మనిషికి బాల్యం పునాది వంటిది. పిల్లలు కదా వారికి ఏమి తెలుసు అని అనుకోవడం పొరపాటు. వారి పరిశీలన , అవగాహన లోతుగా ఉంటుంది. బాల్యం లో ఏర్పడిన అభిప్రాయాలు, అభిరుచులు, మనిషి వయసుతో పాటు పరిణతి చెందుతుంటాయి. అందుకే వారికి చిన్న వయసులోనే అంటే మూడేళ్ళ వయసు లోపే ఏది , మంచి , ఏది చెడు అనేది చెబుతుండాలి. ఆ వయసులోనే వారి అభిరుచులు ఏమిటో తెలుసుకోవచ్చు . ఈ దిశగా పెద్దలు పిల్లలను అవగాహన చేసుకుని వారి అభిరుచులకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించాలి. అంతే కాకుండా. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న క్రమం లో పిల్లల మానసిక ఎదుగుదల కూడా పెరిగింది. వారు ఎంత వేగంగా ఆలోచిస్తున్నారు గమనించి వారికి అన్ని ఏర్పాట్లు చేయాలి.
అదే విధముగా రచయితలూ కూడా తమ రచనల్లో మార్పులు తీసుకు రావాలి. బాల్యం లోనే సృజన అమోఘంగా ఉంటుంది. దాన్ని పదును పెట్టడానికి పెద్ద్లు కృషి చేయాలి . కానీ మీరు అనుకున్నది వారు చేయాలి. మీరు చెప్పింది వారు వినాలి అనే ధోరణి ఉంటే వారు రెంటికి చెడ్డ రేవడిగా మారి పోతారు. వారి ఆలోచనలు మారుతున్న కాల పరిస్థితులను అవగాహన చేసుకుని పెద్దలు కూడా తమ రచనల్లో మార్పులు చేసుకోవాలి. ఇప్పుడు చందమామ , బాల మిత్ర కథలు కాదు ఈ తరానికి తగిన రచనలు చేయాలి. ప్రపంచ బాలలతో పోటీ పడి ఎదగాలంటే బాల సాహితీ వేత్తలతో పాటు ప్రభుత్వాలు, సమాజ ఆలోచనల్లో తగిన మార్పు రావలసి వుంది.
ఇలా పెద్దల్లో మార్పు వస్తే భావితరానికి బంగారు బాట వేసిన వారమవుతాము.
ప్రతి ఏటా ఉపాధ్యాయులకు , రచయితలకు కార్యశాలలు ఏర్పాటు చేయాలి. సమాజ ఆలోచనా విధానాలు కూడా మారాలి. మారుతున్న కాలం తో పాటు మనుషులు కూడా మారాలి. ఆ మేరకు పిల్లల ఆలోచనలకు అనుగుణంగా అవగాహన పెంపొందించడానికి ప్రయత్నాలు ప్రారంభించాలి , మొక్కు బడి ఆలోచనల నుంచి బయట పడాలి. రచనలు చేయడం ఒక్కటే సరిపోదు , మీరు రాసేది ఎందరు చదువుతున్నారు , ఎంతమందికి ఉపయోగ పడుతుంది ఆలోచించాలి. లేకుంటే మీ లక్ష్యం నెరవేరనట్టే .
Author
vedantasuri
vedantasuri
టి. వేదాంత సూరి, ఎడిటర్ , మొలక, పిల్లలకు తోలి సారిగా ప్రతి రోజు బాలలకు మొగ్గ అనే పేజీ ప్రవేశ పెట్టారు, తరువాత మొలక మాస పత్రిక ప్రారంభించారు. అదే విధంగా తోలి సరిగా తెలుగులో ఆన్లైన్ లో ప్రతి రోజు ఇవ్వడానికి గూగుల్ వారు అవకాశం ఇచ్చారు . రెండేళ్లుగా ప్రతి రోజు మొలక వస్తుంది. ఇంతవరకు 40 పుస్తకాలు రాశారు. అందులో 36 బాలల కోసం రాసిన పుస్తకాలే. పిల్లలూ మీరెలా ఉండాలి, పిల్లలూ మీరు మంచి విద్యార్థులు కావాలంటే, పిల్లల మనసులో ఏముంటుందో మీకు తెలుసా , జయహో పుస్తకాలు పేరు తెచ్చి పెట్టాయి. పిల్లలు మీరెలా ఉండాలి? జయహో పుస్తకాలు కన్నడ లోకి అనువాదం అయ్యాయి. maill id : molakanews@gmail.com
బాల్యం ఎంతో విలువైనది. వ్యక్తిత్వానికి పునాది వంటిది బాల్యం. పిల్లలకు ఈ వయసులో ఏది చెబితే అది అర్థం చేసుకుంటారు, అనుసరిస్తారు. లేకుంటే పెద్దలను చూసి అనుకరిస్తారు. చిన్నపిల్లలే కదా. అని మీరు అనుకుంటే పొరపాటు పడినట్టే. పెద్దల మనస్తత్వాలు, అలవాట్లు వారు నిరంతరం గమనిస్తుంటారు. పిల్లల పెంపకం విషయం లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇక పిల్లల రచనల విషయం లో కూడా ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. కథలు, గేయాలు, సంఘటనలు, జ్ఞాపకాలు వారికి నిరంతరం చెబుతుండాలి. యెంత చెప్పినా వారు నేర్చుకోవడానికి సిద్ధంగా వుంటారు . వారి అభిరుచులను గమనిస్తూ అందుకు అనుగుణంగా మనం నడుచుకోవాలి ఉంటుంది.
మారుతున్న కాలానికి అనుగుణంగా బాలల అభిరుచుల్లో, అలవాట్లలో మార్పులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారి మార్పులకు అనుగుణంగా పెద్దలలో కూడా మార్పు రావాలి. పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలి. పరిసరాలు, జంతువులు , పళ్ళు , కూరగాయలు, చెట్లు, పూలు, .. ఇలా ఒక్కటొక్కటిగా పిల్లలకు చెబుతుండాలి , నడవడిక, మర్యాద, స్నేహం, మిత్రులు, బంధువులు ,దుస్తులు. పరిశుభ్రత తదితరాలను పరిచయం చేస్తుండాలి.
విదేశాల్లో పిల్లలకు పాఠశాలకు వెళ్లక ముందే. డే కేర్ కు పంపిస్తారు. అక్కడ ఇవన్నీ అలవాటు చేస్తారు. ఇంగ్లీష్ భాష కూడా బాగా వస్తుంది. ఐదేళ్ల కు స్కూల్ కు వెళ్ళగానే నేర్చుకోవడం సులువవుతుంది.
ఇక మనకు గతం లో చదివిన చందమామ, బాల మిత్ర, బొమ్మరిల్లు కథలు ఈ తరం పిల్లలకు నచ్చక పోవచ్చు . వారికి తగిన కథలు, అర్థమయ్యే రీతిలో చెప్పవలసిన అవసరం వుంది. వారు ఇష్టపడే మాధ్యమాల ద్వారా చెప్పాలి. మనం అనుకున్నట్టుగా వారు ఉండాలనుకోవడం తగదు. వారి అభిరుచులకు అనుగుణంగా చదువులు, ఉండాలి. ఈ విషయం లో మనం విదేశాల వారు అనుసరించే విధానాలను అధ్యయనం చేయవలసిన అవసరం వుంది. మన దేశం లో పిల్లల అభివృద్ధిని కాంక్షించే వారంతా భవిష్యత్ కు అందమైన రూపు రేఖలు దిద్దేవారే. కానీ అటు సమాజం, ఇటు తల్లి తండ్రులు, మరో వైపు ఉపాధ్యాయులు, రచయితలు బాల్యాన్ని విస్మరిస్తున్నారు. మరో మాటలో చెప్పాలం

టే బాలల భవిష్యత్తు పైన సరైన అవగాహన ఉండటం లేదు ఇది విచారించతగిన అంశం. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. బాలలకు చేసేవన్నీ మొక్కుబడి పనులే కానీ చిత్తశుద్ధి తో మాత్రం కాదు.
కాలం తో పాటు మనుషులు, అవసరాలు, ఆలోచనా విధానాలు మారుతుంటాయి. అదే విధానంగా ఈ తరం బాలల్లో కూడా ఎంతో మార్పు వచ్చింది. కానీ వారి అవసరానికి సరిపడా వనరులు లేవు. ఈ మధ్య కరోనా వలన పిల్లల్లో మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వచ్చింది. మరి వారి కోసం ఎవరు ఏమి ఆలోచిస్తు

న్నారు.
ప్రస్తుతం బాల సాహిత్య రచనలు చేసే వారు కేవలం తమకు పేరు రావాలని, అవార్డులు కావాలని రాస్తున్నట్టుగా అనిపిస్తుంది.
ఇంగ్లీష్ లో ఆర్కే నారాయణ్, మార్క్ ట్విన్ వంటి వారి పుస్తకాలు ఎవరైనా చదివారా. ఎక్కడో జె. కె. రోలింగ్ లండన్ లో ఉంటూ హరీ పాటర్ పుస్తకాలు రాస్తే హైదరాబాద్ లో క్యూ ల్లో నిలబడి పుస్తకాలు కొనుగోలు చేసిన సంఘటనలు వున్నాయి కదా.మరి పిల్లలను ఆకట్టుకునే రచనలు ఎందుకు రావడం లేదు.
తెలుగు బాల సాహిత్యం లో రాసి పెరుగుతుంది కానీ వాసి ఉండటం లేదు. ఇంగ్లీష్ మాధ్యమం ప్రభావం మరింత పెరిగితే తెలుగు బాల సాహిత్యం మనుగడ కష్టం.
ఈ విషయం లో నిజాయితీ గల బాల సాహితీ వేత్తలు ముందుకు వచ్చి ఒక కార్యాచరణ రూపొందించు కోవాలి. పాత కథలను ఆధారం చేసుకుని పిల్లలకు అర్థం అయ్యే రీతిలో మార్చి రాయాలి, ఈ తరం పిల్లలు ఇష్టపడే రచనలు చేసి వారిని ఆకట్టుకోవాలి . అందరు కలిసి కట్టుగా ముందుకు వచ్చి మంచి సాహిత్యం కోసం కృషి చేయాలి, అలాంటి వారిని, సమాజం, ప్రభుత్వాలు ప్రోత్సహించాలి.

ReplyForward
|