Home బాల‌సాహిత్యం పల్లెటూరి అబ్బాయి

పల్లెటూరి అబ్బాయి

by Parsa Mounika

రామా పురం అనే గ్రామంలో రాజు అనే ఒక అబ్బాయి ఉన్నాడు. అతనికి అమ్మ,నాన్న ఎవరు లేరు .అతను ఒక అనాధ. రోజు ఊరివారందరి దగ్గర అడుక్కుని తినేవాడు. ఒక రోజు అతనికి చాలా ఆకలి వేసింది.అతనికి ఎవరు ధర్మం చేయలేదు. పాపం ఆ అబ్బాయి వీదులన్ని తిరిగాడు .అయినా తనకు ఎవరూ ధర్మం చేయలేదు .
ఆకలితోనే నడుచుకుంటూ ఆ గ్రామం చెరువు ఒడ్డుకు వెళ్లాడు .అక్కడికి వెళ్ళగానే తను కళ్లు తిరిగి పడిపోయాడు .అప్పుడే అక్కడికి ఒక పెద్దావిడ వచ్చింది. అతనిని చూసి చాలా జాలివేసి వెంటనే అతని పైన కొన్ని నీళ్ళు చల్లింది .అతను వెంటనే లేచి చాలా కృతజ్ఞతలు అని ఆ పెద్దావిడకు చెప్పాడు .
అప్పుడు ఆ పెద్దావిడ ” నీవు ఎవరు బాబు, ఇక్కడికి ఎందుకు వచ్చావు ,కళ్లు తిరిగి ఎందుకు పడిపోయావు “అడిగింది.. అప్పుడు ఆ అబ్బాయి నేను ఒక అనాధ నని చెప్పాడు . తనకున్న కష్టం అంతా చెప్పాడు.అప్పుడు ఆ పెద్దావిడ
” అయ్యో పాపం ,జరిగినదంతా ఒక పీడ కలలా మర్చిపోయి నువ్వు నాతో వస్తే, నేను నీకు ఏది కావాలంటే అది కొనిస్తాను .పాఠశాలలో మంచి చదువు చదివిస్తాను.ఇంకా నువ్వు సంతోషంగా బ్రతుకచ్చు “అని చెప్పి అతనిని తీసుకొని వెళ్ళింది.
అతను ఆ పెద్దావిడ తో కలిసి ఆమె ఇంటికి వెళ్ళాడు. పెద్దావిడ రాజు ను పాఠశాలలో చేర్పించింది.కొన్ని సంవత్సరాలలో అతని జీవితం మారిపోయింది.తరగతిలో ఎంతోమంది స్నేహితులు పరిచయమయ్యారు.ఆ అబ్బాయిని పెద్దావిడ తల్లి లా పెంచుతుంది. ఇప్పుడు అతను అనాధ కాదు.

***
పర్స మౌనిక
8 వ తరగతి
ZPHS జక్కాపూర్
సిద్దిపేట జిల్లా, తెలంగాణా
సెల్ :9989488156

You may also like

1 comment

కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి October 29, 2021 - 5:55 am

బాగుందమ్మా! కాస్త వివరంగా అల్లితే చక్కని కథ ఆవిర్భవిస్తుంది. శుభమస్తు.

Reply

Leave a Comment