Home కవితలు నట్లు

పంకం నుంచి పద్మం వచ్చినట్లు

పాలనాంకం  నుండి సుంకం వచ్చినట్లు

తత్వం నుండి సత్యం వచ్చినట్లు

స్వరాజ్యం కోసం తిలక్ ఉదయించినట్లు

కాంగ్రెస్ నుండి గాంధీ వచ్చినట్లు

సంస్కరణ కోసం కందుకూరి ఉద్యమించినట్లు

ఆదర్శ మే మూడో పాదం గా గురజాడ అడుగు పడినట్లు

భాషపై వ్యవహార పిడుగు గిడుగు పడినట్లు

ఒక చాణుక్యుడి నుండి కౌటిల్యుడు వచ్చినట్లు

ఒక  సంకల్పం నుండి నెహ్రూ వచ్చినట్లు

సాహసం నుండి నేతాజీ వచ్చినట్లు

ధృఢ సంకల్పం నుంచి సర్దార్ వచ్చినట్లు

పౌరుష సందర్భం నుండి ప్రకాశం వచ్చినట్లు

విభిన్నత నుండి జిన్నా వచ్చినట్లు

ధిక్కార స్వరం నుండి అంబేడ్కర్ వచ్చినట్లు

ఛందస్సు నుంచి పద్యం వచ్చినట్లు

వికాసం కొరకు పౌరహక్కులొచ్చినట్లు

సమాజం నుండి సంక్షేమం వచ్చినట్లు

అత్యాశ  నుండి అవినీతి వచ్చినట్లు

పరిపక్వత నుండి పీవీ వచ్చినట్లు

ధిక్కార స్వరం నుండి కాళోజీ వచ్చినట్లు

ప్రపంచంలో భారత్ ఎదిగినట్లు భిన్నత్వంలో ఏకత్వం మిగిలిన

You may also like

Leave a Comment