పిడికిళ్ళు బిగుసుకుని
సంకెళ్ళు సడలినట్లు
ఛాతీలు ఉప్పొంగి
జైలుగోడలు బ్రద్దలై కూలినట్లు
స్థంభించిన గాలి
ఒక్కసారిగా నలుదిశలా వీచినట్లు
కలలు నిజమై
కళ్ళు తారకలైనట్లు
రెక్కలు రెక్కలై
ప్రతి మనిషీ స్వేచ్ఛావిహంగమై
నింగిలోకి ఎగిరినట్లు
నాటి జనుల భావోద్వేగాలు
నేటి మన హృదయ ప్రకంపనల్లో
మూడు రంగుల రెపరెపల్లాగా
నూరు కోట్ల కెరటాల్లాగా
వందేమాతరం! జైహింద్!
… సి యస్ ఆర్