Home పుస్త‌క స‌మీక్ష‌ అక్షర ప్లాంట్స్

అక్షర ప్లాంట్స్

by vanaparti padma

డా॥ కందేపి రాణీ ప్రసాద్ కవయిత్రి, బాల సాహితి వేత్త, పరిశోధకులు, చిత్రకారిణి, హస్తకళాకారిణి అనువాదకులు, బాల సాహిత్యంతో అనేక ప్రయోగాలు చేస్తుంటారు. సృజన్ చిల్డ్రన్ ఆసుపత్రి గోడల నిండా పొడుపు కథలను దాదాపు 300 వందలకుపైగా చార్టులను అతికించి పొడుపు కథల ఆసుపత్రిగా మార్చారు.
పజిల్స్ ప్లాంట్ అనే పుస్తకాన్ని, మరియు చెట్లతో చెలిమి అనే రెండు కొత్త పుస్తకాల గూర్చి మనం తెలుసుకుందాం.
మొదట పజిల్స్ ప్లాంట్ పుస్తకము గూర్చి తెలుకుందాం. ఇందులో ఖండాలు, నదులు, కొలతలు, సముద్రాలు, ప్రపంచ వింతలు, ప్రపంచ నగరాలు వంటి అనేక అంశాలు ఇందులో వున్నాయి. ఉచ్చరించడానికి రెండు పదాలు ఒకటే కాని వాటి మధ్యనే ఓ ఫరికొత్త పదం దాగి వుంటుంది.
“క్షణం కాని క్షణం – వీక్షణం”, “ద్రాక్ష కాని ద్రాక్ష –రుద్రాక్ష” లాంటి పదంలో మరో పదం రాయడం వారి ‘కలం’ కు మాత్రమే తెలుసు, నిత్యం చిన్నారులు ఉపయోగించే రాత వస్తువును కూడ పొడుపు కథగా మర్చారు రచయిత్రి.
నల్లని గ్రాఫైటు బళ్ళు
చెక్కతో చేసిన కోటు
కొనదేలిన సూది ముక్కు
ఎవరది? ఏం పేరు చెప్పు అని ప్రశ్న వేస్తునే ‘పెన్సిల్’ అనే జవాబును ఇస్తారు.
మట్టిలో పుట్టి మంటల్లో కాలి
మనింటికే వచ్చి మంచి నీళ్ళిస్తుంది
ఎవరో చెప్పుకోండి చూద్దాం! అని అంటూనె ‘చల్లటి కుండ’ అనే జవాబును ఇస్తూ చమత్కారంగా రాస్తారు.
పిండి వంటల్లోను అందరు ఇష్టపడే తీపి పదార్థంతో పొడుపు కథ: ఈ పూత చెట్టు మీద కాదు కుండ మీద పేరులోని రేకు విచ్చుకోదు, గుచ్చుకోదు అంటునే ‘పూత రేకు’ సమాధానంతో మనల్ని తీయ్యటి జ్ఞాపకాల్లోకి తీసుకుపోతారు. మరో స్వీట్: ఒళ్ళంతా నాకు నొక్కులు, పంచాదార పాకాలు, పేరులో సముద్ర జీవులు అంటారు. ఎంటో తెలుసా “గవ్వలండి”, సరస్సులకు కూడ పోడుపు కథలు: ‘పప్పు’ తినే సరస్సు పేరు ఏమిటి ‘దాల్ లేక్’ అండి ఛాల తమాషాగా ఉంది కదా.
ప్రసిద్ది నగరాల్లోకి వెళ్దాం. ‘లా’ చదువుకున్న”సిమ్” ఎక్కడుందో చెప్పగలరా “సిమ్లా” కదాండి, టీచర్లు అందరు నివాసముండే గ్రామమేమిటి “గూర్ గావ్”. చెర్రీలున్న నగరం – పాండిచేరి. బాల బాగున్నాయి రచయిత్రి ఆలోచన విధానం పిల్లలకి కాలక్షేపంలో పాటు విజ్ఞానం.
ఊర్ల పేర్ల విషయం చుద్దాం. దేవుడు వరాలిస్తాడని తెలుసు కాని ఇక్కడ అన్న వరాలిస్తాడు తెలుసా. అది ఏ ఊరిలొ చెప్పండి. “అన్నవరం” సత్యదేవుడు కదాండి.

రవి ఉంటే పేట ఏదో చెప్పండి- సూర్యపేట ఇలా అనేక ఊర్ల పేర్లను పొడుపు కథలుగా మలిచారు.
రాష్ట్రల పేర్లు చూస్తే: రాజులకు నిలయమైన రాష్ట్రమిది.
జ: “రాజస్థాన్” – 36 కోటలు కట్టుకున్న రాష్ట్రమేది ఛత్తీస్ గడ్ అంటారు.
కొండలతో ఊరి పేర్లున్న పొడుపు కథలు.
1. రామ భక్తుడు కొండ ఎక్కింది ఎక్కడ;- హన్మకొండ.
2. ప్రభలతో తిరుణాలకు ప్రఖ్యాతి చెందిన కొండ ఎక్కడ- కోటప్ప కొండ అంటారు.
నక్షత్రాల పేర్లతో కూడిన పదాలు
1. చిత్త శుద్ధితో పని చేసే నక్షత్రం – చిత్త (నక్షత్రం)
2. కృష్ణని ప్రియురాలు ఉన్న నక్షత్రం – అనురాధ
ఇలా తమాషాగా మర్మగర్భంతో కూడిన పదజాలం చాలా ఉపయోగించారు రచయిత్రి రాణీ ప్రసాద్.
ప్రహరీ గోడకట్టి పుసిద్ధి కెక్కిన ప్రపంచ వింత- చైనావాల్ అంటునే స్వచ్ఛను కోరె విగ్రహపు వింత –స్టాచ్యూఆఫ్ లిబర్టీ అని ప్రపంచ వింతలను కూడ జోడిండిచారు. ఇంక నదుల విషయానికొస్తే 1. నల్లని పాయలు కలిగిన జీవనది – కృష్ణ వేణి కాగ 2. నీరు కడుపులో పెట్టుకుని మోసేసే నది – మూసి (నది) అంటారు.
దేశాల పేర్లకు వస్తే 1. ‘డెన్’ లకు మార్కు వేసే దేశం ఏది – డెన్మార్క్ అంటారు.
2. బీధధైన సింహం ఉండే దేశం – సింగపూర్ అంటునే
3. తీగల్ని పందిరికి పాకిస్తా అనే దేశం – పాకిస్తాన్ చాల సానిగా ఉంది కదా
బాల్యం ఒక మధురం జ్ఞాపకం ఏలాంటి స్వార్ధం, ద్వేషం లేని ప్రేమైక్య దశ కాని నేడు ‘బాల్యమా నీ చిరునామా ఎక్కడా’ అని అనుకునే స్థాయికి దిగజారుతున్నాము. పోటి ప్రపంచం ఆర్థిక వనరుల కోసం తల్లి తండ్రుల పరుగు వ్యక్తిగత కుటుంబాల్లో పెద్దవారు కరువు. కథలు, బుజ్జగింపులు లేక బాలలు ఒంటరిగా మానసికంగా ఒడి దుడుకులు పడుతున్నారు. సేల్ ఫోన్ ప్రపంచంగా మారుతున్న తరుణంగా రాణీప్రసాద్ గారి రచనలు ‘అక్షర ప్లాంట్’ చాల ఉపయక్తంగా వుంది. ఈ పుస్తకాన్ని పాఠశాలలో ఉంచితే మంచి పరిణామంగా భావిస్తున్నాను. నేటి పిల్లలకు ఇలాంటి తమాషా పదాలతో పోడుపు కథలు పిల్లలకు కాలక్షేపంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తుంది.
పెద్దలు పిల్లలు చదవతగిన పుస్తకం – ‘పజిల్ ప్లాంట్’

You may also like

8 comments

Madison1188 September 16, 2025 - 9:14 pm Reply
Greyson1412 September 17, 2025 - 7:11 am Reply
Brynn513 September 17, 2025 - 11:25 am Reply
Linda2415 September 17, 2025 - 6:22 pm Reply
Andres2128 September 17, 2025 - 11:24 pm Reply
Roger452 September 18, 2025 - 4:54 pm Reply
Pedro568 September 18, 2025 - 7:18 pm Reply
Kathryn2164 September 18, 2025 - 9:02 pm Reply

Leave a Reply to Andres2128 Cancel Reply