సర్గ : 2
అక్కడే మేలుకొన్నది ఆలోచనాలోకం ,
ఎక్కడికో పరిగెడుతున్నది మానసం ;
భిన్నభ్రమలను కూడదీసుకుని ,
తనకుతానే నిలిచెను ఒంటరిగా !
నిత్య వికసిత యవ్వనదీప్తి ,
ముగ్ధవసంత బాల్యవిముక్త ;
అరుణచాప అపురూప విలసిత,
ఎగిసిపడినది యజ్ఞజ్వాలలా!
కలత చెందిన కోరికలు ,
క్రూర వాస్తవ విలోకనలు;
సర్వం కరిగిన కాలంతెరలు,
-2-
స్వరబద్ధాలంకృత శిధిల వాద్యాలు!
లోపలి సూర్యుని నిద్రలేపెను,
వడిగా చీకటి పారిపోయెను ;
ఎప్పటినుంచో హత్తిన నీడ ;
అన్నిటినుండీ లిప్తను వీడెను!
సకల అస్మితలు ఓడిపోయినవి,
మాన్యతాయుత ముకుటము తొలగె ;
యాచన కోరిన శరణాగతిగా,
వికృతరూపము దీక్షగబూనె!
అటు ఇటు ఏవో ఆలోచనలు,
అతులిత సమయస్మృతి కదలె;
స్వయంవరం అది ఎవరి కోసమో ,
ఆమెయే నేడు అభిశప్త భాగ్య!
-3-
జనకుడు వరుని వెదకిన వేళ ,
ఆహ్వానించెను రాజవీరులను;
చివరకు పడినది దావానలమున,
నూతనరూప శపిత మోసమున!
పరమ ప్రియతముని వరించవలయు,
అయినను కానదు మనోహరుని;
పాండుపుత్రుని ప్రతిష్ట వెలిగె,
సూతపుత్రుడు కళంకమొందె!
అచ్చట నిలిచిరి ఇద్దరు వీరులు, అద్వితీయ దీప్తిమంతులు,
విజయునే వరింపవలసె , రాధేయుని వెడలగద్రోసె;
క్షాత్రతేజమున విరాజిల్లినా, నాధుడుమాత్రం కాలేడు,
కిరీటికి సరిసమానుడు , వివశవదనుడై వెనుదిరిగె!
******
గుజరాతీ మూలం , హిందీ అనువాదం : డా. వినోద్ కుమార్ జోషి