్థితికి చేరుకున్నారు. పగిడిద్దరాజు తాను కప్పం కట్టలేనంటూ చేతులేత్తేశాడు. దీంతో ప్రతాపరుద్రుడు వారిపైకి సైనికులను పంపాడు. కాకతీయ సైన్యం వంటి ములుగు జిల్లాలోని ములుగు సమీపంలో లక్నవరం సరస్సు వద్ద స్థావరం ఏర్పాటు చేసుకొని యుద్ధం ప్రకటించారు. పడిగిద్దరాజు అతని కుమార్తెలు, నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజు కలిసి కాకతీయ సైన్యాన్ని మేడారం సరిహద్దులోని సంపెంగ వాగు వద్ద నిలువరించి పోరాడి వీరమరణం పొందారు. కుమారుడు జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నాటి నుంచి సంపెంగ వాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి గాంచింది. తన కొడుకు, కుమార్తె మరణించారన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడిరది. ఈటెలు, బళ్ళాలతో కాకతీయసైన్యాలను పరుగెత్తించి అంతం చేసింది. ఇక ఓటమి తప్పదని భావించిన ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెనుక నుంచి పొడవడంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టకు వెళ్లి గుట్ట మలుపు తిరిగిన తర్వాత ఆమె అదృశ్యమైంది.తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారాడు. మేడారం జాతర గద్దెల ప్రాంగణానికి సాంప్రదాయ పద్ధతిలో దేవతలను తీసుకు వస్తారు. వంశపారపర్యంగా వస్తున్న గిరిజనులే ఇక్కడ పూజారులుగా కొనసాగుతున్నారు. మేడారం జాతరకు సుమారు పది రోజుల ముందు నుంచే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సారలమ్మ పూజారులు కన్నెపల్లిలోని గుడి వద్ద అమ్మ వారిని పూజించి సమ్మక్క దేవతాపూజారులైన సిద్దబోయిన వారింటికి వస్తారు. సమ్మక్క పూజారులు చిలుకలగుట్ట వద్దకు వెళ్ళి దేవతను కుంకుమ భరిణ రూపంలో తీసుకు వస్తారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు 10 రౌండ్లు తుపాకీ కాల్పులు జరిపి దేవతను గద్దెకు తీసుకు వస్తారు. భక్తుల మొక్కుబడుల అనంతరం తిరిగి దేవతలు వనప్రవేశం చేస్తారు.
ShailajaMitra
ShailajaMitra
చదువు:ఏం.ఎ. ఆంగ్లం, మరియు తెలుగు, పి.జి.డి.సి.జే. శంఖారావం, మనో నేత్రం, నిశ్శబ్దం, అంతర్మధన వేళ, అగ్నిపూలు ,రాతి చిగుళ్లు, తడిసి ముద్దయిన కాలం, సృష్టి కేతనం (దీర్ఘ కవిత), కవితా సంపుటాలు, మనోనేత్రం, అడ్డా, - కధా సంపుటాలు, ఆకుపచ్చని జాబిలీ, ఈ నావది ఏ తీరమో, నీకు నువ్వే, ఏ తప్పెవరిది? నవలలు, సిల్వర్ లైన్స్( ఆంగ్ల కవితా సంపుటి) glowing flowers , hardend earth , how to speek in telugu , voice of water , (ఆంగ్ల అనువాదాలు) ఉషోదయ వెలుగు పత్రికలో 'మానవీయం ' అనే పేరుతో 46 సాంఘీక వ్యాసాలు, భక్తిరంజని పత్రికలో 'ఆధ్యాత్మికత -జీవితం ' అనే అంశంపై 42 భక్తి వ్యాసాలు ఆంధ్రభూమి, ఆంధ్ర ప్రదేశ్, ఆంధ్రప్రభ, ఈ వారం, నేటినిజం, సుజనరంజని (వెబ్ మాగజైన్) అన్నింటిలో కలిపి 567 కవిత, కధ, నవల, సమీక్షలు, విశ్లేషణా వ్యాసాలు, పురస్కారాలు 1 రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం 'సాహిత్య శ్రీ ' బిరుదు (అఖిల్ భారత్ భాషా సాహిత్య సమ్మేళన్, భోపాల్) ఆరుద్ర పురస్కారం, దేవులపల్లి కృష్ణ శాస్త్రి పురస్కారం శ్రీ శ్రీ పురస్కారం జ్వాలాముఖి పురస్కారం
‘‘యత్ర నార్యన్తు పూజ్యంతే` రమంతే తత్ర దేవతా:!
యత్రైతాస్తు స పూజ్యంతే ` సర్వాస్తత్రాఫలా:క్రియా: !!
శోచంతి జామయోయత్ర -వినశ్యత్యాశు తత్కులం!
నశోచంతితు యత్రైతా: `వర్ధతే తద్ధి సర్వదా !!
తస్మాదేతా సదా పూజ్యా: `భూషణాచ్ఛాదనాశనై : !!’’
మహిళలు గౌరవం పొందే స్థలంలో దేవతలు ఆనందంతో నిలుస్తారు. స్త్రీలను అగౌరవపరిచే వారికి ఏ పనులలోనూ మంచి ఫలితాలు లభించవు. ఏ స్త్రీలు వంశంలో దు:ఖిస్తూ ఉంటారో ఆ వంశం నాశనమైపోతుంది. నిజానికి వారి సంతోషమే వంశోన్నతికి మూలం. ఎపుడూ వారికి అన్నం, వస్త్రం తదితర సామగ్రీ ఉండే విధంగా వ్యవహరించాలి అనేది శాస్త్రం. వాస్తవం కూడా.
అనాది నుండి అత్యాధునికం వరకు మహిళ తమవంతు బాధ్యతను నిర్వహిస్తూ తన ఉనికి పతాక స్తాయిలో వినువీధుల్లో విస్తరిస్తూనే ఉంది. ఇది నిజం. నిజానికి ఆదిలో స్త్రీలకు ఉన్న ప్రాధాన్యత రాను రాను తగ్గుతూనే వస్తుందని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే అప్పట్లో మహిళ కి ఇన్ని పరిమితులు విధించి ఉన్నట్లయితే కులాలకతీతంగా ఒక రaాన్సీ లక్ష్మీబాయి, సమ్మక్క సారక్కలు, జ్యోతీరాయ్పూలే, మొల్ల, చాకలి ఐలమ్మ వంటి వారు ఉండేవారే కారు. ఆ కాలంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. రాను రాను ఎప్పుడైతే పితృస్వామ్యవ్యవస్థ అహంతో ముందువరసలోకి వచ్చిందో అపుడే స్త్రీల అణచివేత ప్రారంభమైంది. కన్యాశుల్కం ఇచ్చిన రోజులనుంచి నేడు వరకట్నం ఇస్తున్న నేటి రోజుల వరకు మహిళ ఆర్థికంగా సమానత్వం సాధించినా కూడా ఇంకా ఇంకా అణచివేత సాగుతూనే ఉంది. వీటిని ఎలా అధిగమించడం? అమ్ముడుపోతున్న చట్టాలను ఎదిరించి గెలిచే ధైర్యమూ ఎవరికీ లేదు. మరి ఆడపిల్లను ఎలా పెంచడం? కాపాడటం ఎలా? అంతరిక్షానికి ఎగురుతున్నా కూడా ఇంకా అణగారిన కథలే వినిపిస్తున్నాయంటే లోపం ఎక్కడుంది? అసలు ఆడపిల్ల సమాజంలో బతకగలదా? తనకు తానే ధైర్యంగా ఈ సమస్యలను ఎదుర్కోగలదా? వంటి అనేక పశ్నలకు సమాధానంగా వెలువడిన ‘‘భారతీయ మహిళ’’ అమూల్యమైన గ్రంథాన్ని రూపొందించిన ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారములు.
ఈ గ్రంథంలో వేదాలలో మహిళలు, పురాణాల్లో మహిళలు, భాగవతంలో మహిళలు, రామాయణంలో మహిళలు, మహాభారతంలో మహిళలు, దేశ చరిత్రలో మహిళలు, ఆధునిక కాలంలో మహిళలు , పూజ్యశ్రీ గురూజీ చెప్పిన మహిళల భాగస్వామ్యం వంటి అతి విలువైన అంశాలు ప్రస్తావనలోకి వచ్చాయి.
భారతీయ మహిళ` మాతృశక్తి లో ఆత్మకు స్త్రీ అనీ, పురుషుడనీ, మృగమనీయ పక్షి అయనీ పాము అనీ భేదం లేదు. అందరిలోనూ అంతటా ఉన్న ఆత్మ ఒక్కటే. సంసారంలో ఎవరి విధి వారు నిర్వర్తిస్తారు. పరస్పరం సహకరించుకుంటూ, ఇచ్చిపుచ్చుకుంటూ జీవిస్తారు. వర్గపోరాటమే జీవితమనుకుంటే అదే చరిత్ర అనుకుంటే కలిసి బతికే వ్యవస్థ ఏర్పడి కాదు ఆత్మీయత , అనురాగం సర్వ ప్రాణుల మధ్య ఎప్పటికీ ఉంటాయి. ఈ సువిశాల భావాలు, ఆచారాల కారణంగా, మహిళను భార్యగా, అక్కగా, చెల్లెలిగా గౌరవించబడుతున్న కారణంగానూ, జీవితంలో పురుషుడు స్త్రీనే అనుసరించి నడుస్తాడని చెప్పడం జరిగింది.
ఋగ్వేదంలోని అనేక మంత్రాల్ని మహిళలే దర్శించినట్లు అంతర్గత సాక్ష్యాలున్నాయని అంటారు. ‘‘గార్గి, రోమశ, ఘోషా, విశ్వాపర, ఆత్రేయ, లోపాముద్ర, వసుక్రపత్ని, ఇంద్రాణి, అపాల, శ్రద్ధ, కామాయని, వైవస్వతి, యామిపైలమి, సూర్య, స్వస్తి, శిఖండిని, ఊర్వశి, శచి, దేవరని, ఇంద్రమాత, సర్వరాజ్ఞి, వాక్, గోధ.. తదితరుల పేర్లు ఉన్నాయి. వీరందరూ దార్శనికులైన మేధావినులు. విద్య, వైద్యం, వ్యవసాయం, సాహిత్యం, కళలు వంటి వివిధ వృత్తులు, రాజనీతి తదితర రంగాలలో ప్రతిభావంతులుగా వెలిగారు. మహిళావికాసం సమగ్రంగా జరిగిన కాలమది. ఆ కాలంలోని కొంతమంది మహిళామణులను గురించి తెలుసుకోవాలంటే ముందుగా
బ్రహ్మవాదిని గార్గి గురించి: మహావేదాంతి రాజఋష జనకుడు మిథిలను పరిపాలిస్తున్న రోజుల్లో సీత తండ్రి జనకుడు కాడు. రామాయణ కాలం కన్నా ఎంత ముందున్నవాడు. ఈ రాజవేదాంతి ఆస్థానంలో గార్గి అనే బ్రహ్మవాదిని ఉండేది. యాజ్ఞవల్క్య అనే ఋషి ఉండేవాడు. వీరిరువురికి బ్రహ్మతత్త్వ వివేచనార్థం సభ జరుగుతున్నప్పుడు ఆకాశం, నేల, నీరు వంటి పంచభూతాల పట్ల వాదోపవాదాలు జరిగింది. చివరికి యాజ్ఞవల్క్యుని బ్రహ్మజ్ఞానిగా గార్గి గుర్తించింది. అంటే అతను బ్రహ్మజ్ఞాని అని గుర్తించిన మహామేధావి గార్గి అన్నమాట. అందుకే ఈమె బ్రహ్మవాది అయింది.
శ్రేయోమార్గంలో మైత్రేయి యజ్ఞవల్కుని భార్య. వీరికొక ఆశ్రమమున్నది. పోషణ నిమిత్తుం ఆశ్రమ భూములున్నాయి. గోవులున్నాయి. ఫలధాన్య సమృద్ధి వున్నది. ఆయన ఆశ్రమం విడిచి వెళ్ళి కొన్నాళ్ళపాటు తపస్సు చేసి దేశ పర్యాటన చేసి రావాలనుకుని మరో భార్య అయిన కాత్యాయనికి మొదటి భార్య మైత్రేయికి ఆస్థి విభజన చేసి రక్షించుకోవలసినదిగా తెలిపి మైత్రేయితో ఈ విషయం ప్రస్తావించాడట. కానీ మైత్రేయి ఈ భూమి వల్ల నేను అమృతత్త్వం పొందుతానా? అని అడిగిందట. అందుకు ఎప్పటికీ పొందలేవు. సంపదలున్నవారు అమృతత్త్వాన్ని పొందలేరు అంటే అమరత్వం పొందని ఈ ఆస్తి వలన, సంపద వలన నాకేం ప్రయోజనం ఉంది అని తిరస్కరించిందట. అయితే ఆత్మ బ్రహ్మ ఒక్కరే! ధ్యానం చేయాలి. ఆత్మను తెలుసుకోవాలి, ఇంద్రియాలను తాడిరచి ఆత్మను శోధించి ఈ పంచభూతాత్మక ప్రపంచం కంటే ఆత్మ ఎలా భిన్నమైనదో భార్యకు యజ్ఞవల్కుడు వివరించాడట. పృథ్వి జలము, అగ్ని , వాయువు, ఆదిత్యుడు, దిశలు, విద్యుత్తు, మేఘం, ఆకాశం తదితర వివరాలు చెప్పి ధర్మమే సర్వప్రాణులకు ప్రీతియని మైత్రేయి తెలుసుకున్నది.. కానీ రెండవ భార్య మాత్రం ఆస్తివైపే దృష్టిని సారించి కఠోపనిషత్తులోని శ్రేయస్సును, ప్రేయస్సును స్వీకరించింది. ఇపుడు కాత్యాయని సంసారాన్ని నడుపుతోంది. మైత్రేయి మోక్ష పథంలో ఉంది. యాజ్ఞవల్క్యుడు తపస్సులో ఉన్నాడు ముగ్గురిలో ఒకరు ప్రేయస్సుకు ప్రతీక, మైత్రేయి శ్రేయస్సుకు ప్రతీక, యాజ్ఞవల్క్యుడు తపస్సుకు ప్రతీక అనచ్చు. ఇలా సుజ్ఞాని సులభ జనక మహారాజుతో సులభ వేదాంత గోష్టి చేసిన అంశం భారతంలో సూచించబడిరది. వేదాల్లో వందల కొలది మహిళలు పృథ్వి, ఇల, సరస్వతి, భారతి, సినీవాలి, రాఖ, సూనృత, పురంధ్రి, ధిషణ, అనుమతి, తిఱిని, ఇంద్రాణి, ఉషస్సు, రాత్రి, శ్రద్ధ, అనుమతి, అరామతి, దంపతి, అరణ్యాని, వరుణాని వంటి వారంతా మహిళా రూపంలోని దేవతలే అనవచ్చు. ఇలా మహిళల పేర్లు ఎన్నో ఒక్క ఋగ్వేదంలోనే ఉన్నాయి. వీటన్నిటిమీద ప్రత్యేకాధ్యయనం చేయాల్సిందే అంటారు రచయిత.
మాతృశక్తి దివ్యత్వాన్ని తీసుకుంటే ఆదిశక్తి మహామాయగా అవతరించింది. ఈ తల్లికి మహాకాళి అని పేరు. మొదటి అవతారంలో ఈ అమ్మవారు మధుకైటభులనే రాక్షసులను సంహరించారు.
రెండవ అవతారం మహిషాసురమర్థిని. సింహవాహనjైున ఈ తల్లికి ‘మహాలక్ష్మి’ అనే పేరుంది. ఈ తల్లి మహిషముఖుడైన అసురుడిని సంహరించింది. మూడవ అవతారం అయిన మహాసరస్వతి రక్తబీజుడ్ని సంహరించింది. నాల్గవ అవతారంలో యోగమాయగా జన్మించి కంసుడ్ని భయపెట్టి అదృశ్యమైపోయింది. ఐదవ అవతారంలో అమ్మవారు దంతాలనే ఉపయోగించడం వల్ల రక్తదంతిగా పేరును సంపాదించుకుంది. లోకంలో కరువు కాటకాలు ఎక్కువై పోవడంతో తల్లి అంతటా శాకాలు సృష్టించి కరువును తొలగించింది. అందుకే ఈ తల్లిని శాకాంబరిగా పిలుస్తారు. ఏడవ అవతారంలో దుర్గుడునే రాక్షసుడ్ని సంహరించినందువలనే దుర్గాంబగా పేరు వచ్చింది. ఎనిమిదవ అవతారంలో తల్లి మాతంగుని ఇంట పుట్టి మాతంగిగా పిలవబడిరది. తొమ్మిదవ వతారంలో రాక్షస సంహారం నిమిత్తం అమ్మవారు భ్రమరాలను సృష్టించి విజయం సాధించింది. అందువల్లే ఈ అవతారానికి భ్రామరి అనే పేరు వచ్చింది. ఇలా భిన్న రూపాలతో వర్ణితమైన పురాణాది ప్రక్రియలను ఆధారంగా గ్రహించి రేఖామాత్రంగా మనకు దర్శనమిస్తున్నాయి.
పురాణాల్లో మనసావాచా కర్మణా శుచీ దేవి. శచీదేవి, వేదవేత్త వేదవతి, వరూధిని మన నాయనమ్మ, అరుంధతి మన అంతర్యామి, ఆత్మబంధువు అనసూయ, ప్రేమరస చైతన్యమూర్తి ఊర్వశి, సుస్థిర మానస సుకన్య, ఎల్లలు లేని ఎల్లమ్మ రేణుకమ్మ, సత్యసారమతి చంద్రమతి, సంపదల దేవి లక్ష్మీదేవి, పరాశక్తి పార్వతి, జ్ఞానజ్యోతి సరస్వతి వంటి దివ్యశక్తులున్న మహిళలెందరో పురాణాల్లో ఉన్నారు. మన జీవితాలు, ప్రవర్తనలు భారతీయ మహిళలకు ఆదర్శాలయి, ఆచరణ యోగ్యాలయ్యాయి.
ఇంద్రసేన, దేవసేనచ పులోమ, ఇల, అంగీరస, కావేరి, ఘృతాచి, జలంధర, తిలోత్తమ, మనోరమ, యమున, రాధ, లోపాముద్ర, శతరూప ఇలా మరో వందమంది పురాణ మహిళల ద్వారా సార్వకాలీన సత్యాల్ని అనుసరించవచ్చు. అయితే ఈ పురాణ మహిళలు ఏం చేసారు? అని ఆలోచిస్తే సత్యమే మాట్లాడుతారు. స్వేచ్చాభిప్రాయాలు ప్రకటిస్తారు. రాజీపడి జీవిస్తారు. ప్రేమను పంచి పెడతారు.అన్యాయాన్ని ఎదిరిస్తారు. పురుషునితో పాటు సమానంగా వ్యవహరిస్తారు. జన హితం కోసం దేశ హితం కోసం త్యాగాలు చేస్తారు. ఆత్మబంధువులై అందరినీ ఆదుకుంటారు. శక్తి పూత్కారం చేస్తారు. జ్ఞానజ్యోతిని వెలిగిస్తారు. అంతేనా? అంటే కాదు. మహిళాలోకానికి ఆదర్శవంతులై నిలిచారు. ఆధునిక మహిళా ప్రస్థానంలో ప్రాథేయాలంగా మహిళలంతా నిలిచారు. ఒక్కొక్కరి స్పర్శ ఒక్కొక్క పీఠికై నిలిచేలా చేసారు. నేడు దారులు వేరైనా గమ్యం ఒకటే అనిపించేలా ఆనవాళ్ళను ఉంచి మరీ కదిలారు.
భాగవతంలో ఆదితి మాత నేతృత్వం. వ్యతిరేక దిశలో దితి ప్రయాణం, దివ్య మార్గం చూపిన దేవహూతి, సహనశీలి ఆశావాది దేవకి, వాత్సల్యద యశోద, చంద్రునికో నూలుపోగు అంటున్న కుబ్జ, జగన్మోహిని యుక్తి, అరుచి సురుచి వినీతి సునీతి, తమస్సు చీల్చిన ఉషస్సు ఉష, జనగణనాయక రాధ, మహిళా చైతన్య ప్రతీక సత్యభామ, కృష్ణ చైతన్య స్రోతస్విని రుక్మిణి వంటి వారెందరో మహిళలు భారతీయ మహిళల జీవితాలతో పెనవేసుకుపోయారు. వీరిలో కొందరు భారతాది గ్రంథాల్లోనూ, అన్య పురాణాల్లోనూ వచ్చారు. కొందరిని మాత్రమే పరామర్శించే అవకాశం ఉంది. వీటి వివరణలు ఈ గ్రంథంలో చదవవచ్చు.
రామాయణంలో మహిళలు గమనిస్తే ఈ మహాకావ్యం నిండా మహిళల కథలే. మహితమైన దారిలో నడిచిన మండోదరి, రాజనీతి దురంధర మంథర, జైజైజై కైకామాతా దేవహిత కార్యనిర్మాత స్త్రీ జనాభ్యుదయతారా తార, అసురత్రాత, కైకసి కైసేత,, సత్య సౌందర్యమూర్తి సరమ, జనరంజన అంజన, కౌశల పూర్ణ కౌసల్య, ఫలిత పర్ణ శబరి, విషాగ్ని వృక్షం శూర్పణఖ, యోగిని ఊర్మిళ, పరమపునీత లోకమాత సీత తలుచుకుంటే రామాయణమంతా రమణుల కథే కదా అనిపించకమానదు.
మహేతిహాసంలో (మహాభారతంలో)మహిళల విషయానికి వస్తే స్వేచ్ఛాజీవి గంగ, ధీరమానస సత్యవతి, సౌజన్యవతి శర్మిష్ట, స్వాభిమాని దేవయాని, కపటి కద్రువ వినీత వినత, మేధానిది మేనక, సత్యవాది సరమ, ధర్మవాదిని జరత్కారువు, మృత్యుంజయ సావిత్రి, పరమ పతివ్రత పారమార్థికత, వీరమాత కుంతి, భారత భారతి ద్రౌపది. వీరిని తలుచుకుంటూనే ఉంటాం. మళ్ళీ మనం యథాస్థానంలోకి వస్తూనే ఉంటాం.
దేశ చరిత్రలో మహిళల్ని ఆలోచించుకుంటే గృహంలో యశోధర, ప్రచారిక సంఘమిత్ర, దేవిగా మారిన ఉభయభారతి, ఉత్తమ సేవిక సుజాత, వీర నారి రుద్రమ, రామాయణ రచయిత్రి మొల్ల, నాయకురాలు నాగమ్మ, వీరునికి వెన్ను చూపని చానమ్మ, చితిని వరించిన సంయుక్త, కృష్ణభక్తిని చూపే మీరాబాయి, విద్వేషాల మంటల్లో దుర్గావతి, యువతకు ప్రేరణ రaాన్సీరాణి ఇలాంటి చరిత్రలో ఎందరో ఇంకెందరో ఉన్నారు.
కీస్తు శకారంభం నుండి ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం వరకు ఎందరో మహిళలు గృహిణులుగా, వీర వనితలుగా, పరిపాలకులుగా, విద్యావేత్తలుగా, వ్యవసాయదారులుగా, వృత్తి నైపుణ్య రమణులుగా, నాట్యగత్తెలుగా, సంగీత విద్వాంసులుగా, దార్శనికులుగా, కర్మయోగినులుగా, భక్తి ప్రచారకులుగా, దేశికలుగా, ఋషికలుగా, రచయిత్రులుగా, కవయిత్రులగా దేశంలో భిన్న ప్రాంతాలలో వికసించారు. అయితే ఈ దేశం జాతిలో శక్తి తగ్గి విదేశీయులను తనలో జీర్ణించుకునే పాటవం కోల్పోయిన నాటినుంచి స్వతంత్య్రాన్ని కోల్పోతూ వచ్చింది. దానివల్ల, స్వదేశీ ఆచారాలపై జీవన విధానాలపై విదేశీయ అశాస్త్రీయ భావజాలం పెత్తనం చలాయిస్తూ వచ్చింది. ఇది కాస్త రాజ్య సభల్లో, వీధుల్లో వీర విహారం చేసినా చాలాకాలం గృహంలోనే ప్రవేశించలేకపోయింది. అందువల్ల విశాల హిందూ ధార్మిక సాంస్కృతిక తాత్త్వికాంశాలను ఎన్నింటినో గృహిణి అందించగలిగింది. ఇలా జాతి జీవనాడి నిత్య చైతన్యంతో పోరాడిన స్థలం గృహమే. ఈ గృహానికి యజమానే గృహిణి. ఆమె పుణ్యఫలమే జాతిలో స్వాతంత్య్ర భావబీజాలు నాటుకోవడం, ఆధునిక మహిలకు స్పూర్తి ప్రదాతగా నిలవడం అంటూ వివరిస్తున్న రచయిత భావాలకు ప్రణమిల్లక తప్పదు.
ఇదొక అద్భుతమైన గ్రంథం. ప్రతి మహిళ ఇంట్లో నిత్యం నిలవాల్సిన గ్రంథం కూడా. స్వేచ్ఛ అనేది ఒకప్పుడు లోక కళ్యాణం కోసం ఉపయోగించేవారు. నేడు స్వేచ్ఛ దుర్వినియోగం ఎక్కడ ఎలా అవుతోందో అనే విషయాలు ఈ గ్రంథం చదివితే అందరికీ ఖచ్చితంగా బోధపడుతుంది. నామటకు నాకు చాలా కాలమైంది ఇంత చక్కని గ్రంథం చదివి అనిపించింది. గౌరవనీయులైన కసిరెడ్డి వెంకటరెడ్డి గారి కలం నుండి వెలువడిన ఈ గ్రంథం తెలుగు సాహిత్య చరిత్రకు ఒక తలమానికం.
కసిరెడ్డిగారి గురించి
కసిరెడ్డి వెంకటరెడ్డి కవిగా, వక్తగా, వ్యాసకర్తగా, జానపద వాజ్మయ పరిశోధకుడిగా, ధార్మిక సామాజిక విజ్ఞాన వ్యాఖ్యాతగా వాసికెక్కాడు