సీసమాలిక. ఏదివిమోచనో ఏదివిలీనమో
తెల్యనిస్థితిలోన దేశజనులు
దేశరాష్ష్రాలలో తీరులు వేరయ్యి
రాజకీయాలతో రగులుతుండె
కొందరువిద్రోహ మిదటంచుపల్కగ
వివిధవాదనలకు వేదికయ్యె
ప్రత్యేక ప్రాంతపు పరిరక్షణనుచేసి
నప్పగించవిమోచనందురింక
ప్రాంతమునింకొక ప్రాంతమందునకల్ప
అదివిలీనంబౌను యిదియెనిజము
వాస్తవాలవదిలి పార్టీల గెలుపుకై
పోరాటచరితను బుగ్గి చేయ
కల్పితగాధల కనికట్టుజేయుచు
వక్రీకరించిందె వాస్తవమని
జనులభ్రమలనుంచ సభలనుజరుపుచు
ఏత్తులపైయెత్తు లేయుచుండె
అధికారముకొఱకై అర్రులు సాచుచు
పాలనేధ్యేయమై పరుగులెట్టి
రైతుసమస్యల రాజకీయముచేసి
ప్రైవేటు వ్యక్తుల పరముచేయ
ప్రజలబాగోగులు పట్టించుకోకుండ
పాలకులమనుచు పాలనేల
అప్రజాస్వామ్యమే ఆదర్శపాలనా
ఆప్రజాస్వామ్యమే అంతరించె
తే.గీ ప్రజలపాలనపేరిట పార్టిలన్ని
కోట్లు కూడగొనుచునుండి ఓట్లుకొనుచు
ఎవరియిచ్చవచ్చినరీతి యేలవట్ట్రి
న్యాయమడిగినోళ్ళందర్కి నణచవట్రి.