అనగనగా రామాపురం అనే ఊరిలో రాధమ్మ అనే స్త్రీ ఉండేది .ఆమె చాలా మంచిది,తెలివైనది. ఆమె భర్త పేరు గోపాల్. అతడు చాలా మంచివాడే కానీ అహంకారం ఎక్కువ. అతడు బ్యాంకులో పని చేస్తూ ఉండేవాడు. వారు ఇద్దరికీ నలుగురు పిల్లలు. వారిలో ఇద్దరు మగవాళ్ళు, ఇద్దరు ఆడవాళ్లు. వారి పేర్లు. రవి, ఆనంద్, ఊర్మిల, శృతి. ఆనంద్ వాళ్ళ అమ్మ పోలిక. కాబట్టి అతడు చాలా మంచివాడు. కానీ ఆనంద్ కు కోపం ఎక్కువ. తనముందు తప్పు జరిగితే అక్కడికక్కడే వారిని శిక్షిస్తాడు.అతనికి అమ్మ మీద ప్రేమ ఎక్కువ. రవి,ఊర్మిల, శృతి వాళ్ళ నాన్న పోలిక కాబట్టి వారికి అహంకారం ఎక్కువ. రవి రాధమ్మ మీద ఎప్పుడూ కోప్పడుతూ ఉండేవాడు. తను మంచి చెప్పినా చెడు చెప్పినట్లుగానే అర్థం చేసుకునేవాడు. రవి ఎప్పుడూ రాధమ్మను తిడుతూనే ఉండేవాడు. ఆ మాటలకు రాధమ్మ చాలా బాధపడేది. ఊర్మిల తనకు ఎవ్వరూ సరిలేరు అంటూ గర్వపడుతూ ఉండేది. తను రాధమ్మతో తల్లి అని కూడా చూడకుండా తనతోనే అన్ని పనులు చేయిస్తూ ఉండేది. రాధమ్మ తనకు గర్వపడడం తప్పు అని చెప్తున్నా కూడా తను వినిపించుకునేది కాదు. ఊర్మిల ఏదైనా తప్పు చేసినా రాధమ్మ మీదకు నెట్టేసేది. ఇంట్లో వాళ్ళందరూ రాధమ్మను అవమానించేవారు. ఆ తిట్లు విని ఊర్మిల సంతోషించేది. రాధమ్మ తనలో తాను కృంగిపోయేది.
శృతి చాలా బద్ధకస్తురాలు.తను ఎప్పుడూ బయటనుండి ఏదైనా ఆహారం తెప్పించుకుని తింటూనే ఉండేది. తను ఎంత తినేదంటె రోజూ సుమారు ₹2000/-దాకా తిండి కోసం ఖర్చు చేసేది. రాధమ్మ తనకు“అమ్మా శృతి అలా తినవద్దు అమ్మా”,అని చెప్పినా వినిపించుకునేది కాదు. పైగా తను దొంగచాటుగా తినేది ఎందుకంటే గోపాల్ తను తినడం చూస్తాడని. ఒకవేళ గోపాల్ చూస్తే శృతి“నాన్న!నన్ను ఇవన్నీ అమ్మ తినమని చెప్పింది”,అని చెప్పేది. గోపాల్ ఆ మాటలను నమ్మి రాధమ్మను తిడతాడు. శృతి మాత్రం అమాయకురాలిగా నటిస్తూ ఉండేది. రోజూ ఇలా గొడవ జరుగుతుండడంతో ఇరుగు-పొరుగు వాళ్ళు గోపాల్ ఇంటికొచ్చి“మీరిలా గొడవ పడితే మా పిల్లలకు నిద్ర పట్టడం లేదు కాబట్టి మీరు గొడవ పడకండి”,అని హెచ్చరిస్తూ ఉండేవారు. ఈ విషయంలో కూడా గోపాల్ రాధమ్మదే తప్పు అన్నట్లు రాధమ్మను తిడుతూ ఉండేవాడు. ప్రతిరోజూ అలాగే జరుగుతుండేది. రాధమ్మ ఇవన్నీ చూసి“నేనెవ్వరికీ అవసరం లేదు”,అని అనుకుంటూ బాధపడేది. రాధమ్మ తన పిల్లలెవ్వరికి ఏ అనారోగ్య సమస్య వచ్చినా తను వారికి సేవ చేసి మామూలు స్థాయికి తీసుకొచ్చేది. కొన్ని రోజుల తర్వాత రాధమ్మకు జ్వరం వచ్చింది. ఆనంద్ చాలా బాధపడుతూ ధైర్యం చెబుతున్నాడు. ఆనంద్ గోపాల్ దగ్గరకు వచ్చి“నాన్న అమ్మకు జ్వరం వచ్చింది కాబట్టి నువ్వు వెంటనే డాక్టర్ కు ఫోన్ చేయి”,అంటూ కంగారుగా చెప్పాడు.గోపాల్ వినలేదు. ఎందుకంటే తనకు మాధవపురం అనే ఊరికి బదిలీ చేశారు. ఆనంద్ ఏడుస్తూ ఉన్నాడు. గోపాల్ అక్కడి నుండి మాధవపురానికి వెళ్ళిపోయాడు. ఆనంద్ కు ఏం చేయాలో తెలియక శృతి,ఊర్మిలల దగ్గరకు వెళ్ళాడు వారు నిద్రపోతున్నాడు. ఆనంద్ ఎంత నిద్ర లేపినా వాళ్ళు లేవలేదు. ఆనంద్ తన అన్నయ్య అయిన రవి దగ్గరకు వెళ్ళాడు. తను కూడా నిద్ర పోతున్నాడు. ఆనంద్ తనను లేపి జరిగిందంతా చెప్పి“అన్నయ్య! డాక్టర్ కు ఫోన్ చేయి అన్నయ్య,”అని వేడుకున్నాడు. రవి కోప్పడుతూ“జ్వరం మాత్రమే కదా వచ్చింది రెండు రోజులైతే అదే తగ్గిపోతుంది”, అనన్నాడు. ఆనంద్ బాధపడుతూ పక్కింటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి డాక్టర్ నంబర్ తీసుకుని, డాక్టర్ కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పాడు. కొద్ది సేపుతర్వాత డాక్టర్ ఇంటికి వచ్చి రాధమ్మను చూసి“పని ఎక్కువగా చేయడం వల్ల ఈ జ్వరం వచ్చింది”,అని చెప్పింది. మందులు ఇచ్చి డబ్బులు అడిగింది. ఆనంద్ తను రాధమ్మ ఇచ్చి దాచిపెట్టుకోమన్న డబ్బులను ఇచ్చాడు. డాక్టర్ ఆ డబ్బులు తీసుకుని వెళ్ళింది. ఆనంద్ డాక్టర్ ఇచ్చిన మందులను రాధమ్మకు వేసాడు. తను పడుకుంది. రవి, ఊర్మిల, శృతిలు నిద్రలేచి పాలు, బూస్ట్, హార్లిక్స్ అంటూ గట్టిగా అరిచారు రాధమ్మ ఆ మాటలు విని వెంటనే లేచి ఆనంద్“లేవొద్దమ్మా!”,అని చెబుతున్నా వినకుండా పాలు, బూస్ట్, హార్లిక్స్ సిద్ధం చేసి వారి దగ్గరకు వెళ్ళి పాలు, బూస్ట్, హార్లిక్స్ ఇచ్చింది. ఊర్మిల, శృతి లు బూస్ట్, హార్లిక్స్ తాగుతంటే రవి మాత్రం పాలు తాగి“జ్వరం వస్తే ఆలస్యంగా తీసుకొస్తారా?!”,అంటూ గట్టిగా అరిచాడు. రాధమ్మ ఏడుస్తూ రవి గదిలో నుండి వెళ్ళిపోయింది.కొద్ది రోజుల తర్వాత రాధమ్మకు జ్వరం తగ్గింది.గోపాల్ మాధవపురంలో బ్యాంకులో పని చేస్తుండగా రాజు అనే వ్యక్తి వచ్చాడు.అతడు ఒక రౌడీ అతడు చాలా చెడ్డవాడు. అతడు గోపాల్ దగ్గరకు వచ్చి అప్పు కావాలని అడిగాడు. గోపాల్ పక్కనే ఉన్న ఒక వ్యక్తి“ఇదిగో గోపాల్ గారు! ఇతని పేరు రాజు ఇతను చాలా చెడ్డవాడు,ఇతనొక రౌడీ,”అని మెల్లగా చెప్పాడు. గోపాల్ “రాజు గారు మీరు ఏ పని కోసం అప్పు అడుగుతున్నారు”,అని అడిగాడు. రాజు“ఇవ్వకపోతే నిన్ను చంపేస్తా! ”, అంటూ బెదిరించాడు. గోపాల్ జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పమని అంగరక్షకుడికి సైగ చేశాడు. పోలీసులు వచ్చి రాజును తీసుకుబోతుండగా రాజు“రేయి గోపాల్!నేను జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తాను,”అని బెదిరించాడు. గోపాల్ ఆ మాటలను విని కంగారుపడి తన పై అధికారులతో మాట్లాడి మళ్ళీ రామాపురాని బదిలీ చేపించుకున్నాడు. గోపాల్ ఇంటికొచ్చాడు. ఇంట్లో చూస్తే రాజు ఎప్పుడో వచ్చేశాడు. గోపాల్ లోపలికి వచ్చాడు. రాజు“రా గోపాల్! రా, జైలులో నుంచి ఎలా వచ్చాను అని అనుకుంటున్నావా, ఇదంతా నాకు మామూలే”,అని అన్నాడు. గోపాల్ “ఇప్పుడు ఏం చేయడానికి వచ్చావు?”,అని అడిగాడు. రాజు“నీ కుటుంబాన్ని చంపేయడానికి వచ్చాను”,అని అన్నాడు. గోపాల్ ను రాజు మనుషులు బంధించారు. ఆ సమయంలో రాధమ్మ వంటగదిలో వంట చేస్తుంది. ఆనంద్ లెక్కలు వ్రాస్తున్నాడు. రవి ఆట ఆడుతున్నాడు. ఊర్మిల టీ.వీ చూస్తుంది. శృతి తింటుంది. రాజు గోపాల్ పిల్లల గదిలోకి వెళ్లి పిల్లలను లాక్కొచ్చి వారి మీద కత్తి పెడుతూ“నీ పిల్లలను నేను చంపేస్తాను”,అంటూ గట్టిగా అరిచాడు.ఆ అరుపులు విని రాధమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. రాధమ్మ బాబు! నీకు దండం పెడతాను, వయసులో నీకంటే పెద్దదాన్ని అయినా నీ కాళ్ళు పట్టుకుంటున్నాను,నా పిల్లలను వదిలేయి”,అని వేడుకుంది.రాజు వినకుండా కత్తితో పొడుస్తుండగా రాధమ్మ అడ్డుగా వచ్చింది. కత్తి రాధమ్మకు బలంగా గుచ్చుకుంది.రాధమ్మ క్రింద పడింది. అందరూ కంగారు పడ్డారు. రాజు శృతిని పొడవబోతుండగా గోపాల్ రాజును కిందకి తోసాడు. కత్తి రవికి గుచ్చుకుంది రవి కూడా కింద పడ్డాడు. రాజూకి బల్ల తాకి క్రింద పడ్డాడు. గోపాల్ రాజు మనుషుల నుంచి తప్పించుకుని రాధమ్మను, రవిని ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. రవికి ముందే రక్తం చాలా తక్కువ. డాక్టర్ వచ్చి“గోపాల్ గారు రవికి రక్తం ఎక్కించాలి”,అని చెప్పింది. గోపాల్ కు మిగతా వారికి రవి యొక్క రక్తం లేదు. రాధమ్మ స్పృహలోకి వచ్చింది. డాక్టర్ జరిగిన విషయమంతా రాధమ్మకు చెప్పింది. రాధమ్మ వద్దన్నా వినకుండా రవికి రక్తం ఇచ్చింది. కొన్ని గంటల తర్వాత రవి స్పృహలోకి వచ్చాడు. డాక్టర్ జరిగిన విషయమంతా రవితో పాటు అందరికీ చెప్పింది. అందరూ కొన్నేళ్లుగా చేసిన తప్పులను తెలుసుకుని రాధమ్మకు క్షమాపణలు చెప్పారు. రాధమ్మ సంతోషించింది. కొద్ది రోజుల తర్వాత అందరూ ఇంటికొచ్చారు.రవి రాధమ్మ మీద కోప్పడడం మానేశాడు. ఊర్మిల గర్వపడడం మానేసి తల్లిని గౌరవించడం మొదలుపెట్టింది. శృతి ఎక్కువగా తినడం మానేసి తల్లిమాట వింటుంది. గోపాల్ కూడా తనను అర్థం చేసుకున్నాడు. అలా కుటుంబం అంతా సంతోషంగా ఉంది.
నీతి:అమ్మ ఏం చెప్పినా అది మన
మంచి కోసమే. కాబట్టి అమ్మ
ఏం చెప్పినా వినాలి.