సీ. రైతులే మనకు పోరాట పటిమ చూపి
విజయమ్ము సాధించి వీరులైరి
ఎందరో ప్రాణాల నిట్టెనొదిలినను
స్ఫూర్తిని వీడక సోయి తోడ
రాజ్యహింసలనన్ని రైతులు భరియించి
పడరాని కష్టాల పడతులు పడి
పట్టు సడలకుండి ఫలితము సాధించ
ప్రాణాలనిచ్చిన భరతరైతు
తే. జలము విద్యుత్తు లేకున్న జంకులేక
భాష్పవాయుతొ ప్రభుతయు బాధలేట్టె
కార్ల నెక్కించి చంపిన కదలకుండ
వెన్ను చూపులే రైతులు విజయులైరి
సి. అంగట్లో వడ్లన్ని ఆగమై పోవట్టె
వానకు తడిసియు వరదమునిగె
వడ్లు తడువకుండా పాలకవర్గము
శాశ్వత షెడ్లను సత్వరమ్మె
నిర్మించ చేపట్ట నిధులనీయవలెను
వడ్లన్ని కొనలె వడివడిగను
రైతు జాగరణలు రాత్రి పగలు లేక
అమ్ముకొనవలెను అలుపులేక
తే. రైతు బాగున్న దేశమ్మె రంగులీను
వానకాలము వడ్లపై వాదనేల
ఎండకాలమువడ్లకు నిప్పుడేల
ఉన్న దాన్యాన్ని కొనకుండ ఉచితమేన
సీ. రాష్ట్రములోనున్న రైతులందరు నింక
వరిని సాగును చేయబందుపెట్టు
పత్తిమిరప పంట పండించవలె నింక
వ్యాపార పంటలే పాడియౌను
రైతుల స్థితియేమొ రంగుల బతుకులౌ
రాను రానేమౌనొ రాష్ట్ర జనము
రాష్ట్రము వరికొన రంగుల రాట్నాల
పైనె రైతును తిప్పి పంపుతుండు
తే. కాలిమీద కాలెస్కుంటె కఱువు తీరు
చిన్న ధాన్యాలెయిక నుండి చిఱుతిండ్లె
అన్నమనుమాని రొట్టెలె యందరు తిన
జనులు ఆరోగ్యవంతులై చనుదురింక
సీ కవులేమొ కొందరు కౌలుదార్లుగ పార్టి
వారలకు కవితలు వ్రాయుచుండి
పథకాలనన్నియు ప్రభుత పెట్టిరటంచు
అతిశయోక్తులతోడ నల్లుకొనుచు
కవితల పద్యాల కాగితాల నింపగ
గాయకుల గళాలో గానమొప్ప
ఆిపాడెదరుగ అన్ని సభలయందు
పదవులు ప్రజాకవులను బందిజేసె
తే. పాలనల్జేయ పాలకవర్గముండె
పాతకొత్త పార్టీలన్ని బదురుకొనియు
వివిధ రాష్ట్రల నేలుచు పేద జనుల
బాధలను తీర్చగనెవరు వత్తురయ్య