ఒక నిన్న మన మధ్య గడిచిపోయింది/
అక్కడ నువ్వుంటివి/
నేనూ ఉంటిని/
ఆ నిన్న నేడూ వచ్చింది/
నువూ ఉన్నావు/
నీతో నేనూ, మనతో మన వారూనూ…/
ఈ నేడు రేపూ వస్తుంది/
బహుశా నేనుండక పోవచ్చు/
నువున్నా…
మన వాళ్ళల్లో ఎందరుంటారో…?ఎందరెల్లి పోతారో…?/
ఇక ఎల్లుండికి/ ఎవరి స్థితులు, గతులు, పరిస్థితులూ
ఏమో…? ఏమిటో…?/
శతాబ్దం బ్రతికి
ఎవరికీ ఏమీ కాకుండా పోయేవారు…/
దశాబ్దాలు బ్రతికీ
ఎందరెందరికో ఏమేమో అయ్యేవారు/
ఎందరో కదరా…?/
నిన్నడుగుతున్నా /
సిరాజ్ నీ లెక్కేమిటీ…???.
*****
Sirajudding Mohmmad
Sirajudding Mohmmad
సిరాజుద్దీన్ ముహమ్మద్ హన్మ కొండ, వరంగల్ సెల్:9949710085. ప్రస్తుతం: పెన్షనర్(రెవెన్యూ శాఖ). స్వస్థలం: వరంగల్. D O B: 05-12-1953. ప్రవృత్తి: సాహిత్య ప్రక్రియ. ప్రధానంగా కవితలు రాయటం. అంతకన్నా ప్రధానం, జీవిత లక్ష్యం: సమాజ సేవ.(ప్రపంచంలో శాంతి స్థాపన).ఈ ప్రయాసలో బహుశా 1990 నుండి ఉన్నానని చెప్పుకోవచ్చూ. వ్యవస్థాపనలు: 1) శాంతి పేర ఒక క్రొత్త పండుగ స్థాపన.(ఒక పుస్తకం ద్వారా ప్రతిపాదించటం జరిగింది.) ఇండియా లో జీవం పోసుకున్న ఆ పండుగను ప్రపంచ వ్యాపితం చేయటం కోసం ఒక అంతర్జాతీయ శాంతి సంస్థ స్థాపన(World Peace Festival Society) (Registerd No:255/2002). ఈ పండుగలో బాల/యువ శాంతిదూతల పేరిట అవార్డులు ఉన్నాయి, వీటిని ప్రతేడూ ప్రతి విద్యాలయం నుండి ఒకొక్కరికి చొప్పున మా సంస్థ ఇస్తూ వస్తున్నది. ఈ అవార్డులను ప్రపంచ స్థాయిలో పెద్దలకు కూడా ఇచ్ఛే ప్రయత్నాల్లో ఉన్నాం. ఆ అవార్డుల పేరు: "భారత్ శాంతి దూత్". సుమారు 5000 విద్యార్థులకు, 30 కి పైగా సీనియర్ లకు ఈ అవార్డులు ఇవ్వబడినాయి ఉజ్వల పేరిట ఓ సాహిత్య సంస్థను కూడా స్థాపించటం(1997)జరిగింది. 1) 1995 లో "ప్రపంచ శాంతి పండుగ", పేరిట ఒక పుస్తకం అచ్ఛేసుకున్నాను. 2) 2005 లో "యుద్దం", పేరిట కవితా సంకళనాన్ని ప్రచురించుకోవటం జరిగింది. Email: mohd sirajuddin8@gmail.com