Home బాల‌సాహిత్యం ” పసి పిల్లలు ” (బాలగేయం)

” పసి పిల్లలు ” (బాలగేయం)

by Gadwal Somanna
పసి పిల్లలు వేల్పులు
జగతి ప్రగతి బాటలు
వెలుగునిచ్చు భానులు
నింగిలోని  తారలు
       ముద్దులొలుకు పిల్లలు
       ముద్దబంతి పువ్వులు
       మురిపించే మువ్వలు
       విహరించే గువ్వలు
ఇంటిలోన దివ్వెలు
కంటిలోని పాపలు
ప్రాణమున్న బొమ్మలు
ఫలములిచ్చు తరువులు
         వెన్నెలమ్మ జల్లులు
         వెన్న వంటి మనసులు
         సొగసుల హరివిల్లులు
         తెల్లని సిరిమల్లెలు
కన్నవారి ఆశలు
వారి గుండె శ్వాసలు
బాధ్యతగల పౌరులు
భారతమ్మ వీరులు
-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు, సెల్:9966414580
—–హామీ పత్రం——
మయూఖ పత్రిక సంపాదకులకు నమస్కారం. ఈ గేయం నా సొంత రచన.అనువాదం, కాపీ కాదని హామీ-గద్వాల సోమన్న

You may also like

1 comment

రాథోడ్ శ్రావణ్ March 2, 2023 - 5:37 am

చాలా చాలా బాగుందండీ

Reply

Leave a Comment