అమ్మ నవ్వితే…
గుత్తులు గుత్తులుగా పూసిన
శిక్కుడు పూల లెక్కుంటది
అమ్మ కోపం చేస్తే…
పడమటేల సూరీడు
సుర సుర కాలినట్టుంటది
అమ్మ ప్రేమ చూపితే…
తేనె జడి వానలో
నిలువునా తడిసినట్టుంటది
అమ్మ యెదకద్దుకుంటే…
ఏండ్ల నాటి భారమంతా
ఒక్కసారిగా తీరినట్టుంటది
అమ్మ నా నెత్తి నిమిరితే…
వెయ్యేనుగుల బలం
ఒంట్లో చేరినట్టుంటది
1 comment
అమ్మ కోపానికి నడినెత్తిన సూర్యుణ్ణి కాకుండా పడమటి సూర్యుణ్ణి ఉపమానంగా తీసుకోవటం గొప్పగా ఉంది. కాసేపటిలో చల్లబడే వాడు కదా పడమటి సూర్యుడు! అమ్మ కోపం మాత్రం ఎంతసేపుంటుంది గనక!