సిగాచీ చిరుపరిశ్రమ
రమేశ్ నల్లగొండ
Ramesh
7.నల్లగొండ రమేశ్...తండ్రి పేరు నారాయణ తల్లి పేరు అహల్య.ఊరు: ఆసిఫాబాద్ వృత్తి ఉపాధ్యాయులు. ప్రవృత్తి సాహిత్యం సేవ,తెలుగుభాషా సేవ. పదవతరగతి(1991) నుండే కవితలు రాయడం మొదలు... తొలినాళ్ళలో శ్రీ శ్రీ ప్రభావం ఎక్కువ.... సినారె,ఆరుద్ర,తిలక్ ల ప్రభావం నా పై మెండుగా ఉంది... కాలక్రమేనా విస్తృత అధ్యయనం.. శివారెడ్డి, సిధారెడ్డి.శేషేంద్ర శర్మ,ఆచార్య గోపి,అజంతా, బైరాగి శివ సాగర్, చెరబండరాజు,వరవరరావుఇస్మాయిల్...మొదలుకొని యువనవ కవుల కవితలు చదవడం రాయడం...అలవాటైంది... విస్తృత పఠనం, కవితా పిపాస,,నా కవితా అధ్యయనం,పత్రికల్లో కవితా సమీక్షా వ్యాసాలు శివారెడ్డి గారి కవిత్వం ,వారి దీవెనలు, సిధారెడ్డి గారిసాహితీ ఆశీస్సులు,మంజీర రచయిత సంఘం you tube కవిత్వ పాఠాలు,ప్రత్యక్షంగా వారి సంభాషణ,మెళకువలు నాకుచాలా ఉపయోగపడ్డాయి. ఆసిఫాబాద్ లో మడిపెల్లి భధ్రయ్యగారి కవి సమ్మేళనాలలో పాల్గొనడం..... ఆకసం:2011 డిసెంబర్ 4 వ తేదిన సాహితీ సమావేశాలను ప్రారంభిం చటం... తదనంతరం ఆ సమావేశాలే ఆకసం( ఆసిఫాబాదు కవుల సంగము) గా రూపాంతరం చెందటం...జరిగింది ఆ రకంగా ఆకసం ను 2011 లో నేను స్థాపించడం మరియు దానికి 11 సంవత్సరాలు అడ్మిన్ గాను కార్యదర్శి గాను ఆకసం ఎదగటంలో ముఖ్యభూమిక పోషించాను. తెలుగు రాష్ట్రాలలో గొప్ప వేదిక నిలుస్తోంది. అనేక మంది క్రొత్త కలాలకు ప్రోత్సాహంగా ఉంటోంది. రచనలు :1 సినారె గారి దివ్య ఆశీస్సులతో 2013 సంవత్సరం లో 'సిరివెన్నెల'దీర్ఘ వచన కవితా పుస్తకం 2.2016 లో 'పెద్దవాగు గలగలలు' దీర్ఘ కవిత 3. 2021 లో 'సంక్షోభ స్వరం '( కరోనా నేపధ్యంలో)చిరు కవితా సంపుటి ఉదారి నారాయణ గారిచే ఆవిష్కరణం. అనేక కవితలు దిన,వార,మాస మరియు అంతర్జాల పత్రికలలో ప్రచురితం... :వలస కూలీ'...కవిత "తెలంగాణ సాహితి...&ప్రేరణ ఫౌండేషన్" వారిఅంతర్జాతీయ కవి సమ్మేళనం లో ప్రత్యేక బహుమతిని అందుకుంది రైతు ధ్వజం కవిత( రైతుల ఢిల్లీ లో ధర్నా...నేపథ్యంలో) "సుందరయ్య విజ్ఞాన కేంద్రం" వారి అంతర్జాతీయకవితల పోటిలో ద్వితీయ బహుమతి కైవసం. సుధామ గారు నిర్వహిస్తున్న "ఓసారి చూడండి అంతే" వాట్సాప్ గ్రూప్ నిర్వహించిన 2022 దసరా కవితా పోటీలో "సముద్రమంత దుఃఖం" కవిత తృతీయ స్థానం రావడం ఆనందంగా ఉంది. అనేక zoom వేదికల జాతీయ, అంతర్జాతీయ కవి సమ్మేళనాలలో పాల్గొనడం జరిగింది.

2 comments
https://shorturl.fm/fa6nW
https://shorturl.fm/DYo0o