Home వ్యాసాలు స్త్రీల సాధికారత

స్త్రీల సాధికారత

by Kondapally Neeharini

భారతీయ సమాజంలో కుటుంబం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. జీవన సరళి మొత్తం కౌటంబిక వ్యవస్థ పైన ప్రముఖ స్థానం ఇస్తుంది .ఉజ్వలమైన స్త్రీల భవిష్యత్తును అంధకారంలో పడేసే దుష్టశక్తులు ఏవో పసిగట్టి దుర్మార్గులను కృష్ణ జన్మాస్థానానికి పంపించినప్పుడే న్యాయం జరుగుతుంది. లైంగిక వేధింపులు చేసే ఆ దుర్మార్గులైన వాళ్ళను శిక్ష గురి చేసేలా కృషి చేయవలసిన బాధ్యత సమాజానిదే. మానసికంగా స్త్రీల ను కృంగీదీసి శారీరక శ్రమను దోచుకుంటారు. స్త్రీల సాధికారతకు స్త్రీలపై వివక్షకు ఏంటి సంబంధం?  సరైనటువంటి అభిప్రాయాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.వివక్ష లేకుండా ఉంటే సాధికారత సాధనకు సాధ్యమవుతుంది.

2001 సంవత్సరాన్ని భారతదేశ మహిళా సాధికారత దినోత్సవం గా ప్రకటించారు సాధికారత అంటే ఏమిటి? అంటే స్వేచ్ఛగా ఉండడం. స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం  కాదు. సామాజికంగా ఆర్థికంగా బలోపేతం చేయడానికి స్వేచ్ఛగా ఉండడం అని అంటాం. సాధికారతను సాధించుకున్నారని అంటాం. ఆడవాళ్లు స్వశక్తిపై ఒక నమ్మకం కలిగి ఉండేలా జెండర్ డిస్క్రిమినేషన్ అనేది లేకుండా ఉండేలా చూడడం నిర్ణయాధికారాలు ఉండడం. ఒక సానుకూలమైన దృక్పథం కలిగి ఉండడం. వాళ్ళలోని నైపుణ్యాలను సృజనాత్మకతను వ్యక్తం చేసుకొనే అవకాశం ఇవ్వడం.వీటికి ముఖ్యమైన విషయాలు మూడు విధాలుగా చెప్పుకున్నట్టయితే,

1. ఆర్థికంగా బలోపేతంగా ఉండడం

2. సామాజికంగా బలోపేతంగా ఉండడం

3. రాజకీయంగా బలోపేతంగా ఉండడం

 1 ఆర్థికంగా బలోపేతంగా ఉండడం అనే విషయాన్ని తీసుకున్నప్పుడు భారతదేశంలోని మహిళలకు ఒక ప్రత్యేకమైన హోదాను మన రాజ్యాంగంలో పొందుపరిచారు 14,15 నిబంధనల ప్రకారం సమానత్వం కలిగి ఉండడం వివక్ష చూపకుండా ఉండడం. స్త్రీలందరికీ సమాన అవకాశాలు కల్పింప చేయడం. ఇలాంటి చట్టాలలో స్త్రీలతో పాటు

పిల్లలనూ కొన్నింటికి జత చేశారు. పని వేతనాలలో తేడా లేకుండా ఉండడం స్త్రీల గౌరవానికి భంగం కలగకుండా చూడడం ఆచారాల పేరుతో చేసే పనులలో స్త్రీల మనోభావాలు దెబ్బ తినకుండా కాపాడడం ఉచిత ఉచితలను సమంగా పరిశీలించి పరిరక్షణ చేయడం వంటివి ఇందులో వస్తాయి ఇటువంటి ఉద్యమ స్ఫూర్తితో పని చేసిన సంస్థలను గుర్తుంచుకోవాల్సిన బాధ్యత మనదే

 2001 నుండి స్త్రీల స్వశక్తి అనే విషయం పైన జాతీయ విధానాన్ని అంటే ఒక పాలసీని జారీ చేసినప్పటి నుండి మహిళా సంక్షేమ పథకాలు ప్రారంభమయ్యాయి 1990లో ఎన్ ఈ డబ్ల్యూ ఏ [N E W A ] సేవ అనేది అంటే స్వయం ఉపాధి మహిళా సంఘాలు అని అంటాం. ఈ సంస్థ భారతీయ మహిళా హక్కుల గురించి ఎన్నో పోరాటాలు చేసింది.బాధితులైన స్త్రీలకు, ఒంటరి స్త్రీలకు, అభయహస్తం అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. స్త్రీలు రోజుకు ఒక రూపాయి ఇవ్వాలి. ఎన్నేళ్ల తర్వాతనైనా ఆ స్త్రీ  ఒక రూపాయి రోజుకి ఇస్తే ప్రభుత్వం మరో రూపాయి జత చేసి వారికే ఉపయోగ చేస్తుంది. వృద్ధులకు ఆసరా పెన్షన్ పథకాన్ని కూడా పెట్టారు. ఇటువంటి పథకాల వలన స్త్రీలు ఆర్థికంగా నిలదొక్కుకొని మరికొందరికి ఆదర్శంగా నిలువగలరు.

2. సామాజికంగా బలోపేతంగా ఉండడం అనే అంశంలో గృహహింస నిరోధక చట్టం అనేది ముఖ్యమైనటువంటిది. ఇది 2005లో ఏర్పడిన సివిల్ చట్టం బాధిత మహిళ పక్షాన నిలబడి వారికి ఉపశమనం కలిగించే దిశగా సహాయం చేయడం అనేది ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ఇందులో ముఖ్యభాగం ఆడవాళ్లు తమ ఇంట్లో తాము నివసించడము అనే హక్కును కలిగి ఉండడం. సాధారణంగా పెళ్లయి భర్త దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఈ నివాసం పై హక్కు అనేది ఉండేదే కాదు ఒకవేళ ఇంట్లో ఆడవాళ్లను హరాస్మెంట్ చేస్తే హింసిస్తే ఆమె వెనక కేసు నమోదు చేస్తే ఆమె భర్త మామగారు అత్తగారు ఇబ్బంది పెడితే కౌన్సిలింగ్ చేయించే హక్కు కూడా ఆమెకి ఉంటుంది. ప్రభుత్వం ప్రత్యక్షంగా ఏర్పరిచే ఈ సౌకర్యాలే కాదు దాదాపు 72 స్వచ్ఛంద సంస్థలను ప్రభుత్వమే సర్వీస్ ప్రొవైడర్లుగా ఏర్పరిచింది షెల్టర్ హోమ్ లో ఆశ్రయం ఇవ్వడము. మెజిస్ట్రేట్ సిద్ధం చేసిన

నివేదికను అందించడం.లౌకిక జీవనానికి కావాల్సిన మనోబలాన్ని సామూహిక భాగస్వామ్యమే ఇస్తుంది .ఈ సత్యాన్ని గ్రహించేలా చేయడము. ఏ భాషకైనా ఆదేశం లోని వర్ణాలు ఫోనిక్స్ శబ్దాలు మైక్రోఫోనిక్స్, మార్చి నిర్మాణం సింటాక్స్ లు ఎలాగైతే అర్థవంతంగా ఉండేలా ఉంటే  సమర్థవంతమైన రచన ఆవిర్భవిస్తుందో అలా జీవితానికి ఇదే సూత్రం వర్తిస్తుంది. అలాగే అన్ని  భావాలు, అన్ని హక్కులు కలిస్తే ఏకశక్తిగా ఉద్భవిస్తుంది ఇదే సామాజికపరంగా స్త్రీ సాధికారత సాధనకు సాధ్యమవుతుంది

 3.రాజకీయంగా బలోపేతంగా ఉండేలా చాలా ముఖ్యమైనటువంటి అంశం.

మార్గదర్శక సూత్రాల అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నియమాలను ఏర్పరిచాయి .అవి స్త్రీలకు సమంగా చేరుతున్నయా లేదా చూడాలి అంటేళఅంతో ఇంతో రాజకీయ పరిజ్ఞానం ఉండాలి. 33 శాతం రిజర్వేషన్ అని తీసుకొచ్చినా కానీ, రాజకీయ రంగంలో స్త్రీలు ఆ శాతానికి కాదు కదా దాని అంచుల వరకు కూడా వెళ్లలేని పరిస్థితిలో మన దేశం ఉంది. పొలిటికల్ లీడర్ లు గా స్త్రీలు ఎదిగినప్పుడు స్త్రీలకుండేటువంటి సాధకబాధకాలు తెలుసు కాబట్టి సహజసిద్ధంగా తెలుస్తాయి కాబట్టి వాళ్ల కోసం ఏదైనా చేసే ప్రయత్నం రాజకీయ శక్తిగా చేయగలుగుతుంది . కాబట్టి ఎన్నికల్లో నిలబడి పోటీ చేసి గెలవగలిగే సత్తాను స్త్రీలు సంపాదించుకోవాలి కానీ ఈ అవకాశాలను రాకుండానే జాగ్రత్తపడుతుంది పురుష ప్రపంచం ఎక్కడో కొంతమంది రాజకీయ నాయకురాలుగా ఎదిగిన వాళ్ళు ఉన్నా వాళ్ళపైన వాళ్ళ కుటుంబ సభ్యుల పెత్తనమే సాగుతుంది. తండ్రిదో, కొడుకుదో,భర్తదో  అండ ఉండాల్సిందే అనే ఒక విధానాన్ని క్రియేట్ చేస్తారు. చేసి, ఒక స్టాంపు లాగా తయారుచేసి కీలుబొమ్మను తయారుచేసి వాళ్ళ పబ్బం కడుక్కుంటుంది  ఈ పురుష ప్రపంచం

   చట్టాలకు చుట్టాలుగా ఉండగలిగే రాజకీయ నాయకులు వారి పురుష నిత్య స్వభావంతోనే స్త్రీల పరంగా ఆలోచించకుండానే నిర్ణయాలు తీసుకుంటారు.

సమాన హక్కులు పొందుతున్నారా లేదా అని  మనస్ఫూర్తిగా మహిళల పట్ల ఆలోచనలు తీసుకునే వారు ఎక్కడ? గతంలో రాష్ట్రపతిగా

ప్రధానమంత్రిగా లోక్సభ అధిపతిగా ప్రతిపక్ష నాయకురాలు గా వారి వారి సేవలనందిచిన వారు గా ఎందరో మహిళలు ఉన్నారు. ప్రస్తుత రాష్ట్రపతి కూడా స్త్రీ నే , ఇది జాతి గర్వించదగిన విషయం. కానీ, ఒకవైపు పరిపూర్ణత అక్షరాస్యతను సాధించలేదు మరోవైపు స్త్రీలకు కేటాయించిన శాతం అమలులోకి రావడం లేదు. కూలీలు గా వ్యవసాయదారులుగా వ్యవసాయ కూలీలుగా ఎందరో మహిళలు పనులు చేస్తున్నారు. వాళ్లందరికీ సత్వర సమస్త న్యాయం జరిగేలా చూడవలసిన బాధ్యత రాజనీతిజ్ఞులదే. ఇందులో ప్రధానంగా చెప్పవలసి వస్తే వరకట్న నిషేధం చట్టం ఎంత ప్రయత్నించినా అరికట్టలేకపోతున్నటువంటి విషయం. బాల్య వివాహాల బాధల నుండి వితంతు స్త్రీల ఇక్కట్ల నుండి మూడో కాలు పట్టుకుని నడిచే వృద్ధాప్యం వరకు వరకు పోరాటాలు చేసిన ఫలితం శూన్యం.

యూనిసెఫ్ నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో 18 ఏళ్ల కంటే ముందే పెళ్లిళ్లు జరిగి, తల్లులై ఎన్నో కష్టాలకు గురవుతున్నారు అనేది తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం నిరక్షరాస్యత ఆర్థిక స్వావలంబన లేకపోవడం, పురుషాధిపత్య  ఉక్కు పిడికిళ్ళలో నలిగిపోవడం.

ఇక గృహహింస అని మరో విపరీతం స్త్రీలను అదిమిపెట్టి ఎదగకుండా చేస్తున్న ది. ఇక మరో అన్యాయమైన విషయం ఏమిటంటే అమ్మాయిలను వేశ్య వృత్తిలోకి దింపి వ్యాపారం చేసుకుంటున్న లోకం ఇది. ఒకసారి ఆ ఊబిలో పడిపోయిన తర్వాత ఇక వాళ్ళు ఎంత ప్రయత్నించినా వాళ్ళని  బయటికి రానీయకుండా చేసే కొద్ది మార్గపు లోకం ఇది.

ఇక బాల కార్మికుల అవస్థలు అయితే చెప్పనక్కర లేనివి. పసి మొగ్గలను చినిమేసే నియంతలు అడుగడుగునా కనిపిస్తుంటారు.

మన అభివృద్ధి శాఖ ఇచ్చే నివేదికలో చూస్తే ఆరోగ్య విషయంలో స్త్రీలు ఎన్నో కష్టాలకు గురవుతున్నారు. గర్భనిరోధక పద్ధతులు వాడకం వల్ల, స్టెరాయిడ్స్ వాడకం వల్ల  అయితే నేమి క్యాన్సర్ వంటి విపరీత జబ్బులు అయితే నేమి కుటుంబ నియంత్రణ కొరకు ఉపయోగించే పిల్స్ అయితేనేమి గర్భస్రావాలు అయితేనేమి  ఆడవాళ్ళ ను  ఎన్నో కష్టాలకు గురి చేస్తున్నాయి.

ఈ అన్నింటినీ మించి మరొక వికృతమైన చర్య భ్రూణ హత్య. తినడం గా ఉన్నప్పుడే ఆడపిల్లని తెలవగానే చిదిమేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి మనదేశంలో విపరీతంగా ఉన్నది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆడవాళ్ళ కష్టాలు అనంతం. వీటిని కనిపెట్టి కీలరి వాతపెట్టే పరిస్థితులు వస్తే బాగుంటుంది వీటి కొరకే మహిళా సాధికారత దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉంది

మానవ వనరులను వినియోగించుకోవడంలోనూ విద్య విజ్ఞానాలను సంపాదించుకోవడంలోనూ స్త్రీలకు సమాన అవకాశాలు కలిగింప చేయడమే మహిళా సాధికారతకి ఒక అర్థం. కుటుంబ స్థితిలో స్త్రీలది ఎంతో గణనీయమైన పాత్ర ఉంటుంది గుర్తింపు ఏమాత్రం ఉండదు. రాజకీయ సాధికారత చట్టపరమైన సాధికారత విద్యా సాధికారత మహిళలందరూ పొందినప్పుడే సమ సమాజం స్థాపించబడుతుంది

 ______****_____

You may also like

Leave a Comment