Home కథలు అతిథి దేవోభవ

అతిథి దేవోభవ

అన్నపూర్ణ హోటల్‌ యజమాని విజయభాస్కర్‌కు ఇద్దరు కొడుకులు. పెద్దబ్బాయి సృజన్‌ డిగ్రీ చదువుతూ కూడా తండ్రికి చేదోడువాదోడుగా హోటల్‌ పనులు చేస్తున్నాడు. కానీ చిన్నబ్బాయి సుధీర్‌ మాత్రం అలా కాదు. తన స్వంత హోటల్‌లో పనిచేయటానికి కూడా నామోషీగా ఫీల్‌ అవుతాడు. ఎప్పుడు చూచినా టిప్‌టాప్‌గా టక్‌ చేసుకొని, టై కట్టుకొని మరీ స్నేహితులతో అల్లరిచిల్లరగా తిరగటమే అతని పని.
ఒకప్పుడు చిన్న షెడ్డులో ప్రారంభమైన కాఫీ హోటల్‌, అంచలంచలుగా వృద్ధి చెందుతూ ఇప్పుడూ పెద్ద హోటలై పోయింది. ఒరేయ్‌ సుధీర్‌ మన స్వంత పనులు చేసుకోవటానికి సిగ్గు పడకూడదురా! వీలు కుదిరినపుడు నువ్వు కూడా అన్నయ్యలాగా ఏదో ఒక పనిచేయరా! ఎందుకంటే మన జీవనాధారం ఈ హోటలే కాబట్టి. దీనివల్లే కదా మీరిద్దరూ డిగ్రీలవరకూ చదువుతూ వచ్చారు అని అమ్మ అన్నపూర్ణ అంటుంటే, వద్దమ్మా! ‘‘తమ్ముడికి పనిచెప్పకండి, వాడిని బాగా చదువుకోనివ్వండి’’ అంటూ సృజన్‌ తమ్ముణ్ణి పెద్దరికంగా సమర్థించాడు.
దాంతో సుధీర్‌ ఆగడాలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఒకవేళ ఎప్పుడైనా క్యాష్‌కౌంటర్‌లో కూర్చుంటే, కొంత డబ్బు కొట్టేసేవాడు. అలాగే స్నేహితులందరికీ టిఫిన్లు, కాఫీలు ఫ్రీగా ఇచ్చి, ఏదో పెద్ద ఘనకార్యం చేసిన వాడిలా కాలర్‌ ఎగరేసి మరీ ఫోజులు కొట్టేవాడు.
అన్నపూర్ణ హోటల్‌ రుచికరమైన టిఫిన్లకూ, అభిరుచిగల భోజూజనానికి మారుపేరుగా మారింది. అందుకే హోటల్‌ నిరంతరం జనంతో కిటకిటలాడుతోంది. హోటల్‌ నిర్వాహణలో భార్య అన్నపూర్ణ పాత్ర, నిరంతర శ్రమ ఎంతో ఉంది. అదంతా తన శ్రీమతి సమర్థవంతమైన ప్లానింగ్‌ మహిమేనని విజయభాస్కర్‌ విజయగర్వంగా అందరికీ చెపూతు ఉంటాడు.
కొడుకులిద్దరికీ ఘనంగా వివాహాలు జరిగాయి. ఇద్దరు కోడళ్ళు నలుగురు పిల్లలతో ఇల్లు కళకళలాడిరది. తల్లిదండ్రులు ఒకరి తరువాత ఒకరు కాలగమనంలో కలసిపోయారు. నాన్న చెప్పిన అనుభవసారాన్ని నెమరువేసుకుంటూ క్రమశిక్షణతో హోటల్‌ను నడుపుతున్నాడు సృజన్‌. కానీ తల్లిదండ్రుల కోసం గుండెనిండా బెంగ పెట్టుకున్నాడు.
ఇప్పుడు తమ్ముడి పరిస్థితి అదుపు ఆజ్ఞ లేకుండా పోయింది. నిజం చెప్పాలంటే రౌడీలా తయారయ్యాడు. సృజన్‌ చెమటోడ్చి సంపాదించిన డబ్బును దుబారాగా ఖర్చు చేస్తున్నాడు. ఇక ఇలా ఊరుకుంటే లాభం లేదని, ఒకటికి రెండుసార్లు సున్నితంగానే తమ్ముణ్ణి మందలించాడు. దాంతో ఇంకా రెచ్చిపోయి, అన్నయ్యను దుర్భాషలాడాడు.
సరిjైున సమయం దొరికింది కదా అని ఒక కొత్త పన్నాగాన్ని ప్రయోగించాడు సుధీర్‌. అయినా నాపై నీ పెత్తనం ఏమిటి? నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను. నన్ను కమాండ్‌ చేయాలని చూడకు. ‘‘నువ్వు పెద్దవాడివే అవ్వచ్చు, కానీ నీ హద్దుల్లో నువ్వుండు’’ అని ఆవేశంగా తిట్టేసరికి సృజన్‌కి కోపం తారాస్థాయికి చేరింది. అదీ కాస్తా కొట్లాటకు దారితీసింది.
అంటే ఏమంటావ్‌? అని సృజన్‌ తమ్ముణ్ణి నిలదీశాడు. నీకు దమ్ముంటే ఆస్తిలో నీ వాటాను నాకు పంచేయ్‌! అని అన్నయ్యను రెచ్చగొట్టాడు సుధీర్‌. ఇది చాలదు అన్నట్లు తోడికోడళ్ళు ఇద్దరూ రంగంలోకి దిగి, అక్కడ భయంకరమైన దృశ్యాన్ని సృష్టించారు. ఆ సమయంలో నాన్న చెప్పిన అమృతవాక్కులను గుర్తు చేసుకున్నాడు సృజన్‌. నీకు ఎలాంటి కష్టాలు, సమస్యలు ఎదురైనా సహనాన్ని పాటించు. అప్పుడు నీ యొక్క సహనమే నీ సమస్యలకు పరిష్కారాలను కూడా చూపిస్తుంది ` నాన్న.
నీవు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఇంట్లో గొడవ జరిగిన వారం తరువాత సామరస్య వాతావరణం నెలకొంది. అనేక గందరగోళ ఆలోచనలతో సృజన్‌కు నిద్రలేకుండా పోయింది. ఇప్పుడు తను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావటంలేదు. ఇక చేసేది లేక ఆస్థిని రెండు భాగాలుగా పంచుకున్నారు అన్నదమ్ములు.
ఎవరికివారు సపరేటుగా హోటళ్లు పెట్టుకున్నారు. అమ్మ నాన్నకు సహకరించినట్లే, సహధర్మచారిణి హిమజ కూడా సృజన్‌తో కలసి అన్ని పనులూ ఓపికగా చేస్తోంది.
కానీ సుధీర్‌కు భార్య సునంద సహకారం అంతంత మాత్రంగానే ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరికీ అతి తెలివితేటలు ఎక్కువ. ఆచరణ తక్కువ. చేస్తున్న వంటల్లో శుచి, శుభ్రత పాటించేవాళ్ళు కాదు. దీనివల్ల చేసిన వంటకాలు తొందరగా పాడైపోయేవి. దానికి తోడు కష్టమర్లు ఎక్కువగా తినకుండా ఉండటానికి అన్నంలో సున్నం కలిపేవాళ్ళు. పైకి ఘుమఘుమల వాసనలు బాగా వచ్చేవి. తీరా తిందామనుకునేవారు తినలేకపోయేవారు. సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉన్నా దాహం తీర్చుకోలేని పరిస్థితిలా ఉండేది వారి దుస్థితి.
కూరలు, సాంబారుల్లో గూబగుయ్యిమనిపించే కారం వేసి, పట్టపగలే నక్షత్రాలు కన్పించే బిల్లు చేతికిచ్చేవారు. పాపం గొడ్డుకారం తట్టుకోలేక కష్టమర్లు బెంబేలెత్తి పారిపోయేవారు.
ఇదేంటండీ? మీరు గొడ్డుకారం వంటకాలు వడ్డిస్తే మేము మాత్రం ఎలా తింటామనుకుంటున్నారు? అని జనం నీలదీసి అడిగేసరికి ‘‘మీరు తింటే తినండి లేకపోతే బయటకుపొండి’’ అంటూ సునంద తిట్ల దండకం మొదలుపెట్టింది.
చూడండి! అక్కడ మీ అన్నయ్యగారి హోటల్‌లో టిఫిన్లతోపాటు భోజనాలు కూడా ఎంతో రుచికరంగా ఉంటున్నాయి. అక్కడ భోజనంలోకి అరటిపండో, మామిడిపండో వడ్డిస్తున్నారు. అవి లేకుంటే ఏదైనా స్వీటుని స్పెషల్‌గా ఇస్తున్నారు. అంతేకాదండీ! ఆ హోటల్‌లో భోజనంచేసిన తరువాత వక్కపొడి, సోంపు, పాన్లు కూడా ఇస్తున్నారు అని ఒక వ్యక్తి ధైర్యంగా సుధీర్‌ని క్లాస్‌ తీసుకున్నాడు.
అప్పుడు మళ్ళీ సునంద కళ్ళెర్రజేసి, అతని మీదకు విరుచుకుపడిరది. మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ‘‘మా హోటల్‌లో నచ్చితే తినండి, లేకపోతే బయటకుపొండి’’, మా హోటల్లో తిన్నవారికి పట్టు చీరలివ్వటం, పేరంటటాలు చేయటం, తాంబూలాలివ్వటం లాంటి చెత్త మర్యాదలు చెయ్యటం మావల్ల కాదు. వంటల్లో కల్తీ వంటనూనెలు వాడటం, నిల్వ ఉంచిన కూరలు, సాంబర్‌లు వడ్డీంచడం, ఎక్కువగా జరగడంతో జనం ప్రభుత్వానికి కంప్లయింట్‌ ఇచ్చారు. దాంతో ఫుడ్‌ఇనస్పెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు చేసి కేసు బుక్‌ చేశాడు. అలాగే 5వేల రూపాయలు జరిమానా విధించారు. ఇది మొదటిసారి కాబట్టి కేవలం వార్నింగ్‌ ఇచ్చామని, లేకుంటే జైలుశిక్ష కూడా విధించే అవకాశముందని కోర్టులో మేజిస్ట్రేట్‌ తీర్పునిచ్చారు.
ఇంత జరిగినా తమ తప్పులను వీరిద్దరు సరిదిద్దుకోలేకపోయారు.
రోజు రోజజుకీ ఆమె కొట్లాటలు మితిమీరిపోయాయి. హోటల్‌ దివాలా స్థాయికి చేరుకొంది. ఆ కారణంగానే సుధీర్‌కి సహనం, అశాంతి బాగా పెరిగిపోయాయి. అవి తట్టుకోలేకే చిటికీమాటికీ సునందను తిట్టటం, మొదలుపెట్టాడు. ఒకరోజు ఉక్రోషంతో ఆమెను చావబాదాడు.
సునంద అహం దెబ్బతిన్నది. అసలు మీకు బిజినెస్‌ చేయటం చేతకాక నన్ను కొట్టటం ఏమిటి? అని భర్త సుధీర్‌ని ఆవేశంతో చెంపదెబ్బకొట్టింది. ఇంట్లో జరిగిన ఈ గొడవతో పిల్లలు భయభ్రాంతులకు లోనయ్యారు. ఇంట్లో అందరూ కలసి భోజనం చేసి ఎన్నో రోజులైయ్యింది. పాపం పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారు.
సుధీర్‌ ఇద్దరమ్మాయిలూ బిక్క ముఖంతో పెదనాన్నింటికి వెళ్ళారు. వీళ్ళిద్దరూ చెప్పిన విషయాలు విని పెద్దమ్మ, పెదనాన్న ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఆ తరువాత కొంత సమయానికి తేరుకొని పిల్లలతో కలసి భోంచేశారు.
పెదనాన్న మీరే ఎలాగైనా మా అమ్మకు, నాన్నకు సహాయం చేయాలి. ప్రస్తుతానికి అమ్మా నాన్నల దగ్గర డబ్బులు అసలే లేనే లేవు అని చెపుతూ బోరున ఏడ్చేశారు ఇద్దరమ్మాయిలూ.
సృజన్‌ పేరుకు తగ్గట్టు చాలా సున్నితమైన మనసున్న వ్యక్తి. తను చెబితే తమ్ముడూ, మరదలూ వినకపోవచ్చని భార్య హిమజను సుధీర్‌ ఇంటికి పంపించాడు. మళ్లీ అందరూ కలిసుండటానికి సుధీర్‌, సునంద ససేమీరా ఒప్పుకోలేదు. అప్పుడు సృజన్‌ రంగంలోకి దిగి హోటల్‌ బిజినెస్‌ నష్టాల్లో మునిగిపోయిన తమ్ముణ్ణి ఓదార్చాడు.
మొత్తానికి అన్నయ్య, వదినల ప్రేమా ఆప్యాయతలకి సుధీర్‌, సునందలు కరిగిపోయారు. నన్ను క్షమించు అన్నయ్య అని అంటూ, ఇంతకీ నీ హోటల్‌ బిజినెస్‌కి ఎక్కువగా లాభాలు రావటానికి గల రహస్యాలేమిటి? అని వినయంగా అడిగాడు.
తమ్ముడి పశ్చాత్తాపంతో అడిగిన మాటలకు సృజన్‌ కళ్ళు చమర్చాయి. ఆ రోజుల్లో నాన్న చెప్పిన మాటలు సృజన్‌ గుర్తుచేసుకొని చెపుతున్నాడు.
ప్రతీ వ్యాపారంలో లాభనష్టాలు చాలా సహజమైనవి. ప్రతి బిజినెస్‌లోనూ కష్టమర్లు ఉంటారు. కానీ మన హోటల్‌ కూడా ఒక బిజినెస్సే అని అందరూ అనుకుంటారు. ఈ హోటల్‌ వ్యవస్థలో వ్యాపారం కన్నా సేవాభావం చాలా ముఖ్యమైనది.
హోటల్‌ కొచ్చేవారంతా అన్నార్థులే. అందుకనే మనకు లాభం రాకపోయినా, రుచికరమైన, నాణ్యమైన ఫలహారాలను, భోజనాన్ని అతిథులకు వడ్డించాలి. మనంగానీ మంచి రుచికరమైన వంటకాలు వండి వడ్డిస్తే హోటల్‌ బిజినెస్‌లో నష్టం రానే రాదు. ఒకవేళ అధిక లాభాలు రాకపోయినా, నష్టాలు మాత్రం రానే రావు.
అందుకనే హోటల్‌కి వచ్చే వాళ్ళందరూ అతిథి దేవుళ్ళే, కష్టమర్లు కానేకాదు అని నాన్నగారు ఆనాడు చెప్పిన మాటలను సృజన్‌ చెపుతూ ఉంటే అందరూ శ్రద్ధగా విన్నారు. ఆ తరువాత అందరూ కలసి విందు భోజనం చేశారు.
మళ్లీ అన్నపూర్ణ హోటల్‌ అతిథిదేవుళ్ళతో కళకళలాడుతోంది.

                    అతిథి దేవోభవ

You may also like

2 comments

శోభనాచలంకేశబోయిన July 9, 2022 - 6:55 am

కాశీ! మీకధావస్తువు, కదనం బహు బాగు బాగు! రాను రాను కదనంలో పదును పెరుగుతోంది. పరిపక్వత కనిపిస్తోంది. మీరిలాగే సామాజిక స్పృహతో పలు సందేశాత్మక కధలు అందించాలని కోరుకుంటూ ……మిత్రుడు చలం

Reply
Konduri Kasi visveswara rao July 9, 2022 - 4:17 pm

Thank you so much for your valuable comments and encouragement.

Reply

Leave a Comment